pushkar
-
యోగి బాటలో థామీ సర్కార్.. డ్యామేజ్ రికవరీ బిల్లు అమలు?
ఉత్తరప్రదేశ్‌లో అల్లర్లకు, హింసకు పాల్పడే వారిపై కఠిన చర్యలు అవలంబిస్తూ సీఎం యోగి ఆదిత్యనాథ్ వార్తల్లో నిలిచారు. ఆందోళనకారుల కారణంగా ప్రభుత్వానికి వాటిల్లే నష్టాలను రికవరీ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. తాజాగా ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి కూడా సీఎం యోగిని అనుసరించనున్నారని సమాచారం. హల్ద్వానీ హింసాకాండలో ధ్వంసమైన ప్రభుత్వ ఆస్తులకు సంబంధించిన నష్టాలను నిందితుల నుంచి వసూలు చేసేందుకు థామీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. నిరసనల సమయంలో ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆస్తులకు ఏదైనా నష్టం జరిగితే ఆ మొత్తాన్ని ఆందోళనకారుల నుండి రికవరీ చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. సీఎం పుష్కర్ సింగ్ ధామి దీనికి సంబంధించిన బిల్లును అసెంబ్లీలో సమర్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఉత్తరాఖండ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ ప్రాపర్టీ డ్యామేజ్ రికవరీ బిల్లును సోమవారం నుండి ప్రారంభమయ్యే బడ్జెట్ సెషన్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. నిరసనల కారణంగా సంభవించే ఆస్తి నష్టాల పరిహారంపై నిర్ణయం తీసుకునేందుకు రిటైర్డ్ జిల్లా జడ్జి అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఫిబ్రవరి 8న నైనిటాల్ జిల్లా హల్ద్వానీలో అక్రమాస్తుల వ్యతిరేక ప్రచారంలో హింసాయుత ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపధ్యంలో బంబుల్‌పురా ప్రాంతంలో ఒక మసీదు, మదర్సాను కూల్చివేశారు. అంతటితో ఆగక స్థానిక పోలీస్ స్టేషన్‌కు కూడా నిప్పంటించారు. ఈ ఘటనలో ధ్వంసమైన ఆస్తుల విలువ మొత్తాన్ని నిందితుల నుంచి రికవరీ చేస్తామని, దీనికి సంబంధించిన బిల్లును అసెంబ్లీ టేబుల్‌పైకి తీసుకురానున్నామని ముఖ్యమంత్రి పుష్కర్ ధామి గతంలోనే ప్రకటించారు. కాగా ఈ హింసాకాండలో పాల్గొన్నవారి సమాచారం అందించాలని మీడియాను జిల్లా యంత్రాంగం కోరింది. హల్ద్వానీ హింసాకాండలో ప్రధాన నిందితుడైన అబ్దుల్ మాలిక్‌ను ఇటీవల ఉత్తరాఖండ్ పోలీసులు అరెస్టు చేశారు. -
బతుకు పోరు
‘ఈ కర్మభూమిలో ప్రతి అడుగులో ఒక కథ వినిపిస్తుంది’ అంటుంది ఇంజా రోజియ. అమెరికన్ టూరిస్ట్ రోజియ ఇటీవల తన స్నేహితురాలితో కలిసి రాజస్థాన్‌లోని పుష్కర్ నగరానికి వచ్చింది. బిడ్డను ఒళ్లో పడుకోబెట్టుకొని ఎర్రటి ఎండలో కూర్చున్న గుడియ అనే మెహందీ ఆర్టిస్ట్ కనిపించింది. మెహందీ వేయించుకుంటూ గుడియతో కబుర్లలో పడింది రోజియ. తెలిసీ తెలియని ఇంగ్లీష్‌లోనే తన జీవితకథను రోజియతో పంచుకుంది గుడియ. రోజియ వయసే ఉన్న గుడియకు నలుగురు పిల్లలు. విద్యుత్ సౌకర్యం కూడా లేని చిన్న పల్లెలో ఉండేది. తల్లిదండ్రులు చనిపోయారు. భర్త తాగుబోతు. ఎప్పుడూ ఏదో రకంగా హింసించేవాడు. భర్త పెట్టే బాధలు భరించలేక పిల్లల్ని తీసుకొని పట్టణానికి వచ్చింది. తనకు తెలిసిన ‘మెహందీ ఆర్ట్’తో బతుకుబండి లాగిస్తోంది అంటూ గుడియ గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది రోజియ. ‘నా జీవితం ఇలా అయిపోయింది... అంటూ ఆమె కన్నీళ్లతో బాధ పడలేదు. ఎవరి మీదో ఫిర్యాదు చేస్తున్నట్లుగా లేదు. జరిగిందేదో జరిగింది. బతుకుపోరు చేస్తాను...అనే స్ఫూర్తి ఆమెలో బలంగా కనిపించింది. గుడియ నలుగురు పిల్లలకు తల్లి. తల్లి ప్రేమకు ఉన్న శక్తి ఏమిటంటే జీవితంలో ఎన్నో యుద్ధాలను గెలిచేలా చేస్తుంది’ అంటూ రాసింది రోజియ. -
ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. చార్ధామ్ బోర్డు రద్దు
డెహ్రాడున్: ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చార్ధామ్ దేవస్థానం బోర్డును రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. ముఖ్యమంత్రి పుస్కర్ సింగ్ ధామి సోమవారం ఈ విషయాన్ని ప్రకటించారు. దేశస్థానం బోర్డుకు సంబంధించిన అన్ని అంశాలను అధ్యయనం చేస్తామని తెలిపారు. అప్పటివరకు చార్ధామ్ దేవస్థానం బోర్డు చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించామని సీఎం ధామి పేర్కొన్నారు. ఈ బోర్డును 2019లో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. బోర్డును రద్దు చేయాలని పెద్ద ఎత్తున పూజారులు డిమాండ్ చేస్తున్నారు. ఆలయాల సాంప్రదాయ హక్కులకు వ్యతిరేకంగా బోర్డు ఉందని పూజారులు ఆరోపలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దేవస్థానం బోర్డుపై ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా సీఎం ధామి రద్దు నిర్ణయం తీసుకున్నారు. మనోహర్ కంట్ దయానీ నేతృత్వంలోని బృందం నివేదికను తయారు చేసింది. దేవస్థానం బోర్డు కింద 51 ఆలయాల నిర్వహణ ఉండగా.. ప్రముఖ కేదార్నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రీ ఆలయాలు కూడా బోర్డు పరిధిలోనే ఉన్నాయి. -
ఉత్తరాఖండ్ కొత్త సీఎంగా పుష్కర్ సింగ్ ధామి ప్రమాణం
-
తుంగభద్ర పుష్కరాలకు రూ. 2.5 కోట్లు
సాక్షి, హైదరాబాద్ : తుంగభద్ర పుష్కరాలకు సంబంధించి ఏర్పాట్లు, అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం బుధవారం రూ.2.50 కోట్లు విడుదల చేసింది. ఈనెల 20 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు తుంగభద్ర పుష్కరాలు జరగనున్నాయి. అయితే కోవిడ్ నేపథ్యంలో ఈ ఉత్సవాలను అత్యంత నిరాడంబరంగా నిర్వహించాలని ఇప్పటికే దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పలుమార్లు ప్రకటించారు. గతంలో గోదావరి, కృష్ణా పుష్కరాల మాదిరిగా భక్తులు పెద్దసంఖ్యలో హాజరైతే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రత్యేకంగా పుష్కరాల కోసం ఏర్పాట్లు చేయొద్దని నిర్ణయించింది. ఇందులో భాగంగానే అధికారికంగా పుష్కరఘాట్లను కూడా ఏర్పాటు చేయటం లేదు. ఆలంపూర్లోని జోగులాంబ దేవాలయం వద్ద మాత్రమే ఆలయం పక్షాన ఏర్పాట్లు ఉంటాయని ఇప్పటికే అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేయటం విశేషం. -
భర్త యాక్షన్ చెప్తే భార్య కట్ చెప్తుంది
భార్యాభర్తలై జంటగా పని చేసే నటులున్నారు.. కొరియోగ్రాఫర్లు ఉన్నారు... సింగర్లు ఉన్నారు... కాని భార్యాభర్తలై జంటగా పని చేసే దర్శకులు మొత్తం ఆసియా ఖండానికి ఒకే ఒకరు ఉన్నారు. వారే పుష్కర్–గాయత్రి. వారిరువురు కలిసి డైరెక్ట్ చేసి తాజా తమిళ సినిమా ‘విక్రమ్ వేదా’ పన్నెండు కోట్ల పెట్టుబడికి 90 కోట్లు సంపాదించి సంచలనం సృష్టిస్తోంది. చెట్టు మీద ఉన్న శవాన్ని దింపి భుజాన వేసుకుని నడుస్తున్న విక్రమార్కుడితో బేతాళుడు రోజుకో కథ చెబుతాడు. చిత్ర విచిత్రమైన కథలు. గాయత్రి–పుష్కర్ల కథ కూడా కొంచెం విచిత్రమైనదే. దర్శకత్వం వహించే భార్యాభర్తలుగా వీళ్లు ఒక ట్రెండ్ సృష్టించారు. గతంలో మనం ‘భారతి–వాసు’ వంటి స్నేహితులు, అబ్బాస్– మస్తాన్ వంటి అన్నదమ్ములు కలిసి దర్శకత్వం వహించిన సందర్భాలు ఉన్నాయి. కాని భార్యాభర్తలు కలిసి దర్శకత్వం వహించడం వింత. ఎవరు యాక్షన్ చెప్తారు, ఎవరు కట్ చెప్తారు, ఎవరు స్క్రీన్ ప్లే రాస్తారు, ఎవరు డైలాగ్ ఎక్స్ప్లయిన్ చేస్తారు.. ఇదంతా అంత సులభం కాదు. కాని మా విషయంలో ఇది చాలా ఈజీ అంటారు గాయత్రి–పుష్కర్. పెళ్లే మాకు దర్శకత్వం లాంటిది... దర్శకత్వమే మాకు పెళ్లి లాంటిది అంటారు వాళ్లు. మెడ్రాస్ కపుల్ పుష్కర్–గాయత్రిలు పుట్టి పెరిగిందంతా చెన్నైలోనే. అందుకే వారి నరనరాన చెన్నై ప్రవహిస్తూ ఉంటుంది. ఇద్దరూ లయోలా కాలేజ్‌లో విజువల్ కమ్యూనికేషన్స్ చదువుతూ ఉండగా ఒకరికొకరు పరిచయం ఏర్పడింది. ఆ రోజులను తలుచుకుంటూ గాయత్రి ఇలా అంది– ‘ఇద్దరికీ ఒకేరకమైన ఇష్టాలు ఉండటం గమనించాం. ఇద్దరికీ ఒకే రకమైన సినిమాలు ఇష్టం. పుస్తకాలు ఇష్టం. ఇద్దరం ఒకే నాటకానికి కలిసి వెళ్లే వాళ్లం. ఇద్దరం డైరెక్షన్లోకి రావాలని అప్పుడే నిర్ణయించుకున్నాం’ అందామె. డిగ్రీ అయ్యాక సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఎక్కడో ఒక చోట అసిస్టెంట్స్‌గా చేరి కెరీర్ మొదలెడతారు. కాని పుష్కర్–గాయత్రీలు సినిమా నియమబద్ధంగా చదవాలని నిర్ణయించుకున్నారు. అందుకే గాయత్రి షికాగోలో, పుష్కర్ న్యూ ఓర్లెన్స్లో సినిమా కళను అభ్యసించారు. అక్కడి నుంచి వచ్చాక పి.సి.శ్రీరామ్, మానవ్ మీనన్ వంటి వారి దగ్గర యాడ్ రంగంలో పని చేశారు. ఇక చాలు అనుకొని 2007లో ‘ఓరమ్ పో’ సినిమాతో దర్శకత్వంలోకి వచ్చారు. బ్లాక్ కామెడీ ఇండియన్ సినిమాలో బ్లాక్ కామెడీతో వచ్చే సినిమాలు తక్కువ. అమర్యాదకరమైన, నలుగురు బహిరంగంగా చర్చించని విషయాలను వేదికగా తీసుకుని హాస్యాన్ని పండించే ఈ తరహా సినిమాలనే పుష్కర్–గాయత్రీలు సినిమాలుగా తీయాలని నిశ్చయించుకున్నారు. వాళ్ల మొదటి సినిమా ‘ఓరమ్ పో’ చెన్నై అర్ధరాత్రిళ్లు ఆటో రేసింగ్ పెట్టుకునే ఆటోడ్రైవర్ల మధ్య నడిచే సినిమా. ఈ సినిమాతో పుష్కర్–గాయత్రీలు కొత్త ప్రేక్షకులను సృష్టించుకున్నారని చెప్పవచ్చు. వీరి తర్వాతి సినిమా ‘వా–క్వార్టర్ కట్టింగ్’ కూడా కొత్తరకం కథే. ఉద్యోగం కోసం సౌదీకి వెళ్లాలనే కుర్రాడు తాను సౌదీకి వెళ్లబోయే రాత్రి ఇక సౌదీకి వెళ్లాక అక్కడ మద్యం తాగలేనని గ్రహించి జీవితంలో ఇప్పటిదాకా మద్యం ముట్టలేదు కనుక ఒక్కసారి ముట్టి వెళ్లిపోదామని అనుకుంటాడు. అయితే ఆ రోజు ఎలక్షన్లు జరుగుతుంటాయి కనుక అది డ్రై డే. ఇక అతడు, అతడి స్నేహితులు మద్యం కోసం ఎన్ని పాట్లు పడ్డారన్నది కథ. దీనికి కూడా ప్రేక్షకులు హిట్ టాక్ ఇచ్చారు. అద్వైతం పుష్కర్–గాయత్రీలు ఇద్దరు కాదు. దాదాపు ఒక్కరే అన్నట్టుగా కలిసిపోయారు. ‘మీకు విభేదాలు రావా?’ చాలామంది వారిని ప్రశ్నించారు. ‘మేము ఒకరి కళ్లలో మరొకరు కళ్లు పెట్టి చూసిన వెంటనే ఒకరి అభిప్రాయం మరొకరికి తెలిసిపోతుంది. తప్పును ఆపేస్తాం. ఒప్పును కొనసాగిస్తాం’ అంటుంది గాయత్రీ. ఇంట్లో అయినా లొకేషన్లో అయినా వీరి మధ్య వాదన ఉండదు చర్చ ఉంటుంది. అందుకే మా జంట సక్సెస్ అయ్యింది అంటారు వాళ్లు. విక్రమ్ వేదా సూపర్ హిట్ తర్వాత రజనీకాంత్ అంతటి వ్యక్తి ప్రత్యేకంగా వీరిని అభినందించాడు. వీరికి చాలా డిమాండ్ ఏర్పడింది. ఇద్దరూ విడివిడిగా దర్శకత్వం వహించవచ్చు కదా అని అడిగితే వాళ్లు చెప్పే జవాబు ‘అంత అవసరం ఏమొచ్చింది?’ అని. ఈ జంట చాలా జంటలకు ఆదర్శం అవ్వాలి. విక్రమ్ వేదా పుష్కర్–గాయత్రీలు చాలా ఒరిజినల్ స్క్రిప్ట్ కోసం ప్రయత్నించే దర్శకులు అని చెప్పుకోవచ్చు. అందుకే వారు పదేళ్ల కాలంలో కేవలం మూడు సినిమాలే తీశారు. మొదటి రెండు సినిమాల తర్వాత వాళ్లు ఏడేళ్లు గ్యాప్ తీసుకుని ‘విక్రమ్ వేదా’కు దర్శకత్వం వహించారు. దీనికి ముందు ఒకటి రెండు స్క్రిప్ట్‌లు అనుకున్నా వారిని అవి ఉత్సాహపరచలేదు. ఆ సమయంలో వారి దృష్టి బేతాళ కథల మీద పడింది. విక్రమార్కునితో బేతాళుడు రోజుకో కథ చెప్పడం దానికి అనూహ్యమైన జవాబును విక్రమార్కుడు చెప్పడం ఇలా సాగే కథలాగా ఒక సినిమా తీయాలనుకున్నారు. అదే విక్రమ్ వేదా. ఇందులో విక్రమ్ అనే సిన్సియర్ పోలీసాఫీర్, వేదా అనే రౌడీ ఎలా ఒకే ఘటనకు తమ తమ దృక్కోణం నుంచి జవాబులు చెప్పారో ఆసక్తికరంగా ఉంటుంది. విక్రమ్ తన వాదన వినిపిస్తుంటే వేదా తన వాదన వినిపిస్తాడు. మనిషి పూర్తిగా మంచి పూర్తిగా చెడ్డ ఉండడని మధ్యలో కొన్ని గ్రే ఏరియాలు ఉంటాయని ఈ కథ చెబుతుంది. అనూహ్యమైన మలుపులతో చెన్నై ఒరిజినాలిటీతో సాగే ఈ కథకు ప్రేక్షకులు బ్రహ్మరథం పలికారు. -
పుష్కర ఘటనపై సా..గుతున్న విచారణ
రాజమహేంద్రవరం క్రైం : పుష్కర తొక్కిసలాటపై ఏర్పాటు చేసిన జస్టిస్ సోమయాజులు కమిష¯ŒS విచారణ కొనసాగుతూనే ఉంది. విచారణ ఈ నెల 28 కి వాయిదా వేశారు. శుక్రవారం రాజమహేంద్రవరం ఆర్ అండ్ బి అతిథిగృహంలో పుష్కర తొక్కిసలాట ఘటనపై జస్టిస్ సోమయాజులు కమిష¯ŒS విచారణ నిర్వహించింది. పుష్కరాల సమయంలో తీసిన ఫొటోలు, సీడీలు, కొన్ని డాక్యుమెంట్లను సమాచార శాఖ కమిషన్‌కు సమర్పించింది. వాటిని తమకు ఇవ్వాలని కమిష¯ŒSను పౌరహక్కుల సంఘం నాయకుడు, న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు అభ్యర్థించారు. అనంతరం ఈ నెల 28 కి విచారణను వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ సోమయాజులు ప్రకటించారు. కమిష¯ŒS గడువు ఈ నెల 29 తో ముగియనుంది. అనంతరం న్యాయవాది ముప్పాళ్ళ సుబ్బారావు మాట్లాడుతూ పుష్కర తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వం కమిష¯ŒS వేస్తూ 6 నెలల్లో విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని గడువు విధించి ఏడాదిన్నర కావస్తున్నా అధికారులు కమిష¯ŒSకు పూర్తి స్థాయిలో ఆధారాలు సమర్పించలేదన్నారు. ఈ సంఘటన కు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజీలు ఇవ్వలేదని, నేషనల్ జియోగ్రఫీ చానల్లో కూడా పూర్తిస్థాయి ఆధారాలు సమర్పించకుండా ఎడిట్ చేసి ఇచ్చారన్నారు. సీఎం స్నానానికి అనుమతి ఇచ్చిందెవరు? వీఐపీ ఘాట్ ఉండగా పుష్కర ఘాట్ లో సీఎం చంద్రబాబు నాయుడు స్నానం చేయడానికి ఎవరు అనుమతి ఇచ్చారని ముప్పాళ్ల ప్రశ్నించారు. పుష్కర ఘాట్ లో బారికేడ్లు ఎవరి ఆదేశాల మేరకు తొలగించారో చెప్పాలన్నారు. సంఘటన సమయంలో పుష్కర ఘాట్‌లో ఆక్సిజ¯ŒS అందుబాటులో లేకపోవడం వల్ల ఎక్కువ మంది మృత్యువాతపడ్డారని అన్నారు. ఈ సంఘటనలో 170 మంది బాధితులను విచారించామని చెబుతున్న పోలీసులు పూర్తి స్థాయిలో ఆధారాలు సమర్పించలేదని అన్నారు. కమిష¯ŒS గడువు ఈనెల 29 తో ముగుస్తున్నందున ఆ లోగా అన్ని శాఖలు పూర్తి స్థాయిలో ఆధారాలు సమర్పించి బాధ్యులకు శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ న్యాయవాది సీహెచ్ ప్రభాకరరావు, కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మ¯ŒS కూనపురెడ్డి శ్రీనివాస్, డీపీఆర్ఓ వెంకటేశ్వరరావు, రాజమహేంద్రవరం రూరల్ తహసీల్దార్ కె.భీమారావు, డీఎస్పీ రామకృష్ణ, ఎ.వి.స్వరూప్, త్రీటౌ¯ŒS సీఐ శ్రీరామకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
అమరేశ్వరుని పుష్కర ఆదాయం రూ.1.47 కోట్లు
అమరావతి (గుంటూరు): గుంటూరు జిల్లా అమరావతి పట్టణంలో వేంచేసియున్న శ్రీబాలచాముండికా సమేత శ్రీ అమరేశ్వర స్వామి దేవస్థానంలో శుక్రవారం హుండీల లెక్కింపు నిర్వహించారు. దేవాదాయ సహాయ కమిషనర్ కేబీ శ్రీనివాసరావు సమక్షంలో తెనాలికి చెందిన భక్త సమాజం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వాహ ణాధికారి ఎన్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ హుండీల ఆదాయం రూ.42 49,606 వచ్చినట్లు తెలిపారు. స్వామివారి దర్శనం టికెట్ల ద్వారా రూ.96 లక్షల 22 వేలు, అన్నదానానికి రూ.2 లక్షల 34,509 వచ్చినట్లు వెల్లడించారు. మొత్తం రూ.1,47,23,526 ఆదాయం సమకూరినట్లు తెలిపారు. నగదును స్థానిక బ్యాంక్‌లలోని దేవాలయ ఖాతాకు జమ చేస్తున్నామన్నారు. లడ్డూప్రసాదాన్ని సుమారు రూ.40 లక్షలకు విక్రయించినట్లు తెలిపారు. -
పుష్కరాలకు పెరుగుతున్న రద్దీ
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: పుష్కరాలు బుధవారం నాటికి ఆరు రోజలు పూర్తయ్యాయి. ఈ నెల 12 నుంచి పుష్కరాలు ప్రారంభంకాగా మొదటి రెండు రోజుల పాటు భక్తులు నామమాత్రంగా తరలివచ్చారు. శని, ఆది,సోమ వారాలు సెలవు దినాలు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో ప్రధాన ఘాట్లన్నీ జనసందోహంతో కిక్కిరిసి పోయాయి. ఈ నెల 12 నుంచి 17 వరకు వాడపల్లి, మట్టపల్లి, నాగార్జునసాగర్‌లో 12 లక్షల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. అత్యధికంగా నాగార్జునసాగర్‌కు 5.57 లక్షల మంది వచ్చారు. సినీ, రాజకీయ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు కృష్ణా నదిలో పుణ్యస్నానాలు చేసి పునీతులయ్యారు. పుష్కరాల ముగింపునకు మరో ఆరురో జుల వ్యవధి మాత్రమే ఉండటంతో బుధవారం నాడు ఘాట్ల వద్ద భక్తుల రద్దీ పెరిగినట్లు కనిపించింది. పానగల్లు, దర్వేశిపురం, కాచరాజుపల్లి ఘాట్ల వద్దకు కూడా భక్తులు వేల సంఖ్యలో వచ్చారు. భక్తుల రద్దీ.. ఆరో రోజు సుమారు మూడున్నర లక్షల మంది భక్తులు 28 ఘాట్లలో పుణ్యస్నానాలు ఆచరించారు. అది కూడా నాగార్జునసాగర్, వాడపల్లి, మట్టపల్లిలో మాత్రమే 2,64,737 మంది భక్తులు స్నానాలు చేయగా, మిగిలిన అన్ని చోట్లా కలిపి 85 వేల మంది భక్తులు స్నానమాచరించారు. ఎప్పటిలాగే సాగర్ శివాలయం ఘాట్‌కు 80 వేల మంది, సురికి వీరాంజనేయ స్వామి ఘాట్‌లో 34 వేల మంది వరకు స్నానాలు చేసినట్లు అంచనా. మట్టపల్లిలో 38 వేలు, వాడపల్లిలో 85 వేలపై చిలుకు, కనగల్ మండలం దర్వేశిపురం ఘాట్‌లో 19,500, నేరేడుచర్ల మహంకాళి గూడెం ఘాట్‌లో 15 వేల మంది స్నానాలు చేశారు. బ్యాక్ వాటర్ పరిధిలో ఉన్న చందంపేట మండలం కాచరాజుపల్లి ఘాట్‌కు 7,100, పానగల్లు ఘాట్‌కు 5 వేల మంది భక్తులు వచ్చారు. ఇక పీఏపల్లి మండలం అజ్మాపూర్, మేళ్వచెర్వు మండలం బుగ్గ మాదారం, కిష్టాపురం, మేళ్వచెర్వు, కనగల్ ఘాట్, వాడపల్లిలోని లక్ష్మీ నరసింహస్వా మి ఘాట్, ఓల్డ్ సిమెంట్ ఫ్యాక్టరీ ఘాట్, ముదిమాణిక్యం, లక్ష్మీపురం, మెట్లరేవు, అయ్యప్పటెంపుల్, ముదిరాజ్ ఘాట్లకు భక్తులు వందల సంఖ్యలోనే వచ్చారు. ప్రముఖులు హాజరు.. సినీ, రాజకీయ, విద్యా రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు బుధవారం వివి«ధ ఘాట్ల వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. అడవిదేవులపల్లిలో ఎమ్మెల్సీ పూలరవీందర్, వాడపల్లిలో లోకాయుక్త ఆనంద రెడ్డి, నాగార్జునసాగర్‌లో మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి , విద్యాసంస్థ లకు చెందిన పదిహేను వందల మంది విద్యార్థులు, వీరితో పాటు సినీ హాస్యనటుడు వేణు మాధవ్, బీజేపీ నాయకులు సీఎల్.రాజం దంపతులు మట్టపల్లిలో పుణ్యస్నానాలు ఆచరించారు. -
ఆదాయం నిల్
హాలియా : కృష్ణాపుష్కరాలతో ఆలయాల ఆదాయం పెరుగుతుందన్న ఆశతో ఎదురుచూసిన దేవాదాయ శాఖ అధికారులకు నిరాశే ఎదురైంది. నాగార్జునసాగర్ భక్తజన సందోహం కారణంగా ఆలయ అధికారులు ఎంతో ఆశించినప్పటికీ పోలీసుల ఆంక్షలతో ఆల యాలు బోసిబోయాయి. ప్రధానంగా శివాలయం ఘాట్ వద్ద ఉన్న శివాలయానికి వచ్చే భక్తులు కూడా ఒక్కరు లేకపోవడం గమనార్హం. వీఐపీలకు మాత్రమే దర్శనభాగ్యం కలగడంతో సాధారణ భక్తులకు దేవుని దర్శనం కావడం లేదు. ఆలయ ప్రధాన గేట్ వద్ద బారీ కేడ్లు ఏర్పాటు చేసి తాము రాకుండా చేశారని సాధారణ భక్తులు మండిపడితున్నారు. వీటితోపాటు పైలాన్‌కాలనీలో ఉన్న మార్కండేయస్వామి, హిల్‌కాలనీలోని ఏలేశ్వరస్వామి, సత్యనారాయణస్వామి ఆలయాలు బోసిబోతున్నాయి. వన్‌వే ట్రాఫిక్ కారణంగా ఆలయాలకు భక్తులు వెళ్లే అవకాశం లేదు. ఇప్పటికే ఆరు రోజులు గడిచింది. మరో ఆరు రోజులే ఉన్నాయి. ఇకనైనా పోలీసు అధికారులు సాధారణ భక్తులకు దేవుని దర్శన భాగ్యం కలిగించాలని భక్తులు, అర్చకులు కోరుకుంటున్నారు. సాధారణ భక్తులకు దర్శనభాగ్యం కల్పించాలి – సుధాకరశాస్త్రి శివాలయ అర్చకులు 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాల సందర్భంగా భక్తులు ప్రతిఒక్కరూ పుణ్యస్నాం అనంతరం దేవుని దర్శనం చేసుకోవాలని కోరుకుంటారు. పోలీసులు ఆంక్షల తొలగించి శివాలయంలో దర్శనభాగ్యం కల్పించాలి. మాకు కూడా పని దొరుకుతుంది. దేవుని దర్శనం పెద్దోళ్లక్కేనా..? – రామలింగయ్య నిడమనూరు భక్తుడు నదిలో స్నానం చేశాక మొదట శివుడిని దర్శించుకుంటే పాపాలు తొలుగుతాయి. కాని నదిపక్కన గుడి ఉన్నా దేవుని దర్శనం చేసుకోకుండా ఆపుతున్నారు. దేవున్ని పెద్దోళ్లే దర్శనం చేసుకోవాలా. మాలాంటి సాధారణ భక్తులు చేసుకోకూడదా..? -
పుష్కరాలకు 3.50 లక్షలజనాభా
–మూడో రోజు జిల్లాలో కిక్కిరిసిన పుష్కర ఘాట్లు –సాగర్‌లో 1.5లక్షలు దాటిన భక్తుల సంఖ్య –వాడపల్లి, మట్టపల్లికీ అదే తాకిడి... మార్పు లేని బ్యాక్‌వాటర్ ఘాట్లు –మూడోరోజు మహంకాళిగూడెంలో పోటెత్తిన భక్త జనం – వాడపల్లిలో పుష్కర ఘాట్లను పరిశీలించిన డీజీపీ అనురాగ్‌శర్మ సాక్షి ప్రతినిధి, నల్లగొండ : వరుసగా వచ్చిన సెలవుల కారణంగా జిల్లాలో పుష్కర స్నానాలు జోరందుకున్నాయి. శనివారం సెలవు ఉండడం, సోమవారం కూడా సెలవు కావడంతో ఆదివారం జిల్లా వ్యాప్తంగా భక్తుల సంఖ్య పెరిగింది. ఆదివారం ఒక్క రోజే జిల్లాలో 3.50లక్షల మంది భక్తులు పుష్కర స్నానాలు చేశారని అంచనా. నాగార్జునసాగర్‌లో అయితే భక్తుల సంఖ్య లక్షన్నర దాటింది. ఒక్క శివాలయం ఘాట్‌లోనే 1.16లక్షల మంది భక్తులు పుష్కర స్నానం చేశారని అంచనా. వాడపల్లి, మట్టపల్లికి సైతం భక్తుల తాకిడి బాగానే కనిపించింది. వాడపల్లిలో 76 వేల మందికి పైగా, మట్టపల్లిలో 37వేల మందికిపైగా భక్తులు పుష్కర స్నానాలు చేశారు. ఇక, మిగిలిన ఘాట్లలో ఎలాంటి మార్పు లేదు. రెండో రోజు నేరేడుచర్ల మండలం మహంకాళిగూడెం ఘాట్‌కు భక్తుల సంఖ్య తగ్గినా, మూడోరోజు మాత్రం పోటెత్తారు. ఆదివారం ఒక్కరోజే అక్కడ 32వేల మందికి పైగా స్నానాలు చేశారు. ఇక, బ్యాక్ వాటర్ కింద నిర్మించిన కాచరాజుపల్లి, పెదమునిగల్, అజ్మాపూర్ ఘాట్లలో అయితే వందల సంఖ్యలోనే భక్తులు వస్తున్నారు. మూడు ఘాట్లలో కలిపి 3వేల మందికి పైగా మాత్రమే భక్తులు వచ్చారు. ఊట్లపల్లి, మేళ్లచెరువు మండలం వజినేపల్లి, కిష్టాపురం, బుగ్గమాదారం ఘాట్లకు కూడా భక్తులు తక్కువ గానే వెళ్లారు. కనగల్, మట్టపల్లిలోని మార్కండేయ ఘాట్లకు నీళ్లు మూడోరోజు కూడా స్నానాలు ప్రారంభం కాలేదు. కనగల్ ఘాట్‌కు ఈ రోజు నీళ్లు వస్తాయని అధికారులు చెపుతున్నారు. ఇక, దర్వేశిపురంలో అయితే 15వేల మంది భక్తులు స్నానాలు చేశారు. పానగల్లో 10వేల మందికి పైగా భక్తులు వచ్చారని అంచనా. దామరచర్ల మండలంలో అడవిదేవులపల్లి ఘాట్‌లో 5వేల మందికి పైగా భక్తులు స్నానాలు చేయగా, ఇర్కిగూడెం, ముదిమాణిక్యం ఘాట్లకు అంతగా తాకిడి లేదు. మొత్తంమీద భక్తులు పెరగడంతో అధికార యంత్రాంగంలో ఉత్సాహం కనిపిస్తోంది. పుష్కరాల తొలిరోజు కేవలం 62వేల మందికి పైగా, రెండో రోజు 1.70లక్షల మంది మాత్రమే హాజరయ్యారు. రెండోరోజు సెలవు ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో భక్తులు రాకపోవడంతో పరిస్థితేంటనే మీమాంస అధికారుల్లో వచ్చింది. అయితే, మూడోరోజు సంఖ్య మూడున్నర లక్షలు దాటడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ నెల 16న రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్. నరసింహన్ మట్టపల్లికి రానున్నట్టు సమాచారం. అధికారికంగా సోమవారం ఖరారు కానుంది. మూడు ప్రధాన క్షేత్రాల్లో.. సాగర్‌లో: పర్యాటక ప్రాంతం కావడంతో సాగర్‌కు ఆదివారం భక్తులు అత్యధిక సంఖ్యలో వచ్చారు. శివాలయం ఘాట్‌కు ఉదయం 8గంటలకే ఆరువేల మంది భక్తులు రాగా, పోలీసులు వారిని సురికి వీరాంజనేయస్వామి ఘాట్‌కు మళ్లించారు. సాయంత్రంవరకు 1.16లక్షల మంది భక్తులు కేవలం శివాలయం ఘాట్‌లోనే స్నానాలు చేశారు. సురికి వీరాంజనేయస్వామి ఘాట్‌లో 41వేల మంది భక్తులు స్నానాలు చేశారు. ఊట్లపల్లిఘాట్లో 2,750మంది స్నానాలు చేయగా పొట్టిచెల్మఘాట్లో కేవలం 70మంది మాత్రమే షవర్‌బాత్ చేశారు. సాగర్‌కు ఉదయం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ కుటుంబæసమేతంగా వచ్చి పుణ్యస్నానం చేశారు. సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి కుమారుడు రఘువీర్‌రెడ్డి, ఆయన సతీమణి, కుమారుడు, కుమార్తెలు స్నానాలు చేశారు. సాయంత్రం కమలానందస్వామి స్నాన ం చేశారు. కలెక్టర్ సత్యనారాయణరెడ్డి ఘాట్లను సందర్శిచారు. వాడపల్లిలో: వాడపల్లి, ఆడవిదేవులపల్లిలో కూడా ఆదివారం ఉదయం నుంచి భక్తుల రాక మొదలైంది. 10 గంటల నుంచి మద్యాహ్నం రెండు గంటల వరకు భక్తులు భారీగా తరలి వచ్చారు. వాడపల్లిలోని శివాలయం ఘాట్‌కు భారీగా భక్తులు వచ్చారు. వాడపల్లిలోని శివాలయం ఘాట్‌కు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్, ఉప లోకాయుక్త గంగిరెడ్డి, ఐజీ నాగిరెడ్డి, జిల్లా జడ్జిలు సుధ, సత్యేంద్ర, రాధాకృష్ణమూర్తి, జిల్లా మొదటి అదనపు జడ్జి సునిత, లీగల్ లిటరసీ జడ్జి శైలజాదేవి, ఎంఎం కోర్టు జడ్జి ప్రశాంతి, మొబైల్కోర్డు జడ్జి రజనిలు వీఐపీ ఘాట్‌లో పుష్కర స్నానాలు చేశారు. డీజీపీ అనురాగ్‌శర్మ శివాలయం ఘాట్‌ను సందర్శించారు. అనంతరం ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను పరిశీలించారు. మట్టపల్లిలో: మట్టపల్లిలో అయితే ఉదయం నుంచే భక్తుల తాకిడి పెరిగింది. పెద్ద ఎత్తున భక్తులు రావడంతో పోలీసులు ట్రాఫిక్ నిబంధనలను సడలించి దేవాలయ సమీపంలోని పార్కింగ్ స్థలం వరకు బస్సులు నడిపి ప్రయాణికులను చేరవేశారు. అదేవిధంగా కళ్యాణమండపం నుంచి నర్సింహస్వామి ఉత్సవమూర్తులను దేవాలయానికి తరలించారు. భక్తులందరికీ ప్రధాన దేవాలయంలోని మూలవిరాట్‌ను దర్శించుకునే విధంగా అవకాశం కల్పించారు. ఉపలోకాయుక్త గంగిరెడ్డితో పాటు పలువురు ప్రముఖులు కూడా ఇక్కడ స్నానాలు చేశారు. -
స్పీడ్ బ్రేకర్లను మరిచారా..?
సందర్భంగా మిర్యాలగూడ–నాగార్జునసాగర్ ప్రధాన రహదారిని మరమ్మతులు చేయడంతోపాటు డివైడర్లకు, కల్వర్టులకు రంగులు వేశారు. కానీ ప్రమాదకరంగా మారిన స్పీడ్‌బ్రేకర్లను మాత్రం మరిచి పోయారు. స్పీడు బ్రేకర్లు ఉన్నట్లుగా ఎక్కడా ఒక్క సూచికబోర్డుకు ఏర్పాటు చేయలేదు. దీంతో సాగర్–మిర్యాలగూడ రహదారి ప్రమాదకరంగా మారింది. ఈ రహదారి మీదుగా దూరప్రాంతాల నుంచి వచ్చే వారు సమీపంలోకి వచ్చే వరకు స్పీడు బ్రేకర్ ఉన్నట్లు తెలియక తమ వాహనాలను సడెన్‌గా బ్రేక్‌లు వేసి ఆపే క్రమంలో ముప్పుపొంచి ఉంది. ఇదే క్రమంలో వెనకాల వచ్చే వాహనాలు ఢీకొట్టే ప్రమాదం లేకపోలేదు. ఇలాంటివే గతంలోనే పలు ప్రమాదాలు జరిగినా ఆర్అండ్బీ అధికారులు మాత్రం వాటిని పట్టించుకున్నట్లు కన్పించడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రహదారిపై స్పీడు బ్రేకర్లు ఉన్నట్టు సూచిక బోర్డులు ఏర్పాటు చేయడం, స్పీడు బ్రేకర్లకు రంగులు వేయాలని వాహనదారులు కోరుతున్నారు. -
కృష్ణా పుష్కరాలను విజయవంతం చేయాలి
కనగల్ రేపటి నుంచి నిర్వహించే కృష్ణా పుష్కరాలను విజయవంతం చేయాలని నల్లగొండ ఆర్డీఓ వెంకటాచారి అధికారులకు సూచించారు. బుధవారం దర్వేశిపురం, కనగల్ పుష్కరఘాట్ల వద్ద విధులు నిర్వహించే అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు. రెండు ఘాట్ల వద్ద అధికారులు మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. విధుల్లో అధికారులు, సిబ్బంది అలసత్వం ప్రదర్శిస్తే ఉపేక్షించేది లేదన్నారు. పుష్కర స్నానాలకు వచ్చే భక్తులకు అసౌకర్యం కలుగకుండా సిబ్బంది సహరించాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో కనగల్, దర్వేశిపురం పుష్కరఘాట్ల ఇన్చార్జులు సునంద, రాజేందర్, తహసీల్దార్ కృష్ణయ్య, ఎండోమెంట్ అధికారులు రాంచందర్‌రావు, సులోచన, ఐబీడీఈ నాగయ్య, సీఐ రమేశ్‌కుమార్, ఎస్సై వెంకట్‌రెడ్డి, డి.సీతాకుమారి, ఖలీల్‌అహ్మద్ పాల్గొన్నారు. -
కృష్ణా పుష్కరాలకు భారీ బందోబస్తు
మఠంపల్లి : కృష్ణానది పుష్కరాల్లో శాంతి భద్రతల పర్యవేక్షణకు 8,500 మంది పోలీసులు,వలంటీర్లు, స్వచ్ఛంద సంఘాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. బుధవారం సాయంత్రం ఆయన మఠంపల్లిలో పోలీస్ సిబ్బందితో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా 28 ఘాట్ల పరిధిలో 6 వేల మంది పోలీసులు, మరో 2500 మంది స్వచ్ఛంద వలంటీర్లతో బందోబస్తుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముఖ్యంగా 28 ఘాట్ల వద్ద ప్రతి 20కిలో మీటర్లకు ఒక పోలీస్ పెట్రోలింగ్ వాహనం తిరుగుతుందన్నారు. కృష్ణాపుష్కరాల విజయవంతానికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతల పరిరక్షణకు విధిగా కృషి చేయాలన్నారు. సమావేశంలో డీఎస్పీ సునితామోహన్, సీఐ నర్సింహారెడ్డి, ఎస్ఐలు రమేష్, రంజిత్‌రెడ్డి, ఆర్కె.రెడ్డి, గోపితదితరులున్నారు. -
పుష్కరాలకు అందరూ సహకరించాలి
యాత్రికులకు ఇబ్బందులు కలగనీయవద్దు పలుచోట్ల హెల్ప్ డెస్క్‌ల ఏర్పాటుకు అంగీకరించిన సంఘాలు మంచినీటి సౌకర్యం ఏర్పాటు పట్టణ ఎంవీఐ శ్రీనివాసరెడ్డి కోదాడ: ఈ నెల 12 నుంచి 23 వరకు జరిగే కృష్ణా పుష్కరాలకు దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రతి ఒక్కరు సహకరించాలని కోదాడ ఎంవీఐ శ్రీనివాసరెడ్డి , పట్టణ సీఐ రజితారెడ్డిలతో పాటు పలువురు వక్తలు కోరారు. మంగళవారం కోదాడలోని లారీ అసోసియేషన్ కార్యాలయంలో లారీ యజమానులకు,అటో డ్రైవర్లలకు, ప్రైవేట్ పాఠశాలల యజమానులతో జరిగిన అవగాహన సమావేశంలో వారు మాట్లాడారు. శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కోదాడ నుంచి మట్టపల్లి ఘాట్‌కు వెళ్లడానికి వేలాది వాహనాలు వచ్చే అవకాశం ఉన్నందున వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పట్టణవాసులపై ఉందన్నారు. వారికి అన్ని విధాలుగా సహయ సహకారాలు అందించి కోదాడ వాసులను గుర్తుంచుకొనేలా వ్యవహరించాలన్నారు. అన్ని కంపెనీలు మెకానిక్‌లను అందుబాటులో ఉంచుతామని ఎక్కడైన వాహనం ఆగితే వెంటనే తమకు సమాచారం ఇస్తే మెకానిక్‌లను అక్కడికి పంపుతామని ఆయన తెలిపారు. అదే విధంగా హైద్రాబాద్ నుంచి విజయవాడకు వెల్లడానికి కూడ భక్తులు కోదాడ మీదుగా వెళ్లే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని కోరారు. నిబంధనలు పాటించాలి.. సీఐ రజితారెడ్డి మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు ఈ 12 రోజులు ఎలాంటి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోడ్డుపై వాహనాలను ఆపవద్దని, కొత్తగా వచ్చిన వారికి రూట్, ఘాట్ల సమాచారం అందించాలని కోరారు. పట్టణంలో ముఖ్యకూడళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని తెలిపారు. యాత్రికుల కోసం ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు కూడ ప్రతి రోజు బస్సులను అందుబాటులో ఉంచాలని కోరారు. వివిధ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు రోడ్డు వెంట, ముఖ్య కూడళ్లల్లో మంచినీటి సౌకర్యం, హెల్ప్‌లైన్‌డెస్క్‌లను ఏర్పాటు చెయాలని కోరారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న చోట్ల వలంటీర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో వైద్యులు జాస్తీ సుబ్బారావు, ఏటుకూరి రామారావు, రావెళ్ల సీతరామయ్య, అర్వపల్లి శంకర్, గుండపనేని నాగేశ్వరరావు, రాపోలు శ్రీనివాస్, బాణాల కోటిరెడ్డి, నర్సరాజు , అక్కిరాజు వెంకట్రావ్ తదితరులు పాల్గొన్నారు. -
రూ. 25 వేల విరాళం అందజేత
గరిడేపల్లి : కృష్ణా పుష్కరాల కోసం మట్టపల్లి నర్సింహాస్వామి క్షేత్రంలో జరుగే నిత్యాన్నదాన కార్యక్రమానికి మండల మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో విరాళం అందజేశారు. ఇందులో భాగంగా రూ. 25 వేలు, ఐదు క్వింటాళ్ల బియ్యాన్ని ఆ సంఘం మండల అధ్యక్షుడు కడియం అప్పయ్య, అన్నదాన సత్రం అధ్యక్షుడు సాలేటి రామారావుకు మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని మున్నూరు కాపుల వద్ద నుంచి ఈ విరాళం సేకరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆకుల రాము, కంబాలపల్లి వెంకటనారాయణ, గోపగాని సత్యనారాయణ, అర్జున్‌రావు, సైదులు, వెంకటమ్మ, సత్యావతి పాల్గొన్నారు. -
ముస్తాబైన మహంకాళిగూడెం పుష్కరఘాట్
నేరేడుచర్ల : ఈ నెల 12 నుంచి ప్రారంభం కానున్న కృష్ణా పుష్కరాల కోసం మండలంలోని మహంకాళిగూడెం పుష్కరఘాట్ ముస్తాబైంది. గతంలో ఉన్న ఘాట్ పక్కన నూతనంగా మరో ఘాట్ పనులు పూర్తికావడంతో నదికి అడ్డంగా రెయిలింగ్ ఏర్పాటుచేసి, ఘాట్లకు రంగులు వేయడంతో పుష్కర శోభను సంతరించుకుంది. మహంకాళిగూడెం పుష్కర ఘాట్ సమీపంలో బారీకేడ్లు ఏర్పాటుచేయడంతో పాటు పోలీసు, రెవెన్యూ, వైద్య, అగ్నిమాపక కేంద్రాలను సైతం ఏర్పాటు చేశారు. పుష్కరాల సందర్భంగా నదిలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా 30 మంది గజ ఈతగాళ్లను సిద్ధం చేశారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు తాగునీరు అందించేందుకు ప్రతి 50 మీటర్లకు ఒకటి చొప్పున నల్లాలను ఏర్పాటు చేశారు. భక్తుల వాహనాలను పార్కింగ్ చేసేందుకు మహంకాళిగూడెం సమీపంలో పార్కింగ్ స్థలాన్ని చదును చేసి రోడ్లు వేశారు. బైపాస్ రోడ్డు ద్వారా ట్రాఫిక్‌ను మళ్లించేందుకు పోలీసులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇరువైపులా బైపాస్ రోడ్డును కొంతమేర బీటీ మెటల్‌తో వేశారు. నేరేడుచర్ల నుంచి మహంకాళీగూడెం వరకు 25 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు వేసి రోడ్డుపై మార్కింగ్ చేయడం పూర్తి చేశారు. ఘాట్‌కు సమీపంలోని ఆంజనేయస్వామి దేవాలయం, మహంకాళి ఆలయంలో భక్తుల దర్శనార్ధం ఏర్పాట్లు పూర్తి చేశారు. నిరంతర విద్యుత్ కోసం ఆ శాఖ ఆధ్వర్యంలో సైతం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఘాట్ వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, పరిస్థితులను గమనించేందుకు 15 సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. వృద్ధులు, వికలాంగులు పుష్కర స్నానం చేసేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. -
పుష్కరాలకు 1150 బస్సులు
దామరచర్ల: కృష్ణాపుష్కరాలకు రాష్ట్ర వ్యాప్తంగా 1150 ఆర్టీసీ బస్సులు నడుపుతామని ఆర్టీసీ ఎండీ రమణారావు తెలిపారు. సోమవారం నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లిలో బస్సు పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. అనంతరం శ్రీమీనాక్షి అగస్త్యేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ పుష్కరాలు జరిగే నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు 1150 బస్సులు నడుపుతామన్నారు. వీటిలో ఏసీ బస్సులు కూడా ఉంటాయన్నారు. భక్తుల డిమాండ్‌ను బట్టి అవసరమైతే బస్సుల సంఖ్యను పెంచుతామన్నారు. పార్కింగ్ ప్రాంతాలనుంచి ఉచితంగా షటిల్ బస్సులు నడిపేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎం కృష్ణహరి, మధుసూదన్‌రెడ్డి, వీవీఎన్రెడ్డి, సుధాకర్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు
దామరచర్ల : కృష్ణా పుష్కరాలకు వచ్చే వృద్ధులు, వికలాంగుల కోసం అధికార యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. నదిలో స్నానమాచరించడానికి ఘాట్ పక్కనే ఉన్న కొంత భాగాన్ని ప్రత్యేకంగా వృద్ధులు, వికలాంగుల కోసం కేటాయించారు. వారికి ఇబ్బందులు తలెత్తకుండా ఇక్కడ అన్ని సదుపాయాలు కల్పించనున్నారు. దీంతో పాటుగా పార్కింగ్ స్థలాల నుంచి ఘాట్ల వరకు వెళ్లేందుకు ప్రత్యేకంగా ఆటోలను గుర్తించి పాస్‌లు ఇస్తున్నారు. ఆయా ఆటోలు తక్కువ చార్జీకే వారిని ఘాట్లకు వరకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. -
పుష్కరాలకు సర్వం సిద్ధం
– కలెక్టర్ సత్యనారాయణరెడ్డి –ఎంత మంది భక్తులు వచ్చినా ఇబ్బందులు లేవు వాడపల్లి(దామరచర్ల) కష్ణా పుష్కరాకు జిల్లాలో సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ సత్యనారాయణరెడ్డి తెలిపారు. ఆదివారం దామరచర్ల మండలం వాడపల్లి స్నానఘాట్లను, ఇతర పుష్కర పనులను పరిశీలించారు. ఈసందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ ఐదు జిల్లాల్లో గోదావరి పుష్కరాలకు 3కోట్ల మంది భక్తులు వచ్చారని, రెండు జిల్లాలో జరుగుతున్న కష్ణా పుష్కరాలకు అదే సంఖ్యలో భక్తులు వస్తారని అంచనాలు వేస్తున్నామన్నారు.ఎంతమంది భక్తులు వచ్చినా ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జిల్లాలో 2650 మీటర్ల 28 స్నానఘాట్లను అందంగా ముస్తాబు చేస్తున్నామన్నారు.11శాఖల సిబ్బంది మూడు షిఫ్టులలో ఘాట్ల వద్ద విధులు నిర్వహిస్తారన్నారు. 2500 తాగునీటి ఆర్వో ప్లాంట్లు,2300 టాయ్లెట్లు నిర్మించినట్లు తెలిపారు. భక్తుల సమూహం అ«ధికంగా ఉంటే 40 నిమిషాల నుంచి 1గంట పాటు వేచి ఉండేందుకు వీలుగా 1657 ఎకరాల్లో పార్కింగ్.హోల్డింగ్ పాయింట్లు ఏర్పాట్లు చేశామన్నారు. ఘాట్ల వద్ద మెడికల్,కంట్రోల్ రూంలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎగువ ప్రాంతంలో వస్తున్న వర్షాలతో ఇప్పటికే శ్రీశైలంకు నీళ్లు వస్తున్నాయన్నారు. దీంతో పుష్కరాలకు నీటి విడుదల ఉంటుందని, భక్తులు ఆందోళన పడాల్సిన పనిలేదన్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులు అధికారుల సూచనలు పాటించాలని కోరారు. ఆయన వెంట ఏజేసీ వెంకట్రావ్,ఆర్డీఓ కిషన్‌రావు,తహసీల్దార్ గణేష్, ఎంపీడీఓ ఉమాదేవి,ఐబీ ఎస్.ఈ ధర్మానాయక్, డీఈ మురళి, పీఆర్ ఈఈ హన్మంతరావు, డీఎస్పీ మరాంగోపాల్రావు, సీఐలు రవీందర్, భిక్షపతి,ఎస్.ఐ చరమంద రాజు పాల్గొన్నారు. -
పుష్కర పనుల నాణ్యత ప్రశ్నార్థకం
వాడపల్లి(దామరచర్ల) : ప్రభుత్వం పుష్కర పనులను ఆర్నెళ్ల క్రితం ప్రారంభిస్తే నాణ్యతగా పనులు జరిగేవని సీపీం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని వాడపల్లి పాతపోలీస్ స్టేషన్ ఘాట్, పాత సిమెంట్ఘాట్, శివాలయం ఘాట్ పనులను పరిశీలించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ పుష్కరాలు దగ్గర పడుతుండడంతో హడావుడిగా పనులు చేయడం వలన నాణ్యత ప్రశ్నార్థకంగా మారిందన్నారు. వాడపల్లిలో ఉన్న చారిత్రక కట్టడాల భద్రతపై చర్యలు తీసుకోకపోవడం సరికాదన్నారు. ఇప్పుడు రంగులు, టైల్స్ వేస్తే పుష్కరాలు అయిపోయేంత వరకైనా ఉంటాయా అనేది అధికారులే చెప్పాలన్నారు. ఆయన వెంట డివిజన్ కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్ యాదవ్, పాపానాయక్, దయానంద్,వినోద తదితరులు పాల్గొన్నారు. -
పుష్కర విధుల్లో ఉండేవారికి భోజన వసతి
ఎంజీయు (నల్లగొండ రూరల్) : పుష్కర విధుల్లో పాల్గొనే ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ అభ్యర్థులకు భోజన వసతి కల్పిస్తామని ట్రాఫిక్ సీఐ ఆదిరెడ్డి అన్నారు. శనివారం యూనివర్సిటీలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పుష్కరాలకు వచ్చే అభ్యర్థుల పట్ల మర్యాదగా మాట్లాడుతూ వారికి కావాల్సిన సమాచారాన్ని అందించాలని కోరారు. పార్కింగ్, ట్రాఫిక్, అంతరాయం కలుగకుండా చూడడం ద్వారానే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగవన్నారు. అభ్యర్థులకు ప్రత్యేకంగా రెడ్‌కలర్ షర్టు అందజేస్తామని తెలిపారు. సమావేశంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు పాల్గొన్నారు. -
పుష్కరాలకు భారీ బందోబస్తు
సందర్భంగా మట్టపల్లి వద్ద 1500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు హుజూర్నగర్ సీఐ వి.నర్సింహారెడ్డి తెలిపారు. ఈ నెల 12 నుంచి కృష్ణా పుష్కరాలు జరుగుతుండడంతో మట్టపల్లిలో ఇప్పటికే 11 శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది సంబంధిత ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పుష్కరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడడంలో పోలీసుల పాత్ర కీలకం. జిల్లాలోని వాడపల్లి, నాగార్జునసాగర్‌తో పాటు మట్టపల్లికి భక్తులు లక్షలాదిగా తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోనే ప్రధాన పుష్కర ఘాట్లలో ఒకటైన మట్టపల్లిలో కీలక విధులు నిర్వహించనున్న హుజూర్నగర్ సీఐ వి.నర్సింహారెడ్డి తెలిపిన వివరాలు ఆయన మాటల్లోనే... బందోబస్తు పనులు పూర్తి హుజూర్నగర్ సర్కిల్ పరిధిలో మట్టపల్లి, నేరేడుచర్ల మండలం మహంకాళిగూడెం ఘాట్లు ముఖ్యమైనవి. ఇక్కడ ఏర్పాటు చేసిన ఐదు పుష్కర ఘాట్ల వద్ద బందోబస్తు, రూట్ మ్యాప్‌ల విషయమై సంబంధిత అధికారులు ఇప్పటికే పనులు పూర్తి చేశారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రూపొందించిన రూట్ మ్యాప్‌ను విడుదల చేశాం. భారీ బందోబస్తు ఏర్పాట్లు పుష్కర ఘాట్ల నుంచి ఆయా రహదారులు, పార్కింగ్ స్థలాల వద్ద ఇద్దరు డీఎస్పీలు, 25 మంది సీఐలు, 100 మంది ఎస్ఐలతో పాటు 1500 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తారు. వీరితో పాటు 600 మంది ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు సైతం పుష్కర విధుల్లో పాల్గొంటున్నారు. ఖమ్మం, సైబరాబాద్ నుంచి పోలీస్ అధికారులు, సిబ్బంది రానున్నారు. ప్రతిరోజు మూడు దఫాలుగా ఉదయం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సిబ్బంది విధి నిర్వహణలో పాల్గొంటారు. 65 సీసీ కెమెరాల ఏర్పాటు పుష్కర ఘాట్ల వద్ద అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతరం పర్యవేక్షించేందుకు 65 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో మట్టపల్లి పుష్కర ఘాట్లు, పరిసర ప్రాంతాల్లో 50, మహంకాళిగూడెం ఘాట్ వద్ద 15 కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రత్యేక కంట్రోల్‌రూం ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించనున్నాం. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు మట్టపల్లికి వచ్చే వాహనాలతో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నాం. ఇందుకోసం మఠంపల్లి పోలీస్‌స్టేషన్ సమీపంలోని బైపాస్ నుంచి రఘునాథపాలెం, గుండ్లపహాడ్, పాత సుల్తాన్పూర్ తండాల మీదుగా ఎన్సీఎల్ పరిశ్రమ వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలానికి చేరుకునే విధంగా రూట్ మ్యాప్ సిద్ధం చేశాం. అక్కడి నుంచి ఆర్టీసీ ఉచిత బస్సుల్లో భక్తులను ఘాట్ల వద్దకు చేరవేస్తారు. పుష్కర స్నానం ముగించుకొని ఎన్సీఎల్ పరిశ్రమ వద్ద గల పార్కింగ్ స్థలానికి చేరుకున్న భక్తులు తిరుగు ప్రయాణంలో నేరుగా ప్రధాన రహదారికి వెళ్లే అవకాశం కల్పించాం. కోదాడ రోడ్డు మీదుగా హుజూర్నగర్ వచ్చే వాహనాలు ముక్త్యాల మేజర్ వెంట గల బైపాస్ రోడ్డు మీదుగా మట్టపల్లి వెళ్లే విధంగా, మిర్యాలగూడ రోడ్డు నుంచి హుజూర్‌నగర్‌కు వచ్చే వాహనాలను పట్టణం నుంచి మట్టపల్లి వెళ్లేందుకు అనుమతిస్తున్నాం. వీఐపీ పాస్‌ల జారీ అధికారం కలెక్టర్, ఎస్పీలదే.. వీఐపీ పాస్‌ల జారీ విషయంలో తమకెలాంటి అధికారాలు లేవు. కలెక్టర్, ఎస్పీలు మాత్రమే వీఐపీ పాస్‌లను జారీ చేస్తారు. -
పుష్కర పనులను త్వరితగతిన పూర్తిచేయాలి
– మంత్రి జగదీశ్‌రెడ్డి నాగార్జునసాగర్ పుష్కర పనులను త్వరితగతిన పూర్తిచేయాలని రాష్ట్రవిద్యుత్శాఖమాత్యులు గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం నాగార్జునసాగర్‌లో కృష్ణాతీరానగల శివాలయం,సురికివీరాంజనేయస్వామి ఘాట్లను సందర్శించారు. వీఐపీఘాట్ శివాలయంలో చేయాల్సిన మార్పులను అధికారులతో చర్చించారు. ఐదు నుంచి 10వేల క్యూసెక్కుల నీటిని విద్యుదుత్పాదన ద్వారా కృష్ణా నదిలోకి విడుదల చేస్తే ఏ ప్రాంతం వరకు నీళ్లు వస్తాయే అడిగి తెలుసుకున్నారు. అలాగే దుస్తులు మార్చుకునేందుకు మధ్యలో గదులు ఏర్పాటు చేయాలని సూచించారు. సురికివీరాంజనేయ స్వామి ఘాట్ సమీపంలో నదికి అడ్డంగా కట్టవేసి ఘాట్‌లోకి నీటిని మళ్లించాలని ఎస్ఈ రమేశ్‌కు సూచించారు. భక్తులు అసౌకర్యాలకు గురికాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని కోరారు.. పాత వీఐపీ ఘాట్‌ను సందర్శించిన మంత్రి గత పుష్కరాలలో సాగర్‌డ్యాంపై గల చిల్డ్రన్స పార్కు వద్ద నిర్మించిన వీఐపీ ఘాట్‌ను మంత్రి సందర్శించారు. నేటికీ టెయిల్స్ చెక్కుచెదరకుండా ఉన్నాయని జలాశయంలోకి నీరు వచ్చి చేరితే ఈఘాట్ను వినియోగించుకోవచ్చని అధికారులకు సూచించారు. శివాలయం ఘాట్‌కు అత్యధిక సంఖ్యలో వీఐపీలు వచ్చిన సమయంలో సాధారణ భక్తులు ఇబ్బందులకు గురయ్యే అవకాశాలుంటాయని జెడ్పీ వైస్‌చైర్మన్ కర్నాటి లింగారెడ్డి సూచించారు. దీంతో ఈ ఘాట్‌ను వినియోగంలోకి తేవడానికి ఉన్న అవకాశాలను చూడాలని అధికారులకు సూచనలు చేశారు. మంత్రితో పాటు పార్లమెంట్ సభ్యులు గుత్తాసుఖేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ బాలునాయక్, వైస్‌చైర్మన్ కర్నాటి లింగారెడ్డి,యడవల్లి విజయేందర్‌రెడ్డి,ఎమ్.సీ.కోటిరెడ్డి, కర్నబ్రహ్మనందరెడ్డి,రమావత్ శంకర్‌నాయక్,మలిగిరెడ్డి లింగారెడ్డి,పుల్లెంల వెంకటనారాయణగౌడ్, కలెక్టర్ సత్యనారాయణరెడ్డి, జెడ్పీ సీఈఓ మహేందర్‌రెడ్డి,ఎస్ఈ రమేశ్,డీఈ విజయకుమార్,కృష్ణయ్య,నర్సింహారావు ఉన్నారు. -
‘అంత్య’ శోభితం
-
పూర్తికావస్తున్న ఊట్లపల్లి ఘాట్
పెద్దవూర : ఊట్లపల్లి పుష్కర ఘాట్ పనులు పూర్తికావస్తున్నట్లుగా ఘాట్ ఇన్చార్జి అధికారి, డిండి ప్రాజెక్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ప్రభాకర శ్రీనివాస్ తెలిపారు. సోమవారం ఆయన ఘాట్‌ను సందర్శించారు. ప్రభుత్వం నిర్ణయించిన సమయానికి పనులు పూర్తవుతాయని అన్నారు. ఈ నెల 5వ తేదీ లోపు పనులు మొత్తం పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించనున్నట్లు తెలిపారు. ఆయన వెంట దేవరకొండ బస్ డిపో మేనేజర్ రమేశ్, మేరెడ్డి జైపాల్‌రెడ్డి ఉన్నారు. -
రాణించిన పుష్కర్
ఎం.ఎల్.జైసింహా 193 ఆలౌట్ సీనియర్ జోనల్ క్రికెట్ సాక్షి, హైదరాబాద్: పుష్కర్ (66) అర్ధసెంచరీతో రాణించడంతో ఎం.ఎల్.జైసింహా ఎలెవన్ జట్టు 193 పరుగులు చేసి ఆలౌటైంది. లాలా హర్బన్స్ రాయ్ ట్రోఫీ సీనియర్ జోనల్ టోర్నీ మొదట బ్యాటింగ్‌కు దిగిన జైసింహా జట్టులో పుష్కర్‌తో పాటు రాహుల్ బుద్ధి (39) మెరుగ్గా ఆడాడు. తర్వాత బ్యాటింగ్ చేపట్టిన కంబైన్డ్ ఎలెవన్ 4 ఓవర్లో వికెట్ నష్టపోకుండా 4 పరుగులు చేసింది. మరో మ్యాచ్‌లో కృష్ణమూర్తి ఎలెవన్ 95 పరుగులకే ఆలౌటైంది. ప్రెసిడెంట్ ఎలెవన్ బౌలర్లు కార్తికేయ 4, తనయ్ త్యాగరాజన్ 3 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ప్రెసిడెంట్ జట్టు వికెట్ నష్టానికి 45 పరుగులు చేసింది. మ్యాచ్‌లు వాయిదా వర్షం వల్ల క్రికెట్ మ్యాచ్‌ల్ని వాయిదా వేశారు. సీనియర్ జోనల్ క్రికెట్ టోర్నీలో నేడు మూడు మ్యాచ్‌లు మినహా మిగతా పోటీలు సాధ్యపడలేదు. మైదానాలన్నీ వాన నీటితో చిత్తడిగా మారడంతో తొలి రోజు ఆటను రద్దు చేశారు. అయితే తదుపరి జరిగే మ్యాచ్‌లను రీ షెడ్యూలు చేస్తామని హెచ్‌సీఏ కార్యదర్శి జాన్‌మనోజ్ ఒక ప్రకటనలో తెలిపారు. -
పుష్కర ప్రాంతాలను పరిశీలించండి
అర్బన్ జిల్లా ఎస్పీ గుంటూరు (పట్నంబజారు) : కృష్ణా పుష్కర బందోబస్తులో భాగంగా వచ్చిన అధికారులు వారికి అప్పగించిన ప్రాంతాలను పరిశీలించాలని అర్బన్ జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆదేశించారు. అర్బన్ ఎస్పీ క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన అధికారులతో సమావేశమయ్యారు. అధికారులు ఘాట్ల వద్ద వారికి కేటాయించిన ప్రాంతాలను పరిశీలించి సలహాలు, సూచనలు అందజేశారు. తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారిస్తామని అధికారులు తెలిపారు. పుష్కరాల సమయంలో ప్రజలకు సేవలందించేందుకు 500 మంది స్కౌట్స్ అండ్ గైడ్స్ పోలీసుశాఖకు అందుబాటులో ఉంచుతామని గుంటూరు కార్యదర్శి జీవీ కుమార్, అసిస్టెంట్ ఎస్వోసీ పి.శ్రీనివాస్ ఎస్పీకి తెలియ జేశారు. ఈ కార్యక్రమంలో సీఐడీ ఎస్పీ డి.కోటేశ్వరరావు, అదనపు ఎస్పీలు జె.భాస్కరరావు, సుబ్బారాయుడు, బీపీ తిరుపాల్ తదితరులు పాల్గొన్నారు. -
ముహూర్తం ముంచుకొస్తున్నా మీనమేషాలేనా?
దేవీచౌక్ (రాజమహేంద్రవరం) : అంత్యపుష్కరాలకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులు ఇప్పటి వరకు ప్రజాప్రతినిధులతో చర్చించకపోవడం శోచనీయమని శాసనమండలి సభ్యుడు, భారతీయ జనతాపార్టీ జాతీయ కార్యవర్గసభ్యుడు సోము వీర్రాజు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన కోటిలింగాలఘాట్, పుష్కరఘాట్, టీటీటీ ఘాట్, సరస్వతిఘాట్, వీఐపీ ఘాట్లను సందర్శించారు. సోమువీర్రాజు విలేకరులతో మాట్లాడుతూ అంత్య పుష్కరాలకు నాలుగే రోజులే గడువున్నా, అధికారులు అలసత్వం వీడలేదన్నారు. ఆది పుష్కరాలలో నీరు లేక, సీలేరు నుంచి విడుదల చేశారని, ఇప్పుడు ముందుగానే వరదలు రావడంతో గోదావరిలో తగినంత నీరు ఉందన్నారు. ఘాట్లలో పరిశుభ్రతపై దృష్టి సారించాలని, స్త్రీలు దుస్తులు మార్చుకునేటందుకు సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఘాట్లలో పేరుకుని పోయిన బురదను తొలగించుడానికి అగ్నిమాపక విభాగం సేవలు వినియోగించుకోవాలని సూచించారు. వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున ఓఎన్జీసీ, ఇంటర్నేషనల్ పేపర్ మిల్స్వంటి సంస్థలనుంచి మోటార్లు తెప్పించుకుని నల్లా చానెల్ వద్ద అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. త్వరలో కలెక్టర్‌ను కలసి, సమస్యలపై చర్చిస్తామన్నారు. భారతీయ జనతాపార్టీ రాష్ట్రకార్యవర్గ సభ్యుడు పొట్లూరి రామ్మోహనరావు, కార్పొరేటర్ రేలంగి శ్రీదేవి, ప్రధాన కార్యదర్శి అడబాల రామకృష్ణారావు, మీడియా ఇన్చార్జి దాస్యం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
పుష్కరాల విజయవంతానికి సహకరించాలి
మట్టపల్లి (మఠంపల్లి): మండలంలోని మట్టపల్లి వద్ద ఆగస్టు 12 నుంచి 23 వరకు జరిగే కృష్ణా పుష్కరాలకు స్థానికంగా ఉన్న అన్ని వర్గాలు, శాఖలు సహకరించాలని తహసీల్దార్ యాదగిరి, ఎస్ఐ ఆకుల రమేశ్ కోరారు. మంగళవారం మట్టపల్లిలోని ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రంలో వివిధ కులాల అన్నదాన సత్ర కమిటీలతో నిర్వహించిన సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. పుష్కరాల విజయవంతానికి దేవస్థానం, అన్నదానసత్రాలు, స్థానిక గ్రామపంచాయతీ, ఆర్టీసీ తదితర శాఖలు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా అన్నదాన సత్ర కమిటీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో ఆలయ అనువంశిక ధర్మకర్త చెన్నూరు మట్టపల్లిరావు, ఈఓ ఎంపీ లక్ష్మణరావు, సర్పంచ్ శ్రీనివాసరావు, ఆర్ఐ శైలజ, చల్లా రామ్మూర్తి, దాసా నాగేశ్వరరావు, తండు వెంకటరత్నంగౌడ్, ఎన్.అంజయ్యగౌడ్, ఎ.శౌరెడ్డి, పి.రామారావు, ఎం.వెంకటేశ్వర్లు, మట్టపల్లిరావు, గిరిబాబు, చంద్రశేఖరశర్మ, అశోక్, ఎం.ఎం. యాదవ్, మాల్యాద్రి, బుచ్చయ్య, అనంతరాములు, రమేష్, కార్యదర్శి గురవయ్య, వీఆర్ఓ వెంకటరామారావు పాల్గొన్నారు. -
జబర్దస్త్ బందోబస్తు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : పుష్కరాలను సజావుగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామని ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. సగటు పుష్కర భక్తుడు కించిత్ కూడా ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. పుష్కర ఘాట్లకు వెళ్లేందుకు, వచ్చేందుకు వేర్వేరు మార్గాలు కేటాయిస్తున్నామని.. 189 సీసీ కెమెరాలతో నిఘా పెట్టినట్లు వివరించారు. పుష్కారాలు జరిగే 12 రోజులపాటు యాదగిరిగుట్టకు ప్రత్యేక బందోబస్తు చర్యలు తీసుకుంటున్నామని.. భక్తులు, ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. పుష్కరాల నేపథ్యంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న ఏర్పాట్లపై ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు మీకోసం.. సాక్షి: నమస్తే ఎస్పీ గారూ...! కృష్ణా పుష్కరాల భద్రత కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎంత మంది పోలీసు సిబ్బందిని వినియోగించుకుంటున్నారు? ఎస్పీ: పుష్కరాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. పుష్కర స్నానాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలనేది ప్రభుత్వ ఉద్దేశం. అందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా మొత్తం ఏడు వేల మంది సిబ్బందిని బందోబస్తు కోసం ఉపయోగించుకుంటున్నాం. 2వేల మంది మన జిల్లా సిబ్బంది కాగా, మిగిలిన సిబ్బంది ఖమ్మం, వరంగల్‌సిటీ, రూరల్, మెదక్, సైబరాబాద్ ఈస్ట్, వెస్ట్‌కు చెందిన వారు. ఇందులో ఇద్దరు అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులు కూడా ఉంటారు. 15 మంది డీఎస్పీలు, 60 మంది సీఐలు, 150 మంది ఎస్ఐలుంటారు. మిగిలిన వారు కానిస్టేబుళ్లు, హోంగార్డులు. సాక్షి: ఘాట్ల వద్ద చేపడుతున్నæ ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు ఏమున్నాయి? ఎస్పీ: పుష్కర ఘాట్ల వద్ద క్లోజ్డ్ సర్క్యూట్ (సీసీ) కెమెరాలతో పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నాం. మొత్తం 28 పుష్కర ఘాట్ల వద్ద 180 సీసీ కెమెరాల ఏర్పాటు కోసం రూ.48లక్షల నిధులు వచ్చాయి. భక్తులు ఎక్కువగా వస్తారని భావిస్తున్న నాగార్జునసాగర్, వాడపల్లి, మఠంపల్లిలో ఘాట్ల వద్ద 40 చొప్పున 120 కెమెరాలు పెడుతున్నాం. మిగిలిన చోట్ల 60 కెమెరాలను పంపిణీ చేస్తాం. మూడు వీఐపీ ఘాట్ ప్రాంతాల్లో వద్ద పోలీస్ కంట్రోల్ రూంలుంటాయి. ఈ కంట్రోల్ రూంలనుంచి సీసీ కెమెరాలను పర్యవేక్షిస్తాం. పుష్కరాలు ముగిసిన తర్వాత ఈ సీసీ కెమెరాలను జిల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, కోదాడ, దేవరకొండ పట్టణాల్లో అమర్చుతాం. మరో విషయం ఏమిటంటే... 100 ఎంబీపీఎస్ సామర్థ్యం కల కేబుల్ లైన్ ఇవ్వాలని బీఎస్ఎన్ఎల్ను అడుగుతున్నాం. వారు కూడా సూత్రప్రాయంగా అంగీకరించారు. ఆ లైన్ ఏర్పాటు చేస్తే కేంద్రీకృత భద్రత వ్యవస్థ ఏర్పాటవుతుంది. జిల్లా కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలే కాదు... సెక్రటేరియల్‌లో కూర్చుని కూడా జిల్లాలోని పుష్కర ఘాట్లలో ఏం జరుగుతుందో చూడవచ్చు. సాక్షి: పుష్కరాల భద్రత కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు? ఎస్పీ: సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంలో తెలంగాణ పోలీస్ ఎప్పుడూ ముందే ఉంది. ఈసారి పుష్కరాల కోసం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఓ మొబైల్ యాప్‌ను రూపొందిస్తున్నాం. ఈ యాప్‌ను మరో వారం రోజుల్లో విడుదల చేస్తున్నాం. ఇందులో జిల్లాలోని పుష్కర ఘాట్లకు సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ ఉన్న ఎవరైనా దీన్ని ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్‌ను చూస్తే పుష్కర ఘాట్ల వద్ద ఎలాంటి పరిస్థితి ఉంది? ట్రాఫిక్ ఏ రూట్లో ఎలా ఉంది? ఎక్కడ జామ్ అయింది? ప్రమాదాలు జరిగిన వివరాలు? తప్పిపోయిన వారి సమాచారం? కంట్రోల్ రూం నెంబర్లు... ఇలా పుష్కర భద్రతకు సంబంధించిన అన్ని వివరాలు ఉంటాయి. ఏ ఘాట్‌కు ఎక్కడి నుంచి ఎలా వెళ్లవచ్చు? ఎలా రావచ్చు? ఎక్కడ పార్కింగ్, హోల్డింగ్ ఏరియాలున్నాయి? లాంటి సమాచారం కూడా పొందుపరుస్తున్నాం. ఈసారి పుష్కరాలకు ఇదే ప్రత్యేకత. సాక్షి: రాకపోకలు సజావుగా సాగేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఎస్పీ: పుష్కర భక్తులు స్నానం చేసి, దైవదర్శనం చేసుకోవడం ఎంత ప్రాధాన్యత కలదో... వెళ్లి రావడం కూడా అంతే ముఖ్యమైనది. అందుకే రోడ్డు మార్గంలో వెళ్లే భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. జిల్లాలోని అన్ని ఘాట్లకు ఒన్వేలు ఏర్పాటు చేస్తున్నాం. అంటే పుష్కర ఘాట్‌కు వెళ్లేందుకు ఒక రూట్ ఉంటే... వెళ్లేందుకు మరో రూట్ ఉంటుంది. వెళ్లిన దారిలో వచ్చే పని ఉండదు. తద్వారా ట్రాఫిక్జామ్లుండవు. ప్రమాదాలు జరగవు. అదే విధంగా పుష్కర స్నానాల కోసం భక్తులను ఉదయం 4 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వర కే అనుమతిస్తాం. ఆ సమయంలో హైదరాబాద్ – మాచర్లకు వెళ్లే రోజువారీ వాహనాలను దారిమళ్లించి గుర్రంపోడు, నల్లగొండ, మిర్యాలగూడ, వాడపల్లి మీదుగా గుంటూరు జిల్లాకు పంపిస్తాం. అదే విధంగా కృష్ణా జిల్లాకు వెళ్లే వాహనాలను కోదాడ నుంచి ఖమ్మం వైపునకు మళ్లించే ఆలోచన చేస్తున్నాం. సాక్షి: పార్కింగ్, హోల్డింగ్ ఏరియాల పరిస్థితి ఏంటి? ఎస్పీ: జిల్లాలో పార్కింగ్, హోల్డింగ్ ఏరియాలపై ప్రత్యేక దృష్టి పెట్టాం. ఇప్పటికే ప్రతి ఘాట్ వద్ద పార్కింగ్ ప్రదేశాలను గుర్తించి ఏర్పాటు చేశాం. ఘాట్ ఎన్ని మీటర్లుంది... ఆ ఘాట్‌లో గంటకు ఎంతమంది భక్తులు స్నానాలు చేసే వీలుంది... ఆ మేరకు ఎన్ని వాహనాలు వస్తాయనే అంచనాతో ప్రతి చోటా పార్కింగ్‌కు అవసరమైన వందల ఎకరాల స్థలాన్ని తీసుకున్నాం. అదే విధంగా పార్కింగ్ ఏరియాలు నిండిపోయినప్పుడు భక్తుల తాకిడి లేకుండా వాహనాలన్నింటిని దూరంగా నిలిపివేసేందుకు హోల్డింగ్ ఏరియాలను ఏర్పాటు చేస్తున్నాం. పార్కింగ్, హోల్డింగ్ ఏరియాల్లో మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యాలుంటాయి. టీషాప్లు కూడా ఉంటాయి. రెండు చోట్లా బందోబస్తు ఉంటుంది. జిల్లాలో 25 హోల్డింగ్ ఏరియాలున్నాయి. జాతీయ రహదారులపై వీటిని ఏర్పాటు చేశాం. పార్కింగ్ ఏరియాల్లో క్రేన్, టోయింగ్ వాహనం, మెకానిక్‌లను కూడా అందుబాటులో ఉంచుతున్నాం. సాక్షి: తొక్కిసలాటలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎస్పీ: ఈసారి పుష్కరాలకు జిల్లాకు సుమారు 1.50 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా. ఈ భక్తులు ఎప్పుడు, ఎలా వస్తారన్నది ముందే ఊహించడం కష్టం. ఆ రోజు పరిస్థితిని బట్టి ప్రణాళికలు రూపొందించుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు ముందు జాగ్రత్తగా ప్రతి ఘాట్‌కు వెళ్లేందుకు దారిసూచికలు ఏర్పాటు చేస్తున్నాం. దారికి ఇరువైపులా ఆర్అండ్బీ బారికేడింగ్ కూడా చేస్తోంది. ఘాట్ చుట్టూ వల ఏర్పాటు చేస్తాం. అంటే ఘాట్‌పై స్నానం చేసే వాళ్లు నీటి లోపలకు వెళ్లకుండా ఇది అడ్డుకుంటుంది. ఆ మెష్ ఆవల జాలరి బోట్లు, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచుతాం. ఒక్కో ఘాట్ వద్ద ఒక్కో షిఫ్ట్‌లో ఇద్దరు ఈతగాళ్లుంటారు. అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ట్యూబ్‌లు, తాళ్లు ఏర్పాటు చేస్తున్నాం. ఘాట్ల వద్ద పరిస్థితిని పర్యవేక్షించేందుకు జాతీయ విపత్తు నిర్వహణ దళం (ఎన్డీఆర్ఎఫ్) కూడా టీంలను ఏర్పాటు చేస్తోంది. ఈ టీంలో ఒక్కో షిఫ్ట్‌లో 10 మంది సిబ్బంది ఉంటారు. వీరు కూడా ఘాట్లవద్ద ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక పడవల్లో బందోబస్తు చేస్తారు. దేవాలయాల అధికారులతో మాట్లాడి ప్రసాద, అన్నదాన కౌంటర్లను దూరంగా ఏర్పాటు చేస్తాం. సాక్షి: పుష్కరాల నిర్వహణలో స్వచ్ఛంద సంస్థల పాత్ర ఏ విధంగా ఉండబోతోంది? ఎస్పీ: ఈ పుష్కరాల కోసం మొత్తం 1500 మంది వలంటీర్లను ఉపయోగించుకుంటున్నాం. అందులో 750 మంది సత్యసాయి సేవాసదన్కు చెందిన వారుంటారు. వీరు దేవాలయాల వద్ద, ఘాట్ల వద్ద సేవ చేస్తారు. ఘాట్, దేవాలయ పరిసరాలను శుభ్రంగా ఉంచడంతో పాటు భక్తులకు దైవదర్శనం చేసేందుకు వీరు పనిచేస్తారు. వీరితో పాటు 200 మంది ఎన్సీసీ, 550 మంది ఎన్ఎస్ఎస్ కార్యకర్తలను ఉపయోగించుకుంటాం. వీరు ట్రాఫిక్‌ను నియంత్రించడంతో పాటు పార్కింగ్, హోల్డింగ్ ఏరియాల్లో పనిచేస్తారు. సాక్షి: దొంగతనాలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మొబైల్ పార్టీలుంటాయా? ఎస్పీ: పుష్కర భక్తులు దొంగతనాల బారిన పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. అన్ని జిల్లాల నుంచి సీసీఎస్ (క్రైం పార్టీ) పోలీసులను రప్పించి ఘాట్ల వద్ద నిఘా ఉంచుతాం. జిల్లాలోని అన్ని మేజర్ బస్టాండుల్లో ఈ నిఘా 24 గంటలు కొనసాగుతుంది. పార్కింగ్ ప్రదేశాల వద్ద ఉన్న ఆర్టీసీ షటిల్ బస్‌స్టాపుల్లో కూడా ఉంటుంది. ఇక, హైదరాబాద్ నుంచి వరంగల్, విజయవాడ, అద్దంకి, మాల్ ప్రధాన రహదారులపై మొబైల్ పోలీస్ పార్టీలు నిరంతరం పహారా కాస్తాయి. ప్రతి 20 కిలోమీటర్లకు ఒక ఎస్ఐ ఆధ్వర్యంలో వాహనం ఉంటుంది. ప్రతి 40 కి లోమీటర్లకు ఓ సీఐ పర్యవేక్షక అధికారిగా ఉంచుతాం. అదే విధంగా ప్రతి హైవేని ఓ డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షిస్తారు. ఈ బృందాలు ప్రమాదాల నివారణ, సహాయ చర్యల్లో కీలకంగా ఉంటాయి. సాక్షి: ఇంకా ఎలాంటి బందోబస్తు చర్యలుంటాయి? సాయుధ బలగాలను ఉపయోగించుకుంటున్నారా? ఎస్పీ: ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో సాగర్‌కు వచ్చే పుష్కర భక్తులను డ్యాం మీదకు అనుమతించడం లేదు. అన్ని ఘాట్లవద్ద, జిల్లా వ్యాప్తంగా డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్లను గస్తీ తిప్పుతాం. అలాగే ప్రతి ఘాట్ వద్దా 24 గంటల పాటు సాయుధ బలగాలు గస్తీ ఉంటాయి. ప్రతి ఘాట్ వద్ద 20 మంది సభ్యులతో కూడిన ఓ బృందం ఉంటుంది. పుష్కరాలు జరిగినన్ని రోజులు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట వద్ద ప్రత్యేక బందోబస్తు ఉంటుంది. ఒక ఎస్సై, 25 మంది కానిస్టేబుళ్లతో పహారా ఉంటుంది. కృష్ణానదిపై ఉన్న అన్ని బల్లకట్టులను ఆ 12 రోజులు ఆపేయాలనుకుంటున్నాం. సాగర్‌లో బోటింగ్ కూడా నిలిపివేసే అంశాన్ని పరిశీలిస్తున్నాం. మొత్తం మీద పుష్కర స్నానం కోసం జిల్లాకు వచ్చే ఏ ఒక్క భక్తుడు ఇబ్బంది పడకుండా ఇంటికి వెళ్లేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటున్నాం. శాంతియుతంగా పుష్కరాలు ముగియాలంటే పోలీసు కృషితో పాటు ప్రజల సహకారం కూడా అవసరం. -
ఎక్కడి పనులు అక్కడే..!
కృష్ణా పుష్కరాలకు ముంచుకొస్తున్న గడువు –చందంపేట, పెద్దవూర మండలాల్లో పనులు నత్తనడక.. –ఆలస్యంగా ఇచ్చారని కాంట్రాక్టర్ల ఆవేదన కృష్ణా పుష్కరాలకు గడువు ముంచుకొస్తున్నా పనుల్లో వేగం పుంజుకోవడం లేదు. ఇప్పటికే చివరి దశకు చేరుకోవాల్సిన పనులు.. నత్తనడకను తలపిస్తున్నాయి. పలు చోట్ల పరిస్థితి చూస్తుంటే సకాలంలో పూర్తవుతాయా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వర్క్స్ ఆలస్యంగా ఇవ్వడం వల్లే జాప్యం జరుగుతుందని కాంట్రాక్టర్లు బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చందంపేట : మండలంలో కృష్ణా పుష్కరాల కోసం పెద్దమునిగల్, కాచరాజుపల్లిలో రెండు ఘాట్లు నిర్మిస్తున్నారు. ఈనెలాఖరు నాటికి వాటి నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. అధికారులు, కాంట్రాక్టర్లు ఎల్లవేళలా పనుల్లో నిమగ్నమైనా గడువులోగా పూర్తయ్యేలా కనిపించడం లేదు. అదే విధంగా ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో పెద్దమునిగల్ స్టేజీ నుంచి కాచరాజుపల్లి డబుల్ రోడ్డు వరకు 31 కిలో మీటర్ల మే రూ. 34.7 కోట్ల వ్యయంతో పనులు చేపడుతున్నారు. ఈ పనుల పరిస్థితి కూడా అధ్వానంగా ఉంది. సింగిల్ రోడ్డు కూడా పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. పెద్దమునిగల్ ఘాట్‌కు చేపట్టిన రోడ్డు పనులను ఫారెస్ట్ అధికారులు అడ్డుకోవడంతో ఇప్పటికీ పూర్తి కాలేదు. పార్కింగ్ కోసం పెద్దమునిగల్, కాచరాజపల్లి వద్ద స్థలం సేకరించారు. కానీ ఆ స్థలాల నిండా చెట్టే దర్శనమిస్తున్నాయి. ఇదిలా ఉండగా పుష్కరాల సమయం నాటికి నీరు రాకుంటే నది నుంచిlమోటార్లు ఏర్పాటు చేసి ఘాట్ల వద్దకు పైపుల ద్వారా సరఫరా చేయాలి. భక్తులు స్నానం చేయడానికి షవర్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఏర్పాట్లు మొదలే పెట్టలేదు. మంచినీటి సౌకర్యం కోసం రెండు ఘాట్ల వద్ద నిర్మిస్తున్న ఆర్వో ప్లాంట్ల పనులు కొనసాగుతూనే ఉన్నాయి. అంతేకాకుండా పార్కింగ్ స్థలాలు, ఘాట్ల వద్ద విద్యుదీకరణ పనులు ఇంకా చివరి దశకు చేరుకోలేదు. పెద్దమునిగల్ ముత్యాలమ్మ దేవాలయం, కాచరాజుపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి రెండు రోజుల క్రితమే మరమ్మతు పనులు ప్రారంభించారు. తలలు పట్టుకుంటున్న అధికారులు పుష్కరాలకు గడువు ముంచుకొస్తుండడం, పనులు ఇంకా ఓ కొలిక్కి రాకపోవడంతో అధికారులు, కాంట్రాక్టర్లు తలలు పట్టుకుంటున్నారు. పనుల కోసం ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించిందని, సకాలంలో పూర్తి చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేస్తుండడంతో కాంట్రాక్టర్లు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. పనులు ముందుగా అప్పగిస్తే గడువులోగా పూర్తి చేసేవాళ్లమని, ఆలస్యంగా ఇచ్చి పూర్తి చేయాలంటే ఎలా సాధ్యమని కొంతమంది కాంట్రాక్టర్లు బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. -
వన్‌వే రహదారులపై అధికారుల సర్వే
నాగార్జునసాగర్ పుష్కర స్నానాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు అధికారులు వన్‌వే రహదారుల ఏర్పాటుకు శనివారం సర్వే నిర్వహించారు. నాగార్జునసాగర్‌కు వచ్చి స్నానాలు చేసి తిరుగు ప్రయాణంలో హాలియా వైపు వెళ్లే వారు నెల్లికల్లు క్రాస్‌రోడ్డు నుంచి పిల్లిగుండ్ల తండా మీదుగా పేరూరు నుంచి హాలియాకు చేరేందుకు రోడ్డు ఎలా ఉందో చూడటంతో పాటు ఎంత సమయం పడుతుంది? దూరం ఎన్ని కిలోమీటర్లు వస్తుందనే అంశంపై సర్వే నిర్వహించారు. పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఉన్న అన్ని అవకాశాలును వినియేగించుకునేందుకు అధికారులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ సర్వేలో స్పెషల్ ఆఫీసర్ మోహన్‌రెడ్డితో పాటు హాలియా సీఐ పార్థసారథి,ఆర్టీసీ అధికారులు ఉన్నారు. -
పుష్కరాలకు ఉచిత బస్సులు
నాగార్జునసాగర్ : కృష్ణా పుష్కరాలకు పొట్టిచెలిమ నుంచి కృష్ణా తీరంలోని స్నానఘాట్ల వరకు ఉచితంగా బస్సులు నడపనున్నట్లుగా నల్లగొండ ఆర్టీసీ డిపో మేనేజర్ జె.వి.బాబు తెలిపారు. గురువారం నాగార్జునసాగర్‌లోని పుష్కరఘాట్లు, హిల్‌కాలనీ, పైలాన్‌కాలనీ బస్టాండ్లను సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నల్లగొండ, హైదరాబాద్, మిర్యాలగూడ, సూర్యాపేట, భువనగిరి తదితర ప్రాంతాల నుంచి వచ్చే బస్సులు పొట్టిచెలిమ వరకు వచ్చి తిరిగి వెళ్తాయన్నారు. అక్కడ ఏర్పాటు చేసే పార్కింగ్ స్థలంలో బస్సులు ఆగుతాయన్నారు. భక్తులకు రవాణా పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆయన వెంట అసిస్టెంట్ జిల్లామేనేజర్ లావణ్య తదితరులు ఉన్నారు. -
పుష్కరాలకు పటిష్ట బందోబస్తు
– 180 సీసీ కెమెరాల ఏర్పాట్లు – 24 గంటలు పెట్రోలింగ్ – పుష్కర రూట్లలో సూచిక బోర్డులు – ఎస్పీ ఎన్.ప్రకాశ్‌రెడ్డి నల్లగొండ : కృష్ణా పుష్కరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ ఎన్.ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో డీఎస్పీలు, సీఐలతో నిర్వహించిన సమావేశంలో పుష్కరాల ఏర్పాట్లు, తీసుకోవాల్సిన బందోబస్తు చర్యలు, పార్కింగ్ తదితర అంశాలపై పోలీసులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలో 120 కిలో మీటర్ల మేర కృష్ణానది ప్రవహిస్తుండడంతో 28 పుష్కరఘాట్లు పుణ్యస్థానాల కోసం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాకు హైదరాబాద్ దగ్గరగా ఉండడం వల్ల ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉందని, అందుకు తగ్గట్టుగా భద్రత చర్యలు చేపట్టాలని సూచించారు. పుష్కరాలను 180 సీసీ కెమెరాలతో పరిశీలించేందుకు ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి 20 కిలోమీటర్లకు మొబైల్ పెట్రోలింగ్ పోలీస్ బృందాన్ని 24 గంటలు గస్తీ నిర్వహించాలన్నారు. పుష్కరాల యాప్‌ను త్వరలో విడుదల చేస్తామని చెప్పారు.వాహనాల ద్వారా వచ్చే వారికి పుష్కర రూట్లు తెలిపేందుకు సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. 6751 మంది పోలీసులతో భద్రత చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. అంబులెన్స్‌లు, వైద్య సదుపాయం ముందస్తుగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కోటి 50 లక్షల మంది భక్తులు పుష్కర పుణ్యస్నానాలు ఆచరిస్తారని అంచనా వేస్తున్నట్లు వివరించారు. వచ్చే, పోయే వాహనాలను వేర్వేరు రహదారుల్లో మళ్లించాలని, ప్రమాదాలు జరగకుండా మూలమలుపుల వద్ద సూచిక బోర్డుల ఏర్పాటు, విస్తరణ చర్యలు సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తూ చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో ఎఎస్పీ గంగారాం, డీయస్పీలు సుధాకర్, సునీతామోహన్, చంద్రమోహన్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. -
పుష్కర అధికారిగా వికాస్ రాజ్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: వచ్చే నెలలో జరుగనున్న కృష్ణా పుష్కరాల కోసం నిర్వహిస్తున్న పనులను పర్యవేక్షించేందుకు గాను ఐఏఎస్ అధికారి వికాస్‌రాజ్‌ను జిల్లా ప్రత్యేక అధికారిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం పుష్కర భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పుష్కరాల నిర్వహణను వికాస్‌రాజ్ పర్యవేక్షిస్తారు. ఈ పుష్కరాల కోసం జరుగుతున్న ప్రత్యేక పనులను, ఇతర ఏర్పాట్లను కూడా ఆయన ఎప్పటికప్పుడు జిల్లా అధికారులతో సమీక్షిస్తారు. 1992 బ్యాచ్‌కు చెందిన వికాస్‌రాజ్ ప్రస్తుతం చిన్న నీటిపారుదల శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. పుష్కరాల జిల్లా ప్రత్యేక అధికారిగా నియమితులయిన వికాస్‌రాజ్ గురువారం జిల్లాకు రానున్నారు. జిల్లాకు వచ్చిన వెంటనే పుష్కర పనులపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి అనంతరం వాడపల్లికి వెళతారని, అక్కడ జరుగుతున్న పుష్కర పనులను పరిశీలిస్తారని సమాచారం. -
గడువులోగా పుష్కర పనులు పూర్తి
నాగార్జునసాగర్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారిగా నిర్వహించే కృష్ణా పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తామని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి తెలిపారు. సాగర్‌లోని విజయవిహార్ సమావేశ మందిరంలో మంగళవారం మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల కలెక్టర్లు, ఆయా శాఖల అధికారులతో పుష్కర పనులను సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. పుష్కర భక్తుల సౌకార్యార్థం నూతనంగా రహదారుల నిర్మాణంతో పాటు రోడ్ల విస్తరణ పనులు చేపట్టినట్లు తెలిపారు. రెండు జిల్లాలో కలిపి 53 ఘాట్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఆ ఘాట్లన్నీ గడువులోపే పూర్తవుతాయని వెల్లడించారు. రోడ్లు కొంత మేరకు పనులు వెనుకబడి ఉన్నప్పటికీ అధికారులు అందించిన వివరాల ప్రకారం ఆగస్టు 5వ తేదీ వరకు పూర్తికానున్నట్లు తెలిపారు. ఘాట్ల వద్ద భక్తులకు తాగునీటి కోసం ఆర్ఓ ప్లాంట్లు నిర్మించినట్లు తెలిపారు. నల్లగొండ జిల్లాలో కృష్ణా నది 120 కిలోమీటర్లు ప్రవహిస్తుండగా 28 ఘాట్లు నిర్మించినట్లు వివరించారు. మహాబూబ్‌నగర్‌లో 25 ఘాట్లు నిర్మించినట్లు తెలిపారు. గత గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని ఆ అనుభవాలను జోడించి భక్తులకు ఎలాంటి లోటు లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రులు వివరించారు. సమావేశంలో డీజీపీ అనురాగ్‌శర్మ, జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సత్యనారాయణ, మహబూబ్‌నగర్ ఎస్పీ రమారాజేశ్వరి, జిల్లా ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి, ఎస్ఈలు ధర్మానాయక్, రమేశ్, జిల్లాపరిషత్ సీఈఓ మహేదంర్‌రెడ్డి పాల్గొన్నారు. -
బ్రహ్మ కొలువైన చోటు...
పాఠక పర్యటన విష్ణు, మహేశ్వరులకు ఉన్నట్టుగా ప్రపంచంలో బ్రహ్మదేవుడికి విరివిగా దేవాలయాలు లేవు. కారణాలు ఏవైనా మన దేశంలో ఒకే ఒక ప్రాంతంలో బ్రహ్మదేవుడికి ఆలయం ఉంది. అదే పుష్కర్! రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలో ఉన్న ఈ ఆలయంలో బ్రహ్మ నిత్య పూజలతో విరాజిల్లుతున్నాడు. గాయత్రీ, సరస్వతీ దేవేరులతో నాలుగు ముఖాలతో గల బ్రహ్మ మూర్తిని చూడటానికి రెండూ కళ్లు చాలవు. పుష్కర్ పట్టణ అందాలు, అజ్మీర్ దర్గా, మౌంట్ అబు సుందర దృశ్యాలు విని ఉన్న నేను వాటన్నింటినీ చూడాలనే ఆసక్తితో మా మిత్రుడితో కలిసి రాజస్థాన్ రాష్ట్రానికి బయల్దేరాం. ఒంగోలు నుండి హైదరాబాద్- అటు నుంచి అజ్మీర్ ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరాం. అజ్మీర్‌కు చేరుకోవడానికి రెండు రోజులు పట్టింది. అజ్మీర్ చాలా పెద్దపట్టణం. అక్కడ ప్రఖ్యాతి గాంచిన దర్గాకు బయల్దేరాం. మతసామరస్యానికి ప్రతీక... సూఫీమత సన్యాసి దివంగతుడయ్యాక సమాధి చేసినదే ఈ దర్గా. అజ్మీర్ దర్గాగా దేశవ్యాప్తంగా విశేష ప్రాచుర్యం ఉంది. దేశం నలుమూలల నుంచి వచ్చే హిందువులూ ఈ దర్గాను సందర్శించుకుంటారు. మొఘలుల కాలం నాటి శిల్ప కళ ఈ దర్గా గోడల మీద కనిపిస్తుంది. దర్గా సందర్శన తర్వాత మరునాడు ఉదయం అజ్మీర్‌కు22 కి.మీ దూరంలో గల పుష్కర్‌కు బస్సులో బయల్దేరాం. ఆహ్లాదకరమైన సరస్సు... పుష్కర్! పుష్కర్ అనేది పెద్ద సరస్సు పేరు. ఆ సరస్సు పేరే ఆ ప్రాంతానికీ వచ్చింది. చుట్టూ ఆవాసాలు.. మధ్యలో సరస్సు... సరస్సు పక్కనే బ్రహ్మ ఆలయం.. అద్భుతంగా అనిపించింది. ద్వాపరయుగంలో వజ్రనాభుని వధించడానికి బ్రహ్మ తన ఆయుధమైన తామరపుష్పాన్ని ప్రయోగించగా కొన్ని తామర రేకలు భూమిమీద పడ్డాయట. ఆ రేకలు పడిన ప్రదేశమే పుష్కర సరస్సుగా చెబుతారు. ఈ ప్రాంతంలోనే బ్రహ్మ యజ్ఞం చేశాడనీ, అందుకే పుష్కర్‌కు అంత ప్రాధాన్యత వచ్చిందని చెబుతారు. ఆలయానికి సమీపంలో హంస వాహనం, గర్భ గుడి ఎదురుగా వెండి తాబేలు ఉంది. బ్రహ్మదేవుడు నాలుగు తలలతో, ఎడమవైపున గాయత్రీదేవి, కుడివైపున సరస్వతీ దేవీతో కొలువుదీరి ఉన్నాడు. ఈ ఆలయం 2000 ల సంవత్సరాల క్రితం నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది. ప్రపంచంలోని పది ముఖ్యమైన దేవాలయాలలోనూ, 5 పవిత్ర మత పరమైన పుణ్యస్థలాలలో ఒకటిగా పుష్కర్‌కి, అక్కడి బ్రహ్మ ఆలయానికి పేరుంది. మనసు దోచిన మౌంట్ అబూ... పుష్కర్ సందర్శన తర్వాత సాయంకాలానికి తిరిగి అజ్మీర్ చేరుకున్నాం. మరుసటి రోజు సిరోహి జిల్లాలో ఉన్న అబు రోడ్‌కు రైలు మార్గాన చేరుకున్నాం. అబూ రోడ్‌కు దగ్గరలో అంబాజీ గ్రామంలో శక్తిపీఠాన్ని సందర్శించుకొని, అనంతరం మౌంట్ అబూ చేరుకున్నాం. సుందర, ఆహ్లాదకరమైన ప్రదేశాలు, జైన దేవాలయాల శిల్పకళతో మౌంట్ అబూ పెట్టింది పేరు. బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఉన్నదిక్కడ. టోడ్ రాక్, దిల్వారా ఆలయం, హనీమూన్ పాయింట్, నక్కి సరస్సు, గబ్బర్ కొండ చూడదగినవి. రోప్ వే ద్వారా గబ్బర్ కొండవీదకు చేరుకోవాలి. ఈ కొండమీద అమ్మవారి ఆలయం, 51 శక్తిపీఠాల నమూనా ఆలయాలు చూశాం. అంబాజీ నుంచి బస్సులో అబూ రోడ్‌కు వచ్చి అక్కడ రైల్వేస్టేషన్లో బికనీర్ -సికింద్రాబాద్ రైలులో హైదరాబాద్ చేరుకున్నాం. రైలు-బస్సు చార్జీలు, భోజనం, బస, ఇతర చిల్లర ఖర్చులు కలుపుకొని ఒక్కొక్కరికి రూ.4000 ల చొప్పున ఖర్చు అయినప్పటికీ దేశంలోనే ప్రఖ్యాతి గాంచిన ప్రాంతాన్ని సందర్శించామన్న తృప్తిని మదినిండా నింపుకున్నాం. - ఎస్.వి.సత్యభగవానులు, ఒంగోలు