
హైదరాబాద్: రానున్న ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతిచ్చేది నవంబర్ 4న నిర్ణయిస్తామని మాల మహా నాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య తెలిపారు. మాల ల మనోభావాలకు దగ్గరగా ఉండే పార్టీకే మద్దతిస్తామని చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు గంగారాం అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. నవంబర్ 4న మింట్ కాంపౌండ్‌లో మాల మహా నాడు కమిటీ సమావేశమై మద్దతుపై నిర్ణయం తీసుకుంటుందని చెన్నయ్య చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment