మోదీ పాక్ పర్యటనను ప్రశంసించిన చైనా
బీజింగ్: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆకస్మిక పాకిస్థాన్ పర్యటన నేపథ్యంలో భారత్-పాక్ సంబంధాలను స్వాగతిస్తున్నట్లు చైనా ప్రకటించింది. ఆ దేశ విదేశాంగ అధికార ప్రతినిధి లు కాంగ్ మాట్లాడుతూ.. భారత్, పాక్ సంబంధాల మెరుగుపడటం చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు. అలాగే ఇరుదేశాల మధ్య సంబంధాల బలోపేతానికి తమ మద్దతు ఉంటుందని, చర్చలు కొనసాగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
భారత్, పాక్ సంబంధాలు మెరుగుపడటం ప్రాంతీయంగా శాంతి, స్థిరత్వం, అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందని చైనా తెలిపింది. పొరుగు దేశాలతో మైత్రిని కోరుకుంటూ మోదీ చేస్తున్న దౌత్యం, పాక్ పర్యటనను పలు దేశాలు పొగడ్తలతో ముంచెత్తాయి.