మహబూబాబాద్‌లో విషాదం: ఉరేసుకొని ఏఆర్‌ ఎస్సై ఆత్మహత్య | AR SI Commits Suicide mahabubabad Gangaram mandal | Sakshi
Sakshi News home page

మహబూబాబాద్‌లో విషాదం: ఉరి వేసుకొని ఏఆర్‌ ఎస్సై ఆత్మహత్య

Published Tue, Sep 19 2023 9:16 PM | Last Updated on Tue, Sep 19 2023 9:30 PM

AR SI Commits Suicide mahabubabad Gangaram mandal - Sakshi

సాక్షి, మహబూబాబాద్‌: మహబూబాబాద్‌ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గంగారం మండలం బావురుగొండలో ఏఆర్‌ ఎస్సై పడిగ శోభన్‌బాబు ఆత్మహత్య చేసుకున్నారు. వ్యవసాయ పొలం వద్ద ఉరివేసుకొని ప్రాణాలు విడిచారు

కాగా శోభన్‌బాబు సత్తుపల్లి బెటాలియన్‌లో ఏఆర్‌ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నారు. మెడికల్‌ లీవ్‌లో సోమవారం ఇంటికి వచ్చిన శోభన్‌బాబు.. పొలం వద్ద ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. అనారోగ్య సమస్యలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు వెల్లడించారు.  మృతుడి భార్య రజిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: కేఎంసీలో ర్యాగింగ్‌.. ఏడుగురిపై కఠిన చర్యలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement