
వేసవిలో కాటన్ బెడ్‌షీట్‌లను ఉపయోగించడం మంచిది. కాటన్ చెమటను త్వరగా గ్రహిస్తుంది. నిద్ర పోతున్నప్పుడు సౌకర్యవంతంగా ఉంటుంది. చర్మాన్ని జిగటగా ఉంచదు. బెడ్ షీట్‌లను ఎంచుకునేటప్పుడు 100 శాతం కాటన్ ట్యాగ్‌కు ప్రాధాన్యత ఇవ్వండి. కొన్ని బ్రాండ్లు కాటన్ షీట్‌లను అమ్ముతున్నప్పటీకి... అవి బ్లెండెడ్ కాటన్‌వి (ఇతర రకాల పదార్థాలతో కలిసిన కాటన్) అయి ఉంటాయి. బ్లెండెడ్ కాటన్ స్కిన్ ఫ్రెండ్లీ కాదు.
కలప గుజ్జును ఫైబర్‌గా మార్చడం ద్వారా తయారుచేయబడిన మృదువైన వస్త్రాలలో ‘టన్సెల్’ ఒకటి. ఇది చల్లని అనుభూతిని కలిగిస్తుంది. నిద్ర నాణ్యతను పెంచుతుంది. వేసవిలో చెమట కారణంగా బెడ్ షీట్‌లు త్వరగా మురికి పడతాయి. అందువల్ల వారానికి కనీసం రెండుసార్లు బెడ్ షీట్‌లను మార్చాలి. ఇలాంటి సందర్భాలలో తేలికైన, ఫ్లోయింగ్ కాటన్ షీట్‌లను ఎంచుకోవడం మంచిది.
వేసవిలో దద్దుర్లలాంటి వివిధ చర్మ సమస్యలు వస్తాయి. మీది సెన్సిటివ్ స్కిన్ అయితే సింథటిక్ కాని బెడ్‌షీట్‌లను వాడితే మంచిది. వేసవిలో ఎలాంటి కలర్స్ బెడ్ షీట్‌లను ఎంచుకోవాలనే విషయానికి వస్తే నీలం రంగు బెటర్. లేత నీలం రంగు బెడ్‌షీట్‌లు చల్లదనాన్ని కలిగిస్తాయి.
(చదవండి: ఆయన వింతగా ప్రవర్తిస్తున్నారు!)