పాక్‌ ప్రధానికి షాక్‌: మార్కెట్లు క్రాష్‌ | Pakistan stocks crash on Sharif's disqualification as PM | Sakshi
Sakshi News home page

పాక్‌ ప్రధానికి షాక్‌: మార్కెట్లు క్రాష్‌

Published Fri, Jul 28 2017 4:33 PM | Last Updated on Thu, Sep 27 2018 8:42 PM

పాక్‌ ప్రధానికి షాక్‌: మార్కెట్లు క్రాష్‌ - Sakshi

పాక్‌ ప్రధానికి షాక్‌: మార్కెట్లు క్రాష్‌

కరాచీ: పనామా గేట్‌ వ్యవహారం పాకిస్తాన్‌​ ప్రధానమంత్రి నవాజ్‌ షరీఫ్‌కు పదవీగండం తెచ్చి పెడితే అక్కడి స్టాక్‌మార్కెట్లను అశని పాతంలా తాకింది. పాకిస్తాన్‌  స్టాక్‌ మార్కెట్లు  ఒక్క సారిగా కుప్పకూలిపోయాయి. ప్రధాని నవాజ్‌ షరీఫ్‌కు ఆ దేశ సుప్రీంకోర్టులో భారీ షాక్‌ తగలడంతో ఇన్వెస్టర్లలో ఆందోళన భారీ అమ్మకాలకు దారి తీసింది. 

కోర్టు తీర్పుపై అంచనాల నేపథ్యంలో ఆరంభంలో ఒక దశలో 12 వందల పాయింట్లు పడిపోయిన  సూచీ ఆ తర్వాత కొద్దిగా తేరుకుని 45వేల మార్క్‌ వద్ద స్థిరపడింది. అయితే కోర్టు తీర్పు వెలువడిన నిమిషాల్లోనే  అక్కడి మార్కెట్లు  క్రాష్‌ అయ్యాయి. కరాచీ స్టాక్‌ మార్కెట్‌   ఇండెక్స్‌ కెఎస్‌ఈ  700 పాయింట్లు పతనమైంది.  కాగా  ఈ తీర్పు నేపథ్యంలో ప్రధానమంత్రి పదవికి షరీఫ్‌ రాజీనామా చేశారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement