పుష్కర విధుల్లో ఉండేవారికి భోజన వసతి | meal accommodation for those who are on Pushkar duty | Sakshi
Sakshi News home page

పుష్కర విధుల్లో ఉండేవారికి భోజన వసతి

Published Sat, Aug 6 2016 9:38 PM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM

పుష్కర విధుల్లో ఉండేవారికి భోజన వసతి - Sakshi

పుష్కర విధుల్లో ఉండేవారికి భోజన వసతి

ఎంజీయు (నల్లగొండ రూరల్‌) : పుష్కర విధుల్లో పాల్గొనే ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ అభ్యర్థులకు భోజన వసతి కల్పిస్తామని ట్రాఫిక్‌ సీఐ ఆదిరెడ్డి అన్నారు. శనివారం యూనివర్సిటీలో ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పుష్కరాలకు వచ్చే అభ్యర్థుల పట్ల మర్యాదగా మాట్లాడుతూ వారికి కావాల్సిన సమాచారాన్ని అందించాలని కోరారు.  పార్కింగ్, ట్రాఫిక్, అంతరాయం కలుగకుండా చూడడం ద్వారానే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగవన్నారు. అభ్యర్థులకు ప్రత్యేకంగా రెడ్‌కలర్‌ షర్టు అందజేస్తామని తెలిపారు. సమావేశంలో ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం అధికారులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement