gangaram
-
మహబూబాబాద్‌లో విషాదం: ఉరేసుకొని ఏఆర్ ఎస్సై ఆత్మహత్య
సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గంగారం మండలం బావురుగొండలో ఏఆర్ ఎస్సై పడిగ శోభన్‌బాబు ఆత్మహత్య చేసుకున్నారు. వ్యవసాయ పొలం వద్ద ఉరివేసుకొని ప్రాణాలు విడిచారు కాగా శోభన్‌బాబు సత్తుపల్లి బెటాలియన్‌లో ఏఆర్ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నారు. మెడికల్ లీవ్‌లో సోమవారం ఇంటికి వచ్చిన శోభన్‌బాబు.. పొలం వద్ద ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. అనారోగ్య సమస్యలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు వెల్లడించారు. మృతుడి భార్య రజిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: కేఎంసీలో ర్యాగింగ్.. ఏడుగురిపై కఠిన చర్యలు -
గంగారాం మఠం పిటిషన్ కొట్టివేసిన ఐడీటీ కోర్టు
సాక్షి, తిరుపతి: గంగారాం మఠం పిటిషన్‌ను ఐడీటీ కోర్డు సోమవారం కొట్టివేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కి అనుకూలంగా తీర్పు వెల్లడించింది. 1998 నుంచి జరుగుతున్న కేసులో తుది తీర్పు వెల్లడించింది. టైటిట్ డిడ్ ప్రకారం ఎస్వీ, వేదిక్, వెటర్నరీ యూనివర్సిటీ, పద్మావతి గెస్ట్‌హౌస్‌తో సహా ఆస్తులు టీటీడీ ఆధీనంలో ఉండనున్నాయి. -
ఏ పార్టీకి మద్దతిచ్చేది 4న నిర్ణయిస్తాం: చెన్నయ్య
హైదరాబాద్: రానున్న ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతిచ్చేది నవంబర్ 4న నిర్ణయిస్తామని మాల మహా నాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య తెలిపారు. మాల ల మనోభావాలకు దగ్గరగా ఉండే పార్టీకే మద్దతిస్తామని చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు గంగారాం అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. నవంబర్ 4న మింట్ కాంపౌండ్‌లో మాల మహా నాడు కమిటీ సమావేశమై మద్దతుపై నిర్ణయం తీసుకుంటుందని చెన్నయ్య చెప్పారు. -
ఆధార్‌తో ఫింగర్ ప్రింట్ బ్యూరో సమన్వయం
సాక్షి, హైదరాబాద్ : ఫింగర్ ప్రింట్ బ్యూరోతో ఆధార్ వ్యవస్థను సమన్వయం చేసేలా కసరత్తు చేయనున్నట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగారాం అహిర్ వెల్లడించారు. తద్వారా నేరస్తుల గుర్తింపు సులభతరం అవుతుందని చెప్పారు. వేలిముద్రల సేకరణలో చట్టపర సమస్యలను అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నామని, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రిజనర్స్ యాక్ట్‌ను సవరించేందుకు ఉన్నత స్థాయిలో చర్చిస్తామన్నారు. ఫింగర్ పింట్ బ్యూరో 19వ జాతీయ స్థాయి సమావేశాలు గురువారం హైదరాబాద్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి్ద సంస్థలో ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాల్లో తొలిరోజు కార్యక్రమానికి హాజరైన హన్స్‌రాజ్ మాట్లాడుతూ.. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రతి ఒక్కరి వేలిముద్రలు డేటాబేస్‌లో ఉంటున్నాయని, కానీ మన దేశంలో నేరస్తులకు సంబంధించి 11.50 లక్షల మంది వేలిముద్రలే డేటాబేస్‌లో ఉన్నాయన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న నేరాల్లో 80% కొత్త వ్యక్తులు చేస్తున్నవేనన్నారు. నేరాలు, శిక్ష శాతాల్లో ఉత్తర, దక్షిణ రాష్ట్రాల మధ్య భారీ వ్యత్యాసం ఉంటోందన్న మంత్రి.. అన్ని రాష్ట్రాల డీజీపీలతో ఏటా ప్రధాని మోదీ సమావేశం నిర్వహిస్తున్నారని తెలిపారు. స్మార్ట్ పోలీసింగ్‌లో తెలంగాణ పోలీస్ శాఖ దూసుకెళ్తోందని హాన్స్‌రాజ్ ప్రశంసించారు. టెక్నాలజీ వినియోగంలో దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ పోలీస్ శాఖ ‘ది బెస్ట్’గా ఉందని కొనియాడారు. ‘కంపెన్డియం ఆఫ్ ఫింగర్ ప్రింట్ ఎక్విప్మెంట్’ పుస్తకాన్ని మంత్రి ఆవిష్కరించారు. అన్ని ఠాణాలకు డేటా: ఎన్సీఆర్బీ డీజీ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోలోని ఫింగర్ ప్రింట్ విభాగం వద్ద ఉన్న వేలిముద్రల డేటాను దేశంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు అనుసంధానం చేస్తామని ఎన్సీఆర్బీ డీజీ ఈష్‌కుమార్ వెల్లడించారు. అన్ని రాష్ట్రాల్లోని ఫింగర్ ప్రింట్ బ్యూరోల్లో తీవ్రమైన సిబ్బంది కొరత ఉందని.. 250 పోస్టులకుగాను 50 మంది సిబ్బందే పనిచేస్తున్నారని చెప్పారు. ఏటా నమోదవుతున్న కేసుల్లో ఒక శాతం మాత్రమే ఫింగర్ ప్రింట్ సిబ్బంది, అధికారులు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఫింగర్ ప్రింట్ బ్యూరోను సర్కిల్, సబ్ డివిజన్ వారీగా నియమిస్తే కేసులు పరిష్కారంతోపాటు నియంత్రణ కూడా పెరుగుతుందని వివరించారు. అతి తక్కువ సమయంలో.. : డీజీపీ తెలంగాణలో ఫింగర్ ప్రింట్ బ్యూరోను పటిష్టం చేశామని డీజీపీ మహేందర్‌రెడ్డి వెల్లడించారు. ఆటోమేషన్ ఆఫ్ ఫింగర్ ప్రింట్స్ ఐడెంటిఫికేషన్ విధానం (ఏఎఫ్ఐఎస్) ఇటీవలే ప్రారంభించామని, అతి తక్కువ కాలంలో మంచి ఫలితాలు సాధించామని తెలిపారు. ఏఎఫ్ఐఎస్ విధానాన్ని అమలుపరచడంతో 868 పాత కేసులు పరిష్కరించామని, ఇందులో 480 కేసులు పాత ఫింగర్ ప్రింట్స్ విధానంలో పరిష్కారం కాలేదని వివరించారు. కొత్త విధానంతో నిందితుల నుంచి రూ.7.2 కోట్ల విలువైన సొత్తు కాపాడగలిగామని చెప్పారు. ఫింగర్ ప్రింట్ మొబైల్ డివైజ్ ద్వారా 1.22 లక్షల మంది వేలిముద్రలను సేకరించి డేటాబేస్‌లో అందుబాటులోకి తీసుకొచ్చామని, ఇందులో 7,273 మంది పాత నేరస్తులను గుర్తించినట్లు వెల్లడించారు. సదస్సులో ఎన్సీఆర్బీ జాయింట్ డైరెక్టర్ సంజయ్ మాథుర్, సీఐడీ అదనపు డీజీపీ గోవింద్‌సింగ్, రాష్ట్ర ఐపీఎస్‌లు, సీఐడీ అధికారులు పాల్గొన్నారు. -
గనుల కుంభకోణంలోఐఏఎస్ అధికారి అరెస్టు
బెంగళూరు: అక్రమ గనుల తవ్వకాలకు సంబంధించి కర్ణాటక రెవెన్యూ శాఖ కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి గంగారామ్ బడేరియా అరెస్టు అయ్యారు. విచారణ కోసం ఆయన్ను సోమవారం పిలిపించిన కర్ణాటక ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సాయంత్రానికి అరెస్టు చేసినట్లు ప్రకటించింది. కాగా, ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రులు కుమారస్వామి, ధరంసింగ్లు నిందితులుగా ఉన్నారు. బళ్లారి జిల్లాలో 11,797 చదరపు కిలోమీరట్ల మేర అటవీ భూమిని నిబంధనలకు విరుద్ధంగా డీ నోటిఫై చేయడమే కాకుండా అక్కడ గనుల తవ్వకాలకు, ఎగుమతులకు అనుమతిచ్చారన్నది ప్రధాన ఆరోపణ. ఈ విషయమై లోకాయుక్త జస్టిస్ సంతోష్‌హెగ్డే గతంలోనే ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఇందులో సీనియర్ ఐఏఎస్ అధికారులైన వి.ఉమేష్, గంగారామ్ బడేరియా, ఎం.రామప్ప, జీజా హరిసింగ్ వంటి 11 మంది అధికారులు విధులను దుర్వినియోగం చేశారని పేర్కొన్నారు. ఈ డీ నోటిఫైలో సీఎంలుగా పనిచేసిన కుమారస్వామి, ధరంసింగ్, ఎస్.ఎం కృష్ణల హస్తం కూడా ఉన్నట్లు హెగ్డే నివేదికలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే అబ్రహం జోసెఫ్ అనే సామాజిక కార్యకర్త గనుల అక్రమాలపై దర్యాప్తు జరపాలని గతంలో సుప్రీం కోర్టుకు వెళ్లారు. పరిశీలించిన కోర్టు డీ నోటిఫైతో పాటు గనులపై మూడునెలల్లోపు విచారణ పూర్తి చేయాలని మార్చి 29న సిట్‌ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో సోమవారం తాజా అరెస్టు చోటుచేసుకుంది. అప్పట్లో మైసూరు మినరల్స్ డైరెక్టర్‌గా ఉన్న గంగారామ్ 14,200 మెట్రిక్ టన్నుల ఇనుప ఖనిజం ఎగుమతికి అక్రమంగా అనుమతులు ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. -
నిజామాబాద్ మార్కెట్ యార్డులో విషాదం
నిజామాబాద్: నిజామాబాద్ మార్కెట్ యార్డులో బుధవారం ఉదయం విషాదం చోటచేసుకుంది. చిన్న గంగారామ్ అనే పసుపు రైతు గుండెపోటుతో మృతిచెందాడు. మంగళవారం మార్కెట్ యార్డుకు పసుపు తెచ్చిన రైతు రాత్రి అక్కడే నిద్రపోయాడు. అయితే ఉదయం లేచిన కాసేపటికే గంగారామ్ గుండెపోటు రావడంతో మార్కెట్ యార్డులోనే కుప్పకూలిపోయాడు. గమనించిన తోటి రైతులు గంగారామ్‌ను కాపాడే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయింది. కొద్ది సమయంలోనే అతడు మృతిచెందాడని తోటి రైతులు చెబుతున్నారు. మృతిచెందిన రైతు జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం ఎద్దండి గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
వీడిన 26 ఏళ్ల అజ్ఞాతం!
సాక్షి చొరవతో స్వగ్రామానికి చేరుకున్న గల్ఫ్ బాధితుడు కోరుట్ల/కోరుట్ల రూరల్: పొట్ట చేతపట్టుకొని గల్ఫ్ వెళ్లాడు.. ఉత్తి చేతులతో ఇంటికి తిరిగి రావడానికి మనసొప్పక.. ఇంటికి సమాచారం ఇవ్వకుండా అక్కడే అష్టకష్టాలు పడ్డాడు. చివరికి ‘సాక్షి’కథనం.. ఓ సోషల్ వర్కర్ చేయూతతో 26 ఏళ్ల తర్వాత గల్ఫ్ బాధితుడు శనివారం స్వగ్రామానికి చేరుకున్నాడు. చిన్న నాడు వదిలి వెళ్లిన పిల్లలు ఎదిగిన వైనాన్ని చూసి కన్నీళ్ల పర్యంతమయ్యాడు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం సంగెం గ్రామానికి చెందిన శనిగారం గంగారాంకు భార్య పెద్దు లు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. 1991 మేలో ఉపాధి కోసం దుబాయ్ వెళ్లి, అక్కడి అల్ అప్తూర్ కంపనీలో లేబర్ పనికి అగ్రిమెంట్‌తో 6 సంవత్సరాలుగా పనిచేశాడు. జీతం సరి పోవడం లేదని బయటి ఇండ్లల్లో పని చేసుకుంటే ఎక్కువ సంపాదించవచ్చనే ఉద్దేశం తో కల్లివిల్లి(కంపెనీ వదిలి బయట పని చేయడం) అయ్యాడు. అప్పటి నుండి అతడి ఆచూకీ లేక ఇంట్లో భార్య పెద్దులు, పిల్లలు ఆవేదన చెందేవారు. ఎక్కడ ఉన్నాడో..ఏం చేస్తున్నాడో తెలియక ఎడతెగని ఆందోళనలో కాలం గడిపారు. ఊర్లోకి దుబాయి నుంచి ఎవరు వచ్చినా తన భర్త ఆచూకీ కోసం పెద్దు లు ఆరా తీసేది. ఎవరు సరైన సమాధానం చెప్పకపోయే సరికి నిరాశతో కాలం గడిపింది. చివరికి భర్త గంగారాం దుబాయ్‌లో ఉండగానే ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్లు చేసింది. ఏడు నెలల క్రితం దుబాయ్ పోలీసులు గంగారాంను పట్టుకుని వీసా సరైన ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో జైల్లో ఉంచారు. సాక్షి చొరవ..సోషల్ వర్కర్ సాయం దుబాయ్జైలులో గంగారాం అనే వ్యక్తి ఉన్నా డనే సమాచారంతో మూడు నెలల క్రితం ‘సాక్షి’గంగారం కుటుంబ వ్యథను ప్రచురిం చింది. అంతటితో ఆగకుండా రెవెన్యూ అధికారులతో మాట్లాడి సంగెం గ్రామానికి చెందిన వాడేనని ధ్రువీకరణ పత్రం అందేలా సాయపడింది. ఈ క్రమంలో హైదరాబాద్‌కు చెందిన శశికళ అనే సోషల్‌వర్కర్ దుబాయి జైల్లో ఉన్న గంగారాంను చూసి వివరాలు అడిగి తెలుసుకుంది. తన వద్ద ఎలాంటి ఆధా రాలు లేవని చెప్పటంతో ఆమె వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి, ఆధారాలు తీసుకోమని చెప్పింది. ఈ క్రమంలో గ్రామ సర్పంచ్ కేర్తి రాజమణి, సింగిల్‌విండో చైర్మన్ చీటి వెంక ట్రావ్, కులపెద్ద శనిగారం రాజం సహకారం తో గంగారాంకు చెందిన ధృవీకరణ పత్రాలు దుబాయ్ ఎంబసీకి పంపించారు. ఈ పత్రా లను చూపిన శశికళ రెండు రోజుల క్రితం గంగారాంను ఇండియా విమానం ఎక్కించి పంపించారు. చివరికి శుక్రవారం గంగారాం తన స్వగ్రామమైన సంగెంకు చేరుకుని కుటుం బ సభ్యులకు కలుసుకుని కన్నీరుమున్నీర య్యాడు. ఇరవై ఆరేళ్ల తరువాత భర్త గంగా రాం ఇంటికి రావడంతో భార్య పెద్దులు ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. చాలా కష్టాలు పడ్డాను దుబాయ్‌లో చాలా కష్టాలు పడ్డాను. మొదట వెళ్లిన కంపెనీలో జీతం సరిపోక వేరే కంపెనీలు చాలా వాటిలో చేశాను. దుబాయ్ నుంచి డబ్బులతో తిరిగి వస్తాన ని నా కుటుంబసభ్యులు అనుకు న్నారు. ఉట్టిగనే తిరిగిరావడానికి నాకు మన సొప్పలేదు. అందుకే ఇంటి వాళ్లకు ఏమి చెప్పకుండా అక్కడే ఉండి ఏదో ఓ పని చేస్తూ గడిపాను. ఆరు నెలల క్రితం నా దగ్గర పాస్‌పోర్టు..వీసా కాగితాలు సరిగా లేక జైల్లో పడ్డాను. చివరికి శశికళ నన్ను చూసి ఇక్కడికి పంపించింది. చివరికి నేను కుటుంబ సభ్యులను కలుసుకోగలిగాను. –గంగారాం, సంగెం,కోరుట్ల -
ప్రేమించి.. పెళ్లి చేసుకుని..
ఐదు నెలలకే అనంతలోకాలకు.. చెరువులో దూకి దంపతుల ఆత్మహత్య ప్రాణాలు తీసిన క్షణికావేశం అమృతాపూర్‌లో విషాదం డిచ్పల్లి : ప్రేమించి పెళ్లి చేసుకొన్న ఐదు నెలలకే వారికి నూరేళ్లు నిండారుు. క్షణికావేశం ఆ దంపతుల ప్రాణాలు తీసింది. చిన్న గొడవ కారణంగా ఇద్దరు చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు.. ఈ విషాదకర సంఘటన డిచ్పల్లి మండలం అమృతాపూర్‌లో చోటు చేసుకుంది. సీఐ తిరుపతి, ఎస్సై కట్టా నరేందర్‌రెడ్డి, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ మాజీ సర్పంచ్ దువ్వ ల పెద్ద గంగారాం, అబ్వవ్వ దంపతుల చిన్న కుమారుడు చిన్న గంగారాం(25) ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. అదే గ్రామానికి చెందిన తేలు బాలయ్య, చిన్నుబారుు దంపతుల కూతురు రోజా(21) బీడీలు చుడుతుంది. చిన్నగంగారాం, రోజా సుమారు ఐదేళ్లు ప్రేమించుకున్నారు. కులాలు వేరు కావడంతో పెద్దలు అంగీకరించరనే భయంతో గత జూన్‌లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. గంగారాం కుటుంబ సభ్యులు రానివ్వకపోవ డంతో కొద్ది రోజులు పక్క గ్రామమైన గొల్లపల్లిలో, మరి కొద్ది రోజులు నిజామాబాద్ నగరంలో ఉన్నారు. మూడు నెలల క్రితం తిరిగి గ్రామానికి చేరుకున్నారు. రోజా తల్లిదండ్రుల సహకారంతో ఒక గుడిసెలో నివాసం ఉంటున్నారు. ఆదివారం రాత్రి ఇద్దరు రోజా తల్లి గారింటికి వెళ్లి భోజనం చేసి తిరిగి నివాసానికి వచ్చారు. రాత్రి పది గంటల సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆవేశంలో చిన్న గంగారాం రోజాపై చేరుు చేసుకున్నాడు. దీంతో రోజా చనిపోతానని ఏడ్చుకుంటూ సమీపంలోని చెరువు వద్దకు పరుగెత్తిందని, వెనకే వెళ్లిన చిన్న గంగారాం చెరువుకట్టపై ఆమెను అడ్డుకున్నాడని స్థానికులు తెలిపారు. చెరువు కట్టపై తిరిగి ఇద్దరు గొడవ పడ్డారు. క్షణికావేశంలో రోజా చెరువులో దూకింది. ఆమె వెనకే చిన్న గంగారాం సైతం చెరువులో దూకాడు. ఇద్దరు నీటి లో మునిగి ప్రాణాలు విడిచారు. సోమవారం ఉదయం రోజా తల్లి చిన్నుబారుు గుడిసె వద్దకు వెళ్లి చూడగా కూతురు, అల్లుడు కనిపించలేదు. ఇంతలో చెరువు వద్దకు వెళ్లిన గ్రామస్తులకు చెరువులో గంగారాం మృతదేహం కనిపించింది. దీంతో కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా వారు అక్కడకు చేరుకున్నారు. సమాచారం అందుకున్న డిచ్పల్లి సీఐ, ఎస్సై గ్రామానికి చేరుకున్నారు. చెరువులో నుంచి ఇద్దరి మృతదేహాలను వెలికి తీరుుంచారు. మృతదేహాలను చూసిన రెండు కుటుంబాల సభ్యులు బోరున విలపించారు. గంగారాం, రోజాలు ఒకరిని విడిచి ఒకరు ఉండే వారు కాదని, చివరకు చావును సైతం ఇద్దరు కలిసే పంచుకున్నారని గ్రామస్తులు కంటతడిపెట్టారు. గుడిసెను పరిశీలించిన పోలీసులకు మంచంపై పగిలిన గాజులు కనిపించారుు. దీంతో దంపతులిద్దరి మధ్య గొడవ జరిగి ఉంటుందని పోలీసులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇద్దరి మధ్య ఏ విషయంలో గొడవ జరిగిందని సీఐ, ఎస్సైలు ప్రశ్నించినా రెండు కుటుంబాల వారు తమకు తెలియదని సమాధానం చెప్పారు. రోజా తండ్రి బాలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
పెళ్లైన ఆర్నెల్లకే.. ప్రేమజంట ఆత్మహత్య
-
పెళ్లైన ఆర్నెల్లకే.. ప్రేమజంట ఆత్మహత్య
డిచ్పల్లి: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. ఆరునెలలు గడవక ముందే ఆత్మహత్యకు పాల్పడి తనువు చాలించారు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం అమృతపూర్‌లో సోమవారం ఉదయం వెలుగుచూసింది. కుటుంబ కలహాల నేపథ్యంలో నిన్న రాత్రి ఇంట్లో గొడవ జరగడంతో.. మనస్తాపానికి గురైన నవదంపతులు ఊరిబయట చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలు.. గ్రామానికి చెందిన గంగారాం(22) డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన రోజ(19)ను ప్రేమించాడు. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలపడంతో.. కులాలు వేరు కావడంతో వారు పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో ఈ ఏడాది జూన్‌లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. అనంతరం అదే గ్రామంలో కాపురం పెట్టారు. కాగా.. గత కొన్ని రోజులుగా వీరి కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన భార్యభర్తలు గ్రామ శివారులోని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం చెరువు కట్టపై నుంచి వెళ్తున్న స్థానికులు గంగారాం మృతదేహం తేలి ఉండటాన్ని గుర్తించి బయటకు తీశారు. రోజా మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టగా ఆమె మృతదేహాన్ని వెలికితీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
మొక్కల పరిరక్షణకు తోడ్పాటును అందించాలి
జడ్చర్ల : బాదేపల్లి నగర పంచాయతీలో హరితహారంలో నాటిన మొక్కలను పరిరక్షించేందుకు పట్టణ వాసులు, ప్రముఖులు తోడ్పాటునందించాలని నగర పంచాయతీ కమిషనర్ గంగారాం పేర్కొన్నారు. శనివారం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో టీఆర్ఎస్ నాయకులు బాదేపల్లి రంజిత్‌బాబు హరితహారం కార్యక్రమానికి తన వంతుగా రూ.10వేల నగదును కమిషనర్‌కు అందజేశారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి పిలుపు మేరకు మొక్కల పరిరక్షణకు ట్రీగార్డ్‌లను ఏర్పాటు చేసేందుకు సహాయం అందజేసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ గంగారాం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ పట్టణంలోని వివిధ కాలనీలు, రహదారులు తదితర ప్రాంతాల్లోదాదాపు 50 వేల మొక్కలకు పైగా నాటామని తెలిపారు. ట్రీగార్డుల ఏర్పాటుకు వ్యాపారులు, ప్రముఖులు తదితరులు మొక్కలను కాపాడేందుకు తమ వంతు సహాయం చేయాలని కోరారు. -
అప్పులబాధతో రైతు ఆత్మహత్య
కరీంనగర్ జిల్లా కథలాపూర్ మండలం తాండ్య్రాలకు చెందిన చెన్నవేని చిన్నగంగారాం(65) అనే రైతు అప్పులబాధతో శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. చిన్నగంగారాంకు మూడెకరాల భూమి ఉంది. బోర్లు వేయగా చుక్కనీరు రాలేదు. తిండికోసమని రెండు గుంటల్లో వరి వేయగా ఎండిపోయింది. ఆయన కుటుంబానికి రూ.2 లక్షల అప్పు ఉంది. ఓ వైపు వృద్ధాప్యం మీద పడడం... అప్పులు తీరే మార్గం కనిపించకపోవడంతో శుక్రవారం చేను వద్దే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. అతడికి భార్య, కుమారుడు ఉన్నారు. -
రేషన్ సరుకుల స్వాధీనం
సత్తుపల్లి(ఖమ్మం): రేషన్ సరుకులను అక్రమంగా నిల్వ ఉంచారనే సమాచారంతో రంగంలోకి దిగిన పౌర సరఫరా అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 7 క్వింటాళ్ల బియ్యం, 1.40 క్వింటాళ్ల కందిపప్పు, ఒక క్వింటాల్ పంచదారను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారం గ్రామంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇంట్లో అక్రమ నిల్వలు ఉన్నాయనే సమాచారంతో పౌరసరఫరాల అధికారి డీటీ జగదీశ్ దాడులు నిర్వహించి నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. -
మురికి కాల్వలో పడి వ్యక్తి మృతి
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కుంటాల మండలం ఓల గ్రామంలో సోమవారం రాత్రి ప్రమాదవశాత్తూ మురికి కాల్వలో పడి గంగారాం(42) అనే వ్యక్తి మరణించాడు. గ్రామ పంచాయతీ సమీపంలోని మురికి కాల్వలో గంగారాం పడి ఉండటం మంగళవారం ఉదయం గమనించిన స్థానికులు కుటుంబసభ్యులకు సమాచారమందించారు. గంగారాం మూర్ఛ వ్యాధితో భాదపడుతున్నాడని, మురికి కాల్వలో పడి ఉండి మరణించి ఉండవచ్చునని కుటుంబసభ్యులు భావిస్తున్నారు -
స్నేహమంటే ఇదేరా!
-
మందులు అడవి పాలు
-
అంధరివాడు
బ్రెయిలీ లిపి అంధులకు మాత్రమే కాదు, అందరికీ అవసరమేనంటారు విశ్రాంత ఉద్యోగి గంగారామ్. అంధులతో పాటు, అనాధలను ఆదుకోవడానికి, యువతీ యువకులలో జీవితం పట్ల ఆశావహ దృక్పథం పెంపొందించడానికి ఆయన ఓ చారిటబుల్ ట్రస్టును, వికలాంగులకోసం ‘ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ డిజేబిలిటీ’ అనే మరో స్వచ్ఛంద సంస్థనూ నెలకొల్పి, సేవలు అందిస్తున్నారు. విశేషం ఏమిటంటే ఇన్ని పనులు చేస్తున్న గంగారామ్ కూడా అంధుడే కావడం! - నిర్మలారెడ్డి, ‘సాక్షి’ ఫీచర్స్ ప్రతినిధి బ్రెయిలీ ఫర్ ఆల్... ఇదీ గంగారామ్ నినాదం. చూపున్నవారికి కూడా ఆయన బ్రెయిలీ లిపి నేర్పిస్తున్నారు! ‘‘పిల్లలకు, పెద్దలకు ఇప్పుడు ఏకాగ్రత లేకపోవడం ప్రధాన సమస్య. అందుకే అంధులు మాత్రమే అలవరచుకునే స్పర్శ జ్ఞానాన్ని మిగతావారు కూడా సాధన చేయాలి. స్పర్శజ్ఞానం ఏకాగ్రతను కలిగిస్తుంది. వృద్ధులయ్యాక చాలామందిలో అరవై శాతం కంటిచూపు తగ్గిపోతుంది. అలాంటప్పుడు ఒంటరి జీవితం గడిపేవారు బ్రెయిలీ లిపిలో ఉన్న పుస్తకాలను అవలీలగా చదువుకోవచ్చు. ఒంటరితనాన్ని దూరం చేసుకోవచ్చు. చీకట్లో కూర్చుని కూడా పుస్తకాలు చదువుకోవచ్చు. ప్రపంచంలోని అన్ని భాషల్లోనూ బ్రెయిలీ లిపిలో పుస్తకాలు చాలా చాలా తక్కువగా ఉన్నాయి. పుస్తకపఠనం పట్ల ఆసక్తి ఉన్న అంధులకు అవి అందుబాటులో లేవు. వీలైనన్ని పుస్తకాలను బ్రెయిలీ లిపిలోకి అనువదిస్తే ఎంతో విజ్ఞానం అంధులకు చేరువలోకి వస్తుంది’’ అంటూ, ఇలాంటివే ఎన్నో విలువైన సూచనలు ఇస్తారు గంగారామ్! అలాగని సలహాలతో సరిపెట్టడం లేదు ఆయన. తన స్నేహితులకు, ఇంటి వద్ద ఉండే పిల్లలకు, వృద్ధులకు, మిత్రులకు.. బ్రెయిలీ లిపిని నేర్పుతున్నారు. అందుకు కావల్సిన బ్రెయిలీ కిట్‌ను తానే సమకూర్చుతున్నారు. అంధుల సమస్యలను అర్థం చేసుకోండి అంటూ ‘మా కోసం ఓ నిమిషం’ అనే నినాదంతో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రేరణ ఇచ్చిన మిత్రుడు పదేళ్ల క్రితం గంగారామ్ మిత్రుడు (కంటిచూపు బాగున్న వ్యక్తి) ‘నాకూ బ్రెయిలీ లిపి’ నేర్పించవా అని ఆసక్తిగా అడిగాడట. ‘నీకెందుకయ్యా. చూపు బాగున్నవాడికి!’ అన్నారట గంగారామ్. ఆ తర్వాత అతను ఊరు వెళ్లిపోయాడు. కొన్ని రోజుల తర్వాత ఆ మిత్రుడు గంగారామ్‌కు ఫోన్ చేసి ‘ప్రమాదంలో రెండు కళ్లూ పోయాయి. బ్రెయిలీ లిపి అప్పుడే నేర్చుకుని ఉంటే ఇప్పుడు పనికొచ్చేది కదా!’ అన్నాడట. ఆ విషయాన్ని గంగారామ్ ప్రస్తావిస్తూ- ‘నాకు చాలా బాధ వేసింది. ఏదో తప్పిదం చేసినట్టు కూడా అనిపించింది. అప్పటి నుంచే ‘బ్రెయిలీ ఫర్ ఆల్’ అనే కాన్సెప్ట్ పెట్టుకున్నాను. సాధ్యమైనంత మందికి ఈ లిపి నేర్పించాలని గట్టిగా అనుకున్నాను. అలా చిన్నా, పెద్ద, ఆడ, మగ తేడా లేకుండా ఇప్పటికి చాలామందే ఈ లిపిని నేర్చుకున్నారు. ఇంకా నేర్చుకుంటున్నారు. మలక్‌పేట సూపర్ బజార్లో బ్రెయిలీ పార్క్ ప్రభుత్వ ఆధ్వర్యంలో సిద్ధమవుతోంది. అందులోనే ‘డిజేబుల్ టుడే’ అని అంధులకు బ్రెయిలీ లిపి నేర్పించే దిశగా కృషి చేయబోతున్నాను. వృద్ధాశ్రమాలకు వెళ్లి వారికీ బ్రెయిలీ లిపి నేర్పించాలనుకుంటున్నాను’’ అని తెలిపారు గంగారామ్! కౌన్సెలింగ్ సెంటర్ గంగారామ్‌కు భార్య, ముగ్గురు కుమార్తెలు. ఉద్యోగ జీవితం, కుటుంబం, మిత్రుల సాంగత్యం.. ఇద్దరు కూతుళ్ల వివాహ వేడుకలు.. అంతా సవ్యంగా జరిగిపోతున్న తరుణంలో రెండవ కూతురు బాలవీక్షణ తన స్నేహితురాలు చనిపోయిందనే ఆవేదనతో తనూ ఆత్మహత్య చేసుకుంది. అంధులైన వారే ఎంతో ఆత్మస్థైర్యంతో జీవిస్తుంటే అన్నీ సక్రమంగా ఉన్నవారు మానసిక బలహీనులై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు! కూతురు అతనిలో రేపిన ఈ ఆలోచనతోనే ‘బాల మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్’ (హైదరాబాద్, మలక్‌పేట) ఏర్పాటు చేసి, దాని ద్వారా అన్ని వయసుల వారికి కౌన్సెలింగ్ ఇస్తూ, జీవితం పట్ల ఆశావహ దృక్పధాన్ని పెంపొందిస్తున్నారు గంగారామ్. డాట్స్ విత్ డేట్స్ క్యాలెండర్ చూపున్నవారికే తప్ప చూపులేనివారికి అది తెలియజేసేదేమీ ఉండదు. ఈ అవస్థ అనుభవపూర్వకంగా తెలుసు కాబట్టి మూడేళ్ల క్రితం క్యాలెండర్లో బ్రెయిలీ డాట్స్‌ను ప్రవేశపెట్టి అంధులకు ఉపయోగపడేలా తీర్చిదిద్దారు గంగారామ్. దానిని మరికాస్త అభివృద్ధి పరిచి ‘డాట్స్ విత్ డేట్స్’ పేరిట ఈ యేడాది క్యాలెండర్‌ను ముద్రించారు. జీతం ద్వారా వచ్చే డబ్బులోనే కొంత భాగాన్ని వికలాంగ విద్యార్థుల సంక్షేమం కోసం వెచ్చిస్తూ వచ్చిన గంగారామ్ ఇప్పుడు పెన్షన్ ద్వారా లభించే మొత్తాన్ని సేవాకార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. ప్రభుత్వ పథకాలు వికలాంగులకు అందేలా కృషి చేస్తున్నారు. చూపున్నవారితో పోటీ పడి పనులు చేయడమే కాదు, ఎంతోమందికి మార్గదర్శకంగా నిలబడుతున్నారు! మూడేళ్ల వయసులో... నిజామాబాద్‌లో పుట్టిన గంగారామ్‌కి మూడేళ్ల వయసులో అమ్మవారు పోసి అంధత్వం ప్రాప్తించింది. అయితే అతని తెలివి తేటలకు ముచ్చటపడిన బంధువులు హైదరాబాద్‌లోని దారుషాహి అంధుల స్కూల్లో చేర్పించారు. టెన్త్ వరకు అక్కడే చదువుకున్నారు. అక్కడే బ్రెయిలీ లిపి నేర్చుకున్నారు. తర్వాత బి.ఇడి, ఎంఫిల్ చేశారు. హిందీ భాషతో పాటు తెలుగు సాహిత్యంపై మక్కువతో ఎన్నో పుస్తకాలు చదివారు. ముందు అధ్యాపకుడిగా, ఆ తర్వాత బ్రెయిలీ ప్రెస్‌లో ‘స్టీరియో ఆపరేటర్ కమ్ ఫ్రూఫ్ రీడర్’గా, ఆ తర్వాత హైదరాబాద్ జిల్లాలో కౌన్సెలింగ్ అండ్ రిహాబిలిటేషన్ ఆఫీసర్‌గా, పదేళ్ల పాటు బ్రెయిలీ ప్రెస్ మేనేజర్‌గా.. ఇలా వివిధ శాఖలలో విధులు నిర్వహించారు. -
గృహ నిర్మాణ అక్రమాలపై సర్కారు దృష్టి
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : గృహ నిర్మాణశాఖ అక్రమాలపై తెలంగాణ సర్కారు దృష్టి సారించింది. నివాస గృహాల బిల్లుల మంజూరులో జరిగిన భారీ కుంభకోణాన్ని వెలికి తీసేందుకు చర్యలు చేపట్టింది. అక్రమార్కులు కాజేసిన సొమ్మును కక్కించేందుకు సమాయత్తమవుతోంది. ఈ మేరకు ఆయా గ్రామాల్లో ఎన్ని నివాసాలు మంజూరయ్యాయి. వాస్తవానికి కట్టిన గృహాలెన్ని? ఎన్ని గృహాలకు బిల్లులు డ్రా చేశారు? వంటి వివరాలు సేకరించాలని గృహ నిర్మాణశాఖ హౌసింగ్ వర్క్ ఇన్స్పెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆ శాఖ ప్రాజెక్టు డెరైక్టర్ గంగారాం తెలిపారు. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు హ్యాబిటేషన్లవారీగా వివరాలు సేకరించాలని ఆదేశించామని అన్నారు. మరోవైపు అక్రమాలకు పాల్పడినట్లు రుజువైన కేసుల్లో బాధ్యుల వద్ద ఆ మొత్తాన్ని రికవరీ చేసే అంశంపై కూడా దృష్టి సారించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. కొన్నేళ్లుగా గృహ నిర్మాణాల్లో జరిగిన అక్రమాలు తవ్వి తీసేందుకు ప్రభుత్వం దృష్టి సారించింది. ఇటీవల హైదరాబాద్‌లో ‘నవ తెలంగాణ సమాలోచన’లో సీఎం కేసీఆర్ గృహ నిర్మాణ శాఖలోని అక్రమాల అంశాన్ని ప్రస్తావించారు. రూ.50 కోట్లకు పైగా అక్రమాలు నిలువ నీడలేని నిరుపేదల కోసం అమలు చేసిన గృహనిర్మాణ పథకాలు అక్రమాలకు వరంగా మారాయి. క్షేత్రలో స్థాయి నాయకులు, గృహ నిర్మాణ శాఖ అధికారులు, సిబ్బంది కలిసి పెద్ద మొత్తంలో అక్రమాలకు పాల్పడ్డారు. అసలు ఇళ్లే నిర్మించుకోకుండా బిల్లులు కాజేశారు. ఒకే ఇంటిపై నాలుగైదు బిల్లులు డ్రా చేశారు. ఒకే వ్యక్తి బినామీ పేర్లతో గృహాలు మంజూరు చేసుకుని భారీ భవనాలను నిర్మించుకున్నారు. ఒక్కో గ్రామంలో వందల సంఖ్యలో గృహాల బిల్లులు అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లాయి. ఈ అక్రమాలపై గతంలో థర్డ్ పార్టీతో విచారణ జరిగింది. ర్యాండమ్ సర్వేలో భాగంగా జిల్లాలో 73 గ్రామాల్లో సర్వే నిర్వహించగా భారీగా అక్రమాలు వెలుగు చూశాయి. సుమారు 1,582 గృహాలకు సంబంధించిన రూ.2.93 కోట్ల మేరకు బిల్లులు కాజేసినట్లు రుజువైంది. ఇందుకు బాధ్యులుగా పలువురు గృహ నిర్మాణ శాఖ అధికారులపై అప్పట్లో వేటు వేశారు. ఐదుగురు ఏఈలను విధుల నుంచి తొలగించగా, తొమ్మిది మంది వర్క్ ఇన్స్పెక్టర్లను కూడా విధుల నుంచి తొలగించారు. ఎనిమిది మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. కేవలం సర్వే జరిగిన 73 గ్రామాల్లోనే రూ.కోట్లలో అక్రమాలు జరిగితే జిల్లా వ్యాప్తంగా పక్కదారి పట్టిన మొత్తం సుమారు రూ.50 నుంచి రూ.100 కోట్ల వరకు ఉంటుందని అంచనా. అయితే ఈ అక్రమాలపై ప్రస్తుత సర్కారు ఇప్పుడు దృష్టి సారించింది. రూ.960 కోట్లు.. 3.45 లక్షల గృహాలు.. వివిధ గృహ నిర్మాణ పథకాల కింద 2006 నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 3.45 లక్షల గృహాలు మంజూరయ్యాయి. ఇందులో మూడు విడతలుగా అమలైన ఇందిరమ్మ పథకం కింద 2.72 లక్షల గృహాలు మంజూరు కాగా, మూడు విడతల్లో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు మరో 46,982 నివాసాలు ప్రభుత్వం మంజూరు చేసింది. ఇవికాకుండా మరో 47,553 గృహాలు మంజూరు చేస్తూ గత ప్రభుత్వం 2013లో జీవో నంబర్ 23ను జారీ చేసింది. ఈ గృహాలపై ఇప్పటివరకు రూ.960.10 కోట్లు మేరకు ప్రభుత్వం ఖర్చు చేసింది.