Chennaiah
-
కిషన్‌రెడ్డిపై 200 మందితో నామినేషన్ వేయిస్తా
పంజగుట్ట/సాక్షి, హైదరాబాద్: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాదిగల పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. కిషన్‌రెడ్డి ఎస్సీల వర్గీకరణ అంశంపై మంద కృష్ణ మాదిగను కేంద్ర మంత్రుల వద్దకు తీసుకెళ్లడం సరికాదని అన్నారు. కిషన్‌రెడ్డి ఇలాంటి చర్యలు మానుకోకపోతే వచ్చే ఎన్నికల్లో ఆయనకు వ్యతిరేకంగా 200 మందితో నామినేషన్ వేయిస్తామని హెచ్చరించారు. సోమవారం మాల మహానాడు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎంఆర్పీఎస్ నాయకులు, మాలలు తక్కువగా ఉన్నారని, మాదిగలు 12 శాతం ఉన్నారని ప్రచారం చేస్తున్నారని దమ్ముంటే మాలలు, మాదిగలు ఎంతమంది ఉన్నారో లెక్కలు తేల్చాలని డిమాండ్ చేశారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా మాలలను జాగృతం చేసి మాలల శంఖారావం పేరిట సదస్సు నిర్వహిస్తామని చెన్నయ్య వెల్లడించారు. -
మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడిగా జంగా శ్రీనివాస్
పంజగుట్ట: రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాలలను చైతన్యపరచాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య కోరారు. బుధవారం మాల మహానాడు జాతీయ కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఇటీవల మాల మహానాడు రాష్ట్ర కమిటీ రద్దు చేసిన నేపథ్యంలో నూతన రాష్ట్ర అధ్యక్షునిగా జంగా శ్రీనివాస్‌ను, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మాల మహేశ్, గ్రేటర్ అధ్యక్షునిగా బైండ్ల శ్రీనివాస్‌ను నియమించి వారికి నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా చెన్నయ్య మాట్లాడుతూ.. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్, పీవీ రావు ఆశయాలకు అనుగుణంగా పనిచేయా లని, రాష్ట్రంలో మాలలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా ముందుండాలని కోరారు. -
భర్తను చంపి.. బాత్రూంలో పాతిపెట్టి
నవాబుపేట: భూమి అమ్మగా వచ్చిన డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో భార్య తన బంధువులతో కలసి భర్తను దారుణంగా హత్య చేసి.. బాత్రూంలో పాతిపెట్టింది. నెలన్నర తర్వాత బయటపడిన ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలంలో చోటు చేసుకుంది. దుర్పల్లి పంచాయతీ పరిధిలోని మొరంబావికి చెందిన చెన్నయ్య (47) నాలుగు నెలల క్రితం తనకున్న రెండెకరాల భూమిలో ఎకరా పొలాన్ని రూ.14 లక్షలకు అమ్మాడు. ఆ డబ్బులతో ఇల్లు నిర్మాణం చేపట్టి.. కొంత డబ్బుతో తన అక్కాచెల్లెళ్లకు బంగారం ఇచ్చాడు. దీంతో తనకు డబ్బులు లేకుండా చేస్తున్నాడని భావించిన చెన్నయ్య భార్య రాములమ్మ భర్తతో గొడవపడేది. (చదవండి: గణాంకాలు–వాస్తవాలు) ఇంటి నిర్మాణ పనులు పూర్తికావచ్చిన నేపథ్యంలో ఇంటిలో వాటా ఇస్తానని చెప్పి బావ పెంటయ్యతో పాటు మరో బంధువుతో కలసి భర్తను చంపేందుకు రాములమ్మ పథకం వేసింది. భర్తకు బాగా మద్యం తాగించి టవల్‌ను గొంతుకు బిగించి హత్య చేసింది. అనంతరం కొత్తగా నిర్మిస్తున్న ఇంటి బాత్రూంలో గుంత తీసి శవాన్ని పాతిపెట్టారు. ఎవరికీ అనుమానం రాకుండా.. నెల రోజులకు పైగా రాములమ్మ అదే ఇంట్లో నివాసం ఉంటోంది. కాగా జూలై 14వ తేదీ నుంచి అన్న కనిపించడం లేదని, ఎక్కడికి వెళ్లాడని.. చెన్నయ్య చెల్లెలు చెన్నమ్మ వదిన రాములమ్మను నిలదీసింది. ఆమె పొంతనలేని సమాధానం చెప్పడంతో జూలై 20న పోలీసులకు ఫిర్యాదు చేయగా అదృశ్యం కేసుగా నమోదు చేశారు. తొలుత చెన్నయ్య బంధువులను విచారణ చేసిన పోలీసులు, రెండు రోజుల క్రితం భార్య రాములమ్మను కూడా అదుపులోకి తీసుకుని విచారించడంతో విషయం బయటపడింది. బాత్రూంలో గుంత తీసి శవాన్ని పూడ్చిపెట్టినట్లు ఆమె చెప్పడంతో గురువారం పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ఘటనపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. (చదవండి: అక్కడ రూపాయికే ఇడ్లీ: ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజమే..) సంఘటన స్థలంలో బయటపడ్డ మృతదేహం. (ఇన్సెట్లో) చెన్నయ్య (ఫైల్) -
ఛలో ఢిల్లీ విజయవంతం: చెన్నయ్య
ఖైరతాబాద్ః తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు ఆధ్వర్యంలో ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద చేపట్టిన మహాధర్నా, నిరసన కార్యక్రమాలు విజయవంతమయ్యాయని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య అన్నారు. మింట్ కాంపౌండ్‌లోని అంబేడ్కర్ స్ఫూర్తి భవన్లో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ కాలం చెల్లిన డిమాండ్ అని, ఎస్సీలను వర్గీకరించొద్దని కోరుతూ కేంద్ర మంత్రులు, ఎస్సీ కమిషన్ జాతీయ చైర్మన్, పార్లమెంట్ పక్ష వైఎస్సార్సీపీ నాయకులు విజయసాయిరెడ్డి, ఆ పార్టీ మహిళా ఎంపీలను కలసి వినతి పత్రం సమర్పించినట్లు తెలిపారు. -
వివేకా మృతిపై సీబీఐ విచారణ జరిపించాలి
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై సీబీఐతో విచారణ జరిపించాలని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని సిట్‌తో కాకుం డా సీబీఐతో విచారణ చేయించాలని కోరారు. మాలలకు ఎక్కువ సీట్లు ఇవ్వాలి పార్లమెంట్ సీట్ల కేటాయింపుల్లో మాల సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని మాలమహానాడు డిమాండ్ చేసింది. -
ఈబీసీ రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం
సాక్షి, హైదరాబాద్: ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య ఆరోపించారు. జనాభాలో 70 శాతానికి పైగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వకుండా, ఈబీసీ రిజర్వేషన్లు కల్పించడంతో తీవ్ర అన్యాయం జరిగినట్లేనని ఆయన బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికల నేపథ్యం లో ఓట్లు రాబట్టేందుకు బీజేపీ ప్రభుత్వం చేసిన ఎత్తుగడ అని అన్నారు. అగ్రకుల పేదలకు 10 శాతం రిజర్వేషన్లు ఇస్తూ.. పార్లమెంటులో బిల్లు పెట్టడాన్ని మాలమహానాడు తీవ్రంగా ఖండించింది. -
ఏ పార్టీకి మద్దతిచ్చేది 4న నిర్ణయిస్తాం: చెన్నయ్య
హైదరాబాద్: రానున్న ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతిచ్చేది నవంబర్ 4న నిర్ణయిస్తామని మాల మహా నాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య తెలిపారు. మాల ల మనోభావాలకు దగ్గరగా ఉండే పార్టీకే మద్దతిస్తామని చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు గంగారాం అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. నవంబర్ 4న మింట్ కాంపౌండ్‌లో మాల మహా నాడు కమిటీ సమావేశమై మద్దతుపై నిర్ణయం తీసుకుంటుందని చెన్నయ్య చెప్పారు. -
మాల మాదిగలకు సమానంగా టికెట్లివ్వాలి
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు మాల మాదిగలకు సమానంగా టికెట్లు ఇవ్వాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య డిమాండ్ చేశారు. బుధవారం ఖైరతాబాద్‌లో ఏర్పాటు చేసిన మాల మహానాడు రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చెన్నయ్య మాట్లాడుతూ..అన్ని పార్టీలు ప్రకటించబోయే మేనిఫెస్టోలో తమ డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చే రుణాలను బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా రూ.5 లక్షల వరకు ఇవ్వాలని, సబ్‌ప్లాన్ నిధులను సక్రమంగా వినియోగించేలా కమిటీని ఏర్పాటుచేయాలని, అర్హులైన దళితులందరికీ ఇళ్లు నిర్మించాలని, మహిళా సంఘాలకు ఇచ్చే బ్యాంకు రుణాలు రూ.20 లక్షలకు పెంచి ప్రోత్సహించాలనే డిమాండ్లను మేనిఫెస్టోలో చేర్చాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మాల మహానాడు మహిళా అధ్యక్షురాలు సరసాదేవి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా శ్రీనివాస్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు శ్యామ్‌కుమార్, సాయి, దేవిక, రాజ్‌కుమార్, రాజేందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
30న ‘హలో మాల.. చలో ఢిల్లీ’
హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 30న హలో మాల.. చలో ఢిల్లీ కార్యక్రమం చేపడుతున్నట్లు మాల మహానాడు జాతీయ అ«ధ్యక్షుడు జి.చెన్నయ్య తెలిపారు. లక్షలాది మంది మాలలతో కలసి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామన్నారు. సోమవారం ఆయన హైదరాబాద్‌లోని కూకట్పల్లి వై జంక్షన్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలిపిన పార్టీలకు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మాలలు తగురీతిన గుణపాఠం చెప్పడం ఖాయమని హెచ్చరించారు. వర్గీకరణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టకుండా అడ్డుకోవడమే మాలల లక్ష్యమని అన్నారు. వర్గీకరణను వ్యతిరేకిస్తున్న యూపీ మాజీ ముఖ్యమంత్రి మాయావతికి, బీజేపీ మంత్రి రాందాస్ అత్వాలేకు ప్రత్యేక కృతజ్ఞతలు -
నమ్మకాన్ని పోగొట్టుకున్నాడు..: చిరంజీవి
సాక్షి, హైదరాబాద్ : తన నివాసంలో జరిగిన చోరీపై ప్రముఖ నటుడు చిరంజీవి స్పందిస్తూ.. నిందితుడు చెన్నయ్య తమ కుటుంబానికి నమ్మకంగా ఉండేవాడని అన్నారు. తమ కుటుంబసభ్యుల్లో ఒకడిగా ఉండేవాడని, ఇంట్లో జరిగే అన్ని వేడుకల్లోనూ పాల్గొనేవాడన్నారు. అలాంటిది సొంత మనిషిలా చూసుకున్నా.. నమ్మకాన్ని పోగొట్టుకున్నాడని చిరంజీవి ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. చిరంజీవి కుటుంబసభ్యుల గ్రూప్ ఫొటోల్లో కూడా చెన్నయ్య ఉండటం గమనార్హం. చిరంజీవితో పాటు ఆయన కుటుంబ సభ్యుల సినిమా ఫంక్షన్లకు కూడా చెన్నయ్యను ప్రత్యేకంగా తీసుకెళ్లేవారని సమాచారం. కాగా చిరంజీవి ఇంట్లో నగదు చోరీ చేసిన చెన్నయ్యను జూబ్లీహిల్స్ పోలీసులు నిన్న అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. నిందితుడి నుంచి రూ. 1.50 లక్షల నగదు రికవరీ చేశారు. జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు. కర్నూలు జిల్లా అవుకు గ్రామానికి చెందిన చెన్నయ్య పదేళ్ల క్రితం నగరానికి వచ్చి జూబ్లీహిల్స్ రోడ్ నెం. 25లోని చిరంజీవి ఇంట్లో వ్యక్తిగత సహాయకుడిగా పని చేస్తూ రాజీవ్‌గాంధీ నగర్లో ఉండేవాడు. గత నెల 30న అతను చిరంజీవి నివాసంలో కప్‌బోర్డ్‌లో ఉన్న రూ. 2 లక్షలు దొంగిలించాడు. ఈ నెల 7న చిరంజీవి మేనేజర్ గంగాధర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి నగదును రికవరీ చేశారు. ఆర్ధిక అవసరాల కోసమే తాను నగదు చోరీ చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. చోరీ సొత్తులో రూ. 50 వేలు ఇంటి ఖర్చులకు వాడుకున్నాడని మిగతా డబ్బును ఇంట్లోనే భద్రంగా ఉంచినట్లు తెలిపాడు. నమ్మకంగా పని చేస్తూనే యజమాని కళ్లగప్పి కప్‌బోర్డ్‌లో ఉన్న డబ్బులను విడతల వారిగా చోరీ చేసినట్లు పోలీసులు వివరించాడు. -
సమాజంలోని అసమానతలు రూపుమాపాలి
బామ్సెఫ్ రాష్ట్ర అధ్యక్షులు చెన్నయ్య కరీంనగర్: సమాజంలోని అసమానతలు రూపుమాపాలని బామ్సెఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బి.చెన్నయ్య అన్నారు. ఆదివారం రెవెన్యూ గార్డెన్లో జరిగిన తెలంగాణ రాష్ట్ర బామ్సెఫ్ మూడో రాష్ట్ర మహాసభలో ఆయన మాట్లాడుతూ బహుజన పితామహులు మహత్మా జ్యోతిబాపూలే, సాహుమహారాజ్, అంబేద్కర్ సిద్ధాంతాలను నిమ్నవర్గాలకు అందజేస్తూ సమాజ రుగ్మతలను పారదోలేందుకు విద్యావంతులు ముందుకు రావాలని సూచించారు. సమాజాన్ని చైతన్యపర్చడంలో బామ్‌సేప్ కార్యకర్తలు అగ్రభాగాన నిలవాలని కోరారు. బ్రిటిష్ ప్రభుత్వం, బ్రాహ్మణులతో పోరాడి బాబాసాహెబ్ అంబేద్కర్ కమ్యూనల్ అవార్డును సాధించారని, పూనా ఒప్పందం పేరుతో గాంధీ సాధించిన హక్కులను లాక్కున్నారని ఆరోపించారు. ఎస్సీ,ఎస్టీ,బీసీలు హక్కుల సాధన కోసం దమాషా ప్రకారం పోరాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బామ్‌సేఫ్ ప్రతినిధులు జనాబ్ ఆహ్మద్ మహ్మద్ సాహెబ్, దాసురాం నాయక్, రేవెల్లి శంకర్, ప్రొఫెసర్ ఎల్లన్నయాదవ్, ఎన్.దేవేందర్(ఎస్టీఓ), అమరేందర్, నాగెల్లి దేవేందర్, సుదర్శనం, కట్టెకోల లక్ష్మణ్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు. -
స్వామి అగ్నివేష్ నిజాలను వక్రీకరిస్తున్నారు
► మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య సాక్షి, న్యూఢిల్లీ: రిజర్వేషన్లలో మాలలు మూడో వంతు ప్రయోజనాలను పొందుతున్నారని స్వామి అగ్నివేష్ నిజాలను వక్రీకరిస్తున్నారని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య విమర్శించారు. వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు చేపట్టిన ఆందోళన మంగళవారం 20వ రోజుకు చేరుకుంది. చెన్నయ్య మాట్లాడుతూ.. సుప్రీం కోర్టు, జాతీయ ఎస్సీ కమిషన్ సూచనల మేరకు బిహార్‌లో నితీశ్ ప్రభుత్వం.. ఎస్సీలను ఏబీసీడీలుగా వర్గీకరించకుండా ఎస్సీలలో అత్యంత వెనుకబడిన కులాలకు ప్రత్యేక సదుపాయాలు కల్పించిందన్నారు. ఉషామెహ్రా కమిషన్ నివేదిక ప్రకారం మాలల కంటే మాదిగలు రెండు రెట్లు ఎక్కువగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రయోజనాలు పొందుతున్నారని చెన్నయ్య తెలిపారు. -
ఓటు బ్యాంకు కోసమే వర్గీకరణ
- మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య సాక్షి, న్యూఢిల్లీ: ఒక వర్గం వారి ఓటు బ్యాంకు కోసం అగ్రవర్ణ పార్టీలు దళితులను విభజించి పాలించాలని చూస్తున్నాయని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య ఆరోపించారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఎస్సీల్లో వెనుకబడిన ఉపకులాలకు ప్రత్యేక విద్యా సదుపాయాలు కల్పిస్తే వారు మిగతా విద్యార్థులతో సమానంగా పోటీపడి ఉద్యోగాలు పొందుతారని, ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు లేకుండా రిజర్వేషన్లు కల్పించినా నిరుపయోగమని పేర్కొన్నారు. ప్రభుత్వాలు ఈ పని చేయకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసం దళితులను విభజించి పాలిస్తున్నారని మండిపడ్డారు. దళితులను విభజించవద్దని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌ను కలసి వినతి పత్రం సమర్పించినట్టు చెన్నయ్య తెలిపారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందిచినట్టు పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద మాల మహానడు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. అమలాపురం ఎంపీ రవీంద్రబాబు దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. -
వర్గీకరణ వ్యతిరేక ఉద్యమం తీవ్రతరం
- మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక ఉద్యమాన్ని తీవ్రతరం చేయనున్నట్లు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య ప్రకటించారు. మాదిగలు చేపట్టనున్న ఉద్యమాలకు దీటుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆగస్టు 12వ తేదీ వరకు వివిధ రూపాల్లో ఉద్యమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హలో మాల-చలో ఢిల్లీ పేరుతో మహాధర్నాను నిర్వహిస్తున్నామని చెప్పారు. వర్గీకరణ బిల్లును పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణ చెల్లదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అన్ని రాజకీయ పార్టీలు గౌరవించాలని ఆయన కోరారు. మహాధర్నాకు మాలలు, ఉప కులాలు, కార్యకర్తలు, ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలు, మేధావులు, కవులు, కళాకారులు, రాజకీయ నాయకులు మద్దతు పలకాలని కోరారు. ఈ సమావేశంలో మాల మహానాడు రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు గైని గంగారాం, సెక్రటరీ జనరల్ జంగా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
సీమ రాజధాని కోసం ఉద్యమం
కర్నూలు రూరల్: ఆంధ్రప్రదేశ్ రాజధాని రాయలసీమలో ఏర్పాటు చేయకుంటే ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం చేపడతామని రాజధాని సాధన కమిటీ చైర్మన్ చెన్నయ్య హెచ్చరించారు. స్థానిక జలమండలి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగు జాతంతా ఐక్యంగా ఉండాలనే ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా ఉన్న కర్నూలును అప్పట్లో వదులుకున్నామన్నారు. రాజకీయ పార్టీలు గత చరిత్రను, పెద్ద మనుషుల ఒప్పందం గురించి తెలుసుకొని రాజధానిని సీమలో ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్ర విభజన సమయంలో రాజధాని ఏర్పాటు కోసం కమిటీ ఏర్పాటు చేసిన సమయంలో సీమలో తిరుపతి, కర్నూలలో కూడా పర్యటిస్తామని చె ప్పారన్నారు. ఆ కమిటీ ఇక్కడకి రాక మనుపే రాజధాని గుంటూరు-విజయవాడ మధ్యలో ఉంటుందని లీకులు ఇవ్వడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. రాజకీయ పార్టీలు వారి స్వార్థం కోసం కాకుండా ప్రజా సంక్షేమానికి ప్రయోజనకరంగా ఉండేలా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. కర్నూలు జిల్లాలో ప్రభుత్వ భూములు, వనరులు, నీటి సదుపాయం, జాతీయ రహదారులు, రైల్వే రవాణ వ్యవస్థ అందుబాటులో ఉందన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ విలీనమైన తర్వాత సీమ ప్రజలు అధిక శాతం నష్టం పోయారని, తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో మళ్లీ సీమకే నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంత ఎమ్మెల్యేలు ఇప్పటికైనా స్పందించి ఈ నెల 19 నుంచి 24వ తేది వరకు జరిగే అసెంబ్లీ సమావేశాలలో రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాలని గళమెత్తాలని కోరారు. లేని పక్షంలో అన్ని ఉద్యోగ, ప్రజా సంఘాల జేఏసీలను కలుపుకొని ప్రత్యేక రాయల సీమ రాష్ట్ర సాధనకు ఉద్యమం చేపడతామని చెన్నయ్య హెచ్చరించారు. సమావేశంలో రాయలసీమ రాజధాని సాధన కమిటీ చైర్మన్ సోమశేఖర శర్మ, సభ్యులు విజయ్‌కుమార్, నాగరాజు, రాజధాని సాధన కమిటీ సభ్యులు సుబ్బరాయుడు, ప్రసాద్‌రావు, నెహేమియా, శ్రీనివాసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
ఆ కుటుంబంలో ‘ఏడు’పే..!
ఇబ్రహీంపట్నం, న్యూస్‌లై న్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నగర పంచాయతీకి సంబంధించి పలు వార్డుల నుంచి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు పోటీ చేయగా, అందరూ ఓటమి పాలయ్యారు. వీరిలో ఐదుగురు కాంగ్రెస్ అభ్యర్థులు న్నారు. ఇబ్రహీంపట్నంలోని ఆంగ్లిస్ట్ స్కూల్ యజమాని చెన్నయ్య కుటుంబానికి చెందిన ఏడుగురు సభ్యులు పలు వార్డుల్లో కౌన్సిలర్ అభ్యర్థులుగా పోటీచేశారు. ఒకటో వార్డు నుంచి చెన్నయ్య కుమారుడు భానుబాబు, 4,13 వార్డుల నుంచి కూతుళ్లు భానురేఖ, భానుప్రియ, 15వ వార్డు నుంచి భార్య అండాలు, 20వ వార్డు నుంచి అల్లుడు పల్లె శ్రీధర్‌బాబు, 9వ వార్డు నుంచి కోడలు జయ, 16వ వార్డు నుంచి కుమారుడు భానుచందర్ పోటీ చేసి ఓడిపోయారు.