succuss
-
మహాసభలను విజయవంతం చేయాలి
నాంపల్లి : అక్టోబర్ 2 నుంచి 4 వరకు మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌లో జరిగే జాతీయ మహసభలను విజయవంతం చేయాలని తెలంగాణ ప్రజానాట్యమండలి జిల్లా అ«ధ్యక్షుడు బుడిగపాక జగన్∙అన్నారు. అదివారం స్థానిక సీపీఐ కార్యలయంలో ప్రజానాట్యమండలి ముఖ్య కార్యకర్తల సమావేశాశంలో ఆయన మాట్లాడారు. అనంతరం మహసభల కరపత్రాని విడుదల చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం హేతువాదులపై, రచయిత, కవులపై ఉక్కుపాదం మోపుతూ అణిచివేస్తుందన్నారు. ఈ జాతీయ మహసభలు నూతన కళారూపాలను ప్రదర్శించేందుకు , ప్రభుత్వం అవలంభిసుత్నS్న విధానాలపై కళాగళాలను పదును పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజానాట్యమండలి జిల్లా ప్రధాన కార్యదర్శి కలకొండ జంజీవ, ఊరుపక్క వెంకటయ్య, మొగుదల సైదమ్మ, మహేష్, మురళి, తదితరులున్నారు. -
కృష్ణా పుష్కరాలను విజయవంతం చేయాలి
కనగల్ రేపటి నుంచి నిర్వహించే కృష్ణా పుష్కరాలను విజయవంతం చేయాలని నల్లగొండ ఆర్డీఓ వెంకటాచారి అధికారులకు సూచించారు. బుధవారం దర్వేశిపురం, కనగల్ పుష్కరఘాట్ల వద్ద విధులు నిర్వహించే అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు. రెండు ఘాట్ల వద్ద అధికారులు మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. విధుల్లో అధికారులు, సిబ్బంది అలసత్వం ప్రదర్శిస్తే ఉపేక్షించేది లేదన్నారు. పుష్కర స్నానాలకు వచ్చే భక్తులకు అసౌకర్యం కలుగకుండా సిబ్బంది సహరించాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో కనగల్, దర్వేశిపురం పుష్కరఘాట్ల ఇన్చార్జులు సునంద, రాజేందర్, తహసీల్దార్ కృష్ణయ్య, ఎండోమెంట్ అధికారులు రాంచందర్‌రావు, సులోచన, ఐబీడీఈ నాగయ్య, సీఐ రమేశ్‌కుమార్, ఎస్సై వెంకట్‌రెడ్డి, డి.సీతాకుమారి, ఖలీల్‌అహ్మద్ పాల్గొన్నారు. -
ప్రధాని పర్యటనను విజయవంతం చే యాలి
నడిగూడెం: ఈ నెల 7న హైద్రాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటనను విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు కనగాల వెంకట్రామయ్య కోరారు. బుధవారం మండల కేంద్రంలో నిర్వహించిన ఆ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. నడిగూడెం మండలం నుంచి 200 మంది కార్యకర్తలను తరలించేలా ప్రయత్నం చేయాలని మండల నాయకులకు సూచించారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి వంగవీటి శ్రీనివాసరావు, మండల అధ్యక్షుడు రొండ్ల శ్రీనివాసరెడ్డి, ప్రధాన కార్యదర్శి పోలంపల్లి నాగార్జున్, నాయకులు పరబ్రహ్మచారి, రామక్రిష్ణ, దున్నా మధు, గురునాదం, ఏడుకొండలు, ప్రసాద్ పాల్గొన్నారు.