నో చీటింగ్.. విద్యార్థులకు మోదీ టిప్స్
పరీక్షలు అనగానే ఒత్తిడిలోకి కూరుకుపోవద్దని, వాటిని పండుగల్లా ఆనందంగా జరుపుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ విద్యార్థులకు ప్రబోధించారు. విద్యార్థులు పరీక్షలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో తన నెలవారీ 'మన్ కీ బాత్' రేడియో కార్యక్రమంలో ప్రధాని మోదీ పరీక్షల గురించి మాట్లాడారు. పరీక్షలను ఎదుర్కొనేందుకు విద్యార్థులకు స్ఫూర్తిదాయకమైన వచనాలను చెప్పారు. వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. కార్యక్రమ ప్రారంభంలో దేశం కోసం ప్రాణాలర్పించిన అమర జవాన్లకు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాని మోదీ.. జమ్ముకశ్మీర్‌లో మంచుచరియలు విరిగిపడి మృతిచెందిన జవాన్లకు నివాళులర్పించారు.
kkkkkkkkkkk
'మన్ కీ బాత్'లో ప్రధాని మోదీ చేసిన టాప్ వ్యాఖ్యలివే..
- ఈ సంవత్సరం మీరు రాసే పరీక్షలు.. మీ జీవితాకాలానికి సంబంధించిన పరీక్ష కాదు. జీవితంలో మీ విజయానికి పరీక్షలు మాత్రమే కొలమానం కాదు.
- పరీక్షలు పండుగల్లాంటివి. పరీక్షలను విద్యార్థులను ఆనందంగా స్వీకరిస్తే.. ఎలాంటి ఒత్తిడి ఉండదు. పరీక్షల సమయంలో తల్లిదండ్రులు ఇంట్లో పండుగ వాతావరణాన్ని ఏర్పరచాలి.
- ఎక్కువ నవ్వండి.. ఎక్కువ మార్కులు తెచ్చుకోండి (స్మైల్ మోర్.. స్కోర్ మోర్)
- మీరు ప్రశాంతంగా ఉంటే జ్ఞాపకశక్తి అధికంగా ఉంటుంది. జ్ఞాపకశక్తికి ప్రశాంతతే మంచి టానిక్
- ఇతరులతో కన్నా మీతో మీరు పోటీపడండి. ఇది మీకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది.
- సచిన్ టెండూల్కర్‌ను చూడండి. గత 20 ఏళ్లుగా ఆయన ప్రతిసారి మెరుగవుతూ తన రికార్డులను తానే బద్దలుకొట్టాడు.
- ఆత్మవిశ్వాసం లేకపోవడం వల్లే దొడ్డిదారులు, చీటింగ్ వంటి వాటికి పాల్పడతారు. కొందరు విద్యార్థులు తమ సమయమంతా చీటింగ్ చేయడానికి వెచ్చిస్తారు. దానికన్నా వారు చదువు మీద దృష్టి పెడితే బాగుంటుంది.
- చీటింగ్‌ను అలవాటుగా మార్చుకుంటే నేర్చుకోవాలన్న తపన తగ్గిపోతుంది.
-
మాజీ అధ్యక్షుడు అబ్దుల్ కలాం సైనిక బలగాల్లో చేరాలనుకున్నారు. కానీ చేరలేకపోయారు. అది తనకు ఆటంకం అనుకొని ఉంటే.. దేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయేది.