పుష్కరాలకు ఉచిత బస్సులు | free buses to go to potti chelima pushkar ghat | Sakshi
Sakshi News home page

పుష్కరాలకు ఉచిత బస్సులు

Published Thu, Jul 21 2016 11:32 PM | Last Updated on Mon, Sep 4 2017 5:41 AM

పుష్కరాలకు ఉచిత బస్సులు

పుష్కరాలకు ఉచిత బస్సులు

నాగార్జునసాగర్‌ : కృష్ణా పుష్కరాలకు పొట్టిచెలిమ నుంచి కృష్ణా తీరంలోని స్నానఘాట్ల వరకు ఉచితంగా బస్సులు నడపనున్నట్లుగా నల్లగొండ ఆర్టీసీ డిపో మేనేజర్‌ జె.వి.బాబు తెలిపారు. గురువారం నాగార్జునసాగర్‌లోని పుష్కరఘాట్లు, హిల్‌కాలనీ, పైలాన్‌కాలనీ బస్టాండ్లను సందర్శించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ..  నల్లగొండ, హైదరాబాద్, మిర్యాలగూడ, సూర్యాపేట, భువనగిరి తదితర ప్రాంతాల నుంచి వచ్చే బస్సులు పొట్టిచెలిమ వరకు వచ్చి తిరిగి వెళ్తాయన్నారు. అక్కడ ఏర్పాటు చేసే పార్కింగ్‌ స్థలంలో బస్సులు ఆగుతాయన్నారు. భక్తులకు రవాణా పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆయన వెంట అసిస్టెంట్‌ జిల్లామేనేజర్‌ లావణ్య తదితరులు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement