Inspector of Police
-
తణుకు రూరల్ పీఎస్ వద్ద ఉద్రిక్తత.. ఎస్ఐ ఆత్మహత్యకు కారణం ఇదేనా?
సాక్షి, పశ్చిమ గోదావరి జిల్లా: తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇవాళ ఉదయం స్టేషన్లో సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని ఎస్ఐ ఏజీఎస్ మూర్తి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, మృతుడు.. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో రికార్డ్ చేయడంతో పాటు, సూసైడ్ నోట్ రాశారనే అనుమానాలు ఉండటంతో ఆయన సెల్ ఫోన్ తమకు ఇవ్వాలంటూ కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు.స్టేషన్‌కు చేరుకున్న జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, ఇతర పోలీస్ అధికారులతో ఎస్ఐ మూర్తి బంధువులు వాగ్వివాదానికి దిగారు. మూర్తి.. తణుకు రూరల్ ఎస్ఐగా పనిచేస్తుండగా, ఇటీవల ఆయన విధుల నుంచి తొలగించారు. ఎస్ఐ సత్యనారాయణమూర్తి స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా కే.గంగవరం గ్రామం. ఆయనకు ఇద్దరు పిల్లలు. అకారణంగా విధుల్లోంచి తొలగించి, తిరిగి విధుల్లోకి తీసుకోకపోవడంపై ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఎస్ఐ మూర్తి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తణుకు ఏరియా ఆసుపత్రికి తరలించారు. జిల్లాలో పెనుగొండలో సీఎం చంద్రబాబు పర్యటన ఉండగా, ఎస్ఐ ఆత్మహత్య ఘటనతో పోలీసు వర్గాల్లో కలవరం రేగింది. బందోబస్తు డ్యూటీ నుంచి వచ్చి స్టేషన్లోనే ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడనే దానిపై దర్యాప్తు చేయాలని మృతుడి బంధువులు కోరుతున్నారు. మండల మెజిస్ట్రేట్ ముందు ఫోన్ ఓపెన్ చేయాలని బంధువుల, స్నేహితులు పట్టుబడుతున్నారు. అధికారుల ఒత్తిడి వల్లే చనిపోయాడంటూ ఎస్ఐ కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు.ఇదీ చదవండి: యువజంట పరువు హత్య.. హంతకులకు మరణశిక్ష -
Karimnagar: సీఐ బాత్రూం బకెట్లో 3లక్షలు.. ఫోన్ కాల్ వైరల్
సాక్షిప్రతినిధి, కరీంనగర్: నేను మీ తమ్ముడిని.. ఇవన్నీ పిట్టకథలు వద్దు... బాజప్తా మీ బాత్రూంలో రూ.3 లక్షలు పెట్టిన.. అని ఆడియో లీక్‌కాగా, మరునాడు సామాజిక కార్యకర్త సదరు సీఐని విచారణ చేయాలంటూ వీడియో విడుదల చేయడం రెండు రోజులుగా జిల్లాలో సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే... కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట టౌన్ సీఐ, సామాజిక కార్యకర్త షేక్ సాబీర్ అలీతో డబ్బుల విషయంలో మాట్లాడిన సంభాషణ ఆడియో రికార్డు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యింది. సదరు ఆడియోలో ఎస్సీ, ఎస్టీ కేసులో సీఐకి మూడు లక్షల రూపాయలు లంచంగా సీఐ ఛాంబర్లోని వాష్‌రూమ్‌లో పెట్టి అందజేసినట్లు ఆడియోలో ఉంది. తాజాగా ఆడియోలో మాట్లాడిన సామాజిక కార్యకర్త షేక్‌సాబీర్ అలీ మరిన్ని వివరాలతో వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో షేక్‌సాబీర్ అలీ మాట్లాడుతూ.. ‘జెర్రంశెట్టి కృష్ణారావు, గోవిందరెడ్డి, మర్రుతో పాటు ఎస్ఆర్కే డెయిరీ చైర్మన్ బండారు మాధురి మధ్య ఉన్న వివాదాల్లో మధ్యవర్తిత్వం కోసం కృష్ణారావు నన్ను ఆశ్రయించారు. గత అక్టోబర్ 28 నుంచి 30 వరకు వివాదం పరిష్కారం కోసం పోలీస్ స్టేషన్లో సీఐ రవితో మాట్లాడటం జరిగింది. కృష్ణరావుపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయొద్దంటే రూ.3 లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. బాధితులతో మాట్లాడి రూ.3 లక్షలు తీసుకొచ్చి సీఐ వద్దకు వెళ్లగా, సీఐ ఛాంబర్లోని బాత్రూంలోని బకెట్లో పెట్టాలని సూచించాడు. డబ్బులు తీసుకున్న తర్వాత కూడా కృష్ణారావుపైనే కేసు నమోదు చేశాడు’ అని వీడియోలో పేర్కొన్నాడు. దీంతో గత ఏడాది డిసెంబర్ 30న సీఐకి ఫోన్‌చేసి, రూ.3 లక్షలు తీసుకొని బాధితుడిపైనే కేసు ఎలా నమోదు చేస్తారని సూటిగా అడిగిన. దానికి అతడు తడబడ్డాడు కానీ.. పైసలు తీసుకోలేదని మాత్రం చెప్పలేదు. డబ్బులు ఇచ్చేటప్పుడు స్పై కెమెరాతో రికార్డు చేశానని చెప్పడంతో నిన్ను నమ్మటం తప్పా అని సీఐ అన్నాడని అందులో చెప్పాడు. తర్వాత ఆరోజు సాయంత్రం 7 గంటల ప్రాంతంలో మారేపల్లి రాజుతో రోడ్డుపై నడిచి వెళ్తుండగా నా మొబైల్‌ను పల్సర్ బైక్‌మీద వచ్చిన ఇద్దరు ప్రైవేట్ యువకులు లాక్కోనిపోయారు. అప్పటికే సదరు ఆడియోను మా మిత్రులకు షేర్చేసి చేసిన కాబట్టి ఆ ఆడియోను మీడియాకు లీక్ చేయగలిగాను. గతంలో ఇలా ప్రశ్నించినప్పుడు నాపై తప్పుడు కేసులు పెట్టారు. ఇప్పుడు కూడా కేసులు బనాయించే అవకాశం ఉంది. బాధితులను బెదిరించి డబ్బులు ఇవ్వలేదని చెప్పించే అవకాశాలున్నాయని పేర్కొన్నాడు. పోలీస్ ఉన్నతాధికారులు గత ఏడాది అక్టోబర్ 28 నుంచి 30 వరకు పోలీస్ స్టేషన్‌లోని సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించి చర్యలు తీసుకోవాలని సదరు వీడియోలో షేక్ సాబీర్ అలీ పేర్కొన్నారు. పోలీసుల మౌనం వెనక అనుమానాలురెండు రోజులుగా జిల్లాలో ఆడియో, వీడియోలు నెట్టింట హల్చల్ చేస్తున్నా... పోలీస్ వర్గాల నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేకపోవడం పలుఅనుమానాలకు తావిస్తోంది. మధ్యవర్తి తేదీ, సమయంతో పాటు పూర్తివివరాలు చెబుతుండడం, లీకైన ఆడియోలో సామాజిక కార్యకర్త సీఐను ఏకవచనంతో సంభోదించటం, పదేపదే డబ్బులు ఇచ్చానని చెప్పుతున్నా... సీఐ మాత్రం స్టేషన్‌కి రా మాట్లాడుకుందాం అంటూ సున్నితంగా రిక్వెస్ట్ చేస్తున్నట్లు మాట్లాడటం.. నిన్ను నమ్మడం తప్పా అని సీఐ అనటంలో అంతర్యం ఏంటని జిల్లావాసులు చర్చించుకుంటున్నారు. మొత్తంగా ఈ జమ్మికుంట ఎపిసోడ్లో విచారణ చేపడితే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి. ఇది ఇలా ఉంటే గురువారం రాత్రి జమ్మికుంట పోలీసులు మీడియాకు ప్రెస్‌నోట్ విడుదల చేశారు. అందులో ఆడియో, వీడియోలోని మాటలను ఖండించకుండా కేవలం సాబీర్ అలీ బ్లాక్‌మెయిలర్, అతడిపై గతంలో చాలా కేసులు నమోదు అయ్యాయంటూ పేర్కొనడం గమనార్హం. రిమాండ్ చేసి సస్పెండ్ చేయాలిజమ్మికుంట పట్టణ సీఐ వరిగంటి రవి అవినీతి తిమింగలంగా మారి రూ.3లక్షలు లంచం తీసుకోవడం ప్రజాస్వామ్యానికి పెద్ద మచ్చ. పోలీస్ యూనిఫామ్ ధరించి ప్రజల నమ్మకాన్ని దోచుకోవడం దుర్మార్గం. తెలంగాణ డీజీపీ, ఏసీబీ డీజీపీ, కరీంనగర్ సీపీలు ఇలాంటి అవినీతి పురుగులను రిమాండ్ చేసి సస్పెండ్ చేయాలి. ప్రజల రక్షణ కోసం ఉన్న యూనిఫామ్‌కి మచ్చ తెచ్చే వారిని వదిలిపెట్టవద్దు.– పాడి కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్యేషాక్కు గురయ్యా సాబీర్ నా మీద అంత పెద్ద ఆరోపణ చేసేసరికి ఒక్కసారిగా షాక్ తిన్న. అందుకే, కాస్త వెనక్కి తగ్గినట్లు మాట్లాడాను. అతన్ని పట్టుకునేందుకు రప్పిద్దామని అనుకున్నా. సాబీర్‌పై గతంలోనూ అనేక కేసులు ఉన్నాయి. ఈ ఘటన విషయంలో అతనిపై చర్యలు తీసుకునే అవకాశాలను పరిశీలిస్తున్నాం.– వి.రవి, జమ్మికుంట టౌన్ సీఐ -
కామారెడ్డి: ప్రైవేట్ స్కూల్ వద్ద ఉద్రిక్తత.. సీఐపై రాళ్ల దాడి
సాక్షి, కామారెడ్డి: జీవ్దాన్ ప్రైవేట్ స్కూల్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. విద్యార్థిని పట్ల పీఈటీ అసభ్యంగా ప్రవర్తించాడని.. రూమ్‌లో బంధించి విద్యార్థినిని వేధించాడంటూ పాఠశాల వద్ద తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. విద్యార్థి సంఘాల నాయకులు.. స్కూల్ అద్దాలను ధ్వంసం చేశారు.అడ్డుకున్న సీఐ చంద్రశేఖర్‌పై ఆందోళనకారులు రాళ్లతో దాడి చేశారు. సీఐకి తీవ్ర రక్తస్రావం కావడంతో ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో లాఠీఛార్జ్ చేసి ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. పీఈటీ నాగారాజుపై కఠిన చర్యలు తీసుకోవాలని, పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.ఇదీ చదవండి: హలో.. సైబర్ సెక్యూరిటీ బ్యూరో.. -
వైఎస్సార్సీపీ నేత హత్య ఘటన.. సీఐ, ఎస్ఐ సస్పెన్షన్
సాక్షి, నంద్యాల జిల్లా: సీతారామాపురంలో వైఎస్సార్సీపీ నేత సుబ్బారాయుడు హత్య ఘటనపై డీఐజీ సీరియస్ అయ్యారు. నంద్యాల రూరల్ సీఐ శివ కుమార్‌రెడ్డి, మహానంది ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సమాచారం ఉన్నప్పటికీ సీఐ, ఎస్ఐ నిర్లక్ష్యం వహించారని అభియోగం. పోలీసుల అలసత్వం వల్లే వైఎస్సార్సీపీ నేత హత్య జరిగిందని నిర్థారణ అయ్యింది. మరికొందరిపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారామాపురంలో శనివారం అర్ధరాత్రి 12.20 గంటలకు టీడీపీ నేతలు పోలీసుల సమక్షంలో వైఎస్సార్సీపీ నేత పసుపులేటి సుబ్బరాయుడు అలియాస్ పెద్దన్న(65) ఇంట్లోకి వెళ్లి బయటకు లాగి.. కత్తులు, రాడ్లు, రాళ్లతో దాడి చేసి కిరాతకంగా హత్య చేశారు.పోలీసులు గుడ్లప్పగించి చూస్తుండగా సుబ్బరాయుడు అతి దారుణంగా ప్రాణాలు కోల్పోయాడు. హత్య జరిగే ప్రమాదముందని మూడు గంటల ముందే పోలీసులకు సమాచారం ఇచ్చినా, కనీస చర్యలు తీసుకోకపోవడంతో ఈ దారుణం చోటుచేసుకుంది. -
సీఐ ఆగ్రహం.. ‘ఇసుక పంపిస్తావా..లేదంటే బంద్ చేస్తావా’
కర్నూలు: తాను పంపిన ట్రాక్టర్లకు ఇసుకను నింపి పంపించాలని హాలహర్వి మండలం గూళ్యం గ్రామానికి చెందిన దుబ్బలింగను ఆలూరు సీఐ ఆర్. ఈశ్వరయ్య బెదిరించారు. ఈ ఆడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. గ్రామానికి సమీపంలో ఉన్న వేదావతి నది నుంచి దుబ్బలింగ తనకున్న ట్రాక్టర్ల ద్వారా ఇసుకను వివిధ గ్రామాలకు సరఫరా చేస్తున్నారు. విషయం తెలుసుకున్న సీఐ ఫోన్ ద్వారా దుబ్బలింగతో మాట్లాడారు. ‘‘అక్రమంగా వేదావతి నదిలో ఇసుక రవాణా చేస్తున్నావు.. నేను పంపుతున్న ట్రాక్టర్ డ్రైవర్‌కు ఇసుక ఎత్తి పంపు’ అని సూచించారు. వేదావతి నది సమీపంలో ఉన్న పొలం యజమాని ఇసుక ట్రాక్టర్లును రస్తాను వదలడం లేదని దుబ్బలింగ సమాధానం చెప్పారు. దీంతో సీఐ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘‘అందరికీ ఇసుక రవాణాను చేసుకోవడానికి ఎలా రస్తా ఇచ్చారు.. నేను పంపిన ట్రాక్టర్లర్లకు ఇసుక పంపిస్తావా..లేదంటే అంతా బంద్ చేస్తావా..సీఐ అంటే ఎవరికీ లెక్కలేకుండా పోయింది’’ అని బెదిరించాడు. ఈ విషయంపై సీఐ ఆర్. ఈశ్వరయ్య మాట్లాడుతూ..పోలీసు సర్కిల్ కార్యాలయ మరమ్మతులకు సంబంధించి మాత్రమే నేను పంపిన ట్రాక్టర్‌కు ఇసుకను పంపాలని కోరానన్నారు. అందుకు తగిన నగదును చెల్లిస్తానని దిబ్బలింగకు చెప్పానన్నారు. -
ఏఎస్ఐ కుమార్తె ఆత్మహత్య.. కారణం అదేనా?
మైసూరు: కర్నాటకలోని మైసూరు నగరంలో సహాయ సబ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న గోపీనాథ్ కుమార్తె గిరిజా లక్ష్మీ (19) ఆత్మహత్య చేసుకుంది. జలపురి పోలీసు వసతి గృహంలోని సీ బ్లాక్‌లో ఉంటున్న ఇంటిలో ఉరి వేసుకుని సూసైడ్ చేసుకుంది. కాగా, బయటకు వెళ్లి వచ్చిన కుటుంబ సభ్యులు ఇంటికి రాగా గిరిజ ఉరికి వేలాడుతూ కనిపించింది. ఇక, బీకాం చదువుతున్న గిరిజా ఆత్మహత్యకు కారణాలు తెలియడం లేదు. నజరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఐదు రోజుల క్రితమే గిరిజా అన్న అనారోగ్యంతో మృతి చెందాడు. ఆ బాధే ఆత్మహత్యకు కారణమని అనుమానాలున్నాయి. -
హైదరాబాద్: వనస్థలిపురంలో ఇన్స్పెక్టర్ రాజు అరెస్ట్
-
Hyderabad: నడిరోడ్డుపై సీఐ రాసలీలలు.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య
హస్తినాపురం(హైదరాబాద్): చట్టాన్ని పరిరక్షించాల్సిన రక్షకభటులే సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహరిస్తున్నారు. నగరంలోని సౌత్జోన్లో కంట్రోల్ల్ రూంలో పనిచేస్తున్న ఓ సీఐ నడిరోడ్డుపై కారులో మహిళతో రాసలీలకు పాల్పడుతూ పోలీసులకు పట్టుబడటమేగాక డ్యూటీలో ఉన్న పోలీసులపై దాడికి పాల్పడిన సంఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వనస్థలిపురం ఇన్స్పెక్టర్ కె.సత్యనారాయణ కథన ం మేరకు వివరాలిలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా, కందుకూరు మండలం, బేగంపేట గ్రామానికి చెందిన రాజు వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని హరిహరపురం కాలనీలో నివాసం ఉంటూ నగరంలోని సౌత్జోన్లో కంట్రోల్ రూమ్ సీఐగా పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి అతను సాగర్ రహదారిపై పెట్రోల్‌బంక్ పక్కన కారులో పీకలదాకా మద్యంతాగి మరో మహిళతో కారులో ఉండటంతో అతని భార్య, పిల్లలు అక్కడికి వెళ్లి అతడితో గొడవపడ్డారు. దీనిని గుర్తించిన పెట్రోలింగ్ కానిస్టేబుళ్లు నాగార్జున, నాయుడు అక్కడికి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించగా మద్యం మత్తులో ఉన్న సీఐ రాజు వారిపై దాడిచేసి గాయపరిచాడు. హెడ్ కానిస్టేబుల్‌ను వెంబడించి దాడికి ప్రయత్నించడంతో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు. కానిస్టేబుళ్లపై దాడికి పాల్పడినందుకు కేసు నమోదు చేశామని, నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వివరించారు. చదవండి: రెండు నెలల క్రితం లవ్ మ్యారేజ్.. అంతలోనే షాకింగ్ ఘటన.. అసలు ఏం జరిగింది? -
ఇన్స్పెక్టర్ అరెస్టు: దోపిడీ కేసులో పోలీసుల ఉదాసీనం
తమిళనాడులో ఇటీవల దారికాచి రూ.10 లక్షలు దోపిడీ చేసిన కేసులో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడంపై మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పోలీసులే దారి దోపిడీకి పాల్పడితే ప్రజల గతేమిటి. అరెస్ట్ చేయకుండా కాలయాపన చేస్తుంటే ప్రజల్లో పోలీసు శాఖపై విశ్వాసం ఎలా ఉంటుంది’ అని మండిపడ్డారు. ఈ క్రమంలో పోలీసులు ఎట్టకేలకు మహిళా ఇన్స్పెక్టర్ వసంతిని శుక్రవారం అరెస్ట్ చేశారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: శివగంగై జిల్లా ఇళయాన్గుడికి చెందిన బేకరీ వ్యాపారి అర్షిత్ (32) సరుకులు కొనుగోలు కోసం రూ.10 లక్షలు తీసుకుని జూలై 5న మదురై–తేని రోడ్డు సమీపంలోకి వచ్చాడు. అదే సమయంలో నాగమలై పుదుకోట్టై పోలీస్ ఇన్స్పెక్టర్ వసంతి.. పాల్పాండి, పాండియరాజన్, ఉక్కిరపాండి, సీమైస్వామిని వెంట బెట్టుకుని అక్కడి చేరుకున్నారు. తనిఖీల పేరు తో అర్షిత్ వద్దనున్న రూ.10 లక్షలు లాక్కుని బెదిరించి పంపేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్పీ ఆదేశాలతో కేసు నమోదు చేసిన మదురై జిల్లా క్రైం బ్రాంచ్ పోలీసు లు విచారణ చేపట్టారు. ఇన్స్పెక్టర్ వసంతి అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో డీజీపీ ఆమెను సస్పెండ్ చేశా రు.చదవండి:బంపర్ టూ బంపర్ ఇన్సురెన్స్ తప్పనిసరి..మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. సంఘటన జరిగిన రోజు వసంతితోపాటు ఉన్న తేనికి చెందిన పాల్ పాండిని ఈ నెల 10వ తేదీన పోలీసులు అరెస్ట్ చేసి రూ.61 వేలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఉక్కిరపాండి, సీమైస్వామి అరెస్ట్ చేసి రూ.1.65 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అజ్ఞాతంలో ఉన్న ఇన్స్పెక్టర్ వసంతి మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనంలో తన న్యాయవాది ద్వారా ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు నాలుగు రోజుల క్రితం విచారణకు వచ్చింది. పోలీసుల తీరుపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘటన జరిగి నెలరోజులైనా ఇన్స్పెక్టర్ వసంతిని ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. ఇలాంటి ఉదాసీన పోకడల వల్లే పోలీసులంటే ప్రజల్లో విలువ తగ్గి పోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితురాలిని వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించి కేసు వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో నీలగిరి జిల్లా కొత్తేరిలో ఉన్న వసంతిని, ఆమె కారు డ్రైవర్‌ను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. చదవండి: 20 ఏళ్ల క్రితం ఇంటికి తాళం.. దెయ్యాలు ఉంటాయని పూజలు -
కేక్ ముక్క ఇన్స్పెక్టర్కు కష్టాలు తెచ్చిపెట్టింది
ఢిల్లీ: తనకు తెలియకుండానే కరుడుగట్టిన నేరస్తుడికి కేక్ తినిపించి ఒక సీనియర్ ఇన్స్పెక్టర్ కష్టాలు కొనితెచ్చుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ ఘటన రెండు వారాల క్రితం జరగ్గా.. తాజాగా గురువారం ఈ ఘటనపై డీసీపీ విచారణకు ఆదేశించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. దానిష్ షేక్ హత్యయత్నం సహా ఇతర కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఇటీవలే ఒక కేసు విషయమై జోగేశ్వరి పోలీసులు దానిష్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే.. అదే స్టేషన్లో సీనియర్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న మహేంద్ర నెర్లీకర్ పుట్టినరోజు వేడుకలు హౌసింగ్ సొసైటీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆ సమయంలో దానిష్ కూడా అక్కడే ఉన్నాడు. ఈ సందర్భంగా దానిష్‌కు మహేంద్ర కేక్ తినిపించాడు. దాదాపు 15 సెకన్ల నిడివి ఉన్న వీడియో లీకవడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటనపై మహేంద్ర నెర్లీకర్ స్పందింస్తూ..'' ఇది పాత వీడియో. కూల్చివేత పనులు జరుగుతున్న హౌసింగ్ సొసైటీని సందర్శించాను. అదే రోజు నా పుట్టినరోజు కావడంతో అక్కడే కొందరు అధికారులు నా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఆ సమయంలో దానిష్ అక్కడ ఉన్నట్లు నాకు అసలు తెలియదు. ఆ వ్యక్తి ఒక అధికారి అని భావించి కేక్ తినిపించా. అనవసరంగా దీనిని ఒక ఇష్యూగా చూపిస్తున్నారు.'' అంటూ చెప్పుకొచ్చారు.ఘీ ఈ ఘటనపై డిప్యూటీ పోలీసు కమిషనర్ మహేష్ రెడ్డి ప్రాథమిక విచారణకు ఆదేశించారు. అసలు ఒక నేరస్తుడు ఆ సమయంలో అక్కడ ఎందుకు ఉన్నాడు.. అతన్ని ఎవరు తీసుకొచ్చారు అనే కోణంలో విచారిస్తున్నారు. కాగా సకినాకా డివిజన్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ఈ విచారణను నిర్వహిస్తారని తెలిపారు. ప్రస్తుతం మహేంద్ర నెర్లీకర్‌ను కంట్రోల్ రూమ్‌కు అటాచ్ చేశారు. https://t.co/FW51cp6WPu — varun seggari (@SeggariVarun) July 16, 2021 -
సీఐ జగదీశ్ కేసు: రోజుకో విషయం వెలుగులోకి
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి సీఐ జగదీశ్ అక్రమాల వ్యవహారంలో రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. జగదీశ్ అక్రమాస్తులకు సంబంధించి వారం రోజులుగా ఏసీబీ అధికారుల విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే నిజామాబాద్ కంఠేశ్వర్‌లోని యాక్సిస్ బ్యాంక్ లాకర్లో ఉన్న రూ.34 లక్షల నగదు, 9 లక్షల విలువ చేసే బంగారంతో పాటు ఇతర విలువైన ఆస్తులకు సంబంధించిన విలువైన డాక్యుమెంట్స్‌ను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. ఐపీఎల్ క్రికెట్ ప్రారంభం నుంచే బెట్టింగ్ నిర్వాహకులతో సీఐ జగదీశ్ టచ్‌లో ఉన్నట్లు ఏసీబీ అనుమానం వ్యక్తం చేస్తోంది. కాగా, జగదీశ్‌కు బెట్టింగ్ వ్యవహారంలోనే కాకుండా ఓ వివాహిత హత్య కేసుతో, ఓ పెళ్లి సంబంధం విషయంలో పెద్ద ఎత్తున డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జగదీశ్‌కు సంబంధించిన బాధితుల నుంచి ఏసీబీ అధికారులు వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ఐపీఎల్ క్రికెట్‌కు సంబందించి బెట్టింగ్ నిర్వాహకుల నుంచి సీఐతో పాటు జిల్లాకు చెందిన పలువురు సీఐలు, ఏఎస్సైలు పెద్ద ఏత్తున మాముళ్లు తీసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఏసీబీ అధికారులు క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో ఇతర పోలీస్ అధికారుల ప్రమేయంపై కూడా ఆరా తీస్తున్నారు. చదవండి: (బెయిల్ కోసం కామారెడ్డి సీఐ చేతివాటం) -
కామారెడ్డి సీఐ జగదీశ్ అరెస్టు
సాక్షి, కామారెడ్డి/కామారెడ్డి క్రైం: క్రికెట్ బెట్టింగ్ కేసులో అవినీతికి పాల్పడిన కామారెడ్డి పట్టణ సీఐ జగదీశ్ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. శుక్రవారం ఏకకాలంలో పలు చోట్ల తనిఖీలు జరిగాయి. బాన్సువాడ కు చెందిన సుధాకర్‌ను కామారెడ్డి పోలీసులు బెట్టింగ్ వ్యవహారంలో 15 రోజుల క్రితం అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ నెల 6న అతనికి స్టేషన్ బెయిల్ ఇవ్వడం కోసం సీఐ జగదీశ్ రూ. 5 లక్షలు డిమాండ్ చేశాడు. ముందుగా రూ.1,39,500లను సుధాకర్ సీఐకి ఇచ్చాడు. మిగతా డబ్బులను సైతం వెంటనే చెల్లించాలని సీఐ పలుసార్లు సుధాకర్ ఒత్తిడి పెంచ డంతో అతను ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ నెల 19న ఏసీబీ అధికారులు సీఐ జగదీశ్‌తో పాటు ఈ వ్యవహా రంలో మధ్యవర్తిత్వం చేసిన సుజయ్‌పై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో శుక్రవారం కామారెడ్డిలోని సీఐ జగదీశ్ ఇంటిపై అధికారులు దాడులు నిర్వహించారు. ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు సోదాలు జరిగాయి. సీఐ ఇంట్లో విలువైన డాక్యుమెంట్లు, లాకర్ కీలు స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నట్టు డీఎస్పీ ఆనంద్‌కుమార్ తెలిపారు. మధ్యవర్తి సుజయ్‌ను సైతం విచారిస్తున్నామని, సీఐని ఏసీబీ కోర్టులో శనివారం ప్రవేశపెడుతామని చెప్పారు. -
‘వనస్థలిపురం పోలీసులపై నమ్మకం లేదు’
సాక్షి, సిటీబ్యూరో : గడిచిన కొన్నేళ్లుగా తనను వివిధ రకాలుగా వేధించిన ఇన్స్పెక్టర్ కె.చంద్రకుమార్ విషయంలో వనస్థలిపురం పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని బాధితురాలు గురువారం వాపోయారు. ఈ మేరకు ఆమె ‘సాక్షి టీవీ’కి సందేశాలు పంపారు. ఈ ‘ఖాకీ’చకుడిని నగర పోలీసు కమిషనర్ సస్పెండ్ చేయగా... నిర్భయ కేసు నమోదైనా వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేయకపోవడం సందేహాలకు తావిస్తోందని అభిప్రాయపడ్డారు. నగర నిఘా విభాగమైన స్పెషల్ బ్రాంచ్‌లో (ఎస్బీ) ఈస్ట్ జోన్ ఇన్స్పెక్టర్గా పని చేస్తూ సస్పెన్షన్‌కు గురైన ఇన్స్పెక్టర్ కె.చంద్రకుమార్ తక్షణం అరెస్టు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. సందేశాలు, ఫోన్ కాల్స్‌తో పాటు నగ్న వీడియో కాల్స్ ద్వారా బాధితురాలి పట్ల హేయంగా ప్రవర్తించిన చంద్రకుమార్‌పై నమోదైన కేసు విషయంలో వనస్థలిపురం పోలీసులు ఆది నుంచి అనుమానాస్పదంగానే ప్రవర్తిస్తున్నారు.(నగ్నంగా వీడియో కాల్స్ చేస్తూ సీఐ వేధింపులు..) ఈ ఇన్స్పెక్టర్ బాధితురాలు సోమవారం మధ్యాహ్నం వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీన్ని తొలుత జనరల్ డైరీలో (జీడీ) ఎంట్రీ పెట్టిన అధికారులు ఎఫ్ఐఆర్ నం.748/2020గా కేసు నమోదు చేశారు. ఇందులో ఐపీసీలోని 354, 354 సీ, 354 డీ, 504, 506, 509 సెక్షన్లతో పాటు ఐటీ యాక్ట్‌లోని 67, 67 ఏ సెక్షన్ల కింద ఆరోపణలు పొందుపరిచారు. చంద్రకుమార్ వ్యవహారంపై ప్రాథమిక విచారణ చేయించిన నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ అతడిని మంగళవారం సస్పెండ్ చేశారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. దీంతో పాటు చంద్రకుమార్‌పై వనస్థలిపురం పోలీసుస్టేషన్లో కేసు నమోదైందన్న విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు ఆ ఠాణా ఇన్స్పెక్టర్ను సంప్రదించారు. చంద్రకుమార్‌పై సోమవారమే కేసు నమోదైందన్న విషయాన్ని గోప్యంగా ఉంచడానికి వనస్థలిపురం పోలీసుల అధికారులు ప్రయత్నించారు. ఆయన తమ కమిషనరేట్ అధికారి కాదని, ఇక్కడ ఎలాంటి కేసులు నమోదు కాలేదంటూ చెప్పి తప్పుదోవ పట్టించేందుకు యత్నించారు. పోలీసులు తప్పు చేసినా తప్పించుకోలేరు అనే విషయాన్ని స్పష్టం చేస్తూ నగర కొత్వాల్ తన ట్విట్టర్ ద్వారా చంద్రకుమార్ సస్పెన్షన్‌ను బయటపెట్టారు. అయితే ఓ మహిళతో అత్యంత హేయంగా ప్రవర్తించిన చంద్రకుమార్‌పై నమోదైన కేసు విషయాన్ని మాత్రం వనస్థలిపురం పోలీసులు గోప్యంగా ఉంచడం గమనార్హం.(వనస్థలిపురం ఎసీపీ సస్పెన్షన్ కేసు దర్యాప్తు వేగవంతం) దీనికి తోడు నిర్భయ వంటి కేసులో నిందితుడిగా ఉన్న పోలీసు ఇన్స్పెక్టర్ను వనస్థలిపురం పోలీసులు గురువారం వరకు అరెస్టు చేయకపోవడం బాధితురాలి అనుమానాలకు బలాన్ని చేకూరుస్తోంది. వరంగల్‌లో పని చేస్తున్న ప్రభుత్వ అధికారిణి అయిన బాధితురాలు గురువారం ‘సాక్షి టీవీ’తో మాట్లాడుతూ... ‘నా వద్ద ఉన్న అన్ని ఆధారాలను డీజీపీ, రాచకొండ సీపీతో సహా అందిరికీ పంపించా. నిందితుడిని వెంటనే అరెస్టు చేసి రిమాండ్‌కు పంపుతామని హామీ ఇచ్చారు. అయితే మూడు రోజులు ఎదురు చూసినా అది జరగలేదు’ అని వాపోయారు. -
వీడియో కాల్స్ చేస్తూ.. సీఐ వేధింపులు..
-
నగ్నంగా వీడియో కాల్స్ చేస్తూ సీఐ వేధింపులు..
సాక్షి, హైదరాబాద్ : ఓ ఖాకీచకుడి బరితెగింపు ఇది. నగర నిఘా విభాగమైన స్పెషల్ బ్రాంచ్‌లో (ఎస్బీ) ఈస్ట్ జోన్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తూ సస్పెన్షన్‌కు గురైన కె.చంద్రకుమార్ బాధితురాలితో అత్యంత హేయంగా ప్రవర్తించాడు. తన కోరిక తీర్చకుంటే యాసిడ్ పోసి చంపేస్తానంటూ బెదిరించాడు. నగ్నంగా వీడియో కాల్స్ చేస్తూ వేధించాడు. ఈ అంశంపై వనస్థలిపురం పోలీసులు నమోదు చేసిన ప్రాథమిక సమాచార నివేదికలో (ఎఫ్ఐఆర్) దర్యాప్తు అధికారులు ఈ వివరాలు పొందుపరిచారు. ప్రస్తుతం వనస్థలిపురంలో నివసిస్తున్న బాధితురాలు వరంగల్‌లో ఫుడ్ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్నారు. కొన్నేళ్ల క్రితం తన పదో తరగతి సర్టిఫికెట్లు పోవడంతో ఫిర్యాదు చేయడానికి మిర్యాలగూడ పోలీసుస్టేషన్‌కు వెళ్లారు. ఈ నేపథ్యంలోనే అప్పట్లో అక్కడ ఎస్సైగా పని చేస్తున్న చంద్రకుమార్‌తో బాధితురాలికి పరిచయమైంది. ఆ సర్టిఫికెట్లు రికవరీ చేసి ఇచ్చిన చంద్రకుమార్ అప్పటి నుంచి అప్పుడప్పుడు బాధితురాలికి ఫోన్లు చేయడం, సందేశాలు పంపడం చేసేవాడు. ఐదేళ్ల క్రితం ఆమె వ్యక్తిగత పనికి సంబంధించిన ఫైల్‌ను సచివాలయంలో క్లియర్ చేయిస్తానంటూ రూ.5 లక్షలు తీసుకున్నాడు. ఆ తర్వాత యాచారం ఇన్స్పెక్టర్గా బదిలీపై వచ్చిన చంద్రకుమార్ బాధితురాలికి తరచూ ఫోన్లు, ఎస్సెమ్మెస్‌లు పంపుతూ వేధించడం మొదలుపెట్టాడు. తన కోరిక తీరిస్తే వేధింపులు ఆపేస్తానంటూ బెదిరించడంతో బాధితురాలు అతడిని దూరంగా ఉంచడం మొదలెట్టారు. దీంతో ఆమె ఇంటికి వెళ్లి యాసిడ్ పోసి చంపేస్తానంటూ బెదిరించాడు. పిల్లల్నీ హత్య చేస్తానంటూ హెచ్చరించాడు. బాధితురాలి తండ్రికీ ఫోన్లు చేసి దుర్భాషలాడాడు. రాచకొండ పోలీసుల కౌన్సెలింగ్ బాధితురాలు రాచకొండ పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా అతడికి కౌన్సెలింగ్ ఇచ్చారు. బాధితురాలి జోలికి వెళ్లనని, ఆమె నుంచి తీసుకున్న నగదు కూడా తిరిగి ఇచ్చేస్తానంటూ చెప్పి చర్యల నుంచి తప్పించుకున్నాడు. ఆ తర్వాత కూడా ఇన్స్పెక్టర్ తన ధోరణి మార్చుకోలేదు. బాధితురాలికి నగ్నంగా వీడియో కాల్స్ చేయడం మొదలెట్టాడు. చంద్రకుమార్ వ్యవహారం శ్రుతి మించుతుండటంతో బాధితురాలు హైదరాబాద్ పోలీసు కమిషనర్‌తోపాటు వనస్థలిపురం పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. దీంతో నగర కొత్వాల్ అతడిని సస్పెండ్ చేయగా వన స్థలిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఓ మహిళతో అత్యంత హేయంగా ప్రవర్తించిన చంద్రకుమార్‌పై కేసు నమోదైన విషయాన్ని మాత్రం వనస్థలిపురం పోలీసులు గోప్యంగా ఉంచడం గమనార్హం. చంద్రకుమార్‌ను అరెస్ట్ చేయాలి తనను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నా ఎస్బీ సీఐ చంద్రకుమార్‌ను ఇప్పటివరకూ అరెస్ట్ చేయలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. వనస్థలిపురం పోలీసులు ఆయనను రక్షిస్తున్నారని ఎఫ్ఐఆర్ నమోదై మూడు రోజులు గడుస్తున్నా అరెస్ట్ చేయలేదన్నారు. మహిళలను మానసికంగా వేధిస్తున్న సీఐ చంద్రకుమార్‌ను వదలకూడదని ఆమె డిమాండ్ చేశారు. కాగా ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రకుమార్‌ను హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ మూడు రోజుల క్రితం విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఆయనపై ఇప్పటికే నిర్భయ కేసు నమోదు అయింది. -
కశ్మీర్లో పోలీస్ ఇన్స్పెక్టర్ హత్య
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. రెండు వేర్వేరు ఘటనల్లో ఓ పోలీస్ ఇన్స్పెక్టర్తో పాటు పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) కార్యకర్తను ఆదివారం కాల్చిచంపారు. జమ్మూకశ్మీర్ సీఐడీ విభాగంలో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న ఇంతియాజ్ అహ్మద్ మిర్(30) పూల్వామా జిల్లాలోని తన ఇంటికి వెళుతుండగా కాపుకాసిన ఉగ్రవాదులు ఆయన్ను మార్గమధ్యంలోనే అడ్డుకుని హత్యచేశారు. ఈ విషయమై ఇంతియాజ్ సీనియర్ అధికారి మాట్లాడుతూ.. తల్లిదండ్రులను చూసి చాలాకాలం కావడంతో ఇంతియాజ్ సొంతబాగ్లోని ఇంటికి బయలుదేరాడని తెలిపారు. అయితే ఇప్పుడు పుల్వామాలో పరిస్థితి బాగోలేదనీ, ఉగ్రవాదులు పోలీసుల్ని లక్ష్యంగా చేసుకుంటున్న నేపథ్యంలో ప్రయాణాన్ని కొంతకాలం వాయిదా వేసుకోవాలని సూచించినట్లు వెల్లడించారు. కానీ ఇంతియాజ్ అంగీకరించలేదనీ, గడ్డం తీసేసి, వస్త్రధారణను మార్చుకుని సొంత వాహనంలో ఊరికి బయలుదేరాడన్నారు. ఇంతియాజ్ రాకపై సమాచారం అందుకున్న ఉగ్రవాదులు అతడిని చేవకలాన్లో కిరాతకంగా హతమార్చారని తెలిపారు. మరోవైపు పీడీపీ నేత సయ్యద్ అల్తాఫ్ బుఖారి అనుచరుడు మొహమ్మద్ అమిన్ దార్(40)ను కూడా ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారు. -
కీచకుడికి ఖద్దరు వత్తాసు
‘లైంగిక వేధింపులకు పాల్పడేవారిని చీపుర్లతో కొట్టండి’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గతంలో గుంటూరులో మహిళలకు పిలుపునిచ్చారు. అందుకు భిన్నంగా ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన సీఐని కాపాడేందుకు అధికార పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ఒకరు రంగంలోకి దిగారు. పోలీసులు సస్పెండ్ చేసిన సీఐకి తిరిగి పోస్టింగ్ ఇవ్వాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. సాక్షి, గుంటూరు: విచక్షణ మరచిన సీఐ ఒకరు ఓ మహిళను లైంగికవేధింపులకు గురిచేశారు. ఎంత బతిమాలినా ఆ సీఐ మాట వినకపోవడంతో బాధితురాలు పోలీసు ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారుల విచారణలో సీఐ కీచకపర్వం వాస్తవమేనని తేలడంతో అతనిపై సస్పెన్షన్ వేటువేశారని సమాచారం. అయితే అధికారపార్టీ సీనియర్ ఎమ్మెల్యే ఒకరు కీచక సీఐకి అండగా నిలిచి, సస్పెన్షన్ ఎత్తివేసి పిడుగురాళ్ల టౌన్ సీఐగా పోస్టింగ్ ఇవ్వాలంటూ డీజీపీ కార్యాలయం నుంచి ఒత్తిడి తెస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గుంటూరు జిల్లాలోని అర్బన్, రూరల్ జిల్లాల పరిధిలో పలు పోలీసు స్టేషన్లలో ఎస్ఐగా, సీఐగా విధులు నిర్వర్తించి ప్రస్తుతం రైల్వేలో సీఐగా పనిచేస్తున్న పోలీసు అధికారి ఒకరు తనపై లైంగిక వేధింపులకు పాల్ప డ్డారంటూ ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ జరిపారు. సదరు సీఐ లైంగిక వేధింపులకు పాల్పడ్డ విషయం వాస్తవమేనని ఆ విచారణలో తేలింది. సీఐపై చర్యలకు పోలీసు ఉన్నతాధికారులు సిఫార్సు చేశారు. పది రోజుల క్రితమే సదరు సీఐపై సస్పెన్షన్ వేటు వేశారని సమాచారం. అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. అందుకు కారణం అధికార పార్టీ నేతల నుంచి వస్తున్న ఒత్తిళ్లేనని సమాచారం. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొందరు పోలీసు అధికారులు అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అండతో వరుసగా లా అండ్ ఆర్డర్ పోస్టింగ్‌లు పొందుతూ వారికి అనుకూలంగా పనిచేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆరు నెలల క్రితం కీచక సీఐని వీఆర్‌కు పిలిచి రైల్వేకు బదిలీ చేశారు. అయితే ఆ సీఐ తనతో అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఓ మహిళ పలుమార్లు ఎస్పీ, ఐజీకి ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులు స్పందించి విచారణకు ఆదేశించారు. ఆ విచారణలో వేధింపులు వాస్తవమేనేని తేలిన తరువాత సస్పెండ్ చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా ఆ సీఐను రక్షించేందుకు అధికార పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే రంగంలోకి దిగారు. సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేయాలని, పిడుగురాళ్ల టౌన్ సీఐగా పోస్టింగ్ ఇవ్వాలని పోలీసు ఉన్నతా ధికారులపై ఒత్తిడి పెంచుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎవరైనా బాధిత మహిళ ఫిర్యాదు చేస్తే వెంటనే కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేయడంతోపాటు కఠిన సెక్షన్లు వేసి రిమాండ్‌కు పంపే పోలీసు అధికారులు, తమ శాఖకు చెందిన కీచక అధికారి వ్యవహారాన్ని గోప్యంగా ఉంచుతూ సస్పెన్షన్‌ను సైతం ఎత్తివేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
పోలీస్ వర్సెస్ పొలిటికల్
సాక్షి, భూపాలపల్లి : అధికార పార్టీకి ఎదురు తిరిగితే జిల్లా పోలీసులకు మిగిలేది బదిలీనే. చిన్న వివాదాలకు సైతం రాజకీయాలను ఆపాదించి అధికారులను సాగనపుంతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నారు. మొన్న కాటారం, మహదేవపూర్ సీఐల బదిలీ మరవకముందే పోలీసు శాఖలో మరో బదిలీ చోటుచేసుకుంది. ములుగు డీఎస్పీని ట్రాన్స్ఫర్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై ఇటు పోలీస్ శాఖలో, అటు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. జిల్లాలో పోలీసులకు అధికార పార్టీ నాయకులకు మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. ఏ సమస్యలోనైనా రాజకీయ నాయకుల ప్రమేయం ఉం టే బాధితులకు న్యాయం జరగదేమోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా జరుగుతున్న సంఘటనలు ఇందుకు బలం చేకూర్చుతున్నాయి. చిన్న పాటి భూ వివాదంలో ఏకంగా డీఎస్పీ స్థాయి వ్యక్తిని ఉన్నపళంగా బదిలీ చేశారం టే.. ఏమేరకు రాజకీయ ఒత్తిళ్లు పనిచేశాయో అర్థం అవుతోంది. ఇంతకు ముందు కాటారంలో సీఐగా పనిచేసిన శంకర్‌రెడ్డి బదిలీ విషయం కూడా జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. కాటారం పరిధి లో ఇసుక, గుట్కా, బెల్ట్ షాపుల అక్రమ దందా పై ఉక్కుపాదం మోపారు. ఇసుక రవాణాలో ప్రతీరోజు ఏదో ఒకదగ్గర కేసు నమోదు అవు తుండడం ఇసుక వ్యాపారులకు కంటగింపుగా మారింది. దీంతో స్థానిక నాయకులు, ఇసుక వ్యాపారులు మంత్రి స్థాయిలో పైరవీలు నడిపి బదిలీ చేయించారని స్థానిక ప్రజలు ఆరోపించారు. ఇది జరిగిన కొద్ది రోజులకే ఓ రోడ్డు ప్రమాదం సంఘటనకు సంబంధించి ప్రతిపక్ష నాయకులకు సపోర్టుగా ఉంటున్నారనే కారణంతో మహదేవపూర్ సీఐని బదిలీ చేసినట్లు వినికిడి. ప్రస్తుతం ఇదే వరుసలో ములుగు డీఎస్పీ రాఘవేంద్రరెడ్డిని చేర్చారు. పోలీసు వృత్తికి రాజకీయాలు ఆపాదిస్తూ బదిలీ వేటు వేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గణపురం మండలం రవినగర్ భూవివాదంలో అధికార పార్టీ నాయకులపై చేయిచేకున్నారని ఆరోపిస్తూ ఆపార్టీ కార్యకర్తలు ధర్నా, రాస్తారో కో చేసిన విషయం తెలిసిందే. బాధితుల వివరాల ప్రకారం.. డీఎస్పీ రాఘవేంద్రారెడ్డి తమ కు న్యాయం చేయాలని చూశాడని, ఇది నచ్చకే అధికార పార్టీ నాయకులు డీఎస్పీపై ఆధారాలు లేని ఆరోపణలు చేసి ట్రాన్స్ఫర్ అయ్యేలా చేశారని మండిపడుతున్నారు. గతంలో వరంగల్ ఎంపీ ఉప ఎన్నికల సమయంలో అప్పటి ములుగు డీఎస్పీ, ప్రస్తుతం జిల్లాలో ఏఎస్పీగా పనిచేస్తున్న రాజ్మహేంద్ర నాయక్ బదిలీలోనూ రాజకీయ ప్రమేయం ఉందని ప్రజలు అంటున్నారు. ములుగులో డీఎస్పీ మార్క్.. ములుగు సబ్ డివిజన్ పరిధిలోని అన్ని మండలాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నేరాలను నియంత్రించడానికి డీఎస్పీ కృషి చేశారు. ఇందుకోసం ప్రతీ పోలీస్‌స్టేషన్ పరిధిలో వ్యాపారులు, ప్రజలతో సమావేశాలు ఏర్పాటు చేసి సీసీ కెమెరాల వినియోగంపై అవగాహన కల్పించారు. ప్రజలకు పోలీసులకు మధ్య ఎలాంటి తారతమ్య బేధాలు ఉండకూడదనే ఉద్దేశ్యంతో ప్రజాబంధం(కనెక్టివిటీ పోలీసింగ్) కార్యక్రమాన్ని వినూత్నంగా చేపట్టారు. జాకారం వైటీసీలో జరుగుతున్న కానిస్టేబుల్ ట్రైనింగ్ క్యాంపు పట్ల ప్రత్యేక శ్రద్ధవహిస్తూ యువతలో స్ఫూర్తిని నింపుతున్నారు. ఫలించని ప్రజల ఆందోళనలు.. ప్రతీసారి ప్రజ లు అధికారులు బదిలీలు ఆపాలని ధర్నా చేస్తున్నా పాలకులు పట్టించుకున్న దాఖాలాలు లేవు. ములుగు డీఎస్పీ బదిలీని అపాలని సుమారు 2వేల మంది ప్రజలు ధర్నాకు దిగారు. అక్రమ బదిలీని నిపివేయాలని ఎల్లారెడ్డిపల్లి గ్రామస్తులు రోడెక్కి ఆందోళన చేశారు. తమకు న్యాయం చేయాలని చూసిన అధికారిని అన్యాయంగా బదిలీ చేశారని ఆందోళన చేశారు. గతంలో కాటారం సీఐ శంకర్‌రెడ్డికి మద్దతుగా ప్రజలు, వివిధ సంఘాల నేతలు ధర్నాలు రాస్తారోకోలు నిర్వహించారు. విపక్ష పార్టీల ఆధ్వర్యం లో ప్రజాసంఘాలు ఆందోళనలు చేశారు. ప్రజలు ఎంతగా ప్రయత్నించినా ప్రభుత్వం స్పందించలేదు. సామాన్యుడికి భరోసా ఏదీ..? పోలీసులకే భరోసా కరువైంది. ఇక సామాన్యుడి పరిస్థితి ఎలా ఉంటుందో ఇటీవలి బదిలీల ఘటనలను బట్టి అర్థం చేసుకోవచ్చు. బాధితులకు న్యాయం చేయాలని చూస్తున్నప్పటికీ పలు రాజకీ య ఒత్తిళ్ల కారణంగా పోలీసులు ఇబ్బందులకు గురికావాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిజాయతీగా పనిచేస్తున్న పోలీస్ అధికారులకు ప్రభుత్వ ఇచ్చే బహుమతి బదిలీయేనా అని ప్రజలు ఆక్రోశిస్తున్నారు. తమకు న్యాయం చేయాలనుకున్న అధికా రిని అకారణంగా బదిలీ చేస్తున్నారంటూ రోడ్లపైకి వస్తున్నారు. జిల్లాలో సమర్థవంతమైన ఎస్పీ ఉన్నప్పటికీ రాజకీయ ఒత్తిళ్లతోనే ట్రాన్స్ఫర్లు అవుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
సీఐ శ్యామరావుపై బదిలీ వేటు
అనంతపురం సెంట్రల్: వరుస వివాదాలకే కేరాఫ్‌గా మారిన అనంతపురం నాలుగో పట్టణ పోలీసుస్టేషన్ సీఐ శ్యామరావుపై బదిలీ వేటు పడింది. అవినీతి ఆరోపణలు, ముఖ్యంగా న్యాయవాదిపై దాడి ఘట న పోలీసు శాఖకే చెడ్డపేరు తీసుకొచ్చింది. ఉన్నతాధికారులు సైతం సీఐ వ్యవహారశైలిపై తీవ్ర స్థాయిలో మందలించడంతో చివరకు క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది. దీంతో స్టేషన్లో ‘పంచాయితీ’లు కూడా బెడిసికొట్టి వార్తల్లోకెక్కారు. చివరకు తమ కానిస్టేబుల్‌నే లాకప్‌లో వేస్తానని బెదిరించిన ఘటన కలకలం రేపింది. ఈ వ్యవహారాలన్నింటిపై ‘సాక్షి’ లో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. అప్పట్లోనే చర్యలు ఉంటాయని భావించినప్పటికీ ఓ ప్రజాప్రతినిధి అండతో ఆయన అలాగే కొనసాగుతూ వచ్చారు. చివరకు సీఐ శ్యామరావును వీఆర్ కు బదిలీ చేస్తూ అనంతపురం రేంజ్ డీఐజీ ప్రభాకర్‌రావు గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులు తీసుకునేందుకు ససేమిరా వీఆర్‌కు బదిలీ చేస్తూ జారీ అయిన ఉత్తర్వులను అందుకోవడానికి సీఐ శ్యామరావు ససేమిరా అన్నట్లు తెలిసింది. బదిలీ ఉత్తర్వులు వచ్చినా యథాస్థానంలో కొనసాగేందుకు ప్రయత్నాలు చేసినట్లు నాల్గవ పట్టణ పోలీస్‌స్టేషన్ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో మళ్లీ పైస్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చి వీఆర్ నుంచి సీసీఎస్ సీఐగా పోస్టింగ్ ఇప్పించుకున్నారు. నూతన సీఐగా రాజశేఖర్ నాల్గవ పట్టణ నూతన సీఐగా రాజశేఖర్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన గతంలో స్పెషల్‌బ్రాంచ్ సీఐగా పనిచేశారు. తర్వాత కర్నూలకు బదిలీ అయ్యారు. ప్రస్తుతం నాల్గవ పట్టణ సీఐగా నియమించడంతో శుక్రవారం ఉన్నతాధికారులను మర్యాదపూర్వకంగా కలిసిన అనంతరం బాధ్యతలు స్వీకరించారు. నూతన సీఐకి ఎస్ఐలు, సిబ్బంది స్వాగతం పలికారు. -
ఏయ్.. పక్క గ్రామాల్లో తిరగొద్దు
చిత్తూరు, నిండ్ర:‘ఏయ్.. ఎక్కడికెళ్లి వస్తున్నారు? ఒక గ్రా మం వాళ్లు ఇంకో గ్రామంలో తిరగద్దండి. వేరే గ్రామాల్లోకి వెళ్తే కేసులు నమోదు చేస్తా’ అంటూ నగరి సీఐ మల్లికార్జున వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మండలంలోని కొప్పేడు దళితవాడలో ఎమ్మెల్యే రోజా బుధవారం వైఎస్సార్సీపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే వెంట వైఎస్సార్సీపీ యువజన విభాగం నాయకులు వెళ్లారు. తిరిగి స్వగ్రామాలకు వెళ్తున్న వారి వాహనాలను నగరి సీఐ మల్లికార్జున గుప్తా మార్గమధ్యలో నిలిపారు. ఎక్కడికి వెళ్లి వస్తున్నారని బెదిరింపులకు దిగారు. ఎమ్మెల్యే రోజా కార్యక్రమానికి వెళ్లినట్టు చెప్పడంతో సీఐ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీరు మీ గ్రామంలోనే ఉండాలి. మరో గ్రామానికి వెళ్తే కేసులు నమోదు చేస్తా’ అని హెచ్చరించారు. వేరే గ్రామాల్లో తిరగవద్దని చెప్పే హక్కు సీఐకి ఎవరిచ్చారని నేతలు మండిపడుతున్నారు. -
వేటు పడింది..
తాండూరు వికారాబాద్ : తాండూరు రూరల్ సీఐ చింతల సైదిరెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు ఐజీ స్టీఫెన్ రవీంద్ర సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో అదే రోజు రాత్రి సీఐ స్టేషన్ నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. మూడేళ్ల క్రితం చేవెళ్ల సీఐగా పనిచేసిన ఈయన బదిలీపై తాండూరుకు వచ్చారు. 5 నెలల క్రితం తాండూరు రూరల్ సర్కిల్ పరిధిలోని పెన్నా సిమెంట్స్ టౌన్షిప్లో భారీ చోరీ జరిగి రూ.కోటికి పైగా నగదు, బంగారం అపహరణకు గురైంది. సీఐ ఇంతవరకూ ఈ కేసును ఛేదించలేకపోయారు. అధికార పార్టీ అండ ఉందనే అతి విశ్వాసంతో ఇతర పార్టీ నాయకులను బెదిరింపులకు గురి చేశారని, పలు కేసుల్లో అమాయకులను వేధించారని ఈయనపై ఆరోలున్నాయి. రూరల్ పరిధిలో కాగ్నానది నుంచి ఇసుక అక్రమ రవాణాకు అండగా నిలిచారనే అభియోగాలున్నాయి. అంతే కాకుండా యంగ్ లీడర్స్ రాష్ట్ర అధ్యక్షుడు పైలెట్ రోహిత్‌రెడ్డితో పాటు ఆ సంస్థ వ్యవస్థాపకులు, సభ్యులపై అక్రమ కేసులు బనాయించారని విమర్శలు ఎదుర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీల నేతలు, స్వచ్ఛంద సంస్థలపై అకారణంగా కేసులు పెడుతూ పోలీసు శాఖపై ప్రజలకు ఉన్న గౌరవాన్ని మంటగలుపుతున్నారంటూ టీజేఎస్ జిల్లా ఇన్చార్జ్ పంజుగుల శ్రీశైల్‌రెడ్డి ఈయనపై ఇటీవలే డీజీపీ, ఐజీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. సాక్షి కథనంతో స్పందించిన అధికారులుపోలీస్ వర్సెస్ ఇంటెలిజెన్స్ శీర్షికతో గత నెల 23న సాక్షిలో ప్రచురితమైన కథనంపై ఆ శాఖ ఉన్నతాధికారులు స్పందించారు. యాలాల మండల పరిధిలోని లక్ష్మీనారాయణపూర్ చౌరస్తావద్ద ఇటీవల పోలీసులు, ఇంటెలిజెన్స్ అధికారుల మధ్య జరిగిన గొడవపై స్పెషల్ బ్రాంచ్ పోలీసులు వివరాలు సేకరించారు. గత నెల 19న పోలీసులు, ఇంటెలిజెన్స్ అధికారుల మధ్య ఘర్షణ జరిగింది వాస్తవమేనని ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు. ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు.రూరల్ సీఐ సైదిరెడ్డి ఎదుట గొడవ జరిగినా.. ఉన్నతాధికారులకు సమాచారం అందించలేదని, గొడవ విషయాన్ని సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేయకపోవడంతో అతనిపై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు ఐజీ స్టీఫెన్ రవీంద్ర ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
హుజూర్నగర్ సీఐపై సస్పెన్షన్ వేటు
సూర్యాపేట జిల్లా: హుజూర్ నగర్ సీఐ నరసింహా రెడ్డితో పాటు హెడ్ కానిస్టేబుల్ బలరాం రెడ్డి, కానిస్టేబుళ్లు వెంకటేశ్వర్లు (1416), కమలాకర్ (1845)లను సస్పెండ్ చేస్తూ ఐజీ స్టీఫెన్ రవీంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. హుజూర్ నగర్ పరిధిలో రేషన్ బియ్యం, గుట్కా పాకెట్ల అక్రమ రవాణా విషయంలో చిన్న వ్యాపారులపై కేసులు పెడుతూ పెద్ద వారికి సహకరిస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వీరిపై వచ్చాయి. దీంతో ఐజీ స్టీఫెన్ రవీంద్ర కొరడా ఝుళిపించారు. సస్పెన్షన్ వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. -
యూనిఫాంతో మోకరిల్లిన సీఐ.. ట్రోలింగ్
గోరఖ్‌పూర్: ఉత్తరప్రదేశ్‌లో ఓ సీనియర్ అధికారి చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ముందు యూనిఫాంలో మోకరిల్లిన సదరు అధికారి.. పైగా ఆ ఫోటోలను తన ఫేస్బుక్లో పోస్టు చేశారు. దీంతో పలువురు ఆన్లైన్లో సీఐను ట్రోల్ చేయటం ప్రారంభించారు. గురుపూర్ణిమ సందర్భంగా గోరఖ్‌నాథ్ ఆలయంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆలయ పెద్ద ఆదిత్యానాథ్ హాజరయ్యారు. దీంతో భద్రత కోసం సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ సింగ్ అక్కడికొచ్చారు. ఈ సందర్భంగా యోగి నుంచి ఆశీర్వాదం తీసుకున్న ప్రవీణ్.. ఆయా ఫోటోలను సోషల్ మీడియాలో ఉంచి ‘ఫీలింగ్ బ్లెస్స్డ్’ అంటూ పోస్ట్ చేశారు. వెంటనే విమర్శలు రావటంతో ప్రవీణ్ స్పందించలేదు. ‘నేను సీఎం హోదాలో ఆయనకా గౌరవం ఇవ్వలేదు. కేవలం ఆలయానికి పెద్దగా మాత్రమే పూజ చేశా’ అంటూ బదులిచ్చారు. అయితే చాలా మంది మట్టుకు మాత్రం ప్రవీణ్ చేసిన పనిని తప్పుబడుతున్నారు. యూనిఫాంలో ఆ పని చేయాల్సిన అవసరం ఏంటి? సిగ్గుందా? పోలీసుల పరువు తీసేశావ్.. ప్రభుత్వ ఉద్యోగివేనా? ఇలా పలువురు విరుచుకుపడుతున్నారు. మరోవైపు ట్రోలింగ్ కూడా ఓ రేంజ్‌లోనే జరుగుతోంది. -
సీఐ భూమయ్య ఇంట్లో ఏసీబీ సోదాలు
కరీంనగర్‌క్రైం: భూమిని కొనుగోలు చేయడానికి వెళ్తున్న అదిలాబాద్ ట్రాఫిక్ సీఐ దాసరి భూమయ్యను హైదరాబాద్‌లోని ఔటర్‌రింగ్ రోడ్డు వద్ద గురువారం ఏసీబీ అధికారులు తనిఖీ చేశారు. అతని వద్ద నుంచి లెక్కకురాని రూ.10లక్షలు, భూమికి సంబంధించిన రూ.15లక్షల విలువైన పేపర్లు స్వాధీనం చేసుకున్నారు. వాటిని గురించి సరైన సమాధానం చెప్పకపోవడంతో సీఐ భూమయ్యను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. కరీంనగర్‌లోని భూమయ్య ఇంట్లో జగిత్యాల, అదిలాబాద్, కరీంనగర్, హైదరాబాద్‌లోని వారి బంధువుల ఇళ్లలో ఏసీబీ డీఎస్పీ కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో సోదాలు చేశారు. ఈ సందర్భంగా పలు ఆస్తులను గుర్తించినట్లు తెలిసింది. అది నుంచి వివాదాలతోనే.. పోలీస్‌శాఖలో దాసరి భూమయ్యకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. సామాన్యుడికి న్యాయం చేస్తారని నేతలు, అధికారులు ఒత్తిళ్లను పట్టించుకోరని పేరుంది. గతంలో ఓ ఎస్పీ తనను అకారణంగా వేధింపులకు గురి చేస్తున్నాడని ప్రెస్మీట్లో బహటంగానే ప్రకటించారు.కొద్దిరోజులుగా డీఎస్పీగా పదోన్నతి కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఏసీబీకి పట్టుబడ్డారు. -
జూపల్లి ఓఎస్డీ వ్యవహారంలో సీఐపై బదిలీ వేటు
సాక్షి, హైదరాబాద్: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని భూవివాదంలో మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు, ఓఎస్డీతో వివాదాస్పదంగా మాట్లాడిన సీఐ వ్యవహారంపై పోలీస్ శాఖ స్పందించింది. ఈ వివాదంతో సంబంధమున్న ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా తాండూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జనార్దన్‌రెడ్డిని వీఆర్‌కు పంపిస్తూ గురువారం కరీంనగర్ రేంజ్ డీఐజీ ప్రమోద్‌కుమార్ ఆదేశాలిచ్చారు. ఓ అదనపు ఎస్పీ స్థాయి అధికారికి విచారణ బాధ్యతలను అప్పగించి అంతర్గత విచారణ నివేదిక అందజేయాల్సిందిగా ఆదేశించినట్టు పోలీస్ వర్గాలు తెలిపాయి. -
గంటలో ఐజీ ఫోన్ చేస్తడు
సాక్షి, పెద్దపల్లి/హైదరాబాద్: ‘‘నేను.. జూపల్లి కృష్ణారావు మినిస్టర్‌ను మాట్లాడుతున్నా.. ఏం మాట్లాడుతున్నవ్...తమాషా చేస్తున్నవా...గంటలో ఐజీ ఫోన్ చేస్తడు.. ప్రభుత్వమంటే ఏంటో చూపిస్తా..’’అంటూ పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఓ సీఐని బెదిరించిన ఫోన్ సంభాషణ వైరల్ అవుతోంది. పెద్దపల్లి జిల్లా ధర్మారంలోని భూవివాదం విషయంలో మంచిర్యాల జిల్లా తాండూరు సీఐ జనార్దన్‌రెడ్డిని బెదిరించిన ఈ ఆడియో కలకలం రేపుతోంది. ‘‘ఏయ్ నీ పేరేంటి.. నీది ఏ స్టేషన్... చెప్పేది విను... ఈ నంబర్‌ను డీజీకి ఫార్వర్డ్ చేస్తా.. ఏం ఆధారాలున్నాయో చెప్పు..’’అని ఆ ఆడియోలో మంత్రి అన్నా రు. శనివారం మంత్రి ఓఎస్డీ వీరారెడ్డికి సీఐ ఫోన్ చేసిన సందర్భంగా ఇది చోటుచేసుకొంది. ముందు వీరారెడ్డి మాట్లాడినా.. సంభాషణ మధ్యలో అకస్మాత్తుగా మంత్రి వచ్చారు. భూ వివాదంలో జోక్యం చేసుకొని స్టే ఇప్పించారని, అవతలి వ్యక్తులకు మద్ద తు పలుకుతున్నారంటూ వీరారెడ్డితో సీఐ వాగ్వాదానికి దిగారు. ‘‘ఆ భూమి మాది కాదని ఆర్డర్ అయినా ఇప్పించండి.. ఇదేం ధ ర్మం... న్యాయం’’అని సీఐ వాదనకు దిగారు. ఈ సమయంలో మంత్రి ఫోన్ తీసుకొన్నారు. ఈ విషయం తెలియక.. సీఐ కూడా కాస్త గట్టిగానే మాట్లాడారు. దీనిపై తీవ్రంగా ఆగ్రహించిన జూపల్లి తాను మంత్రి జూపల్లి కృష్ణారావును మాట్లాడుతున్నానంటూ మండిపడ్డారు. సూసైడ్ చేసుకుంటాం.. ధర్మారంలోని తన సోదరి కొత్త లక్ష్మికి చెందిన స్థల వివాదంలో అవతలి పార్టీ వారికి వీరారెడ్డి మద్దతు పలుకుతున్నారని, రోజుల తిరబడి తిప్పుకుంటున్నారంటూ సీఐ ఫోన్లో ఆవేదన వ్యక్తంచేశారు. మీ డీజీకి నంబర్ ఫార్వర్డ్ చేస్తానని జూపల్లి చెప్పడంతో.. ‘‘నేను కూడా డీజీకి వివరిస్తా. ఏదైతే అదే అవుతుంది. సూసైడ్ చేసుకొని చస్తం.. ఏం చేస్తాం’’అని సీఐ పేర్కొన్నారు. సీఐపై మంత్రి ఓఎస్డీ ఫిర్యాదు మంత్రి ఓఎస్డీ వీరారెడ్డి సీఐ జనార్దన్‌రెడ్డిపై ఆదివా రం సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జనార్దన్‌రెడ్డి చేస్తున్న ఆరోపణలు, భూమి వ్యవహారానికి సంబంధించిన విషయాలను వివరించారు. తనను సీఐ భయబ్రాంతులకు గురిచేశాడని, వివిధ చానళ్ల లో వస్తున్న కథనాలు అవాస్తవమని, వాటిపైనా చర్యలు తీసుకోవాలన్నారు. జనార్దన్‌రెడ్డి గత నెల 30 నుంచి బెదిరింపులకు పాల్పడుతున్నాడని తెలిపారు. ఇదీ వివాదం.. పెద్దపల్లి జిల్లా ధర్మారం పోలీసు స్టేషన్ ఎదురుగా ఉన్న సర్వే నంబర్ 262 నెంబర్లో నూనె నర్సయ్య అనే వ్యక్తికి 13 గుంటల పట్టా భూమి ఉంది. దాదాపు 30 సంవత్సరాల క్రితం ఇందులోంచి కోమటిరెడ్డి హన్మంతరెడ్డి అనే వ్యక్తికి ఆరు గుంటల పావు స్థలం విక్రయించాడు. రెండు సంవత్సరాల క్రితం నర్సయ్య మరణించగా ఆయన కుమారుడు నూనె శ్రీనివాస్ పేరిట మిగతా భూమిని మార్పిడి చేశారు. తర్వాత హన్మంతరెడ్డి కూడా ఆరున్నర గుంటల భూమిని తన కూతురు కొత్త లక్ష్మి పేరిట రిజిస్ట్రేషన్ చేయించి ఇటీవలే మరణించాడు. కాగా 2016లో శ్రీనివాస్ ధర్మారం మండలం ఎర్రగుంటపల్లికి చెందిన బద్దం మల్లారెడ్డికి ఇందులో నుంచి రెండు గుంటల భూమిని విక్రయించగా.. ఆ భూమికి హద్దులుగా సిమెంట్ పిల్లర్లు ఏర్పాటు చేసుకున్నారు. దీంతో తన సోదరుడు తాండూరు సీఐ జనార్దన్‌రెడ్డి సహాయంతో లక్ష్మి తన బందువులతో కలిసి వెళ్లి సరిహద్దు రాళ్లను ధ్వంసం చేశారు. ఈ వివాదంలో ఇరువర్గాలపై ధర్మారం పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. లక్ష్మి ఆ భూమిలో ఇంటి నిర్మాణం చేసింది. దీంతో శ్రీనివాస్ మంత్రి జూపల్లిని ఆశ్రయించాడు. ఈ క్రమంలో మంత్రి పేషీ నుంచి పలుమార్లు ఇరువర్గాలను పిలిపించి విచారణ చేశారు. దీనిపైనే వివాదం నెలకొంది. -
వీడియో కాలింగ్‌లో వేధింపులు: సీఐ సస్పెన్షన్
సాక్షి, చెన్నై: మహిళను లైంగిక వేధింపులకు గురి చేసిన ఇన్స్పెక్టర్ను అధికారులు సస్పెండ్ చేశారు. ఇన్స్పెక్టర్ కన్యాకుమారి జిల్లా కుళచ్చల్ పరిధిలో గల పోలీసుస్టేషన్లో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్ ఒకరు ఒక మహిళతో వీడియో కాలింగ్‌లో మాట్లాడుతుండగా అసభ్యమైన పదజాలంతో వేధింపులు గురి చేయడం ఇటీవల వాట్సాప్‌లో వైరల్ అయ్యింది. ఈ వీడియోలలో ఒక వీడియోలో ఇన్స్పెక్టర్ యూనిఫాంలో ఉంటూ మహిళతో అసభ్యకరంగా మాట్లాడుతూ వచ్చారు. మరో వీడియోలో అతను బెడ్‌పై అర్ధనగ్నంగా పడుకుని అసభ్యచేష్టలు చేస్తూ కనిపించాడు. ఈ వీడియోను తిలకించిన పోలీసు అధికారులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఇన్స్పెక్టర్ లీలలను వీడియో కాలింగ్ ద్వారా నమోదు చేసి విడుదల చేసిన మహిళ నాగర్‌కోవిల్ ప్రాంతానికి చెందినట్లు తెలిసింది. విచారణ కోసం వెళ్లిన సమయంలో సదరు మహిళను చూసి ఆకర్షితుడైన ఇన్స్పెక్టర్ ఆమె నంబరు తీసుకుని తరచూ మాట్లాడేవారు. ఆ తరువాత క్రమక్రమంగా అసభ్యకరంగా మాట్లాడుతుండడంతో మహిళ ఆవేదనకు గురైంది. దీంతో ఈ వ్యవహారాన్ని ఆమె వాట్సాప్ ద్వారా విడుదల చేసినట్లు సమాచారం. ఈ వీడియో వ్యవహారం గురించి ఎస్పీ శ్రీనాథ్ విచారణకు ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో దీనిపై విచారణ ముగించి విచారణ నివేదికను నెల్లై డీఐజీకి పంపారు. దీంతో ఇన్స్పెక్టర్ను అధికారులు సస్పెండ్ చేశారు. -
భూమి వదలకపోతే అంతు చూస్తా!
రాప్తాడు నియోజకవర్గంలో రాజ్యహింస పెరిగిపోయింది. మంత్రి పరిటాల సునీత ప్రమేయంతో ఆ పార్టీ కార్యకర్తలు, నాయకుల దౌర్జన్యాలకు అంతు లేకుండా పోతోంది. తాజాగా తనకు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలతో బలమైన వార్తలు రాసిన సాక్షి విలేకరిని ఆర్థికంగా దెబ్బతీసే ఎత్తుగడలకు మంత్రి ఊతమిచ్చారు. వంశపారంపర్యంగా వస్తున్న భూమిని టీడీపీ కార్యకర్తల పరం చేసేందుకు పావులు కదిపారు. వివాదం కాస్త కోర్టుకు చేరుకుంది. అయినా పట్టు విడవకుండా పోలీసులను ప్రభావితం చేస్తూ బెదిరింపులకు దిగారు. భూమి వదులుకోకపోతే అంతు చూస్తామంటూ సాక్షాత్తూ సీఐ స్థాయి అధికారి ద్వారా బెదిరించడమే కాక భౌతిక దాడికి ఉసిగొల్పారు. అనంతపురం సెంట్రల్ : రాప్తాడు నియోజకవర్గంలో తొలి నుంచి అధికారపార్టీకి వత్తాసు పలుకుతూ, ఏకపక్ష నిర్ణయాలతో ముందుకు పోతున్న ఇటుకలపల్లి సీఐ రాజేంద్రనాథయాదవ్ వ్యవహారం తారాస్థాయికి చేరుకుంది. ఇటీవల కందుకూరులో వైఎస్సార్ సీపీ కార్యకర్త శివారెడ్డి హత్య కేసులో కూడా ఆయనపై తీవ్ర ఆరోపణలున్నాయి. ఆయన అండ చూసుకునే టీడీపీ నేతలు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు అప్పట్లో నిరసనలు వ్యక్తమయ్యాయి. తాజాగా కోర్టులో వివాదంలో ఉన్న భూ సమస్యలోకి తలదూర్చి టీడీపీ నేతలకు బలవంతంగా ఆ భూమిని ఇప్పించేందుకు దుప్పటి పంచాయితీ చేస్తూ మరోవివాదానికి తెరలేపారు. గురువారం ఏకంగా బాధితుడిపై దాడికి బరితెగించారు. 40 సంవత్సరాలుగా సాగులో.. మండల కేంద్రం రాప్తాడులో సర్వే ‘612–1బి’లో ఉన్న ఐదు ఎకరాల పొలం స్థానిక సాక్షి విలేకరి కొండప్ప పేరుపై ఉంది. 40 సంవత్సరాలుగా ఆ భూమిని కొండప్ప కుటుంబసభ్యులే సాగు చేస్తూ వస్తున్నారు. పట్టాదారు పాసు పుస్తకాలతో పాటు రెవెన్యూ రికార్డుల్లో కూడా కొండప్ప సాగులో ఉన్నట్లు ఉంది. 44వ జాతీయ రహదారి పక్కనే ఈ భూమి రూ. కోట్లు విలువ చేస్తోంది. ఈ భూమిపై కన్నేసిన టీడీపీ నేతలు ఎలాగైనా దానిని కబ్జా చేసేందుకు పావులు కదుపుతూ వచ్చారు. మంత్రి సునీత అండతో కొన్నేళ్లుగా ఇబ్బందులకు గురిచేస్తూ వచ్చారు. సీఐ దుప్పటి పంచాయితీ తమకు వ్యతిరేకంగా వార్తలు రాశాడన్న అక్కసుతో కొండప్పను ఆర్థికంగా దెబ్బతీయడం ద్వారా లొంగదీసుకోవాలని టీడీపీ నాయకులు పథకం వేశారు. ఇందులో భాగంగానే అతని భూమిని టీడీపీ నేతలు కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న కొండప్ప కబ్జాను అడ్డుకున్నాడు. హైకోర్టును ఆశ్రయించి, భూమిపై అన్ని విధాలుగా హక్కులను సాధించారు. దీనిని జీర్ణించుకోలేని టీడీపీ నాయకులు సీఐని ప్రభావితం చేసి దుప్పటి పంచాయితీలతో ముప్పుతిప్పలు పెడుతూ వచ్చారు. భూమిపై హక్కులు వదులుకో.. గురువారం ఉదయం రాప్తాడు పోలీస్‌స్టేషన్‌కు కొండప్పను సీఐ రప్పించుకున్నారు. ‘కోర్టుకెళ్లి ఎన్ని స్టేలు తెచ్చుకున్నా.. నీ భూమి నీకు దక్కదు. నేను చెప్పినట్లు విని రెండు ఎకరాలు వారికి ఇచ్చేసి సమస్య పరిష్కరించుకో’ అంటూ హుకుం జారీ చేశారు. దీనిపై కొండప్ప ససేమిరా అన్నారు. ‘సార్.. 40 ఏళ్లుగా ఆ భూమిలో మేమే సాగులో ఉన్నాం. మా నాన్న 30 ఏళ్లు సాగు చేశారు. ఆయన మరణానంతరం నాకు సంక్రమించిన ఆస్తి అది. నేను వదులుకోలేను. భూ రికార్డులు పరిశీలించి న్యాయం చేయండి’ అంటూ కొండప్ప అభ్యర్థించారు. దీంతో సీఐ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొండప్ప కాలర్ పట్టుకుని నాకే ఎదురు చెబుతావా.. నేను చెప్పినట్లు నీవు విని తీరాల్సిందే లేకుంటే పరిస్థితులు మరోలా ఉంటాయి అంటూ దుర్భాషలకు దిగారు. ఈ అంశాన్ని తన కెమెరాలో బంధించేందుకు కొండప్ప ప్రయత్నించగా ఆవేశంతో ఊగిపోతు దాడికి పాల్పడ్డారు. వైఎస్సార్ సీపీ,ప్రజాసంఘాల ఆందోళన రాప్తాడు నియోజకవర్గంలో టీడీపీకి సీఐ రాజేంద్రనాథ్‌యాదవ్ తొత్తుగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ సీపీ, ప్రజసంఘాల నాయకులు ఆరోపించారు. విలేకరి కొండప్పపై దాడిని ఖండిసూత గురువారం రాప్తాడు పోలీస్ స్టేషన్ ఎదుట రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగారాప్తాడు జెడ్పీటీసీ సభ్యుడు వెన్నపూస రవీంద్రారెడ్డి మాట్లాడుతూ.. భూ పంచాయితీలు చేసే అధికారం సీఐకి ఎవరిచ్చారని ప్రశ్నించారు. వెంటనే సీఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దాదాపు గంటపాటు ఆందోళన కొనసాగించారు. విషయం తెలుసుకున్న అనంతపురం డీఎస్పీ వెంకట్రావ్ అక్కడకు చేరుకుని ఘటనపై ఆరా తీశారు. బాధితుడికి న్యాయం చేస్తామంటూ హామీనివ్వడంతో ఆందోళనను విరమించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ బోయ రామాంజనేయులు, యూత్ కన్వీనర్ చిట్రెడ్డి సత్యనారాయణరెడ్డి, జిల్లా కార్యదర్శి సాకే నారాయణ, సర్పంచ్ గాండ్లపర్తి మోహన్‌రెడ్డి, నాయకులు యర్రగుంట కేశవరెడ్డి, దండు రామాంజనేయులు, కొత్తపల్లి నారాయణస్వామి, పసుపుల బాబయ్య, కుమ్మరరాము, సీపీఐ నాయకులు రామకృష్ణ, నాగరాజు, సీపీఎం నాయకులు పోతులయ్య, చంద్రశేఖర్‌రెడ్డి, రామాంజనేయులు, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. -
సాక్షి విలేకరిపై దాడి
సాక్షి, అనంతపురం : జిల్లాలోని ఇటుకలపల్లి సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ దైర్జన్యానికి దిగారు. భూవివాదంలో హైకోర్టు స్టేకాపీ ఇచ్చేందుకు వెళ్లి సాక్షి విలేకరిపై దాడికి పాల్పడ్డారు. స్టేకాపీ ఇచ్చేందుకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన రాప్తాడు విలేకరి కొండన్నపై దుర్భాషణలాడారు. గతంలో కూడా సీఐ రాజేంద్రనాథ్‌పై అనేక ఆరోపణలు వచ్చినా అధికారులు మాత్రం పట్టించుకోలేదు. కందుకూరు వైఎస్సార్సీపీ కార్యకర్త హత్య కేసులో నిందితులకు సహకరించారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. మంత్రి పరిటాల సునీత అండతో సీఐ రెచ్చిపోతున్నారనే విమర్శలు కూడా రాజేంద్రనాథ్‌పై ఉండడం గమనార్హం. -
గుంటూరులో కీచక చర్య
సాక్షి, గుంటూరు : మహిళలు, బాలికలపై రోజురోజుకు అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. తాజాగా గుంటూరు నగరంలో మైనర్ బాలికపై సీఐ కారు డ్రైవర్ అత్యాచారయత్నం చేయబోయాడు. ఆ కామాంధుడి చర్యతో బెంబేలెత్తిపోయిన బాలిక గట్టిగా కేకలు వేసింది. దీంతో పట్టాభిపురం సీఐ కారు డ్రైవర్ జానీ బాలికను వదిలేసి పారిపోయాడు. ఈ ఘటనపై బాధిత బాలిక నల్లపాడు పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. సీఐ కారు డ్రైవర్‌గా పనిచేస్తూ.. బాధ్యతాయుతంగా మెలగాల్సిన వ్యక్తే.. ఇలా బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టేందుకు ప్రయత్నించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
మృతురాలి ఒంటిపై బంగారం అపహరణ
గుంటూరు: పోలీసు శాఖలో కొందరు అధికారుల తీరు రోజురోజుకు ప్రశ్నార్థకంగా మారుతోంది. చివరకు శవాలను సైతం వదలకుండా దోచుకోవడంలో తాము మాత్రం తక్కువ తిన్నామా అన్నట్లు వ్యవహరిస్తూ పోలీసు శాఖ ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరిస్తున్నారు. అధికారులే నేరుగా రంగంలోకి దిగి దొంగల తరహాలో శవంపై ఉన్న బంగారు ఆభరణాలను చోరీ చేసిన ఘటన సభ్య సమాజం తలదించుకునేలా చేసింది. ఏకంగా అర్బన్ జిల్లా పరిధిలోని ఓ సీఐ తన చేతివాటం ప్రదర్శించి సుమారు 25 నుంచి 30 సవర్ల బంగారు ఆభరణాలను దర్జాగా తీసుకెళ్లి ఇంట్లో దాచుకున్నాడు. ఈ విషయమంతా మృతురాలి కుమార్తె అర్బన్ ఎస్పీని కలిసి ఫిర్యాదు చేయడంతో వెలుగు చూసింది. ఘటన పూర్వాపరాలు... అర్బన్ జిల్లా పరిధిలోని ఓ పోలీసు స్టేషన్ పరిధిలో 66 ఏళ్ల వయస్సు గల వృద్ధురాలు ఆమె నివాసంలో ఒంటరిగా నివాసం ఉంటుంది. గతేడాది మే 15న గుర్తు తెలియని అగంతకులు వృద్ధురాలిని తలపై మోది దారుణంగా హతమార్చారు. ఆపై మృతదేహాన్ని ఓ గదిలో పడేసి ఏసీ ఆన్‌చేసి ఇంటికి తాళాలు వేసి వెళ్లిపోయారు. మూడు రోజుల అనంతరం విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఏసీ పనిచేయక ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన స్థానికులు సమీపంలోని పోలీసులకు సమాచారం అందించడంతో అప్పుడు ఆ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న సీఐ, మరో కానిస్టేబుల్‌తో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని తాళాలు పగులగొట్టి ఇంట్లోకి వెళ్లారు. రక్తపు మడుగులో వృద్ధురాలి మృతదేహం పడి ఉండటంతో హత్య జరిగిందనే నిర్థారణకు వచ్చారు. ఈక్రమంలో మృతురాలు శరీరంపై, ఇంట్లో ఉన్న సుమారు 25 నుంచి 30 సవర్ల బంగారు ఆభణాలను సదరు సీఐ సర్దేశాడు. ఆవిషయాన్ని ఎక్కడా పోలీసుల రికార్డుల్లో నమోదు చేయలేదు. కేవలం హత్య కేసు మాత్రమే నమోదు చేసి చేతులు దులిపేసుకున్నారు. విషయాన్ని కృష్ణా జిల్లా దొగ్గంపూడిలో నివాసం ఉంటున్న వృద్ధురాలి కుమార్తెకు సమాచారం అందించడంతో హుటాహుటిన గుంటూరు చేరుకుని రక్తపు మడుగుల్లో విగతజీవిగా పడి ఉండటం చూసి కన్నీటి పర్యంతమైంది. వెలుగు చూసిందిలా .... ఈక్రమంలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి మృతురాలి తల్లికి అప్పగించారు. అంత్యక్రియల అనంతరం ఇంట్లో పరిశీలించగా ఎక్కడా బంగారు ఆభరణాలను కనిపించలేదు. ముందు రోజు కూడా తన తల్లి ఒంటిపై బంగారు ఆభరణాలు ఉన్నట్లు స్థానికుల ద్వారా తెలుసుకుంది. ముందుగా తాళాలు పగులగొట్టి ఇంట్లోకి వెళ్లింది. సీఐ మాత్రమే కావడంతో ఆయన తీరుపై అనుమానం వచ్చి పలుమార్లు సీఐను కలిసి ప్రశ్నించినా తనకు బంగారం విషయం తెలియదని, మళ్లీ ఇదే విషయాన్ని అడిగితే నిన్ను అనుమానించి కేసులో నిందితురాలిగా తేల్చాల్సి ఉంటుందని భయభ్రాంతులకు గురి చేశారని తెలిపింది. దీంతో బాధితురాలు గత్యంతరం లేని స్థితిలో ఇటీవల అర్బన్ ఎస్పీ సీహెచ్ విజయరావును కలిసి జరిగిన దొంగతనాన్ని వివరించి చెప్పడంతో అవాక్కైన ఎస్పీ విచారణకు ఆదేశించారు. విచారణలో నమ్మలేని నిజాలు... అర్బన్ జిల్లా పరిధిలోనే ప్రస్తుతం సదరు సీఐ విధులు నిర్వహిస్తుండటంతో నిఘా వర్గాల ద్వారా ఎస్పీ సమాచారం సేకరించి విచారణకు ఆదేశించారు. విచారణ అధికారిగా ఓ సీఐను నియమించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐను ఇటీవల ఓ పోలీసు స్టేషన్‌కు పిలిచించి విచారణ అధికారిగా వ్యవహరిస్తున్న సీఐ రెండు రోజులపాటు విచారించారు. చివరకు తన వద్ద నెక్లస్తోపాటు ఓ గాజు ఉన్నట్లు అంగీకరించి అప్పగించారని సమాచారం. మిగిలిన బంగారం కూడా సదరు సీఐ వద్దే ఉండి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటన పోలీసు శాఖలో అంతర్గతంగా చర్చనీయాంశంగా మారింది. ఇలాటి సీఐలపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటే మరో అధికారి ఇలాంటి చర్యలకు పాల్పడకుండా ఉంటారని చర్చించుకుంటున్నారు. -
పత్రాలు ఇవ్వడానికి రూ.3 లక్షలు లంచం
అన్నానగర్ : ఇంటి పత్రాలను ఇవ్వడానికి రూ.3 లక్షలు లంచం అడిగిన తంజావూర్ సీఐపై శుక్రవారం సీబీఐ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన ఉంటున్న హాస్టల్ గదికి సీల్ వేశారు. వివరాలు.. తంజావూర్ పల్లియక్కిరకారకి చెందిన జోసఫ్ కుమారుడు అంథోనిస్వామి. జేసీబీ యంత్రాన్ని బాడుగకు ఇచ్చే వ్యాపారం చేస్తున్నాడు. ఇతను తంజావూర్ మేలవీధిలో ఫైనాన్స్ సంస్థ నడుపుతున్న చంద్ర వద్ద 2016లో మూడు కంతుల వారీగా రూ.10.50 లక్షలు తీసుకున్నాడు. తన స్నేహితుల స్థలాలకు సంబంధమైన 4 దస్తావేజులను చంద్ర వద్ద అంథోనిస్వామి కుదువ పెట్టాడు. తరువాత అతను, అప్పుని కొద్ది కొద్దిగా వడ్డీతో చెల్లించాడు. వడ్డీతో కలిపి రూ.12.5 లక్షలు చెల్లించగానే తన దస్తావేజులను ఇవ్వమని అంథోనిస్వామి అడిగాడు. ఇంకా నగదు ఇస్తేనే దస్తావేజులను తిరిగి ఇస్తానని చంద్ర తెలిపాడు. దీంతో అంథోని స్వామి కొన్ని నెలల ముందు తంజావూర్ జిల్లా ఎస్పీ సెంథిల్‌కు ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ చేయాలని తంజావూర్ నగర జాయింట్ పోలీసు సూపరింటెండెంట్‌కు పంపారు. అనంతరం పోలీసు సీఐ జ్యోతి మహాలింగం ఇరువర్గాల వారిని పోలీసు స్టేషన్‌కి పిలిపించి విచారణ చేశారు. రూ.1 లక్షతో ఇంకొక దస్తావేజుని చంద్ర వద్ద ఇవ్వాలని అంథోని వద్ద పలికాడు. చంద్ర వద్ద కుదువపెట్టిన 4 దస్తావేజులను సీఐ తీసుకున్నాడు. ఈ పత్రాలను తీసుకున్నట్లు అంథోని స్వామి వద్ద ఓ పేపర్‌పై సంతకం తీసుకున్నాడు. కానీ ఆ పత్రాలను అతనికి అప్పగించలేదు. పత్రాలు అడిగిన ఆంథోని స్వామిని తంజావూర్ పాత బస్టాండ్ సమీపంలోని ఓ ప్రైవేటు హాస్టల్(రూం నంబర్105)కి వచ్చి తీసుకొమ్మని సీఐ చెప్పాడు. దీంతో అక్కడికి వెళ్లిన అంథోని స్వామి సీఐని కలిశాడు. అప్పుడు అతను, పత్రాలను ఇవ్వడానికి లంచం కోరాడు. అంథోని స్వామి తన వద్ద ఉన్న రూ.50 వేల నగదు ఇచ్చాడు. దాన్ని తీసుకున్న సీఐ ఒక పత్రం మాత్రం ఇచ్చాడు. ఇంకా 3 పత్రాలు కావాలంటే రూ.3 లక్షలు లంచం ఇవ్వాలని అడిగాడు. లంచం ఇవ్వటానికి ఇష్టపడని అంథోని స్వామి తంజావూర్ సీబీఐ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీబీఐ పోలీసులు అతని కదలికలు పర్యవేక్షించారు. శుక్రవారం తంజావూర్ పోలీసుస్టేషన్‌కి లంచం నిషేధ పోలీసులు వెళ్లి అక్కడ పనుల్లో ఉన్న పోలీసుల వద్ద విచారణ చేశారు. అప్పడు అంథోని స్వామి కుదువ పెట్టిన పత్రాలను సీఐ జ్యోతి మహాలింగం తీసుకున్నట్లు, దాన్ని అతనికి అప్పగించకుండానే సంతకం తీసుకున్నట్లు తెలిసింది. అనంతరం సీఐ నివసించిన గదికి సీల్ వేశారు. సీఐ జ్యోతి మహాలింగంపై సీబీఐ పోలీసులు కేసు నమోదు చేశారు. -
నిజాయితీ సేవకు ‘బదిలీ’ బహుమానం!
సాక్షి, భూపాలపల్లి : పని చేసిన 11 నెలల్లోనే ఆయన తన మార్క్ చూపించారు. ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న ఇసుక లారీల ఆట కట్టించారు. పల్లెల్లో విచ్ఛలవిడిగా వెలసిన బెల్ట్‌షాపుల బెల్ట్ తీశారు. కొందరు పెద్దమనుషులు చేసే సెటిల్మెంట్లను కట్టడి చేశారు. అక్కమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్న కాటారం సీఐ శంకర్‌రెడ్డి అనతికాలంలోనే బదిలీని బహుమతిగా అందుకున్నారు. దీని వెనక ఇసుకాసురుల లాబీయింగో.. అధిక పార్టీ నేతల ఒత్తిడో బలంగా పని చేసి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒత్తిళ్లతోనే బదిలీ ? జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏర్పాటు అనంతరం సీఐ శంకర్‌రెడ్డి ఇక్కడ స్పెషల్ బ్రాంచ్‌లో విధులు నిర్వర్తించారు. ఆయన పనితీరును గమనించిన పోలీసు ఉన్నతాధికారులు కీలకమైన కాటారం సర్కిల్‌కు బదిలీ చేశారు. ఇక్కడ సాఫీగా పని చేస్తున్న క్రమంలోనే హఠాత్తుగా జిల్లా స్పెషల్ బ్రాంచ్‌కి తిరిగి బదిలీ చేశారు. అయితే సీఐ బదిలీ వెనుక ఇసుకాసురుల హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధిక లోడ్‌తో వెళ్లే ఇసుక లారీలను అరికట్టడం, అక్రమ ఇసుక రవాణాపై దృష్టి సారించడం మూలంగానే కొందరు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు పోలీసు ఉన్నతాధికారులపై రాష్ట్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చి బదిలీ చేయించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే సీఐ బదిలీని రద్దు చేయాలని, ఇక్కడే కొనసాగించాలంటూ పలు ప్రజాసంఘాల నాయకులు స్వయంగా కాటారం ప్రధాన రహదారిపై రాస్తారోకో చేయడం, టీఆర్ఎస్ నాయకులు టపాసులు పేల్చడంతో అనుమానాలు బలపడుతున్నాయి. వందలాది కేసులు.. అధికార పార్టీ, ప్రతిపక్షం అనే తేడా లేకుండా కాటారం డివిజన్లో జరిగే అనేక అక్రమ కార్యకలాపాలను సదరు సీఐ నిరోధించారనే పేరుంది. గుట్కా, డ్రంక్ అండ్ డ్రైవింగ్, బెల్ట్‌షాపులు, క్యాట్ ఫిష్ రవాణాను ఆశించిన స్థాయిలో నివారించినట్లు స్థానికులు తెలుపుతున్నారు. క్యాట్‌ఫిష్‌లను తరలిస్తున్న 7 వాహనాలు, అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న 10 వాహనాలు, అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న 20 లారీలు, 150 ఓవర్‌లోడ్ ఇసుక లారీలను పట్టుకొని కేసులు నమోదు చేశారు. 25 మంది గుడుంబా తయారీ, విక్రయదారులు, 40 మంది బెల్టుషాపు నిర్వాహకులపై కేసులు పెట్టారు. 20 మంది గుట్కా విక్రయదారుల పట్టివేతతోపాటు ఏకంగా 20 మందిపై రౌడీషీట్ ఓపెన్ చేశారు. గురువారం సైతం అధిక లోడ్‌తో వెళ్తున్న 36 ఇసుక లారీలను పట్టుకొని కేసు నమోదు చేనినట్లు తెలిసింది. విధి నిర్వహణతో కచ్చితంగా ఉండే పోలీసు అధికారిని హఠాత్తుగా బదిలీ చేయడంపై పోలీసుశాఖలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్యులకు భరోసా.. కాటారం ఠాణాకు వచ్చిన పంచాయతీలన్ని పోలీస్‌స్టేషన్ వెనుక భాగంలోని మామిడి చెట్టు కింద కొందరు పెద్ద మనుషులు సెటిల్మెంట్లు చేస్తారనే ఆరోపణలు ఉండేవి. కాగా శంకర్‌రెడ్డి విధుల్లో చేరిన అనంతరం ఈ పంచాయతీలకు చెక్ పెట్టడంతో సామన్య ప్రజలు సైతం పెద్ద మనుషులను ఆశ్రయించకుండా నేరుగా స్టేషన్‌కు వచ్చేదని స్థానికులు తెలుపుతున్నారు. -
సార్.. స్టేషన్‌కు వెళ్లమన్నారని..!
సాక్షి, సూర్యాపేట క్రైం : హలో డ్రైవర్సార్.. మిమ్మ ల్నే.. సీఐసార్ నాకు దగ్గర.. మిమ్మల్ని.. పల్సర్ బైక్ వేసుకొని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లమ్మంటున్నారం టూ.. ఓ గుర్తుతెలియని దుండగుడు.. సరిగ్గా.. 04.44 గంటల సమయంలో డ్రైవర్ కళ్లు కప్పి పోలీసు వాహనాన్ని దొంగిలించాడు. ఈ ఘటన శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. సూర్యాపేట రూరల్ సీఐగా పనిచేస్తున్న ప్రవీణ్‌కుమార్ జిమ్ చేసేందుకు జిల్లా కేంద్రంలోని యూనివర్సల్ జిమ్సెంటర్కు తన కు కేటాయించిన ఆత్మకూర్(ఎస్) మండల పోలీస్‌స్టేషన్ సుమో టీఎస్ 09 పీఏ 1568 నం బరు గల వాహనంలో వచ్చాడు. సెంటర్లో సీఐని దింపిన డ్రైవర్ సమీపంలో పార్కింగ్ చేసేందుకు వచ్చాడు. సీఐ డ్రైవర్ ఎం.సైదులు వద్దకు వచ్చిన దుండగుడు సీఐ మిమ్మల్ని అర్జెంటుగా స్టేషన్‌కు వెళ్లమన్నారని.. మీకు పల్సర్‌బైక్ ఇవ్వమన్నారంటూ తన వద్ద ఉన్న బైక్ డ్రైవర్‌కు ఇవ్వడమే ఆలస్యం.. వెంటనే సుమోలోకి ఎక్కిన దుండగుడు డ్రైవింగ్ చేసుకుంటూ అపహరించుకుపోయాడు. 20 నిమిషాల పాటు .. డ్రైవర్ సైదులు వద్ద నుంచి సుమోను దొంగలించుకుపోయిన దుండగుడు.. నేరుగా పట్టణంలోని మున్సిపల్ పెద్దవాటర్ ట్యాంక్ మీదుగా.. సద్దుల చెరువు కట్టపైకి సుమోను డ్రైవింగ్ చేసుకుంటూ సూర్యాపేట రూరల్ పోలీస్‌స్టేషన్ ముందు నుంచే వెళ్లాడు. సుమో ఎక్కడాన్ని గమనించిన డ్రైవర్ సైదులు దుండగుడు ఇచ్చిన బైక్‌ను తీసుకుని సుమోను వెంబడించాడు. ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో సుమోకు బైక్‌ను అడ్డం పెట్టినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. సుమోను తిరిగి వెనక్కు అదే రూట్లో రూరల్‌పోలీస్‌స్టేషన్ ముందు నుంచి తీసుకెళ్తండడాన్ని స్టేషన్లో పోలీసులు గుర్తించారు. గమనించిన కొందరు కానిస్టేబుళ్లు.. సూర్యాపేట రూరల్ పోలీస్‌స్టేషన్ నుంచి సీఐ ప్రవీణ్‌కుమార్‌కు ఫోన్‌చేసి తమకు కేటాయించిన సుమోను వేగంగా నడుపుతూ వెళ్తున్నారని చెప్పారు. వెంటనే సీఐ డ్రైవర్ సైదులుకు ఫోన్ చేయగా.. విషయాన్ని వివరించాడు. వాహనాన్ని అపహరించిన దుండగుడు ముందుగా సుమోకు ఏర్పాటు చేసిన జీపీఆర్ఎస్ను తొలగించి రూరల్ పోలీస్‌స్టేషన్ ప్రాంతంలోనే వేశాడు. దీంతో దుండగుడు వినియోగించిన పల్సర్ బైక్ టీఆర్ నంబర్ ఆధారంగా విచారణ చేపట్టారు. జిల్లా కేంద్రంలోని అన్నాదురై నగర్‌కు చెందిన యాట ప్రవీణ్‌కు చెందిన పల్సర్బైక్గా గుర్తించారు. వెంటనే అన్నాదురై నగర్‌కు పోలీసులు చేరుకుని యాట నవీన్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో ప్రవీణ్ తన బైక్‌ను బావమరిది తిరుపతి రాజు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో తీసుకుని వెళ్లినట్లుగా తెలిపాడు. వెంటనే ప్రవీణ్ వద్ద ఉన్న రాజు, అతని భార్య ఫోన్ నంబర్లు కూడా తీసుకుని విచారణ చేపట్టారు. భార్య ఫోన్ ఫోన్ కలవగానే.. విషయాన్ని పోలీసులు వివరించారు. రాజు భార్య తనకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నానని.. పోలీసు వాహనాన్ని తమ వద్దకు తీసుకొచ్చి నట్లు తెలపడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. భార్యను చూసిన రాజు.. తిరిగి వాహనాన్ని తీసుకుని అక్కడి నుంచి తన అత్తగారి స్వ గ్రామమైన ఖమ్మం జిల్లా చింతకాని మండలం లోని జగన్నాథపురం గ్రామానికి వాహనాన్ని తీ సుకుని వెళ్లాడు. వెంటనే అక్కడి కమిషనర్ ఆఫ్ పోలీస్‌కు ఎస్పీ జాదవ్ సమాచారం చేరవేశారు. ఐదు గంటలకుపైగా హైరానా.. ఎస్పీ జాదవ్ అన్ని జిల్లాల కమిషనర్లు, ఎస్పీలకు సమాచారం చేరవేశారు. వెంటనే సూర్యాపేట రూరల్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని డ్రైవర్ సైదులుతో పాటు సీఐ ప్రవీణ్‌కుమార్‌ను విచారించారు. జిల్లా వ్యాప్తం గా ఉన్న పోలీస్స్టేషన్లలోని సీఐలు, ఎస్ఐలు, సిబ్బందిని అప్రమత్తం చేసి విషయాన్ని సెట్ ద్వారా చేరవేశారు. జిల్లా కేంద్రంలోని పోలీసులు 8 బృందాలుగా చీలిపోయి గాలింపు చర్యల్లో నిమగ్నమయ్యారు. కృష్ణా జిల్లా చిల్లకల్లులో స్వాధీనం దుండగుడు తన అత్తగారి గ్రామమైన ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథరం నుంచి వాహనాన్ని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లులోకి ప్రవేశించాడు. అక్కడ వాహనంతో సంచరిస్తుండగా.. అక్కడి పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా చింతకాని నుంచి చిల్లకల్లుకు సుమారు 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది. పేట ఎంటీఓ ఆర్ఐ, సిబ్బంది చాకచక్యంగా వ్యవరించి దుండగుడిని పట్టుకుని చిల్లకల్లు పోలీస్‌స్టేషన్‌లో ఉంచారు. సూర్యాపేటలోని ఇందిరమ్మ కాలనీ చెందిన తిరుపతి రాజుగా గుర్తించామని ఎస్పీ ప్రకాశ్‌జాదవ్ తెలిపారు. దుండగుడు దొంగ కాదని.. అతడికి మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తి అని పేర్కొన్నారు. -
సూర్యాపేట: సీఐ వాహనాన్ని దొంగలించిన దుండగులు
-
తెలుగు తమ్ముళ్ల కక్ష సాధింపు
సాక్షి, తాడేపల్లిగూడెం : ఆంధ్రప్రదేశ్‌లో అధికార తెలుగుదేశం పార్టీ నాయకుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. తమ అక్రమాలకు అడ్డొస్తున్నారనే అక్కసుతో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సీఐ రాజశేఖర్‌ను సస్పెండ్ చేయించారు. నగరంలో అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో జరుగుతున్న పేకాట, అవినీతిని అక్రమాలను రాజశేఖర్ అడ్డుకుంటున్నారు. తమ ఆటలు సాగడం లేదన్న కోపంతో ఆయనపై తెలుగు తమ్ముళ్లు కక్ష కట్టారు. కొన్నిరోజుల క్రితం టీడీపీ నేతల ఒత్తిడితో రాజశేఖర్‌ను ఉన్నతాధికారులు విఆర్‌లోకి పంపించారు. ఈ విషయం తెలుసుకుని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిగూడెం బహిరంగ సభలో ప్రస్తావించారు. రాజశేఖర్ గురించి సభలో ప్రస్తావించడంతో టీడీపీ నాయకులు కక్ష సాధింపుతో సీఐను అదేరోజు ఏకంగా సస్పెండ్ చేయించారు. రాజశేఖర్‌ను తామే సస్పెండ్ చేయించినట్టు టీడీపీ నేత, జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు మీడియా ముఖంగా ప్రకటించారు. విఆర్‌లోకి కాదు ఏకంగా సస్పెండ్ చేయించామని గొప్పలు పోయారు. తమ పార్టీ నేతలపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తే ఎలా ఊరుకుంటామని ఎదురు ప్రశ్నించారు. ఈ మాటలను బట్టి టీడీపీ కక్ష సాధింపులో భాగంగానే సీఐ రాజశేఖర్‌పై చర్య తీసుకున్నారని స్పష్టమయింది. -
సివిల్ కేసులో ఒంటిమిట్ట సీఐ జోక్యం!
వైస్సార్, రాజంపేట: నందలూరు మండల పరిధిలోని గొల్లపల్లె రహదారిలో ఉన్న గొబ్బిళ్ల మెమోరియల్ హైస్కూల్ ఆస్తి వ్యవహారంలో ఒంటిమిట్ట సీఐ రవికుమార్ వ్యవహరించిన తీరుపై స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. బాధితురాలు గొబ్బిళ్ల భాగ్యలక్ష్మీ మాట్లాడుతూ గొబ్బిళ్ల హైస్కూ ల్ ఆస్తి నా పేరుతో రిజిష్టరు అయిందన్నారు. అయితే దానిని కబ్జా చేయడానికి కోడూరు సుజాత కుట్ర పన్ని పోలీసులకు తప్పుడు సమచారం ఇచ్చిందన్నారు. దానికి అధికారపార్టీ నాయకుల వత్తిడి మేరకు ఒంటిమిట్ట సీఐ రవికుమార్ జోక్యం చేసుకున్నారని ఆరోపించారు. రాత్రి పది గంటల సమయంలో సీఐ తన సిబ్బందితో ఆవరణంలోకి ప్రవేశించి, గేటు ఓపెన్ చేయాలని విచారణ నిమిత్తం వచ్చానని చెప్పినట్లు తెలిపారు. దౌర్జన్యంగా తమ పట్ల సీఐ వ్యవహరించారన్నారు. అర్ధాంతరంగా రాత్రి సమయంలో సీఐ సివిల్ వ్యవహారంలో తలదూర్చి విచారణ చేయడం తగదన్నారు. ఈనెల 2వతేదీ కోడూరు సుజాత, ఇద్దరి పిల్లలపై నందలూరు పోలీసుస్టేషన్ తాను ఫిర్యాదు చేయగా, నాన్‌బెయిల్‌బుల్ కింద కేసు నమోదైందని పేర్కొన్నారు. అయితే ఇంతవరకు ఆ కేసుపై ఎటువంటి విచారణ కానీ, అరెస్టు కానీ చేయలేదని ఆరోపించారు. కేసులో ఉన్న వారు పోలీసుస్టేషన్లో సీఐ ఎదుట కూర్చొని మాట్లాడుతున్నారని, ఇదెక్కడి న్యాయమని ఆమె ప్రశ్నించారు. పోలీసుల దౌర్జన్యం తమ పట్ల ఇలాగే కొనసాగితే తనతోపాటు నా కుటుంబసభ్యులు అందరం కలిసి పోలీసుస్టేషన్ ఎదుట ఆత్మహత్య చేసుకుంటామన్నారు. పోలీసులు అక్రమంగా తమ ఆస్తిలోపలికి ప్రవేశిస్తే తమకు ఆత్మహత్య శరణ్యమని వాపోయారు. తప్పుడు సమాచారం జిల్లా ఎస్పీకి చేరవేస్తున్నారని ఆరోపించారు. తాను జోక్యం చేసుకోలేదు ఈ విషయంపై సీఐ వివరణ కోరగా తాను సివిల్ కేసులో జోక్యం చేసుకోలేదని తెలిపారు. అలాంటిదేమీ లేదని పేర్కొన్నారు. -
న్యాయవాదిపై సీఐ దాడి
అనంతపురం న్యూసిటీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి, న్యాయవాది గోవిందరాజులుపై నాల్గవ పట్టణ సీఐ శ్యామ్‌రావు దాడి చేసి గాయపరిచారు. వివరాల్లోకి వెళితే శుక్రవారం గోవిందరాజు, అతని సోదరుడు శివశంకర్, మరో వ్యక్తి దివాకర్ రుద్రంపేట బైపాస్ సమీపంలో ఉన్న సండే కార్ బజార్ షోరూంకు బైక్‌లో వెళ్లారు. మొదట దివాకర్ బయటకు రాగా, ఆ సమయంలో అక్కడికి చేరుకున్న నాల్గవ పట్టణ సీఐ ‘ఏం రా..? దొంగకార్లు అమ్ముతున్నారంట’ అని వారిని నిలదీశారు. ‘సార్ దొంగ కార్లు అమ్మే ఖర్మ మాకేం పట్టిందని సీఐకు సమాధానమిచ్చారు. ఈ క్రమంలో దివాకర్‌ను సీఐ కొట్టే ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్న గోవిందరాజు సీఐకి నచ్చజెప్పే క్రమంలో అతనిపై చేయి చేసుకున్నారు. తాను న్యాయవాదినని, ఇలా చేయడం సరైన పద్ధతికాదని అనగా ‘ఎవరైతే నాకేం? నేను చెప్పిందే వేదం’ అంటూ విచక్షణారహితంగా దాడి చేయడంతో గాయపడ్డ గోవిందరాజులు సర్వజనాస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. సీఐపై కేసు నమోదు చేయాలి న్యాయవాది గోవిందరాజులుపై విచక్షణారహితంగా దాడిచేసిన సీఐ శ్యామ్‌రావుపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ అనంతపురం అర్బన్ నియోజకవర్గ సమన్వయకర్త, అనంతపురం పార్లమెంట్ అధ్యక్షులు అనంత వెంటకరామిరెడ్డి డిమాండ్ చేశారు. సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతున్న గోవిందరాజులను ఆయన పరామర్శించారు. జిల్లాలో అధికార పార్టీ నేతలు ప్రజలపై దాడులు, వసూలు చేస్తున్నా నియంత్రించడంలో పోలీసులు వైఫల్యం చెందారన్నారు. తక్షణం సీఐపై కేసు నమోదు చేసి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. వైఎస్సార్ సీపీ లీగల్‌సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కురుబ నాగిరెడ్డి మాట్లాడుతూ న్యాయవాదులపైనే దాడి చేస్తుంటే ఇక సామాన్యుల పరిస్థితేమిటన్నారు. సీఐపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు నారాయణరెడ్డి మాట్లాడుతూ సీఐపై ఎస్పీ క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్పీ స్పందించకపోతే ప్రైవేట్ కేసు వేస్తామని హెచ్చరించారు. గోవిందరాజులను పరామర్శించిన వారిలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మీసాల రంగన్న, జిల్లా అధికార ప్రతినిధులు చింతకుంట మధు, ఆలమూరు శ్రీనివాస్ రెడ్డి, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు మరువపల్లి ఆదినారాయణ రెడ్డి, పార్టీ నగరాధ్యక్షులు చింతా సోమశేఖర్ రెడ్డి, నేతలు గౌస్‌బేగ్, అనిల్, తదితరులు పాల్గొన్నారు. -
తప్పిపోయిన చిన్నారి చైల్డ్ ప్రొటెక్షన్‌కు అప్పగింత
ఏలూరు టౌన్ : ఏలూరు ఆర్టీసీ బస్టాండ్‌లో ఒంటరిగా ఉన్న ఒక బాలుడిని ఒక వ్యక్తి చేరదీసి బంధువుల కోసం ఆరా తీశాడు. ప్రయోజనం లేకపోవటంతో ఆ బాలుడిని ఏలూరు టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి పోలీసులకు అప్పగించాడు. బంధువుల సమాచారం తెలియకపోవటంతో బాలుడిని శిశు గృహకు తరలించారు. ఏలూరు పాత బస్టాండ్‌లో మంగళవారం రాత్రి 10గంటల సమయంలో నాలుగేళ్ల బాలుడు ఏడుస్తూ ఒంటరిగా కనిపించాడు. ఏలూరు మరడాని రంగారావు కాలనీకి చెందిన కాటూరి వెంకన్న ఆ బాలుడిని గమనించి తన ఇంటికి తీసుకువెళ్లాడు. బుధవారం ఉదయం మళ్లీ పాతబస్టాండ్‌కు తీసుకు వచ్చి వివరాలు ఏమైనా తెలుస్తాయని ఆశించాడు. రాత్రి వరకూ చూసినా ఎవరూ రాకపోవటంతో ఏలూరు టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకు వెళ్లి సీఐ జి.మధుబాబుకు అప్పగించారు. వెంటనే ఆయన ఐసీడీఎస్ పీడీకి సమాచారం అందించి ఆయన ఆదేశాల మేరకు చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఆర్.రాజేష్ పోలీస్‌స్టేషన్‌కు రాగా, ఆ బాలుడిని సీఐ మధుబాబు చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులకు అప్పగించారు. బాలుడి చిరునామా తెలిసిన వారు ఏలూరు టూటౌన్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీఐ మధుబాబు కోరారు. -
మా కుటుంబానికి న్యాయం చేయండి
కాకినాడ రూరల్: తన భర్త సకురు రాంబాబును హత్యచేసిన వ్యక్తులను కాపాడుతున్న అన్నవరం ఎస్సై, ప్రత్తిపాడు సీఐలపై చర్యలు తీసుకుని తమ కుటుంబానికి న్యాయం చేయాలంటూ మృతుడు రాంబాబు భార్య సకురు లక్ష్మి తన పిల్లలు, బంధువులతో కలెక్టరేట్ వద్ద మంగళవారం నిరాహారదీక్ష చేపట్టారు. తన భర్త మేకలను మేపుకొంటూ జీవనం సాగిస్తున్నాడని, అతడి మరణానికి నాలుగు రోజుల ముందు శంఖవరం మండలం వజ్రకూటం గ్రామానికి చెందిన సకురు ధర్మరాజు పోడుభూమి వ్యవహారంలో తన భర్తను చంపి కాల్చేస్తానంటూ బెదిరించాడన్నారు. ఫిబ్రవరి 23న వజ్రకూటానికి చెందిన ధర్మరాజు, అతను పురమాయించుకున్న కిరాయి మనుషులు కర్రి సోమరాజు, దేశలింగ రాంబాబు, అమలకోటి సూరిబాబు, అతడి అల్లుళ్లు గోపు సురేష్, కేళంగి జగ్గారావు, మేనల్లుడు గంగుమళ్ల అప్పారావు తన భర్తను హత్య చేసి కాల్చేశారని లక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది. అన్నవరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. తన భర్తను చంపిన వ్యక్తులపై కేసులు పెట్టాలని కోరుతుంటే.. అన్నవరం పోలీసులు తమ కుటుంబాన్ని బెదిరించి, తప్పుడు కేసులు పెడుతున్నారని లక్ష్మి విలపించింది. తన కుటుంబానికి అన్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్న ఎస్సై, సీఐలపై చర్యలు తీసుకోవాలని, అదే విధంగా తన భర్తను హత్యచేసిన ధర్మరాజు అతడి మనుషులను అరెస్టు చేయాలంటూ లక్ష్మి డిమాండ్ చేసింది. ఈ దీక్షల్లో సకురు త్రిమూర్తులు, సకురు రోజామణి, సకురు వెంకటలక్ష్మి, సకురు విష్ణుమూర్తి, పెదిరెడ్డి మంగ, సకురు నాగేశ్వరరావు తదితరులు కూర్చొని తమ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. -
సీఐ సస్పెన్షన్
గోదావరిఖని(రామగుండం): గోదావరిఖని వన్‌టౌన్ సీఐ గజ్జి కృష్ణను సస్పెండ్ చేస్తూ కరీంనగర్ రేంజీ డీఐజీ ప్రమోద్‌కుమార్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. గోదావరిఖని బాపూజీ నగర్లో ఫిబ్రవరి 16న తూడి స్వాతి ఆత్మహత్యకు ఆయనే కారణమని తేలడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. వివరాలు.. తూడి స్వాతి నాలుగేళ్ల కూతురుపై అదే కాలనీకి చెందిన 12 ఏళ్ల బాలుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయమై గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. తదనంతరం బాలుడు, ఆయన తండ్రి బెయిల్‌పై వచ్చి స్వాతితో పాటు కుటుంబ సభ్యులను తిట్టడం.. వేధించడం చేశారు. దీంతో స్వాతి న్యాయం చేయాలని వన్‌టౌన్ సీఐ గజ్జి కృష్ణను కోరినా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మానసికంగా వేదనకు గురైన ఆమె గతనెలలో ఆత్మహత్య చేసుకున్నారు. స్పందించిన సీపీ దుగ్గల్ వెంటనే సీఐ కృష్ణను కమిషనరేట్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. విచారణ అనంతరం ఆయనను సస్పెండ్ చేస్తూ డీఐజీ ప్రమోద్ కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. అయితే సీఐని కమిషనరేట్‌కు అటాచ్ చేసినప్పటికీ ఉన్నతాధికారులకు తెలియకుండా విధులకు గైర్హాజరుకావడం.. ఆయనపై అవినీతి ఆరోపణలు రావడం కూడా సస్పెండ్‌కు కారణాలుగా తెలుస్తోంది. -
సీఐ సోదరితో ప్రేమాయణం: అసలేం జరిగింది?
సాక్షి, కర్ణాటక(కృష్ణరాజపురం) : అపార్ట్మెంట్లోని ఐదో అంతస్తు నుంచి పడిపోయి తల్లి, కుమారుడు అనుమానాస్పదంగా మృతి చెందారు. ఈ ఘటన కేఆర్.పురం పరిధిలోని కాడుగోడి వార్డులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. యాదగిరికి చెందిన మౌనేశ్ (36) కేఎస్ ఆర్టీసీలో కండక్టర్‌గా పని చేస్తుండేవాడు. మూడు సంవత్సరాల కింద తుమకూరు జిల్లా స్పెషల్ పోలీస్ బృందం సీఐ చంద్రప్ప సోదరితో మౌనేశ్‌కు పరిచయమైంది. బీఎడ్ పరీక్షల కోసం మౌనేశ్ యాదగిరికి శిక్షణ తీసుకోవడానికి బస్సులో వెళ్తుండగా సీఐ చంద్రప్ప సొదరితో పరిచయం ఎర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. కాగా మౌనేశ్‌కు అప్పటికే వివాహమై పిల్లలు ఉండడంతో సీఐ చంద్రప్ప వీరి ప్రేమకు అడ్డు చెప్పారు. దీంతో కుటుంబ సభ్యుల ఒత్తిడికి చంద్రప్ప సోదరి కొంత కాలంగా మౌనేశ్‌కు దూరంగా ఉంటుంది. అయితే కొద్ది రోజుల నుంచి చంద్రప్ప సోదరి కనిపించడం లేదంటూ కాడుగోడి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీని వెనక మౌనేశ్ హస్తం ఉండొచ్చనే అనుమానంతో సీఐ చంద్రప్ప మాట్లాడాలంటూ మౌనేశ్‌తో పాటు అతని తల్లి సుందరమ్మ(60)ను కాడుగోడిలోని ఓ అపార్ట్‌మెంట్‌కు తీసుకెళ్లాడు. గత కొన్ని రోజుల నుంచి వారిని చంద్రప్ప గృహనిర్భంధం చేసి సోదరి గురించి చెప్పాలంటూ చిత్రహింసలకు గురి చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో సోమవారం రాత్రి మౌనేశ్, సుందరమ్మలు అపార్ట్మెంట్ నుంచి పడిపోయి మృతి చెందడంతో వీరి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విషయం తెలుసుకున్న అదనపు పోలీస్ కమిషనర్ సీమంత్ సింగ్, వైట్‌ఫీల్డ్ డీసీపీ అబ్దుల్ వహాద్, కాడుగోడి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆరా తీశారు. మృతుల శరీరాలపై గాయాలు ఉండడం అనుమానాలను మరింత పెంచుతోంది. కాడుగోడి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వృద్ధురాలిపై సీఐ దౌర్జన్యం
కడప అర్బన్ :పోలీసుస్టేషన్‌కు వచ్చే బాధితుల పట్ల కఠినంగా వ్యవహరించవద్దని, ప్రజలకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాలని రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు అనేక సందర్భాల్లో పోలీసు అధికారులు, సిబ్బందికి సూచిస్తున్నారు. అయితే కొందరు సిబ్బంది తమ తీరును ఏ మాత్రం మార్చుకోనట్లు కనబడుతోంది. కడప చిన్నచౌకు పోలీసుస్టేషన్ సీఐగా పనిచేస్తున్న రామకృష్ణ వైఖరి ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. గతంలో ఓ మైనర్ బాలిక వ్యవహారంలో కూడా సీఐ రామకృష్ణ తమదైన శైలిలో వ్యవహరించడం, మీడియాలో వార్తలకెక్కడం అధికారులనుంచి అక్షింతలు పడడం...తీరు మార్చుకోవాలని హెచ్చరించడం తెలిసిందే.తాజాగా శుక్రవారం జరిగిన సంఘటన ఆయన వ్యవహారశైలికి అద్దం పట్టినట్లుగా తెలుస్తోంది. ♦ ఈ సంఘటనపై బాధితుల కథనం మేరకు... కడప నగరం ప్రకాశ్‌నగర్‌కు చెందిన గౌరమ్మ అనే వృద్ధురాలిపై, కుటుంబ సభ్యులపై స్థల వ్యవహారంలో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో స్థలం వ్యవహారం విషయంలో పోలీసులు జోక్యం చేసుకోకూడదని స్పష్టంగా తెలిసినప్పటికీ ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వారిని తన చాంబర్లో కూర్చోబెట్టుకుని విషయం తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే వృద్ధురాలు గౌరమ్మ ప్రకాశ్‌నగర్‌లో నివసిస్తుండగా, ఆమెను, కుటుంబ సభ్యులను సీఐ రామకృష్ణ పిలిపించారు. వచ్చిన వెంటనే ఎలాంటి వివరాలు అడగకుండా వారిని కూర్చోబెట్టకుండా మాట్లాడటంతో అభ్యంతరం తెలిపారు. వృద్ధురాలిని, ఓ మహిళను దుర్బాషలాడి బయటికి వెళ్లిపోవాలని తిట్ల పురాణం అందుకున్నారు. వెంటనే ఆవేదనతో తమను సివిల్ పంచాయతీలో పిలిపించడమే తప్పని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో గౌరమ్మ పెద్దకుమారుడు రమేష్ సీఐ వ్యవహార తీరును ప్రశ్నించగా, అతన్ని కొట్టి చొక్కాను చించి వేసి బయటికి నెట్టివేశారు. దీంతో వారు పూర్తి ఆవేదన చెందారు. సామాన్య ప్రజానీకం వస్తే న్యాయం జరగదా? అని ప్రశ్నించారు. సీఐ క్షమాపణ చెప్పాల్సిందేనని ఆయన వాహనాన్ని కూడా అడ్డుకున్నారు. తమకు ఏమైనా జరిగితే సీఐయే బాధ్యత వహించాలని హెచ్చరించారు. ఈ సంఘటన వ్యవహారం కడప డీఎస్పీ షేక్ మాసుంబాషా దృష్టికి వెళ్లింది. వెంటనే కడప నగరంలోని సీఐలు, ఎస్ఐలు తమ సిబ్బందితో వెళ్లి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు విధులను నిర్వర్తించారు. ఈ సందర్బంగా బాధితులు గౌరమ్మ, బంధువులు మాట్లాడుతూ సీఐ రామకృష్ణ తమ పట్ల దురుసుగా వ్యవహరించారని, స్థలం వ్యవహారంలో ఏదైనా తప్పు ఉంటే కోర్టులో తేల్చుకుంటామని, మాట్లాడే విధానం తెలియకుండా దుర్బాషలాడటం ఎంతవరకు సమంజసమని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగే వరకుపోరాటం చేస్తామన్నారు. కడప డీఎస్పీ షేక్ మాసుంబాషా బాధితులతో, సీఐతో వేర్వేరుగా మాట్లాడి పరిస్థితిని సర్దుమనిపించారు. ఈ సంఘటనపై చిన్నచౌకు సీఐ రామకృష్ణను వివరణ కోరగా తాను వృద్ధురాలినిగానీ, మరెవరినీ గానీ దుర్బాషలాడలేదన్నారు. -
పదవీ విరమణకు ఒకరోజు ముందు పదోన్నతి
ఆదిలాబాద్: డీసీఆర్బీ ఎస్సై జి.కిష్టయ్య బుధవారం పదవీ విరమణ పొందుతున్న తరుణంలో ఆయన ఒకరోజు ముందు సీఐగా పదోన్నతి పొందారు. మంగళవారం స్థానిక పోలీసు కార్యాలయంలో కరీంనగర్ డీఐజీ పి.ప్రమోద్‌కుమార్ పదోన్నతి చిహ్నం(స్టార్)ను కిష్టయ్య భుజానికి అలంకరించారు. ఆదిలాబాద్ మండలం చాందా–టి గ్రామానికి చెందిన కిష్టయ్య 1979లో సివిల్ కానిస్టేబుల్‌గా ఎంపికై సుధీర్ఘకాలంపాటు సేవలు అందించారు. 1986లో హెడ్‌కానిస్టేబుల్‌గా, 1996లో ఏఎస్సైగా పదోన్నతి లభించడంతో జన్నారం, ఇంద్రవెల్లి పోలీసుస్టేషన్లలో విధులు నిర్వర్తించారు. 2010 ఎస్సై పరీక్షలో ఉత్తీర్ణత సాధించి అప్పటి నుంచి ఎస్సైగా కొనసాగుతున్నారు. ఎస్సైగానే పదవీ విరమణ పొందుతానని ఆనుకున్న సమయంలో ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ విషయం తెలుసుకొని నేరుగా రాష్ట్ర పోలీసు డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి దృష్టికి తీసుకురావడంతో వెంటనే సీఐగా పదోన్నతులు ఉత్తర్వులు జారీ చేశారు. డీఐజీ చేతుల మీదుగా పదోన్నతి ఉత్తర్వులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ విష్ణు వారియర్‌తోపాటు కుమురం భీం ఎస్పీ సింగెనేవార్ కల్మేశ్వర్, నిర్మల్ అదనపు ఎస్పీ దక్షణమూర్తి, డీసీఆర్బీ సీఐ శ్రీనివాస్, పోలీసు అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ఎస్బీ డీఎస్పీ విశ్వప్రసాద్, సీసీ దుర్గం శ్రీనివాస్ పాల్గొన్నారు. -
మద్యం మత్తులో సీఐ హల్చల్
-
కంచె చేను మేసింది
సాక్షి, గుంటూరు: చట్టంలోని లొసుగులను కొందరు అవినీతి పోలీసు అధికారులు అనుకూలంగా మలుచుకుంటున్నారు. నల్లపాడు పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఓ కేసు ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తుంది. సాక్షాత్తు జిల్లాస్థాయి అధికారి ఇద్దరు వ్యక్తులపై చేసిన ఫిర్యాదును పట్టించుకోకుండా వారిని కేసు నుంచి తప్పించేశారు. లక్షల్లో వారి నుంచి డబ్బులు గుంజినట్లు సమాచారం. ఏడుగురిని నిందితులుగా చేరుస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేసేశారు. బేరం కుదరని ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. మరో నలుగురి నుంచి సుమారు రూ. 2 లక్షలు వసూలు చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చేశారు. ఆరో ముద్దాయిగా ఉన్న వ్యక్తి నుంచి రూ. లక్ష వసూలు టార్గెట్‌గా పెట్టుకుని రూ. 30వేలకు బేరం కుదుర్చుకున్నారు. డబ్బులు తీసుకునే సమయంలో ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. బాధితుడు ఏసీబీ అధికారుల ముందు ఉన్న సమయంలో సైతం డబ్బులు తీసుకు రావాలంటూ కానిస్టేబుల్, సీఐ నుంచి ఫోన్లు రావడం గమనార్హం. అసలు నిందితులను తప్పించి చిన్న, చితకా ప్రమేయం ఉన్నవారిపై కేసు నమోదు చేయడంపై ఏసీబీ అధికారులు పూర్తి విచారణ జరుపుతున్నారు. డబ్బులు తీసుకుంటూ నేరుగా దొరికిన నల్లపాడు సీఐ కుంకా శ్రీనివాసరావు, కానిస్టేబుల్ శేషగిరిరావు (శేషు)లను విజయవాడ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు పరచి రిమాండ్‌కు తరలించారు. బండారం బయట పడింది ఇలా... గుంటూరుకు చెందిన సునీత, వెంకటేష్ దంపతులు చోళమండల్ ఫైనాన్స్‌లో ఓకారును కొనుగోలు చేశారు. అయితే, వారికి డబ్బులు చెల్లించకుండానే డబ్బు మొత్తం చెల్లించినట్లుగా నకిలీ ఎన్ఓసీ పుట్టించి దాని ద్వారా వేరొకరికి విక్రయించేందుకు గుంటూరు రవాణా శాఖ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేశారు. విషయం తెలుసుకున్న చోళమండల్ ఫైనాన్స్ నిర్వాహకులు డీటీసీ రాజారత్నంకు ఫిర్యాదు చేశారు. దీంతో అప్రమత్తమైన రవాణా శాఖ అధికారులు తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో తమను మోసగించేందుకు యత్నించారంటూ సునీత, వెంకటేష్ దంపతులపై 2017 నవంబరులో నల్లపాడు పోలీసులకు డీటీసీ రాజారత్నం స్వయంగా ఫిర్యాదు చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ.. కేసును దర్యాప్తు చేసిన నల్లపాడు సీఐ కుంకా శ్రీనివాసరావు అసలు నిందితులైన సునీత, వెంకటేష్‌లను కేసు నుంచి తప్పించి వారికి సహకరించిన ఏడుగురిపై కేసు నమోదు చేశారని రవాణా శాఖ అధికారులు ఆరోపణ. కేసు నుంచి తప్పించినందుకు వీరి నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించినట్లు తెలిసింది. అంతేకాకుండా కేసు నమోదు చేసిన ఏడుగురిలో షేక్ అహ్మద్ కరీమ్, కె.నాగరాజులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపిన పోలీసులు కరీముల్లా, రబ్బాని, రజని, దరియావలీల నుంచి సుమారు రూ. 2 లక్షలు వసూలు చేసి వారికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపినట్లు ఏసీబీ అధికారుల దర్యాప్తులో తేలినట్లు సమాచారం. తనకు ఫోన్ చేసి స్టేషన్‌కు పిలిపించిన కానిస్టేబుల్ శేషు రూ. లక్ష ఇస్తే స్టేషన్ బెయిల్ ఇస్తామని, లేదంటే జైలుకు పంపుతామంటూ బెదిరించినట్లు కేసులో ఆరో ముద్దాయిగా ఉన్న రాజశేఖర్ చెప్పారు. ఆత్మహత్య చేసుకుంటా నన్నా పట్టించుకోకుండా డబ్బులు డిమాండ్ చేశారని, దీంతో చేసేది లేక రూ. 30వేలకు బేరం కుదుర్చుకున్నానని, కొంత సమయం ఇవ్వాలని కోరినా తీవ్ర ఇబ్బందులకు గురిచేయడంతో తట్టుకోలేక ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు చెప్పారు. రవాణాశాఖ అధికారుల్లో ఆగ్రహం గతంలో కూడా రవాణా శాఖ అధికారులు ఓ నిందితుడ్ని పట్టుకుని నల్లపాడు పోలీసులకు అప్పగించగా, తమ సిబ్బంది పైనే ఎదురు కేసులు పెట్టారని, ప్రస్తుతం తాము ఇచ్చిన ఫిర్యాదులోని నిందితులను వదిలేసి, ఎవరెవరినో కేసులో ఇరికించారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు నిందితులను ఎందుకు వదిలేశారో ? చోళమండల్ ఫైనాన్స్‌లో లోను తీసుకుని కారు కొనుగోలు చేసిన మేడిపల్లి సునీత, వెంకటేష్ దంపతులు వారికి డబ్బు చెల్లించకుండా నకిలీ ఎన్ఓసీ సృష్టించి వేరొకరికి రిజిస్ట్రేషన్ చేసేందుకు మా కార్యాలయంలో దరఖాస్తు చేశారు. దీన్ని గుర్తించిన సిబ్బంది విషయాన్ని నా దృష్టికి తీసుకు రావడంతో రిజిస్ట్రేషన్ నిలిపివేసి వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ నల్లపాడు సీఐ కుంకా శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశాను. అయితే, వీరిద్దరి ప్రమేయం లేదని సీఐ నాతో చెప్పడంతో విస్తుపోయాను. – రాజారత్నం, డీటీసీ లంచం తీసుకుంటూ పట్టుబడిన నల్లపాడు సీఐ శ్రీనివాసరావు, కానిస్టేబుల్ శేషులను విచారిస్తున్న ఏసీబీ డీఎస్పీ దేవానంద్ శాంతో, సీఐ ఫిరోజ్ (ఫైల్) (ఇన్సెట్) ఏసీబీకి ఫిర్యాదు చేసిన రాజశేఖర్ -
పీకలదాకా తాగి.. ఆపై ర్యాష్ డ్రైవింగ్
సాక్షి, కామారెడ్డి : డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేసేది పోలీసులు.. మరి అదే పోలీసు అధికారే ఆ పరీక్షలో పట్టుబడితే.. కామారెడ్డి జిల్లాలో ఇదే జరిగింది.. నిజామాబాద్, కామారెడ్డి మీదుగా హైదరాబాద్ వెళ్లే మార్గంలో సదాశివ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గురువారం రాత్రి మద్యం సేవించి కారు నడిపిన దర్పల్లి సీఐ ధరావత్ కృష్ణ ఒక ట్రాక్టర్‌ను ఢీకొని, తిట్టి మరీ వెళ్ళిపోయాడు. స్థానికులు వెంటనే డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. హైదరాబాద్ ఉన్నతాధికారుల ఆదేశాలతో సదాశివనగర్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి కారును పట్టుకున్నారు. అందులో ఉన్నది దర్పల్లి సీఐ ధరావత్ కృష్ణ అని తెలియగానే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వారి ఆదేశాలతో డ్రంకన్ డ్రైవ్ పరీక్షలు చేసి కేసు నమోదు చేశారు. సదరు సీఐపై శాఖాపరమైన చర్యల్లో భాగంగా నిజామాబాద్ సీపీ కార్తికేయ విచారణ జరిపారు. నివేదికను పై అధికారులకు పంపి వెంటనే సీఐ బదిలీ వేటు వేశారు. దర్పల్లి నుంచి నిజామాబాద్ ఎర్‌హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ సీపీ కార్తికేయ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే మద్యం మత్తులో వీరంగం సృష్టించింది ఒక సీఐ అని తెలియడంతో ఈ సంఘటన ప్రజల్లో చర్చనీయాంశం అయ్యింది. బదిలీ వేటు చర్యలు తీసుకోవడంతో పోలీసు శాఖ తీరుపై ప్రజలు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. -
ఏసీబీ వలలో సీఐ, కానిస్టేబుల్
లక్ష్మీపురం(గుంటూరు): నగర శివారులో ఉన్న నల్లపాడు పోలీస్‌స్టేషన్‌లో సీఐ కె.శ్రీనివాసరావు, కానిస్టేబుల్ శేషులు రూ.30 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడిన ఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఏసీబీ డీఎస్పీ కె.శాంతో తెలిపిన వివరాల ప్రకారం.. సునీత, వెంకటేష్ దంపతులు నకిలీ స్టాంపులు తయారు చేస్తున్నారని, చోలమండల్ ఫైనాన్స్ ఎన్ఓసీలు ఇస్తున్నారని 2017 నవంబరు తొమ్మిదిన జిల్లా రవాణా శాఖ అధికారి రాజారత్నం నల్లపాడు పోలీసు స్టేషన్లో సీఐకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో సీఐ అసలు నిందితులపై ఎలాంటి చర్యలూ తీసుకోకుండా కేసుకు సంబంధం లేని నరసరావుపేటకు చెందిన షేక్ ఎం.డి.కలీం, నాగరాజు, కరీముల్లా, రబ్బాని, పెన్నింటి రజిని, కసుకుర్తి రాజశేఖర్లపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో నరసరావుపేట ప్రాంతానికి చెందిన నిఖిల్ ప్రింటర్స్ యజమాని కసుకుర్తి రాజశేఖర్ అనే వ్యక్తిని కూడా కేసులో పెట్టారు. కసుకుర్తి రాజశేఖర్ చోరమండల్ ఫైనాన్స్‌కు సంబంధించిన నకిలీ స్టాంపులు తయారు చేసినట్లు దర్యాప్తులో తేలిందని నల్లపాడు పోలీసు స్టేషన్ నుంచి శేషు అనే కానిస్టేబుల్ ఫోన్ చేసి సమాచారం తెలిపాడు. ఆ సమయంలో వైజాగ్‌లో ఉన్న కసుకుర్తి రాజశేఖర్ ఈ నెల 9వ తేదీన నల్లపాడు స్టేషన్‌కు వచ్చి ఈ కేసుకు, తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొనేందుకు ప్రయత్నం చేసినా సీఐ కె.శ్రీనివాసరావు పట్టించుకోలేదు. నకిలీ స్టాంపులు తయారు చేసిన కేసులో ముద్దాయి ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేస్తున్నామని, ఈ కేసు నుంచి బయటపడాలంటే రూ.లక్ష ఇవ్వాలని సీఐ శ్రీనివాసరావు అతన్ని డిమాండ్ చేశాడు. దీంతో తనకు కేసుతో సంబంధం లేదని, కొంత సమయం ఇవ్వాలని రాజశేఖర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇదే నెల 15న షేక్ అహ్మద్ కరీం అనే వ్యక్తిని నల్లపాడు పోలీసులు జీపులో ఎక్కించుకుని నరసరావుపేటలోని కసుకుర్తి రాజశేఖర్ వద్దకు వెళ్లారు. అతని ప్రింటింగ్ షాపులో ఉన్న ప్రింటింగ్ మిషనరీ, సామగ్రిని సీజ్ చేసి నోటీసు ఇచ్చి వెళ్లారు. మరుసటి రోజు రాజశేఖర్‌కు కానిస్టేబుల్ శేషు ఫోన్ చేసి రూ.లక్ష ఇవ్వని పక్షంలో నిందితుడిలా జైలుకు వెళ్లాల్సి వస్తుందని బెదిరించాడు. మరలా రాజశేఖర్ స్టేషన్‌కు వెళ్లి సీఐని బతిమాలుకోగా రూ.30 వేలకు బేరం కుదిర్చారు. ఈ క్రమంలో దిక్కుతోచని స్థితిలో రాజశేఖర్ ఈ నెల 21న ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. జరిగిన సంఘటనపై అధికారులకు తెలిపాడు. దీంతో గురువారం ఏసీబీ డీఎస్పీ శాంతో, సీఐ సురేష్, నల్లపాడు సీఐ శ్రీనివాసరావు, కానిస్టేబుల్ శేషు రూ.30 వేలు తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసుపై దర్యాప్తు చేస్తున్నామని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సీఐ శ్రీనివాసరావు నివాసంపై తనిఖీలు నిర్వహిస్తామని అధికారులు చెప్పారు. ఫిర్యాది ఆవేదన నకిలీ స్టాంపులు తయారు చేశాడంటూ తనపై లేనిపోని ఆరోపణలు చేసి ఇబ్బంది పెట్టారని బాధితుడు కసుకుర్తి రాజశేఖర్ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశాడు. సీఐ శ్రీనివాసరావు రూ.లక్ష ఇస్తే గానీ కేసులో నుంచి తీసేస్తామని బెదిరించారని, చోరమండల్ స్టాంప్‌లు లాంటి నకిలీ స్టాంపులు తయారు చేసిన దాఖలాలు లేవని కన్నీంటి పర్యంతమయ్యాడు. అసలు నిందితులు ఎవరనేది కూడా తెలియకుండా కేసులు నమోదు చేయడం సరైంది కాదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఏసీబీ అధికారులకు కానిస్టేబుల్ శేషు ఫోన్లో మాట్లాడిన సంభాషణ రికార్డింగ్ కూడా వినిపించాడు. ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసిన ఈ నెల 21న, గురువారం ఉదయం కూడా కానిస్టేబుల్ శేషు రూ.30 వేలు తీసుకురావాలని, లేని పక్షంలో జైలు పాలవుతావని బెదిరించాడు. అమాయకుడైన తనపై తప్పుడు కేసు నమోదు చేసిన సీఐ, కానిస్టేబుల్‌పై అధికారులు చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరాడు. -
హైదరాబాద్ సీఐ .. ఏపీలో కేసు
సాక్షి, జగ్గయ్యపేట : తెలంగాణకు చెందిన సీఐ ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలో వివాదంలో చిక్కుకున్నాడు. జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి గ్రామానికి చెందిన పుష్పన్ కుమార్ హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో సీఐగా పనిచేస్తున్నాడు. ఈయనకు విజయతో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వ్యక్తిగత కారణాలతో గత మూడేళ్లుగా భార్య, భర్తలు దూరంగా ఉంటున్నారు. ఇద్దరు విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకొని కోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి వీరు విడిగానే ఉంటున్నారు. అయితే కేసు కోర్టులో ఉండగానే పుష్పన్ కుమార్ మరో వివాహం చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న మొదటి భార్య విజయ, కుటుంబ సభ్యులతో కలిసి సీఐ ఇంటి ముందు ధర్నాకు దిగింది. తనకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేసింది. ఆగ్రహించిన పుష్పన్ కుమార్, అతని కుటుంబ సభ్యులు, విజయ ఆమె కుటుంబ సభ్యులపై దాడి చేశారు. దీంతో విజయ చిల్లకల్లు పోలీసులను ఆశ్రయించింది. తనకు అన్యాయం చేసి మరో పెళ్లి చేసుకొన్న పుష్పన్‌ను అడగటానికి వెళ్తే తనతోపాటు కుటుంబ సభ్యులపై దాడులకు పాల్పడ్డారని ఆరోపించింది. విడాకుల కేసు కోర్టు పరిధిలో ఉందని, విచారణ పూర్తి కాకుండానే రెండో పెళ్లి చేసుకున్నారంటూ విజయ పుష్పన్ కుమార్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
భారీగా గుట్కాల స్వాధీనం
రామాయంపేట(మెదక్): పట్టణంలోని ఒక కిరాణ దుకాణంపై దాడిచేసిన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రూ. లక్షలు విలువ చేసే నిషేధిత గుట్కా, జర్దా ప్యాకెట్లను పెద్ద మొత్తంలో స్వాధీనపర్చుకున్నారు. తను సిబ్బందితో కలిసి ఎనిశెట్టి రాములు కిరాణా దుకాణంలో తనిఖీలు నిర్వహించామని విజిలెన్స్ సీఐ బాల్‌రెడ్డి చెప్పారు. సదరు వ్యాపారి దుకాణం వెనుకభాగంలో ఉన్న గోదాంలో దాచి ఉంచిన నిషేధిత గుట్కా, జర్ధా, సాగర్, షైనీ గుట్కా ప్యాకెట్లను పెద్ద మొత్తంలో స్వాధీనపర్చుకుని గోదాంకు సీల్‌వేసి వెళ్లిపోయామన్నారు. శుక్రవారం జిల్లా ఫుడ్ సేప్టీ అధికారి రవీందర్రావు, మరో అధికారి విద్యాకర్‌రెడ్డి, తాను గోదాంను తెరిచి తనిఖీ చేసి 30 బ్యాగుల్లో దాచి ఉంచిన ప్యాకెట్లను స్వాధీనపర్చుకున్నామన్నారు. ఈమేరకు పంచనామా నిర్వహించి దుకాణం యజమాని సంతోష్‌పై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. -
రిలాక్స్ అయ్యేందుకే.. రిసార్ట్‌కు వెళ్లా: సీఐ
సాక్షి, నల్లగొండ: నిన్నటి నుంచి కనిపించకుండాపోయిన నల్లగొండ టూ టౌన్ సీఐ వెంకటేశ్వర్లు ఎట్టకేలకు మళ్లీ విధుల్లో చేరారు. శనివారం సాయంత్రం ఆయన తిరిగి ఉద్యోగంలో చేశారు. నల్లగొండలో సంచలనం రేపిన రెండు హత్యకేసులను విచారిస్తున్న సీఐ వెంకటేశ్వర్లు శుక్రవారం ఉదయం నుంచి అకస్మాత్తుగా కనిపించకుండాపోవడం పలు ఊహాగానాలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సీఐ కావాలనే అజ్ఞాతంలోకి వెళ్లినట్టు కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం గుంటూరులోని బాపట్లలో ఓ రిసార్ట్‌లో ఆయన ఆచూకీని పోలీసులు కనిపెట్టారు. అయితే, పని ఒత్తిడి వల్లే రిలాక్స్ అయ్యేందుకు తాను గుంటూరు వెళ్లానని సీఐ వెంకటేశ్వర్లు మీడియాతో తెలిపారు. వెళ్లే సమయంలో తన సిమ్ కార్డును, ఆయుధాన్ని డిపార్ట్మెంట్కు అప్పజెప్పానని తెలిపారు. కాంగ్రెస్ నేత బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసుకు సంబంధించిన ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేశానని, గత పది రోజులుగా తీవ్ర పని ఒత్తిడి ఉండటంతో రెస్ట్ తీసుకోవడానికి రిసార్ట్‌కు వెళ్ళానని, తరచూ తాను అక్కడికి వెళ్తూనే ఉంటానని సీఐ వెంకటేశ్వర్లు చెప్పారు. నల్లగొండలో ఇటీవల సంచలనం రేపిన కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరుడు బొడ్డుపల్లి శ్రీనివాస్, పాలకూరి రమేశ్ హత్యకేసులకు సీఐ వెంకటేశ్వర్లు విచారణాధికారిగా ఉన్నారు. -
రిలాక్స్ అయ్యేందుకే.. రిసార్ట్‌కు వెళ్లా: సీఐ
-
సీఐ వెంకటేశ్వర్లును ట్రేస్ చేశాం
-
సీఐ వెంకటేశ్వర్లును ట్రేస్ చేశాం: ఐజీ
సాక్షి, నల్లగొండ : రెండు రోజులుగా కనిపించకుండాపోయిన నల్లగొండ టూటౌన్ సీఐ వెంకటేశ్వర్లు జాడను కనిపెట్టామని ఐజీ స్టీఫెన్ రవీంద్ర చెప్పారు. సర్వీస్ రివాల్వర్, సిమ్‌కార్డులను తిరిగిచ్చేసి అదృశ్యమైన సీఐ.. గుంటూరు జిల్లా బాపట్లలోని ఓ రిసార్ట్స్‌లో మారుపేరుతో ఉన్నట్లు గుర్తించామని, ఇవాళే నల్లగొండ హెడ్ క్వార్టర్స్‌కు తీసుకొస్తామని తెలిపారు. గాలింపు కోసం ఏర్పాటైన ప్రత్యేక పోలీసు బృందం ఇప్పటికే ఇప్పటికే అతనిని కలుసుకున్నట్లు తెలిసింది. అటు వెంకటేశ్వర్లు కుటుంబం కూడా నల్లగొండకు బయలుదేరినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మున్సిపల్ చైర్పర్సన్ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసులో సీఐ వెంకటేశ్వర్లు విచారణాధికారిగా ఉండటంతో అదృశ్యం ఘటన రాజకీయంగానూ ప్రాధాన్యం సంతరించుకుంది. మరో కేసు(పాలకూరి రమేశ్ హత్య)కు సంబంధించి నిందితులను శుక్రవారం కోర్టులో హాజరుపరిచిన అనంతరం సీఐ వెంకటేశ్వర్లు కనిపించకుండా పోయారు. సర్వీస్ రివాల్వర్‌ను డ్రైవర్‌కు, మాడ్గులపల్లి పోలీస్‌స్టేషన్‌లో సిమ్‌కార్డును అప్పగించి వెళ్లిపోయారు. వ్యక్తిగత ఫోన్‌కూడా స్విచ్చాఫ్ చేసుకున్నారు. నల్లగొండ పట్టణంలో వరుస హత్యలపై సీఐని ఉన్నతాధికారులు మందలించినట్టు తెలిసింది. సీఐ తన సన్నిహితుల వద్ద ఇదే విషయాన్ని వెల్లడించి తీవ్ర మనోవేదనకు గురైనట్టు సమాచారం. శ్రీనివాస్ హత్య కేసులో కొందరు నిందితులకు బెయిల్ రావడంతో ఉన్నతాధికారులు సీఐపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. మొత్తానికి సీఐ ఆచూకీ లభించడంతో కుటుంబీకులు, పోలీసు శాఖ ఊపిరి పీల్చుకున్నట్లైంది. -
సంచలన కేసు.. నల్లగొండ సీఐ అదృశ్యం
నల్లగొండ క్రైం: సంచలనం సృష్టించిన మున్సిపల్ చైర్పర్సన్ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసు విచారణాధికారి, నల్లగొండ టూటౌన్ సీఐ వెంకటేశ్వర్లు అదృశ్యమవ్వడం కలకలం సృష్టించింది. పాలకూరి రమేశ్ హత్య కేసు నిందితులను శుక్రవారం కోర్టులో హాజరుపరిచిన అనంతరం సీఐ వెంకటేశ్వర్లు కనిపించకుండా పోయారు. ఈయన మున్సిపల్ చైర్పర్సన్ భర్త హత్య కేసు విచారణ అధికారి కావడంతో రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. శ్రీనివాస్, పాలకూరి రమేశ్ హత్యలతో సీఐపై పనిభారం పెరిగిపోయింది. శాంతిభద్రతల పరిరక్షణలో అలసత్వం ప్రదర్శించారని ఉన్నతాధికారులు మందలించినట్టు తెలిసింది. అయితే సీఐ తన సన్నిహితుల వద్ద ఇదే విషయాన్ని వెల్లడించి తీవ్ర మనోవేదనకు గురైనట్టు సమాచారం. శ్రీనివాస్ హత్య కేసులో కొందరు నిందితులకు బెయిల్ రావడంతో ఉన్నతాధికారులు సీఐపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. మాడ్గులపల్లి పీఎస్‌లో సిమ్ కార్డు ఇచ్చి... మానసిక ఒత్తిడిలో ఉన్న సీఐ తన వద్దనున్న ఆయుధాన్ని డ్రైవర్‌కు, మాడ్గులపల్లి పోలీస్‌స్టేషన్‌లో సిమ్‌కార్డును అప్పగించి వెళ్లిపోయారని తెలిసింది. ఉదయం ఓ సీఐ ఫోన్ చేసినా సీఐ వెంకటేశ్వర్లు రిసీవ్ చేసుకోలేదని సమాచారం. ఇదే విషయాన్ని ఉన్నతాధికారులకు తెలపడంతో సీఐ అదృశ్యమయ్యాడనే వార్త పట్టణంలో దావానలంలా వ్యాపించింది. సీఐ వ్యక్తిగత ఫోన్‌కూడా స్విచ్చాఫ్ చేసుకోవడం అనుమానాలకు తావిస్తోంది. 30 రోజులు సెలవు కావాలని.. తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్న సీఐ వెంకటేశ్వర్లు.. తనకు నెల రోజులు సెలవు కావాలని డీఎస్పీకి విన్నవించారు. అయితే ప్రస్తుతం సెలవులు ఇవ్వలేమని, మరో వారం తర్వాత పరిశీలిస్తామని ఉన్నతాధికారులు తెలిపినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే సీఐ మనస్తాపం చెంది చెప్పాపెట్టకుండా వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. సంచలన హత్య కేసుల విచారణాధికారి అదృశ్యం కావడంతో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, సీఐ క్షేమంగా ఉన్నట్లు బంధువులు జిల్లా ఎస్పీని కలసి చెప్పినట్లు తెలిసింది. -
మద్యం మత్తులో బీభత్సం సృష్టించిన సీఐ
మేడ్చల్ జిల్లా : జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యాప్రాల్‌లో అంబర్ పేట్ ట్రైనింగ్ సీఐ గిరీష్ రావు బీభత్సం సృష్టించాడు. మద్యం మత్తులో తన ఇన్నోవా కారు(ఏపీ 10ఎస్ 6678)తో దారిన పోతున్న పాదచారులను ఢీకొన్నాడు. ఈ ఘటనలో బిక్షపతి, సత్య లక్ష్మీ అనే ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని అత్యవసర చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మరో నలుగురు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు.. సీఐ గిరిష్ రావుపై సెక్షన్-337,338,185 మోటారు వెహికల్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. కారును స్వాధీనం చేసుకుని సీఐని రిమాండుకు తరలించారు. కేసు నమోదు చేసి పూర్తి స్థాయి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. మద్యం మత్తులో కారు నడిపి జనాలను గాయపరించినందుకు గానూ సీఐ గిరీష్ రావును సస్పెండ్ చేసినట్లు రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. -
తణుకు హైవేపై వాష్ అండ్ గో
తణుకు: వాహన డ్రైవర్లకు తగిన విశ్రాంతి లేకపోవడంతోనే ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని తణుకు సర్కిల్ ఇన్స్పెక్టర్ కె.ఎ.స్వామి పేర్కొన్నారు. బుధవారం రాత్రి తణుకు పట్టణ పరిధిలోని పదహారో నెంబరు జాతీయ రహదారిపై వాష్ అండ్ గో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాల డ్రైవర్లకు నిద్ర మత్తు లేకుండా ముఖం కడుక్కుని టీ తాగి కాసేపు విశ్రాంతి తీసుకుని వెళ్లేలా వారిలో అవగాహన కల్పించారు. ఉండ్రాజవరం జంక్షన్‌తో పాటు శర్మిష్ట సెంటర్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్సై డి.ఆదినారాయణ, ట్రాఫిక్ ఎస్సై ఎం.బాల, సిబ్బంది పాల్గొన్నారు. -
మెసేజ్‌లో పెళ్లి ప్రపోజల్..
సాక్షి, హైదరాబాద్: వివాహేతర సంబంధం కేసులో అవినీతి నిరోధక శాఖ అదనపు ఎస్పీ సునీతారెడ్డి, కల్వకుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ మంగళ వారం ఆదేశాలు వెలువడ్డాయి. సీఐ మల్లికార్జున్ రెడ్డిని వెస్ట్‌జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర సస్పెండ్ చేయగా, ఏఎస్పీ సునీతారెడ్డిని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు వెలువరించారని పోలీస్ శాఖ తెలిపింది. వీరిద్దరి వ్యవహారంపై సునీతారెడ్డి భర్త సురేందర్‌రెడ్డి మంగళవారం డీజీపీని కలసి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరినట్టు ఆయన తెలిపారు. విచారణ ముమ్మరం చేసిన పోలీసులు మరోవైపు ఇరువురి అక్రమ సంబంధం విషయంలో కేపీహెచ్‌బీ పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. దీనిలో భాగంగా ఏఎస్పీ భర్త సురేందర్‌రెడ్డి, తల్లి ప్రమీలమ్మ, పెద్దమ్మ సునంద, సురేందర్‌రెడ్డి స్నేహితుడు సురేష్ కుమార్‌లను పోలీసులు విచారించి ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఘటన వివరాలు నమోదు చేసుకున్నారు. సీసీ టీవీ ఫుటేజిలు, ఇరువురి ఫోన్ కాల్ డేటాను పోలీసులు సేకరిస్తున్నారు. మల్లికార్జున్‌రెడ్డి తమ కుటుంబంలో నిప్పులు పోశాడని, ఏవేవో ఆశలు చూపి పచ్చని కాపురంలో చిచ్చుపెట్టాడని ఏఎస్పీ తల్లి, పెద్దమ్మలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇరువురి కుటుంబాలు రోడ్డున పడొద్దని తాము ఎంతగానో ఓపికపట్టి వివాదం లేకుండా సర్దిచెప్పినా వినిపించుకోలేదని పోలీసులకు తెలిపారు. నా కుటుంబాన్ని నాశనం చేయవద్దని అభ్యర్థించినా సీఐ తీరు మార్చుకోకపోగా తమనే చంపుతానంటూ హెచ్చరించడంతో బట్టబయలు చేయాల్సి వచ్చిందని భర్త సురేందర్‌రెడ్డి పేర్కొన్నారు. 2016లోనే దొరికినా తీరు మారలేదు ఏఎస్పీకి, సీఐకి నడుమ సాగుతున్న అక్రమ సంబంధం విషయాన్ని 2016 జూలైలోనే భర్త సురేందర్‌రెడ్డి, కుటుంబసభ్యులు కనిపెట్టి వారిని ప్రశ్నించారు. తమ మధ్య ఎలాంటి సంబంధాల్లేవని బుకాయించడంతో పాటు అనుమానించవద్దని ఇరువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. భర్తతో పాటు కుటుంబసభ్యులు గట్టిగా నిలదీయడంతో మరోమారు ఇలా జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చి ఇరువురు క్షమాపణ చెప్పారు. ఇకపై ఎలాంటి సంబంధాలను కలిగి ఉండనని చెప్పడంతో భార్య మాటలను నమ్మిన సురేందర్‌రెడ్డి కాపురం సాగించాడు. ఇటువంటి చర్యలను ఉపేక్షించబోం: నాయిని పోలీసు శాఖ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించిన ఏఎస్పీ, సీఐలపై చర్యలు తీసుకున్నామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. భవిష్యత్తులో పోలీస్ శాఖలో ఇటువంటి చర్యలకు పాల్పడితే ఎంతటి స్థాయి అధికారులనైనా ఉపేక్షించ బోమని ఆయన స్పష్టం చేశారు. మెసేజ్‌లో పెళ్లి ప్రపోజల్.. కొన్ని రోజుల తర్వాత మల్లికార్జున్‌రెడ్డి నుంచి సునీత ఫోన్‌కు మెసేజ్‌లు రావడం, తనకంటే ఉన్నతస్థాయిలో ఉన్న అధికారిణి పట్ల గౌరవం లేకుండా ఏక వాక్యంగా మెసేజ్‌లు పంపడం చూసిన సురేందర్‌రెడ్డికి అనుమానం మొదలైంది. మల్లికార్జున్‌రెడ్డి ఏఎస్పీ సెల్‌కు పంపిన మెసేజ్‌లో వివాహం చేసుకుందామని ప్రతిపాదించడం చూసిన ఆయన ఇరువురు అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్నారని నిర్ధారణకు వచ్చాడు. ఈ క్రమంలో మల్లికార్జున్‌రెడ్డి తనను చంపేస్తానని బెదిరించడంతో మనోవేదనకు గురైన ఆయన భార్య తరఫు కుటుంబీకుల మద్దతు తీసుకుని ఇరువురి బండారం బట్టబయలు చేయాలని నిర్ణయించు కున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆదివారం అర్ధరాత్రి ఇరువురు తన నివాసానికి 11.30 సమయంలో వచ్చి సుమారు రెండున్నర గంటల పాటు కలసి ఉన్న విషయాన్ని బట్టబయలు చేశాడు. -
మహిళా ఏఎస్పీ, ఇన్స్పెక్టర్ మధ్య వివాహేతర సంబంధం
సాక్షి,సిటీబ్యూరో: రాష్ట్ర అవినీతి నిరోధక శాఖలో (ఏసీబీ) ఏఎస్పీగా పని చేస్తున్న ఓ మహిళా అధికారి, కల్వకుర్తి సీఐగా పని చేస్తున్న మల్లికార్జున్‌రెడ్డి మధ్య కొన్నాళ్ళుగా సాగుతున్న వివాహేతర సంబంధం ఆదివారం అర్ధరాత్రి బట్టబయలైంది. ఏఎస్పీ భర్త, అతని బంధువులు ఇన్స్పెక్టర్ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అధికారిణి భర్త సురేందర్‌రెడ్డి ఫిర్యా దు మేరకు ఇన్స్పెక్టర్పై కేపీహెచ్‌బీ ఠాణాలో సోమ వారం కేసు నమోదైంది.వివరాల్లోకి వెళితే.. మల్లికార్జున్‌రెడ్డి సైతం గతంలో ఏసీబీలో పని చేశారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన, ‘ఓటుకు కోట్లు’ కేసును దర్యాప్తు చేసిన బృందంలో అప్పట్లో డీఎస్పీ çహోదాలో ఉన్న మహిళా అధికారిణి తో అతను కలిసి పనిచేశాడు. అలా వీరి మధ్య ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం అమెరికాలో ఉంటున్న సదరు అధికారిణి భర్తకు తెలియడంతో అతను, ఆయన కుటుంబీకులు ఏడాది క్రితం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు ఇరువురినీ మందలించడంతో పాటు మల్లికార్జున్‌రెడ్డిని ఏసీబీ నుంచి తప్పిస్తూ.. పోలీసు విభాగానికి పంపారు. ప్రస్తుతం అతడు కల్వకుర్తి సీఐగా పని చేస్తున్నారు. అయితే కొన్నాళ్ళుగా మళ్లీ మహిళా అధికారి, మల్లిఖార్జున్ రెడ్డి తమ పరిచయం కొనసాగిస్తున్నారు. అతను తరచూ కేపీహెచ్‌బీ ఏడో ఫేజ్‌లోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న అధికారిణి ఇంటికి రాకపోకల సాగిస్తున్నాడు. ఎక్కువగా రాత్రి వేళల్లో ఈ వ్యవహారం సాగుతుండటాన్ని గుర్తించిన సురేందర్‌రెడ్డి కుటుంబీకులు విషయాన్ని అమెరికాలో ఉన్న అతడికి సమాచారం అందించారు. రెండు రోజుల క్రితం రహస్యంగా అమెరికా నుంచి వచ్చిన సురేందర్‌రెడ్డి భార్య వ్యవహారం బట్టబయలు చేసేందుకు కాపుకాశాడు. ఆదివారం రాత్రి 10 గంటల తర్వాత మల్లికార్జున్‌రెడ్డి సదరు అధికారిణి ఇంటికి వచ్చినట్లు గుర్తించిన ఆయన తన తల్లి, బంధువులతో కలిసి అతడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సురేందర్‌రెడ్డి బంధువులు మల్లికార్జున్‌రెడ్డిని చెప్పుతో కొడుతూ అక్కడి నుంచి తరిమారు. ఈ నేపథ్యంలో మల్లికార్జున్‌రెడ్డి వారిని తీవ్రస్థాయిలో బెదిరించాడు. ఈ మొత్తం వ్యవహారం మీడియా కెమెరాలకు చిక్కింది. తన భార్యను మల్లిఖార్జున్ రెడ్డి ట్రాప్ చేశాడని, దాదాపు రెండేళ్లుగా వారిద్దరి మధ్య సంబంధం కొనసాగుతుందని సురేందర్‌రెడ్డి ఆరోపించాడు. తన భార్య వ్యవహారం బయట పెట్టాలనే ఉద్దేశంతోనే రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు తెలిపాడు. సోమవారం మీడియా ద్వారా విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు ఏఎస్పీ, సీఐల వ్యవహారశైలిని తీవ్రంగా పరిగణిస్తున్నారు. శాఖాపరమైన విచారణ అనంతరం వీరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఏఎస్పీతో తనకు ఐదేళ్లుగా పరిచయం ఉందని చెప్పిన మల్లికార్జున్‌రెడ్డి... ఆమె విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారని, మంజూరైన తర్వాత వివాహం చేసుకోనున్నామని మీడియాతో పేర్కొన్నాడు ఆదివారం రాత్రి ఆమెను దించేందుకే వారింటికి వెళ్ళానని చెబుతుండగా, ఈ వాదనను సురేందర్‌రెడ్డి ఖండిస్తున్నాడు. సోమవారం మాదాపూర్ డీసీపీ విశ్వప్రసాద్‌ను కలిసి తన ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించిన మల్లికార్జున్‌రెడ్డిపై ఫిర్యాదు చేశారు.పోలీసులు మల్లికార్జున్‌రెడ్డిపై ఐపీసీలోని 447, 497, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి నాగర్‌కర్నూల్ ఎస్పీతో పాటు ఉన్నతాధికారులకు నివేదిక పంపనున్నారు. -
నిజాయితీ చాటుకున్న ఆటోవాలా
ఎస్ఆర్నగర్(హైదరాబాద్): నిజాయితీ కరవైన ఈ రోజుల్లో ఓ ఆటోవాలా తన నిజాయితీని చాటుకున్నాడు. తాను నడుపుతున్న ఆటోలో ప్రయాణించిన వారి బంగారు ఆభరణాలు ఆటోలో జారిపోయాయి. ఇది గమనించని వారు ఆటో దిగి వెళ్లిపోయారు. తర్వాత వాటిని గమనించిన ఆటో డ్రైవర్ మీర్జా మహమూద్ ఆరున్నర తులాల బరువున్న ఆ ఆభరణాలను ఎస్ఆర్ నగర్ పోలీసులకు అప్పగించాడు. నిజాయితీ ప్రదర్శించిన ఆటో డ్రైవర్‌ను పోలీసులు అభినందించారు. సీఐ వహిదుద్దీన్ ఆయన్నుసన్మానించారు. -
మరవనేనిని మరిచిపోరు!
వృత్తి పట్ల నిబద్ధత.. కేసులు ఛేదించడంలో ముందంజ.. చురుకుదనంతో నెరగాళ్ల వెన్నులో వణుకు పుట్టించడంలో తనకు తానే సాటి.. సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో మేటి.. కనిగిరి సీఐ మరవనేని సుబ్బారావు. క్లిష్టమైన కేసులను సైతం సవాల్‌కు స్వీకరించి నిందితులను కటకటాల వెనక్కి నెడుతూ డీజీపీ వంటి ఉన్నత స్థాయి పోలీసు అధికారి నుంచి ఆయన శెభాష్ అనిపించుకుంటున్నారు. కనిగిరి: సీఐ మరవనేని సుబ్బారావు విధి నిర్వహణలో అటు ఉన్నతాధికారుల నుంచే కాకుండా ప్రజల నుంచి కూడా మంచి పేరు తెచ్చుకుంటున్నారు. 2004లో గుంటూరు జిల్లా మంగళగిరి ఎస్ఐగా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన సుబ్బారావు మంచి పోలీసు అధికారిగా గుర్తింపు పొందారు. పదోన్నతి తర్వాత 2013లో సీఐడీ సీఐగా నెల్లూరులో పనిచేశారు. సీఐగా పిడుగురాళ్లలో రెండేళ్లు పనిచేశారు. గురుజాలలో ఎస్ఐగా పనిచేసినప్పుడు ఫ్యాక్షన్‌పై ఉక్కుపాదం మోపి మంచి పేరు గడించారు. ప్రసుత్తం 12 నెలల నుంచి కనిగిరి సీఐగా విధులు నిర్వహిస్తున్నారు. చిరిగిన టికెట్ ముక్కే ఆధారం 2017 ఫిబ్రవరిలో హెచ్‌ఎంపాడు మండలం వేములపాడు ఘాట్ వద్ద కారు దహనమైంది. పక్కనే ఓ మహిళ మృతదేహం ఉండటం అప్పట్లో సంచలనం రేపింది. కారు దహనం సమాచారంతో అక్కడికి వెళ్లిన పోలీసులకు సాయంత్రానికి అక్కడికి 100 మీటర్ల దూరంలో మహిళ దారుణ హత్యకు గురైనట్లు గుర్తించారు. మహిళను పెట్రోల్ పోసి దారుణంగా శరీరం మొత్తం కాల్చేశారు. కేవలం పాదాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. మొదట్లో ఆ రెండు ఘటనలు ఒకే నేరానికి సంబంధించినవిగా భావించారు. కేసు దర్యాప్తునకు రంగంలోకి దిగిన సీఐ సుబ్బారావు.. సంఘటన స్థలంలో దూరంగా పడి ఉన్న చిరిగిన బస్సు టికెట్ ముక్కను గుర్తించారు. దాని ఆధారంగా కేసు దర్యాప్తు ప్రారంభించి రెండు వేర్వేరు ఘటనలుగా నిర్ధారించారు. వారం రోజుల్లో రెండు కేసులనూ చేధించారు. వివాహేతర సంబంధ నేపథ్యంలో గుంటూరుకు చెందిన మహిళను నిందితుడు వేములపాడు ఘాట్ వద్దకు తీసుకొచ్చి పెట్రోలు పోసి కాల్చి దారుణంగా హత్య చేసినట్లు తేల్చారు. నిందితుడికి సైతం సంకెళ్లు వేశారు. దహనమై ఉన్న కారు దొంగతనం చేసి తీసుకొచ్చిందిగా గుర్తించారు. ఆ కేసులో నిందితులను పట్టుకుని ఉప్పగుండూరు, గన్నవరం, విజయవాడ ప్రాంతాల నుంచి సుమారు రూ.6 లక్షల విలువైన మూడు కార్లను రికవరీ చేశారు. ఈ కేసులో రాష్ట్ర స్థాయిలో పోలీసు శాఖ ఇచ్చే ఏబీసీడీ అవార్డుల్లో ఆయన నాలుగో స్థానంలో గుర్తింపు పొందారు. కేసును ఛాలెంజ్‌గా తీసుకోవడం ఆయన ప్రత్యేకం సంక్లిష్టమైన కేసును ఆయన ఛాలెంజ్‌గా తీసుకుంటారు. పీసీపల్లి మండలం ఇర్లపాడులో చిన్నారి సియోని (5) లైంగికదాడి, హత్య కేసును సీఐ సుబ్బారావు అత్యంత ఛాలెంజ్‌గా తీసుకుని ఛేదించారు. నిందితుడికి కనీసం అధార్‌కార్డు, రేషన్ కార్డులేదు. ఫోన్ సైతం ఉపయోగించడు. నిందితుడు పేరయ్య చిన్నారిని కిడ్నాప్ చేసిన రోజు (జూన్ 20)న తొలుత చిన్నారి సియోని తండ్రితో జరిపిన సంభాషణ విషయాలు, ఆనవాళ్ల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. సుమారు 40 రోజులు ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో జల్లెడపట్టి కేసును ఒక కొలిక్కి తెచ్చారు. ఆగస్టు 29న గుంటూరు జిల్లా పొన్నూరులో నిందితుడిని సీఐ బృందం పట్టుకుంది. ఈ కేసులో ఎస్పీ నుంచి ప్రశంసలు అందుకున్నారు. పోలీస్ శాఖ అందించే స్మార్ట్ కాప్ అవార్డును సైతం ఎస్పీ చేతుల మీదుగా తీసుకున్నారు. పోలీస్ శాఖ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2017 ఏబీసీడీ అవార్డుకు (జూన్, జూలై, అగస్టు)కు సీఐ సుబ్బారావును ఎంపిక చేశారు. ఈ మేరకు గతేడాది డిసెంబర్ 13న విజయవాడలో అప్పటి డీజీపీ నండూరి సాంబశివరావు చేతులమీదుగా ఏబీసీడీ (అవార్డ్ ఆఫ్ బెస్ట్ క్రైం డిటెక్షన్) అవార్డును సీఐ అందుకున్నారు. అంతేనా.. రాష్ట్రంలోనే సంచలనం రేపిన రాజమండ్రిలో మసీద్ మౌజన్ హత్య కేసును సీఐ రెండు రోజుల్లో ఛేదించారు. కనిగిరి సీఐతో కూడిన బృందం దర్యాప్తు చేపట్టి నిందితుడు సంఘటన స్థలంలో వదిలిన రాజఖైనీపై గల వేలిముద్రల ఆధారంగా.. సాంకేతికతను వినియోగించుకున్నారు. డిసెంబర్ 30న దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో సాంకేతికతతో పాటు ఇటీవల రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగిన చోరీ ఘటనలు.. కీలకంగా చేసుకుని దర్యాప్తు ప్రారంభించి రెండు రోజుల్లో అనంతపురం జిల్లా ఉరవకొండలో నిందితుడు మణిరత్నం అలియాస్ మణిని పట్టుకున్నారు. దీంతో సీఐ సుబ్బారావుకు రాష్ట్ర స్థాయిలో ప్రశంసలు అందాయి. ఇటీవల కనిగిరి వచ్చిన ఎస్పీ సత్య ఏసుబాబు ప్రత్యేకంగా సీఐ మరవనేనిని అభినందించారు. -
యువతిపై లైంగిక వేధింపులు.. సీఐ సస్పెండ్
సాక్షి, విశాఖపట్నం : న్యాయం కోసం పోలీసుస్టేషన్‌కు వస్తే దానిని అవకాశంగా మార్చుకుంటున్నారు. సమస్యను పరిష్కరించాల్సింది పోయి.. బాధితుల పాలిట సమస్యగా మారుతున్నారు. ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ అని చెప్పుకు తిరిగే ఖాకీల్లో కొందరు కామాంధులుగా మారుతున్నారు. తాజాగా విశాఖపట్నంలో ఓ యువతిని లైంగికంగా వేధించిన ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్పై సస్పెండ్ వేటు పడింది. వివరాల్లోకి వెళ్తే విశాఖపట్నంలోని ఓ హోటల్లో పనిచేసే వారణాసికి చెందిన యువకుడు, మలేషియాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న యువతి సోషల్ మీడియాలో ప్రేమించుకున్నారు. ప్రియుడి కోసం మలేషియా నుంచి విశాఖపట్నం వచ్చి, ప్రియుడు పనిచేసే హోటల్లోనే ఉద్యోగంలో చేరింది. అయితే, ఇరువురి మధ్య మనస్పర్ధలు రావడంతో ప్రియుడు ఉద్యోగం వదిలేసి విశాఖపట్నం నుండి వెళ్ళిపోయాడు. కొద్ది రోజుల ఎదురుచూసిన యువతి ప్రియుడి ఆచూకీ కోసం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసును విచారించిన పోలీసులు పంజాబ్‌లో ఉన్న అతన్ని గుర్తించి, విశాఖకు తీసుకొచ్చి జైలుకు తరలించారు. అయితే, ప్రియుడిని జైలుకు పంపితే తర్వాత తనను వివాహం చేసుకోడని ఆందోళన పడిన యువతి జైలుకు పంపవద్దని సీఐను కోరింది. దాన్ని అవకాశంగా తీసుకున్న సీఐ యువతిపై లైంగిక వేధిపులు మొదలుపెట్టాడు. ఈ నేపధ్యంలో డిసెంబర్ 28న నేరుగా యువతి ఉంటున్న హోటల్ గదికే వెళ్ళి లైంగిక దాడికి దిగారు. దాంతో యువతి సీఐ ప్రవర్తనను వీడియో తీసి, నేరుగా నగర కమీషనర్‌కు ఫిర్యాదు చేసింది. కమీషనర్ వెంటనే విచారణకు ఆదేశించారు. యువతి అందించిన వీడియో సాక్ష్యాల ఆధారంగా కమీషనర్ సీఐను సస్పెండ్ చేశారు. -
జవహర్‌నగర్ సీఐపై వేటు
సాక్షి, హైదరాబాద్: ఓ మహిళపట్ల అమర్యాదగా ప్రవర్తించిన జవహర్‌నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ టీఎస్ ఉమామహేశ్వరరావుపై బదిలీ వేటు పడింది. హైదరాబాద్ రేంజ్ డీఐజీకి రిపోర్టు చేయాలని రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ ఆదివారం ఆదేశించారు. హత్య కేసులో బాధితురాలి ఇంట్లో సీఐ ఉమామహేశ్వర్ అనుచితంగా వ్యవహరించారు. కేసు విచారణ కోసం వెళ్లిన ఆయన అమర్యాదగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఉన్నతాధికారులు స్పందించారు. ఆయనను బదిలీ చేస్తూ ఆదేశాలిచ్చారు. ఉమామహేశ్వరరావు స్థానంలో జవహార్‌నగర్ ఇన్స్పెక్టర్గా చలపతికి పోస్టింగ్ ఇచ్చారు. చలపతి ప్రస్తుతం వనస్థలిపురం డీఐగా పనిచేస్తున్నారు. -
మద్యం సేవించి సీఐ ర్యాష్ డ్రైవింగ్
సాక్షి, హైదరాబాద్: ఓ సీఐ మద్యం సేవించి ర్యాష్ డ్రైవింగ్ చేసిన సంఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. సికింద్రాబాద్ రైల్వే సీఐ చంద్రయ్య మద్యం సేవించి ర్యాష్ డ్రైవింగ్ చేశారు. మితి మీరిన వేగంతో ప్రమాణిస్తూ ముగ్గురిని గాయపరిచారు. బాధితుల ఫిర్యాదుతో పటాన్చెరు పోలీసులు కేసు నమోదు చేశారు. -
కొత్వాల్ కొరడా!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న పోలీస్ అధికారుల్లో వణుకు మొదలైంది. ఖాకీ దుస్తులు ఉన్నంత వరకు తమకు ఎదురు లేదని విర్రవీగిన అధికారులు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఏడాది తరువాత విక్రంజిత్ దుగ్గల్ ఒక్కసారిగా కొరడా ఝుళిపించారు. కొత్వాల్‌గా అవినీతి, అక్రమాలు, మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడే పోలీస్ అధికారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తానని తేల్చిచెప్పారు. ఇందులో భాగంగా భర్త వేధింపులపై ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఓ మహిళను లైంగికంగా వేధించిన మంచిర్యాల మహిళా పోలీస్‌స్టేషన్‌లో సీఐ బాలరాజును సోమవారం విధుల నుంచి సస్పెండ్ చేశారు. అలాగే ఓ భూ వివాదం పరిష్కారంలో సహాయపడిన తనకు మంచి మొబైల్ కొనివ్వమని కోరినట్లు వాయిస్ రికార్డ్‌లో దొరికిన సీసీసీ–నస్పూరు ఎస్ఐ దత్తాత్రిపై ఆదివారమే వేటు వేశారు. ‘సాక్షి’ దినపత్రికలో పోలీసుల అవినీతి, అక్రమాలపై వరుసగా వస్తున్న కథనాలకు స్పందించిన రామగుండం కొత్వాల్ విక్రంజిత్ దుగ్గల్.. ఆరాచక, బరితెగింపు పోలీసు అధికారులపై వేటు వేయాలనే నిర్ణయించుకున్నారు. ఆలస్యంగానైనా కమిషనర్ దుగ్గల్ తీసుకున్న నిర్ణయం పోలీస్ కమిషనరేట్ పరిధిలో చర్చనీయాంశమైంది. శాంతిభద్రతల కన్నా... సివిల్ తగాదాలే ముఖ్యం సివిల్ తగాదాలు, భూ లావాదేవీల్లో ఏదో ఒక వర్గానికి అండగా నిలిచి కేసులను పరిష్కరించడం, లక్షల్లో వసూలు చేయడం మంచిర్యాల జిల్లా పోలీసులకు సర్వసాధారణం అయింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నప్పుడే మంచిర్యాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగగా, భూ వివాదాలు కూడా అప్పటి నుంచే మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో పోలీసుల జోక్యం కూడా పెరిగింది. ఏదైనా భూ వివాదంలో రెండు వర్గాలు ఉంటే ఒక వర్గానికి అనుకూలంగా వ్యహరించి, అందిన కాడికి దండుకోవడం దందాగా సాగింది. జిల్లా ఏర్పాటు కాకముందు ఏఎస్పీగా పనిచేసిన ప్రస్తుత గద్వాల ఎస్పీ విజయ్‌కుమార్ హయంలో పోలీసులు సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకోవడం తగ్గింది. మంచిర్యాల జిల్లా ఏర్పాటుతో విజయ్‌కుమార్ గద్వాల ఎస్పీగా వెళ్లగా, మంచిర్యాల రామగుండం పోలీస్‌కమిషనరేట్ పరిధిలోకి వచ్చింది. ఇక్కడ డీసీపీగా జాన్‌వెస్లీతో పాటు ముగ్గురు ఏసీపీలు నియమితులైనా... పోలీస్స్టేషన్లలో సాగే దందాలు ఆగలేదు. సీఐ కన్నా ఉన్నతస్థానాల్లో ఉన్న వారే నేరుగా భూదందాల్లో జోక్యం చేసుకోవడం, పోలీసుల పర్యవేక్షణలో ఫెన్సింగ్‌లు ఏర్పాటు చేయించడం వంటి అక్రమాలు చోటు చేసుకున్నాయి. తాజాగా బస్టాండ్ వెనుక ఉన్న 13 ఎకరాల భూ వివాదంలో ఏకంగా ఏసీపీ చెన్నయ్య రూ.13 లక్షలు తీసుకున్నట్లు ఏసీబీ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. బెల్లంపల్లి ఏసీపీగా పనిచేసి బదిలీపై వెళ్లిన అధికారిపై కూడా అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఇక మంచిర్యాల, బెల్లంపల్లి, జైపూర్ ఏసీపీల పరిధిలోని కొన్ని పోలీస్స్టేషన్లలో ఇసుక, రియల్ ఎస్టేట్ వ్యాపారులు , గుట్కా, ఇతర అక్రమ వ్యాపారాలు చేసే వారితో పోలీసుల సంబంధాలు బహిరంగమే. కాగా మహిళా పోలీస్‌స్టేషన్‌లో సీఐగా ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళలను సీఐ బాలరాజు లైంగిక వేధింపులకు గురిచేసినట్లు రుజువయింది. బాలరాజును ఇక్కడి నుంచి రామగుండం కమిషనరేట్‌కు అటాచ్డ్ చేసి పంపించగా, ఎస్ఐ బాధ్యతలు చూస్తున్నారు. అయితే మహిళా పీఎస్‌లో ఫిర్యాదుదారుల పట్ల ఎస్ఐ వ్యవహారశైలిపై కూడా కమిషనర్‌కు ఫిర్యాదులు వెళ్లినట్లు తెలిసింది. ఫిర్యాదుదారులతో సెటిల్మెంట్లు స్టేషన్లోనే జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. పెద్దపల్లి జోన్‌లోనూ అదే తీరు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జోన్ (జిల్లా) పరిధిలో కూడా అవినీతి అక్రమాలకు కొదవలేదు. రామగుండం, పెద్దపల్లి ఏసీపీల పరిధిలో అక్రమార్కులకు పోలీసులు అండగా నిలవడం, నజరానాలు అందుకోవడం మామూలే. ఇటీవల బసంత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నిషేధిత గుట్కా రవాణాకు సంబంధించిన కేసులో గోదావరిఖనికి చెందిన ప్రధాన నిందితుడిని తప్పించడానికి ఓ ఎస్ఐ రూ. 5లక్షలు వసూలు చేసిన ఆరోపణలున్నాయి. సీఐ సెలవులో ఉన్న సమయంలో ఎస్ఐ టోల్గేట్ వద్ద వేర్వేరుగా రెండు లారీల్లో రవాణా అవుతున్న గుట్కా లోడ్లను స్వాధీనం చేసుకున్నాడు. ఈ క్రమంలో నాగరాజు అనే గుట్కా లోడ్లను తెప్పిస్తున్న ప్రధాన నిందితుడిని వదిలి లారీలో వస్తున్న అతని తమ్ముడిపై కేసు నమోదు చేశాడు. ఈ విషయం బయటకు పొక్కకుండా పోలీస్ యంత్రాంగం ఇప్పటికీ ప్రయత్నిస్తోంది. అలాగే ఓ ఎన్టీపీసీ ఉద్యోగి, ఓ వీఆర్వో, వారి అనుచరులు ప్రతిరోజు గోదావరిఖని, మంచిర్యాల ప్రాంతాల నుంచి మహారాష్ట్రలోని సిరోంచ, వాంకిడి ఆవల ఉన్న అటవీ ప్రాంతాలకు పేకాట రాయుళ్లను తీసుకెళ్లి ‘పత్తాలాట’ ఆడిస్తున్నారు. గతంలో బైండోవర్ అయిన ఈ అంతర్రాష్ట్ర పత్తాలాట ముఠా నాయకుడు, ఇతరుల గురించి తెలిసినా గోదావరిఖని పోలీసులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. పెద్దపల్లి జిల్లా కేంద్రంగా ఏర్పాటు కావడంతో ఇక్కడ కూడా భూ వివాదాలు పెరిగాయి. అదే సమయంలో పోలీసుల జోక్యం కూడా పెరిగింది. మంథని పరిధిలో కూడా పలువురు సీఐలు, ఎస్ఐలపై ఆరోపణలు ఉన్నట్లు కమిషనర్ దృష్టికి వెళ్లింది. ఏసీపీ, సీఐ, ఎస్ఐల ట్రాక్ రికార్డ్ పరిశీలన మంచిర్యాల, పెద్దపల్లి జోన్ల పరిధిలో పోలీస్ అధికారుల తీరు వివాదాస్పదం అవుతుండడంతో కొత్వాల్ విక్రంజిత్ దుగ్గల్ పోస్ట్‌మార్టం ప్రారంభించారు. తన కమిషనరేట్ పరిధిలోని ఏసీపీలు, సీఐలు, ఎస్ఐల ట్రాక్ రికార్డును పరిశీలిస్తున్నట్లు తెలిసింది. గతంలో ఎస్‌హెచ్‌ఓలుగా పనిచేసిన చోట వచ్చిన ఆరోపణలు, ప్రస్తుతం బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై స్వయంగా విచారణ జరుపుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఒకటి రెండు రోజుల్లో అవినీతి ఆరోపణలపై మంచిర్యాలకు చెందిన ఓ ఉన్నతాధికారిపై వేటు పడనుంది. పెద్దపల్లి డీసీపీ పరిధిలోని ఓ అధికారిపై కూడా విచారణ జరిపి చర్యలు తీసుకొనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. స్టేషన్ల తనిఖీ సోమవారం కమిషనర్ విక్రంజిత్ దుగ్గల్ జైపూరు ఏసీపీ పరిధిలోని నీల్వాయి పోలీస్‌స్టేషన్, కోటపల్లిలో ఉన్న చెన్నూరు రూరల్ సర్కిల్ కార్యాలయాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బందితో పోస్టు ప్రొడక్షన్ డ్రిల్ చేయించారు. వారి పనితీరును వాకబు చేశారు. -
మంచిర్యాల సీఐ బాలరాజు సస్పెన్షన్
-
వీడని చిక్కుముడులెన్నో..?
మణికొండ: నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చెట్టపొదల్లో మూడు, కారులో రెండు మృతదేహాలు లభ్యమైన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బుధవారం అశోక్‌నగర్‌లోని అతని ఇంట్లో తనిఖీలు నిర్వహించిన పోలీసులు షేర్ మార్కెట్‌కు సంబందించిన పత్రాలు, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. తన భార్య మాధవి(28), కుమారుడు వశిష్ట్‌రెడ్డి(రెండున్నరేళ్లు), పిన్ని కొండాపురం లక్ష్మి(45), ఆమె కుమార్తె సిందూజ(16)లకు పథకం ప్రకారం విషం ఇచ్చి మృతి చెందిన తర్వాత వారిని చోట చెట్ల పొదల్లో పడేసి, తన కుమారునితో పాటు రెండు కిలోమీటర్ల దూరం వెళ్లిన ప్రభాకర్‌రెడ్డి కుమారునితో పాటు విషం తీసుకుని చనిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. అమీన్పూర్లో ఓ స్థలాన్ని కొనుగోలు చేసి అపార్ట్మెంట్ నిర్మించాలనుకున్న అతను సదరు స్థలం డిఫెన్స్ భూమిగా తేలటంతో కోలుకోలేని దెబ్బ పడింది. అప్పటికే అధిక ఆదాయం చూపుతూ బంధువులు, మిత్రుల నుంచి పెట్టుబడుల కోసం తీసుకున్న అతను మాట నిలుపునే క్రమంలో అప్పులపై అప్పులు చేసినట్లు సమాచారం. తన వద్ద పెట్టుబడులు పెట్టిన వారికి అధిక వడ్డీకి డబ్బులు తిరిగి ఇచ్చేవాడని తెలిపారు. ప్రభాకర్‌రెడ్డిని నమ్మి అతనివద్ద షేర్మార్కెట్లో పెట్టుబడులు పెట్టడంతో పాటు, వడ్డీకి డబ్బును ఇచ్చిన వారు వందమందికి పైగా ఉన్నట్లు సమాచారం. శంకర్పల్లి మండలం పామెన గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ప్రభాకర్‌రెడ్డికి రూ. 5కోట్ల వరకు అప్పు ఇచ్చాడని, ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవటంతో అతను షాక్‌కు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం. ప్రభాకర్‌రెడ్డి అప్పులు రూ. 30నుంచి రూ.50కోట్ల వరకు ఉండవచ్చునని స్థానికులు పేర్కొంటున్నారు. ఆర్ధిక లావాదేవీలే కారణం: రమణగౌడ్, నార్సింగి సీఐ ప్రభాకర్‌రెడ్డి ఆర్ధిక లావాదేవీలే ఐదుగురి మృతికి కారణంగా భావిస్తున్నాము. అతని షేర్‌మార్కెట్, రియల్ఎస్టేట్, చేసిన అప్పుల వివరాలను తెలుసుకుంటున్నాం. వారి సెల్ఫోన్లు కనిపించనందున విచారణలో జాప్యం జరుగుతోంది. అవన్నీ బయటకు వస్తే ఆత్మహత్యలకు కారణం తెలుస్తుంది. త్వరలోనే చిక్కుముడి విప్పుతాం. -
మావాడే కావాలి.. మా కోసమే ఉండాలి
విజయవాడ కమిషనరేట్ పరిధిలో సీఐల నియామకంపై అధికార పార్టీ ప్రజాప్రతినిధులు పంతం పట్టారు. తమకు అనుకూలంగా ఉన్న వారినే నియమించాలని భీష్మించారు. పోలీస్ వ్యవస్థను గాడినపెట్టేందుకు సమర్థులను నియమిద్దామని ఆ శాఖ ఉన్నతాధికారులు కోరుతున్నా ప్రజాప్రతినిధులు మాత్రం ససేమిరా అంటున్నారు. సాక్షి, అమరావతి బ్యూరో: విజయవాడ కమిషనరేట్ పరిధిలో సీఐల బదిలీల అంశం ఉన్నతాధికారులు, టీడీపీ ప్రజాప్రతినిధుల మధ్య ఆధిపత్యపోరుకు వేదికగా మారింది. పోలీసు వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఉన్నతాధికారులు చేసిన ప్రతిపాదనలకు ప్రజాప్రతినిధులు ససేమిరా అంటున్నారు. పూర్తిగా తమకు అనుకూలమైన అధికారులే ఉండాలని నగరంలోని ప్రజాప్రతినిధులు పట్టుబడుతున్నారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న సమర్థులైన అధికారులను రాజధానిలో నియమించాలని అధికారులు ప్రతిపాదించారు. ఈ వ్యవహారం సంక్లిష్టంగా మారడంతో రెండు నెలలుగా సీఐల బదిలీల ప్రక్రియ పెండింగులో చిక్కుకుంది. ఆ ఆరింటిపైనే పీటముడి కమిషరేట్ పరిధిలోని ఆరు పోలీసు స్టేషన్లలో సీఐ పోస్టింగుల అంశంలో పీటముడి బిగుసుకుంటోంది. పటమట, అజిత్‌సింగ్ నగర్, గన్నవరం పోలీసు స్టేషన్లలో సీఐల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ మూడు పోలీస్ స్టేషన్లలో అధికారులు వివాదాస్పద రీతిలో వైదొలగడం గమనార్హం. కీలకమైన ఈ పోలీస్స్టేషన్లలో తమకు అనుకూలమైనవారే ఉండాలని ప్రజాప్రతినిధులు తేల్చిచెబుతున్నారు. అందు కోసం ముగ్గురు టీడీపీ ప్రజాప్రతినిధులూ తమకు అనుకూలమైన అధికారుల పేర్లు సూచించారు. నగరంలో వాణిజ్య ప్రాంతంలో వివాదాస్పదమైన ఓ ప్రజాప్రతినిధి తన పరిధిలోనే ఉన్న ఓ అధికారిని అజిత్‌సింగ్‌నగర్ సీఐగా నియమించాలని సిఫార్సు చేశారు. శివారు ప్రాంతాల్లో దందాలకు పాల్పడే మరో ప్రజాప్రతినిధి గన్నవరం సీఐగా ఓ వివాదాస్పద అధికారి పేరు సూచించారు. ప్రస్తుతం నగర పరిధిలో ఉన్న ఆయన పనితీరుపై ప్రతికూల నివేదికలే ఉన్నాయి. సౌమ్యుడిగా కనిపిస్తూ పెద్దపెద్ద సెటిల్మెంట్లు చేసే మరో ప్రజాప్రతినిధి తీరు అదే విధంగా ఉంది. క్రైం రేటు అధికంగా ఉండే పటమట సీఐ పోస్టు కోసం తన నియోజకవర్గ పరిధిలోని ఓ అధికారిని సిఫార్సు చేశారు. మరో ముడు పోలీస్స్టేషన్లలో సీఐల పోస్టింగుల వ్యవహారం కూడా సంక్లిష్టంగా మారింది. కంకిపాడు, పెనమలూరు, విజయవాడ సత్యన్నారాయణపురం పోలీస్స్టేషన్లలో ప్రస్తుత సీఐలను కూడా బదిలీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఆ పోస్టుల కోసం టీడీపీ ప్రజాప్రతినిధులు తమ అనుకూల అధికారుల పేర్లను సిఫార్సు చేశారు. వారికి ఇవ్వలేం... ప్రజాప్రతినిధులు సిఫార్సు చేసిన అధికారుల పేర్లపై పోలీసు ఉన్నతాధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆ అధికారుల ట్రాక్ రికార్డు సరిగాలేదన్న అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుతం కమిషనరేట్ పరిధిలో ఉన్న వారినే ఖాళీగా ఉన్న పోస్టుల్లో నియమించడం వల్ల ప్రయోజనం ఉండదని కూడా చెబుతున్నారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న సమర్థులైన అధికారులను నియమిస్తే పోలీసింగ్‌ను పటిష్ట పరచవచ్చని అంటున్నారు. ఈ మేరకు ప్రస్తుతం ఇతర ప్రాంతాల్లో పనిచేసున్న కొందరు అధికారులపేర్లతో ఓ జాబితా రూపొందించి ఉన్నతాధికారులకు సమర్పించినట్లు సమాచారం. బదిలీల ప్రక్రియకే బ్రేక్...!? తమ సిఫార్సులకు విరుద్ధంగా సీఐల బదిలీల జాబితా రూపొందించడంపై ప్రజాప్రతినిధులు మండిపడుతున్నారు. తాము చెప్పినట్లే బదిలీలు చేయాలని హోమంత్రిత్వ శాఖ స్థాయిలో చెప్పించారు. ఈ మేరకు ఉన్నతాధికారి తీరుపై కూడా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. హోంమంత్రిత్వశాఖ పెద్దలు కూడా ప్రజాప్రతినిధులకే పరోక్షంగా మద్దతు తెలపడం గమనార్హం. రాజధానిలో పోలీసు వ్యవస్థను సంస్కరించేందుకే ప్రయత్నిస్తున్నామని ఉన్నతాధికారి సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా ఫలితంలేదని సమాచారం. దీంతో సీఐల బదిలీల ప్రకియనే పెండింగులో ఉంచేశారు. దాదాపు రెండు నెలలు కావస్తున్నా సీఐల బదిలీలకు ఆమోదముద్ర వేయలేదు. రాజధానిలో కీలకమైన మూడు పోలీస్స్టేషన్లలో రెగ్యులర్ సీఐలు లేక పోలీసింగ్ గాడితప్పుతున్నా పట్టించుకోవడం లేదు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు తాము సూచించినట్లుగా బదిలీల జాబితాలో మార్పులు చేయాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో సీఐల బదిలీల ప్రక్రియ చర్చనీయాంశంగా మారింది. మరి ట్రాక్ రికార్డుకు పెద్దపీట వేస్తారో... ప్రజాప్రతినిధుల అనుకూల అధికారులకు పచ్చజెండా ఊపుతారో వేచిచూడాల్సిందే. -
అంతరాష్ట్ర దొంగ అరెస్టు
గుత్తి: అనంతపురం, కర్నూల్ , కడప జిల్లాల పోలీసులను ముప్పతిప్పలు పెడుతూ ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న అగ్రహారం రంగస్వామి అనే అంతరాష్ట్ర దొంగను ఎట్టకేలకు గుత్తి పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 23 తులాల బంగారు ఆభరణాలు, 40 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని సీఐ కార్యాలయంలో సీఐ ప్రభాకర్ గౌడ్ విలేఖరుల సమావేశంలో ఆ వివరాలను వెల్లడించారు. కర్నూల్ జిల్లా తుగ్గలి మండలం రాంపల్లి గ్రామానికి చెందిన అగ్రహారం రంగస్వామి అనే 23 సంవత్సరాల యువకుడు గత రెండు, మూడు సంవత్సరాలుగా చోరీలకు పాల్పడుతున్నాడు. అనంతపురం, కర్నూల్, కడప జిల్లాల పరిధిలో పలు చోట్ల తాళాలు వేసిన ఇళ్లలోకి ప్రవేశించి దొంగతనాలకు పాల్పడుతుండేవాడు. గుత్తి మున్సిపాలిటీతో పాటు బాచుపల్లి, ధర్మాపురం గ్రామాల్లో కూడా చోరీలకు పాల్పడ్డాడు. మూడు జిల్లాల పోలీసులు ఆ దొంగను పట్టుకోవడానికి శత విధాల ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. ఈ క్రమంలో సదరు దొంగ గుత్తిలోని గుంతకల్లు రోడ్డులో ఉన్నట్లు సీఐకు సమాచారం వచ్చింది. దీంతో ఆయన వెంటనే సిబ్బందిని వెంట బెట్టుకుని దొంగను పట్టుకోవడానికి ప్రయత్నించారు. అయితే పోలీసుల రాకను పసిగట్టిన దొంగ పరుగు తీశాడు. ఎస్ఐ చాంద్‌బాషా, కానిస్టేబుళ్లు రవి, మోహన్, ఆదిలు సుమారు కిలో మీటరు వెంట పడి దొంగను పట్టుకున్నారు. అనంతరం అరెస్టు చేసి అతని వద్ద ఉన్న బంగారం, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దొంగను కోర్టులో హాజరు పరిచారు. జడ్జి రిమాండ్‌కు ఆదేశించారు. దొంగను పట్టుకోవడంలో ధైర్యసాహసాలు చూపిన ఎస్ఐ, కానిస్టేబుళ్లను సీఐ అభినందించి నగదు బహుమతులు అందజేశారు. -
మాతృత్వానికి అర్థం చెప్పిన సీఐ
వేములవాడ: ఖాకీ వెనుక కన్న తల్లి ప్రేమ కూడా దాగుంటుందని చాటారు వేములవాడ సీఐ మాధవి. వేములవాడ దేవస్థానం మెట్ల దగ్గర గురువారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు 20 రోజుల పసికందును వదిలి వెళ్లారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సీఐ మాధవి హుటాహుటిన అక్కడికి చేరుకుని చిన్నారి పరిస్థితిని చూసి చలించిపోయారు. బాబును అక్కున చేర్చుకుని ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స చేయించారు. బాబుకు స్నానం చేయించి కొత్త బట్టలు తొడిగి పాలు పట్టించారు. అనంతరం ఐసీడీఎస్ అధికారులకు సమాచారం అందజేశారు. అక్కడున్న కొందరు సీఐ మాధవిని తమ జిల్లాకు పోలీసు అమ్మగా ఆమెను పేర్కొనడంతో అక్కడున్న వారందరి కళ్లు చెమర్చాయి. ఇదే కాదు, ఇంతకు మునుపు కూడా పలుమార్లు సీఐ మాధవి ఇటువంటి ఎన్నో ఘటనలకు అమ్మవలే స్పందించి మంచి తనాన్ని చాటుకున్నారు. -
నా చావుకు సీఐ కారణం
► లేఖ రాసి మహిళా ఏఎస్ఐ ఆత్మహత్యాయత్నం బనశంకరి(కర్ణాటక): సర్కిల్ ఇన్స్పెక్టర్ వేధింపులు తట్టుకోలేక మహిళా ఏఎస్ఐ లేఖరాసి ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన హవేరిజిల్లా హిరేకరూరు పట్టణంలో మంగళవారం జరిగింది. హంసభావి పోలీస్‌స్టేషన్‌లో ఎం.ఏ అసాది మహిళా ఏఎస్ఐ. హిరేకరూరుపట్టణ పోలీస్‌స్టేషన్‌లో సీఐ సంగనాద జీఆర్. పట్టణంలో జరిగిన రైతుల ధర్నాకు ఏఎస్ఐ అసాది బందోబస్తుకు వచ్చారు. ఆమె డ్యూటీ పత్రాలు లేకుండా రావడంతో సీఐ సంగనాద ఆమెను నాటకాలు ఆడటానికి వచ్చావా, షాపింగ్ చేయడానికి వచ్చావా అని హేళన చేస్తూ వేధింపులకు దిగాడు. దీంతో ఆవేదన చెందిన అసాది తన చావుకు సీఐ కారణమని డెత్‌నోట్ రాసిపెట్టి నిద్రమాత్రలు మింగింది. తీవ్ర అస్వస్ధతకు గురైన బాధితురాలిని దావణగెరెలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. -
సచివాలయానికి సీఐ పదోన్నతుల రగడ
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో తమకు పదోన్నతుల విషయంలో తీవ్ర అన్యాయం జరిగిందని, బంగారు తెలంగాణలోనైనా న్యాయం జరుగుతుందని ఆశ పడ్డ తమకు నిరాశే ఎదురవుతోందని 1989–91 బ్యాచ్ సీఐ (సర్కిల్ ఇన్స్పెక్టర్లు)లు వాపోయారు. శనివారం సచివాలయానికి ఆ బ్యాచ్ సీఐలు మూకుమ్మడిగా తరలివచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హైదరాబాద్ ఐదో జోన్లో డీఎస్పీలుగా పదోన్నతులు ఇవ్వాలని కోరారు. పదోన్నతుల ఫైలు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి వద్ద ఉండటంతో సాయంత్రం వరకు అక్కడే వేచిచూశారు. అనంతరం సీఐలతో హోంమంత్రి, రాజీవ్ త్రివేది, రాజీవ్ శర్మలు రాత్రి 7 గంటల వరకు చర్చలు జరిపారు. ఈ నెల 31లోపు ప్రమోషన్ల విషయంపై తుది నిర్ణయం తీసుకుంటామని, అప్పటి వరకు ఎలాంటి ఆలోచనలు చేయొద్దని వారు సూచించారు. దీని వల్ల ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు వస్తాయని సీఐలకు హామీ ఇవ్వడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
పలువురు సీఐల నియామకం
అనంతపురం సెంట్రల్: ఖాళీగా ఉన్న సీఐ పోస్టులను భర్తీ చేస్తూ డీఐజీ ప్రభాకర్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. వీఆర్‌లో ఉన్న సీఐ శ్రీధర్‌ను కదిరి అర్బన్ సీఐగా నియమించారు. కదిరి అర్బన్‌లో పనిచేస్తున్న శ్రీనివాసులును పెనుకొండకు బదిలీ చేశారు. చిత్తూరు జిల్లా గంగవరం సీఐ రవికుమార్‌ను పుట్టపర్తి రూరల్ సర్కిల్‌కు బదిలీ చేశారు. కర్నూలు సీఐడీ విభాగంలో పనిచేస్తున్న చిన్నగౌస్ను ఉరవకొండ సీఐగా నియమించారు. -
అక్కను స్కూలుకు పంపేందుకు వచ్చి..
- స్కూలు బస్సు కింద పడి మరణించిన రెండేళ్ల చిన్నారి - మీర్పేట్లో విషాదం హైదరాబాద్: అమ్మతో కలసి అక్కను స్కూలు బస్సు ఎక్కించేందుకు బయటకు వచ్చిన రెండేళ్ల చిన్నారి... అదే బస్సు చక్రాల కింద పడి నలిగిపోయాడు. అప్పటివరకూ ఆడుతూ... ముద్దు లొలికించిన బుడతడు అంతా చూస్తుండగానే... క్షణాల్లో ప్రాణాలు కోల్పోయాడు. కళ్లముందే జరిగిన ఈ ఘోరం చూసి ఆ తల్లి గుండెలవిసేలా రోదించింది. హైదరాబాద్ మీర్పేట్లో మంగళవారం జరిగిన ఈ విషాదం అక్కడున్నవారిని కలచివేసింది. సూర్యాపేట జిల్లా ఎలకారం గ్రామానికి చెందిన రమేశ్ యాదవ్ చంపాపేట్‌లోని నారాయణ కళాశాలలో వైస్ప్రిన్స్పాల్గా పనిచేస్తున్నారు. భార్య లలిత, కూతురు మోక్ష(4), కుమారుడు మనీశ్(2)తో కలసి మీర్పేట్ ఠాణా పరిధిలోని శివాహిల్స్లో నివాసం ఉంటున్నారు. మోక్ష సమీపంలోని భారతీయ మహావిద్యాలయలో ఎల్కేజీ చదువుతోంది. రోజూ మాదిరిగానే మంగళవారం కూడా లలిత తన కుమార్తె మోక్షను పాఠశాలకు పంపే క్రమంలో ఇంటి ముందుకు వచ్చిన బస్సు ఎక్కించేందుకు బయటకు వచ్చింది. ఎప్పటిలానే తల్లి, అక్కను అనుసరిస్తూ మనీశ్ బయటకు వచ్చాడు. అయితే ఊహించని విధంగా బస్సు ముందు టైర్ కిందకు వెళ్లాడు. ఇది గమనించని డ్రైవర్ బస్సును కదిలించడంతో మనీశ్ తల మీద నుంచి ముందు టైర్ వెళ్లింది. దీంతో చిన్నారి అక్కడిక్కడే మృతి చెందాడు. రక్తపు మడుగులో తమ బిడ్డను చూసి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు భోరున విలపించారు. దీనిపై కేసు నమోదు చేశామని, బస్సు డ్రైవర్‌ను అదుపు లోకి తీసుకున్నామని సీఐ రంగస్వామి తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఎంపీపీ విక్రంరెడ్డి తదితరులు ఘటనా స్థలికి వచ్చి చిన్నారి తల్లిదండ్రులను పరామర్శించారు. -
‘బూతుపురాణం’పై విచారణకు ఆదేశం
అనంతపురం సెంట్రల్: కళ్యాణదుర్గంలో ట్రాఫిక్ క్లియర్ చేయలేదంటూ ఓ కానిస్టేబుల్‌ను సీఐ శివప్రసాద్ బూతులు తిట్టి మనస్తాపానికి గురి చేసినట్లు ‘కానిస్టేబుల్‌పై సీఐ బూతుపురాణం’ శీర్షికన శుక్రవారం సాక్షిలో ప్రచురితమైన కథనానికి ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ స్పందించారు. అసలేం జరిగిందని ఆరా తీశారు. ఘటనపై విచారణ చేసి సమగ్ర నివేదిక అందజేయాలని కళ్యాణదుర్గం డీఎస్పీ వెంకటరమణను ఆదేశించారు. -
ఓ చెత్తకుండీ...16 లక్షల పాత కరెన్సీ!
చిత్తు కాగితాలు ఏరుకొనే మహిళకు దొరికిన వైనం - హైదరాబాద్‌లోని నేరేడ్మెట్లో కలకలం హైదరాబాద్: చిత్తు కాగితాలు ఏరుకొని జీవించే మహిళకు చెత్తకుండీలో రూ.16 లక్షల రద్దయిన పాత నోట్ల కట్టలు దొరికాయి. గురువారం నేరేడ్మెట్ ఠాణా పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ వివరాలను సీఐ జగదీశ్‌చందర్ విలేకరులకు వెల్లడించారు. చిత్తు కాగితాలు సేకరించి జీవనం సాగించే నేరేడ్మెట్ వాజ్పేయినగర్వాసి చందా గంగూబాయి (58).. గురువారం ఉదయం సమీపంలోని రైల్వేగేట్ వద్దకు వెళ్లింది. అక్కడి చెత్త కుండీలో కాగితాలు సేకరిస్తుండగా... ఆమెకు పాత రూ.500, రూ.1000 నోట్ల కట్టలు కనిపించాయి. ఇవి చూసి దిగ్భ్రాంతికి గురైన ఆమె.. స్థానికుల ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చింది. అక్కడకు చేరుకున్న పోలీసులు నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.16 లక్షలని తేల్చారు. దీనిపై కేసు నమోదు చేశామని, ఈ నోట్లు ఎవరు పడేశారనేది తెలుసుకొనేందుకు దర్యాప్తు చేస్తున్నామని సీఐ చెప్పారు. రూ.1.2 కోట్ల పాత నోట్లు స్వాధీనం మార్పిడికి యత్నిస్తున్న ముగ్గురి అరెస్టు సాక్షి, హైదరాబాద్: రద్దయిన పాత రూ.500, రూ.1000 నోట్ల మార్పిడికి యత్నిస్తున్న ముఠాను పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేసి రూ.1.2 కోట్ల పాత కరెన్సీ స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ బి.లింబారెడ్డి గురువారం వెల్లడించారు. మంచిర్యాల జిల్లాకు చెందిన సలీమ్ మెహిదీపట్నంలో ఉంటూ కరాటే కోచ్‌గా పనిచేస్తున్నాడు. మంచిర్యాలకు చెందిన ఇతడి బంధువులు, స్నేహితుల్లో అనేక మంది రియల్ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. రద్దయిన పాత నోట్లు తమ వద్ద ఉన్నాయని, కమీషన్ పద్ధతిలో వాటిని మార్పిడి చేసిపెట్టాలని గత నెలలో వారు కోరడంతో సలీమ్ అంగీకరించాడు. మొత్తం రూ.1.2 కోట్ల విలువైన పాత నోట్లను తీసుకుని హైదరాబాద్‌కు చేరుకున్నాడు. వీటిని మార్చేందుకు కూకట్‌పల్లికి చెందిన రియల్ఎస్టేట్ దళారి ఎల్.సుబ్బారెడ్డి, విజయ్‌నగర్‌కాలనీకి చెందిన టెంట్‌హౌస్ వ్యాపారి ఎండీ అలీమ్ సహకారం కోరాడు. దీనికి వారు అంగీకరించడంతో ముగ్గురూ కలసి మార్చేందుకు గురువారం కారులో నగదు తీసుకుని పంజగుట్ట ప్రాంతానికి వచ్చారు. దీనిపై సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎల్.రాజావెంకటరెడ్డి నేతృత్వంలోని బృందం దాడి చేసి ముగ్గురినీ అదుపులోకి తీసుకుంది. రద్దయిన నోట్లను స్వాధీనం చేసుకుని, కేసును పంజగుట్ట పోలీసులకు అప్పగించింది. -
రైల్వే స్టేషన్ టు సీఐ హౌస్
-
రైల్వే స్టేషన్ టు సీఐ హౌస్
► పార్కింగ్‌లో ఉంచిన బైక్ నేరుగా సీఐ ఇంటికి ► బండిని దర్జాగా వాడుకుంటున్న సీఐ ► బాధితుని ద్వారా విషయం వెలుగులోకి ఆదోని(కర్నూలు): రూల్ అమలు చేసేది తామే కదా.. ఎవరేం చేస్తారనుకున్నారో ఏమో తెలియదు కానీ ఆదోని టూ టౌన్ సీఐ గంటా సుబ్బారావు స్థానిక రైల్వే స్టేషన్ పార్కింగ్‌లో ఉంచిన బైక్‌ను ఏకంగా తన ఇంటికి తరలించారు. అంతేనా దానికి పోలీస్æ స్కిక్కర్ అతికించి మరీ దర్జాగా వినియోగించుకుంటున్నా రు. బాధితుని ద్వారా విషయం సోమవారం మీడియాకు తెలియడంతో హడావుడిగా బైక్‌పై ఉన్న పోలీస్ స్టిక్కర్ తీయించేసి దాంతో సంబంధం లేదని బుకాయించారు. ఇందుకు సంబంధించి బాధితుడు బోయ నరేష్ అందించిన వివరాల మేరకు.. ఆదోని బోయ గేరికి చెందిన బోయ నరేష్ మే నెల చివరి వారంలో తన మిత్రుడు ప్రకాష్‌తో కలిసి చెన్నై వెళ్లాడు. ఈ సమయంలో తన హీరో హొండా బైక్(ఏపీ 21 ఎఎ 0622)ను రైల్వే స్టేషన్ స్టాండ్‌లో పార్కింగ్ చేసి వెళ్లాడు. పక్షం రోజుల తర్వాత తిరిగొచ్చి న నరేష్ బైక్ కోసం స్టాండు నిర్వాహకుడిని ఆరా తీశాడు. చాలా రోజులుగా స్టాండ్‌లోనే ఉండడంతో టూటౌన్ పోలీసులకు అప్పగించినట్లు తెలుసుకుని బైక్‌ను తీసుకెళ్లిన కానిస్టేబుల్ సింగ్‌తో మాట్లాడగా సీఐని కలవాలని సూచించా రు. ఈ మేరకు అతడు సీఐ గంటా సుబ్బారావును కలిసి ఫిర్యాదు చేయగా పొంతనలేని ప్రశ్నలతో పదేపదే తిప్పించుకోవడంతో అనుమానం వచ్చిన నరేష్ నెల తర్వాత అతని ఇంటికి వెళ్లి చూడగా బైక్ కనిపించింది. విషయాన్ని మీడియాతోపాటు డీఎస్పీ దృష్టికి తీసుకెళ్లిన కొద్దిసేపటికే సీఐ సదరు బైక్‌పై అంటించిన పోలీస్ స్టిక్కర్‌ను తీయించి ఇంటి నుంచి స్టేషన్‌కు తెప్పించారు. మూడు రోజుల క్రితమే నా వద్దకు వచ్చాడు బైక్ పోయిందంటూ నరేష్ నా వద్దకు మూడు రోజుల క్రితం వచ్చాడు. అయితే ఆ బైక్ కర్నూలుకు చెందిన భాస్కర్ అనే వ్యక్తి పేరుపై ఉండడంతో రికార్డులు తీసుకురమ్మన్నాను. పర్చేజింగ్ డీడ్ ఉందని చూపించగా ఒరిజినల్స్ చూపించాలని చెప్పాను. తెస్తే పరిశీలించి బైక్ అప్పగిద్దామనుకున్నా. ఆలోగా ఇలా జరిగింది. (బైక్ ఎక్కడుందని విలేకరులు ప్రశ్నించగా ఎక్కడో ఒక చోట ఉంటుందిలే అంటూ బయటకు వెళ్లిపోయారు). – గంటా సుబ్బారావు, సీఐ వాస్తవమైతే చర్యలు తప్పవు... బైక్‌ను ఇంట్లో పెట్టుకోవడం, సొంత అవసరాలకు వాడుకోవడం సరికాదు. బండి యజమాని ఎవరో తెలియకపోతే రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలి. బాధితుడు సంప్రదిస్తే రికార్డులు పరిశీలించి, అవసరమైతే కేసు నమోదు చేసి న్యాయం చేయాలి. అయితే సీఐ నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించారనే ఆరోపణలపై పూర్తి స్థాయి విచారణ చేస్తాం. వాస్తవమని తేలితే చట్టపరమైన చర్యలకు ఎస్పీకి సిఫారసు చేస్తాం. కేసు నమోదు చేసి విచారించిన తరువాత బాధితుడికి బైక్ అప్పగిస్తాం. – కొల్లి శ్రీనివాసరావు, ఆదోని డీఎస్పీ -
పోలీసుల క్రూరత్వం
- ప్రేమికులకు సహకరించారని చితకబాదారు - రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరో దారుణం సిరిసిల్ల క్రైం: దళితులపై ‘థర్డ్‌డిగ్రీ’ ప్రయోగం దుమారం మరువకముందే రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు మరో దారుణానికి ఒడిగట్టారు. ప్రేమికులకు సహకరించారనే కార ణంతో ముగ్గురు యువకులను చావబాదారు. ఈ ఘటన ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది. బాధితుల కథనం ప్రకారం.. సిరిసిల్ల అర్బన్ మండలం చంద్రంపేటకి చెందిన ఎల్లయ్య కూతురు అదే గ్రామానికి చెందిన రజాక్ కుమారుడు ప్రేమించుకున్నారు. తమ వివాహానికి కుటుంబసభ్యులు అంగీకరించరనే కారణంతో ప్రేమికులు వారం క్రితం తమ ఇళ్లు విడిచి హైదరాబాద్ వెళ్లి అక్కడే వివాహం చేసుకున్నారు. అయితే, తన కూతురు కనిపించడంలేదంటూ ఎల్లయ్య సిరిసిల్ల ఠాణాలో ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలోనే పోలీసులు విచారణ పేరుతో ప్రేమికుడి స్నేహితులు శేఖర్, రజాక్, సన్నీ అనే యువకులను అదుపులోకి తీసుకున్నారు. ప్రేమికులు ఎక్కడ ఉన్నారనే విషయం చెప్పాలంటూ గత శుక్రవారం నుంచి ఆదివారం వరకూ చితకబాదారు. ఆ తర్వాత వదిలేయడంతో సోమవారం విలేకరులను ఆశ్రయించారు. ప్రేమికులకు సహకరించారనే అనుమానంతో పోలీసులు తమను అదుపులోకి తీసుకోవడంతో ఆగ్రహించిన ఆమె బంధువులు ఫోన్‌చేసి తమను చంపుతామని బెదిరిస్తున్నారని బాధితుల్లో ఒకరైన శేఖర్ చెప్పారు. దీనిపై సిరిసిల్ల సీఐ శ్రీనివాసరావును సంప్రదించగా, ప్రేమికుల వివరాలు తెలుసుకునేం దుకు ముగ్గురు యువకులను ఠాణాకు పిలిపించామన్నారు. ప్రేమికులు మేజర్లని తెలియడంతో వారిని వదిలివేశామని, తాము ఎవరినీ కొట్టలేదన్నారు. -
సీఐ, కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు
అనంతపురం సెంట్రల్ : క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారులపై అనంతపురం రేంజ్ డీఐజీ ప్రభాకర్‌రావు కొరడా ఝుళిపించారు. స్పెషల్‌బ్రాంచ్ సీఐ రాజశేఖర్, మడకశిర కానిస్టేబుల్ ఫరూక్‌లను సస్పెండ్ చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. సీఐ రాజశేఖర్‌ను ఓ భూకబ్జా ఘటనలో ఇప్పటికే వీఆర్‌కు పంపారు. తాజాగా సస్పెండ్ చేస్తూ డీఐజీ ఆదేశాలు జారీ చేసినట్లు పోలీసువర్గాలు వెల్లడించాయి.