ఎస్సై వేధింపులు తట్టుకోలేక.. | women constable commits suicide | Sakshi
Sakshi News home page

ఎస్సై వేధింపులు తట్టుకోలేక..

Apr 14 2017 11:11 AM | Updated on Nov 6 2018 7:53 PM

ఎస్సై వేధింపులు తట్టుకోలేక.. - Sakshi

ఎస్సై వేధింపులు తట్టుకోలేక..

మహిళా కానిస్టేబుల్‌ బడ్నాన శశి గురువారం ఉదయం స్థానిక పోలీస్‌క్వార్టర్స్‌లో పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

గజపతినగరం రూరల్‌/దత్తిరాజేరు : దత్తిరాజేరు మండలం బూర్జివలస పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్‌ బడ్నాన శశి గురువారం ఉదయం స్థానిక పోలీస్‌క్వార్టర్స్‌లో పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే కుటుంబ సభ్యులు గుర్తించి గజపతినగరంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ఎస్సై రమేష్‌నాయుడు వేధింపుల వల్లే తన భార్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని మహిళా కానిస్టేబుల్‌ భర్త శశిభూషణరావుతో పాటు బంధువులు ఆరోపించారు.

లేనిపోని పనులు అప్పగిస్తూ ఎస్సై తనను వేధిస్తున్నాడని బాధితురాలు తెలిపింది. ఏడు నెలల గర్భిణిగా ఉన్నప్పుడు కూడా సమయపాలన లేని విధులు వేసేవారని వాపోయింది. ఈ విషయమై సీఐ లీలారావు వద్ద ప్రస్తావించగా, ఎస్సై వేధించినట్లు తన వద్ద సమాచారం లేదన్నారు. ఏదిఏమైనా విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇదిలా ఉంటే ఆస్పత్రి వద్దకు గిరిజన సంఘాల నాయకులు చేరుకుని ఎస్సైపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement