ప్రధానికి లేఖ రాసింది .. చివరికి సాధించింది.
ముంబై: ఒలింపిక్స్ లో భారతదేశం పతకాలు సాధించాలంటే ప్రతీ పాఠశాలలో ఆట స్థలం ఉండాలి. పిల్లలకు స్కూలు నుంచే ఆ శిక్షణ లభించాలని ముంబైకి చెందిన ఓ విద్యార్థిని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాసింది. దయచేసి మాకు ప్లే గ్రౌండ్ కేటాయించండని పీఎంఓ కార్యాలయానికి విన్నవించింది. సాక్షి తివారీ నవీ ముంబై శివారులోని ప్రభుత్వ పాఠశాలలో 9 వ తరగతి చదువుతోంది.
నరేంద్రమోదీ 'మన్ కీ బాత్' లోమాట్లాడుతూ.. ప్రజలు తమ సమస్యలను రాసి తనకు పప్పించాలని చెప్పడం విన్న ఆమె ఒలింపిక్ లో పతకం సాధించాలనే తన ఆశయాన్ని వివరిస్తూ పీఎంఓకి లెటర్ రాసింది. పీఎంఓ కార్యాలయం ఆమె లేఖకు స్పందిస్తూ.. పాఠశాలకు దగ్గరలో స్థలాన్ని కేటాయించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. సాక్షికి ఈవిషయాన్ని పీఎంఓ కార్యాలయం తెలిపింది. పీఎంఓ కార్యాలయం నుంచి వచ్చిన రెస్సాన్స్ కు ఆశ్చర్యానికి గురయ్యానని పీవీ సింధు, సాక్షి మలిక్ లాగానే తాను కూడా ఒలింపిక్ లో పతకం సాధిస్తానని సాక్షి చెబుతోంది.