prime minister of india
-
PPC: మోదీతో సందడి చేయనున్న సెలబ్రిటీలు
న్యూఢిల్లీ: విద్యార్థుల్లో పరీక్షల పట్ల భయాన్ని పోగొట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహిస్తున్న ‘పరీక్షా పే చర్చ’.. ఈ ఏడాది కొత్త ఫార్మాట్లో జరగనుంది. మోదీతో పాటు ఈసారి పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొనే పరీక్షా పే చర్చ ఇప్పటికే ఏడు ఎడిషన్లు పూర్తి చేసుకుంది. పిబ్రవరి 10వ తేదీన న్యూఢిల్లీలోని భారత మండపంలో 8వ ఎడిషన్ జరగనుంది. అయితే ఈ చర్చకు ప్రత్యేకత తీసుకురావాలని అధికారులకు మోదీ సూచించారు. ఈ క్రమంలోనే ప్రముఖులను చర్చలో భాగం చేయనున్నారు. ఆధ్యాత్మికవేత్త సద్గురు, నటి దీపికా పదుకొనే, మేరీ కోమ్, విక్రాంత్ మెస్సీ, భూమి ఫడ్నేకర్, అవనీ లేఖరా, రుజుతా దివేకర్, సోనాలి సభార్వల్, ఫుడ్‌ఫార్మర్, టెక్నికల్ గురూజీ, రాధికా గుప్తా.. ఇందులో పాల్గొననున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమం కోసం దేశవ్యాప్తంగా 6 నుంచి 12 తరగతుల చదివే సుమారు 2,500 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. మరోవైపు.. ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే విద్యార్థులందరినీ పీపీసీ కిట్స్‌ను కేంద్ర విద్యా శాఖ అందించనుందని సమాచారం. అలాగే.. లెజెండరీ ఎగ్జామ్ వారియర్స్‌గా ఎంపిక చేసిన 10 మందికి ప్రధాని నివాసం సందర్శించే అవకాశం కల్పించనున్నారు. -
అచ్యుతాపురం ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన
న్యూఢిల్లీ, సాక్షి: ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఫార్మా కంపెనీలో భారీ పేలుడు ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విదేశీ పర్యటనలో ఉన్న ఆయన ఈ మేరకు తన ఎక్స్ ఖాతా ద్వారా స్పందించారు. ఘటన తనను ఎంతో బాధించిందన్న ఆయన.. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. అలాగే గాయపడిన వాళ్లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం, క్షతగాత్రులకు రూ.50 వేలు అందించనున్నట్లు ప్రకటించారు. Pained by the loss of lives due to a mishap at a factory in Anakapalle. Condolences to those who lost their near and dear ones. May the injured recover soon. An ex-gratia of Rs. 2 lakhs from PMNRF would be given to the next of kin of each deceased. The injured would be given Rs.…— PMO India (@PMOIndia) August 21, 2024అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్సెస్ ఫార్మా కంపెనీలో బుధవారం రియాక్టర్ పేలిన సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా 18 మంది మృతి చెందగా.. 35 మంది తీవ్ర గాయాలతో అనకాపల్లి, విశాఖ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. -
విదేశీ పర్యటనకు బయల్దేరిన ప్రధాని.. 45 ఏళ్లలో తొలిసారి
న్యూఢిల్లీ: పోలాండ్, ఉక్రెయిన్ దేశాల పర్యటనకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ బయల్దేరారు. నేడు ఆయన పోలాండ్ రాజధాని వార్సా వెళ్లేందుకు విమానం ఎక్కారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు చేశారు. పోలాండ్‌తో దౌత్య సంబంధాలకు 70 ఏళ్లు నిండాయని మోదీ తెలిపారు. సెంట్రల్ యూరోప్‌లో పోలాండ్ కీలకమైన ఆర్థిక భాగస్వామి అని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం, బహుళత్వానికి రెండు దేశాలు కట్టుబడి ఉన్నాయని, ఇది రెండు దేశాల బంధాన్ని బలోపేతం చేస్తున్నట్లు ప్రధాని వెల్లడించారు.కాగా గత 45 ఏళ్లలో భారత ప్రధాని పోలాండ్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. చివరిసారి 1979లో అప్పటి ప్రధాని మోరార్జీ దేశాయ్ పోలాండ్‌ను సందర్శించారు. అయితే ఆర్థిక, ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదల లక్ష్యంగా పోలాండ్‌లో మోదీ పర్యటన సాగనుంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జేలెన్ స్కీ ఆహ్వానం మేరకు ఆ దేశంలోనూ ప్రధాని పర్యటించనున్నారు. ఇక ఉక్రెయిన్‌లో భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి. ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి ముగింపు పలకాలని, శాంతి నెలకొనాలని ఆకాంక్షించిన విషయం తెలిసిందే.Leaving for Warsaw. This visit to Poland comes at a special time- when we are marking 70 years of diplomatic ties between our nations. India cherishes the deep rooted friendship with Poland. This is further cemented by a commitment to democracy and pluralism. I will hold talks…— Narendra Modi (@narendramodi) August 21, 2024 -
పంద్రాగస్టు స్పీచ్‌తో సరికొత్త రికార్డు
-
నెహ్రూ హవా
స్వాతంత్య్రం సిద్ధించి అప్పటికి దశాబ్దం గడిచింది. నెహ్రూ పాలనే సాగుతోంది. ముప్పిరిగొన్న సమస్యల నడుమే రెండో లోక్‌సభ ఎన్నికలు ముంచుకొచ్చాయి. ప్రజలకు ఓటు విలువ తెలియజెప్పి ఓటేసేలా చేయడం ఎన్నికల సంఘానికి కీలక సవాలుగా నిలిచింది. అయితే 1952 తొలి ఎన్నికల నిర్వహణ తాలూకు అనుభవం ఈసారి బాగా పనికొచి్చంది. పాకిస్తాన్ రాజ్యాంగ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ ఉండగానే మనం రెండో ఎన్నికలు కూడా విజయవంతంగా నిర్వహించుకున్నాం. దేశంలో ప్రజాస్వామ్యం గట్టిగా వేళ్లూనుకుందని ప్రపంచానికి చాటాం. దేశాన్ని ఎన్నో సమస్యలు వేధిస్తున్నప్పటికీ రెండో లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు మరోసారి నెహ్రూకే పట్టం కట్టారు. బలమైన ప్రతిపక్షం లేకపోవడమే దీనికి కారణం. 1952లో తొలి ఎన్నికల్లో 364 లోక్‌సభ సీట్లు గెలిచిన కాంగ్రెస్ బలం ఈసారి 371 స్థానాలకు పెరిగింది. ఓట్ల శాతం కూడా 45 శాతం నుంచి 47.8 శాతానికి పెరిగింది. సీపీఐ 27 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. 1952తో పోలిస్తే 11 స్థానాలు పెరిగినా ఓట్ల శాతం మాత్రం 32.65 నుంచి 24.55కు క్షీణించింది. కాంగ్రెస్ తర్వాత అధిక స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులే నెగ్గడం విశేషం! వారు 19.3 శాతం ఓటింగ్‌తో 42 స్థానాలు గెలుచుకున్నారు. రాష్ట్రాల స్థాయిలో జనతా, ఫార్వార్డ్ బ్లాక్, గణతంత్ర పరిషత్, అఖిల భారతీయ హిందూ మహాసభ, జార్ఖండ్ పార్టీ, పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్, ప్రజాపార్టీ, పీసెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ, అఖిల భారతీయ రామ్ రాజ్య పరిషత్, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, ఆల్ ఇండియా షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ పోటీ చేశాయి. సమస్యలు ఎన్నున్నా... నిరుద్యోగం, ఆహార కొరత, నిత్యావసరాల ధరల పెరుగుదల, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ విషయంలో ప్రజల్లో అసంతృప్తి, అవినీతి, ఆశ్రిత పక్షపాతం, ఆశించిన అభివృద్ధి లేకపోవడం, భూ సంస్కరణల నత్తనడక, రాష్ట్రాల్లో పాలనా సామర్థ్యం లోపించడం, ఉత్తరాధి ఆధిపత్యంపై దక్షిణ భారతీయుల్లో ఆగ్రహం... ఇలాంటి పలు సమస్యలను రెండో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా పార్టీలు బలంగా ప్రజల ముందుకు తీసుకెళ్లాయి. ఇన్ని సమస్యలున్నా కాంగ్రెస్‌ను ఢీకొట్టే బలమైన ప్రతిపక్షం లేకపోవడంతో పోటీ ఏకపక్షమేనని ముందే తేలిపోయింది. నెహ్రూ సర్కారుకు ఎన్ని స్థానాలొస్తాయన్నదే కాస్త ఆసక్తి కలిగించిన అంశం. అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వచి్చన సీట్లలో మూడింట రెండొంతులు ఉత్తరాది చలవే! ఒక్క యూపీయే కాంగ్రెస్‌కు ఏకంగా 70 సీట్లు కట్టబెట్టింది! ఒక స్థానం.. ఇద్దరు ప్రజాప్రతినిధులు బహుళ అభ్యర్థుల నియోజకర్గాలకు చివరి ఎన్నికలుగా 1957 లోక్‌సభ ఎన్నికలు చరిత్రలో గుర్తుండిపోతాయి. 1957లో 91 స్థానాలు ద్వంద్వ నియోజకవర్గాలున్నాయి. జనరల్ కోటా నుంచి ఒకరు, ఎస్సీ/ఎస్టీ కోటా నుంచి ఒకరు చొప్పున ఆ స్థానాల్లో ఇద్దరు విజేతలుండేవారు. ఆ తర్వాత ఈ విధానాన్ని తొలగించారు. 1952 తొలి ఎన్నికల్లోనైతే పశి్చమబెంగాల్లో ముగ్గురు అభ్యర్థులు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం కూడా ఉంది...! వాజ్‌పేయి అరంగేట్రం... దిగ్గజ నాయకుడు అటల్ బిహారీ వాజ్‌పేయి 1957 ఎన్నికల్లో నెగ్గి తొలిసారి లోక్‌సభలో అడుగుపెట్టారు. ఆయనను గొప్ప వక్తగా నెహ్రూ కొనియాడారు. అంతేకాదు, ‘ఏదో ఒక రోజు ప్రధాని అవుతాడు’ అంటూ కచి్చతంగా భవిష్యద్దర్శనం కూడా చేశారు! ఇక, సీఈసీగా వరుసగా రెండుసార్లు సార్వత్రిక ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన సుకుమార్ సేన్ 1958 డిసెంబర్ 19న కన్నుమూశారు. విశేషాలు ఎన్నెన్నో ... ► 1957లో రెండో లోక్‌సభ ఎన్నికలు మొత్తం 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో జరిగాయి. ► ఆంధ్రప్రదేశ్, అసోం, బిహార్, బాంబే, కేరళ, మధ్యప్రదేశ్, మద్రాస్, మైసూరు, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశి్చమబెంగాల్, జమ్మూ అండ్ కశీ్మర్‌తో పాటు కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, త్రిపుర, అండమాన్ నికోబార్, లక్షద్వీప్–మినీకాయ్– మినిందివిల్లో పోలింగ్ జరిగింది. ► మొత్తం 494 లోక్‌సభ స్థానాలకు గాను ఒక్కో చోట సగటు ముగ్గురు అభ్యర్థుల కంటే బరిలో లేరు. ► కాంగ్రెస్ మినహా మరో బలమైన జాతీయ పార్టీ లేనే లేదు. ప్రాంతీయ పార్టీలు అప్పుడప్పుడే మొగ్గ తొడుగుతున్నాయి. ► జాతీయ స్థాయిలో నాలుగే పార్టీలు ఎన్నికల్లో పాల్గొన్నాయి. రాష్ట్రాల్లో మరో 15 పార్టీలు అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. ► 1957 ఫిబ్రవరి 24 నుంచి జూన్ 9 దాకా మూడున్నర నెలల పాటు ఎన్నికల నిర్వహణ క్రతువు సాగింది. ► ఓటు ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈసీ ఎంతో కృషి చేసినా పెద్దగా ఫలితం కనిపించలేదు. ► 1952 తొలి ఎన్నికల్లో 44.87 శాతం ఓటింగ్ నమోదవగా 1957లో 45.44 శాతానికి పెరిగింది. 19,36,52,179 మంది ఓటేశారు. ► ఈ ఎన్నికలూ తొలి ఎన్నికల ప్రధాన కమిషనర్ సుకుమార్ సేన్ సారథ్యంలోనే జరిగాయి. ► ఎన్నికల నిర్వహణ వ్యయాన్ని బాగా తగ్గించడంతో పాటు వాటిని మరింత సమర్థంగా నిర్వహించారాయన. ► దాంతో సుడాన్ తమ తొలి ఎన్నికల నిర్వహణ బాధ్యతలను సేన్‌కే అప్పగించడం విశేషం...! ► పోలింగ్ బూత్‌లను ఆక్రమించే పెడ ధోరణి 1957 ఎన్నికల్లోనే తొలిసారిగా కనిపించింది! -
అత్యంత ప్రజాదరణ కలిగిన నేత మోదీ
వాషింగ్టన్: ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో ఘనత సాధించారు. అమెరికాకు చెందిన ‘మారి్నంగ్ కన్సల్ట్’ అనే ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఈ ఏడాది జనవరి 30 నుంచి ఫిబ్రవరి 5వ తేదీ దాకా ఈ సర్వే నిర్వహించారు. దేశాధినేతలకు వారి సొంత దేశాల్లో ప్రజాదరణ ఏ స్థాయిలో ఉందో గుర్తించారు. ‘మారి్నంగ్ కన్సల్ట్’ వెబ్సైట్ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. నరేంద్ర మోదీకి సొంత దేశం భారత్‌లో 78 శాతం జనాదరణ ఉన్నట్లు తేలింది. అంటే దేశ జనాభాలో 78 శాతం మంది మోదీని నాయకత్వాన్ని ఆమోదిస్తున్నట్లు తేలింది. మోస్ట్ పాపులర్ గ్లోబల్ లీడర్‌గా ఆయన తొలి స్థానం దక్కించుకున్నారు. మరో విశేషం ఏమిటంటే.. గత ఏడాది డిసెంబర్ నిర్వహించిన ఇదే సర్వేలో నరేంద్ర మోదీకి 76 శాతం ప్రజాదరణ లభించింది. అంటే నెల రోజుల్లో మరో 2 శాతం పెరిగినట్లు స్పష్టమవుతోంది. ఈ జాబితాలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో, బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ తదితరులు మోదీ కంటే వెనుకబడి ఉన్నారు. మెక్సికో అధ్యక్షుడు అండ్రూస్ మాన్యుల్ లోపెజ్ ఒబ్రాడర్ రెండవ స్థానంలో నిలిచారు. -
Annual Army Day Parade 2024: మన దేశ బలానికి వారే ఆధారం: వీడియో పోస్ట్ చేసిన ప్రధాని మోదీ
ఢిల్లీ: జనవరి 15వ తేదీన ఆర్మీ డే సందర్భంగా దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భావోద్వేగానికి లోనయ్యారు. సైనికులకు హ్యాట్సాఫ్ చెబుతూ ఓ వీడియో సందేశాన్ని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారాయన. సైనికుల త్యాగం, ధైర్యానికి దేశం గర్విస్తోంది. దేశ రక్షణ, సార్వభౌమత్వాన్ని కాపాడడంలో వారి అంకితభావం ఎనలేనిది. మన దేశ బలానికి వారే ఆధారం అంటూ వీడియో మెసేజ్ పోస్ట్ చేశారాయన. On Army Day, we honour the extraordinary courage, unwavering commitment and sacrifices of our Army personnel. Their relentless dedication in protecting our nation and upholding our sovereignty is a testament to their bravery. They are pillars of strength and resilience. pic.twitter.com/jD6FbM1Gkr — Narendra Modi (@narendramodi) January 15, 2024 -
PM Modi Lakshadweep: ప్రధాని మోదీ.. జస్ట్ వావ్
కవరత్తి: తన పర్యటనల్లో వైవిధ్యం.. కొత్తదనం రెండూ ఉండేలా చూసుకుంటారు ప్రధాని నరేంద్ర మోదీ. తాజాగా కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్ రెండు రోజుల పర్యటనలో ‘వావ్’ అనిపించేలా ఫోజులతో ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ప్రధాని మోదీ గురువారం అడ్వెంచర్‌కు దిగారు. స్నార్కలింగ్ చేసినట్లు ఫొటోల్ని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారాయన. కళ్లజోడు తరహా ఉండి ఒక గొట్టంలాంటి భాగం(దీనిని స్నార్కల్ అంటారు)తో గాలిపీలుస్తూ నీటిలో ఈదడాన్నే స్నార్కలింగ్ అంటారు. ఆ ఫొటోలు పంచుకుంటూ.. ఉల్లాసంగా గడిపినట్లు చెప్పారాయన. అలాగే సాహసయాత్రికుల జాబితాలో లక్షద్వీప్ ఉండాల్సిందేనని సూచించారాయన. అంతకు ముందు.. And those early morning walks along the pristine beaches were also moments of pure bliss. pic.twitter.com/soQEIHBRKj — Narendra Modi (@narendramodi) January 4, 2024 ప్రకృతి అందాలతో పాటు, లక్షద్వీప్ ప్రశాంతత కూడా మంత్రముగ్దులను చేస్తుంది. 140 కోట్ల మంది భారతీయుల సంక్షేమం కోసం మరింత కష్టపడి ఎలా పని చేయాలో ఆలోచించే అవకాశం నాకు లభించింది అంటూ సాగర తీరాన నడుస్తూ.. సేదతీరుతూ ఫొటోల్ని షేర్ చేశారు. -
ఏపీ ప్రజలది అసాధారణమైన ప్రతిభ: ప్రధాని మోదీ
సాక్షి, ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు బుధవారం ఉదయం సోషల్ మీడియాలో ట్వీట్ చేశారాయన. ఏపీ ప్రజలు చైతన్యవంతులంటూ ట్వీట్ చేశారాయన. అంతేకాదు అసాధారణమైన ప్రతిభ, అచంచలమైన సంకల్పం, దృఢమైన పట్టుదల ఇక్కడి ప్రజల సొంతమంటూ ప్రధాని తన సందేశంలో కొనియాడారు. ఏపీ ప్రజల శ్రేయస్సు కోసం, విజయం కోసం నిరంతరం తాను ప్రార్థిస్తానంటూ ప్రధాని మోదీ ట్వీట్లో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభసందర్భంగా, ఈ చైతన్యవంతమైన రాష్ట్ర ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. వారి అసాధారణమైన ప్రతిభ, అచంచలమైన సంకల్పం మరియు దృఢమైన పట్టుదలతో, ఆంధ్రప్రదేశ్ ప్రజలు విభిన్న రంగాలలో తమదైన ముద్ర వేశారు. వారి నిరంతర శ్రేయస్సు మరియు విజయం కోసం నేను… — Narendra Modi (@narendramodi) November 1, 2023 ఇదీ చదవండి: రాష్ట్ర అవతరణ దినోత్సవం.. వైఎస్సార్ అవార్డుల ప్రదానం నేడు -
భారత తొలి ప్రధాని నెహ్రు కాదు.. బీజేపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్
బెంగళూరు: ప్రజల్లో తిరుగే ప్రజాప్రతినిధులు ఏది మాట్లాడినా కొన్ని నిమిషాల్లో జనాల్లోకి వెళ్లిపోతుంది. అలాంటి వ్యక్తులు దేశంలోని కీలక వ్యక్తులు గురించి మాట్లాడేటప్పడు ఎంతో జాగ్రత్త వహించాలి. అయితే, తాజాగా కర్ణాటకలో బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రు కాదని ఆయన చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. వివరాల ప్రకారం.. కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జవహర్లాల్ నెహ్రూ భారత్‌కు తొలి ప్రధాని కాదని ఆయన అన్నారు. దేశ తొలి ప్రధాని నెహ్రూ కాదు, మన తొలి ప్రధాని సుభాష్ చంద్రబోస్ అని పాటిల్ ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ పేర్కొన్నారు. బ్రిటిషర్లలో సుభాష్ చంద్రబోస్ భయం రేకెత్తించడంతోనే వారు భారత్‌ను విడిచిపెట్టి వెళ్లారని అన్నారు. అలాగే, మనం నిరాహార దీక్షలతో స్వాతంత్ర్యం పొందలేదని, ఒక చెంపపై కొడితే మరో చెంపను చూపడం ద్వారా స్వాతంత్య్రం సిద్ధించలేదన్నారు. బ్రిటిష్ వారిలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ భయం కలిగించడం వల్లే మనకు స్వాతంత్ర్యం లభించిందని బాబాసాహెబ్ ఓ పుస్తకంలో రాశారని ఆయన పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా దేశంలో కొన్ని ప్రాంతాల్లో స్వతంత్ర ప్రకటన చేసిన సమయంలో స్వతంత్ర భారత్‌కు తొలి ప్రధాని సుభాష్ చంద్రబోస్ అని చెప్పుకొచ్చారు. ఇదే సయమంలో మాజీ కేంద్ర రైల్వే, టెక్స్టైల్స్ మంత్రి పాటిల్ మాట్లాడుతూ.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటిషర్లు దేశం విడిచివెళ్లారని ఆయన కామెంట్స్ చేశారు. ఇక, వీరి వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. 'Not Nehru, but Subhas Chandra Bose is the first PM of the country': Karnataka BJP MLA Basangouda Patil Yatnal pic.twitter.com/N8Ck6uZTcW — The Jaipur Dialogues (@JaipurDialogues) September 28, 2023 ఇదిలా ఉండగా.. బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ వివాదాస్పద వ్యాఖ్యలు ఇదే తొలిసారి కాదు. అంతకుముందు కూడా ఆయన.. కర్నాటకలో పాలక కాంగ్రెస్ ప్రభుత్వం ఆరేడు నెలల్లో కూలిపోతుందని ఆయన ఇటీవల జోస్యం చెప్పారు. అంతర్గత కలహాలతో కాంగ్రెస్ ప్రభుత్వం పతనమవుతుందని అన్నారు. రాష్ట్రంలో అవినీతిని బీజేపీ లేవనెత్తుతుందని కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: తమిళనాడులో రసవత్తర రాజకీయం.. -
సమావేశాల్లో ఆ 9 అంశాలపై చర్చించండి
సాక్షి, ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అజెండాను ప్రకటించకుండానే ఈనెల 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తోందని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈసారి సమావేశాల్లో మణిపూర్‌లో హింస, దేశవ్యాప్తంగా పెరిగిన ధరలు తదితర కీలకాంశాలపై చర్చించాలని డిమాండ్‌చేస్తూ ప్రధాని మోదీకి సోనియా లేఖ రాశారు. ముఖ్యంగా తొమ్మిది అంశాలపై చర్చ జరగాల్సిందేనని ఆమె పట్టుబట్టారు. ‘ మణిపూర్‌లో హింస, పెరిగిన ధరవరలు, రాష్ట్రాలు– కేంద్రం మధ్య క్షీణిస్తున్న సత్సంబంధాలు, చైనాతో సరిహద్దు వెంట కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, అదానీ గ్రూప్‌లో అవినీతి లావాదేవీల బహిర్గతం కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు వంటి అంశాలను చర్చించాలి’ అని లేఖలో పేర్కొన్నారు. ‘ ఇతర రాజకీయ పారీ్టలతో ఎలాంటి సంప్రతింపులు జరపకుండానే ఎలాంటి ఎజెండా ప్రకటించకుండానే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ప్రభుత్వం నిర్వహించబోతోంది. ఈ సమావేశాల్లో ప్రభుత్వ ఎజెండా ఏమిటో ఎవ్వరికీ తెలియదు. సమావేశాలు జరిగే ఈ మొత్తం ఐదు రోజులూ ప్రభుత్వ ఎజెండాపైనే చర్చ జరగనుందని మాకు సమాచారం వచ్చింది’ అని సోనియా వ్యాఖ్యానించారు. ఇదో చక్కని అవకాశం ‘ఇదో చక్కని అవకాశం. ప్రజాసమస్యలు, ప్రాముఖ్యత దృష్ట్యా ఈసారి సమావేశాల్లో మేం తప్పకుండా పాల్గొంటాం. ఈ అంశాలపై చర్చకు సమయం కేటాయిస్తారనే భావిస్తున్నాను’ అని సోనియా అన్నారు. ‘ఉభయ సభల్లో ఏ అంశాలపై చర్చిస్తారో అనే విషయాన్ని ముందుగా తెలపకుండానే సెషన్‌ను ప్రారంభిస్తుండటం బహూశా ఇదే తొలిసారి అనుకుంటా’ అని కాంగ్రెస్ మరో నేత జైరామ్ రమేశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇతర రాజకీయ పారీ్టలు చేస్తున్న డిమాండ్లకు తగ్గట్లు దేశవ్యాప్తంగా కుల గణన చేయాలని సోనియా కోరారు. ప్రకృతి విపత్తుల కారణంగా కొన్ని రాష్ట్రాల్లో భారీ వరదలు సృష్టించిన విలయం, మరి కొన్ని రాష్ట్రాల్లో కరువు కాటకాలు వంటి ఘటనలను చర్చించాలని సోనియా డిమాండ్‌చేశారు. ‘పెరుగుతున్న నిరుద్యోగిత, సమాజంలో అసమానతలు, సూక్ష్మ,చిన్న, మధ్యతరహా పరిశ్రమలు సమస్యల వలయంలో చిక్కుకోవడం వంటి అంశాలనూ చర్చించాలి. రైతుల డిమాండ్ మేరకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం, రైతాంగం సమస్యలు చర్చకు రావాలి’ అని సోనియా అన్నారు. ‘ఈసారి సమావేశాలను మేం బాయ్‌కాట్ చేయబోం. సభలోనే ఉండి సమస్యలపై పోరాడతాం’ అని ఢిల్లీలో మీడియా సమావేశంలో జైరాం రమేశ్ చెప్పారు. ఆ తొమ్మిది అంశాలు 1. ప్రస్తుత దేశ ఆర్ధిక పరిస్థితితో పాటు నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, పెరుగుతున్న నిరుద్యోగం, అసమానతల పెరుగుదల, ఎస్ఎంఈలపై దుస్థితి 2. రైతులు, రైతు సంస్థలు లేవనెత్తిన కనీస మద్దతు ధర అంశంతో పాటు వారు లేవనెత్తిన ఇతర డిమాండ్ల పరిస్కారం కోసం మోదీ సర్కార్ చూపే నిబద్ధత 3.అదానీ వ్యాపార సమూహం లావాదేవీలను దర్యాప్తు చేయడానికి జేపీసీ ఏర్పాటు 4.మణిపూర్ ప్రజలు ఎదుర్కొంటున్న నిరంతర వేదన, రాజ్యాంగ వ్యవస్థల విచి్ఛన్నం, అక్కడ నెలకొల్పాల్సిన సామాజిక సామరస్యం 5.హరియాణా వంటి వివిధ రాష్ట్రాల్లో మతపరమైన ఉద్రిక్తతలు పెరగడం 6.భారత భూభాగాన్ని చైనా ఆక్రమించడం, లద్దాఖ్, అరుణాచల్ ప్రదేశ్‌లోని మన సరిహద్దుల్లో దేశ సార్వ¿ౌమాధికారానికి ఎదురైన సవాళ్లు 7.దేశవ్యాప్తంగా కుల గణన 8.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య దిగజారుతున్న సంబంధాలు 9.ప్రకృతి వైపరీత్యాల ప్రభావంతో కొన్ని రాష్ట్రాల్లో విపరీతమైన వరదలు, మరికొన్ని రాష్ట్రాల్లో కరువు కారణంగా పెరిగిన కష్టాలు Here is the letter from CPP Chairperson Smt. Sonia Gandhi ji to PM Modi, addressing the issues that the party wishes to discuss in the upcoming special parliamentary session. pic.twitter.com/gFZnO9eISb — Congress (@INCIndia) September 6, 2023 #WATCH | #WATCH | Congress MP Jairam Ramesh says, "Sonia Gandhi in a letter (to PM Modi) mentioned that the session has been called without any discussion with the opposition...Nobody had any information about it...This is for the first time that we do not have any details for… pic.twitter.com/IzEXXJFMEj — ANI (@ANI) September 6, 2023 -
ఎస్పీజీ డైరెక్టర్ ఏకే సిన్హా కన్నుమూత
సాక్షి, ఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భద్రతను పర్యవేక్షించే ప్రత్యేక భద్రతా బృందం ఎస్పీజీ(special protection group) డైరెక్టర్ అరుణ్ కుమార్ సిన్హా కన్నుమూశారు. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన.. గురుగ్రామ్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. 2016 నుంచి SPG డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు ఆయన. అంతకు ముందు ఆ పొజిషన్ 15 నెలలు ఖాళీగా ఉండడం విశేషం. ఈ ఏడాది మే 30వ తేదీన ఆయన పదవీ కాలం ముగియగా.. అంతకు ముందు రోజే ఆయన పదవీ కాలం పొడిగిస్తూ ఉత్తర్వులపై ప్రధాని మోదీ సంతకం చేశారు. ఎస్పీజీ డైరెక్టర్ బాధ్యతల కంటే ముందు ఆయన.. కేరళ డీజీపీ(ప్రత్యేక సేవలు, ట్రాఫిక్) నిర్వర్తించారు. కేరళ క్యాడర్‌కు చెందిన అరుణ్ కుమార్ సిన్హా.. 1987 ఐపీఎస్ బ్యాచ్. ఆ రాష్ట్ర పోలీస్‌విభాగంలో పలు బాధ్యతలు కూడా నిర్వహించారాయన. ప్రత్యేక భద్రతా బృందం ఎస్పీజీ.. 1984లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ హత్య ఘటన తర్వాత ఏర్పాటైంది. 1985 నుంచి ఇది ప్రధానులకు, మాజీ ప్రధానులకు, వాళ్ల వాళ్లకు కుటుంబ సభ్యలకు భద్రత కల్పిస్తూ వస్తోంది. ప్రస్తుతం ప్రధాని, ఆయన కుటుంబ సభ్యుల రక్షణ బాధ్యతలను మాత్రమే చూసుకుంటోంది. -
నేపాల్ ప్రధానితో మోదీ చర్చలు
న్యూఢిల్లీ: ఇరు దేశాల మధ్య పరస్పర సహకారంపై నేపాల్ ప్రధాన మంత్రి పుష్ప కమల్ దహాల్ (ప్రచండ)తో భారత ప్రధాని మోదీ శనివారం చర్చలు జరిపారు. రెండు దేశాల మధ్య మైత్రి బంధాన్ని మరింత బలోపేతం చేయడంపై దృష్టిసారించామని ఆ తర్వాత ప్రధాని మోదీ చెప్పారు. ఈ మేరకు శనివారం ఇద్దరు నేతలు కొంతసేపు ఫోన్లో సంభాíÙంచుకున్నారు. ‘మే 31 నుంచి జూన్ మూడో తేదీ వరకు భారత్‌లో పర్యటించిన నేపాల్ ప్రధాని ప్రచండతో మోదీ పలు ద్వేపాక్షిక అంశాలపై చర్చించారు’ అని ఆ తర్వాత ఢిల్లీలోని ప్రధాని కార్యాలయం శనివారం ఒక ప్రకటన విడుదలచేసింది. పొరుగు దేశం నేపాల్‌ను భారత్ చిరకాలంగా మిత్రదేశంగా పరిగణిస్తోంది. -
నరేంద్ర మోదీ బిగ్ ఫ్రెండ్
మాస్కో: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ రష్యాకు గొప్ప మిత్రుడు(బిగ్ ఫ్రెండ్) అని పేర్కొన్నారు. మోదీ కొన్నేళ్ల క్రితం ప్రారంభించిన ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఎంతగానో ప్రభావితం చేస్తోందని కొనియాడారు. గురువారం మాస్కోలో ఏజెన్సీ ఫర్ స్ట్రాటెజిక్ ఇనీíÙయేటివ్స్(ఏఎస్ఐ) కార్యక్రమంలో పుతిన్ మాట్లాడారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. మనం కాకపోయినా, మన స్నేహితుడు చేసిన పని సత్ఫలితాలు ఇస్తుంటే అనుకరించడంలో తప్పేమీ లేదన్నారు. స్థానికంగా తయారీ సామర్థ్యాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా భారత నాయకత్వం ప్రభావవంతమైన విధానాలను సృష్టిస్తోందని, విదేశీ పెట్టుబడిదారులను అమితంగా ఆకర్శిస్తోందని చెప్పారు. పుతిన్, నరేంద్ర మోదీ చివరిసారిగా 2022 సెపె్టంబర్లో ఉజ్బెకిస్తాన్‌లో ఓ సదస్సు సందర్భంగా కలుసుకున్నారు. ద్వైపాక్షిక, వ్యూహాత్మక బంధాలు బలోపేతం చేసుకుందాం తమ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక, వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ నిర్ణయించుకున్నారు. ఇరువురు నేతలు శుక్రవారం ఫోన్లో మాట్లాడుకున్నారు. ఉక్రెయిన్‌లో సంఘర్షణతోపాటు అంతర్జాతీయ పరిణామాలపై చర్చించుకున్నారు. కీలక రంగాల్లో భారత్, రష్యా మధ్య ద్వైపాక్షిక సహకారంలో పురోగతిని ఇరువురూ సమీక్షించారు. ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా పరస్పర ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. రెండు దేశాల నడుమ వ్యాపార, వాణిజ్యాల విలువ నానాటికీ పెరుగుతుండడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌లో ఘర్షణ ఆగిపోవాలన్నదే తమ ఉద్దేశమని, దౌత్య మార్గాల్లో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని, ఉక్రెయిన్ నాయకత్వం అందుకు అంగీకరించడం లేదని మోదీకి పుతిన్ తెలియజేశారు. వివాదాలకు తెరదించడానికి దౌత్య ప్రయత్నాలు, చర్చలే మార్గమని మోదీ పునరుద్ఘాటించారు. మోదీ, పుతిన్ మధ్య అర్థవంతమైన, నిర్మాణాత్మక సంభాషణ జరిగిందని అధికార వర్గాలు వెల్లడించాయి. -
PV జయంతి నేడు: క్లిష్టకాలంలో దేశాన్ని గట్టెక్కించిన తెలుగు బిడ్డ
భారత దేశ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం కలిగిన మేధావీ, పరిపాలనాదక్షుడూ పాము లపర్తి వెంకట నరసింహారావు. ఎవరి జీవితం, ఎట్లా మలుపు తిరుగుతుందో ఎవరికీ తెలియదు. తమిళ నాడు శ్రీపెరుంబుదూర్‌లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న రాజీవ్ గాంధీని 1991 మే 21న ఎల్టీ టీఈ ఆత్మాహుతి దాడితో హత్య చేసింది. అత్యధిక మెజారిటీతో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్ట బెట్టారు. భారత పదవ ప్రధానమంత్రిగా బాధ్యత చేపట్టారు పీవీ. ఆ సమయంలో భారతదేశం అంతర్జాతీయ చెల్లింపులపై డిఫాల్ట్ అయ్యి రెండు వారాలు కావ స్తోంది. విదేశీ మారక నిల్వలు కేవలం రెండు వారాల దిగుమతులకు మాత్రమే సరిపో యేంతగా ఉన్నాయి. అంతకు నెలరోజుల క్రితం మొత్తం 55 టన్నుల బంగారాన్ని రిజర్వ్ బ్యాంక్ తనఖా పెట్టింది. పెద్ద మొత్తంలో చెల్లింపులు తగ్గు ముఖం పట్టాయి. భారతదేశా నికి రుణం ఇవ్వడానికి ఎవరూ సిద్ధంగా లేరు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్‌ను ఆర్థిక మంత్రిగా నియమించారు పీవీ. దేశ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడడానికి ఎటువంటి నిర్ణయం తీసుకోవడానికైనా ఆయనకు స్వేచ్ఛ నిచ్చారు. అప్పటివరకూ ఉన్న కఠిన నిబంధనలను సడళించి సరళీకరణకు ద్వారాలు తెరచింది పీవీ ప్రభుత్వం. దాని ఫలితాలనే ఇప్పుడు మనమంతా అనుభ విస్తున్నాం. అంతర్జాతీయ సమాజంలో భారత్ పట్ల సన్నగిల్లిన విశ్వాసాన్ని తిరిగి పాదుకొల్పారు పీవీ. ఫలితంగా అంతర్జాతీయ ద్రవ్య సంస్థల సహాయం మళ్లీ ప్రారంభమయ్యింది. అలా దేశాన్ని తిరిగి అభివృద్ధి పథంలోకి తీసుకువచ్చారు. ప్రస్తుత తెలంగాణలోని హనుమకొండ జిల్లా లోని ‘వంగర’ గ్రామంలో 1921లో పీవీ జన్మించారు. అంచెలంచెలుగా రాష్ట్ర, కేంద్ర రాజకీయాల్లో ఎదిగారు. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే బాబ్రీ మసీద్ కూల్చివేత జరిగింది. ఆ సమయంలో ఆయన తీవ్ర మైన విమర్శలను ఎదుర్కొన్నారు. దక్షిణ భారత్‌కు చెందిన పీవీకి వ్యతిరేకంగా ఆయన సొంత పార్టీ ప్రముఖులే పనిచేసి ఆయనను పదవి నుంచి లాగి వేయడానికి ప్రయత్నించారు. కానీ ఇటు ప్రతి పక్షాలు, అటు అసంతృప్తులైన సొంత పార్టీ వారి ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఆయన విజయవంతంగా తన ఐదేళ్ల పదవీకాలాన్ని దిగ్విజయంగా ముగించారు. ఆయన మరణించి 18 ఏళ్లు గడిచాయి. పీవీ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ తన సందేశాన్ని ట్వీట్ ద్వారా పంచుకున్నారు. Remembering Shri PV Narasimha Rao Ji on his birth anniversary. His far-sighted leadership and commitment to India’s development was noteworthy. We honor his invaluable contributions to our nation's progress. — Narendra Modi (@narendramodi) June 28, 2023 కాంగ్రెస్ పార్టీ పీవీ చేసిన సేవలను స్మరించుకుంది. On his birth anniversary, we remember the former PM of India, P.V. Narasimha Rao, who introduced some noteworthy liberal reforms to the Indian economy. Today, we pay a humble tribute to Mr. Rao, a distinguished statesman who reinvented India, both at home & abroad. pic.twitter.com/Cb0YPKbGjw — Congress (@INCIndia) June 28, 2023 ఈ తరుణంలో దేశానికి పీవీ చేసిన సేవను అన్ని వర్గాలూ మరచిపోవడం బాధాకరం. ఆయన శత జయంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శత జయంతి ఉత్సవాలను ఏడాది పాటు ఘనంగా నిర్వహించి ఆయన కీర్తి ప్రతిష్ఠలను ఇను మడింప చేశారు.ఇంతటి మహా మేధా వినీ, పరిపాలనా దక్షుణ్ణీ నేను నా జీవితంలో ఆరుసార్లు అతి దగ్గర నుండి చూశాను. ఆయనతో కొంత సమయం గడిపాను. నా జీవితంలో మరపు రాని సందర్భాలివి. 1977లో పెద్ద పల్లి జిల్లా మా కొలనూరు పక్క ఊరైన ‘పెగడ పల్లి’లో మా చుట్టాల ఇంటిలో పెళ్లి సందర్భంగా ఆయనతో కలిసి బంతి భోజనం చేశాను. మరొకసారి ఒక దినపత్రిక విలేక రిగా పెద్దపల్లి విశ్రాంత భవనంలో ఆయన పక్క కూర్చుని ముచ్చటించడం అరుదైన ఘటన. – దండంరాజు రాంచందర్ రావు, రిటైర్డ్ డిప్యూటీ సూపరింటెండెంట్, సింగరేణి భవన్, హైదరాబాద్ (నేడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి) -
చివరి నిమిషంలో ప్రధాని పదవి దూరం.. ఏం జరిగింది?
అదృష్టం తలుపు తట్టినా కలిసి రాని రాజయోగం. చివరి నిమిషంలో దురదృష్టం వెక్కిరించడంతో భోగం దూరమైంది. ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా అదృష్ట రేఖ మలుపు తిరిగింది. కొందరికి ఇంటి పోరుతో పదవి దూరమైతే మరికొందరికి వేరే కారణాలెన్నో.. ఇక, ఈ లిస్టులో దిగ్గజ నేతల పేర్లే ఉన్నాయి. వారిలో ముఖ్యులు ములాయం సింగ్ యాదవ్, సోనియా గాంధీ, జ్యోతి బసు, ఎల్కే అద్వానీ ఉన్నారు.. వీరికి ప్రధాని పదవి ఎలా దూరమైందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే.. -
ఇది నిరంకుశత్వం.. ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ
‘‘మన దేశం ఇంకా ప్రజాస్వామికమేనని మీరూ అంగీకరిస్తారని భావిస్తున్నాం. కానీ ప్రతిపక్షాల నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలను తీవ్రస్థాయిలో ఉసిగొల్పి దురి్వనియోగపర్చడాన్ని చూస్తుంటే.. మనం ప్రజాస్వామ్యం నుంచి నిరంకుశత్వం వైపు పరిణామం చెందినట్టు అనిపిస్తోంది..’’అని ప్రధాని నరేంద్ర మోదీపై దేశంలోని ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. విపక్షాల ముఖ్య నేతలను లక్ష్యంగా చేసుకుంటున్న తీరును పరిశీలిస్తే.. విపక్షమనేదే లేకుండా అంతం చేయడానికి దర్యాప్తు సంస్థలను వాడుకుంటున్నారన్న ఆరోపణలకు బలం చేకూరుతోందని పేర్కొన్నాయి. ఎన్నికల క్షేత్రం వెలుపల ప్రతీకారం తీర్చుకోవడానికి రాజ్యాంగబద్ధ గవర్నర్ కార్యాలయాలు, కేంద్ర దర్యాప్తు సంస్థలను దురి్వనియోగం చేయడం సరికాదని మండిపడ్డాయి. ఈ మేరకు కాంగ్రెసేతర విపక్షాలైన బీఆర్ఎస్ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా, టీఎంసీ అభినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్, శివసేన యుబీటీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే, ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఎస్పీ అధినేత అఖిలేశ్‌యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలోని ముఖ్యాంశాలు వారి మాటల్లోనే.. ఎన్నికల సమయాల్లోనే దాడులు అధికం ‘‘2014 నుంచి ప్రతిపక్షాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలను దురి్వనియోగం చేస్తుండటంతో వాటి ప్రతిష్ట మసకబారింది. వాటి స్వయం ప్రతిపత్తి, నిష్పాక్షికతపై ప్రశ్నలను లేవనెత్తింది. వీటిపై దేశ ప్రజలు నానాటికి విశ్వాసాన్ని కోల్పోతున్నారు. చాలా సందర్భాల్లో ఎన్నికల సమయంలో నమోదవుతున్న కేసులు, జరుగుతున్న అరెస్టులను పరిశీలిస్తే.. అవి ఫక్తుగా రాజకీయ ప్రేరేపితమైనవని స్పష్టంగా అర్థమవుతోంది. మీ పార్టీ (బీజేపీ)తో విరుద్ధ భావజాలాన్ని కలిగిన పార్టీకి అనుకూలంగా ప్రజలు తీర్పునిచ్చినా గౌరవించి తీరాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలదే అంతిమ నిర్ణయం. ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ తమ ప్రాధాన్యతను కోల్పోయాయి. దేశంలో ప్రజాస్వామ్యానికి ముప్పు దర్యాప్తు, విచారణల పేరుతో సుదీర్ఘకాలం ఉద్దేశపూర్వకంగా వేటాడి, వెంటాడి ఎలాంటి ఆధారాలు లేకున్నా కూడా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది. ఆయనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా నిరాధారం. రాజకీయ కుట్రతో కూడినవి. ఆయన అక్రమ అరెస్టు దేశవ్యాప్తంగా ప్రజలను ఆగ్రహానికి గురి చేసింది. పాఠశాల విద్యలో గొప్ప సంస్కరణలను తీసుకొచ్చి ప్రపంచవ్యాప్త గుర్తింపును మనీశ్ సిసోడియా పొందారు. రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టాలన్న లక్ష్యంతో చేపట్టిన దురుద్దేశపూర్వక దర్యాప్తుకు ఈ అరెస్టు తార్కాణంగా నిలిచింది. నిరంకుశ బీజేపీ పాలనలో దేశంలో ప్రజాస్వామిక విలువలకు ముప్పు వాటిల్లిందన్న ప్రపంచం అనుమానాలను నిజం చేసింది. బీజేపీలో చేరితే కేసుల నుంచి ఉపశమనం మీ పరిపాలనలో 2014 నుంచి దర్యాప్తు సంస్థల కేసులు, అరెస్టులు, దాడులు, విచారణలను ఎదుర్కొన్న ప్రముఖ రాజకీయ నాయకుల్లో అత్యధికులు ప్రతిపక్ష నేతలే. బీజేపీలో చేరిన ప్రతిపక్ష నాయకుల కేసులపై విచారణలను దర్యాప్తు సంస్థలు నెమ్మదిగా చేస్తున్నాయి. 2014, 2015 సంవత్సరాల్లో శారదా చిట్‌ఫండ్ కుంభకోణంలో కాంగ్రెస్ మాజీ నేత, ప్రస్తుత అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మపై సీబీఐ, ఈడీ విచారణ జరిపాయి. ఆయన బీజేపీలో చేరాక కేసు దర్యాప్తు నీరుగారిపోయింది. నారద స్టింగ్ ఆపరేషన్ కేసులో టీఎంసీ మాజీ నేతలు సువేందు అధికారి, ముకుల్ రాయ్‌లను సీబీఐ, ఈడీ వెంటాడి వేధించాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వారు బీజేపీలో చేరడంతో దర్యాప్తు అటకెక్కింది. ఇవేకాదు మహారాష్ట్రకు చెందిన నారాయణ్ రాణే కేసు సహా మరెన్నో ఉదాహరణలు ఉన్నాయి. విపక్ష నేతలపై వేధింపులు 2014 నుంచి ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకోవడం, కేసులు పెట్టడం, అరెస్టు చేయడం వంటివి గణనీయంగా పెరిగాయి. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, శివసేన నేత సంజయ్ రౌత్, ఎస్పీ నేత ఆజంఖాన్, ఎన్సీపీ నేతలు నవాబ్ మాలిక్, అనిల్ దేశ్‌ముఖ్, టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ వంటి ప్రముఖ ప్రతిపక్ష నేతలు కేంద్ర దర్యాప్తు సంస్థల చేతిలో వేధింపులను ఎదుర్కొన్నారు. కేంద్రంలోని పాలక పారీ్టకి అనుబంధ విభాగాలుగా కేంద్ర దర్యాప్తు సంస్థలు పనిచేస్తున్నాయనే అనుమానాలకు ఈ కేసులు బలం చేకూరుస్తున్నాయి. ఆ సంస్థపై దర్యాప్తు చేయరా? రూ.78,000 కోట్లకుపైగా ఒక నిర్దిష్ట సంస్థ (అదానీ గ్రూపు)లో పెట్టుబడిగా పెట్టడంతోనే ఎస్బీఐ, ఎల్ఐసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ భారీగా నష్టపోయినట్టు ఓ అంతర్జాతీయ ఫోరెన్సిక్ ఆర్థిక పరిశోధన సంస్థ నివేదిక ప్రచురించింది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన ఈ సంస్థల అవకతవకలపై కేంద్ర ఏజెన్సీలు ఎందుకు దర్యాప్తు చేయడం లేదు? గవర్నర్లను ఉసిగొల్పి.. సమాఖ్య వ్యవస్థపై యుద్ధానికి కేంద్రం ఇంకో వ్యవస్థను ఉసిగొల్పుతోంది. దేశవ్యాప్తంగా గవర్నర్ కార్యాలయాలు రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తూ, రాష్ట్రాల పాలనకు అడ్డంకులు సృష్టిస్తున్నాయి. గవర్నర్లు ఇష్టానుసారం వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను ఉద్దేశపూర్వకంగా అణగదొక్కుతున్నారు. బీజేపీయేతర పార్టీల పాలనలో ఉన్న తమిళనాడు, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, పంజాబ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్లు, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అంతా కేంద్రం, రాష్ట్రాల మధ్య విభేదాలను పెంచుతూ సహకార సమాఖ్య స్ఫూర్తికి ప్రమాదకారులుగా తయారయ్యారు. సమాఖ్య స్ఫూర్తిని ప్రదర్శించడంలో కేంద్రం పూర్తిగా విఫలంకాగా.. రాష్ట్రాలు రాజ్యాంగ విలువలతో సమాఖ్య స్ఫూర్తిని పాటిస్తున్నాయి. గవర్నర్ల వైఖరి పర్యవసానంగా దేశ ప్రజలు ప్రజాస్వామ్యంలో గవర్నర్ల పాత్ర ఏమిటని ప్రశ్నించడం ప్రారంభించారు.’’ అని లేఖలో విపక్షాల నేతలు పేర్కొన్నారు. -
ఈసీ నియామక వ్యవస్థపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
-
సీఈసీ నియామక వ్యవస్థపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
ఢిల్లీ: కేంద్ర ఎన్నికల కమిషన్ నియామక వ్యవస్థపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత నియామక విధానాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఎలక్షన్ కమిషనర్ల ఎంపిక కోసం కమిటీని ఏర్పాటు చేసింది. ప్రధాన మంత్రి, ప్రతిపక్ష నేత, సీజేఐ సభ్యులుగా ఉన్న కమిటీనే నియమించాలని ఆదేశించింది. ఈ మేరకు ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. భారత ఎన్నికల సంఘం సభ్యుల నియామక ప్రక్రియలో సంస్కరణలు కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్బంగా ఎన్నికల కమిషన్ నియామకాలపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఈసీ నియామకాలపై కమిటీలో ప్రధాన మంత్రి, ప్రతిపక్ష నేత, సీజేఐ సభ్యులుగా ఉన్న కమిటీనే నియమించాలని ఆదేశించింది. అలాగే, ప్రతిపత నేత లేదా విపక్షంలో మెజార్టీ పార్టీ సభ్యుడు ఉండాలని పేర్కొంది. సీబీఐ చీఫ్ ఎంపిక తరహాలోనే సీఈసీ నియామకం జరగాలని సూచించింది. దీనికి సంబంధించి పార్లమెంట్ చట్టం చేసేంత వరకు కమిటీ పని చేస్తుందని జస్టిస్ కె.ఎం నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం స్పష్టం చేసింది. The Constitution Bench of Supreme Court starts pronouncing the judgement on petitions seeking reform in the process for the appointment of members of the Election Commission of India. Judgment being pronounced by a 5-judge bench headed by Justice K.M. Joseph. pic.twitter.com/Th2plMoESH — ANI (@ANI) March 2, 2023 -
తెలంగాణ: ప్రధాని మోదీ పర్యటన వాయిదా!
సాక్షి, ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 19వ తేదీన ఆయన రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు రావాల్సి ఉంది. సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధి పనులతో పాటు వందే భారత్ రైలును ప్రారంభించాల్సి ఉంది. అయితే.. ఈ పర్యటన వాయిదా పడినట్లు బుధవారం బీజేపీ వర్గాలు వెల్లడించాయి. బిజీ షెడ్యూల్ వల్లే వాయిదా పడిందని చెబుతూ.. అతి త్వరలోనే పర్యటన తేదీని ప్రకటిస్తామని తెలిపాయి. అయితే.. ప్రధాని పర్యటన తాత్కాలికంగానే వాయిదా పడిందని, ప్రధాని రాష్ట్ర పర్యటన షెడ్యూల్ త్వరలోనే వెల్లడిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. దీంతో వందే భారత్ రైలు ప్రారంభంపై సందిగ్ధత ఏర్పడినట్లయ్యింది. -
బ్రెజిల్ అల్లర్లపై ప్రధాని మోదీ ఆందోళన
న్యూఢిల్లీ: బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో మద్దతుదారులు వందల సంఖ్యలో రాజధాని బ్రెసిలియాలో బీభత్సం సృష్టించారు. పార్లమెంట్, సుప్రీం కోర్టుపై మెరుపుదాడికి దిగారు. ఈ క్రమంలో బ్రెసిలియాలోని ప్రభుత్వ ఆస్తులపై దాడులు, అల్లర్ల వార్తల పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. బ్రెజిల్ అధికారులకు తమ పూర్తి మద్దతు ఉంటుందని భరోసా కల్పిస్తూ ట్విట్టర్ వేదికగా తెలిపారు. ‘బ్రెసిలియాలోని ప్రభుత్వ సంస్థలను ధ్వంసం చేయడం, అల్లర్లు సృష్టించిన వార్తలు తీవ్ర ఆందోళనకు గురి చేశాయి. ప్రజాస్వామ్య సంప్రదాయాలను ప్రతి ఒక్కరు గౌరవించాలి. బ్రెజిలియన్ అధికారులకు మా పూర్తి మద్దతు ఉంటుంది.’అని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. Deeply concerned about the news of rioting and vandalism against the State institutions in Brasilia. Democratic traditions must be respected by everyone. We extend our full support to the Brazilian authorities. @LulaOficial — Narendra Modi (@narendramodi) January 9, 2023 ఇదీ చదవండి: బ్రెజిల్లో రణరంగం.. ఫాసిస్ట్ ఎటాక్‌గా అధ్యక్షుడి అభివర్ణన.. సంబంధం లేదన్న బోల్సోనారో -
బాధాకరం, అండగా భారత్..: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: భూకంపం ధాటికి ఇండోనేషియా చిగురుటాకులా వణికిపోయింది. సోమవారం ఇండోనేషియాలో భూకంపం దాటికి 150పైగా మంది దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. వందల మంది క్షతగాత్రులు కాగా, నష్టం ఊహించని స్థాయిలోనే చోటు చేసుకుంది. ఇక ఈ విపత్తుపై భారత ప్రధాని మోదీ మంగళవారం ట్విటర్ ద్వారా స్పందించారు. ‘‘ఇండోనేషియాలో సంభవించిన భూకంపం వల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగడం బాధాకరం. బాధితులకు, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్న. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ దుఃఖ సమయంలో ఇండోనేషియాకు భారత్ అండగా నిలుస్తుంది’’ అని భారత ప్రధాని ట్వీట్ ద్వారా తెలిపారు. Saddened by the loss of lives and damage to property from the earthquake in Indonesia. Deepest condolences to the victims and their families. Wish a speedy recovery to the injured. India stands with Indonesia in this hour of grief. @jokowi — Narendra Modi (@narendramodi) November 22, 2022 ఇండోనేషియా జావా కేంద్రంగా రిక్టర్ స్కేల్‌పై 5.6 తీవ్రతతో ప్రకంపనలు కుదిపేశాయి. భారీగా ఆస్తి నష్టం సంభవించగా.. ప్రాణ నష్టం కూడా నమోదు అయ్యింది. ఇదీ చదవండి: అత్యాచార బాధితురాలి నుంచి లంచం వసూలు -
బైడెన్‌తో మీట్.. సునాక్‌తో ముచ్చట్లు.. ఆయనతో షేక్‌హ్యాండ్
బాలి: జీ20 సదస్సులో భారత ప్రధాని మోదీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. అమెరికాతో భారత సంబంధాలపై ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్‌తో ప్రధాని మోదీ లోతైన చర్చలు జరిపారు. సమీప భవిష్యత్తులో అత్యంత కీలకంగా మారనున్న పలు అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, సాంకేతిక పరిజ్ఞానాల వంటి రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యం తాలూకు పురోగతిని సమీక్షించారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధంపైనా చర్చించారు. జీ 20 సదస్సు సందర్భంగా ఇద్దరు నేతలు మంగళవారం విడిగా సమావేశమయ్యారు. అంతర్జాతీయ, ప్రాంతీయ పరిణామాలపైనా బైడెన్‌తో మోదీ చర్చించినట్టు విదేశాంగ శాఖ వెల్లడించింది. ‘‘క్వాడ్, ఐ2యూ2 తదితర నూతన గ్రూపుల్లో భారత్, అమెరికా సన్నిహిత సంబంధాల పట్ల ఇరువురూ సంతృప్తి వెలిబుచ్చారు. ఇండో–యూఎస్ బంధాన్ని బలోపేతం చేసేందుకు మద్దతుగా నిలుస్తున్నందుకు బైడెన్‌కు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఏడాది భారత సారథ్యంలో జరిగే 18వ జీ 20 సదస్సు సందర్భంగా కూడా ఈ సహకారం ఇలాగే కొనసాగుతుందని విశ్వాసం వెలిబుచ్చారు’’ అని వివరించింది. ఇరువురి మధ్య ప్రయోజనాత్మక చర్చలు జరిగినట్టు విదేశాంగ శాఖ తెలిపింది. గత వారం కాంబోడియా రాజధాని నాంఫెన్‌లో ఆసియాన్ ఇండియా శిఖరాగ్రం సందర్భంగా భారత, అమెరికా విదేశాంగ మంత్రులు చర్చలు జరపడం తెలిసిందే. జిన్‌పింగ్‌తో కరచాలనం జీ20 సదస్సు సందర్భంగా బాలిలో మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కరచాలనం చేసుకోవడం దేశాధినేతలతో సహా అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇండోనేíషియా అధ్యక్షుడు ఏర్పాటు చేసిన స్వాగత విందు ఇందుకు వేదికైంది. అటుగా వెళ్తున్న జిన్‌పింగ్ ఆగి మోదీకి షేక్‌హ్యాండిచ్చారు. ఇద్దరూ కాసేపు మాట్లాడుకుంటూ కన్పించారు. అధికారిక భేటీ కూడా ఉంటుందని ప్రచారమైనా అలాంటిదేమీ జరగలేదు. భారత్, చైనా మధ్య కొన్నేళ్లుగా ఉద్రిక్తతలు పెరగడం తెలిసిందే. 2020లో గాల్వన్ లోయలో చైనా సైన్యం భారత సైనికులపై దొంగ దెబ్బ తీసి 20 మందికి పైగా పొట్టన పెట్టుకున్న తీరుపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలొచ్చాయి. అప్పటినుంచీ మోదీ, జిన్‌పింగ్‌ల ముఖాముఖి జరగలేదు. సెప్టెంబర్‌లో షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ వార్షిక శిఖరాగ్రం సందర్భంగా ఇరువురూ కలుసుకున్నారు. సునాక్‌తో మోదీ ముచ్చట్లు కొంతకాలంగా అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. గత నెలలో బ్రిటన్ ప్రధానిగా ఎన్నికై, ఆ ఘనత సాధించిన తొలి భారత సంతతి వ్యక్తిగా చరిత్ర సృష్టించిన రిషి సునాక్‌తో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. బాలిలో జీ 20 సదస్సు సందర్భంగా ఇరువురు నేతలు కాసేపు ముచ్చటించారు. సునాక్ పీఎం అయ్యాక వారిరువురూ భేటీ కావడం ఇదే తొలిసారి. నేతలిద్దరూ సరదాగా మాట్లాడుకున్నారంటూ ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడొడొ, ఇతర దేశాధినేతలు, ఐఎంఎఫ్ చీఫ్, ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు తదితరులతోనూ మోదీ ముచ్చటించారు. రిషి, మాక్రాన్, విడొడొతో బుధవారం ఆయన సుదీర్ఘ చర్చలు జరపనున్నారు. -
G20: ఇప్పుడు మన వంతు వచ్చింది: ప్రధాని మోదీ
జకార్త: ఇండోనేషియా బాలి వేదికగా జరుగుతున్న జీ20 సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. ఫుడ్ అండ్ ఎనర్జీ సెక్యూరిటీ మీద కీలక ప్రసంగం చేశారాయన. ఆ సమయంలో ఉక్రెయిన్ పరిణామంపై స్పందించిన ఆయన.. కాల్పుల విరమణ, దౌత్యవేత్తం దిశగా ప్రపంచం ఓ మార్గాన్ని వెతకాల్సిన అవసరం ఏర్పడిందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. గత శతాబ్దంలో.. రెండో ప్రపంచ యుద్ధం ప్రపంచ విధ్వంసానికి కారణమైంది. ఆ తర్వాత.. శాంతి బాట పట్టేందుకు అప్పటి నేతలు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు మన వంతు వచ్చింది. ఈ సమయంలో ప్రపంచ శాంతి, సామరస్యం, భద్రతను నిర్ధారించడానికి.. ఖచ్చితమైన, సామూహిక సంకల్పాన్ని ప్రదర్శించడం అవసరం. వచ్చే ఏడాది బుద్ధుడు, గాంధీల పవిత్ర భూమిలో(భారత్‌లో జరగబోయే సమావేశాన్ని ఉద్దేశించి..) G20 సమావేశమైనప్పుడు.. మనమంతా ప్రపంచ శాంతి అనే బలమైన సందేశం తెలియజేయడానికి అంగీకరిస్తామని నేను విశ్వసిస్తున్నా.. అంటూ ఆయన సలహా పూర్వక ప్రసంగం కొనసాగించారు. అలాగే.. ఉక్రెయిన్ యుద్ధం, వాతావరణ మార్పులు, కరోనా లాంటి పరిణామాలు ప్రపంచ ఉత్పత్తుల మీద తీవ్ర ప్రభావం చూపెట్టాయని, ప్రపంచం మొత్తం మీద ఈ సంక్షోభం కొనసాగుతోందని, ముఖ్యంగా దాదాపు అన్ని దేశాల్లో పేదలకు పెనుసవాళ్లు ఎదురవుతున్నాయని భారత ప్రధాని మోదీ అన్నారు. ఇక భారత్‌లో ఆహార భద్రతను ప్రస్తావించిన ప్రధాని మోదీ.. రాబోయే రోజుల్లో ఫెర్టిలైజర్స్ కొరత.. ఆహార సంక్షోభానికి దారి తీయొచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభావవంతమైన గ్లోబల్ బ్లాక్ భారత్ తరపున.. అన్ని ముఖ్యమైన సమస్యలపై ప్రపంచ ఏకాభిప్రాయాన్ని సాధించడానికి కృషి చేయడం జరుగుతుందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. PM Modi attends #G20Indonesia Working Session on food & energy security. In his intervention, he underlined the criticality of resilient supply chains for food, fertilizers & energy, the need for affordable finance for a smooth energy transition for the Global South: MEA pic.twitter.com/GhHvGFxBZ8 — ANI (@ANI) November 15, 2022 అంతకు ముందు.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటును తిరిగి పట్టాలెక్కించడం, ఆహార, ఇంధన భద్రత తదితర కీలకాంశాలపై పలువురు దేశాధినేతలతో లోతుగా చర్చస్తానని బాలి పర్యటనకు బయల్దేరే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పలు రంగాల్లో భారత్ సాధించిన అద్భుత ప్రగతి, గ్లోబల్ వార్మింగ్ తదితర ప్రపంచ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో చేస్తున్న కృషిని జీ 20 వేదికపై ప్రస్తావిస్తానని ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో ప్రధాని పేర్కొన్నారు. వచ్చే ఏడాది భారత్ సారథ్యంలో జరిగే జీ20 సదస్సుకు ‘ఒకే భూమి, ఒక కుటుంబం, ఒకే భవిష్యత్తు’ (వసుధైవ కుటుంబం) ప్రధాన నినాదంగా ఉండబోతోందని పేర్కొన్నారు. ఇండొనేసియా అధ్యక్షుడి నుంచి జీ 20 సారథ్య బాధ్యతలు భారత్ స్వీకరించనుండటాన్ని చరిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. సదస్సు సందర్భంగా పలువురు దేశాధినేతలతో విడిగా భేటీ కానున్నారు. అమెరికా, చైనా, ఫ్రాన్స్ అధ్యక్షులు జో బైడెన్, షీ జిన్‌పింగ్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తదితరులు భేటీలో పాల్గొననున్నారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌తో మోదీ భేటీ జరుగుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. -
దేశాభివృద్ధిలో ఏపీ కీలక భూమిక పోషించనుంది: ప్రధాని మోదీ
-
ఈరోజు ఏపీకి, విశాఖకు గొప్పదినం: ప్రధాని మోదీ
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం దేశంలోనే ప్రముఖ నగరం అని.. ఇక్కడి ఓడరేపు చారిత్రకమైందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రక్షణ, వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో విశాఖది కీలకపాత్ర అని భరోసా ఇచ్చారాయన. శనివారం ఏయూ గ్రౌండ్స్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ‘ప్రియమైన సోదరీసోదరులారా.. నమస్కారం..’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు తెలుగులో అభివాదం చేశారు. ఆపై వేదిక మీదున్న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తదితరులకు అభివాదం తెలిపారు. ‘‘కొన్ని నెలల కిందట విప్లవవీరుడు అల్లూరి జయంతి వేడుకలో పాల్గొనే అవకాశం వచ్చింది. దేశంలో విశేషమైన నగరం ఇది. విశాఖ ఓడరేపు చారిత్రకమైంది. ఇక్కడ నుంచి రోమ్ వరకు వ్యాపారం జరిగేది. ఆరోజు కూడా విశాఖపట్నం ప్రముఖ వ్యాపారం కేంద్రంగా విరజిల్లుతోంది. దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఏపీ ప్రజలకు గుర్తింపు ఉంది. అన్ని రంగాల్లో తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. స్వభావ రీత్యా స్నేహపూర్వకంగా ఉంటారు. ప్రతీ రంగంలో మెరుగైన మార్పు కోసం తెలుగు ప్రజలు తపన పడతారు. అలాగే సాంకేతిక వైద్య రంగాల్లో ఏపీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇవాళ రూ. 10వేల కోట్ల ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తున్నాం. ఇవాళ ఏపీకి, విశాఖకు గొప్పదినం. ఇవాళ ప్రారంభించిన ప్రాజెక్టులు.. విశాఖ, ఏపీ ప్రజల అభివృద్ధికి ఎంతో ఉపయోగపడతాయి. విశాఖ రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి పరుస్తూనే.. ఫిషింగ్ హార్బర్‌ను ఆధునీకరిస్తాం. తీర ప్రాంతం వేగవంతమైన అభివృద్ధిని సాధిస్తుంది. ఓడరేవుల ద్వారా వేల కోట్లలో వ్యాపారం జరుగుతుంది. విశాఖ ఫిఫింగ్ హార్బర్ అభివృద్ధితో మత్స్యకారుల జీవితాల్లో మార్పు వస్తుంది. దేశాభివృద్ధిలో ఏపీ కీలక భూమిక పోషించనుంది. మౌలిక సదుపాయాల అభివృద్ధికి మా ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుంది. వెనుకంజ అస్సలు వేయదు అని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ఈ క్రమంలో తన ప్రసంగంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కంభంపాటి హరిబాబుల ప్రస్తావన తీసుకొచ్చారు ప్రధాని మోదీ. ఏపీ, వైజాగ్ అభివృద్ధికి ఎంతో దోహదం చేశారని వాళ్లపై ప్రశంసలు గుప్పించారు. ఇప్పుడు చాలా దేశాలు వెనుకంజలో ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో భారత్ అభివృద్ధి సాధిస్తోంది. వికాస భారత్ దిశగా మనం దూసుకుపోతున్నాం. ప్రపంచ వ్యాప్తంగా భారత దేశమే అందరికీ ఆశావాహ దృక్పథం ఇస్తోంది. మేధావులు, నిపుణులు భారత్‌ను ప్రశంసిస్తున్నారు. భారత్.. ప్రపంచ దేశాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. రైతులకు ఏటా రూ.6వేల సాయం అందిస్తున్నాం.వెనుకబడిన జిల్లాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. పేదల కోసం సంక్షేమ పథకాలను మరింత విస్తరిస్తున్నాం. అంతరిక్షం నుంచి సముద్ర గర్భం వరకు ప్రతీ అవకాశాన్ని వెతికి పట్టుకుంటాం. మా ప్రతి నిర్ణయం సామాన్యుడి జీవితాన్ని మెరుగు పర్చడం కోసమే అని ప్రధాని మోదీ మరోసారి స్పష్టం చేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
విశాఖ: సభా వేదిక వద్దకు చేరుకున్న ప్రధాని మోదీ
-
ముగిసిన పీఎం నరేంద్ర మోదీ విశాఖ పర్యటన
అప్డేట్స్ 11:30AM ముగిసిన పీఎం ప్రధాని మోదీ విశాఖ పర్యటన 10:44AM ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం ►తెలుగులో ప్రసంగం ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ ►ప్రియమైన సోదరీ సోదరమణులకు స్వాగతం ►కొద్ది రోజుల క్రితం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జన్మదిన వేడుకలో పాల్గొనే అదృష్టం కలిగింది ►ఈరోజు ఏపీకి, విశాఖకు గొప్పదినం ►విశాఖ దేశంలోనే విశేషమైన నగరం ►విశాఖ ఓడరేవు చారిత్రాత్మకమైనది ►ఇక్కడ నుంచి రోమ్ వరకూ వ్యాపరం జరిగేది ►ఈరోజు కూడా విశాఖపట్నం ప్రముఖ వ్యాపార కేంద్రం ►ఈరోజు ప్రారంభించే రూ. 10 వేల కోట్ల విలువ చేసే ప్రాజెక్టులతో విశాఖ, ఏపీ ప్రజలకు ఎంతో అభివృద్ధి జరుగుతుంది ►ఈ ప్రాజెక్టులతో ఏపీ అభివృద్ధి కొత్త శిఖరాలకు చేరుతుంది ►దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఏపీకి ప్రజలకు ప్రత్యేక గుర్తింపు ఉంది ►తమ స్వభావంలో సౌమ్యులైన ఏపీ ప్రజలు అన్ని రంగాల్లో తమ ప్రతిభను కనబరుస్తున్నారు ►కేవలం సాంకేతిక పరిజ్ఞానం, వృత్తిపరమైన గుర్తింపు మాత్రమే కాదు..తెలుగు ప్రజలకు స్నేహ శీలత సహద్భావం వల్లే ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ►తెలుగు ప్రజలు ప్రతి రంగంలో మెరుగైన మార్పు కోసం తపన పడతారు ►మౌలిక వసుతల కల్పనలో మేమెప్పుడూ వెనక్కి తగ్గలేదు ►మౌలిక వసతుల అభివృద్ధి అన్ని రంగాల పురోగతిని వేగవంతం చేస్తోంది ►ఒకవైపు విశాఖ రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి పరుస్తూనే మరోవైపు ఫిషింగ్ హార్బర్‌ను ఆధునీకరిస్తున్నాం ►మౌలిక వసతుల కల్పనతోనే ఏపీ తీర ప్రాంతం వేగవంతమైన అభివృద్ధి సాధిస్తుంది ►విశాఖ ఫిషింగ్ హార్బర్ అభివృద్ధితో మత్స్యకారుల జీవితాల్లో మార్పు వస్తుంది ►ప్రపంచ వ్యాప్తంగా భారతదేశమే అందరికీ ఆశావహ దృక్పథం ఇస్తోంది ►మా ప్రతి నిర్ణయం సామాన్యుడి జీవితాన్ని మెరుగు పర్చడం కోసమే ►ఒక వైపు మేం చేసిన అభివద్ధితో దేశంలో పెట్టబడులు పెరుగుతున్నాయి ►మరోవైపు పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలను మరింత విస్తరిస్తున్నాం ►రైతులకు ఏటా రూ. 6 వేల ఆర్థిక సాయం అందిస్తున్నాం ►అంతరిక్షం నుంచి సముద్ర గర్భం వరకు ప్రతి అవకాశాన్ని వెతికి పట్టుకుంటాం 10: 25AM సీఎం వైఎస్ జగన్ స్పీచ్ ►దేశ ప్రగతి రథసారథి ప్రధాని నరేంద్ర మోదీ గారికి స్వాగతం ►ఏయూలో జన సముద్రం కనిపిస్తోంది ►ఉవ్వెత్తున ఎగసిపడుతున్న కెరటాల్లా జనం ఇక్కడికి తరలివచ్చారు ►వంగపండు పాట ఏం పిల్లడో ఎల్లమొస్తవా అనే పాటలా జనం తరలివచ్చారు ►జగన్నాథ రథచక్రాలు ఇక్కడికి కదిలి వచ్చాయి ►10,742 కోట్ల ప్రాజెక్టులు ప్రారంభిస్తున్న ప్రధాని మోదీకి రాష్ట్ర ప్రజలు, అశేష జనం తరఫున ధన్యవాదాలు ►కేంద్ర ప్రభుత్వంతో మా అనుబంధం రాజకీయాలకు అతీతమైంది ►మాకు మరో ఎజెండా లేదు.. ఉండబోదు ►రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా పోలవరం నుంచి ప్రత్యేక హోదా వరకూ మీకు చేసిన విజ్ఞప్తులను పరిష్కరించాలని మరోసారి కోరుతున్నాం ►గత మూడున్నరేళ్లుగా రాష్ట్రంలో విద్య, వైద్యం, సంక్షేమం, మహిళా అభివృద్ధి, పారదర్శకమైన గడప వద్దకే పాలన ప్రాధాన్యతగా అడుగులు ముందుకు వేస్తున్నాం ►ప్రతి కుటుంబం నిలదొక్కుకునేందుకే మా ఆర్థిక వ్యవస్థలో ప్రతి రూపాయి ఖర్చు చేశాం ►పెద్దలు సహృదయలైన మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి ►ఎమిమిదేళ్ల క్రితం తగిలిన అతిపెద్ద గాయం ఇంకా మానలేదు ►మీరు మా రాష్ట్రానికి చేసే ప్రతి సాయం మా రాష్ట్రానికిచ్చే ప్రతి సంస్థ, ప్రతి రూపాయి, మా అభివృద్ధికి దోహద పడుతాయి ►విభజన హామీలైన పోలవరం, రైల్వే జోన్, విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి ప్రత్యేక హోదా వరకు అన్ని హామీలు పూర్తి చేయాలని కోరుతున్నాం 10: 20AM ►నమస్కారం.. అంటూ తెలుగులో ప్రజలకు అభివాదం ద్వారా ప్రసంగం ప్రారంభించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అద్భుత ప్రగతి సాధిస్తోంది. రైల్వే శాఖ ఆధునీకరణదిశగా దూసుకెళ్తోంది.. ప్రధాని మోదీకి శాలువ కప్పి గౌరవించిన సీఎం జగన్.. రాముడి చిత్రం బహుకరణ 10:18AM ►సభా వేదికపైకి చేరుకున్న ప్రధాని మోదీ, గవర్నర్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ 10:14 AM ►రోడ్లు, రైల్వే ప్రాజెక్టుల నమునాలను పరిశీలించిన ప్రధాని మోదీ. 10:09 AM ► ఏయూ ప్రాంగణానికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ. వెంట ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్ ఉన్నారు. ► కాసేపట్లో విశాఖ ఆంధ్రా యూనివర్శిటీ సభా ప్రాంగణానికి చేరుకోనున్న ప్రధాని మోదీ. ► రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో ఏయూలో నిర్వహించబోయే ఈ భారీ బహిరంగ సభకు జనం పోటెత్తారు. ► ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం పర్యటన నేపథ్యంలో నగరంలో భారీ భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. ఉదయం నుంచే ట్రాఫిక్ ఆంక్షలను పటిష్టంగా అమలు చేస్తున్నారు. మరోవైపు అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పహారా కాస్తున్నారు. ► సుమారు రూ.10,742 కోట్లతో చేపట్టనున్న వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనతో పాటు ఇప్పటికే పూర్తి అయిన ప్రాజెక్టులను జాతికి అంకితం. ప్రాజెక్టుల వివరాలు.. ► రూ. 460 కోట్లతో విశాఖ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు ► రూ. 3,778 కోట్లతో రాయిపూర్ విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ గ్రీన్ ఫీల్డ్ హైవే ► రూ. 566 కోట్లతో కాన్వెంట్ జంక్షన్ నుంచి షీలా నగర్ వరకు రోడ్డు నిర్మాణం ► రూ. 152 కోట్లతో విశాఖ ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణ పనులు ► రూ. 2658 కోట్లతో గెయిల్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం అంగుల్ గ్యాస్ పైప్‌లైన్ ప్రాజెక్టుకు నిర్మాణ పనులకు శంకుస్థాపన ► రూ. 211 కోట్లతో నరసన్నపేట పాతపట్నం రహదారి అభివృద్ధి పనులు జాతికి అంకితం ► రూ. 2,917 కోట్లతో నిర్మించిన ఓఎన్జీసీ యు ఫీల్డ్ ఆన్ షోర్ డీప్ వాటర్ బ్లాక్ ప్రాజెక్ట్ జాతికి అంకితం -
పదమూడేళ్లలో ఒక్క సెలవూ పెట్టని నరేంద్ర మోదీ
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత దేశానికి ప్రధానిగా.. గ్లోబల్ ఫేమ్ దక్కించుకున్నారు నరేంద్ర మోదీ. ఆయన తీసుకునే నిర్ణయాలను.. ప్రతీ చర్యనూ అంతే ఆసక్తిగా గమనిస్తుంటుంది మన దేశం. ఇవాళ ఆయన 72వ పుట్టినరోజు. ఈ సందర్భంగా నరేంద్ర దామోదర్‌దాస్ మోదీ జీవితంపై ప్రత్యేక కథనం.. ► భారత దేశానికి స్వాతంత్రం వచ్చిన మూడేళ్లకు.. గణతంత్రంగా మారిన కొన్నినెలలకు నరేంద్ర మోదీ జన్మించారు. ► ఉత్తర గుజరాత్ మెహ్సనా జిల్లా వాద్నగర్లో సెప్టెంబర్ 17, 1950.. దామోదర్ దాస్ మోదీ, హిరాబా మోదీ దంపతులకు జన్మించారు నరేంద్ర దామోదర్‌దాస్ మోదీ. ఆరుగురు సంతానంలో నరేంద్రుడు మూడవవాడు. ► తనది అట్టడుగు స్థాయి కుటుంబంగా చెప్పుకునే ఆయన.. తన చిన్నతనంలో తిండి కోసం పడ్డ కష్టాలను ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. తన తల్లి ఇల్లు గడవడానికి నాలుగు ఇళ్లలో పని చేసేదని, తన తండ్రి స్థానికంగా ఉన్న స్టేషన్లో ఛాయ్ అమ్ముకుని జీవించేవారని, తానూ తన తండ్రికి సహాయంగా పనికి వెళ్లేవాడినని ఆయన తరచూ చెప్తుంటారు. ఆర్మీలో చేరాలనుకున్నా.. ఆర్మీలో చేరాలని నరేంద్ర మోదీ కలలుగన్నాడు. జామ్‌నగర్ సైనిక్ స్కూల్లో చేరాలని ప్రయత్నించాడు కూడా. కానీ, ఆర్థిక సమస్యలతో ఆ కల.. కలగానే మిగిలిపోయింది. అయితే.. 1965 ఇండో-పాక్ వార్ సమయంలో స్టేషన్‌కు చేరుకునే భారత సైనికులకు టీ అందించడం ద్వారా తన అభిమానాన్ని చాటుకున్నట్లు చెప్పేవారు. పనిమంతుడు మంత్రులు, తోటి నాయకులు, చివరికి నరేంద్ర మోదీ వ్యక్తిగత సిబ్బంది కూడా ఆయన గురించి చెప్పే ఒకే ఒక్కమాట.. విరామమెరుగని పనిమంతుడు అని. ఆ పని వల్లే తనకు నిద్ర దూరమైందని, కాకపోతే యోగా, ప్రాణాయామం వల్ల తాను ఆరోగ్యంగా, ఉత్తేజంగా ఉండగలుగుతున్నానని మోదీ తరచూ చెప్తుంటారు. అది అసలు నచ్చదు హోటల్స్ బస చేయడం అంటే ఆయనకు అస్సలు ఇష్టం ఉండదు. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు.. ప్రధానిగా ఉన్నప్పుడు కూడా ఆయనెప్పుడూ హోటల్స్‌లో దిగడానికి ఆసక్తికనబరిచేవారు కాదు. దాదాపుగా.. ప్రయాణాలతో ఆ సమయాన్ని భర్తీ చేసుకునేవారు ఆయన. ఒకవేళ ఆ మరుసటిరోజు ఉదయం మీటింగ్‌లు ఉండే అత్యవసర స్థితిలో మాత్రమే ఆయన హోటల్స్‌లో దిగేవారట. ► ఉన్నత పదవుల్లో, స్థానాల్లో ఉన్నవాళ్లు తరచూ విరామం తీసుకోవడం చూస్తుంటాం. కానీ, నరేంద్ర మోదీ మాత్రం గుజరాత్ ముఖ్యమంత్రిగా.. పదమూడేళ్లలో ఏనాడూ సెలవు పెట్టింది లేదు. అసలు ఆయన అంతకాలంలో జ్వరం బారిన పడిన దాఖలాలు, విరామం తీసుకున్నారనేది కూడా లేకపోవడం విశేషం. ఇప్పుడు ప్రధానిగానూ దేశం కోసం ఆయన అదే డెడికేషన్‌ను ప్రదర్శిస్తున్నారు. ► ప్రధాని మోదీకి ఒంటరి జీవితం అంటేనే ఇష్టం. యువకుడిగా ఉన్నప్పుడు దేశంలో చాలాచోట్లు, ఆధ్యాత్మిక యాత్రలు చేశారు. చిన్నతనంలో పెద్దలు బలవంతంగా చేసిన పెళ్లిని ఆయన తిరస్కరించారు. అమెరికాలో మూడు నెలలపాటు.. ఆధ్యాత్మిక, మతపరమైన ధోరణిలో మునిగిపోయి.. మోదీ తన కాలేజీ జీవితాన్ని కూడా పక్కనపెట్టేశారు. సంచారిగా కోల్‌కతాలోని బేలూర్ మఠానికి తన ప్రయాణానికి కొనసాగించారు. అయితే.. తన 28వ ఏట ఆయన ఢిల్లీ యూనివర్సిటీ తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారాయన. ఇక ఇమేజ్ మేనేజ్మెంట్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ కోర్సు కోసం మూడు నెలలపాటు అమెరికాలో ఉన్నారు. ► వర్క్‌హాలిక్ అయిన మోదీకి మందు, సిగరెట్ లాంటి అలవాట్లు లేవు. నిత్యం యోగా చేసే అలవాటు ఉన్న ఆయన.. పక్కా వెజిటేరియన్ డైట్‌ను ఫాలో అవుతుంటారు. ఫొటోగ్రఫీ, కవితలు-పద్యాలు రాయడం ఆయనకు ఇష్టం. ఆయన ఫొటోలతో చాలాసార్లు ఎగ్జిబిషన్ కూడా నిర్వహించారు. ► పాలనాపరమైన నిర్ణయాల్లోనూ ప్రధానిగా తనదైన ముద్ర చూపిస్తున్నారు ఇప్పుడు. అందుకే గ్లోబల్ లీడర్లలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న నేతగా గుర్తింపు దక్కించుకున్నారు. -
ఏ స్వామీజీ కనిపించినా.. అలా అతుక్కుపోతున్నారు!!
ఏ స్వామీజీ కనిపించినా.. అలా అతుక్కుపోతున్నారు!! -
ఆ పోరులో మాతో కలిసి రండి.. జీ-7కు ప్రధాని మోదీ పిలుపు
ఎల్మౌ (జర్మనీ): పర్యావరణ పరిరక్షణకు, తత్సంబంధిత వాగ్దానాలకు భారత్ పూర్తిగా కట్టుబడిందని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ఈ విషయంలో కొన్నేళ్లుగా భారత్ కనబరుస్తున్న పనితీరే అందుకు నిదర్శనమన్నారు. వాతావరణ మార్పులపై పోరులో సంపన్న జీ7 దేశాలు కూడా భారత్‌తో కలిసి వస్తాయని ఆశాభావం వెలిబుచ్చారు. స్వచ్ఛ ఇంధన పరిజ్ఞానానికి సంబంధించి భారత్‌లో అందుబాటులో ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకోవాలని వాటికి పిలుపునిచ్చారు. ఆయన సోమవారం ఇక్కడ జీ7 శిఖరాగ్ర సదస్సులో వాతావరణ మార్పులు, ఇంధనం తదితరాలపై జరిగిన భేటీలో మాట్లాడారు. ఇంధన సామర్థ్యంలో 40 శాతాన్ని శిలాజేతర వనరుల నుంచి సమకూర్చుకోవాలన్న లక్ష్యాన్ని గడువుకు 9 ఏళ్ల ముందే సాధించామన్నారు. ‘‘పేద దేశాలు పర్యావరణానికి బాగా హాని చేస్తున్నారన్న అపోహను దూరం చేయడంలో భారత్ చిత్తశుద్ధి ఇతర వర్ధమాన దేశాలకూ స్ఫూర్తిగా నిలుస్తుంది. ప్రపంచ జనాభాలో 17 శాతానికి భారత్ నిలయం. కానీ ప్రపంచ కర్బన ఉద్గారాల్లో దేశ వాటా కేవలం 5 శాతం. ప్రకృతితో కలిసి సాగే మా జీవన విధానమే ఇందుకు ప్రధాన కారణం’’ అన్నారు. ఆల్ఫ్స్ పర్వత శ్రేణిలో జీ7 వేదికైన ఎల్మౌలో సోమవారం మోదీకి జర్మనీ చాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్ ఘనస్వాగతం పలికారు. అనంతరం అధినేతల ఫొటో సెషన్ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మోదీ వద్దకు స్వయంగా వచ్చి కాసేపు ఆప్యాయంగా మాట్లాడారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ తదితరులు కూడా మోదీతో సుదీర్ఘంగా మంతనాలు జరుపుతూ కన్పించారు. కెనడా పీఎం జస్టిన్ ట్రూడో, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామాఫోసా, ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడొడొ తదితరులతో మోదీ భేటీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. సదస్సులో జి7 దేశాలైన అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, యూకే, ఇటలీ, కెనడా, జపాన్‌తో పాటు భారత్, ఇండొనేసియా, దక్షిణాఫ్రికా, సెనెగల్, అర్జెంటీనా దేశాధినేతలు పాల్గొన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌తో ఛాయ్ పే చర్చలో ప్రధాని మోదీ ఉక్రెయిన్‌కు జీ7 బాసట రష్యాపై పోరులో ఉక్రెయిన్‌కు అండగా నిలుస్తామని జి7 దేశాధినేతలు ప్రతినబూనారు. యుద్ధం కాలంలో, తర్వాత కూడా మద్దతిస్తూనే ఉంటామన్నారు. రష్యాపై మరిన్ని కఠిన ఆంక్షలు విధిస్తామన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సదస్సునుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేనందున తమకు సాయంపై పశ్చిమ దేశాలు వెనుకంజ వేస్తాయేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. దాన్ని జి7 దేశాధినేతలు కొట్టిపారేశారు. రష్యా నుంచి దిగుమతులపై సుంకాలను భారీగా పెంచాలని నిర్ణయించారు. ఉక్రెయిన్‌కు నానామ్స్ సిస్టమ్ అత్యాధునిక యాంటీ–ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్స్ ‘నాసమ్స్’ను ఉక్రెయిన్ అందించాలని అమెరికా నిర్ణయించింది. కౌంటర్–బ్యాటరీ రాడార్లు కూడా ఇవ్వనుంది. 7.5 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయమూ అందజేస్తామని బైడెన్ ప్రకటించారు. ఉక్రెయిన్ పునర్నిర్మాణానికి జి7 సహకారం కొనసాగిస్తూనే ఉండాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు. -
మైసూర్ ప్యాలెస్‌లో ప్రధాని మోదీ యోగాసనాలు
బెంగళూరు: ప్రపంచానికి భారత్ అందించిన అద్భుత కానుక.. యోగా. ఇవాళ(జూన్ 21) అంతర్జాతీయ యోగ దినోత్సవం. ఈ సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ, మంగళవారం వేకువజామున మైసూర్ ప్యాలెస్(కర్ణాటక) గ్రౌండ్లో నిర్వహించిన యోగా డే వేడుకలకు నేతృత్వం వహించి.. ప్రసంగించారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, కేంద్రమంత్రి సోనోవాల్ తదితర ప్రముఖులతో పాటు సుమారు పదిహేను వేల మందికిపైగా ప్రజలు ఈ వేడుకలో పాల్గొన్నట్లు సమాచారం. వేదాలు, ఉపనిషత్తుల్లో యోగా ప్రస్తావన ఉంది. యోగా ఫర్ హ్యూమానిటీ థీమ్‌తో ఈసారి వేడుకలను, గార్డియర్‌రింగ్ పద్ధతిలో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అంతకు ముందు ప్రధాని మోదీ ప్రసంగిస్తూ.. మైసూర్ అధ్యాత్మికానికి కేంద్రం. ఒకప్పుడు ఆధ్యాత్మిక కేంద్రాల్లో మాత్రమే యోగా చేసేవాళ్లు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా యోగా చేస్తున్నారు అని పేర్కొన్నారు. ..ఈ 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా.. అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేడు ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలో యోగా సాధన జరుగుతోంది. యోగా మనకు శాంతిని కలిగిస్తుంది. యోగా వల్ల కలిగే శాంతి వ్యక్తులకు మాత్రమే కాదు, మన దేశాలకు, ప్రపంచానికి శాంతిని తెస్తుంది. అంతర్గత శాంతితో కోట్ల మంది ప్రజలు ప్రపంచ శాంతి వాతావరణాన్ని సృష్టిస్తారు. ఆ విధంగా యోగా ప్రజలను, దేశాలను కలుపుతుంది. ఇలా.. యోగా మనందరికీ సమస్య పరిష్కారానికి దారి తీస్తుంది అని ప్రధాని పేర్కొన్నారు. విశ్వ మానవాళి ఆరోగ్యమే లక్ష్యం.. ఇదే అంతర్జాతీయ యోగా దినోత్సవ ఉద్దేశం. మనసు, శరీరం అదుపు చేసే శక్తి యోగాకు ఉంది సూర్యుడి కదలికలను అనుసరిస్తూ యోగాసనాలు వేయాలి. ప్రపంచవ్యాప్తంగా 25కోట్ల మంది.. ఈ దఫా వేడుకల్లో పాల్గొనే అవకాశం కనిపిస్తోంది. Karnataka | Prime Minister Narendra Modi arrives at Mysuru Palace Ground where he will perform Yoga, along with others, on #InternationalDayOfYoga Union Minister Sarbananda Sonowal, CM Basavaraj Bommai and others are also present here. pic.twitter.com/cfj84smyB6 — ANI (@ANI) June 21, 2022 Prime Minister Narendra Modi leads the #InternationalDayOfYoga celebrations from Karnataka's Mysuru pic.twitter.com/DDumTiIYVf — ANI (@ANI) June 21, 2022 -
ప్రధాని మోడీ పై కేటీఆర్ సంచలన ట్వీట్
-
రూ. 17 వేల కోట్లు సీఎం జగన్ విజ్ఞప్తి
-
ప్రధాని మోదీతో ముగిసిన సీఎం జగన్ భేటీ
-
ఢిల్లీ చేరుకున్న సీఎం జగన్
-
ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులతో సీఎం జగన్ భేటీ
Updates కేంద్రమంత్రులతో సీఎం జగన్ భేటీ.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రానికి రావాల్సిన రూ.17వేల కోట్లు విడుదల చేయాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. నిధుల సమీకరణకు ఆటంకాలు లేకుండా బ్యాంకర్లకు ఆదేశాలివ్వాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు బకాయిలు విడుదల చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. అనంతరం.. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో సీఎం భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై చర్చించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం జగన్.. తొలుత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం అయ్యారు. రేపు(శుక్రవారం) ఉదయం 10 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సీఎం వైఎస్ జగన్ భేటీ కానున్నారు. ప్రధానితో ముగిసిన సీఎం జగన్ భేటీ ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ ముగిసింది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. సుమారు 45 నిమిషాల పాటు సమావేశం కొనసాగింది. సీఎం వైఎస్ జగన్ వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఉన్నారు. కాసేపట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం భేటీ కానున్నారు. ప్రధానితో భేటీ.. ►ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చిస్తున్నారు. ప్రధానితో భేటీ అనంతరం సాయంత్రం 5.30కి కేంద్ర ఆర్థిక మంత్రితో సీఎం భేటీ కానున్నారు. సీఎం జగన్‌కు ఘన స్వాగతం ►ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వైఎస్సార్సీపీ ఎంపీలు ఘన స్వాగతం పలికారు. కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో చర్చించనున్నారు. ►సీఎం వైఎస్ జగన్ ఢిల్లీకి చేరుకున్నారు. ఉదయం గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విమానంలో బయల్దేరిన సీఎం జగన్.. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఢిల్లీకి చేరుకున్నారు. ►రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీలో పర్యటించనున్నారు. గురువారం ఉదయం గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఆయన విమానంలో బయలుదేరారు. ►ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం జగన్ గురువారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై సీఎం జగన్ చర్చించనున్నారు. అనంతరం పలువురు కేంద్రమంత్రులతోనూ భేటీ కానున్నారు సీఎం జగన్. -
PM KISAN: రైతుల ఖాతాలోకి నగదు జమ చేసిన ప్రధాని మోదీ
షిమ్లా: కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోన్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (పీఎం కిసాన్) పథకంలో భాగంగా.. 11వ విడత నిధుల్ని నేడు విడుదల చేశారు. మంగళవారం గరిబ్ కళ్యాణ్ సమ్మేళనం కోసం ప్రధాని మోదీ షిమ్లాకు వెళ్లారు. ఈ వేదికగానే ఆయన రైతుల ఖాతాలో నగదు జమ చేశారు. షిమ్లాలోని రిడ్గే మైదానంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. తొమ్మిది మంత్రిత్వ శాఖల ద్వారా అమలు అవుతున్న 16 పథకాల పని తీరు గురించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని స్వయంగా కొందరు లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఇక పీఎం కిసాన్ స్కీమ్‌లో భాగంగా.. రైతులకు పెట్టుబడి సాయం కింద ఏటా రూ.6000(2 వేలు చొప్పున మూడు దఫాలుగా) అందిస్తోంది. ఏడాదికి మూడు విడతచొప్పున ఇప్పటి వరకు 10 ఇన్స్టాల్మెంట్లలో డబ్బులు రైతుల ఖాతాల్లోకి చేరగా, ఇవాళ 11వ విడత డబ్బులు జమ చేసింది. దాదాపు పది కోట్ల కంటే ఎక్కువ మంది రైతుల ఖాతాలో పీఎం సమ్మాన్ నిధి నుంచి రూ.21 వేల కోట్ల రూపాయలను విడుదల చేశారాయన. అయితే ప్రభుత్వం నుండి పిఎం కిసాన్ పథకం ద్వారా.. దేశంలోని రైతులందరికీ గ్రాంట్లు అందవు. PM కిసాన్ పథకానికి అర్హత ప్రమాణాలు ఉన్నాయి. ముందుగానే రిజిస్టర్ అయ్యి ఉండాలి. అలాగే చిన్న మరియు సన్నకారు రైతులు ప్రయోజనాలను పొందుతారు. కొన్ని షరతులు వర్తిస్తాయి కూడా. ఎలా తెలుసుకోవాలంటే.. https://pmkisan.gov.in/BeneficiaryStatus.aspx లింక్‌ను క్లిక్ చేయాలి. కుడి వైపు ఆప్షన్స్‌లో బెనిఫీషియరీ(లబ్దిదారుడు) స్టేటస్ ఉంటుంది. అక్కడ ఆధార్, అకౌంట్ నెంబర్‌ను ఎంటర్ చేసి గెట్ డేటాపై క్లిక్ చేయాలి పీఎం కిసాన్‌కు రిజిస్టర్ చేసుకుని.. ఈ-కేవైసీ పూర్తి అయ్యి ఉంటే ఖాతాలోకి డబ్బు జమ అవుతుంది. -
వేగవంతమైన ఆర్థిక వ్యవస్థల్లో భారత్: మోదీ
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రతికూల ప్రభావాన్ని తట్టుకుని, ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందే ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్ నిలిచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. శాస్త్రవేత్తలు, వైద్యులు, యువత సహకారంతో ఈ మహమ్మారిని భారత్ ఎదుర్కొంది. భారత్ ప్రపంచానికి సమస్యగా మారకుండా, కరోనా సమస్యకు సొంతంగా పరిష్కారం చూపిందన్నారు. ప్రపంచంలోని అనేక దేశాలకు కోవిడ్ నివారణ ఔషధాలు, టీకాలను అందజేసిందని తెలిపారు. కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్స్ స్కీం ప్రయోజనాలను మోదీ సోమవారం విడుదల చేశారు. పథకం పాస్ బుక్కులను, ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘ఊహించనంతటి అభివృద్ధిని ఎనిమిదేళ్లలోనే భారత్ సాధించింది. ప్రపంచ వేదికలపై మన ప్రభావం, పలుకుబడి పెరిగాయి’అన్నారు. చిన్నారుల రోజువారీ అవసరాల నిమిత్తం నెలనెలా రూ.4 వేల అందజేస్తామని చెప్పారు. వారికి 23 ఏళ్లు వచ్చాక రూ.10 లక్షలు అందించడంతోపాటు ఆయుష్మాన్ కార్డు, సైకలాజికల్ కౌన్సెలింగ్ సదుపాయాలున్నట్టు చెప్పారు. వృత్తివిద్యా కోర్సులకు, ఉన్నత విద్యకు విద్యారుణాలూ అందజేస్తామని ప్రకటించారు. పీఎం కేర్స్ పథకం కింద విద్యార్థులకు 1 నుంచి 12వ తరగతి పూర్తయ్యేదాకా వారి ఖాతాల్లో నేరుగా స్కాలర్షిప్ జమవుతుంది. 2022–23కు దేశవ్యాప్తంగా 3,945 మంది చిన్నారులకు రూ.7.89 కోట్లు కేటాయించారు. Prime Minister Narendra Modi releases benefits under PM CARES for Children Scheme. This will support those who lost their parents during the Covid-19 pandemic. pic.twitter.com/7DEM7qGM1Y — ANI (@ANI) May 30, 2022 -
తలదించుకోనివ్వలేదు: ప్రధాని మోదీ
రాజ్‌కోట్/గాంధీనగర్: జాతిపిత మహాత్మాగాంధీ, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ కలలుగన్న భారతదేశ నిర్మాణానికి గత ఎనిమిదేళ్లలో నిజాయతీగా కృషి చేశామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. పేదల గౌరవాన్ని కాపాడేందుకు నిబద్ధతతో పని చేశామని అన్నారు. ప్రధానమంత్రిగా మోదీ ఈ నెల 26న ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభ కార్యక్రమంలో ప్రధాని దేశానికి సేవలు అందించడంలోఏ ఒక్క ప్రయత్నాన్నీ వదిలిపెట్టలేదని ఉద్ఘాటించారు. దేశంలో ఏ ఒక్క పౌరుడూ సిగ్గుతో తలదించుకొనే పరిస్థితి రాకుండా జాగ్రత్తగా మసలుకున్నామని అన్నారు. ప్రధాని మోదీ శనివారం సొంత రాష్ట్రం గుజరాత్లో నిర్మించిన 200 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించారు. అనంతరం సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గత ఎనిమిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పనులు, సాధించిన ఘనతలను వివరించారు. అంకెలు కాదు.. సాక్ష్యాధారాలు ‘‘పేదలు, దళితులు, ఆదివాసీలు, మహిళల సాధికారతతో కూడిన భారత్‌ను గాంధీజీ కోరుకున్నారు. పరిశుభ్రత, ఆరోగ్యం అనేవి నిత్య జీవితంలో భాగం కావాలని ఆకాంక్షించారు. స్వదేశీ విధానాలపై ఆధారపడిన ఆర్థిక వ్యవస్థ కావాలని చెప్పేవారు. వాటన్నింటి కోసం ప్రభుత్వం కృషి చేసింది. గత ఎనిమిదేళ్లలో 3 కోట్ల కుటుంబాలకు పక్కా ఇళ్లు కట్టించి ఇచ్చాం. కొత్తగా 10 కోట్ల కుటుంబాలకు మరుగుదొడ్లు అందుబాటులోకి తీసుకొచ్చాం. 9 కోట్ల మంది మహిళలకు ఎల్పీజీ కనెక్షన్లు అందజేశాం. 2.5 కోట్ల కుటుంబాలకు విద్యుత్ సౌకర్యం, 6 కోట్ల కుటంబాలకు కుళాయి నీరు సదుపాయం కల్పించాం. ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద 50 కోట్ల మంది ఉచిత వైద్యానికి అర్హత పొందారు. ఇవన్నీ కేవలం అంకెలు కాదు. పేదల సంక్షేమం పట్ల మా అంకితభావానికి సాక్ష్యాధారాలు. ‘సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్’ అనే నినాదంతో దేశ అభివృద్ధికి కొత్త దిశను నిర్ధారించాం. ఎరువుల కొరత లేకుండా చర్యలు: మోదీ కరోనా మహమ్మారి, ఉక్రెయిన్–రష్యా యుద్ధం కారణంగా ఎరువుల ధరలు పెరిగాయని నరేంద్ర మోదీ అన్నారు. మన దేశంలో ఎరువుల కొరత తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. రైతన్నలను బలోపేతం చేసేందుకు చేయాల్సిందంతా చేస్తున్నామని వివరించారు. గుజరాత్లో ‘ఇఫ్కో’ ఆధ్వర్యంలో నిర్మించిన నానో యూరియా ప్లాంట్‌ను మోదీ శనివారం వర్చువల్‌గా ప్రారంభించారు. మరో 8 ప్లాంట్లు రాబోతున్నాయని, దీనివల్ల ఎరువుల కోసం విదేశాలపై ఆధారపడడం తగ్గుతుందని చెప్పారు. పాడి సహకార రంగంలో గుజరాత్ అభివృద్ధి సాధించిందని కితాబిచ్చారు. గాంధీనగర్‌లో ‘సహకార్ సే సమృద్ధి’ సదస్సులో ప్రధానమంత్రి మాట్లాడారు. పేదరికాన్ని అనుభవించా దేశంలో కోవిడ్–19 మహమ్మారి వ్యాప్తి ఉధృతంగా ఉన్న సమయంలో పేదలకు ఆహార ధాన్యాలు సరఫరా చేశాం. జన్‌ధన్ బ్యాంకు ఖాతాలు ఉన్న మహిళకు ఆర్థిక సాయం అందించాం. కరోనా బాధితులకు వైద్య సేవలు కల్పించాం. అర్హులైన భారతీయులందరికీ కరోనా టీకా ఉచితంగా అందించాం. పేదరికం గురించి నేను పుస్తకాలు, టీవీల ద్వారా తెలుకోలేదు. పేదరికాన్ని స్వయంగా అనుభవించా. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉన్న కారణంగా గుజరాత్ ఎంతో అభివృద్ధి సాధించింది. 2014 కంటే ముందు (యూపీఏ ప్రభుత్వ హయాంలో) రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన ఫైల్‌ను ఢిల్లీకి పంపిస్తే వెంటనే తిరస్కరణకు గురయ్యేది. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. రాజ్‌కోట్‌లో నేను ప్రారంభించిన ఈ ఆసుపత్రి రోగులు లేక ఎల్లప్పుడూ ఖాళీగా ఉండాలని కోరుకుంటున్నా. ఎవరూ అనారోగ్యం బారినపడకూడదు. అందుకోసం చక్కటి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలి’’ అని మోదీ సూచించారు. -
కుటుంబ పాలనలో తెలంగాణ బందీ: ప్రధాని మోదీ
సాక్షి, హైదరాబాద్:తెలంగాణ అభివృద్ధి కోసం ఎంతటి పోరాటమైనా చేస్తామని, యువతతో కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడిపిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ రాష్ట్ర భవిష్యత్ కోసమే బీజేపీ పోరాటం చేస్తోందని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ సాధిస్తున్న వరుస విజయాలు, సాగిస్తున్న పోరాటాలు చూస్తుంటే.. తెలంగాణలో పార్టీకి ప్రజల మద్దతు పెరిగిందని, బీజేపీని తప్పక గెలిపించాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోందని అన్నారు. దశాబ్దాల తరబడి సాగిన తెలంగాణ ఉద్యమంలో వేలాదిమంది అమరులయ్యారని, కానీ అమరుల ఆశయాలు తెలంగాణలో నెరవేరటం లేదని విమర్శించారు. ఒక కుటుంబ పాలనలో తెలంగాణ బందీ అయ్యిందని, నిరంకుశ తెలంగాణలో ఎవరి ఆశయాలు నెరవేరటం లేదని ధ్వజమెత్తారు. కేవలం ఒక కుటుంబం కోసమే తెలంగాణ ఏర్పాటు జరగలేదని వ్యాఖ్యానించారు. కుటుంబ పార్టీల పాలనను ఊడబెరికి, ఈ పాలనకు అంతం పలికే పోరాటాన్ని తెలంగాణ సోదర, సోదరీమణులు, ప్రజలు ముందుకు తీసుకెళతారని భావిస్తున్నానన్నారు. గురువారం ఐఎస్బీ వార్షికోత్సవంలో పాల్గొనడానికి వచ్చిన ప్రధాని మోదీ.. బేగంపేట విమానాశ్రయం వద్ద రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. తన ప్రసంగంలో ఎక్కడా సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం పేర్లు ఎత్తకుండానే కుటుంబ పాలన, కుటుంబ పార్టీలు అంటూ పదేపదే వ్యాఖ్యానించారు. పలు అంశాలపై మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. కుటుంబ పాలకులే దేశద్రోహులు.. కుటుంబ పాలన చేసేవారే దేశ ద్రోహులు. ఇలాంటి పాలన దేశ ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం. దేశంలో కుటుంబ పాలన ముగిసిన రాష్ట్రాల్లోనే అభివృద్ధి జరుగుతోంది. తెలంగాణ మాత్రం ఒక కుటుంబం చేతుల్లో దోపిడీకి గురవుతోంది. తెలంగాణలో కుటుంబ పాలన అంతా అవినీతి మయం. కుటుంబ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కలగాలి. 2023లో విముక్తి కలుగుతుందనే నమ్మకం నాకుంది. తెలంగాణను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనేది మా ఆకాంక్ష. తెలంగాణ అభివృద్ధి కోసం ఎంతటి పోరాటమైనా చేస్తాం. ఇక్కడ సామ, దాన, భేద, దండోపాయాలు ఉపయోగించి తెలంగాణను తమ చెప్పు చేతల్లో ఉంచుకునే కుట్రకు కుటుంబ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఏమి చేసినా ప్రజల హృదయాల నుంచి మాపై ప్రేమాభిమానాలను, మా పేరును మీరు తుడిచి వేయలేరు. రాష్ట్రాన్ని సాంకేతికంగా అభివృద్ధి చేయాలి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాల సాధనను సంకల్పంగా తీసుకుని మనమంతా ముందుకు సాగాలి. తెలంగాణలో సంతుష్టీకరణ రాజకీయాలు సాగుతున్నాయి. దానికి భిన్నంగా ఈ రాష్ట్రాన్ని సాంకేతికంగా అభివృద్ధి చేయాల్సి ఉంది. తెలంగాణను పురోభివృద్ధి విషయంలో ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలనేది మా ఆకాంక్ష. దేశ ప్రజల కలలు సాకారం అవుతున్నాయ్ భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా పురోగమిస్తోంది. ఎనిమిదేళ్లలో వేల స్టార్టప్‌లను ప్రోత్సహించాం. ప్రపంచంలోనే మూడో స్టార్టప్ ఎకోసిస్టమ్‌గా భారత్ ఉద్భవించింది. వంద యూనికార్న్ కంపెనీలు ఏర్పడ్డాయి. ఈ పురోగతిలో టెక్నాలజీ పాత్ర ముఖ్యమైనది. ఇందులో తెలంగాణ యువత, సాంకేతిక నిపుణుల నైపుణ్యం మరువలేనిది. కేంద్ర పథకాలతో దేశంలో కోట్లాది మంది ప్రజల కలలు సాకారం అవుతున్నాయి. బీజేపీ కార్యకర్తలు తగ్గేవాళ్లు కాదు..నెగ్గేవాళ్లు నేను శాస్త్ర, సాంకేతికతలను నమ్ముతాను, అంధ విశ్వాసాలను నమ్మను. 21వ శతాబ్దంలోనూ తెలంగాణలో అంధవిశ్వాసాలున్న వారున్నారు. వారితో తెలంగాణకు ప్రయోజనం కలగదు. వీరు తెలంగాణకు న్యాయం చేయలేరు. గుజరాత్ సీఎంగా ఉన్నపుడు కొన్ని ప్రాంతాలకు వెళితే పదవి పోతుందన్నారు. నేను ఢంకా భజాయించి మరీ పదేపదే ఆ ప్రదేశాలకు వెళ్లివచ్చాను. మేం పారిపోయే వాళ్లం కాదు.. పోరాడే వాళ్లం. బీజేపీ కార్యకర్తలు తగ్గే వాళ్లు కాదు, నెగ్గే వాళ్లు. తెలంగాణలో కొత్త చరిత్ర సృష్టించాలి ప్రధాని మొదట తెలుగులో మాట్లాడుతూ.. ‘పట్టుదలకు, ధృఢ సంకల్పానికి, పౌరుషానికి మారు పేరైన తెలంగాణ ప్రజలకు నమస్కారాలు..’ అంటూ సభికులకు అభివాదం చేశారు. ‘నేను ఎప్పుడు తెలంగాణకు వచ్చినా అపూర్వ స్వాగతం పలికారు. ఇప్పుడు కూడా ఇంత పెద్దెత్తున అపూర్వమైన రీతిలో స్వాగతించారు. ప్రజలు, కార్యకర్తలు చూపుతున్న ప్రేమ, ఆదరాభిమానాలకు, స్నేహానికి కృతజ్ఞతలు. 2013లో నేను ప్రధానిని కాదు. అయినా అప్పుడు హైదరాబాద్‌లో నా సభ జరిగితే దానికి టికెట్టు కొనుగోలు చేసి మరీ నా ప్రసంగం వినడానికి వచ్చారు. ఇదొక అద్భుతం. ఇది యావత్ దేశంలో పరివర్తనకు కారణమైంది. నా జీవితంలో అదొక టర్నింగ్ పాయింట్. దేశ ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగింది. ఈ విధంగా తెలంగాణకు, హైదరాబాద్‌కు తనదైన చరిత్ర ఉంది. ఇప్పుడు తెలంగాణలో కొత్త చరిత్ర సృష్టించాలి. బీజేపీని అధికారంలోకి తీసుకురావడం ద్వారా జెండా నాటాలి. గవర్నర్, తలసాని స్వాగతం విమానాశ్రయంలో మోదీకి గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, బీజేపీ అధ్య క్షుడు, ఎంపీ బండి సంజయ్, సీఎస్ సోమేశ్కు మార్, డీజీపీ మహేందర్‌రెడ్డి స్వాగతం పలికారు. సంజయ్ ఇంకా పోరాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను పలుకరించిన మోదీ.. ‘పాదయాత్ర ఎలా సాగుతోంది? ఆరోగ్యం ఎలా ఉంది ?’ అంటూ ప్రశ్నిం చారు. ‘ఇంకా పోరాడు..’ అని అన్నారు. సభా వేదికపై మూడువరసల్లో బీజేపీ ముఖ్య నేతలంతా ఆసీనులయ్యారు. స్వాగత కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన మంత్రి తలసాని వీడ్కోలు సందర్భంగా కనబడలేదు. -
నమో హైదరాబాద్.. మోదీ పర్యటన కొనసాగిందిలా..
PM Hyderabad Visit Live Updates: 03:20PM ► మోదీ హెలికాప్టర్‌కు ఏవియేషన్ అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో రోడ్డు మార్గంలో ప్రధాని బేగంపేటకు వెళ్లారు. బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై వెళ్లనున్నారు. 02:40PM ఐఎస్బీ 20వ వార్షికోత్సవంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్ధేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తున్నారు. ఐఎస్బీ తన ప్రయాణంలో కీలక మైలురాయికి చేరిందన్నారు. 2001 లో వాజ్‌పేయ్ ఐఎస్బీని ప్రారంభించారని తెలిపారు.ఎంతోమంది కృషి వల్లే ఐఎస్బీ ఈ స్థాయికి చేరిందన్నారు. ఆసియాలో టాప్ బిజినెస్ స్కూల్‌గా ఐఎస్బీ ఎదిగిందన్నారు. ఐఎస్బీ విద్యార్థులు అనేక స్టార్టప్లుప్రారంభించారని పేర్కొన్నారు. 02:12PM ఐఎస్బీకి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ. ఐఎస్బీ వార్షికోత్సవంలో పాల్గొననున్న మోదీ. ► కాసేపట్లో ఐఎస్బీకి చేరుకోనున్న ప్రధాని మోదీ. 01:35PM ఎయిర్‌పోర్ట్‌లో ఏర్పాటు చేసిన సభా వేదికలో ప్రధాని మోదీ ప్రసంగం సుమారు 30 నిమిషాలపాటు సాగింది. ఈ ప్రసంగంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేసి మాట్లాడారు ప్రధాని మోదీ. 01:06PM ► ఇంత ఎండలో చెమటలు కారుస్తూ వచ్చిన కార్యకర్తలకు కృతజ్ఞతలు. మీ ప్రేమే నా బలం. తెలంగాణకు ఎప్పుడొచ్చినా మీ రుణం పెరిగిపోతోంది అనిపిస్తోంది: ప్రధాని మోదీ. ప్రధాని ప్రసంగంలోని కొన్ని ముఖ్యాంశాలు.. బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర ఈ స్వాగతాన్ని చూశాక బీజేపీ పోరాటం ఫలితాన్నిస్తోందని అర్థమవుతోంది. ఇక తెలంగాణలో బీజేపీ విజయం ఖాయమని తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం. తెలంగాణలో మార్పు తథ్యం. ఒక్క కుటుంబం తెలంగాణ అభివృద్ధిని అణిచివేయాలని చూస్తోంది. కుటుంబ పార్టీలు దేశ ప్రజాస్వామ్యానికే ప్రమాదం. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడాలి. ఒక్క కుటుంబం సంక్షేమం కోసమే కొన్ని పార్టీలు పని చేస్తున్నాయి. ► పట్టుదలకు, పౌరుషానికి మారుపేరైన తెలంగాణ ప్రజలకు నమస్కారం: ప్రధాని మోదీ 01:05PM ►తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రంసంగంతో మొదలైన సమావేశం.. అనంతరం ప్రధాని మోదీ ప్రసంగం 01.04PM ►గురువారం మధ్యాహ్నాం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ప్రధాని మోదీ.. ఎయిర్‌పోర్ట్‌లో ఏర్పాటు చేసిన సభా వేదికకు చేరుకున్నారు. ముందుగా బీజేపీ నేతలతో ఆయన సమావేశం కానున్నారు. ఇందుకోసం పార్టీ శ్రేణులు బేగంపేట్ చేరుకుని.. భారత్ మాతాకీ జై నినాదాలతో హోరెత్తిస్తున్నాయి. 12:57PM ►భారత ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఐఎస్బీ వార్షికోత్సవం, స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు గురువారం ప్రధాని మోదీ నగరానికి వచ్చారు. -
క్వాడ్ నేతల మూడో శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న ప్రధాని మోదీ
-
పీఎం మోదీ హైదరాబాద్ పర్యటన.. సోషల్ మీడియా జల్లెడ!
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ నగర పర్యటన Modi Hyderabad Tour నేపథ్యలో భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 26న గచ్చిబౌలిలోని ఐఎస్బీ(ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్) 20వ స్నాతకోత్సవంలో ప్రధాని పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో.. ప్రధాని మోదీ టూర్ కోసం స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ) రంగంలోకి దిగింది. ఐఎస్బీ క్యాంపస్‌ను ఇప్పటికే తమ అధీనంలోకి తీసుకున్న ఎస్పీజీ.. పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. ఇక ఈ స్నాతకోత్సవ కార్యక్రమంలో.. మొత్తం 930 మంది విద్యార్థులు పాల్గొననున్నారు. వీళ్లలో మొహాలీ క్యాంపస్ కు చెందిన 330 విద్యార్థులు కూడా ఉన్నారు. దీంతో మొత్తం 930 మంది సోషల్ మీడియా అకౌంట్స్‌ను జల్లెడపడుతున్నారు అధికారులు. ప్రధానికి వ్యతిరేకంగా పోస్టులు ఉన్నాయా? అని వాళ్ల అకౌంట్లను పరిశీలిస్తున్నారు. విద్యార్థుల బ్యాక్ గ్రౌండ్ ను చెక్ చేస్తున్న ఎస్పీజి అధికారులు.. అంతా క్లియర్‌గా ఉంటేనే పాస్‌లతో అనుమతించాలని భావిస్తున్నారు. -
క్వాడ్.. మంచి కోసం ఓ శక్తి: ప్రధాని మోదీ
టోక్యో: క్వాడ్ సభ్య దేశాల పరస్పర విశ్వాసం, సంకల్పం ప్రజాస్వామ్య శక్తులకు కొత్త శక్తిని మరియు ఉత్సాహాన్ని ఇస్తోందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. క్వాడ్ అనేది మంచి కోసం పుట్టుకొచ్చిన ఒక శక్తి అని, అది ఇండో-పసిఫిక్‌ను మెరుగుపరుస్తుందని అభివర్ణించారు. మంగళవారం టోక్యో వేదికగా క్వాడ్ నేతల సమావేశం జరిగింది. భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా, ఆస్ట్రేలియా నూతన ప్రధాని ఆంటోనీ అల్బనీస్ ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగిస్తూ.. క్వాడ్ సభ్య దేశాల పరస్పర విశ్వాసం, సంకల్పం ప్రజాస్వామ్య శక్తులకు కొత్త శక్తిని మరియు ఉత్సాహాన్ని ఇస్తోందని అన్నారు. క్వాడ్ తక్కువ వ్యవధిలో ముఖ్యమైన స్థానాన్ని సంపాదించుకుందని, ఇండో-పసిఫిక్‌లో శాంతిని నిర్ధారించిందని పేర్కొన్నారు. ముఖ్యంగా కరోనా కష్టకాలంలో సభ్యదేశాల మధ్య.. వ్యాక్సిన్ పంపిణీ, క్లైమేట్ యాక్షన్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఆర్థిక తోడ్పాటుతో పరస్పర సహకారం మరింతగా వృద్ధి చెందిందని మోదీ పేర్కొన్నారు. అంతేకాదు.. ప్రమాణం చేసిన కొన్ని గంటలకే క్వాడ్ సదస్సుకు హాజరైన ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్‌ను ప్రధాని మోదీ ప్రత్యేకంగా అభినందించారు. సదస్సుకు ముందు.. బైడెన్, కిషిదా, అల్బనీస్‌లతో విడివిడిగా భేటీ అయ్యి ద్వైపాకక్షిక సంబంధాల గురించి చర్చించారు ప్రధాని మోదీ. మార్చి 2021లో వర్చువల్‌గా క్వాడ్ నేతల మధ్య భేటీ జరగ్గా.. సెప్టెంబర్ 2021 వాషింగ్టన్ డీసీలో ఇన్ పర్సన్, మార్చి 2022లో వర్చువల్ మీటింగ్ జరగ్గా.. ఇప్పుడు టోక్యో వేదికగా జరుగుతున్న సమావేశం నాలుగవది. -
జపాన్‌లో ప్రధాని మోదీ: పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా..
Narendra Modi Japan Tour: భారతదేశాన్ని ఆధునికీరించే సంస్కరణలను ప్రధాని మోదీ తీసుకువస్తున్నారు. పిఎం మోదీ స్వయం-విశ్వాస దీక్షకు జపాన్ కంపెనీలు గట్టిగా మద్దతు ఇస్తున్నాయి అని సుజుకీ మోటర్ కార్పొరేషన్ చైర్మన్, ప్రెసిడెంట్ తోషిహిరో సుజుకీ పేర్కొన్నారు. క్వాడ్ సదస్సు, ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా.. భారత ప్రధాని నరేంద్ర మోదీ జపాన్‌లో బిజీబిజీగా గడుపుతున్నారు. భారత కాలమానం ప్రకారం.. సోమవారం ఉదయం నుంచి వరుసభేటీలు అవుతున్నారు. ముందుగా నోబుహిరో ఎండోతో భేటీ అయ్యారు ప్రధాని మోదీ. జపానీస్ మల్టీనేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రిక్ దిగ్గజం ఎన్ఈసీ కార్పొరేషన్‌కు హెడ్ ఆయన. భారతదేశ సంస్కరణల పథాన్ని హైలైట్ చేస్తూ.. డిజిటల్ లెర్నింగ్, ఫిన్‌టెక్, ఇన్ఫ్రా మరియు లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌ల వంటి రంగాలలో అవకాశాల గురించి ఆయన మాట్లాడారు అంటూ ప్రధాని కార్యాలయం ట్విటర్ హ్యాండిల్ వివరాలను పోస్ట్ చేసింది. అదే విధంగా భారత్‌లో టెలికమ్యూనికేషన్ సెక్టార్లో ఎన్ఈసీ అందిస్తున్న సేవలకు.. ప్రత్యేకించి చెన్నై-అండమాన్ నికొబార్‌లో, కొచ్చి-లక్షద్వీప్ ప్రాజెక్టులపై ప్రధాని మోదీ ప్రశంసలు గుప్పించారు. "PM Narendra Modi met Chairman of NEC Corporation Dr. Nobuhiro Endo in Tokyo. Appreciated NEC’s role in India’s telecommunication sector and discussed opportunities in new and emerging technologies in India," tweets MEA Spokesperson Arindam Bagchi. pic.twitter.com/9D3DmMeQvC — ANI (@ANI) May 23, 2022 యునిక్లో చైర్మన్.. సీఈవో తడాషి యానైతోనూ మోదీ భేటీ అయ్యారు. టెక్స్టైల్స్ తయారీ కేంద్రంగా, ప్రత్యేకించి టెక్స్టైల్ తయారీలో సాంకేతికతలను ఉపయోగించుకునే దిశగా భారతదేశ ప్రయాణంలో మెరుగైన భాగస్వామ్యాన్ని ప్రధాని మోదీ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. దానికి యునిక్లో సానుకూలంగా స్పందించింది. PM Modi interacts with Tadashi Yanai, Chairman, President and CEO of UNIQLO in Tokyo "Mr. Yanai appreciated the entrepreneurial zeal of the people of India. PM Modi asked Mr. Yanai to take part in the PM-Mitra scheme aimed at further strengthening the textiles sector," says PMO. pic.twitter.com/Xelu0qVN47 — ANI (@ANI) May 23, 2022 భారతదేశంలో ఉత్పత్తి & రిటైల్ పరిశ్రమలో ఎలా పెట్టుబడి పెట్టాలనే దాని గురించి మేము చర్చించాం. ప్లాంట్ నుండి డిజైన్ నుండి ఫాబ్రిక్ వరకు ఎండ్-టు-ఎండ్ ఉత్పత్తులపై దృష్టి సారించగలం. భారతదేశంలో భారత ఐటీ ప్రతిభ అద్భుతమైనది. కాబట్టి, సానుకూలంగానే మేం ప్రధాని మోదీకి సమ్మతిని తెలిపాం అని యునిక్లో చైర్మన్.. సీఈవో తడాషి యానై వెల్లడించారు. Tokyo | PM Modi is bringing reforms which are changing India into a modern landscape. The self-reliance initiative of PM Modi is being strongly supported by Japanese companies: Toshihiro Suzuki, Chairman & President, Suzuki Motor Corp pic.twitter.com/OK190xenHh — ANI (@ANI) May 23, 2022 #WATCH Prime Minister Narendra Modi meets Osamu Suzuki, Adviser, Suzuki Motor Corporation in Tokyo pic.twitter.com/kJsgkA0Eun — ANI (@ANI) May 23, 2022 -
పెట్రో ధరల తగ్గింపుపై ప్రధాని మోదీ స్పందన
న్యూఢిల్లీ: దేశంలో చాలా కాలం తర్వాత తొలిసారి పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం శనివారం సాయంత్రం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 మేర ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వరుస ట్వీట్లు చేశారు. దీంతో పెట్రోల్‌పై రూ.9.50, డీజిల్‌పై రూ.7 మేర తగ్గుతుందని ఆమె ప్రకటించారు. అయితే ఈ ప్రకటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కాసేపటి క్రితం ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రజల ప్రయోజనాలే తమకు తొలి ప్రాధాన్యమంటూ ఆయన సదరు ట్వీట్లో వ్యాఖ్యానించారు. శనివారం తీసుకున్న కీలక నిర్ణయాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గేలా తీసుకున్న నిర్ణయంతో పలు రంగాలకు సానుకూల ప్రభావం లభించనుందని మోదీ అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయంతో దేశ ప్రజలకు ఊరట లభించనుందని, వారి జీవితాలను మరింత సులభతరం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు తన ట్వీట్‌కు నిర్మలా సీతారామన్ పెట్రో ధరలను తగ్గిస్తూ చేసిన ట్వీట్‌ను ఆయన జత చేశారు. It is always people first for us! Today’s decisions, especially the one relating to a significant drop in petrol and diesel prices will positively impact various sectors, provide relief to our citizens and further ‘Ease of Living.’ https://t.co/n0y5kiiJOh — Narendra Modi (@narendramodi) May 21, 2022 Ujjwala Yojana has helped crores of Indians, especially women. Today’s decision on Ujjwala subsidy will greatly ease family budgets. https://t.co/tHNKmoinHH — Narendra Modi (@narendramodi) May 21, 2022 -
రెండుసార్లు ప్రధాని అయ్యారు.. చాలదా అన్నారాయన!
న్యూఢిల్లీ: దేశ ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వితంతువులు, వృద్ధులు & నిరుపేద పౌరుల కోసం గుజరాత్ ప్రభుత్వం ఆర్థిక సహాయ పథకాల లబ్ధిదారులను ఉద్దేశించి ప్రధాని మోదీ వీడియో లింక్ ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా.. రెండుసార్లు ప్రధాని అయ్యింది చాలదా? అంటూ ఓ విపక్ష నేత చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకున్నారాయన. ‘‘ఒక రోజు చాలా పెద్ద నాయకుడు నన్ను కలిశాడు. ఆయన రాజకీయంగా మా సిద్ధాంతాల్ని వ్యతిరేకించే వ్యక్తి. అయినా నేను ఆయన్ని గౌరవిస్తా. అయితే ఆ టైంలో జరిగిన కొన్ని పరిణామాలపై ఆయన సంతోషంగా లేరు. అందుకే అతను నన్ను కలవడానికి వచ్చారు. మోదీ జీ.. ఈ దేశం మిమ్మల్ని రెండుసార్లు ప్రధానమంత్రిని చేసింది. ఇప్పుడు మీకు ఇంతకంటే ఏమి కావాలి. ఇక చాలాదా? అన్నారు. అంటే.. ఒక వ్యక్తి రెండుసార్లు ప్రధాని అయితే.. అతను ప్రతిదీ సాధించినట్లేనని ఆయన అభిప్రాయపడ్డారు.. కానీ, మోదీజీ అందరిలా కాదని ఆయనకు తెలియదు. నన్ను తయారు చేసింది గుజరాత్ గడ్డ. అందుకే ఏం జరిగితే అది జరుగుతుందని, ఇక విశ్రాంతి తీసుకుందాం అని అనుకునే రకం కాదు నేను. నా కల.. సంక్షేమ పథకాలను నూటికి నూరు శాతం అందించడమే. అప్పటిదాకా నెమ్మదించే ఉద్దేశం నాకు లేద’’ని అని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఆ నేత ఎవరన్నది నేరుగా చెప్పకపోయినా.. శివ సేన ఎంపీ సంజయ్ రౌత్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కుటుంబ సభ్యులపై కేంద్ర సంస్థల చర్యలను ఖండిస్తూ శరద్ పవార్ గతంలో ప్రధాని మోదీని కలిసిన విషయం అందరికీ తెలుసు. -
మాక్రాన్‌తో మోదీ భేటీ
పారిస్: ప్రస్తుత ప్రపంచ పరిణామాలు, ఇండో–ఫ్రాన్స్ ద్వైపాక్షిక సంబంధాలపై ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మానియేల్ మాక్రాన్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ విస్తృత చర్చలు జరిపారు. ప్రపంచశాంతి కోసం ఇరుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే ప్రణాళికలపై ఇరువురు నేతలు అంగీకారానికి వచ్చారు. డెన్మార్క్ పర్యటన అనంతరం మోదీ ఫ్రాన్స్ స్వల్పకాలిక పర్యటనకు వచ్చారు. పారిస్‌లోని ఎలైసీ పాలస్‌లో మాక్రాన్‌తో విస్తృత చర్చలు జరిపారని విదేశాంగ శాఖ తెలిపింది. మాక్రాన్‌ను కలవడం సంతోషాన్నిచ్చిందని, ఇండియా, ఫ్రాన్స్‌లు పలు రంగాల్లో కీలక భాగస్వాములని మోదీ ట్వీట్ చేశారు. వివిధ అంతర్జాతీయ సంక్షోభాలు, ఇరుదేశాల మధ్య భాగస్వామ్యం, భారత్ కీలక పాత్ర పోషించే ఎఫ్‌ఏఆర్‌ఎం కార్యక్రమంపై మోదీతో చర్చించానని మాక్రాన్ ట్వీట్ చేశారు. వీలైనంత త్వరలో భారత పర్యటనకు రావాలని మాక్రాన్‌ను మోదీ ఆహ్వానించారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతిస్థాపనకు రెండుదేశాలు కీలక భాగస్వామ్యం కొనసాగిస్తున్నాయని, ఈ ప్రాంతం స్వేచ్ఛగా ఉండాలన్నది ఇరుదేశాల ఆకాంక్షని ఉమ్మడి ప్రకటన తెలిపింది. పరోక్షంగా ఈ ప్రాంతంపై చైనా పెత్తనాన్ని ప్రస్తావించింది. ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న సంక్షోభంపై ఇరువురు నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ యుద్ధంలో పౌర మరణాలను ఇరువురూ ఖండించారు. వెంటనే ఇరుపక్షాలు కాల్పుల విరమణ పాటించాలని, చర్చలు ఆరంభించాలని విజ్ఞప్తి చేశారు. ఐరాస నిబంధనలను అందరూ గౌరవించాలని కోరారు. శీతోష్ణస్థితి మార్పుపై ఉమ్మడి పోరాటం శీతోష్ణస్థితి మార్పును గతంలో కన్నా బలంగా ఎదుర్కోవాలని ఇండియా, ఫ్రాన్స్ నిర్ణయించాయి. పర్యావరణహిత సాంకేతికతలను పెంపొందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మాక్రాన్, మోదీ చర్చలు జరిపారు. అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్ఏ) లక్ష్యాలకు తమ మద్దతు ప్రకటించారు. జాతీయ హైడ్రోజన్ మిషన్‌లో పాలుపంచుకోమని ఫ్రాన్స్‌ను భారత్ ఆహ్వానించింది. PM @narendramodi and President @EmmanuelMacron meet in Paris. This meeting will add momentum to the 🇮🇳 🇫🇷 friendship. pic.twitter.com/bblaQf96F8 — PMO India (@PMOIndia) May 4, 2022 -
PM Modi Europe Visit: జర్మనీ చేరుకున్న ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: యూరప్ దేశాల పర్యటనలో భాగంగా భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జర్మనీ చేరుకున్నారు. భారత కాలమానం ప్రకారం.. సోమవారం ఉదయం ఆయన బెర్లిన్-బ్రాండెన్‌బర్గ్ ఎయిర్‌పోర్ట్‌లో అడుగుపెట్టారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా ముందుకు జర్మనీ చేరుకున్న ప్రధాని మోదీ.. జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ తో భేటీ అవుతారు. ఆపై ఆరవ ఇండియా జర్మనీ ఇంటర్ గవర్నమెంటల్ కన్సల్టేషన్స్ (ఐజీసీ)లో పాల్గొంటారు. ఐజీసీ ప్రతి రెండేళ్లకొకసారి ఇరు దేశాల మధ్య జరుగుతుంటుంది. రెండు దేశాలకు చెందిన టాప్ సీఈవోలు.. వీరిరువురితో ఇంటెరాక్ట్ అవుతారు. ఇక తన పర్యటనలో భాగంగా.. ప్రధాని మోదీ మంగళవారం డెన్మార్క్‌లో, బుధవారం ఫ్రాన్స్‌లో పర్యటిస్తారు. ఈమధ్యే కొత్తగా ఫ్రాన్స్‌కు తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికైన ఎమ్మాన్యుయెల్ మాక్రోన్‌కు పీఎం మోదీ శుభాకాంక్షలు తెలియజేసి.. భేటీ అవ్వనున్నారు. PM Modi gets a warm welcome from the Indian diaspora in Berlin He will hold his first in-person meeting with the newly appointed German Chancellor Olaf Scholz and co-chair the 6th India-Germany Inter-Governmental Consultations today pic.twitter.com/cs1c6GGMGZ — ANI (@ANI) May 2, 2022 -
దేశానికి ప్రధాని కావాలన్నదే నా డ్రీమ్..
లక్నో: బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు దేశ ప్రధాని కావాలని ఉందన్నారు. రాష్ట్రపతి కావాలనే కాంక్ష తనకు అసలులేదని మాయావతి స్పష్టం చేశారు. అయితే, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ తనపై ప్రతిరోజు పుకార్లు పుట్టిస్తున్నారని మాయావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ ఓట్లను మాయావతి.. బీజేపీకి ఇచ్చేసిందని అఖిలేష్ ఆరోపించారు. అనంతరం మాయావతి రాష్ట్రపతి అవుతుందేమో అంటూ( బీజేపీ ఆమెను క్విడ్ ప్రోకోగా దేశానికి రాష్ట్రపతిని చేస్తుందో లేదో చూడాలి) అఖిలేష్ యాదవ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. దీంతో తాజాగా అఖిలేష్‌కు మాయావతి ఇలా కౌంటర్ ఇచ్చారు. కాగా, గురువారం మాయావతి మాట్లాడుతూ.. తాను అంబేద్కర్, కాన్షీరాం బాటలోనే నడవాలని అనుకుంటున్నట్టు తెలిపారు. దళితులు, అణగారిన వర్గాలు, ముస్లింలు తిరిగి బీఎస్పీకి ప్రాణం పోస్తే, యూపీ సీఎం, ప్రధాని అవుతానని ఆశాభావం వ్యక్తం చేశారు. తాను సుఖవంతమైన జీవితాన్ని కోరుకోవడం లేదంటూ కామెంట్స్ చేశారు. ఇక, ఆమె సన్నిహితురాలు, పార్టీ ప్రధాన కార్యదర్శి ఎస్సీ మిశ్రా, ఆ పార్టీ ఏకైక యూపీ ఎమ్మెల్యే ఉమా శంకర్ సింగ్‌లు సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను ఆయన అధికారిక నివాసంలో కలిసిన తర్వాత మాయావతి ఇలా ప్రకటన చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇది కూడా చదవండి: హిందీ జాతీయ భాష కాదు.. బడాయి వద్దు! -
ప్రధానితో ఎంపీ విజయసాయిరెడ్డి భేటీ
YSRCP MP Meets PM Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని.. వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి గురువారం ఢిల్లీలో కలిశారు. మర్యాపూర్వకంగా సత్కరించిన అనంతరం.. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో చర్చించారాయన. ఈ విషయాన్ని ఎంపీ విజయసాయిరెడ్డి తన ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించారు. అంతేకాదు దేశ చరిత్రలో తొలిసారిగా మన విద్యా రంగానికి బడ్జెట్ గ్రాంట్ రూ. 1 లక్ష కోట్లు వచ్చిందని, దీని అర్థం దేశంలో చాలా కాలంగా ఉన్న మౌలిక సదుపాయాలు, విద్య యొక్క నాణ్యతను పెంచడమే అని విజయసాయిరెడ్డి మరో ట్వీట్ ద్వారా తెలిపారు. Met honourable PM Shri @NarendraModi ji today in Delhi and discussed various issues pertaining to Andhra Pradesh. pic.twitter.com/fobTH656sN — Vijayasai Reddy V (@VSReddy_MP) March 24, 2022 -
ప్రధాని పర్యటనలో భద్రతా వైఫల్యంపై సుప్రీంకోర్టులో విచారణ
-
కేంద్రంలో మోదీ.. యూపీలో యోగి
సాక్షి, న్యూఢిల్లీ: 2024లో కేంద్రంలో నరేంద్ర మోదీని మరోసారి ప్రధానమంత్రిగా చేయాలంటే.. 2022లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని మళ్లీ గెలిపించి, యోగి ఆదిత్యనాథ్‌ను మరోసారి ముఖ్యమంత్రిని చేయాల్సిందేనని హోం మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన యూపీ రాజధాని లక్నోలో పర్యటించారు. ‘మేరా పరివార్–బీజేపీ పరివార్’ పేరిట సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా జరిగిన సభలో ప్రసంగించారు. రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్‌గా మార్చేందుకు మరో ఐదేళ్లు బీజేపీ అధికారంలో ఉండడం అవసరమని చెప్పారు. రాష్ట్రంలో మాఫియాను తరిమికొట్టే అతిపెద్ద పనిని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేశారని ప్రశంసించారు. 1.43 లక్షల మందికి పైగా పోలీసు సిబ్బంది నియామకంలో ఎక్కడా ఎలాంటి అవినీతి జరగలేదని గుర్తుచేశారు. ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌పై అమిత్ షా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కరోనా వ్యాప్తి, వరదల సమయంలో అఖిలేష్ యాదవ్, రాహుల్‌గాంధీ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. 2014లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేశ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారని తెలిపారు. యూపీలో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో 300 సీట్లకు పైగా గెలుచుకోవాలని బీజేపీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. 1.5 కోట్ల నూతన కార్యకర్తలే లక్ష్యం: యోగి ఏక్ భారత్, శ్రేష్ట భారత్ కలను ప్రధాని మోదీ సాకారం చేశారని సీఎం యోగి అన్నారు. మోదీ నాయకత్వంలో దేశంలో కొత్త చైతన్యం వచ్చిందని చెప్పారు. ఇప్పుడు 1.5 కోట్ల మంది కొత్త కార్యకర్తలను తయారు చేసుకోవడమే లక్ష్యమని పేర్కొన్నారు. మోదీ, అమిత్ షా నేతృత్వంలో అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం జరుగుతుండడంపై ప్రజలంతా గర్వపడుతున్నారని తెలిపారు. -
రాజమాత విజయరాజె సింథియా జయంతి ఉత్సవాలు
-
ప్రధాని కోసం కొత్త విమానం
-
వ్యవసాయ బిల్లులపై ప్రధాని ప్రశంసలు
-
స్కిల్ ఇండియా వార్షికోత్సవం
-
బతకాలి.. బతుకు చక్రం సాగాలి
-
ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్
-
మోదీ పిలుపునకు కదిలివచ్చిన యావత్ భారత్
-
కరోనా వైరస్ పై పోరాడే విషయం పై..
-
ప్రధాని మోదీ పిలుపును అందరూ పాటించాలి
-
ప్రధాని నివాసంలో కేంద్ర కేబినెట్ భేటీ
-
కేంద్రం మరిన్ని కీలక నిర్ణయాలు
-
గల్లీ నుంచి ఢిల్లీకి...
సాక్షి వెబ్ ప్రత్యేకం : ‘భాయియోం.. ఔర్ బెహనోం’ అంటూ 2016 నవంబర్ 8 రాత్రి ప్రధానమంత్రి నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ప్రకటించిన నోట్ల రద్దు నిర్ణయం ప్రజల చెవుల్లో మార్మోగుతూనే ఉంది. ఆ మాటే జనం మధ్యన అప్పట్లో మార్మోగింది. భాయియోన్... ఔర్ బెహనోం... తో ఆయనపై అనేక సెటైర్లు మొదలయ్యాయి. ఏ సభలోనైనా ఆయన తన ప్రసంగం మొదలుపెట్టడంతో పాటు ప్రతి పేరా ప్రారంభంలో అన్నట్టు ఈ పదం మధ్యమధ్యలో ఉపయోగిస్తూనే ఉంటారు. ఇలా అనూహ్య నిర్ణయాలు ప్రకటించే ముందే కాదు... తన ఆహార్యంలోనూ మోదీ తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నారు. రాజకీయ రంగంలో కుర్తా పైజమాతో పాటు వాటిపై భిన్న రంగుల జాకెట్లతో ఆయన వేషధారణ మిగిలిన నేతల కంటే భిన్నంగా కనిపిస్తుంది. సంకీర్ణ రాజకీయాలకు స్వస్తి సంకీర్ణ రాజకీయాలను తోసిరాజని 2014 లోక్‌సభ ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీతో సత్తా చాటి ప్రధానమంత్రి పగ్గాలు చేపట్టిన నరేంద్ర దామోదర్‌దాస్ మోదీ 1950 సెప్టెంబర్ 17న ప్రస్తుత గుజరాత్‌లోని వాద్నగర్లో దామోదర్‌దాస్ మూల్‌చంద్ మోది, హీరాబెన్ మోదీకి జన్మించారు. బాల్యంలో వాద్నగర్ రైల్వే స్టేషన్లో తండ్రి నిర్వహించే టీ దుకాణంలో పనిచేసిన మోదీ ఆ తర్వాత బస్ టెర్మినల్‌లో తన సోదరుడి టీ స్టాల్లోనూ పనిచేశారు. 1967లో పాఠశాల విద్యను పూర్తిచేసుకున్న మోదీ ఎనిమిదేళ్ల వయసు నుంచే స్ధానిక ఆరెస్సెస్ శాఖా సమావేశాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 1968లో అత్యంత చిన్నవయసులో యశోదాబెన్‌ను వివాహమాడారు. ఇక 1978లో మోదీ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ నుంచి సార్వత్రిక విద్య ద్వారా పొలిటికల్ సైన్స్‌లో బీఏ పట్టా పొందారు. 1983లో గుజరాత్ యూనివర్సిటీలో దూరవిద్య ద్వారా పొలిటికల్ సైన్స్‌లో ఎంఏ పట్టా పొందారు. ఛాయ్‌వాలా... ఆరెస్సెస్‌లో వివిధ హోదాల్లో పనిచేసిన మోదీ 1985లో బీజేపీలో అడుగుపెట్టారు. 1986లో ఎల్కే అద్వానీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ గుజరాత్ బీజేపీ కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమితులయ్యారు. బీజేపీలో అంచెలంచెలుగా ఎదిగిన మోదీ 1990లో బీజేపీ జాతీయ ఎన్నికల కమిటీ సభ్యుడి స్ధాయికి ఎదిగారు. 1994లో అద్వానీ ప్రోద్బలంతో ఎన్నికల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన మోదీ పార్టీ కార్యదర్శిగా 1995 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయానికి తనదైన వ్యూహాలతో ముందుకెళ్లారు. ఇక గుజరాత్ బీజేపీ నేత శంకర్‌సింగ్ వాఘేలా కాంగ్రెస్‌లోకి ఫిరాయించడంతో పార్టీని కాపాడేందుకు మోదీ చొరవ చూపుతూ 1998లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయానికి బాటలు పరిచారు. గుజరాత్ సీఎంగా.. 2001లో గుజరాత్ సీఎం కేశూభాయ్ పటేల్ అనారోగ్యానికి గురికావడం, అవినీతి ఆరోపణలు చుట్టుముట్టడంతో పటేల్ స్దానంలో మోదీని గుజరాత్ సీఎంగా బీజేపీ అగ్రనేతలు ఎంపిక చేశారు. రాజ్‌కోట్ 2 నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిని ఓడించడం ద్వారా 2002 ఫిబ్రవరి 24న మోదీ గుజరాత్ అసెంబ్లీలోకి ప్రవేశించారు. ఇక 27 ఫిబ్రవరి 2002 గోద్రా అల్లర్లు అనంతరం చెలరేగిన హింసాకాండతో మోదీ అపప్రద మూటగట్టుకున్నారు. గోద్రా అనంతర హింసలో 790 మంది ముస్లింలు, 254 మంది హిందువులు మరణించారని స్వయంగా గుజరాత్ ప్రభుత్వమే వెల్లడించగా, మృతుల సంఖ్య 2000 పైనేని ఇతర సంస్థలు పేర్కొన్నాయి. 2002 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ నేతృత్వంలో బీజేపీ గుజరాత్లో తిరిగి అధికారంలోకి వచ్చింది. ఇక 2007, 2012 అసెంబ్లీ ఎన్నికల్లోనూ గుజరాత్లో బీజేపీని మోదీ గెలిపించుకుని పార్టీలో తిరుగులేని నేతగా ఆవిర్భవించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్ధిగా మోదీ పార్టీని విజయతీరాలకు చేర్చడంలో సఫలీకృతమయ్యారు. మోదీ వారణాసి నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. హాబీలు : యోగాసనాలు, బ్రాండెడ్ వాచీల సేకరణ, ఫోటోగ్రఫీ, సోషల్ మీడియా ఇష్టమైన ఆహారం : వైట్ కట్టా దోక్లా, కిచిడీ, బేసన్ ఖాండ్వి, ఉంధియో -మురళి పులిజాల -
మోదీ.. మరోసారి
న్యూఢిల్లీ : మోదీనే మరోసారి ప్రధానిగా ఉండాలని ఎక్కువ మంది జనాలు కోరుకుంటున్నట్లు ఆన్లైన్ సర్వేలు వెల్లడించాయి. సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు 63 శాతం మంది మోదీనే మరోసారి ప్రధాని కావాలని కోరుకుంటున్నట్లు సదరు సర్వే తెలిపింది. మోదీకి ఇంకో చాన్స్ ఇస్తే భవిష్యత్ బాగుంటుందని 50 శాతం మంది అభిప్రాయ పడినట్లు సదరు సర్వే వెల్లడించింది. ప్రముఖ న్యూస్ పోర్టల్ డైలీ హంట్, డేటా అనాలిటిక్స్ కంపెనీ నీల్సన్ ఇండియాలు ఉమ్మడిగా ఈ ఆన్లైన్ సర్వేను నిర్వహించాయి. ఈ సర్వేలో భాగంగా ఆన్లైన్లో దాదాపు 54 లక్షల మంది అభిప్రాయాలు సేకరించినట్లు తెలిసింది. మన దేశంతో పాటు విదేశాల్లో ఉంటున్న వారు కూడా ఇందులో పాల్గొన్నారని సర్వే నిర్వహకులు తెలిపారు. 2014 ఎన్నికల సమయంలో మోదీపై ఎంత నమ్మకం ఉందో ఇప్పుడు కూడా అంతే నమ్మకముందని 63 శాతం మంది అభిప్రాయపడినట్లు ఈ సర్వే వెల్లడించింది. మోదీ నాలుగేళ్ల పాలన తమకు సంతృప్తినిచ్చినట్లు సర్వేలో పాల్గొన్న వారు వెల్లడించారు. మరి కొద్ది రోజుల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నిలు జరగనున్న నేపథ్యంలో ఈ సర్వేని నిర్వహించారు. కాగా ఈ ఐదు రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ ప్రజలు మోదీపై నమ్మకముంచగా.. తెలంగాణలో మాత్రం మోదీ పట్ల వ్యతిరేకత ప్రదర్శించినట్లు తెలిసింది. సర్వే నిర్వాహకులు మిజోరం గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఈ సర్వేను తప్పుడు సర్వేగా ఆరోపిస్తున్నాయి.మోదీ ప్రభుత్వం ప్రజల నమ్మకం కోల్పోయిందని, ఇలాంటి పనికిరాని సర్వేల వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా విమర్శించారు. -
‘మోదీ విష్ణుమూర్తి 11వ అవతారం’
ముంబై : మహారాష్ట్ర బీజేపీ నాయకులు ప్రధాని నరేంద్ర మోదీని విష్ణుమూర్తి పదకొండో అవతారంగా పేర్కొంటూ చేసిన ట్వీట్‌పై వివాదం చేలరేగుతుంది. మహారాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి అవధూత్ వాఘ్ ‘మన మాన్య ప్రధాన మంత్రి నరేంద్ర మోదీజీ విష్ణు మూర్తి 11వ అవతారం’ అంటూ ట్వీట్ చేశారు. అయితే వాఘ్ చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారింది. బీజేపీ నాయకులు దేవతలను అవమానిస్తున్నారంటూ కాంగ్రెస్ నాయకులు మండి పడుతున్నారు. ఇలాంటి కామెంట్లు బీజేపీ చౌకబారు రాజకీయాలకు ప్రతీకగా వారు ఆరోపిస్తున్నారు. వాఘ్ ఇంజనీరింగ్ గ్రాడ్యూయేట్ అని చెప్పుకుంటూ ఇలాంటి మాటలు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆయన ఇంజనీరింగ్ సర్టిఫికెట్లు సరైనవో కావో చెక్ చేసుకోవాలంటూ కాంగ్రెస్ నాయకులు కామెంట్ చేస్తున్నారు. -
బెస్ట్ పీఎమ్ అవార్డు గోస్ టూ..
న్యూఢిల్లీ : ఇప్పటివరకూ భారత దేశ ప్రధాని పీఠం అధిరోహించినవారిలో నరేంద్ర మోదీనే ఉత్తమ ప్రధాని అంటూ సర్వేలు తేల్చేశాయి. తరువాత స్థానంలో దివంగత మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, అటల్ బిహారీ వాజ్‌పేయిలు ఉన్నారు. అయితే ఈ సర్వేలో స్వతంత్ర భారతావని తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ నాలుగో స్థానానికి పరిమితమయ్యారని ‘ఎమ్‌ఓటీఎన్’(మూడ్ ఆఫ్ ది నేషన్) పోల్ ప్రకటించింది. ఇప్పటి వరకూ దేశ ప్రధాని పదవిని అలంకరించిన వారిలో, ఎవరికి ప్రజల మద్దతు ఎక్కువగా ఉందో తెలుసుకునే ఉద్దేశంతో ప్రముఖ ఆంగ్ల మీడియా సంస్థ ఇండియా టుడే ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ పేరుతో పోల్ నిర్వహించినట్లు సమాచారం. ఈ పోల్‌లో దాదాపు 12,100 మంది పాల్గొన్నారు. వీరిలో 26 శాతం ఓట్లు సాధించి, మోదీ ప్రథమ స్థానంలో ఉన్నారు. ఇందిరా గాంధీ 20 శాతం ఓట్లతో రెండో స్థానంలో ఉండగా, 12 శాతం ఓట్లు సాధించిన అటల్ బిహారీ వాజ్‌పేయి మూడో స్థానంలో ఉన్నారు. జవహర్ లాల్ నెహ్రూ 10 శాతం ఓట్లు సాధించి నాలుగో స్థానంలో ఉన్నారు. మాజీ ప్రధానులు పీవీ నరసింహరావు, హెచ్డీ దేవేగౌడ చివరి స్థానాల్లో ఉన్నారు. అయితే ఈ సర్వేలో మోదీ ప్రథమ స్థానంలో ఉన్నప్పటికి గతంతో పోలిస్తే ఈ సారి ఆయనకు వచ్చిన ఓట్లు తగ్గినట్టు తెలుస్తోంది. గతేడాది(2017) జులైలో నిర్వహించిన ‘ఎమ్‌ఓటీఎన్’ పోల్‌లో మోదీ 33 శాతం ఓట్లు సాధించగా, ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన పోల్‌లో 28 శాతం ఓట్లు సాధించారు. ప్రస్తుతం (జులైలో) నిర్వహించిన పోల్‌లో 26 శాతం ఓట్లు సాధించి ప్రథమ స్థానంలో కొనసాగుతున్నారు. మోదీ ప్రథమ స్థానంలో కొనసాగుతున్నప్పటికి ఆయనకు వస్తున్న ఓట్లు మాత్రం తగ్గుతున్నట్లు సమాచారం. అయితే మోదీకి ఓటు వేసిన వారిలో ఎక్కువగా హిందూవులే ఉండటం గమనార్హం. దాదాపు 28 శాతం హిందూ ఓటర్లు మోదీకి మద్దతుగా ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఇందిరా గాంధీకి ముస్లిం ఓటర్ల మద్దతు ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. దాదాపు 26 శాతం మంది ముస్లింలు ఇందిరకు మద్దతు ఇవ్వగా, మోదీకి కేవలం 11 శాతం ముస్లింలు మాత్రమే ఓటు వేసినట్లు సమాచరం. ఉత్తర, తూర్పు భారతదేశంలో మోదీకి ఎక్కువ మంది మద్దతుదారులు ఉండగా.. ఇందిరకు పశ్చిమం, దక్షిణ భారతంలో ఎక్కువ మంది మద్దతు దారులు ఉన్నారు. ఇక అటల్ బీహార్ వాజ్‌పేయి అన్ని దిశల వారి మద్దతుతో మూడో స్థానంలో ఉన్నారు. -
పీటీఐ ప్రధాని అభ్యర్థిగా ఇమ్రాన్ ఖాన్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ (పీటీఐ) పార్లమెంటరీ కమిటీ ఇమ్రాన్ ఖాన్‌ను తమ పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించింది. పాక్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో పీటీఐ అత్యధిక సీట్లు గెల్చుకోవడం తెల్సిందే. పీటీఐ పార్లమెంటరీ కమిటీ ఇస్లామాబాద్‌లో సోమవారం సమావేశమైంది. పార్టీ పార్లమెంటరీ లీడర్‌గా ఇమ్రాన్‌ను పీటీఐ‡ నేత ఖురేషీ ప్రతిపాదించగా.. మిగిలిన సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని సమావేశంలో ధీమా వ్యక్తం చేశారు. తనను ప్రధాని అభ్యర్థిగా ఎన్నుకున్న సభ్యులందరికీ ఇమ్రాన్ కృతజ్ఞతలు తెలిపారు. ఆయన ప్రమాణ స్వీకార తేదీ వెల్లడి కాకపోయినా.. పాక్ స్వాతంత్య్ర దినోత్సవమైన ఆగస్టు 14వ తేదీన ప్రమాణం చేసే అవకాశాలున్నట్లు సమాచారం. పాక్ జాతీయ అసెంబ్లీలో మొత్తం 342 మంది సభ్యులుండగా, అందులో 272 మందిని నేరుగా ఎన్నుకుంటారు. అధికారంలోకి రావాలంటే ఏదైనా పార్టీ కనీసం 172 సీట్లు గెలవాలి. 116 సీట్లతో పీటీఐ అతిపెద్ద పార్టీగా అవతరించింది. తమకు 174 మంది సభ్యుల మద్దతు ఉందని పీటీఐ తెలిపింది. -
మమతకు మద్దతు
న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి ప్రధాని అభ్యర్థిగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మద్దతిచ్చేందుకు తమకు అభ్యంతరమేమీ లేదని మాజీ ప్రధాన మంత్రి, జేడీఎస్ జాతీయాధ్యక్షుడు దేవెగౌడ స్పష్టం చేశారు. ఢిల్లీలో పీటీఐకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేయడంలో కాంగ్రెస్ కీలకంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. ‘ప్రధాని అభ్యర్థిగా విపక్షాలు మమతా బెనర్జీని ఎన్నుకోవడాన్ని మేం పూర్తిగా స్వాగతిస్తాం. ఇందిరాగాంధీ 17 ఏళ్ల పాటు దేశాన్ని పాలించారు. ఎప్పుడూ మగవాళ్లే ప్రధానులుగా ఉండాలా? మమత లేదా మాయావతి (బీఎస్పీ అధ్యక్షురాలు) ఎందుకు కాకూడదు?’ అని దేవెగౌడ ప్రశ్నించారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మైనారిటీలు అభద్రతా భావంతో ఉన్నారనీ, దేశంలో భయానక వాతావరణం ఉందని ఆరోపించారు. 2019లో బీజేపీని ఓడించాలంటే ఓ బలమైన కూటమి ఉండాల్సిందేనన్నారు. సాధారణ ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్‌తో కలిసే తమ పార్టీ పోటీ చేస్తుందని దేవెగౌడ చెప్పారు. జేడీఎస్ కర్ణాటక అధ్యక్షుడిగా విశ్వనాథ్ జేడీఎస్ కర్ణాటక అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి కుమారస్వామి స్థానంలో హెచ్.విశ్వనాథ్‌ను దేవెగౌడ ఆదివారం నియమించారు. -
విపక్షాల ఉమ్మడి ప్రధాని అభ్యర్థిపై ఊహాగానాలు
-
ప్రధాని అభ్యర్ధి ఎవరో ఇప్పుడే ప్రకటించం
కోల్‌కతా: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఫెడరల్ ఫ్రంట్’ ప్రధాని అభ్యర్ధిగా ఎవరి పేరును ప్రకటించడం లేదని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ముందుగానే చేసే అటువంటి ప్రకటన ప్రాంతీయ పార్టీలున్న తమ కూటమిలో విభేదాలకు బీజం వేస్తుందని, బీజేపీకి వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడాలన్న లక్ష్యాన్ని దెబ్బతీస్తుందని చెప్పారు. శుక్రవారం కోల్‌కతాలో నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ)నేత ఒమర్ అబ్దుల్లాతో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడారు. ‘దేశ క్షేమం కోసం బీజేపీ వ్యతిరేక ప్రాంతీయ పార్టీలన్నీ ఐక్యంగా ఉన్నాయి. ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఒకే అభ్యర్ధిని బరిలోకి దించుతాయి. బీజేపీ నియంత పాలనకు వ్యతిరేకంగా త్యాగాలకు సిద్ధంగా ఉన్నాం’ అని ఒమర్ అన్నారు. -
దీదీనే పీఎం అభ్యర్థి..
సాక్షి, న్యూఢిల్లీ : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీయేతర ఫ్రంట్‌కు పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రధాని అభ్యర్థిగా సారథ్యం వహిస్తారని జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్ధుల్లా సంకేతాలు పంపారు. అబ్దుల్లా శుక్రవారం కోల్‌కతాలో మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. మమతా బెనర్జీ బెంగాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను దేశవ్యాప్తంగా అందించేందుకు ఆమెను జాతీయ రాజకీయాల్లోకి తీసుకువెళతామని దీదీతో భేటీ అనంతరం ఆయన చెప్పారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలపై తాము చర్చించామని, మైనారిటీలు ఎదుర్కొంటున్న భయానక వాతావరణంపై భీతిల్లామన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్, తృణమూల్ వైఖరుల్లో ఎలాంటి వైరుధ్యం లేదని అన్నారు. బీజేపీని వ్యతిరేకించే వారంతా తమతో చేతులు కలపవచ్చని, ఆ పార్టీని మట్టికరిపించేందుకు తమతో కలిసిరావాలని పిలుపు ఇచ్చారు. మరోవైపు బీజేపీని వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీలన్నీ సమిష్టిగా ప్రజల పక్షాన పోరాడాలని మమతా బెనర్జీ పిలుపు ఇచ్చారు. బీజేపీ పాలన నియంత పోకడలను తలపిస్తోందని ఆరోపించారు. -
పొత్తులకు సై..!
-
2019 ప్రధాని అభ్యర్థి రాహుల్
న్యూఢిల్లీ: 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీని నియమిస్తూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) నిర్ణయం తీసుకుంది. విపక్షపార్టీలతో కలిసి పోటీ చేసినప్పటికీ తమ పార్టీ తరపున రాహులే ప్రధాని అభ్యర్థని స్పష్టం చేసింది. దీంతోపాటుగా వచ్చే ఎన్నికల్లో పొత్తులు నిర్ణయించే విషయంలో సంపూర్ణ అధికారాన్ని రాహుల్‌కే కట్టబెడుతూ ఆదివారం ఢిల్లీలో జరిగిన సీడబ్ల్యూసీ భేటీలో నిర్ణయం తీసుకుంది. అధ్యక్షుడి హోదాలో తొలిసారిగా సీడబ్ల్యూసీనుద్దేశించి రాహుల్ ఆదివారం ప్రసంగించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు దేశంలోని పీడిత, బాధిత జనాలకోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. పూర్తిగా నవీకరించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) పార్టీలోని గత, ప్రస్తుత, భవిష్యత్ తరాలకు వారధిగా నిలవాలన్నారు. అనుభవంతోపాటు పరిగెత్తే శక్తి ఉన్న గొప్ప నాయకుల పార్టీ కాంగ్రెస్ అని పేర్కొన్నారు. కొత్త సీడబ్ల్యూసీ కూడా ఇలాంటి స్ఫూర్తితోనే దూసుకెళ్లాలన్నా రు. బీజేపీ దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలు, మైనారిటీలు, పేదలపై దాడులకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు. రాఫెల్ రహస్య నిబంధనపై.. ఫ్రాన్స్‌తో కుదిరిన వివాదాస్పద రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందంలో కుంభకోణం జరిగిందని రాహుల్ ఆరోపించారు. ‘రాఫెల్ ఒప్పందంలోని రహస్య నిబంధన విషయంలో రక్షణమంత్రి తీరు అనుమానాస్పదంగా ఉంది. ఒకసారి అది రహస్యమని మరోసారి ఇందులో రహస్యమేదీ లేదని ఆమె చెబుతున్నారు. రాఫెల్ ధర ఎంతని అడిగితే.. ప్రధాని తటపటాయిస్తున్నారు. నా కళ్లలోకి కళ్లుపెట్టి చూడలేకున్నారు. ఇదంతా చూస్తుంటే భారీ కుంభకోణమే జరిగినట్లనిపిస్తోంది’ అని రాహుల్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో పొత్తుల విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలకు, దేశ ప్రయోజనాలకు భంగం కలగకుండా నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేలా దేశంలో పాలన సాగుతోందని సోనియా ఘాటైన విమర్శలు చేశారు. సమాజంలో విభేదాలు, భయాందోళనలు సృష్టించేలా మోదీ పాలన సాగుతోందన్నారు. ఈ పోరాటంలో రాహుల్‌కు మద్దతుగా ఉంటామని ఆమె స్పష్టం చేశారు. రాహుల్ నాయకత్వం వహించాలి ఆదివారం నాటి సమావేశంలో మాట్లాడిన 40–50 మంది నేతలంతా.. బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటు అవసరమని నొక్కిచెప్పారు. మరికొందరైతే.. ఈ కూటమికి రాహుల్ గాంధీయే నాయకత్వం వహించాలని కోరారు. దేశంలో విద్వేషపూరిత రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని రాహుల్ పిలుపునిచ్చారని సమావేశ వివరాలను పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా వెల్లడించారు. పశ్చిమబెంగాల్లో 42 సీట్లు గెలుస్తామన్న మమతా బెనర్జీ వ్యాఖ్యలను తుది నిర్ణయంగా భావించనక్కర్లేదన్నారు. రాహుల్ నేతృత్వంలోనే కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికలకు వెళ్తుందని సుర్జేవాలా స్పష్టం చేశారు. దేశంలో సామాజిక సామరస్యం, ఆర్థికాభివృద్ధి పునరుద్ధరణకు దుర్భర ప్రయత్నం చేస్తున్న రాహుల్‌కు కాంగ్రెస్ సీనియర్లంతా అండగా నిలుస్తామని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. గొప్పలు చెప్పుకోవడం, గిమ్మిక్కులు చేసే సంస్కృతికి వ్యతిరేకంగా ఓ బలమైన విధివిధానంతో దేశాభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు రాహుల్‌ను ఆదరించరు: బీజేపీ పార్లమెంటులో ప్రధానిని హత్తుకున్న రాహుల్‌పై బీజేపీ ఎదురుదాడి ప్రారంభించింది. రాహుల్ మోదీని ఆలింగనం చేసుకున్నా ప్రజలు మాత్రం రాహుల్‌ను ఆదరించబోరని విమర్శించింది. సీడబ్ల్యూసీ భేటీని, రాహుల్‌ను ‘కాంగ్రెస్ పనిచేయని కమిటీకి.. పనిచేయని చీఫ్’గా, ఒక కుటుంబాన్ని పొగిడేందుకు ఏర్పాటు చేసిన కాంగ్రెస్ దర్బార్‌గా బీజేపీ నేత సంబిత్ పాత్రా అభివర్ణించారు. దేశం వెనుకబడుతోందన్న సోనియా వ్యాఖ్యలపై తిప్పికొడుతూ.. ‘మీ పాలనలో 10ఏళ్ల పాటు దేశం రివర్స్ గేర్‌లోనే ఉంది. ఇప్పుడు మేం రివర్స్ గేర్ వేశాం’ అని పేర్కొన్నారు. ‘నిరాశలో ఉన్న కాంగ్రెస్ నేతలు కనీసం 150 స్థానాల్లో పోటీ చేయాలని అడిగినట్లు తెలిసింది. వీటితోనే ఆ పార్టీ అధ్యక్షుడు ప్రధాన మంత్రి కావాలని వాళ్ల కోరిక’ అని అన్నారు. -
‘పీఎం, సీఎంలకూ పరిమితి విధించాలి’
భోపాల్: ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి పదవులను ఒకే వ్యక్తి ఎన్ని పర్యాయాలు చేపట్టవచ్చుననే దానిపై పరిమితి విధించాలని కాంగ్రెస్ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా డిమాండ్ చేశారు. అమెరికా వంటి దేశాల్లో ఒకే వ్యక్తి అధ్యక్ష పదవిని రెండుసార్లకు మించి చేపట్టరాదనే నిబంధన ఉంది. శనివారం ఆయన భోపాల్‌లో మీడియాతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రిటైరయ్యే ఉన్నతాధికారుల పదవీకాలం పొడిగిస్తుండటంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రిటైరయ్యే అధికారి, ఆ బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్న వారికి పదవిని అప్పగించి వెళ్లిపోవాలని తెలిపారు. -
‘ప్రధాని ప్రోత్సాహంతోనే ఐఏఎస్‌ల ఆందోళన’
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి ప్రోత్సాహంతోనే ఢిల్లీ ఐఏఎస్‌లు విధులు బహిష్కరించి ఆందోళన చేస్తున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. రాష్ట్ర హక్కులను కేంద్రం హరిస్తుందంటూ కేజ్రీవాల్ నేతృత్వంలో ఆమ్ఆద్మీ పార్టీ నేతలు లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం వద్ద గత ఆరు రోజులుగా నిరసన వ్యక్తం చేస్నున్న సంగతి తెలిసిందే. ఏడో రోజు కూడా తమ నిరసన కొనసాగిస్తున్నారు. ఐఏఎస్‌లు విధులు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని ప్రధానికి లేఖ కూడా రాశారు. గత వారం రోజులు పోరాటం చేస్తున్నా.. ప్రధాని నోరు మెదపడం లేదని విమర్శించారు. అధికారులను పనిచేయవద్దని చెప్పి ప్రధాన మంత్రి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఆదివారం ట్వీట్ చేశారు. ‘ ఢిల్లీ ఐఏఎస్ అధికారులకు పని చేయవద్దని చెప్పి, వారితో ఆందోళన చేయిస్తున్న ప్రధాని చేతుల్లో ప్రజాస్వామ్యం భద్రంగా ఉందా’ అని ట్వీటర్ ద్వారా ప్రశ్నించారు. కాగా కేజ్రీవాల్ ధర్నాకు శనివారం నలుగురు ముఖ్యమంత్రులు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కర్ణాటక సీఎం కుమారస్వామి, కేరళ సీఎం విజయన్ శనివారం రాత్రి 9 గంటలకు ఏపీ భవన్ నుంచి పాదయాత్రగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయానికి వెళ్లారు. -
కార్యకర్తల చెమట చుక్కలతో కమలం వికసిస్తుంది
-
అభివృద్ధి నినాదంతో మేం ప్రజల్లోకి వెళ్తున్నాం