women constable
-
రెండేళ్ల కిందట భర్త మృతి.. తర్వాత తమ్ముడే ఇలా చేస్తాడని ఆమె అనుకోలేదేమో!
తుమకూరు: కనిపించకుండా పోయిన హులియూరు పోలీస్‌స్టేషన్‌లోని మహిళా కానిస్టేబుల్ హత్యకు గురైనట్లు తేలింది. ఆమె చిన్నాన్న కుమారుడు మంజునాథ్ (32) హత్య చేసి, ఆపై అతడూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. వివరాల ప్రకరాం.. కానిస్టేబుల్ ఎస్.సుధా (38) ఈ నెల 13వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు పీఎస్ నుంచి స్థానికంగా ఉన్న తన ఇంటికి బయల్దేరింది. అయితే ఆమె ఇంటికి చేరుకోలేదు. ఆమెకు 14 సంవత్సరాల కొడుకు, 10 ఏళ్ల కూతురు ఉన్నారు. రెండేళ్ల కిందట భర్త చనిపోయాడు. ఏడాదిన్నరగా హులియూరులో పనిచేస్తున్నారు. పిల్లల ద్వారా విషయం తెలుసుకున్న హులియూరు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. హైవే పక్కన మృతదేహాం కర్ణాటక రాష్ట్రంలో హాసన్ జిల్లాలోని అరిసికెరె తాలూకాలోని అరసికెరె– తిపటూరు మధ్య జాతీయ రహదారి– 206లో మైలనహళ్ళి గ్రామం వద్ద శుక్రవారం సాయంత్రం సుధా శవం కనిపించింది. అక్కడి పోలీసులు దర్యాప్తు చేయగా సుధా మృతదేహమని తెలిసింది. మరోవైపు శివమొగ్గలో ఒక లాడ్జిలో మంజునాథ్ ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఆస్తి గొడవలే కారణం? పోలీసుల విచారణలో చిక్కుముడి వీడింది. సుధా, మంజునాథ్‌ల స్వస్థలం జిల్లాలోని చిక్కనాయకనహళ్లి. వీరికి డబ్బులు, ఆస్తి గొడవలు ఉన్నట్లు సమాచారం. దీనిపై మాట్లాడుదామని చెప్పి సుధాను మంజునాథ్ కారులో తీసుకెళ్లి హత్య చేశాడు. అతని వద్ద డెత్‌నోటు దొరికింది, తానే సుధాను హత్య చేశానని, అందువల్ల ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రాశాడు. దీంతో, కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. -
ఇంప్లాంట్ ఉందన్నా బట్టలిప్పించి తనిఖీ
గౌహతి: నడుము భాగంలో ఇంప్లాంట్ (మెటల్ ప్లేట్) వేయించుకున్న 80 ఏళ్ల వృద్ధురాలిని బట్టలిప్పించి తనిఖీ చేసిన ఘటన అస్సాంలోని గౌహతి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో గురువారం చోటుచేసుకుంది. వృద్ధురాలి నడుముకు గత ఏడాది శస్త్రచికిత్స జరిగింది. వైద్యులు మెటల్ ప్లేట్ వేశారు. ఢిల్లీకి వెళ్లడానికి నాగాలాండ్ నుంచి గౌహతికి చేరుకుంది. మనవరాలితో కలిసి చక్రాల కుర్చీలో ఎయిర్‌పోర్టు లోపలికి వెళ్తుండగా, మెటల్ డిటెక్టర్ అలారం మోగింది. దీంతో సీఐఎస్ఎఫ్ మహిళా సిబ్బంది ఆమెను ఆపారు. బట్టలు ఇప్పించి తనిఖీ చేశారు. శరీరంలో ఇంప్లాంట్ ఉందంటూ ఎంత చెప్పినా వినిపించుకోలేదు. వృద్ధురాలిని అవమానించినట్లు ఫిర్యాదు అందడంతో అందుకు కారణమైన మహిళా కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. గౌహతి ఎయిర్‌పోర్టులో వృద్ధురాలికి అవమానం -
వైరల్ వీడియో: ప్యాంట్‌పై బురద, ఊగిపోతూ ఏం చేసిందంటే..
కొంతమంది ఎంత ఉన్నత స్థానంలో ఉన్నప్పటికి ఎలాంటి బేషజాలకు పోకుండా సాదాసీదాగా ఉంటారు. ఇంకొంతమంది మాత్రం తమ అధికారాన్ని కొద్దిపాటి హోదాని చూసుకుని కన్నుమిన్ను గానకుండా ప్రవర్తిస్తారు. అచ్చం అలాంటి ఘటన గురించే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఎందుకంటే.. అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది కాబట్టి.. మధ్యప్రదేశ్‌లోని రేవాలో ఒక వ్యక్తి తన మోటారు సైకిల్ని రివర్స్ చేస్తున్నప్పుడు.. అక్కడే ఉన్న ఒక మహిళా పోలీసు ప్యాంట్ పై బురద పడింది. దీంతో కోపంతో ఊగిపోయిన ఆ పోలీస్.. తన ప్యాంట్‌ని శుభ్రం చేయమని ఆ వ్యక్తి బలవంతం చేసింది. గత్యంతరం లేక ఆ వ్యక్తి ఆమె ప్యాంటును శుభ్రం చేశాడు. అయినా ఆ అధికారిణి శాంతించలేదు. ఆ వ్యక్తిని ఒక చెంపదెబ్బ కొట్టి వెళ్లిపోయింది. వీడియో వైరల్ కావడంతో విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. సదరు మహిళ ఖాకీ.. కలెక్టర్ కార్యాలయంలో పనిచేసే హెంగార్డు శశికళగా గుర్తించారు. ఈ ఘటనపై రేవా ఎస్పీ శివ కుమార్ మాట్లాడుతూ..."ఆ వీడియో తమదాకా వచ్చిందని, ఫిర్యాదు అందితే శశికళపై కచ్చితంగా చర్యలు తీసుకుంటాం" అని తెలిపారు. मध्य प्रदेश के रीवा में एक महिला पुलिसकर्मी ने सिरमौर चौक के पास पहले युवक से पैंट साफ कराई. फिर उसे जोरदार थप्पड़ जड़ दिया. बाइक हटाते हुए महिला पुलिसकर्मी के पैंट में कीचड़ लग गया था @ndtv @ndtvindia @DGP_MP @drnarottammisra pic.twitter.com/m0hdSJ2mrZ — Anurag Dwary (@Anurag_Dwary) January 12, 2022 చదవండి: ఒమిక్రాన్ ఉధృతిని ఆపలేం.. బూస్టర్‌తో ప్రయోజనం ఉండకపోవచ్చు! -
దారుణం: మహిళా కానిస్టేబుల్‌పై సామూహిక లైంగిక దాడి
నీముచ్: మహిళా పోలీసులకు కూడా రక్షణ కరువైందని తెలిపే తాజా ఉదాహరణ ఇది. ఓ మహిళా కానిస్టేబుల్(30)పై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడటంతోపాటు ఆ అకృత్యాన్ని వీడియో తీశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని నీముచ్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ నెల మొదటి వారంలో ఘటన చోటుచేసుకోగా బాధితురాలు 13వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలితో నిందితుడు ఏప్రిల్ నుంచి ఫేస్బుక్ ద్వారా పరిచయం కొనసాగిస్తున్నాడు. తన సోదరుడి బర్త్‌డే పార్టీకి ఆహ్వానించగా బాధితురాలు వెళ్లింది. అక్కడే ఆమెపై ప్రధాన నిందితుడు, అతడి సోదరుడు, మరొకరు అత్యాచారానికి పాల్పడ్డారు. అయిదుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రధాన నిందితుడిని, అతడి తల్లిని అదుపులోకి తీసుకున్నారు. -
బిడ్డను బంధువుల ఇంట్లో వదిలి మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
ముంబై: పుణెలో జయభాయి అనే మహిళ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకుంది. పుణె సిటీ పోలీస్ స్పెషల్ భ్రాంచ్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న జయభాయి సోమవారం రాత్రి ఉరేసుకొని తనువు చాలించింది. మృతురాలికి ఒక కుమర్తె ఉన్నారు. ఆదివారం తన విధులును ముగించుకుని ఇంటికి వెళ్లే ముందు, ఆమె తన కుమార్తెను బంధువుల ఇంట్లో వదిలివెళ్లింది. సోమవారం ఆమె స్నేహితుడు ఇంటికి వెళ్లి చూడగా డోర్ లోపల నుంచి లాక్ చేసి ఉంది. దీంతో అనుమానం వచ్చి అతడు వాకాడ్ పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఆమె ఇంటి తలుపు తెరిచి చూడగా.. జయభాయి విగతజీవిగా ఉరికి వేలాడుతూ కనిపించించింది. పోలీసులు కేసు నమోదు చేసి, ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ విషయాన్ని కేరళలో ఇండియన్ నేవిలో పనిచేస్తున్న ఆమె భర్తకు తెలియజేశారు. పోలీస్ ఇన్స్పెక్టర్ వివేక్ ముగ్లికర్ మాట్లాడుతూ సంఘటన స్థలంలో ఎంటువంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదని, దర్యాప్తు కొనసాగుతోందని అన్నారు. -
మొదటి జీతం.. పేదలకు అంకితం
గీసుకొండ : వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా నియామకమైన వలపదాసు అనూష ఇటీవల విధుల్లో చేరింది. ఆమె మొదటి నెల వేతనాన్ని పేదల ఆకలి తీర్చడానికి వెచ్చించి ఆదర్శంగా నిలిచింది. ఆకలితో అలమటిస్తున్న వంద మంది నిరుపేదలు, భిక్షమెత్తుకునే వారికి భోజనం అందజేసింది. వరంగల్ నగరంలోని ఎస్ఆర్ఆర్ తోట ప్రాంతానికి చెందిన అనూష తండ్రి చిన్నతనంలో చనిపోయారు. తల్లి బీడీలు చేసి కుటుంబాన్ని పోషిస్తోంది. అనూష పేదరికంలో బతుకుతూనే ఎంఏ బీఈడీ వరకు చదువుకుని ప్రైవేట్ టీచర్‌గా పని చేస్తూ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించింది. పేదవారికి సాయం చేయా లానే సంకల్పంతో మొదటి వేతనంతో ఆహారం సమకూర్చానని, రానున్న రోజుల్లో తన శక్తి మేరకు సాయపడతానని అనూష చెబుతోంది. ఆమె పేదలకు ఆహార పొట్లాలు అందిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో పలువురు అభినందిస్తున్నారు. -
నీలవేణిది ఆత్మహత్య కాదు.. హత్య
సాక్షి, నందిగామ : కృష్ణా జిల్లాలోని కంచికచర్ల మహిళా కానిస్టేబుల్ నీలవేణి (26) మృతి కేసును పోలీసులు చేధించారు. తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ అనంతరం హత్యగా నిర్ధారించారు. భర్త నాగశేషు, మరిది శ్రీనివాస్ కలిసి నీలవేణిని హత్యచేసినట్లు పోలీసులు తేల్చారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండపల్లి గ్రామానికి చెందిన మద్ది నీలవేణి కంచికచర్ల ఎక్సైజ్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తోంది. అదే స్టేషన్లో చీమలపాడుకు చెందిన పీ నాగశేషు కూడా కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. వీరిద్దరు ఏడాదిన్నర కిత్రం ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి మూడు నెలల కుమారుడు కూడా ఉన్నాడు. ఈ క్రమంలోనే నీలవేణిపై అనుమానంతో భర్త కొంతకాలంగా వేధిస్తున్నాడు. దీంతో భార్యను హతమార్చాలని కుట్రపన్నాడు. అదునుచూసి శనివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన తమ్ముడు శ్రీనివాస్ సహాయంతో భార్యను హతమార్చాడు. అనంతరం ఏమీ తెలియనట్లు భార్య ఇంట్లో ఉరేసుకుని అత్మహత్యకు పాల్పడినట్లు కథ అల్లాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారించగా.. నిందితులు నిజం ఒప్పుకున్నారు. దీంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. -
యువతికి, హోంగార్డుకు కరోనా పాజిటివ్
మహారాణిపేట/అల్లిపురం/గాజువాక : మహారాణిపేట పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న మహిళకు కరోనా పాజిటివ్ రావడంతో పోలీసు సిబ్బందిలో, ఆమె నివసిస్తున్న కొబ్బరితోటలో ఆదివారం కలకలం రేగింది. ఆమె కాక, దండు బజార్లో మరో మహిళకు, గాజువాక ప్రియదర్శిని కాలనీలో ఓ వ్యక్తికి కూడా కరోనా సోకింది. దాంతో ఆదివారం విశాఖలో ముగ్గురు వ్యాధి బారిన పడినట్టయింది. జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 66కు చేరింది. 23 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొబ్బరితోట ప్రాంతంలో ఇప్పటి వరకు కరోనా వ్యాధి బారినపడిన వారు ఎవరూ లేరు. ఈ కారణంగా కొబ్బరితోట రోడ్లు, వీధులు నిర్మానుష్యంగా మారాయి. మనోరమా థియేటర్ వద్ద, కొబ్బరితోటలోని అన్ని వీధుల మొదట్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. 32,33, 34 వార్డులలో రహదారులు మూసివేశారు. టూటౌన్లో అలజడి మహారాణిపేట పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న హోంగార్డుకు కరోనా పాజిటివ్ రావడంతో సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. బాధితురాలు పదిరోజులుగా కొబ్బరితోటలో ఉంటున్నారు. ఈనెల 6న దండుబజారు ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు కరోనా టెస్టులు చేయడంతో ఆమె కూడా పరీక్ష చేయించుకున్నారు. రిపోర్టులలో ఆమెకు పాజిటివ్ రావడంతో పోలీసులు కలవరపడుతున్నారు. బాధితురాలిని గీతం ఆస్పత్రికి, ఆమె తండ్రి, సోదరిలను క్వారంటైన్‌కు పంపారు. -
మహిళా కానిస్టేబుల్‌కు కరోనా లక్షణాలు?
కర్ణాటక,బనశంకరి: సిలికాన్‌సిటీలో ఓ పోలీస్‌స్టేషన్ విధులు నిర్వహించే మహిళా కానిస్టేబుల్‌కు కరోనా వైరస్ సోకిందనే అనుమానంతో నగరంలోని రాజీవ్‌గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈమెతోపాటు మరో నలుగురు మహిళా కానిస్టేబుళ్లు ఒకే గదిలో నివాసం ఉంటున్నారు. ఓ కానిస్టేబుల్ మూడురోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో ఆదివారం స్థానిక ఆసుపత్రికి చికిత్సకోసం వెళ్లగా కరోనా వైరస్ సోకిందనే అనుమానం వ్యక్తమైన నేపథ్యంలో రాజీవ్‌గాంధీ ఆస్పత్రికి తరలించారు. -
మహిళా కానిస్టేబుల్‌కు 'గూగుల్ పే'లో మోసం
సాక్షి, సిటీబ్యూరో: నగరానికి చెందిన ఓ మహిళా కానిస్టేబుల్ సైబర్ నేరగాళ్ళకు టార్గెట్‌గా మారారు. ఆమె తన వివాహం కోసం దాచుకున్న డబ్బును కాజేశాడు. శుక్రవారం వివాహ ముహూర్తం కావడంతో బుధవారం నగదు డ్రా చేసుకోవడానికి బ్యాంకుకు వెళ్ళడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో బాధితురాలు గురువారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేసింది. యూసుఫ్‌గూడ ప్రాంతంలో నివసించే ఓ యువతి పోలీసు కానిస్టేబుల్‌గా పని చేస్తోంది. ఈమెకు ఆంధ్రా బ్యాంక్‌తో పాటు బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనూ ఖాతాలు ఉన్నాయి. తన గూగుల్ పే ఖాతాను ఆంధ్రా బ్యాంక్‌లో ఉన్న అకౌంట్‌తో లింకు చేసుకున్నారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్‌ను తన గూగుల్ పేలో బెనిఫిషియరీగా జత చేసుకున్నారు. అవసరమైన సందర్భాల్లో తన గూగుల్ పే ద్వారా ఆంధ్రా బ్యాంక్‌లో ఉన్న నగదును బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాలోకి మార్చుకునే వారు. ఇలానే గత నెలలో రూ.10 వేలు, మంగళవారం రెండు దఫాల్లో రూ.80 వేలు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాలోకి బదిలీ చేశారు. ఆమె తన వివాహం కోసం పొదుపు చేసుకుంటూ వచ్చారు. శుక్రవారం వివాహ ముహూర్తం కావడంతో బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాలోకి బదిలీ చేసిన రూ.90 వేలు డ్రా చేసుకోవాలని భావించారు. దీంతో బుధవారం ఆ బ్యాంకును సంప్రదించగా అందులో నగదు లేనట్లు తెలిసింది. తన గూగుల్ పేలో బెనిఫిషియరీగా యాడ్ చేసుకున్న ఖాతాకు పంపిన నగదు మాయం కావడంతో ఆమె మోసపోయానని భావించారు. గురువారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ బి.మధుసూదన్ దర్యాప్తు చేపట్టారు. ఇందులులో భాగంగా సదరు మహిళ కానిస్టేబుల్ గూగుల్ పేలో బెనిఫిషియరీగా యాడ్ అయిన ఖాతా వివరాలు లోతుగా పరిశీలించగా... అది ఎస్బీఐకి చెందినదిగా తేలింది. గుర్తుతెలియని దుండగులు ఆమె పేరుతోనే డిస్ప్లే నేమ్ సృష్టించి, దీన్ని బెనిఫిషియరీగా ఆమె గూగుల్ ఖాతాలో యాడ్ చేశారు. అప్పటికే యాడ్ అయి ఉన్న బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాను డిలీట్ చేశారు. డిస్ప్లే నేమ్‌గా ఆమె పేరే, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాకు పెట్టుకున్నట్లే కనిపిస్తుండటంతో బాధితురాలికి అనుమానించలేదు. దీంతో రూ.90 వేలు బదిలీ చేసి మోసపోయారు. ప్రాథమికంగా సేకరించిన అనుమానిత ఖాతా స్టేట్మెంట్లో డబ్బు పోయిన ఖాతా డమ్మీ అకౌంట్ అంటూ ఉందని పోలీసులు చెప్తున్నారు. ఇది ఉత్తరాదికి చెందిన సైబర్ నేరగాళ్ళ పనా? లేక బాధితురాలికి పరిచయస్తులే చేసిన నేరమా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. లాటరీ పేరుతో పాతబస్తీ మహిళకు... నగరంలోని పాతబస్తీ మహిళకు ఫోన్ ద్వారా ఎర వేసిన సైబర్ నేరగాళ్ళు లాటరీ తగిలిందంటూ టోకరా వేశారు. రూ.కోటి వచ్చిందంటూ చెప్పి రూ.5 లక్షలు కాజేశారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సదరు మహిళకు ఇటీవల గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. రూ.కోటి లాటరీ తగిలిందని చెప్పిన దుండగులు ఆ మొత్తం సొంతం చేసుకోవడానికి కొన్ని ట్యాక్స్‌లు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. ఆపై వివిధ పేర్లు చెప్పి దఫదఫాలుగా రూ.5 లక్షలు తమ బ్యాంకు ఖాతాల్లో వేయించుకున్నారు. అంతటితో ఆగకుండా మరికొంత డబ్బు చెల్లించాలంటూ వాళ్ళు ఒత్తిడి చేస్తుండటంతో అనుమానించిన బాధితురాలు గురువారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. -
మానవత్వం.. మాతృత్వం
అసెంబ్లీ ఎదురుగా ట్రాఫిక్ కంట్రోల్ రూం వద్ద ట్రాఫిక్ క్రేన్ వర్కర్‌ను ఓ ద్విచక్రవాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో అతను తీవ్రంగా గాయపడటంతో స్థానిక పోలీసులు అతనికి సపర్యలు చేసి 108కు ఫోన్ చేశారు. ఎంతసేపటికీ అంబులెన్స్ రాకపోవడంతో అదే క్రేన్‌లోనే ఇలా బల్లపై ఉంచి ఆస్పత్రికి తరలించారు. మాతృత్వం ఉపాధ్యాయుల చలో అసెంబ్లీ కార్యక్రమం ఉండటంతో శుక్రవారం ఆ ప్రాంతంలో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. విధి నిర్వహణలో భాగంగా ఓ కానిస్టేబుల్ తన కూతురిని తీసుకొని విధుల్లో పాల్గొంది. -
మహిళా కానిస్టేబుల్ హల్చల్
నర్సంపేట రూరల్: ఓ మామతో కోడలు ఆస్థి విషయంలో మాట్లాడేందుకు మామ అద్దె ఇంటికి రాగా వ్యభిచారం చేయడానికి వచ్చారా అంటూ పక్కనే ఆఫ్ డ్యూటీలో ఉన్న ఓ మహిళా కానిస్టేబుల్ వెంబడించి చితకబాదిన సంఘటన నర్సంపేట పట్టణంలో సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నర్సంపేట డివిజన్లోని చెన్నారావుపేటకు మండలంలోని ఓ తండాకు చెందిన మామ నర్సంపేట పట్టణంలోని ఎన్జీవోస్ కాలనీలో ఇల్లు కిరాయికి తీసుకుని ఉంటున్నాడు. కాగా నర్సంపేట పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో ఇంటి నిర్మాణం చేపడుతున్నారు. కోడలు తన భూమి విషయంలో అద్దెకు ఉంటున్న తన మామ ఇంటి వద్దకు వచ్చి అరుగుమీద కూర్చొని భూమి పంపకాల విషయంలో చర్చించుకుంటున్నారు. అయితే అదే క్రమంలో పక్కనే మహిళా కానిస్టేబుల్ వ్యభిచారం చేయడానికి వచ్చారా అని నిలదీసింది. దీంతో అక్రమ సంబంధం ఎలా అంటకడుతావే అని కానిస్టేబుల్‌పై మామ, కోడలు ఆగ్రహం వ్యక్తం చేసి, డ్యూటీ ఎలా చేస్తావో చూస్తానంటూ ద్విచక్రవాహనం వస్తుండగా విన్న కానిస్టేబుల్, ఆయన భర్త కలిసి వారిని మరో ద్విచక్రవాహనంపై వెంబడించారు. నర్సంపేట పట్టణంలోని ఐసీఐసీఐ బ్యాంకు వద్దకు రాగానే వాహనాన్ని ట్రాప్ చేసి ఆపి మామ, కోడలును తీవ్రంగా కొట్టారు. ఇదంతా తతంగం అరగంట సేపు జరిగినప్పటికీ ఎవరూ ఆపకపోవడంతో ఇరువైపులా ట్రాఫిక్ జామయింది. అనంతరం ఇరువర్గాలు స్థానిక స్టేషన్‌కు చేరుకుని ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఈ ఘటన జరుగుతున్న క్రమంలో ఎంత పోలీసులైనా మాత్రం నడిరోడ్డుపై ప్రజలకు రౌడీలుగా కొడుతారా అని.. ఇదేనా ప్రెండ్లీ పోలీసింగ్ అంటే అంటూ పలువురు బహిరంగానే విమర్శిస్తున్నారు. దీనిపై స్థానిక ఎస్సై నవీన్‌కుమార్‌ను వివరణ కోరగా విచారణ చేపడుతున్నామన్నారు. -
పచ్చ మీడియా దుశ్చర్య!
తుళ్లూరురూల్ (తాడికొండ): అమరావతి ప్రాంతంలో బందోబస్తు విధులు నిర్వర్తిస్తున్న పోలీసులను బెదిరించి అక్కడి నుంచి పంపించేందుకు కొందరు ఆందోళనకారులు.. పచ్చ మీడియా సాయంతో వికృత చేష్టలకు తెరతీశారు. దుస్తులు మార్చుకుంటున్న ఓ ట్రైనీ కానిస్టేబుల్‌ను కెమెరాలతో చిత్రీకరించారు. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లా మందడంలోని జెడ్పీ హైస్కూల్లో బుధవారం చోటు చేసుకుంది. అసెంబ్లీ బందోబస్తు విధులు నిర్వర్తించేందుకు ఒంగోలు పీటీసీ నుంచి సుమారు 370 మంది వరకు ట్రైనీ మహిళా కానిస్టేబుళ్లు విధులకు వచ్చారు. వారికి మందడంలోని జెడ్పీ హైస్కూల్లోని ఖాళీ తరగతి గదుల్లో వసతి కల్పించారు. ఈ క్రమంలో వారిని బెదిరించి అక్కడి నుంచి పంపించేందుకు కొందరు ఆందోళనకారులు ప్రయత్నించారు. పచ్చ మీడియాను వెంటబెట్టుకుని వసతి గదుల వద్దకు చేరుకుని అక్కడ గదిలో దుస్తులు మార్చుకుంటున్న ఓ మహిళా ట్రైనీ కానిస్టేబుల్‌ను వీడియో తీశారు. ఆ మహిళా కానిస్టేబుల్.. భయంతో విద్యార్థులు కూర్చునే బెంచీల చాటున తలదాచుకున్నారు. వసతి ఇన్చార్జి అధికారి వారిని నిలదీశారు. దీంతో వారు పాత్రికేయులమంటూ.. బాధితురాలికి క్షమాపణ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ వెంటనే బాధిత మహిళా కానిస్టేబుల్ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి.. తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తుళ్లూరు పోలీసులు కేసులు నమోదుచేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం: సమాజాన్ని చైతన్య పరచాల్సినవారు.. మహిళలతో అనుచితంగా వ్యవహరించడం బాధాకరమని సీఐడీ అడిషనల్ ఎస్పీ సరిత, విశాఖ డీఎస్పీ ప్రేమ్‌కాజల్, తెనాలి డీఎస్పీ శ్రీలక్ష్మి అన్నారు. ఈ ఘటనపై వారు మీడియాతో మాట్లాడుతూ నిందితులపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. -
బరితెగించిన పచ్చమీడియా..
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజధానిపై ఇప్పటికే దుష్ప్రచారం చేస్తున్న పచ్చ మీడియా సంస్థలు మరో సిగ్గుమాలిన చర్యలకు ఒడిగట్టాయి. బరితెగించిన పచ్చ మీడియా చానళ్లు.. మహిళా పోలీసు కానిస్టేబుల్‌పై అసభ్యకరంగా వ్యవహరించాయి. మందడం హైస్కూల్లో మహిళా కానిస్టేబుల్ దుస్తులు మార్చుకుంటుండగా కనీస మర్యాద పాటించడకుండా వీడియో ద్వారా చిత్రీకరించారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో విధుల నిమిత్తం మందడంకు వచ్చిన కానిస్టేబుల్ డ్యూటీ అనంతరం హైస్కూల్లో వారికి కేటాయించిన గదిలోకి వెళ్లారు. దుస్తులు మార్చకుంటుండగా కొన్ని చానళ్ల సిబ్బంది గది కిటికీల నుంచి రహస్యంగా వీడియో రికార్డు చేశారని ఆ కానిస్టేబుల్ ఆరోపించారు. పాఠశాలలో ఖాళీగా ఉన్న రూములను తమకు కేటాయించారని, తమ అనుమతి లేకుండా రూమ్‌లోకి చొరబడి అసభ్యకరంగా వీడియోలు తీశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనకు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, దీనిపై ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేస్తానని ఆ పేర్కొన్నారు. కాగా ఈ ఘటనపై సంబంధిత పాఠశాల హెడ్ మాస్టార్ కోటేశ్వరరావు స్పందించారు. పాఠశాలలో ఖాళీగా ఉన్న గదులను మహిళా కానిస్టేబుల్స్‌కు కేటాయించామని, వారిపై ఇలాంటి చర్యలకు పాల్పడటం బాధాకరమని అన్నారు. -
ఆసక్తికర ప్రేమకథ
న్యూఢిల్లీ: సినిమాకు ఏమాత్రం తీసిపోని ప్రేమకథ ఇది. రౌడీకి, మహిళా కానిస్టేబుల్ మధ్య కోర్టు ప్రాంగణంలో చిగురించి ప్రేమ చివరకు పెళ్లితో సుఖాంతమైంది. ఈ ప్రేమ పెళ్లి గ్రేటర్ నోయిడాలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. 30 ఏళ్ల రాహుల్ థాస్రానా 2014, మే 8న వ్యాపారి మన్మోహన్ గోయల్ హత్య కేసులో అరెస్టయ్యాడు. అప్పటికే అతడిపై డజనుకుపైగా కేసులు ఉన్నాయి. కానిస్టేబుల్ గా పనిచేస్తున్న పాయల్‌తో రాహుల్‌కు సూరజ్‌పూర్ కోర్టులో పరిచయం ఏర్పడింది. విచారణ కోసం కోర్టుకు వచ్చినప్పుడల్లా వీరిద్దరూ కలుసుకునేవారు. జైలు నుంచి విడుదలైన వెంటనే వీరిద్దరూ పెళ్లిచేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. రాహుల్ నేరచరిత్ర నేపథ్యంలో భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉండాలన్న ఉద్దేశంతో రహస్య ప్రాంతంలో వీరు నివసిస్తున్నారు. పాయల్ మాత్రమే అప్పుడప్పుడు తన అత్తగారింటికి వచ్చి వెళుతోంది. పెళ్లైన తర్వాత రాహుల్ ఎవరికీ కనబడలేదు. పెళ్లి చేసుకునే నాటికి గౌతమ్‌బుద్ధ పీఎస్‌లో పాయల్ పనిచేస్తోంది. గ్యాంగ్‌స్టర్‌ను ఆమె పెళ్లి చేసుకున్న విషయం తమకు తెలియదని, నిజంగా అలా చేసినట్టు రుజువైతే చర్యలు తీసుకుంటామని రూరల్ ఎస్పీ రణ్విజయ్ సింగ్ తెలిపారు. ఆటో డ్రైవర్‌గా పనిచేసిన రాహుల్ డబ్బు, హోదాతో పాటు పాపులర్ కావాలన్న కోరికతో 2008లో అనిల్ దుజానా గ్యాంగ్‌లో చేరాడు. ‘గోయల్ కేసులో జైలు శిక్ష అనుభవించిన తర్వాత రాహుల్ గ్యాంగ్‌స్టర్‌గా మారిపోయాడు. 2016, మే నెలలో పంచాయతీ ఎన్నికల్లో తన తల్లికి ఓటు వేయకపోతే చంపేస్తానని గ్రామస్తులను బెదిరించడంతో అతడు తమ గమనంలోకి వచ్చాడ’ని రణ్విజయ్ సింగ్ వెల్లడించారు. ఈ ఏడాది మార్చిలో మాబుపురా ప్రాంతంలో నాటకీయ పరిణామాల నేపథ్యంలో అతడు బుల్లెట్ గాయాలకు గురయ్యాడు. -
మహిళా కానిస్టేబుల్ దారుణ హత్య
సదాశివపేట రూరల్ (సంగారెడ్డి)/రామచంద్రపురం: రాష్ట్ర రాజధాని శివారులో ఓ మహిళా కానిస్టేబుల్ దారుణ హత్యకు గురైంది. ఆమెతో సన్నిహితంగా మెలిగే మరో కానిస్టేబులే ఈ దారుణానికి ఒడిగట్టాడు. అను మానం, ఆర్థికపరమైన గొడవలతో ఏర్పడిన మనస్పర్థలే ఈ హత్యకు దారితీసినట్లు తెలుస్తోంది. సదాశివపేట సీఐ కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి బుధవారం తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట్ మండలంలోని మేకవనంపల్లి గ్రామానికి చెందిన మందరిక (32) సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రపురం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తోంది. ఆమెకు సంగారెడ్డి జిల్లాలోని హత్నూర పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేసే ప్రకాశ్‌తో పరిచయం ఉంది. అది కాస్తా ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. కొంతకాలం తర్వాత వారి మధ్య మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. మందరిక వేరే వ్యక్తితో చనువుగా ఉంటోం దని ప్రకాశ్ అనుమానం పెంచుకొని తరచూ ఆమె పనిచేసే పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి గొడవ పెట్టుకోవడంతో అతనిపై అదే స్టేష న్లో రెండు కేసులు కూడా నమోదయ్యాయి. ఈ క్రమంలో సోమవారం డ్యూటీకి వెళ్లిన మందరిక రాత్రి అయినా ఇంటికి చేరుకోకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు మంగళవారం రామచంద్రాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు... మొదట ప్రకాశ్‌ను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. అలాగే మృతదేహాన్ని తగలబెట్టానని పేర్కొన్నాడు. మొదట మందరికను తన కారులో ఎక్కించుకొని పటాన్చెరు శివార్లలో గొంతు నులిమి హత్య చేశాడు. ఆ తర్వాత సదాశివపేట మండల పరిధిలోని వెంకటాపూర్ శివారులోని ఓ పంట కాలువలో పెట్రోల్ పోసి మృతదేహాన్ని తగలబెట్టాడు. మృతదేహం చాలా భాగం వరకు కాలిపోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు సీఐ తెలిపారు. మృతదేహాన్ని తగలబెట్టిన ప్రదేశాన్ని జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డితోపాటు సైబరాబాద్ మియాపూర్ ఏసీపీ రవికుమార్ పరిశీలించారు. సిబ్బందిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కాగా, మందరికతోపాటు పనిచేసిన సిబ్బంది, మహిళా కానిస్టేబుళ్లు ఆమె మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. -
హత్య చేశా..దమ్ముంటే పట్టుకో
కర్ణాటక, కృష్ణరాజపురం: పోలీస్‌స్టేషన్‌లోని ల్యాండ్‌లైన్ ఫోన్‌కు కాల్ చేసి మహిళా కానిస్టేబుల్ ను వేధిస్తున్న వ్యక్తిని సోమవారం బాగలకుంటె పోలీసులు అరెస్ట్ చేశారు. ఉపాధి కోసం బెంగళూరుకు వచ్చిన రమేశ్ అనే వ్య క్తి చాలాకాలంగా బాగల్‌కుంటెలో ఉం టున్నాడు. మూడు నెలలుగా అక్కడి ల్యాండ్‌లైన్‌కు ఫోన్ చేయడం, ఫోన్ తీసిన మహిళా కానిస్టేబుల్‌తో అసభ్యంగా మాట్లాడడం పనిగా పెట్టుకున్నారు. హత్య చేశాను, వచ్చి అరెస్ట్ చేయం డి, అత్యాచారం చేశాను, దమ్మంటే పట్టుకోండి, ఒక్కోసారి నాకు సహక రించు..అని అతడు సైకో మాదిరిగా మహిళా పోలీస్‌ను సతాయిస్తున్నా డు.రోజురోజుకు వేధింపులు తీవ్రతరం కావడంతో పోలీసులు అతని ఫో న్ నంబర్, టవర్ లొకేషన్ ఆధారంగా రమేశ్‌ను గుర్తించి అరెస్ట్ చేశారు. -
‘అమ్మ’గా మారిన కానిస్టేబుల్
సాక్షి, సిటీబ్యూరో: పోలీసు దంపతులు మానవత్వాన్ని చాటుకున్నారు... ఒక గుర్తుతెలియని వ్యక్తి పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చిన చిన్నారికి విధి నిర్వహణలో ఉన్న పోలీసు కానిస్టేబుల్ భార్య (ఆమె కూడా కానిస్టేబుల్ )తల్లిపాలిచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసు కమిషనర్ అంజనీకుమార్ వారి బాబుకు ఓ బహుమతిని అందించారు. ఈ ఏడాది చివరి రోజు సిటీ పోలీస్ కమిషనరేట్‌లో ఈ అద్భుత ఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనపై సీపీ అంజనీకుమార్ సోమవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ‘మమ’కారం చాటారు.. ఆదివారం రాత్రి 9.30 గంటల సమయంలో ఉస్మానియా ఆసుపత్రిలో యాఖత్‌పురా వాసి ఇర్ఫాన్ వద్దకు మద్యం మత్తులో ఉన్న ఒక మహిళ వచ్చింది. కొద్దిసేపు పక్కనే నిలబడి.. తాను మంచినీళ్లు తీసుకొస్తానని, రెండు నెలల పాపను ఎత్తుకోమంటూ ఇర్ఫాన్‌కు అందించి కనిపించకుండా పోయింది. పాపను ఇచ్చిన తల్లి తిరిగి వెనక్కి రాకపోవడంతో ఏమి చేయాలో తోయని ఇర్ఫాన్ కుటుంబ సభ్యులతో కలిసి రాత్రి 11.30 గంటల ప్రాంతంలో అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి జరిగిన విషయం చెప్పారు. పాపను రాత్రి విధి నిర్వహణలో ఉన్న ఈ–కాప్స్ కానిస్టేబుల్ రవీందర్‌కు అప్పగించారు. ఆ పాప గుక్కపట్టి ఏడుస్తుంది. తన భార్య ప్రియాంక బేగంపేట్ మహిళా పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తూ ప్రసూతి సెలవులపై ఉంది. రవీందర్, తన చేతిలోని పాప విషయాన్ని భార్యకు వివరించాడు. పాప ఏడుపులను ఫోన్లో విన్న ప్రియాంక చలించిపోయి, వెంటనే క్యాబ్ తీసుకొని అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చింది. వచ్చిన వెంటనే ఆ పాపను హత్తుకొని, తల్లిపాలిచ్చింది. ఆకలితో ఉన్న పాప, తల్లిపాలు తాగిన తరువాత ఏడుపును ఆపి నిద్రపోయింది.అనంతరం పాపను పేట్లబురుజు ప్రసూతి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తల్లికి పాప అప్పగింత. .. పాపను పోలీస్‌స్టేషన్‌కు తెచ్చిన ఇర్ఫాన్ ఇచ్చిన సమాచారంతో సోమవారం ఉదయం వేళల్లో ఎఎస్సై ఎండీ తాహెరుద్దీన్ ఆధ్వర్యంలో పాప తల్లి కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో చంచల్‌గూడ ప్రాంతంలో ఒక మహిళ ఏడుస్తూ పోలీసుల కంట పడింది. పాప పోయిందంటూ ఆమె ఏడుస్తుండడంతో పోలీసులు ఆరా తీశారు. ఫలక్‌నుమాకు చెందిన షాబాన బేగం చిత్తుకాగితాలు ఏరుకుంటుందని, ఆమె భర్త ఫిరోజ్కాన్ పాత నేరస్థుడని ఇటీవల సెల్‌ఫోన్ దొంగతనం కేసులో అఫ్జల్‌గంజ్ పోలీసులు జైలుకు పంపించినట్లు విచారణలో తేలింది. కల్లు తాగేందుకు అలవాటు పడ్డ షాబానకు ఇద్దరు ఆడ పిల్లలకు ఒక పాప ఐదేండ్ల ఫాతిమా కాగా, మరో పాప రెండు నెలల పాప అని పోలీసులు నిర్ధారించారు. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లి పాపను ఆమెకు అందించారు. -
చంద్రబాబు నియోజకవర్గంలో దారుణం
- సీఐ లైంగిక వేధింపులు - మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం చిత్తూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజక వర్గంలో దారుణం చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా కుప్పం పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ లైంగిక వేధింపులు భరించలేక పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నిర్మల మంగళవారం ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. పురుగుల మందు తాగి అపస్మారకస్థితిలో ఉన్న నిర్మలను కుటుంబసభ్యులు తొలుత కుప్పం ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో ఆమెను చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎస్సై వేధింపులు తట్టుకోలేక..
గజపతినగరం రూరల్/దత్తిరాజేరు : దత్తిరాజేరు మండలం బూర్జివలస పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ బడ్నాన శశి గురువారం ఉదయం స్థానిక పోలీస్క్వార్టర్స్లో పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే కుటుంబ సభ్యులు గుర్తించి గజపతినగరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఎస్సై రమేష్‌నాయుడు వేధింపుల వల్లే తన భార్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని మహిళా కానిస్టేబుల్ భర్త శశిభూషణరావుతో పాటు బంధువులు ఆరోపించారు. లేనిపోని పనులు అప్పగిస్తూ ఎస్సై తనను వేధిస్తున్నాడని బాధితురాలు తెలిపింది. ఏడు నెలల గర్భిణిగా ఉన్నప్పుడు కూడా సమయపాలన లేని విధులు వేసేవారని వాపోయింది. ఈ విషయమై సీఐ లీలారావు వద్ద ప్రస్తావించగా, ఎస్సై వేధించినట్లు తన వద్ద సమాచారం లేదన్నారు. ఏదిఏమైనా విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇదిలా ఉంటే ఆస్పత్రి వద్దకు గిరిజన సంఘాల నాయకులు చేరుకుని ఎస్సైపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
అబిడ్స్ సీఐపై మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు
హైదరాబాద్: అబిడ్స్ సీఐ వేధింపులకు పాల్పడుతున్నారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు చేశారు. డ్యూటి విషయంలో తనను వేధింపులకు గురి చేస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. మహిళా కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరపాలంటూ ఉన్నతాధికారులకు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే తాను ఎలాంటి వేధింపులకు పాల్పడలేదని సీఐ వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది. -
పోలీసుశాఖలో.. 610 కిరికిరి
జిల్లా పోలీసుశాఖలో పనిచేస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు మెదక్ జిల్లాలో చదివారు.. స్టడీ సర్టిఫికెట్ ప్రకారం చూస్తే ఆమె మెదక్ జిల్లావాసురాలు అవుతుంది. కానీ, పుట్టి పెరిగింది, తల్లిదండ్రులు నివాసం, ఉద్యోగ రిక్రూట్మెంట్ అన్నీ నల్లగొండలోనే. మరి ఆమెను స్థానికురాలు అనాలా..? స్థానికేతరరాలు అనాలా..? ఇప్పుడు జిల్లా పోలీసుశాఖలో ఇదే అయోమయం నెలకొంది.. !! పోలీసుశాఖలో 610 జీఓ సాక్షిగా కిరికిరి నడుస్తోంది. జిల్లాకు చెందినవారే అయినా, రిక్రూట్మెంట్ ఇక్కడే జరిగినా ‘స్థానికత’ విషయంలో సాంకేతికంగా ఇతర జిల్లాకు చెందిన వారవుతున్నారు. మొత్తంగా జిల్లాలో 610 జీఓ నిబంధనల మేరకు గుర్తించిన వారిలో 46మంది స్థానికేతరులుగా తేలారు. కాగా, వీరిలో 15మంది నిజంగానే ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారు కావడంతో, వీరి విషయంలో ఎలాంటి వివాదమూ లేదు. కానీ, మిగిలిన 31మందిది సొంత జిల్లా నల్లగొండ. కానీ, స్థానికత మాత్రం ఇతర జిల్లాకు చెందినవారిగా చూపెడుతోంది. దీనికి కారణం లేకపోలేదు. పదో తరగతి పూర్తయ్యేలోపు వరుసగా నాలుగేళ్లు ఎక్కడ చదివితే అదే స్థానిక ప్రాంతం అవుతుందన్న నిబంధన ఇప్పుడు సమస్యగా మారింది. స్టడీ సర్టిఫికెట్ ప్రకారం 31మంది పోలీసు ఉద్యోగులు నాన్ లోకల్ అవుతున్నారు. కాబట్టి, 610 జీఓ నిబంధనల మేరకు వారు ఇక్కడినుంచి బయటకు వెళ్లిపోవాల్సి వస్తోంది. దీంతో సొంత జిల్లాను వదిలి, వేరే జిల్లాకు ఎలా వెళతాం అంటూ ఆవేదన చెందుతున్నారు. కేవలం స్టడీ సర్టిఫికెట్‌ను మాత్రమే పరిగణలోకి తీసుకుంటే ఎలా..? ‘పేరెంట్ రెసిడెన్షియల్ అడ్రస్’ను పరిగణనలోకి తీసుకుని తమకు న్యాయం చేయాలన్నది వీరి డిమాండ్. ప్రభుత్వం దృష్టికి సమస్య.. ఇప్పటికే ఈ అయోమయం గురించి ప్రభుత్వం దృష్టికి కొందరు తీసుకెళ్లారు. రాష్ట్ర మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్‌లకు వినతిపత్రాలు కూడా ఇచ్చారు. ఈ సమస్య దాదాపు అన్ని జిల్లాల్లో ఉన్నందున ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుందన్న ఆశాభావంతో ఉన్నా, 610 జీఓను తక్షణం అమలు చేయడానికి అధికారులు నడుంబిగించడంతో ఈ 31మంది సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. తాము నల్లగొండ జిల్లాలో రిక్రూట్ అయినా, నాన్‌లోకల్ అన్న పేరున ఇతర జిల్లాకు పంపిస్తే, అక్కడి అధికారులు తమకు విధుల్లో చేర్చుకోకుంటే పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నారు. ‘610 జీఓ ఉద్దేశం తెలంగాణ ప్రాంతానికి చెందని వారిని బయటకు పంపడం. కానీ, తెలంగాణ రాష్ట్రం వారిని, తెలంగాణలోని మరో జిల్లాకు పంపడం ఏమిటి..? ఇదంతా కొందరు తమ పదోన్నతులు తేలిక కావడానికి, లిస్టులో పైకి ఎగబాకడానికి సృష్టిస్తున్న వివాదం. ప్రభుత్వం ఏదో ఒక క్లారిటీ ఇచ్చేదాకా మరో 2 నెలలు ఆగితే సరిపోతుంది కదా..’ అని ఓ ఉద్యోగి వ్యాఖ్యానించారు. కాగా, ఇబ్బందికరంగా ఉన్న లోకల్, నాన్-లోకల్ వివాదం గురించి ఇప్పటికే ప్రభుత్వానికి వినతులు వెళ్లాయని చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించి ‘పోలీసు శాఖ ఉన్నతాధికారులు ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి గైడ్‌లైన్స్ రాలేదు. ఆందోళన చెందాల్సిన పనిలేదు. సమస్య పరిష్కారమవుతుంది..’ అని పోలీసు అధికారుల సంఘం నాయకులు పేర్కొన్నారు. ఈ వివాదానికి ఎప్పుడు తెరపడుతుందా అని సిబ్బంది ఆశగా ఎదురుచూస్తున్నారు. కాగా, జిల్లా పోలీసుశాఖకు చెందిన ఆంధ్రా ప్రాంత అధికారి కావాలనే ఈ విషయాన్ని వివాదాస్పదం చేస్తున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. -
ఖాకీ కీచకులు
న్యూఢిల్లీ: తనతోపాటు పనిచేసే మహిళా కానిస్టేబుల్‌కు నీలి చిత్రాలు చూపించడం, అశ్లీల పదజాలంతో ధూషించడం, లైంగికంగా వేధించడం వంటి నేరాలకు పాల్పడ్డ పోలీసులపై 62 కేసులు నమోదయ్యాయి. నిందితుల్లో ఏసీపీ స్థాయి అధికారులు కూడా ఉన్నట్టు వెల్లడయింది. 2003 నుంచి 2013 వరకు ఈ కేసులు నమోదయ్యాయి. ఎనిమిది కేసుల్లో నిందితులు విడుదల కాగా, మరో ఎనిమిది కేసుల్లో అభియోగాలు నిరూపితం కాలేదు. మరో కేసులో ఏసీపీ బలవంతంగా పదవీ విరమణ చేయాల్సి వచ్చింది. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద సమర్పించిన దరఖాస్తుకు ప్రతిగా ఢిల్లీ పోలీసు సెక్యూరిటీ విభాగం ఈ వివరాలను వెల్లడించింది. పోలీసులు తమను లైంగికంగా వేధించినట్టు గుర్తుతెలియని మహిళలు చేసిన ఫిర్యాదులపైనా విచారణలు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే 2003-2006 మధ్య నమోదైన కొన్ని కేసుల రికార్డులు తమ వద్ద అందుబాటులో లేవని సెక్యూరిటీ బ్రాంచ్ వివరణ ఇచ్చింది. కింగ్స్‌వే క్యాంప్‌లోని ఢిల్లీ సాయుధ పోలీసు విభాగం కార్యాలయంలో పనిచేసే ఏసీపీపై 2009లో లైంగిక వేధింపుల కేసు నమోదయింది. దీనిపై విచారణ నిర్వహించిన కేంద్ర హోంశాఖ అధికారులు సదరు ఏసీపీ తప్పు చేసినట్టు నిర్ధారించారు. దీంతో పదవీ విరమణ చేయాల్సిందిగా అతణ్ని ఆదేశిస్తూ గత ఏడాది జనవరి 21న ఉత్తర్వులు జారీ అయ్యాయి. సహోద్యోగి తరచూ నీలిచిత్రాలు చూపిస్తూ బూతులు తిడుతున్నాడంటూ మహిళా కానిస్టేబుల్ గత ఏడాది పోలీసు కంట్రోల్ రూమ్ (పీసీఆర్)కు ఫిర్యాదు చేసింది. దీనిపై ఉన్నతాధికారులు శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. ఉన్నతాధికారులు తమపై దురుసుగా ప్రవర్తించడమేగాక, లైంగికంగానూ వేధిస్తున్నారంటూ గుర్తుతెలియని మహిళా పోలీసు ఉద్యోగులు కొందరు పీసీఆర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ కేసుల విచారణ ఇంకా పూర్తి కాలేదని పోలీసుశాఖ తెలిపింది. పశ్చిమజిల్లాలో అత్యధికంగా 13, వాయవ్య జిల్లాలో 12 లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి. అయితే వీరిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఆర్టీఐ చట్టం 81 (జె) సెక్షన్ ప్రకారం సదరు సమాచారం ఇవ్వడం సాధ్యం కాదని పోలీసుశాఖ వివరణ ఇచ్చింది. వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతుందని భావించిన సందర్భంలో సమాచారం ఇవ్వకుండా నిలిపి వేసే అధికారం ఈ చట్టం ప్రకారం సంస్థలకు ఉంటుంది.