మాల మాదిగలకు సమానంగా టికెట్లివ్వాలి | chennaiah demands all parties seats allotted to sc | Sakshi
Sakshi News home page

మాల మాదిగలకు సమానంగా టికెట్లివ్వాలి

Published Thu, Oct 25 2018 5:49 AM | Last Updated on Thu, Oct 25 2018 5:49 AM

chennaiah demands all parties seats allotted to sc - Sakshi

హైదరాబాద్‌: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు మాల మాదిగలకు సమానంగా టికెట్లు ఇవ్వాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య డిమాండ్‌ చేశారు. బుధవారం ఖైరతాబాద్‌లో ఏర్పాటు చేసిన మాల మహానాడు రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చెన్నయ్య మాట్లాడుతూ..అన్ని పార్టీలు ప్రకటించబోయే మేనిఫెస్టోలో తమ డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా ఇచ్చే రుణాలను బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా రూ.5 లక్షల వరకు ఇవ్వాలని, సబ్‌ప్లాన్‌ నిధులను సక్రమంగా వినియోగించేలా కమిటీని ఏర్పాటుచేయాలని, అర్హులైన దళితులందరికీ ఇళ్లు నిర్మించాలని, మహిళా సంఘాలకు ఇచ్చే బ్యాంకు రుణాలు రూ.20 లక్షలకు పెంచి ప్రోత్సహించాలనే డిమాండ్లను మేనిఫెస్టోలో చేర్చాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో మాల మహానాడు మహిళా అధ్యక్షురాలు సరసాదేవి, రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జంగా శ్రీనివాస్, గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడు శ్యామ్‌కుమార్, సాయి, దేవిక, రాజ్‌కుమార్, రాజేందర్, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement