hails
-
National Snow and Ice Data Center: అంటార్కిటికాలో కరిగిపోతున్న మంచు
వాషింగ్టన్: ఉత్తరార్ధ గోళంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది వేసవిలో వడగాలులు వీచాయి. ఫలితంగా అంటార్కిటికా ఖండంలో పెద్ద ఎత్తున మంచు కరిగిపోయింది. ఈసారి అక్కడ రికార్డు స్థాయిలో మంచు ఫలకలు కరిగినట్లు శాస్త్రవేత్తలు తేల్చారు. వాస్తవానికి అంటార్కికాలో వేసవి కాలంలో మంచు కరిగి, శీతాకాలంలో మళ్లీ భారీ మంచు ఫలకలు ఏర్పడుతుంటాయి. కానీ, ఈసారి అలా జరగలేదు. గత 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత తక్కువ స్థాయిలో హిమం ఉంది. నేషనల్ స్నో అండ్ ఐస్ డేటా సెంటర్ (ఎన్ఎస్ఐడీసీ) గణాంకాల ప్రకారం.. అంటార్కిటికాలో 2022 శీతాకాలంతో పోలిస్తే ఇప్పుడు 16 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మంచు కరిగిపోయింది. అలాగే 1981–2010 మధ్య సగటు విస్తీర్ణం కంటే ఈ ఏడాది జూలై మధ్యలో 26 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మేర మంచు తక్కువగా ఉంది. ఇది అర్జెంటీనా దేశ విస్తీర్ణంతో సమానం. అమెరికాలోని టెక్సాస్, కాలిఫోర్నియా, న్యూమెక్సికో, అరిజోనా, నెవడా, ఉతాహ్, కొలరాడో రాష్ట్రాల ఉమ్మడి విస్తీర్ణంతో సమానం. అంటార్కిటికాలో సముద్రపు మంచు కొన్ని దశాబ్దాలుగా రికార్డు స్థాయి నుంచి కనిష్టానికి పడిపోతోంది. ఇది చాలా అసా«ధారణ పరిణామమని, 10 లక్షల ఏళ్లకోసారి ఇలా జరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూతాపం, వాతావరణ మార్పులు అంటార్కిటికాను మరింతగా ప్రభావితం చేస్తాయని అంటున్నారు. -
దశాబ్దంలోనే భారత్‌లో ఎంతో మార్పు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం కింద భారత్ పదేళ్లలోనే ఎంతో మార్పు చెందినట్టు అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది. అంతర్జాతీయంగా భారత్ తన స్థానాన్ని బలోపేతం చేసుకుందని, ఆసియా, ప్రపంచ వృద్ధిని నడిపించే కీలక దేశంగా అవతరించినట్టు తన తాజా నివేదికలో ప్రస్తావించింది. (రూ.190 కోట్లతో లగ్జరీ బంగ్లా కొన్న గ్లామర్ క్వీన్, ఆ నిర్మాత ఇంటిపక్కనే!) భారత్ తన సామర్థ్యాల మేరకు ఫలితాలను చూపించలేదని, ఈక్విటీ వ్యాల్యూషన్లు గరిష్టాల్లో ఉన్నాయన్న విమర్శలను తోసిపుచ్చింది. ఈ తరహా దృక్పథం గత తొమ్మిదేళ్లలో చేపట్టిన వ్యవస్థీకృత సంస్కరణలను విస్మరించడమేన పేర్కొంది. అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న రెండో ఆర్థిక వ్యవస్థకు తోడు, గత 25 ఏళ్లలో గొప్ప పనితీరు చూపిన స్టాక్ మార్కెట్‌ను నిదర్శనాలుగా ప్రస్తావించింది. 2013తో పోలిస్తే ఇప్పుడున్న భారత్ భిన్నమైనదిగా పేర్కొంది. (సెబీ షాక్: కార్వీ స్టాక్ బ్రోకింగ్ రిజిస్ట్రేషన్ రద్దు) ఇవీ మార్పులు..: 2014లో ప్రధానిగా మోదీ కొలువుదీరిన తర్వాత చోటు చేసుకున్న పది పెద్ద మార్పులను మోర్గాన్ స్టాన్లీ ప్రస్తావించింది. పోటీ దేశాల స్థాయిలో కార్పొరేటు పన్నును తగ్గింపు, మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెంచడం అతిపెద్ద సంస్కరణలుగా పేర్కొంది. జీఎస్టీ కింద పన్నుల ఆదాయం క్రమంగా పెరుగుతుండడాన్ని ప్రస్తావించింది. అలాగే, జీడీపీలో డిజిటల్ లావాదేవీలు పెరుగుతుండం ఆర్థిక వ్యవస్థ మరింత క్రమబద్ధీకరణ చెందుతుందనడానికి నిదర్శంగా పేర్కొంది. ఎగుమతుల్లో భారత్ వాటా రెట్టింపై 2031 నాటికి 4.5%కి చేరుకుంటుందని అంచనా వేసింది. తలసరి ఆదాయంలో వృద్ధి ప్రస్తుతం భారత్‌లో తలసరి ఆదాయం 2,200 డాలర్లుగా (రూ.1,80,400) ఉంటే, 2032 నాటికి 5,200 డాలర్లకు (రూ.4,26,400) పెరుగుతుందని మోర్గాన్ స్టాన్లీ తన నివేదికలో పేర్కొంది. ఇది బారత్‌లో వినియోగ పరంగా పెద్ద మార్పునకు కారణమవుతుందని అంచనా వేసింది. మరిన్ని బిజినెస్వార్తలు,ఎకానమీ గురించిన వార్తల కోసం చదవండి సాక్షిబిజినెస్ -
‘ఏపీకి సీఎం జగనే బ్రాండ్ అంబాసిడర్’
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఈ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ అని మంత్రి సీదిరి అప్పలరాజు అభివర్ణించారు. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి వెల్లువెత్తుతున్న పెట్టుబడులను ఉద్దేశించి మంత్రి అప్పలరాజు శనివారం మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఏపీకి బ్రాండ్ అంబాసిడర్. ఈ భారీ పెట్టుబడులు ఆయన ఛరిష్మాతోనే వచ్చాయి అని పశు సంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. అలాగే.. త్వరలో ఉత్తరాంధ్ర ముఖ చిత్రం మారబోతోందన్న ఆయన.. అందులో భోగాపురం మీదుగా ఆరు లైన్ల హైవే ఏర్పాటు అభివృద్ధికి కీలకం కానుందని తెలిపారు. ఇదిలా ఉంటే.. విశాఖపట్నం ఏయూ గ్రౌండ్ వేదికగా రాష్ట్రానికి పెట్టుబడుల పండుగగా వర్ణిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ రెండో రోజూ కొనసాగుతోంది. -
24 గంటల్లో దేశంలోకి ‘నైరుతి’
మహారాణిపేట (విశాఖ దక్షిణ): నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వచ్చే 24 గంటల్లో దేశంలోకి ప్రవేశించనున్నాయి. రుతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం అండమాన్ సముద్రం, దానిని ఆనుకుని ఉన్న బంగాళాఖాతం మధ్య ప్రాంతాలకు విస్తరిస్తున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం డైరెక్టర్ తెలిపారు. ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు మధ్య ప్రాంతం వరకు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఛత్తీస్‌గఢ్ పరిసరాల్లో 1.5 నుంచి 3.1 కిలోమీటర్ల మధ్య ఉపరితల ఆవర్తనం విస్తరించింది. దీని ప్రభావంతో బుధవారం దక్షిణ కోస్తా, రాయలసీమల్లో ఒకటిరెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. వడగాలుల ప్రమాదం రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు కాస్త తగ్గినా వచ్చే మూడు రోజలపాటు రాష్ట్రంలో పలుచోట్ల ఎండ నిప్పుల వానలా ఉంటుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. వడగాలులు వీస్తాయని, 41 నుంచి 43 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటికి రావొద్దని సూచించారు. -
ఎండలు మండుతాయ్!
సాక్షి, అమరావతి: ఈ వేసవిలో భానుడి భగభగలు మరింత ఎక్కువగా ఉంటాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించింది. మార్చి నుంచి మే వరకు దేశంలో సగటు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో వేసవిలో సాధారణం కంటే 0.5 నుంచి 1 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకూ అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ముందస్తు అంచనాల్లో పేర్కొంది. ఏపీలో వడగాడ్పులు - మన రాష్ట్రంలో ఈ వేసవిలో అధిక ఉష్ణోగ్రతలతోపాటు వడగాడ్పులు నమోదయ్యే ప్రమాదం ఉంది. - అపార్ట్మెంట్ల నిర్మాణం వల్ల పట్టణాలు, నగరాలు కాంక్రీట్ జంగిల్స్‌గా మారటం ఉష్ణోగ్ర తలు పెరగటానికి ఒక కారణం. - చెట్లు తగ్గిపోవడం వల్ల భవనాల నుంచి రేడియేషన్ ఎక్కువగా విడుదలవుతోంది. - రాష్ట్రంలో పారిశ్రామిక కాలుష్యం కంటే వాహన కాలుష్యమే ఎక్కువగా ఉంటోంది. ఉగాది నుంచే వడగాడ్పులు ఉగాది తరువాత దక్షిణ కోస్తా, రాయలసీమలో అధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పుల తీవ్రత ఎక్కువగా ఉండనుంది. ఉత్తర కోస్తా జిల్లాల్లో ఉరుములతో కూడిన జల్లులు కురవడం వల్ల సాయంత్రానికి వాతావరణం చల్లబడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో మాత్రం రాత్రి వేళ కూడా అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి. సముద్రం నుంచి తేమ గాలులు రావడం వల్ల ఉక్కపోత, వడగాడ్పులు ఇక్కడ అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది. – డాక్టర్ మురళీకృష్ణ, వాతావరణ శాఖ రిటైర్డ్ శాస్త్రవేత్త -
అక్కడ మరోసారి భయానక వాతావరణం
కాన్బెర్రా : ఆస్ట్రేలియాలో మొన్నటిదాకా ప్రజలు కార్చిచ్చుతో అతలాకుతులం అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే దాని నుంచి కోలుకుంటున్న అక్కడి ప్రజల్లో వరుస తుఫాన్లు, సుడిగాలులు మరోసారి భయానక వాతావరణం సృష్టిస్తున్నాయి. తాజాగా సోమవారం ఆస్ట్రేలియా రాజధాని కాన్బెర్రాలో సుడిగాల్పులు బీభత్సంతో తీవ్ర కలకలం రేగింది. గంటకు 107 మైళ్ల వేగంతో వీచిన గాలులకు ప్రజా భవనాలు, గృహాలు, కార్లు ద్వంసమవడంతో పాటు వేలాది చెట్లు నేలకొరిగాయి. రాజధానిలోని చాలా ప్రాంతాల్లో పవర్ కట్ అవడంతో అత్యవసర సేవలకు అంతరాయం ఏర్పడింది. బ్రిస్బేన్, క్వీన్స్‌లాండ్‌లోని గోల్డ్‌కోస్ట్ ప్రాంతాలలో శనివారం వడగళ్ల వాన చుట్టముట్టడంతో చాలా ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. ఇలా ఆస్ట్రేలియాలో ఒకదాని తర్వాత మరొకటి చోటుచేసుకుంటుండడంతో అక్కడి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోతుంది. రెండు నెలల క్రితం న్యూసౌత్ వేల్స్ అడవుల్లో మొదలైన కార్చిచ్చును చల్లార్చాడానికి ఈ అకాల వర్షాలు మంచివే అయినా ఆస్ట్రేలియాలోని రెండు ప్రధాన నగరాల్లోని ప్రజలకు మాత్రం పెద్ద ఎత్తున ఆస్తి నష్టం కలిగించిందనే చెప్పుకోవాలి. అయితే కార్చిచ్చు దాటికి 28 మంది మరణించగా, వేలాది జంతువులు మృత్యువాత పడ్డాయి. కార్చిచ్చు దాటికి 10.4 మిలియన్ హెక్టార్లు కాలిపోయింది. కార్చిచ్చుకు హరించుకుపోయిన ఈ మొత్తం యూఎస్ఏలోని ఇండియానా రాష్ట్రంతో సమానం కావడం విశేషం. Narromine dust storm - Jan 19th pic.twitter.com/GeFSqby8NY — Mick Harris (@mickharris85) January 19, 2020 Fires, hottest day on record, floods, dust storm, hail storm. All in a month. Climate apocalypse starts in Australia. Are we gonna let this be the new normal?#ClimateCrisis pic.twitter.com/rPGg20JsV2 — Veronica Koman (@VeronicaKoman) January 20, 2020 -
తప్పుదిద్దుకున్న శోభా డే
ముంబై: ఒలింపిక్ లో రజత పతక విజేత, తెలుగు తేజం పీవీ సింధు పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రముఖ రచయిత్రి శోభా డే తన తప్పును తెలుసుకున్నారు. వెండి పథకాన్ని సాధించిన సింధు 24 కారెట్ల బంగారమని, ఆమె హీరో అని పొగడ్తల వర్షం కురిపించారు. ధైర్యశాలి సింధు నిజమైన హీరో అని వ్యాఖ్యానించారు. 24 క్యారెట్ల బంగారమా, మేము నిన్ను ప్రేమిస్తున్నాము అని ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. పీవీ సింధు, దీపా కర్మాంకర్, సాక్షి మలిక్ విజయ గాథలను పోస్ట్ చేశారు. సింధు జీవితంపై సినిమా తీయాలని, ఇందులో దీపికా పదుకోన్ లీడ్ రోల్ లో నటించాలని అన్నారు. దీపిక కన్నా బాగా ఇంకెవరు నటిస్తారని సరదాగా వ్యాఖ్యానించారు.భారత క్రీడాకారులను పతకాలు రావని వారు కేవలం సెల్ఫీలు తీసుకోవడానికే రియోకు వెళ్లారని, వారిపై చేసే ఖర్చంతా వృధా అని గంతంలో శోభా ట్వీట్ చేశారు. దీనిపై వివిధ రంగాల ప్రముఖుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. -
'రాజీవ్ బతికుంటే రామ మందిరం నిర్మించేవారు'
ముంబై: 'రాజీవ్ గాంధీ బతికుంటే అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఎప్పుడో పూర్తయ్యేది. అప్పటివరకు వివాదంలో చిక్కుకుని ఉన్న ఆలయం తాళాలు తీయించింది రాజీవే. అంతేకాదు శిలాన్యాస్(పునాదిరాయి) ఉత్సవానికి కూడా ఆయన అనుమతి ఇచ్చారు. మందిర నిర్మాణం సజావుగా సాగేలా ముస్లిం పెద్దలతో రాజీవ్ చర్చించారు. సుప్రీంకోర్టులో జరిగిన వాదనలను సమగ్రంగా వినేవారు. ఆయన చనిపోకుండా ఉండుంటే మందిరం ఈపాటికి దేదీప్యమానంగా వెలుగుతుండేది' అంటూ రామమందిరంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి. వీలుచిక్కినప్పుడల్లా నెహ్రూ, గాంధీ కుంటుంబంపై విరుచుకుపడే స్వామి ఈ సారి రాజీవ్ గాంధీపై ప్రశంసలు కురిపించడం, అదికూడా వివాదాస్పద అయోధ్య మందిరం నిర్మాణానికి రాజీవ్ కృషిచేశారనడం గమనార్హం. ఆదివారం ముంబైలో నిర్వహించిన 'అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఎందుకు,ఎలా?' అనే సెమినార్ లో ప్రసంగించిన స్వామి.. రాజీవ్ గురించి తనకు బాగా తెలుసునని, ఆయన రెండోసారి ప్రధానిగా ఎన్నికయ్యేదుంటే మందిర నిర్మాణం తప్పక పూర్తి చేసి ఉండేవారని వ్యాఖ్యానించారు. నిజానికి రాజీవ్ రామరాజ్య భావనను సమర్థించేవారు కాకపోయినప్పటికీ, సమస్య పరిష్కారం కోసం ముస్లిం నాయకులను ఒప్పించే ప్రయత్నం చేశారని స్వామి గుర్తుచేశారు. అంతిమంగా బాబ్రీ మసీదు కూల్చిన ప్రదేశంలోనే మందిర నిర్మాణానికి న్యాయస్థానం అనుమతి ఇస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఏడాది చివరికల్లా మందర నిర్మాణ పనులు మొదలవుతాయన్నారు. దేశంలో పాఠశాలలు,హాస్పిటల్స్,రోడ్లు,టాయిలెట్ల నిర్మాణం ముఖ్యమా? రామ మందిరం ముఖ్యమా? అన్న ప్రశ్నకు బదులిస్తూ మొదటిది ప్రభుత్వ బాధ్యత అని, నా పని మందిర నిర్మాణం కోసం కృషి చేయడమని చెప్పారు. -
కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో వడగళ్ల వాన
హైదరాబాద్ : గత కొన్ని రోజులుగా ఎండలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలను గురువారం వరణుడు పలకరించాడు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన జల్లులు పడగా.. మరికొన్ని చోట్ల వడగళ్ల వాన కురిసింది. గురువారం సాయంత్రం కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. వడగళ్ల వానతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని పండ్ల తోటల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
వడగళ్ల వానతో పులకించిన ప్రజలు
దామరచర్ల : నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం సాయంత్రం వడగళ్ల వాన కురిసింది. సాయంత్రం 4 గంటల తర్వాత మొదలైన వర్షం అరగంట పాటు అలాగే కురవడంతో స్థానికుల్లో ఆనందం వ్యక్తమైంది. చుక్కనీరు లేక తాగునీటికి కటకటలాడుతున్న సమయంలో వర్షం పడడంతో వారు హర్షం వ్యక్తం చేశారు. -
మోదీ పాక్ పర్యటనను ప్రశంసించిన చైనా
బీజింగ్: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆకస్మిక పాకిస్థాన్ పర్యటన నేపథ్యంలో భారత్-పాక్ సంబంధాలను స్వాగతిస్తున్నట్లు చైనా ప్రకటించింది. ఆ దేశ విదేశాంగ అధికార ప్రతినిధి లు కాంగ్ మాట్లాడుతూ.. భారత్, పాక్ సంబంధాల మెరుగుపడటం చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు. అలాగే ఇరుదేశాల మధ్య సంబంధాల బలోపేతానికి తమ మద్దతు ఉంటుందని, చర్చలు కొనసాగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. భారత్, పాక్ సంబంధాలు మెరుగుపడటం ప్రాంతీయంగా శాంతి, స్థిరత్వం, అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందని చైనా తెలిపింది. పొరుగు దేశాలతో మైత్రిని కోరుకుంటూ మోదీ చేస్తున్న దౌత్యం, పాక్ పర్యటనను పలు దేశాలు పొగడ్తలతో ముంచెత్తాయి. -
భారీ నష్టం మిగులుస్తున్న అకాల వర్షాలు
నెల్లూరు : అకాల వర్షాలతో అన్నదాతకు ఇక్కట్లు తప్పడం లేదు. వేసవిలో వరుణుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఆదివారం ఆంధ్రపదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో మండల పరధిలోని పలు గ్రామాల్లో ఉన్న నిమ్మ, అరటి, బొప్పాయి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మండలంలోని కాకివాయి, వాగిలేరు, మడిచర్ల తదితర గ్రామాల్లో పెద్ద సంఖ్యలో చెట్లు నేలకొరగడంతో పాటు పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ధర్మవరంలో వడగళ్ల వాన: అనంతపురం జిల్లా ధర్మవరంలో ఆదివారం కురిసిన వడగళ్ల వాన అన్నదాతకు తీవ్ర నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఈ వడగళ్ల వానతో మండలంలోని పలు గ్రామాల్లో ఇళ్లు, పండ్లతోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అంతేకాకుండా మండల పరిధిలోని పోతుకుంట వద్ద ఉన్న 2హెచ్‌టీ విద్యుత్ టవర్ కూలడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.