Sharif
-
హత్య చేసి.. ఆపై ఇన్‌స్టాలో రీల్ పోస్ట్ చేసి
నిజాంపేట్: ప్రతీకారంతో రగిలిపోతున్న ఓ గ్యాంగ్ ప్రత్యర్థి కోసం కాపు కాసి పక్కా స్కెచ్‌తో అదును చూసి అంతమొందించింది. ఆపై హత్యకు ఉపయోగించిన కత్తులు పట్టుకొని నృత్యాలు చేస్తూ రక్తంతో తడిసిన చేతులతో రీల్స్ చేసి లెక్క సరిపోయింది..పగ తీర్చుకున్నామంటూ ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్టు పెట్టి సంచలనం సృష్టించింది. కూకట్పల్లి ఏసీపీ శ్రీనివాస్‌రావు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్ఆర్నగర్ పీఎస్ పరిధిలోని బోరబండలో నివాసముండే షేక్ షరీఫ్ గ్యాంగ్‌స్టర్. చిన్నచిన్న నేరాలకు పాల్పడుతుండేవాడు. ఓ కేసు విషయంలో షేక్ షరీఫ్ జైలుకు వెళ్లాడు. ఈ క్రమంలో ఆయన దగ్గర నంబర్–2గా ఉన్న తరుణ్‌రాయ్ గ్యాంగ్ మొత్తానికి తన ఆదీనంలోకి తీసుకున్నాడు. దీంతో షరీఫ్, తరుణ్రాయ్ల మధ్య విభేదాలు మొదలయ్యాయి. 2023లో దసర పండగరోజున రావణ దహనం సందర్భంగా షరీఫ్ గ్యాంగ్ తరుణ్రాయ్ను హత్య చేసింది. ఈ ఘటనలో ఏడుగురు పాలుపంచుకోగా, ప్రగతినగర్‌లో హత్యకు గురైన తేజస్ అలియాస్ తేజు అలియాస్ డీల్ ఏ3గా ఉన్నాడు. రెండు నెలల క్రితం బెయిల్‌పై వచ్చిన తేజస్ బెయిల్‌పై బయటకు వచ్చాక తేజస్ ప్రత్యర్థుల నుంచి ప్రమాదం పొంచి ఉందని ముందే గ్రహించి బాచుపల్లి పరిధిలోని ప్రగతినగర్లోబతుకమ్మకుంట వద్ద ఓ అపార్ట్మెంట్లో తల్లితో కలిసి ఉంటున్నాడు. తన గ్యాంగ్ స్నేహితులతో మాట్లాడటం, కలిసి పార్టీలు చేసుకోవడం జరిగేది. అయితే ఈ క్రమంలో తేజస్ తన స్నేహితులతో నెక్ట్స్ టార్గెట్ సమీర్ అని..అతడిని కూడా లేపేస్తామంటూ మాట్లాడినట్టు ప్రత్యర్థులకు తెలిసింది. ఈ క్రమంలో ఆదివారం తేజస్ తల్లి ఇంట్లో లేకపోవడంతో బోరబండ నుంచి స్నేహితులు మహేశ్, శివప్ప, మహేశ్‌లు ప్రగతినగర్‌కు వచ్చారు. తేజస్ ఇంట్లో నలుగురు కలిసి మద్యం సేవిస్తున్నారు. వచ్చిన ముగ్గురు స్నేహితుల్లో శివప్ప రెండు గ్యాంగ్‌లకు కామన్ ఫ్రెండ్. దీంతో ప్రత్యర్థులు శివప్పతో మాట్లాడి సమాచారం తెలుసుకున్నారు. మద్యం మత్తులో ఉన్న తేజస్‌ను హత్య చేయాలని పథకం వేసి, శివప్పతో లోకేషన్ షేర్ చేయించుకున్నారు. దాని ఆధారంగా ప్రగతిగనగర్లోని తేజస్ ఇంటి సమీపంలోకి చేరుకున్నారు.. తెల్లవారుజామున ఫుల్‌గా తాగిన తేజస్ ఇంటి నుంచి బయటకు వచ్చాడు. బైక్ ఎక్కే క్రమంలో ఒక్కసారిగా తేజస్‌పై కత్తులతో సమీర్, శివప్ప, సిద్దేశ్వర్, జయంత్‌లు విచక్షణరహితంగా పొడిచి హత్య చేశారు. అనంతరం కత్తులు చూపుతూ రీల్స్ చేసి ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేశారు. ఈ రీల్స్‌కు రక్తచరిత్ర సినిమాలోని పాటను జత చేశారు. హత్యకు పాల్పడిన వారిని, తేజస్‌తో మద్యం సేవించిన వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. -
మద్యం మత్తులో బండరాళ్లతో వ్యక్తిపై దాడి
-
అన్నను బలితీసుకున్న నిద్ర.. 'అన్నా.. లే, మాట్లాడు అంటూ'.. ఇద్దరు చెల్లెళ్ల రోదన..
వరంగల్: అనారోగ్యంతో బాధపడుతున్న నానమ్మను చూసేందుకు తల్లిదండ్రులతో కలిసి ఆటోలో వెళ్తున్న ఓ బాలుడిని మృత్యువు.. నిద్ర రూపంలో కబలించింది. ఈ ఘటన శనివారం జిల్లా కేంద్రంలో జరిగింది. పాలకుర్తి మండలం మల్లంపల్లికి చెందిన ఇమామ్ పాషా, భార్య కర్మిషా బతుకుదెరువు నిమిత్తం ఘట్కేసర్కు వెళ్లారు. అక్కడే పాషా ఆటో నడిపించుకుంటూ.. కుమారుడు షరీఫ్(8), ఇద్దరు కూతుళ్లను పోషించుకుంటున్నాడు. రెండో శనివారం స్కూల్ లేకపోవడంతో తన తల్లి అనారోగ్యంగా ఉండడంతో భార్య, బిడ్డలతో కలిసి పాషా సొంత ఆటోలో బయలు దేరాడు. జనగామ పట్టణంలోని కళ్లెం కమాన్ వద్దకు రాగానే.. ముందు సీటులో ఉన్న బాలుడు షరీఫ్ కునుకు తీయడంతో ఆటో నుంచి కిందపడ్డాడు. తీవ్రగాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అటుగా వెళ్తన్న ఓ కారు ప్రయాణికులు.. బాబును వెంటనే జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. తీసుకొచ్చిన అరగంట లోపే బాలుడు మృతి చెందాడు. రోదనలతో మిన్నంటిన ఆస్పత్రి.. బాలుడి మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు. బాధితుల రోదనలతో ఆస్పత్రి ప్రాంగణం మిన్నంటింది. బాలుడు షరీఫ్ మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించగానే.. తల్లిదండ్రులు అక్కడే కుప్పకూలిపోయారు. మృతుడి ఇద్దరు చెల్లెళ్లు.. అన్నా మాట్లాడు అంటూ విగత జీవిగా ఉన్న తమ సోదరుడిని తట్టి లేపుతుంటే అక్కడే ఉన్న పేషెంట్లు, వైద్యులు కన్నీరు కార్చారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పద్మశ్రీకి ఎంపికైనా పింఛను కరువే
అయోధ్య: 25 ఏళ్లలో 25 వేల అనాథ మృతదేహాలకు అంత్యక్రియలు దగ్గరుండి జరిపించారు.. అందరితో ఆప్యాయంగా ‘షరీఫ్ చాచా’ అని పిలిపించుకున్నారు. కేంద్రం 2020లో ‘పద్మశ్రీ’ అవార్డుకు ఎంపికైనట్లు సమాచారం ఇచ్చింది. అయితే, ప్రభుత్వం కనీసం పింఛను కూడా ఇవ్వకపోవడంతో కటిక పేదరికంతో వైద్యం కూడా చేయించుకోలేక మంచానికే పరిమితమయ్యారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మొహల్లా ఖిర్కి అలీబేగ్‌కు చెందిన మొహమ్మద్ షరీఫ్(83). అనాథలకు షరీఫ్ అందించిన సేవలకుగాను ‘పద్మశ్రీ’కి ఎంపిక చేసినట్లు తెలుపుతూ కేంద్ర ప్రభుత్వం నుంచి గత ఏడాది ఫిబ్రవరిలో ఉత్తరం అందిందని ఆయన కుమారుడు షగీర్ తెలిపారు. అయితే, ఇప్పటికీ ఆయనకు ఆ అవార్డు అందలేదన్నారు. పద్మశ్రీకి తన తండ్రి పేరును సిఫారసు చేసిన స్థానిక ఎంపీ లాలూ సింగ్ కూడా అవార్డు ఇవ్వకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు షగీర్ చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన తండ్రికి పింఛను మంజూరు చేయాలని కోరారు. ప్రైవేట్ డ్రైవర్‌గా పనిచేస్తున్న తనకు నెలకు రూ.7వేల వేతనం మాత్రం వస్తుందనీ, అది కుటుంబ ఖర్చులకు కూడా సరిపోవడం లేదని షగీర్ తెలిపారు. పేదరికం కారణంగా తన తండ్రికి వైద్యం చేయించలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఆ వార్తల్లో నిజం లేదు: మండలి చైర్మన్
సాక్షి, తణుకు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తనను ప్రలోభాలకు గురిచేశారంటూ వస్తున్న వార్తలను శాసనమండలి చైర్మన్ షరీఫ్ తీవ్రంగా ఖండించారు. పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకు నియోజకవర్గంలో ఆయన గురువారం పర్యటించారు. ఈ సందర్బంగా షరీఫ్ విలేకరులతో మాట్లాడుతూ.. బుధవారం శాసనమండలిలో జరిగిన పరిణామాలపై స్పందించారు. వైఎస్సార్సీపీ నాయకులు తనపై వ్యక్తిగత దూషణలు చేయలేదని స్పష్టం చేశారు. తనను మంత్రులు దుర్భాషలాడినట్టు వచ్చిన వార్తలను తోసిపుచ్చారు. అదేవిధంగా వారు తనని బెదిరించినట్లు వస్తున్న వార్తల్లో కూడా ఎంతమాత్రం నిజం లేదన్నారు. ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని ఆయన తెలిపారు. మూడు రాజధానులు రావాలా, అమరావతి ఒక్కటే ఉండాలా అన్నదానిపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయనని తేల్చిచెప్పారు. శాసనమండలిని రద్దు చేయాలన్న ప్రతిపాదనపై స్పందిస్తూ.. అది ప్రభుత్వం ఇష్టమని వ్యాఖ్యానించారు. -
షరీఫ్‌కు చైర్మన్‌గా కొనసాగే అర్హత లేదు : డిప్యూటీ
సాక్షి, అమరావతి : శాసన మండలి చైర్మన్ అహ్మద్ షరీఫ్‌కు ఆ పదవిలో కొనసాగే అర్హత లేదని డిప్యూటీ సీఎం, మండలి సభా నాయకుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ విమర్శించారు. తక్షణమే ఆ పదవికి రాజీనామ చెయ్యాలని డిమాండ్ చేశారు. విచక్షణాధికారం పేరుతో అసహ్యంగా వ్యవహరిచారని అసహనం వ్యక్తం చేశారు. బిల్లు సెలెక్ట్ కమిటీకి ఇంకా వెళ్లలేదని, చైర్మన్ మళ్లీ సభను నిర్వహించాలని అన్నారు. సెలెక్ట్ కమిటీకి పంపాలనన నిర్ణయంపూ ఓటింగ్ జరగకపోతే అది చెల్లదని, టీడీపీ నాయకులు సంకలు గుద్దు కోవడంలో అర్థం లేదన్నారు. చంద్రబాబు ప్రజాస్వామ్యం కోసం మాట్లాడే అర్హత కోల్పోయాడని అన్నారు. ఆయనకు ప్రజాస్వామ్య విలువలు తెలియమని, చట్ట సభలను దారుణంగా అవమానించారని దుయ్యబట్టారు.(‘మండలి చైర్మన్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు’) మండలి నిబంధనలను చైర్మన్ ఉల్లఘించారు శాసన మండలి చైర్మన్ క్షమించరాని నేరం చేశారని చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. సభను రాజ్యాంగానికి అనుగుణంగా నడపడం చేతకనప్పుడు రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేకశారు. విచక్షణాధికారాన్ని సభలో డోలాయమనం ఉన్నప్పుడు వాడాలని, అంతే కాని ఇలా నిబంధనలను అతిక్రమించడానికి విచక్షణను వాడకూడదని గుర్తు చేశారు. రాజ్యాంగాన్ని, మండలి నిబంధనలను మండలి చైర్మన్ ఉల్లఘించారని మండిపడ్డారు. అసలు సెలెక్ట్ కమిటీకి పంపడానికి ఆస్కారమే లేదని, టీడీపీ కార్యకర్తలా చైర్మన్ చంద్రబాబు ఆదేశాలను అమలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెలెక్ట్ కమిటీని ప్రకటించాలని, సభ ఆమోదం పొందాలని తెలియకపోతే ఎలా అని శ్నించారు. ఒక్క నిమిషం కూడా చైర్మన్‌కి ఆ స్థానంలో ఉండే అర్హత లేదని అభిప్రాయపడ్డారు. చదవండి : సీనియర్ మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం జగన్ భేటీ మండలికి కళంకం తీసుకు వచ్చారు శాసన మండలి వ్యవస్థను చైర్మన్ నీరు గార్చారని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద గురువారం ఆయన మాట్లాడుతూ.. చట్ట విరుద్ధంగా సెలెక్ట్ కమిటీకి పంపించారని, శాసనమండలిలో నిన్న జరిగిన తీరు ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని అభివర్ణించారు. మోషన్ మూవ్ చేయకుండానే సెలెక్ట్ కమిటీకి బిల్లును పంపండం సరికాదని సూచించారు. ఇష్టం లేకుండానే సెలెక్ట్ కమిటీకి పంపామని చైర్మన్ చెప్పడం ప్రజాస్వామ్యానికి మచ్చ తేవడమే అని పేర్కొన్నారు. గ్యాలరీలో ఉన్న చంద్రబాబు ఆయన ఎమ్మెల్యేలు చైర్మన్‌ని తప్పుదోవ పట్టించి.. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించేలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛైర్మన్ చర్యను తీవ్రంగా ఖండింస్తున్నామన్నారు. -
‘మండలి చైర్మన్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు’
సాక్షి, విజయవాడ : చట్టానికి వ్యతిరేకంగా, ప్రతిపక్షనేత చంద్రబాబు కనుసన్నల్లో శాసన మండలి చైర్మన్ షరీఫ్ వ్యవహరించారని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ధ్వజమెత్తారు. చంద్రబాబు గతంలో కోడెలను శాసనసభకు, మండలి చైర్మన్‌కు షరీఫ్‌ను ఎన్నుకొని ప్రజాస్వామ్యాన్ని మంట కలిపారని మండిపడ్డారు. గురువారం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీలు మారిన వారికి మంత్రి పదవులు ఇచ్చి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న తమను మట్లాడకుండా గొంత నొక్కారని విమర్శించారు. నిబంధనలు పాటించకుండా చైర్మన్ విచక్షణ అధికారం అని ప్రజాస్వామ్యాన్ని అపహప్యం చేశారని వ్యాఖ్యానించారు. తప్పు జరిగింది. చంద్రబాబు చెప్పారు.. చెస్తున్నా.. అన్నట్లు మాట్లాడిన చైర్మన్ మాటలను తప్పు పట్టారు. ఏపీ ప్రజలు ఆకాంక్షించే బిల్లులను వ్యతిరేకిస్తున్నారని,చట్టసభలను జిగుచ్చాకరంగా మార్చారని మల్లాది విష్ణు దుయ్యబట్టారు. లోకేష్‌పై మంత్రులు దాడి చేశారనడం అసత్యమని, చైర్మన్‌ను దూషించడం.అబద్దామని పేర్కొన్నారు. మండలి చైర్మన్ న్యాయ పక్షాన కాకుండా అన్యాయ పక్షాన నిలిచారని ఆరోపించారు. ప్రజలు చివరి అస్త్రంగానే ఓట్లు వేసి బాబును ఇంటికి పంపారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షం వారు ఏ రోజైనా ప్రజలకు కావాల్సింది కాకుండా చంద్రబాబుకు కావాల్సిందే అడిగుతున్నారని విమర్శించారు. టీడీపీకి రాబోయే కాలంలోనూ ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు. అన్ని ప్రాంతాల అభిృద్ధి కావాలనేదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్ష అని మల్లాది విష్ణు స్పష్టం చేశారు. -
టీడీపీ సభ్యులపై మండలి చైర్మన్ ఆగ్రహం..
సాక్షి, అమరావతి : ఆంధప్రదేశ్ శాసనమండలి సమావేశాలను అడ్డుకునేందుకు టీడీపీ సభ్యులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మంగళవారం సభలో అనవసర రాద్ధాంతం సృష్టించిన టీడీపీ ఎమ్మెల్సీలు బుధవారం కూడా అదే తీరుగా వ్యవహరిస్తున్నారు. దీంతో మండలి చైర్మన్ షరీఫ్ టీడీపీ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీవీ ప్రసారాలు రావడం లేదంటూ టీడీపీ ఎమ్మెల్సీలు బుధవారం మండలి వ్యవహారాలకు ఆటంకం కలిగించారు. టీవీ ప్రసారాలకు సాంకేతిక సమస్య తలెత్తిందని.. దానిని పరిశీలిస్తున్నామని మంత్రి చెప్పినా కూడా టీడీపీ సభ్యులు వినిపించుకోలేదు. మంత్రి సమాధానంతో ఏకీభవించిన మండలి చైర్మన్ షరీఫ్.. టీడీపీ సభ్యులు ఆందోళన విరమించాలని ఆదేశించారు. అయితే టీడీపీ సభ్యులు మాత్రం చైర్మన్ చెప్పిన కూడా వినిపించికోకుండా.. టీవీ లైవ్‌ల కోసం ఆందోళన కొనసాగించారు. పదే పదే టీవీ ప్రసారాల పేరుతో టీడీపీ సభ్యులు మండలి సమావేశాలను అడ్డుకోవడంపై చైర్మన్ అసహనం చెందారు. టీవీ ప్రసారాలు తప్ప మరే అంశం లేదా అంటూ టీడీపీ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఛూ ‘మంత్రి ఖాళీ’!
సాక్షి ప్రతినిధి, ఏలూరు: తాజా మంత్రివర్గ విస్తరణలో జిల్లా నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మొండిచెయ్యి చూపించారు. జిల్లా నుంచి ఎమ్మెల్సీగా ఉన్న షరీఫ్‌కు మైనారిటీ కోటాలో చాలా కాలంగా మంత్రి పదవి ఇస్తామని ఊరిస్తూ వచ్చారు. చివరికి ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఆయనను పక్కన పెట్టి రాయలసీమకు చెందిన వారికి ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఎస్టీ కోటాలో పోలవరం నుంచి మొడియం శ్రీనివాస్ ఒక్కరే అధికార పార్టీ నుంచి గెలుపొందారు. అయితే గత నాలుగేళ్లలో ఎస్టీల నుంచి ఎవరికీ మంత్రి పదవి ఇవ్వలేదు. గత విస్తరణలో మొడియంకు మంత్రి పదవి వస్తుందని ఆశించినా అది దక్కలేదు. తాజాగా వైఎస్సార్ సీపీ నుంచి గెలిచి తెలుగుదేశం తీర్థం పుచ్చుకుని మావోల చేతిలో చనిపోయిన కిడారి సర్వేశ్వరరావు కుమారుడికి ఎస్టీ కోటాలో మంత్రి పదవి ఇవ్వాలని సీఎం నిర్ణయించడంపైజిల్లా నేతల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. షరీఫ్‌కు మరో‘సారీ’..! జిల్లాకు చెందిన మహ్మద్ అహ్మద్ షరీఫ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోసారి మొండిచెయ్యి చూపించారు. చివరిసారిగా జరుగుతున్న మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించడం లేదు. టీడీపీ ఆవిర్భావం నుంచి సేవలందిస్తూ, పార్టీకి వీరవిధేయుడిగా ఉన్న షరీఫ్‌కు మంత్రివర్గంలో స్థానం ఇక దక్కే అవకాశం లేకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురైనట్టు సమాచారం. మైనార్టీ వర్గం నుంచి షరీఫ్‌కు బెర్త్ ఖాయం చేస్తారని మూడేళ్లుగా ప్రచారం సాగుతోంది. ఈ మూడేళ్ల కాలంలో మంత్రివర్గ విస్తరణ జరిగిన ప్రతిసారీ షరీఫ్‌కు మంత్రి పదవి ఖాయం అని పార్టీ అధిష్టానం, సాక్షాత్తూ చంద్రబాబునాయుడు ఊరిస్తున్నారు. ముఖ్యంగా మంత్రివర్గంలో మైనార్టీల నుంచి ప్రాతినిధ్యం లేకపోవడంతో తనపై ఖచ్చితంగా చంద్రబాబు కరుణ చూపిస్తారని షరీఫ్ కూడా ఆశగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి షరీఫ్ పార్టీకి పలు రూపాల్లో సేవలు అందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంటే ముందుగానే పార్టీలో చేరిన వ్యక్తి షరీఫ్. 1982లో ఎన్టీఆర్ పార్టీ ప్రకటన చేయగానే, నరసాపురంలో 11 మందితో పార్టీలో చేరారు. కొత్తపల్లి లాంటి వారూ షరీఫ్ తరువాత వచ్చినవారే. 1990–97 మధ్య పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. తరువాత 1997 నుంచి 2000 సంవత్సరం వరకూ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్‌గా, 2002లో స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా పని చేశారు. 2011లో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 2015లో ఎమ్మెల్సీ అయ్యారు. గుంటూరులో టీడీపీ అట్టహాసంగా మైనార్టీ సదస్సు ఏర్పాటు చేసిన సందర్భంలో అయితే అదే వేదికపై షరీఫ్‌కు మంత్రి పదవిని చంద్రబాబు ప్రకటిస్తారని ప్రచారం సాగింది. షరీఫ్ వైఖరిలో మార్పు మంత్రి పదవి ఊహాగానాలు రాగానే షరీఫ్ కూడా తమ అధినాయకుడిని ప్రసన్నం చేసుకునేందుకు, ప్రతిపక్షంపై వివాదాస్పదమైన విమర్శలు చేయడం మొదలుపెట్టారు. సౌమ్యుడిగా పేరున్న షరీఫ్ వైఖరిలో మార్పు రావడం అప్పటిలో పెద్ద చర్చనీయాంశమైంది. పదవి కోసం పడుతున్న తంటాలుగా షరీఫ్ కొత్త వైఖరిని రాజకీయవర్గాలు విశ్లేషించాయి. కానీ అవేమీ చంద్రబాబును ఆకర్షించలేదు. పార్టీకి వీరవిధేయుడైనా మైనార్టీ కార్డు కూడా చంద్రబాబుకు కనిపించలేదు. మొత్తంగా షరీఫ్‌కు ఇక ఛాన్స్ లేదని తేలిపోవడంతో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. ముఖ్యంగా మైనార్టీ వర్గాలు భగ్గుమంటున్నాయి. ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగి శాసనమండలి చైర్మన్ ఇస్తానని హామీ ఇవ్వడంతో ఆయన మీడియా ముందుకు వచ్చారు. తాను మంత్రి పదవిని ఆశించిన మాట వాస్తవమేనని, మండలి చైర్మన్ పదవి ఇచ్చారని అన్నారు. పదవి కావాలని చంద్రబాబును తాను ఎప్పుడూ అడగలేదని పేర్కొన్నారు. ఎస్టీల నుంచి ఏకైక అధికారపార్టీ ఎమ్మెల్యే అయినా.. మరోవైపు రాష్ట్రంలోనే ఎస్టీల నుంచి గెలిచిన ఏకైక అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన మొడియం శ్రీనివాస్‌కు కూడా మంత్రి పదవి చేతిదాకా వచ్చి చేజారిపోయింది. గత మంత్రివర్గ విస్తరణ సమయంలో ముందురోజు సాయంత్రం మంత్రివర్గంలో బెర్త్ ఖరారు అయ్యింది. అర్జెంట్‌గా వచ్చి ముఖ్యమంత్రిని కలవాలని పేషీ నుంచి ఫోన్ వచ్చింది. ఆయన బయలుదేరి వెళ్లారు. ఈలోగానే సమీకరణాలు మారి బీసీ కోటాలో జిల్లా నుంచి పితాని సత్యనారాయణకు పదవి దక్కింది. ఈసారి అసలు ఎమ్మెల్యే కాని వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వడంతో మొడియం అసంతృప్తికి గురైనట్లు సమాచారం. -
పాక్ ప్రధానికి షాక్: మార్కెట్లు క్రాష్
కరాచీ: పనామా గేట్ వ్యవహారం పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌కు పదవీగండం తెచ్చి పెడితే అక్కడి స్టాక్‌మార్కెట్లను అశని పాతంలా తాకింది. పాకిస్తాన్ స్టాక్ మార్కెట్లు ఒక్క సారిగా కుప్పకూలిపోయాయి. ప్రధాని నవాజ్ షరీఫ్‌కు ఆ దేశ సుప్రీంకోర్టులో భారీ షాక్ తగలడంతో ఇన్వెస్టర్లలో ఆందోళన భారీ అమ్మకాలకు దారి తీసింది. కోర్టు తీర్పుపై అంచనాల నేపథ్యంలో ఆరంభంలో ఒక దశలో 12 వందల పాయింట్లు పడిపోయిన సూచీ ఆ తర్వాత కొద్దిగా తేరుకుని 45వేల మార్క్ వద్ద స్థిరపడింది. అయితే కోర్టు తీర్పు వెలువడిన నిమిషాల్లోనే అక్కడి మార్కెట్లు క్రాష్ అయ్యాయి. కరాచీ స్టాక్ మార్కెట్ ఇండెక్స్ కెఎస్ఈ 700 పాయింట్లు పతనమైంది. కాగా ఈ తీర్పు నేపథ్యంలో ప్రధానమంత్రి పదవికి షరీఫ్ రాజీనామా చేశారు. -
దెయ్యాల ఆట ఆరంభం...!
రెండు ప్రేమ జంటలు హాలీడేస్‌ను ఎంజాయ్ చేసేందుకు రిసార్ట్స్‌లోని ఓ గెస్ట్ హౌస్‌లో బస చేస్తాయి. అక్కడ వారికి ప్రేతాత్మల వల్ల ఊహించని అనుభవాలు ఎదురవుతాయి. ప్రేతాత్మల నుంచి ప్రేమికులు ఎలా బయటపడ్డారు? అనే కథతో రూపొందిన బాలీవుడ్ చిత్రం ‘ది లాస్ట్ హర్రర్’. ఈ చిత్రాన్ని ఎఎన్వీïపీ సమర్పణలో మేఘాంశ్ మూవీస్‌పై సేమ్ టైటిల్‌తో తెలుగులోకి బి.ఎస్. ప్రసాద్ అనువదించారు. ‘దెయ్యాల ఆట మొదలైంది’ ఉపశీర్షిక. శ్యామ్, షరీఫ్, అమృత, నీతా ముఖ్య తారలు. ఈ నెలలోనే సినిమా విడుదల కానుంది. ‘‘సస్పెన్స్‌తో సాగే రొమాంటిక్ హరర్ చిత్రమిది’’ అన్నారు బి.ఎస్. ప్రసాద్. -
ప్రధాని పదవి నుంచి దిగిపో.. లేదా..!
-
ప్రధాని పదవి నుంచి దిగిపో.. లేదా..!
లాహోర్: ఏడు రోజుల్లో ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయకపోతే విపత్కర పరిస్ధితి ఎదుర్కొవాల్సి ఉంటుందని ఆ దేశ సుప్రీం కోర్టు, లాహోర్ హైకోర్టు బార్ అసోసియేషన్లు పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌ను హెచ్చరించాయి. షరీఫ్ రాజీనామా చేయకపోతే ఆయనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ప్రారంభిస్తామని పేర్కొన్నాయి. ఈ మేరకు సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. పనామా పేపర్ల కేసులో సుప్రీం కోర్టు తీర్పు తర్వాత షరీఫ్ ప్రధాని పదవిలో ఉండే అర్హత కోల్పోయారని అన్నాయి. ఈ నెల 19వ తేదీన పాకిస్తాన్ లాయర్స్ రిప్రజెంటేటివ్స్ కన్వెన్షన్ వద్ద పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్(పీఎంఎల్ఎన్) తరఫు న్యాయవాదులు ఎస్సీబీఏ, ఎల్హెచ్సీబీఏ సభ్యులతో గొడవపడిన విషయం తెలిసిందే. ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించిన బార్ అసోసియేషన్లు నవాజ్ షరీఫ్ ప్రధాని పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నెల 27 తేదీలోపు షరీఫ్ ప్రధాని పదవి నుంచి తప్పుకోకపోతే ఆయనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామని ప్రకటించాయి. -
అసాధారణ చర్యలకూ వెనుకాడం!
-
అసాధారణ చర్యలకూ వెనుకాడం!
జాధవ్‌కు పాక్ ఉరిశిక్ష విధించడంపై భారత్ స్పందన ► న్యాయం జరిగేందుకు అన్ని మార్గాల్లోనూ ప్రయత్నిస్తాం ► పార్లమెంటులో విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ ప్రకటన ► ఉభయసభల్లో సభ్యుల ఆందోళన ► 60 రోజుల్లో జాధవ్ అప్పీలు చేసుకోవచ్చు: పాక్ రక్షణ మంత్రి కుల్‌భూషణ్ జాధవ్‌కు పాక్ సైనిక కోర్టు ఉరిశిక్ష విధించడంపై భారత్ తీవ్రంగా స్పందించింది. జాధవ్‌కు న్యాయం జరిగేందుకు అసాధారణ చర్యలకూ వెనుకాడబోమంది. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల విషయంలో తదనంతర పరిణామాలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. ఈ అంశాన్ని పార్లమెంటు ఉభయసభల్లోనూ సభ్యులు లేవనెత్తారు. జాధవ్‌కు న్యాయం జరిగేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించాలని విపక్షాలు ప్రభుత్వాన్ని కోరాయి. దీనిపై విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఉభయసభల్లో సవివర ప్రకటన చేశారు. జాధవ్‌కు న్యాయం జరిగేందుకు దౌత్యపరంగానే కాకుండా.. అన్ని మార్గాల్లోనూ కృషి చేస్తామని స్పష్టం చేశారు. న్యూఢిల్లీ, ఇస్లామాబాద్: భారత మాజీ నేవీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్‌కు ఉరిశిక్షతో భారత్‌ను అప్రతిష్ట పాలు చేసేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోందని, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం నుంచి అంతర్జాతీయ సమాజం దృష్టిని మరల్చేందుకు కుయుక్తులకు పాల్పడుతోందని పార్లమెంట్లో ప్రభుత్వం విమర్శించింది. ఉభయ సభల్లో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రకటన చేస్తూ ‘జాధవ్‌కు న్యాయం కోసం అన్ని చర్యలు తీసుకుంటాం, అమాయకుడైన భారతీయుడ్ని పాక్ కిడ్నాప్ చేసింది. మరణశిక్షపై పాకిస్తాన్ ముందుకెళ్తే జాధవ్ ఉరిని పథకం ప్రకారం చేసిన హత్యగా పరిగణిస్తాం. అనంతరం ఇరుదేశాల దౌత్య సంబంధాలపై ఏర్పడే ప్రతికూల పరిణామాల గురించి పాకిస్తాన్ ఆలోచించుకోవాలి’ అని సుష్మా హెచ్చరించారు. జాధవ్‌ను కలిసేందుకు అనుమతించలేదు ‘జాధవ్ తప్పుచేశాడనేందుకు ఎలాంటి ఆధారం లేదు. జాధవ్‌పై ఆధారాల కోసం పాకిస్తాన్ భారత్ సాయాన్ని కోరింది. ఈ సందర్భంగా కేసుతో సంబంధం లేని కొందరు భారతీయ ఉన్నతాధికారులపై అర్థంలేని ఆరోపణలు చేసింది. తాము చూపించిన ఆధారాల్ని అంగీకరిస్తేనే జాధవ్‌ను కలిసేందుకు భారత్ రాయబార కార్యాలయాన్ని అనుమతిస్తామని పాకిస్తాన్ లింకు పెట్టింది. నిజ నిర్ధారణకు, పాకిస్తాన్లో జాధవ్ ఉండడానికి గల కారణాల కోసం భారత్ రాయబార కార్యాలయాన్ని అనుమతించడం తప్పనిసరన్న అంశాన్ని మేం లేవనెత్తాం. తమ షరతులు ఒప్పుకుంటేనే అనుమతిస్తామని మరోసారి పాక్ పేర్కొంది’ అని సుష్మా తెలిపారు. అంతకముందు లోక్‌సభలో హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ... జాధవ్‌కు న్యాయం జరిగేందుకు చేయదగ్గ అన్ని ప్రయత్నాలు చేస్తామన్నారు. మౌనం ఎందుకు?: లోక్‌సభలో కాంగ్రెస్ జాధవ్ విషయంలో ప్రభుత్వం సరిగా వ్యవహరించలేదని లోక్‌సభలో ప్రతిపక్షాలు ఆరోపించాయి. ‘ఎలాంటి ఆహ్వానం లేకపోయినా మీరు పెళ్లికి(నవాజ్ షరీఫ్ కుమార్తె పెళ్లికి) హాజరుకావచ్చు. కానీ ఈ అంశంపై అతణ్ని(షరీఫ్) కలవడం, మాట్లాడడం గానీ చేయలేదు’ అని మోదీని ఉద్దేశించి ఖర్గే పరోక్షంగా విమర్శించారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేత ఆజాద్ మాట్లాడుతూ.. జాధవ్ తరఫున ప్రభుత్వం అత్యుత్తమ న్యాయవాదిని ఏర్పాటు చేయాలన్నారు. సుష్మ స్పందిస్తూ.. పాకిస్తాన్ సుప్రీంకోర్టులోని అత్యుత్తమ న్యాయవాదుల్ని ఏర్పాటు చేయడంతో పాటు, పాక్ అధ్యక్షుడితో మాట్లాడతామని చెప్పారు. మరణశిక్షపై 60 రోజుల్లోపు కుల్‌భూషణ్ అప్పీలు చేసుకోవచ్చని పాక్రక్షణ మంత్రి అసిఫ్ చెప్పారు. ముప్పును తిప్పికొట్టే సత్తా ఉంది పాక్ ప్రధాని షరీఫ్ ఎలాంటి ముప్పునైనా తిప్పికొట్టే సత్తా తమ బలగాలకు ఉందని పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ అన్నారు. ‘పాకిస్తాన్ శాంతికాముక దేశం. అన్ని దేశాలతో.. ముఖ్యంగా పొరుగు దేశాలతో స్నేహసంబంధాలను కోరుకుంటోంది. అయితే ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు మా బలగాలు సంసిద్ధంగా ఉన్నాయి’ అని చెప్పారు. కుల్‌భూషణ్ జాధవ్‌ను ఉరితీస్తే ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతింటాయని భారత్ హెచ్చరించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. జాతీయ భద్రత అనే భావన మారిపోయిందని, యుద్ధాలు ప్రస్తుతం సైన్యాలకు పరిమితం కాలేదని అన్నారు. మంగళవారం ఖైబర్–పంక్తూన్ఖ్వా రాష్ట్రంలోని అస్ఘర్ ఖాన్‌లో జరిగిన ఓ సైనిక కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఘర్షణలకు కాకుండా సహకారానికి, అనుమానానికి కాకుండా ఉమ్మడి శ్రేయస్సుకు తమ దేశం ప్రాధాన్యమిస్తుందన్నారు. జాధవ్‌కు మరణశిక్షను వ్యతిరేకించిన బిలావల్.. జాధవ్‌కు మరణశిక్షను పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావల్ భుట్టో పరోక్షంగా వ్యతిరేకించారు. ఇది వివాదాస్పద అంశమని, తమ పార్టీ మరణశిక్షకు వ్యతిరేకమని పేర్కొన్నారు. -
పాక్ ప్రభుత్వం కీలక నిర్ణయం?
-
యువకుడి దారుణ హత్య
యువకుడిని దారుణంగా హత్య చేసి రోడ్డు పక్కన పడేసిన సంఘటన చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని అభినవనగర్ కాలనీ కమ్యూనిటి హాల్ వద్ద గురువారం వెలుగుచూసింది. మహమ్మద్ గూడకు చెందిన షరీఫ్(28)ను గుర్తుతెలియని వ్యక్తులు కిరాతకంగా హతమార్చి రోడ్డు పక్కన పడేసి వె ళ్లారు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
అమ్మల సమక్షంలో మోదీ-షరీఫ్ మాట్లాడాలి!
బరెలీ (ఉత్తరప్రదేశ్): భారత్-పాకిస్థాన్ అన్నదమ్ముళ్లలాంటివి. కాబట్టి మన రెండు దేశాల ప్రధానమంత్రులు వారి అమ్మల సమక్షంలో చర్చలు జరిపితే.. ఇరుదేశాల సమస్యలకు కచ్చితమైన పరిష్కారం దొరుకుతుందని అంటున్నారు ప్రముఖ ఉర్దూ కవి మునావరణ్ రాణా. 'ఇద్దరు ప్రధానమంత్రులు నరేంద్రమోదీ, నవాజ్‌షరీఫ్ తమ అమ్మల సమక్షంలో చర్చలు జరిపితే ఇరుదేశాల సమస్యలకు తప్పక పరిష్కార మార్గం దొరుకుతుంది. అమ్మలు చెంత ఉన్నప్పుడు ఎంతటి సమస్యలకైనా పరిష్కారం దొరుకుతుంది' అని ఆయన మంగళవారం ఓ కార్యక్రమంలో పేర్కొన్నారు. భారత్, పాకిస్థాన్‌లు అన్నదమ్ముళ్లని, అందుకే పొరుగు దేశాన్ని ఇటీవల సందర్శించడం, నవాజ్ షరీఫ్ తల్లి పాదాలకు నమస్కరించడం ద్వారా అన్నగా తన బాధ్యతను ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్వర్తించారని మునావర్ రాణా ప్రశంసించారు. ఇప్పుడు తదుపరి చొరవ తీసుకోవాల్సిన బాధ్యత షరీఫ్‌పై ఉందన్నారు. మునావర్ రాణా ఇటీవల తనకు ప్రకటించిన సాహిత్య అకాడమీ అవార్డును తిరస్కరించిన సంగతి తెలిసిందే. తాను కానీ, తన కొడుకు కానీ ప్రభుత్వ అవార్డులు తీసుకోరాదని నిర్ణయించామని ఆయన మరోసారి స్పష్టం చేశారు. -
మోదీ పాక్ పర్యటనను ప్రశంసించిన చైనా
బీజింగ్: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆకస్మిక పాకిస్థాన్ పర్యటన నేపథ్యంలో భారత్-పాక్ సంబంధాలను స్వాగతిస్తున్నట్లు చైనా ప్రకటించింది. ఆ దేశ విదేశాంగ అధికార ప్రతినిధి లు కాంగ్ మాట్లాడుతూ.. భారత్, పాక్ సంబంధాల మెరుగుపడటం చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు. అలాగే ఇరుదేశాల మధ్య సంబంధాల బలోపేతానికి తమ మద్దతు ఉంటుందని, చర్చలు కొనసాగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. భారత్, పాక్ సంబంధాలు మెరుగుపడటం ప్రాంతీయంగా శాంతి, స్థిరత్వం, అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందని చైనా తెలిపింది. పొరుగు దేశాలతో మైత్రిని కోరుకుంటూ మోదీ చేస్తున్న దౌత్యం, పాక్ పర్యటనను పలు దేశాలు పొగడ్తలతో ముంచెత్తాయి. -
శాంతి బాటపై తూటాలు
చర్చలపై ముందుకు వెళ్లాలని మోదీ, షరీఫ్‌లు నిర్ణయించిన కొన్ని రోజుల్లోనే కాల్పుల చిచ్చు ♦ రెండు రోజులుగా పాక్ వైపు నుంచి భారత సైనిక శిబిరాలపై ♦ భారీగా కాల్పులు, మోర్టారు బాంబు దాడులు ♦ జమ్మూలో ఎల్ఓసీ వద్ద చొరబాటుకు ఉగ్రవాద మూక యత్నం.. ♦ కేంద్ర మంత్రుల సమీక్ష... పాక్ దౌత్యాధికారికి భారత్ నిరసన ♦ కాల్పులు, చొరబాట్లను బలంగా తిప్పికొడతాం: దోవల్ ♦ సరిహద్దులో పాక్ కాల్పుల హోరు ♦ తిప్పికొట్టిన భారత బలగాలు జమ్మూ/న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ దేశాల ప్రధానమంత్రులు ఒకవైపు శాంతి చర్చల దిశగా అడుగులు వేస్తుండగా.. మరోవైపు రెండు దేశాల మధ్య సరిహద్దులో కాల్పుల చిచ్చు చెలరేగింది. జమ్మూకశ్మీర్‌లో అంతర్జాతీయ సరిహద్దు వెంట, నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంట.. బుధవారం కాల్పులకు తెగబడి ఒక మహిళ ప్రాణాలను బలితీసుకుని, ఐదుగురిని గాయపరచిన పాక్ సైనిక బలగాలు గురువారం ఉదయం కూడా భారత సైనిక శిబిరాలపై తుపాకులు, మోర్టార్లతో భారీ కాల్పులు కొనసాగించాయి. ఈ కాల్పుల్లో నలుగురు వ్యక్తులు గాయపడ్డారని భారత సైనికాధికారులు తెలిపారు. పాక్ బలగాల కాల్పులను భారత సైనిక బలగాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయని పేర్కొన్నారు. ఇక భారత ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం జమ్మూలో పర్యటించనున్న నేపథ్యంలో.. గురువారం ఉదయం కశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్లో ఎల్ఓసీ వద్ద ఉగ్రవాద మూక ఒకటి భారత భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నించింది. దానిని భారత సైనిక బలగాలు భగ్నం చేశాయి. పాక్ బలగాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించటంపై.. భారత్ ఆ దేశానికి తన నిరసన తెలిపింది. ఎలాంటి కవ్వింపూ లేకుండా పాక్ వైపు నుంచి జరిగే కాల్పులను, సీమాంతర ఉగ్రవాదాన్ని బలంగా తిప్పికొడతామని ఆ దేశాన్ని భారత్ హెచ్చరించింది. అయితే.. సరిహద్దులో కాల్పుల విరమణను ఉల్లంఘించింది భారతేనని, భారత బలగాల కాల్పుల్లో తమ పౌరులు నలుగురు చనిపోయారని పాక్ ప్రత్యారోపణ చేసింది. మంత్రులు, అధికారుల సమీక్ష... మోదీ, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌లు రష్యాలో కలుసుకుని.. శాంతి చర్చల పునరుద్ధరణపై అంగీకారానికి వచ్చి కొద్ది రోజులు కూడా గడవకముందే.. ఇరు దేశాల మధ్య మళ్లీ సరిహద్దులో కాల్పుల వివాదం రాజుకుంది. జమ్మూలోని కానాచక్ - అఖ్నూర్ సెక్టార్ నుంచి ఆర్ఎస్ పురా సెక్టార్ వరకూ పాక్ రేంజర్లు కాల్పుల వలయాన్ని విస్తరించారని బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. పాక్ వైపు నుంచి రెండు వారాలుగా కాల్పుల విరమణ ఉల్లంఘనలు పెరిగాయని ఉత్తర సైనిక కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ డి.ఎస్.హుడా పేర్కొన్నారు. ఈ ఒక్క నెలలోనే 9 ఘటనలు జరిగాయన్నారు. ఈ నేపథ్యంలో.. ఢిల్లీలోని పాక్ హైకమిషనర్ అబ్దుల్బాసిత్ను పిలిపించిన భారత ప్రభుత్వం పాక్ వైఖరిపై తీవ్ర నిరసన తెలిపింది. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి ఎస్.జైశంకర్‌లు, పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లో భారత దౌత్యాధికారి టి.సి.ఎ.రాఘవన్‌లతో బుధవారం ఉదయం నుంచి గురువారం సాయంత్రం వరకూ చర్చలు జరిపారు. హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రక్షణ మంత్రి మనోహర్ పారికర్‌లు గురువారం ఉన్నతాధికారులతో సమావేశమై తాజా పరిణామాలు, పరిస్థితులపై సమీక్షించారు. కాల్పులను బలంగా తిప్పికొడతాం... మంత్రులతో భేటీ అనంతరం దోవల్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. సరిహద్దులో శాంతి, సామరస్యాల స్థాపనకు అవసరమయ్యే చర్యలు చేపట్టేందుకు భారత్ కట్టుబడి ఉందన్నారు. అయితే.. పాక్ వైపు నుంచి నిష్కారణమైన ఎటువంటి కాల్పులనైనా భారత బలగాలు సమర్థవంతంగా, బలంగా తిప్పికొడతాయన్న విషయంలో సందేహం అవసరం లేదన్నారు. చొరబాట్లు, సీమాంతర ఉగ్రవాదం నుంచి సరిహద్దులను పరిరక్షించటంలో ఏమాత్రం ఉపేక్షించేదీ లేదని పేర్కొన్నారు. ‘సరిహద్దులో శాంతి, సామరస్యాలను బలోపేతం చేసే ఉద్దేశం, అభిలాష ఆ చర్చల లక్ష్యమైతే అందుకు భారత్ కట్టుబడి ఉంటుంది. అలాకాకుండా.. కవ్వింపు లేని కాల్పులు, చొరబాట్లు, సీమాంతర ఉగ్రవాదం కొనసాగితే.. అప్పుడు పరిస్థితి వేరుగా ఉంటుంది’’ అని ఆయన బదులిచ్చారు. ఆ ద్రోన్ మాది కాదు: భారత్ బుధవారం తమ భూభాగంలోకి వచ్చిన భారత్ ద్రోన్ ను కూల్చివేశామన్న పాక్ ప్రకటనను భారత విదేశాంగ కార్యదర్శి జైశంకర్ తప్పుపట్టారు. భారత సైన్యం వద్ద ఆ తరహా డ్రోన్లు లేవని, అది చైనా తయారీ డ్రోన్‌గా కనిపిస్తోందనిఅన్నారు. కాగా, ఈ ఉదంతానికి సంబంధించి పాకిస్తాన్ ప్రభుత్వం ఇస్లామాబాద్‌లోని భారత దౌత్యా ధికారి టీసీఏ రాఘవన్‌ను పిలిపించుకుని నిరసన తెలిపింది. నేడు మోదీ పర్యటన.. భద్రత కట్టుదిట్టం ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం జమ్మూలో పర్యటించనున్నారు. జమ్మూకశ్మీర్ మాజీ ఆర్థికమంత్రి గిరిధారిలాల్డోగ్రా శతజయంతి వేడుకల్లో పాల్గొననున్నారు. సరిహద్దు వెంట తాజా పరిణామాల నేపథ్యంలో మోదీ పర్యటనకు భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేశారు. ప్రధానికి భద్రత కల్పిస్తున్న ఎస్పీజీ బృందం ఇప్పటికే జమ్మూ చేరుకుని.. కార్యక్రమం జరిగే జమ్మూ యూనివర్సిటీలో పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తోంది. ఉఫా ప్రకటన చారిత్రక తప్పిదం: కాంగ్రెస్ సరిహద్దు వెంట తాజా పరిణామాల నేపథ్యంలో.. కొద్ది రోజుల కిందట రష్యాలోని ఉఫాలో భారత ప్రధాని మోదీ, పాక్ ప్రధాని షరీఫ్‌లు చేసిన సంయుక్త ప్రకటన.. చారిత్రక విజయం కాదని, చారిత్రక తప్పిదమని కాంగ్రెస్ పేర్కొంది. పాక్‌కు తగిన జవాబివ్వటంతోపాటు, ముంబై దాడుల నిందితులను చట్టం ముందు నిలబెట్టే విషయంలో భారత వైఖరిని నీరుగార్చినందుకు మోదీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని పార్టీ నేత ఆనంద్‌శర్మ డిమాండ్ చేశారు. -
కొత్త ప్రేమకథ
అందమైన ప్రేమకథకు కొన్ని ఆసక్తికరమైన సంఘటనలను జోడించి రూపొందిస్తున్న చిత్రం ‘కొన్ని రోజుల్లోనే ఇలా’. షారిఫ్, రాజేశ్, ఉష, లావణ్య ముఖ్యతారలుగా శ్రీరామ ఫిలిం పతాకంపై బుజ్జి హరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి బుజ్జి గోపి దర్శకుడు. ‘‘ఓ విభిన్నమైన కథాంశంతో అందరినీ ఆక ట్టుకునేలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నాం. తదుపరి పాటల చిత్రీకరణకు గోవా వెళ్లనున్నాం’’ అని దర్శక, నిర్మాతలు తెలిపారు. -
పాతబస్తీలో వడ్డీవ్యాపారుల ఆగడాలు
హైదరాబాద్ : హైదరాబాద్ పాతబస్తీలో వడ్డీ వ్యాపారుల ఆగడాలు అడ్డుఅదుపు లేకుండా కొనసాగుతున్నాయి. తాజాగా ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురి చేశారు. వివరాల్లోకి వెళితే చాంద్రాయణగుట్టలో ట్రావెల్ ఏజెంట్‌గా పని చేస్తున్న షరీఫ్ అనే వ్యక్తి... వడ్డీ వ్యాపారి నారాయణరెడ్డి వద్ద రూ.10 చొప్పున 2లక్షల 50వేల రూపాయలు ఏడాది క్రితం అప్పు తీసుకున్నాడు. అయితే సకాలంలో వడ్డీ చెల్లించలేదని షరీఫ్‌ను బుధవారం నారాయణరెడ్డి అనుచరులు కిడ్నాప్ చేసి ఆల్మాస్గూడలో బంధించి చిత్రహింసలు పెట్టారు. ఈ విషయాన్ని బాధితుడి బంధువులు ఫిర్యాదు చేయటంతో పోలీసులు వడ్డీ వ్యాపారుల డెన్‌పై దాడి చేసి షరీఫ్‌ను విడిపించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మళ్లీ మొదటికి...!
సంపాదకీయం ప్రతి కథా కంచికి చేరినట్టుగానే పాకిస్థాన్‌తో స్నేహ సంబంధాలు నెల కొల్పుకొనేందుకు చేసే ప్రతి యత్నమూ వైఫల్యంతో ముగుస్తున్నది. నరేంద్ర మోడీ ఆహ్వానాన్ని మన్నించి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆయన ప్రమాణస్వీకారానికి వచ్చాక ఏర్పడిన ఆశావహ వాతావరణం కాస్తా తాజా పరిణామాలతో భగ్నమైంది. విదేశాంగ కార్యదర్శుల స్థాయి చర్చలు మరో అయిదారు రోజుల్లో ప్రారంభం కానుండగా, కేంద్ర ప్రభుత్వ అభీష్టానికి భిన్నంగా పాకిస్థాన్ హైకమిషన ర్ అబ్దుల్ బాసిత్ కాశ్మీర్ వేర్పాటువాదులతో సమావేశం కావడంవల్ల ఈ స్థితి ఏర్పడింది. వాస్తవానికి ఈ సమావే శానికి చాలా ముందే... షరీఫ్ వచ్చి వెళ్లిన కొన్ని రోజులకే సరిహద్దులు ఎప్పటిలా ఉద్రిక్తంగా మారాయి. తాను శాంతి సందేశంతో వచ్చానని న్యూఢిల్లీ విమానాశ్రయంలో దిగిన వెంటనే షరీఫ్ ప్రకటించినప్పుడు అందరిలోనూ ఆశలు మోసులె త్తాయి. ఇరు దేశాలమధ్యా పరస్పర విద్వేషాల అధ్యాయం ఇక ముగు స్తుందని చాలామంది భావించారు. ఇదంతా మే నెలాఖరునాటి సం గతి. జూన్ నెల కొద్దో గొప్పో సజావుగా సాగింది. జూలైనుంచి సరిహ ద్దులు ఎప్పటిలా కాల్పులతో మోతెక్కాయి. అధీన రేఖ వద్ద కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలు యధావిధిగా మొదలయ్యాయి. గత పదిరోజుల్లోనూ కాల్పుల విరమణ ఉల్లంఘన ఘటనలు డజను వరకూ చోటుచేసుకున్నాయి. ఇవన్నీ మోడీ ప్రమాణానికి నవాజ్ షరీఫ్ వచ్చి వెళ్లాక జరిగినవి. అంత మాత్రాన అంతకుముందు అంతా బాగుందను కోవడానికి లేదు. సరిహద్దుల్లో కాల్పుల మోత ఎప్పుడూ ఆగిందే లేదు. మరి అలాంటపుడు మోడీ నవాజ్ షరీఫ్‌ను ప్రమాణ స్వీకారానికి ఎలా పిలిచారన్న ప్రశ్న ఆనాడే తలెత్తింది. అయితే, సమస్యలున్నంత మాత్రాన చర్చలకు తలుపులు మూసే యాలనుకోవడం సరికాదు. అలాంటి సమస్యలున్నాయి గనుక చర్చల అవసరం మరింతగా ఉంటుంది. ఇరుగు పొరుగు దేశాలన్నాక పొరపొ చ్చాలు రాకతప్పదు. అందులోనూ భారత్, పాక్‌లు రెండూ దాయాది దేశాలు గనుక వీటి తీవ్రత మరింత ఎక్కు వగా ఉంటుంది. కనుక షరీఫ్‌ను ఆహ్వానిం చడం సరైందేనని శాంతి కాముకులు బలంగా వాదించారు. అలాగే, ఒకపక్క సరిహద్దుల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుంటున్నా కార్యదర్శుల స్థాయి చర్చలకు సిద్ధపడ టాన్ని కూడా అందరూ ఆహ్వానించారు. నిజానికి కాల్పుల విరమణ ఉల్లంఘనలు జరిగిన సందర్భాల్లో పాకిస్థాన్‌తో చర్చలు నిలిపేయాలని గట్టిగా డిమాండు చేసింది బీజేపీయే. నిరుడు నవంబర్‌లో న్యూయార్క్ లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ షరీఫ్‌తో సమావేశమైనప్పుడు దాన్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఆ సమావేశానికి ముందు సరిహ ద్దుల్లో గస్తీలో ఉన్న మన జవాన్లు అయిదుగురిని పాక్ సైనికులు కాల్చి చంపారు. అనంతర కాలంలో కూడా పాకిస్థాన్ ఈ బాణీనే కొనసాగించింది. నవాజ్ షరీఫ్ న్యూఢిల్లీ వచ్చినప్పుడు కూడా ఆయనను కాశ్మీర్ వేర్పాటువాదులు కలవడానికి ప్రయత్నించారని, మోడీ అభ్యర్థనతో షరీఫ్ అందుకు నిరాకరించారని ఇప్పుడు ప్రభుత్వ వర్గాలు అంటు న్నాయి. ఈ సంగతినే పాక్ హైకమిషనర్‌కు చెప్పి, వేర్పాటువాదులను కలవొద్దని సూచించినా వినలేదన్నది కేంద్రం అభియోగం. అయితే, ఇరు దేశాలమధ్యా చర్చలు సాగే ప్రతి సందర్భంలోనూ, కాశ్మీర్లో జరిగే ఎన్నికల ముందు అక్కడి వేర్పాటువాదులతో పాక్ హైకమిషనర్ సమావేశం కావడం చాన్నాళ్లనుంచి రివాజుగా మారింది. గతంలో వాజ పేయి సర్కారు ఉన్నప్పుడు కూడా ఈ సంప్రదాయం ఉంది. అంతమా త్రాన ఆయనకు ఇలాంటి సమావేశాలపై సానుకూలత ఉందని భావిం చనవసరం లేదు. లోలోపల వ్యతిరేకత ఉన్నా వాజపేయి అయినా, తర్వాత వచ్చినా మన్మోహన్ అయినా అభ్యంతరం చెప్పలేదు. దీన్ని ఇకపై అంగీకరించరాదన్న దృఢ నిశ్చయం మోడీ సర్కారుకు ఉన్నదని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. అందుకు త్వరలో జరగబోయే జమ్మూ-కాశ్మీర్ ఎన్నికలు కారణమా లేక ఇటీవలికాలంలో సరిహద్దుల్లో తరచు చోటు చేసుకుంటున్న కాల్పుల విరమణ ఉల్లంఘనలు కార ణమా అనే ప్రశ్నలు అంత ముఖ్యం కాదు. సరిహద్దుల్లో కాల్పుల ఘట నలు జరుగుతున్న తరుణంలోనే కార్యదర్శుల సమావేశం తేదీలు ఖరా రయ్యాయి. జమ్మూ-కాశ్మీర్ ఎన్నికల ముందు వేర్పాటువాదులు ఇలా పాకిస్థాన్‌కు చెందిన ముఖ్యులతో సమావేశం కావడం...ఆ తర్వాత రాష్ట్రంలో నిరసన ప్రదర్శనలు ఊపందుకోవడం, ఉద్రిక్త వాతావర ణంలో ఎన్నికలు ముగియడం సంభవిస్తున్నది. ఈసారి కూడా అదే తంతు కొనసాగవచ్చునన్న అభిప్రాయం కేంద్రానికి ఉంటే ఉండొచ్చు. అయితే వేర్పాటువాదులకు కాశ్మీర్లో గతంలో ఉన్నంత ప్రజాదరణ లేదు. అందువల్ల వారివల్ల ఏదో అవుతుందనుకోనవసరం లేదు. ఇప్పుడు కార్యదర్శుల స్థాయి చర్చలను నిలిపేయడం ద్వారా చర్చలకు ఒక కొత్త ప్రాతిపదికను కేంద్రం ఏర్పరిచింది. భవిష్యత్తులో తమతో చర్చలు జరపాలంటే ఈ తరహా చర్యలను పాక్ విరమించు కోవాల్సి ఉంటుందని చెప్పడమే కేంద్రం ఉద్దేశం. చర్చలు సాగడానికి ఈ విషయంలో స్పష్టత ఇవ్వాల్సిన స్థితి పాక్‌కు ఏర్పడుతుంది. అక్కడి సైన్యానికీ, ప్రపంచ దేశాలకూ కూడా ఇది అర్ధమవుతుంది. ఇప్పటికైతే కాశ్మీర్ వేర్పాటువాదులను కలవడానికి తమకు ఎవరి అనుమతీ అవసరం లేదని పాక్ బింకంగా చెప్పవచ్చుగానీ భవిష్యత్తులో అది సాధ్యంకాదు. ఇరు దేశాలమధ్యా సామరస్యతకు కొత్తగా ఒక పెద్ద అడ్డంకి ఏర్పడటం ఇరు దేశాల్లోనూ శాంతిని కోరుకునే శక్తులకు నిరాశ కలిగించే పరిణామమే. అయితే, చర్చల దారి చర్చలదీ... తమ దారి తమదీ అన్నట్టుండే పాక్ తీరు కూడా మారాలి. తన విధానాలను అది పునస్సమీక్షించుకోవాలి. -
జాతి పతాకకు సెల్యూట్ చేయను..
సుర్ధేపల్లి (నేలకొండపల్లి): జాతి పతాకకు సెల్యూట్ చేయడానికి, జాతి పిత మహాత్మాగాంధీ చిత్రపటం వద్ద కొబ్బరికాయ కొట్టడానికి ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నిరాకరించాడు. దీనిని ప్రశ్నించిన గ్రామస్తులు, ప్రజాప్రతినిధులతో... ‘‘అది నా వ్యక్తిగతం’’ అంటూ వాదనకు దిగారు. అందరూ కలిసి గట్టిగా మందలించడంతో.. ‘‘నూను బడికే రాను పోండి’’ అంటూ, అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సుర్ధేపల్లిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు... నేలకొండపల్లి మండలంలోని సుర్ధేపల్లి గ్రామ ప్రాథమికోన్నత పాఠశాలలో శుక్రవారం స్వాతంత్య్ర వేడుకలకు విద్యార్థులతోపాటు గ్రామస్తులు, సర్పంచ్, స్కూల్ మేనేజ్ కమిటీ(ఎస్ఎంసీ) చైర్మన్ ఉదయం ఎనిమిది గంటలకే వచ్చారు. సమయం గడుస్తున్నా జెండా ఎగురవేసేందుకు ప్రధానోపాధ్యాయుడు షరీఫ్ ముందుకు రాలేదు. ‘‘ఆలస్యమవుతోంది. (గాంధీ చిత్రపటం వద్ద) కొబ్బరికాయ కొట్టి, జెండా ఎగరేయండి’’ అని సర్పంచ్, ఎస్ఎంసీ చైర్మన్ కోరారు. ‘‘కొబ్బరికాయ కొట్టడం నాకిష్టం లేదు. కొట్టను. జాతీయ జెండాకు కూడా సెల్యూట్ చేయను’’ అని ఆయన తెగేసి చెప్పాడు. గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. ‘‘అది నా వ్యక్తిగతం. దానిని మార్చుకోను. అవసరమైతే ఉద్యోగానికే రాజీనామా చేస్తాను కానీ.. జెండాకు మాత్రం సెల్యూట్ చేయను’’ అంటూ మొండికేశాడు. అంతేకాదు.. తెలంగాణ గీతాన్ని ఉద్దేశించి కూడా అనుచితంగా మాట్లాడాడు. అతని తీరుతో కోపోద్రిక్తులైన గ్రామస్తులు గట్టిగా మందలించడంతో.. ‘‘అసలు నేను బడికే రాను పోండి’’ అంటూ, మోటార్ సైకిల్‌పై అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం, అక్కడే గ్రామస్తులు ధర్నాకు దిగారు. ఈ సమాచారమందుకున్న వెంటనే తహశీల్దార్ జి.సుదర్శన్‌రావు, ఎంఈఓ యాలమూడి రవీందర్, ఆర్ఐలు వసంత, వెంకటేశ్వర్లు వచ్చి గ్రామస్తుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. జాతీయ జెండాను అవమానించిన సదరు ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు తీసుకుంటామని చెప్పి, అదే పాఠశాలలోని ఉపాధ్యాయురాలు ప్రమీలతో 10.20 గంటలకు పతాకావిష్కరణ చేయించారు. అనంతరం, పాఠశాలలో గ్రామస్తులతో అధికారులు సమావేశమయ్యారు. ప్రధానోపాధ్యాయుడు షరీఫ్ గతంలో కూడా ఇదే మాదిరిగా వ్యహరించారని గ్రామస్తులు, సర్పంచ్ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ ప్రధానోపాధ్యాయుడు గత మూడేళ్లుగా ఇక్కడ పనిచేస్తున్నాడని, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించకుండా తప్పించుకునేందుకుగాను గతంలోలోనూ స్వాతంత్య్ర దినోత్సవం రోజున సెలవు పెట్టినట్టు చెప్పారు. హెచ్ఎం తీరుపై కలెక్టర్‌కు నివేదిక పంపిస్తానని తహశీల్దార్ చెప్పటంతో గ్రామస్తులు శాంతించారు. -
ప్రాణదాతల కోసం ఎదురు చూపు
ఆటలు, పాటలు, చదువే ప్రపంచంగా జీవిస్తున్న అబ్దుల్‌గఫార్ (12) ఏడాదిగా రక్తహీనతతో బాధపడుతున్నాడు. ఆ బాలుడి వైద్యానికి రూ.30 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారు. మండలంలోని గరిమెనపెంట గ్రామానికి చెందిన తల్లిదండ్రులు కూలిపనులు చేస్తే తప్ప పూటగడవని దయనీయ స్థితి. సహృదయులు స్పందించి తమ బిడ్డకు పునర్జన్మ ప్రసాదించాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. కొండాపురం, న్యూస్‌లైన్: ఆడుతూపాడుతూ చదువుకోవాల్సిన వయస్సులో ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న బాలుడి దీనగాధ ఇది. మండలంలోని గరిమెనపెంట గ్రామానికి చెందిన ఎస్కే జిలానీబాష, షరీఫ్‌ఉన్నీసా దంపతులకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలున్నారు. కుమారుడు అబ్దుల్గఫార్కు 12 ఏళ్లు. ఏడాది కిందట వరకు ఆడుతూ, పాడుతూ చదువుకునేవాడు. ఆ తర్వాత ఆరోగ్యం బాగా లేకపోవడంతో నెల్లూరు నగరంలోని చిన్నపిల్లల వైద్యశాలకు తీసుకెళ్లారు. రక్తం చాలా తక్కువగా ఉందని, తెల్లరక్త కణాలు మూడు ప్యాకెట్లు, ఒక బాటిల్ రక్తం కావాలని వైద్యులు చెప్పారు. ఇంట్లోని వస్తువులను కుదువ పెట్టి వాటిని కొనుగోలు చేసినట్టు బాలుడి తల్లిదండ్రులు తెలిపారు. వాటిని ఎక్కించుకున్న తర్వాత చెన్నై వెళ్లి ఎముకల పరీక్షలు చేయించుకురావాలని వైద్యులు సూచించడంతో అబ్దుల్‌ను చెన్నైకి తీసుకెళ్లారు. రక్తం చాలా తక్కువగా ఉందని, మళ్లీ చెన్నైలో రెండు ప్యాకెట్లు ఎక్కించినట్టు తల్లిదండ్రులు చెప్పారు. రూ.30 లక్షలు అవసరం చెన్నైలో వైద్యులు ఎముకలను పరీక్షించాలంటే సుమారు రూ.లక్ష అవుతుందని చెప్పారు. దీంతో చేసేదేమీలేక వారు వెనుదిరిగారు. గ్రామస్తులు హైదరాబాద్‌లోని రెయిన్బో హాస్పిటల్లో మహానేత వైఎస్సార్ ప్రవేశ పెట్టిన ఆరోగ్యశ్రీ పథకం కింద వ్యాధి నయం చేస్తారని చెప్పడంతో అబ్దుల్‌ను అక్కడికి తీసుకెళ్లారు. బాలుడిని వైద్యులు పరీక్షించి వైద్యానికి రూ.30 లక్షలు ఖర్చు అవుతుందని, ఆరోగ్యశ్రీ వర్తించదని తేల్చి చెప్పారు. కూలిపనులు చేసుకుని కుటుంబాన్ని నెట్టుకొస్తున్న తమకు అంతసొమ్ము తెచ్చుకునే స్తోమత లేదని బాలు డి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దమనసున్న మహరాజుల చల్లని మాట కోసం వారు ఎదురు చూస్తున్నారు. సాయం చేయాలనుకుంటే.. దాతలు ఎవరైనా స్పందించి తమ కుమారునికి ప్రాణదాణం చేయాలని వారు కోరుతున్నారు. సాయం అందించాలనుకునే వారు ఎస్బీఐ ఖాతా నెంబర్ 32034202717 లో నగదు జమ చేయవచ్చని పేర్కొన్నారు. వివరాలకు 9676853871 లో సంప్రదించవచ్చు.