హస్తినాపురం(హైదరాబాద్): చట్టాన్ని పరిరక్షించాల్సిన రక్షకభటులే సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహరిస్తున్నారు. నగరంలోని సౌత్‌జోన్‌లో కంట్రోల్‌ల్ రూంలో పనిచేస్తున్న ఓ సీఐ నడిరోడ్డుపై కారులో మహిళతో రాసలీలకు పాల్పడుతూ పోలీసులకు పట్టుబడటమేగాక డ్యూటీలో ఉన్న పోలీసులపై దాడికి పాల్పడిన సంఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వనస్థలిపురం ఇన్‌స్పెక్టర్ కె.సత్యనారాయణ కథన ం మేరకు వివరాలిలా ఉన్నాయి.
రంగారెడ్డి జిల్లా, కందుకూరు మండలం, బేగంపేట గ్రామానికి చెందిన రాజు వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని హరిహరపురం కాలనీలో నివాసం ఉంటూ నగరంలోని సౌత్‌జోన్‌లో కంట్రోల్ రూమ్ సీఐగా పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి అతను సాగర్ రహదారిపై పెట్రోల్‌బంక్ పక్కన కారులో పీకలదాకా మద్యంతాగి మరో మహిళతో కారులో ఉండటంతో అతని భార్య, పిల్లలు అక్కడికి వెళ్లి అతడితో గొడవపడ్డారు.
దీనిని గుర్తించిన పెట్రోలింగ్ కానిస్టేబుళ్లు నాగార్జున, నాయుడు అక్కడికి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించగా మద్యం మత్తులో ఉన్న సీఐ రాజు వారిపై దాడిచేసి గాయపరిచాడు. హెడ్ కానిస్టేబుల్‌ను వెంబడించి దాడికి ప్రయత్నించడంతో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు. కానిస్టేబుళ్లపై దాడికి పాల్పడినందుకు కేసు నమోదు చేశామని, నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వివరించారు.
చదవండి: రెండు నెలల క్రితం లవ్ మ్యారేజ్.. అంతలోనే షాకింగ్ ఘటన.. అసలు ఏం జరిగింది?
Comments
Please login to add a commentAdd a comment