కృష్ణా పుష్కరాలను విజయవంతం చేయాలి
కనగల్
రేపటి నుంచి నిర్వహించే కృష్ణా పుష్కరాలను విజయవంతం చేయాలని నల్లగొండ ఆర్డీఓ వెంకటాచారి అధికారులకు సూచించారు. బుధవారం దర్వేశిపురం, కనగల్ పుష్కరఘాట్ల వద్ద విధులు నిర్వహించే అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు. రెండు ఘాట్ల వద్ద అధికారులు మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. విధుల్లో అధికారులు, సిబ్బంది అలసత్వం ప్రదర్శిస్తే ఉపేక్షించేది లేదన్నారు. పుష్కర స్నానాలకు వచ్చే భక్తులకు అసౌకర్యం కలుగకుండా సిబ్బంది సహరించాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో కనగల్, దర్వేశిపురం పుష్కరఘాట్ల ఇన్‌చార్జులు సునంద, రాజేందర్, తహసీల్దార్ కృష్ణయ్య, ఎండోమెంట్ అధికారులు రాంచందర్‌రావు, సులోచన, ఐబీడీఈ నాగయ్య, సీఐ రమేశ్‌కుమార్, ఎస్సై వెంకట్‌రెడ్డి, డి.సీతాకుమారి, ఖలీల్‌అహ్మద్ పాల్గొన్నారు.