‘హిందీలో వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీ త్రీ ఇడియట్స్ సినిమా చూసినప్పుడు.. కాలేజీలు కొంచెం వైవిధ్యంగానే ఉంటున్నాయనిపిస్తుంది కదా. అదంతా బుల్ షిట్. అది కేవలం సినిమాలో మాత్రమే. నిజ జీవితంలో కాదు.. నిజ జీవితంలో మేము ప్రెషర్ కుక్కర్‌లో ఉన్నాం. ప్రెషర్ కుక్కర్‌లో ఏమవుతున్నదో తెలుసా? అంతా మాడిపోతున్నది. మీరు మీ పిల్లలకు బ్యాట్‌మెన్ కామిక్ బుక్ ఇస్తే.. వాళ్లు దాన్ని ఒక్క పేజీ కూడా వదిలిపెట్టకుండా చదువుతారు.
కానీ.. అదే కామిక్ బుక్ మీద టెస్ట్ పెడతారంటే మాత్రం కామిక్ బుక్‌ను కూడా ద్వేషిస్తాడు. పిల్లాడు తన కాళ్ల మీద నిలబడాలనుకుంటున్నప్పుడు.. తన స్వశక్తితో ఎదగాలనుకుంటున్నప్పుడు ఎందుకు మీరు కిందికి లాగుతున్నారు. మాకు ర్యాంకులు ఎందుకు ఇస్తున్నారు. ర్యాంకుల పేరుతో మాకు మరో రకమైన ఒత్తిడిని కలగజేస్తున్నారనే విషయం మీకు తెలుస్తున్నదా? ఒకవేళ నేను సింగర్, ఆర్టిస్ట్, డ్యాన్సర్ లేదంటే ఓ ఫిలిం డైరెక్టర్ కావాలనుకుంటే ఎలా?
వీటిలో ఏదైనా నేను కావాలనుకున్నప్పుడు నేను పుస్తకాల్లో చదివే పైథాగరస్ థీరమ్ ఏ విధంగా ఉపయోగపడుతుంది నాకు? చతురస్రంలో ఎన్ని భుజాలుంటే నాకెందుకు? ఇవన్నీ అసలు నేనెందుకు చదవాలి. మమ్మల్ని వదిలేయండి. మేం ఏం చేయాలనుకుంటున్నామో.. చేయనీయండి. మీరు ఊహించినదానికన్నా ఎక్కువగా ఎదుగుతామేమో... మూసధోరణిని వీడండి..‘
–హ్యుమన్స్ ఆఫ్ బాంబే
ఫేస్‌బుక్ పేజీలో ఓ విద్యార్థి చేసిన పోస్ట్ ఇది
Comments
Please login to add a commentAdd a comment