విద్యార్థికి టీచర్ అసభ్యకర మెస్సేజ్ లు! | School alerts cops over lewd SMS teacher sent boy | Sakshi
Sakshi News home page

విద్యార్థికి టీచర్ అసభ్యకర మెస్సేజ్ లు!

Published Thu, Aug 21 2014 2:49 PM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM

విద్యార్థికి టీచర్ అసభ్యకర మెస్సేజ్ లు! - Sakshi

విద్యార్థికి టీచర్ అసభ్యకర మెస్సేజ్ లు!

ముంబై: ఓ విద్యార్థికి స్కూల్ టీచర్ పంపిన అసభ్యకర మెస్సేజ్ ల ఘటన తీవ్ర దుమారాన్ని రేపుతోంది. సెయింట్ మేరీస్ స్కూల్లో పనిచేస్తున్న పీటీ టీచర్ తన పాత విద్యార్థికి పంపిన అసభ్యకరమైన సందేశంతో స్కూల్ యాజమాన్యం అప్రమత్తమైంది. ముంబై నగరంలోని మాజ్ గాన్ ప్రాంతంలో ఉన్న సెయింట్ మేరీస్ స్కూల్లో ఒక విద్యార్థి పదో తరగతి పూర్తి చేసిన అనంతరం బయటకు వెళ్లిపోయాడు. అయితే ఆ స్కూల్ టీచర్ తో అతను తరచు మెస్సేజ్ లతో టచ్ లో ఉంటున్నాడు. ఈ క్రమంలోనే టీచర్ తాజాగా ఒక  బూతు సందేశాన్ని ఆ విద్యార్థికి పంపించింది. ఈ విషయాన్ని గమనించిన స్కూల్ యాజమాన్యం దీనికి ఇక్కడితో ముగింపు పలకాలని భావించింది. దీంతో ఆ స్కూల్ కమిటీ సమావేశమై.. విద్యార్థిపై, టీచర్ పై చర్యలు తీసుకునేందుకు పూనుకుంది.

'ఆ విద్యార్థి మా స్కూల్లోనే పదవ తరగతి పూర్తి చేశాడు. తరువాత బయటకు వెళ్లి పై తరగతులు చదువుకుంటున్నాడు. మా పీటీ టీచర్ అతనితో చనువుగా ఉండేది. ఆ విద్యార్థి ఇక్కడ నుంచి వెళ్లిపోయిన తరువాతం ఇద్దరు ఫోన్లలో మెస్సేజ్ లను ఇచ్చిపుచ్చకుంటున్నారు. అందులో భాగంగానే ఈ మధ్య ఒక అసభ్యకరమైన మెస్సేజ్ ను విద్యార్థికి టీచర్ పంపినట్లు గమనించాం. ఈ అంశాన్ని మా స్కూల్ యాజమాన్యం తీవ్రం పరిగణించి పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించాం. ఆ విద్యార్థిని జాగ్రత్తగా ఉండమని స్కూల్ నుంచి నోటీసు పంపినా.. వారి తల్లి దండ్రుల నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. అందుచేత మా కమిటీ పోలీసుల ఆశ్రయించింది' అని స్కూల్ ప్రిన్సిపాల్ మరియు చైర్మన్ పింటో తెలిపారు. అయితే ఈ మెస్సేజ్ లకు కారణమైన తమ స్కూల్ టీచర్ పై చర్యలు తీసుకున్నామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement