ప్రధాని పర్యటనను విజయవంతం చే యాలి we will must succuss PM program | Sakshi
Sakshi News home page

ప్రధాని పర్యటనను విజయవంతం చే యాలి

Published Wed, Aug 3 2016 10:21 PM | Last Updated on Mon, Sep 17 2018 7:44 PM

ప్రధాని పర్యటనను విజయవంతం చే యాలి - Sakshi

నడిగూడెం: ఈ నెల 7న హైద్రాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటనను విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు కనగాల వెంకట్రామయ్య కోరారు. బుధవారం మండల కేంద్రంలో నిర్వహించిన ఆ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. నడిగూడెం మండలం నుంచి 200 మంది కార్యకర్తలను తరలించేలా ప్రయత్నం చేయాలని మండల నాయకులకు సూచించారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి వంగవీటి శ్రీనివాసరావు, మండల అధ్యక్షుడు రొండ్ల శ్రీనివాసరెడ్డి, ప్రధాన కార్యదర్శి పోలంపల్లి నాగార్జున్, నాయకులు పరబ్రహ్మచారి, రామక్రిష్ణ, దున్నా మధు, గురునాదం, ఏడుకొండలు, ప్రసాద్‌ పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement