సాక్షి, అమరావతి: ఈ వేసవిలో భానుడి భగభగలు మరింత ఎక్కువగా ఉంటాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించింది. మార్చి నుంచి మే వరకు దేశంలో సగటు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో వేసవిలో సాధారణం కంటే 0.5 నుంచి 1 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకూ అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ముందస్తు అంచనాల్లో పేర్కొంది.
ఏపీలో వడగాడ్పులు
- మన రాష్ట్రంలో ఈ వేసవిలో అధిక ఉష్ణోగ్రతలతోపాటు వడగాడ్పులు నమోదయ్యే ప్రమాదం ఉంది.
- అపార్ట్‌మెంట్ల నిర్మాణం వల్ల పట్టణాలు, నగరాలు కాంక్రీట్ జంగిల్స్‌గా మారటం ఉష్ణోగ్ర తలు పెరగటానికి ఒక కారణం.
- చెట్లు తగ్గిపోవడం వల్ల భవనాల నుంచి రేడియేషన్ ఎక్కువగా విడుదలవుతోంది.
- రాష్ట్రంలో పారిశ్రామిక కాలుష్యం కంటే వాహన కాలుష్యమే ఎక్కువగా ఉంటోంది.
ఉగాది నుంచే వడగాడ్పులు
ఉగాది తరువాత దక్షిణ కోస్తా, రాయలసీమలో అధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పుల తీవ్రత ఎక్కువగా ఉండనుంది. ఉత్తర కోస్తా జిల్లాల్లో ఉరుములతో కూడిన జల్లులు కురవడం వల్ల సాయంత్రానికి వాతావరణం చల్లబడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో మాత్రం రాత్రి వేళ కూడా అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి. సముద్రం నుంచి తేమ గాలులు రావడం వల్ల ఉక్కపోత, వడగాడ్పులు ఇక్కడ అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది.
– డాక్టర్ మురళీకృష్ణ, వాతావరణ శాఖ రిటైర్డ్ శాస్త్రవేత్త
Comments
Please login to add a commentAdd a comment