చంద్రబాబు నియోజకవర్గంలో దారుణం
- సీఐ లైంగిక వేధింపులు
- మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
చిత్తూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజక వర్గంలో దారుణం చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా కుప‍్పం పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున‍్న సర్కిల్ ఇన్‌స్పెక‍్టర్ రాజశేఖర్ లైంగిక వేధింపులు భరించలేక పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున‍్న నిర‍్మల మంగళవారం ఉదయం పురుగుల మందు తాగి ఆత‍్మహత్యాయత‍్నం చేసింది. పురుగుల మందు తాగి అపస్మారకస్థితిలో ఉన‍్న నిర‍్మలను కుటుంబసభ‍్యులు తొలుత కుప‍్పం ఆస‍్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో ఆమెను చిత్తూరు ప్రభుత‍్వ ఆస‍్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.