నరేంద్ర మోదీ
సుభాష్‌నగర్(నిజామాబాద్ అర్బన్): ఈనెల 16వ తేదీన ‘పరీక్షల ఒత్తిడిని ఏ విధంగా తగ్గించాలి’ అన్న అంశంపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా దూరదర్శన్ ఛానెళ్లలో విద్యార్థులకు తన సందేశాన్ని ఇవ్వనున్నారని డీఈఓ నాంపల్లి రాజేష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 16న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పాఠశాల, కళాశాల విద్యార్థులను(6వ తరగతి పైబడిన) ఉద్ధేశించి మాట్లాడుతారని పేర్కొన్నారు. ఆలిండియా రేడియో, ఎఫ్‌ఎం ఛానెల్స్, పీఎంఓ, ఎంహెచ్‌ఆర్‌డీ, దూరదర్శన్, యూట్యూబ్ ఛానెల్స్, ఫేస్‌బుక్ లైవ్, స్వయంప్రద చానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతుందన్నారు. కావున జిల్లాలోని అన్ని మండల విద్యాధికారులు, ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్స్, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్స్, రెసిడెన్సియల్ స్కూల్, ప్రయివేటు స్కూల్ యాజమాన్యాలు వారి పాఠశాలల్లో విద్యార్థులు వీక్షించేంందుకు తగిన ఏర్పాట్లు తప్పనిసరిగా చేసుకోవాలని ఆదేశించారు. ఈకార్యక్రమంపై ఆసక్తిగల విద్యార్థిని విద్యార్థులు ఏమైనా ప్రశ్నలు అడగదలుచుకుంటే ఈ కింద పేర్కొన్న వెబ్‌సైట్ www.innovate.mygov.in లో వారి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యాకమిటీ సభ్యులు, వారి తల్లిదండ్రులు కూడా పాల్గొనాలని డీఈఓ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment