డబుల్ డెక్కర్ బస్సులు, రైళ్లు చూశాం. కానీ డబుల్ డెక్కర్ విమానాల గురించి ఎప్పుడైనా విన్నారా? తాజాగా విమానంలో డబుల్ డెక్కర్ సీటు ఫొటో ఒకటి వైరల్ అయ్యింది. ఈ సరికొత్త సీటు డిజైన్‌పై ప్రయాణికుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది.
అలెజాండ్రో నూనెజ్ విసెంట్ అనే 23 ఏళ్ల డిజైనర్ ఈ డబుల్ డెక్కర్ సీట్లను రూపొందించారు. ‘చైస్ లాంజ్’ ఎయిర్‌ప్లేన్ సీట్ ప్రోటోటైప్ ఫొటో మొదటగా 2022లో విడుదలైంది. జర్మనీలోని హాంబర్గ్‌లో జరిగిన ఎయిర్‌క్రాఫ్ట్ ఇంటీరియర్స్ ఎక్స్‌పోలో దీన్ని ప్రదర్శించారు.
ఈ సందర్భంగా ఈ డబుల్ డెక్కర్ సీట్లపై రెడిట్‌లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఒక్కో యూజర్ ఒక్కోలా స్పందించారు. ఈ మిశ్రమ స్పందనలపై డిజైనర్ నూనెజ్ విసెంట్ మాట్లాడుతూ డబుల్ డెక్కర్ సీటు స్థలాన్ని ఆప్టిమైజ్ చేయడంలో సహాయపడుతుందని, విమానంలో ఖాళీ స్థలాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని సీఎన్‌ఎన్ వార్తా సంస్థతో ఆయన పేర్కొన్నారు.
The double-decker airplane seat is back https://t.co/CK2nnh12kC pic.twitter.com/OKqgpmxiCn
— CNN (@CNN) June 9, 2023
Comments
Please login to add a commentAdd a comment