జగిత్యాల జిల్లా మేడిపెల్లి మండలం పోరుమల్ల గ్రామానికి కుంట శంకరమ్మ (55)ను అతి కిరాతంగా హత్య చేసిన సైకో కొడుకు కుంట శేఖర్ (25) వ్యవసాయ బావిలో పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
మేడిపెల్లి: జగిత్యాల జిల్లా మేడిపెల్లి మండలం పోరుమల్ల గ్రామానికి కుంట శంకరమ్మ (55)ను అతి కిరాతంగా హత్య చేసిన సైకో కొడుకు కుంట శేఖర్ (25) వ్యవసాయ బావిలో పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
పోరుమల్లకు చెందిన కుంట శంకరమ్మ(56)పై ఆమె కొడుకు శేఖర్ గత శుక్రవారం రాత్రి అత్యాచారయత్నానికి పాల్పడడంతో పాటు సుత్తితో తలపై కొట్టి కర్కశంగా హత్య చేసిన విష యం తెలిసిందే. అప్పటినుంచి పరారీలో ఉన్న శేఖర్ ఆది వారం సాయంత్రం గ్రామ శివారులోని ఓ వ్యవసాయ బా విలో శవమై కనిపించాడు. విషయం తెలుసుకున్న కోరుట్ల సీఐ రాజశేఖర్‌రాజు వెళ్లి శవాన్ని బయటకు తీయించారు.