seats fight
-
విమానంలో ఏ సీటు భద్రం?
ఆదివారం దక్షిణకొరియాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో వెనకవైపు సీట్లలో కూర్చున్న ప్రయాణికులు ఇద్దరు ప్రాణాలతో బయటపడినట్లు వార్తలొచ్చాయి. దీంతో విమానంలో ముందువైపు లేదంటే వెనుకవైపు అసలు ఏ నంబర్ సీటులో కూర్చుంటే ప్రమాదం జరిగినా బయటపడొచ్చనే అంశంపై ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చ మొదలైంది. తరచూ విమానప్రయాణాలు చేసే అంతర్జాతీయ ప్రయాణికులు ఈ చర్చలను తీక్షణంగా గమనిస్తున్నట్లు వార్తలొచ్చాయి. నిజంగానే వెనుకవైపు సీట్లు భద్రమా? అనే ప్రశ్న ఇప్పుడు ప్యాసింజర్లను తొలచేస్తోంది. మిగతా ప్రయాణాలతో చూస్తే భద్రమే ఎక్కడ కూర్చుంటే క్షేమంగా ఉంటామనే ప్రశ్న కంటే అసలు విమానంలో ప్రయాణమే అత్యంత భద్రమని మరో వాదన మొదలైంది. నిర్లక్ష్య డ్రైవింగ్, గతుకుల రోడ్డు, ఎత్తుఒంపులు ఉన్న చోట్ల సాంకేతిక ప్రమానాలు పాటించకుండా నిర్మించిన రోడ్లు, సరైన సూచికల వ్యవస్థ లేకపోవడం వంటి ఎన్నో కారణాలతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు ప్రయాణంతో పోలిస్తే విమాన ప్ర యాణం ఎంతో క్షేమదాయకమని వారు చెబుతున్నారు. విమానంలో ఎక్కడ కూర్చున్నా భద్ర మేనని, ఎప్పటికప్పుడు మొత్తం విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీచేసి సుశిక్షుతులైన పైలట్ల పర్యవేక్షణలో విమానం ప్రయాణిస్తుందని, అ త్యంత అరుదుగా మాత్రమే, అసాధారణ వాతావరణ పరిస్థితుల్లోనే వి మా నం ప్రమాదంబారిన పడుతుంద ని విశ్లేషకులు చెబుతు న్నారు. అమెరికాలో ఎలా? ఫెడరల్ ఏవియేషన్ అడ్మిని్రస్టేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం అమెరికా రోడ్లపై ప్రతి 10 కోట్ల వాహన ప్రయాణాల్లో కేవలం 1.18 మరణాలు సంభవిస్తున్నాయి. అదే 10 కోట్ల మైళ్ల రైలు ప్రయాణంలో 0.04 మరణాలు సంభవిస్తున్నాయి. ఇక 10 కోట్ల మైళ్ల విమాన ప్రయాణాల్లో అత్యంత స్వల్పంగా కేవలం 0.003 మరణాలు సంభవిస్తున్నాయి. అంతర్జాతీయ పౌర విమానయాన రంగ గణాంకాల ప్రకారం 2023లో ప్రతి వంద కోట్ల మంది ప్రయాణికులకు కేవలం 17 మంది మాత్రమే విమాన ప్రమాదాల్లో చనిపోయారు. 2022 ఏడాదిలో ఈ సంఖ్య 50గా ఉంది. అత్యాధునిక విమానాల్లో ఆధునిక భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నా అననుకూల వాతావరణ పరిస్థితుల కారణంగానే అత్యల్ప స్థాయిలో ప్రమాదాలు జరుగుతున్నాయి. తోక క్షేమమే విమానం ద్రవరూప ఇంధనం(ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్)తో నడుస్తుంది. చిన్న జెట్ విమానాలను మినహాయిస్తే అంతర్జాతీయ సర్వీస్‌లకు వాడే భారీ పౌరవిమానాల్లో రెక్కల కింద ఈ ఇంధనాన్ని నిల్వచేస్తారు. ఏదైనా ప్రమాదం జరిగి నిప్పురవ్వులు రాజుకుంటే రెక్కల కింద ఇంధనం భగ్గున మండి రెక్కల సమీప సీట్లలోని ప్రయాణికులు బుగ్గిపాలుకావడం ఖాయం. ఈ కోణంలో చూస్తే రెక్కల సమీపంలోని సీట్లు ప్రమాదసందర్భాల్లో అంత క్షేమదాయకం కాదని గత ప్రమాదరికార్డులు తేటతెల్లంచేస్తున్నాయి. ఈ విషయమై అమెరికాలో పాపులర్ మెకానిక్స్ అనే మేగజైన్ 1971 నుంచి 2005 వరకు జరిగిన విమాన ప్రమాదాలను విశ్లేíÙస్తూ ఒక నివేదిక సిద్ధంచేసింది. దీని ప్రకారం తోకభాగంలో కూర్చుంటే ప్రమాదాల్లో బతికే అవకాశాలు మిగతా సీట్లతో పోలిస్తే 40 శాతం అధికంగా ఉంటాయి. ముందు సీట్లతో ముప్పే ప్రమాదంలో ఇంధనం అంటుకుని మంటలు చుట్టుముట్టకపోయినా ముందు సీట్లు ఒకరకంగా ప్రమాదకరమని నివేదించారు. ఎదురుగా ఏదైనా కొండను ఢీకొట్టినా, నేలపై కుప్పకూలినా, వేరే విమానాన్ని ఢీకొట్టినా, రన్‌వే చివరన గోడలాంటి నిర్మాణాన్ని ఢీకొట్టినా, రన్‌వే దాటి లోయ లేదంటే సముద్రం, సరస్సు వంటి జలాశయంలోకి దూసుకెళ్లినా ప్రమాద ప్రభావం ముందు సీట్లపైనే అధికంగా ఉంటుంది. మధ్య సీట్ల పరిస్థితి విచిత్రం మధ్య సీట్లలో కూర్చుంటే రెక్కలకు సమీపంలో ఉండటం వల్ల ఇంధనంలో మంటలొస్తే ప్రమాదమే. కానీ మంటలు చెలరేగని పక్షంలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ మార్గం వీళ్లకే దగ్గరగా ఉంటుంది. తప్పించుకునే అవకాశాలు వీళ్లకే ఎక్కువ. ఏదేమైనా విమానం ప్రమాదంలో పడిన తీరు, వేగం, దిశను బట్టి విమానంలోని ముందు, వెనుక, పక్క భాగాలు దెబ్బతింటాయి. భారత్‌లో గంటకొకటి చొప్పున జరిగే రోడ్డు ప్రమాదాలు, ఇటీవల సర్వసాధారణమైన పట్టాలు తప్పడం వంటి రైలు ప్రమాదాలతో పోలిస్తే అత్యంత అరుదుగా జరిగే విమాన ప్రమాదాలను భూతద్దంలో చూడాల్సిన పనిలేదని భరోసా ఇచ్చే వాళ్లు ఈ ‘సీటు క్షేమం’చర్చలో పాల్గొన్నారు. బతికే అవకాశాలు 60 శాతం అమెరికా జాతీయ రవాణా భద్రతా బోర్డ్ నివేదికను విశ్లేíÙస్తూ బ్రిటన్ పాత్రికేయుడు మ్యాక్స్ ఫాస్టర్ తాజాగా ఒక విషయాన్ని బయటపెట్టారు. ‘‘విమానం నేలపై కూలినా, నీటిలో పడినా, గాల్లోనే పేలిపోయినా ముందు సీట్లలో కూర్చునే ప్రయాణికులు 49 శాతం వరకు బతికే అవకాశాలు ఉన్నాయి. రెండు రెక్కల మధ్యభాగంలోని సీట్లలో కూర్చుంటే 59 శాతం వరకు బతికే అవకాశాలు ఉన్నాయి. ఇక వెనుకవైపు అంటే తోక సమీప సీట్లలో కూర్చుంటే 69 శాతం బతికే అవకాశాలు ఉన్నాయి’’అని అన్నారు. అయితే ఇక్కడో ఘటనను తప్పక గుర్తుచేసుకోవాలని ఆయన చెబుతున్నారు. ‘1989లో అమెరికాలో యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానం ప్రమాదానికి గురైనప్పుడు 269 మంది ప్రయాణికుల్లో 184 మంది బతికారు. వీరిలో చాలా మంది ముందు సీట్లలో కూర్చున్నారు’’అని ఆయన గుర్తుచేశారు. ప్రఖ్యాత ‘టైమ్’మేగజైన్ నివేదిక సైతం వెనుక సీట్లు క్షేమమని తెలిపింది. మిగతా సీట్లతో పోలిస్తే వెనుకవైపు సీట్లలో మధ్య వాటిల్లో కూర్చుంటే మరింత క్షేమమని పేర్కొంది. ఇక్కడ కూర్చుంటే మరణించే అవకాశం కేవలం 28 శాతమని, అదే విమానం మధ్యలో కూర్చుంటే ముప్పు శాతం 44 శాతంగా ఉంటుందని వెల్లడించింది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
చల్లారని సర్దుబాటు మంటలు
సాక్షి, రాజమహేంద్రవరం: టీడీపీ, జనసేన సీట్ల సర్దుబాటు మంటలు చల్లారడం లేదు. ఇరు పార్టీల అధినేతలు తీసుకున్న నిర్ణయాలు, వ్యవహార శైలి ఆయా పార్టీ శ్రేణులకు మింగుడు పడటం లేదు. వెరసి వర్గ విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయి. ఇరు పార్టీల నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి తలెత్తింది. సీట్లపై ఎటూ తేల్చకపోవడంతో ఇరు పార్టీల నేతలు వర్గాలుగా విడిపోయి బహిరంగ విమర్శలకు దిగుతున్నారు. పార్టీ అధినాయకత్వంపై ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. తమ నేతకు సీటు కేటాయించని పక్షంలో మూకుమ్మడి రాజీనామాలకు దిగుతామని అల్టిమేటం ఇస్తున్నారు. నియోజకవర్గంలో ఎలా గెలుస్తారో చూస్తామంటూ శపథం చేస్తున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిత్వం నిరాకరిస్తే తమ సత్తా ఏమిటో పార్టీల అధిష్టానాలకు చూపేందుకు సంసిద్ధమవుతున్నారు. ప్రజల్లో తమకున్న ఆదరణను చూపేందుకు కార్యకర్తలను భారీ స్థాయిలో సమీకరించుకుని మరీ బలప్రదర్శనలకు దిగుతున్నారు. కొవ్వొత్తుల ర్యాలీలు, మౌనపోరాటం వంటి కార్యక్రమాలతో వినూత్న నిరసనలకు నాంది పలకడం ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. నిడదవోలును బూరుగుపల్లికి కేటాయించాలని నినదిస్తున్న టీడీపీ నేతలు ఎడతెగని ఉత్కంఠ రాజమహేంద్రవరం రూరల్, నిడదవోలు ఉమ్మడి స్థానాలపై ఎడతెగని ఉత్కంఠ కొనసాగుతోంది. సీటు తనదంటే తనదంటూ జనసేన, టీడీపీ నేతలు ప్రకటించుకుంటున్నారు. ఈ గందరగోళాన్ని చక్కదిద్దాల్సిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తుండటం ఇరు వర్గాల మధ్య విభేదాలకు మరింతగా ఆజ్యం పోస్తోంది. నిడదవోలులో నిరసన గళం నిడదవోలు నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుకు పట్టం కట్టకపోతే సహించేది లేదని టీడీపీ శ్రేణులు హెచ్చరిస్తున్నాయి. కచ్చితంగా తమ నేతకు కేటాయించాల్సిందేనన్న అల్టిమేటం జారీ చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేకి మద్దతుగా ఉండ్రాజవరం మండలంలోని ఆయన స్వగ్రామం వేలివెన్నుకు పార్టీ కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. శనివారం సైతం అధిక సంఖ్యలో కార్యకర్తలు ఆయన ఇంటి వద్దకు చేరుకుని శేషారావుకు మద్దతుగా నినాదాలు చేస్తూ బలప్రదర్శనకు దిగారు. ఆయనకు టికెట్ దక్కని పక్షంలో స్వతంత్ర అభ్యర్థిగా గెలిపించుకుంటామని కుండ బద్దలుగొడుతున్నారు. జనసేన నేత కందుల దుర్గేష్ నిడదవోలు నుంచి పోటీ చేయాల్సిందిగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెప్పినట్లు ప్రకటించుకోవడం పొత్తు ధర్మమా? అంటూ ప్రశ్నించారు. దుర్గేష్‌ను నిడదవోలుకు పంపితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని స్పష్టం చేస్తున్నారు. అదే జరిగితే ఇక్కడికి వచ్చి ఎలా గెలుస్తారో తామూ చూస్తామంటూ సవాల్ విసురుతున్నారు. దుర్గేష్ దారెటు..? రాజమహేంద్రవరం రూరల్ జనసేన నేత కందుల దుర్గేష్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని, తనకే రూరల్ సీటు దక్కుతుందన్న ఆయన ఆశలకు రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి గండి కొట్టారు. బుచ్చయ్య ఒత్తిడికి తలొగ్గిన టీడీపీ, జనసేన అధిష్టానాలు దుర్గేష్‌ను నిడదవోలుకు సాగనంపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. దుర్గేష్‌ను మంగళగిరి పిలిపించి మరీ హితబోధ చేశాయి. ఈ పరిణామం ఇటు రాజమహేంద్రవరం రూరల్ జనసేన, అటు నిడదవోలు టీడీపీ శ్రేణుల్లో ఆగ్రహావేశాలు నింపాయి. ఇద్దరు నేతల మధ్య వైషమ్యాలకు ఆజ్యం పోశాయి. ఈ పరిస్థితుల్లో దుర్గేష్ ఎటు వెళ్లాలో తెలియక తికమకపడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. దుర్గేష్‌కు స్థానచలనంపై జనసేన నేతలు ఆందోళన చెందుతున్నారు. రూరల్‌లో బుచ్చయ్యకు సహకరించేది లేదని తెగేసి చెబుతున్నారు. దుర్గేష్‌కు మద్దతుగా ఆందోళన దుర్గేష్‌ను నిడదవోలుకు పంపాలని జనసేన అధినేత పవన్ తీసుకున్న నిర్ణయంపై జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ ఇచ్చిన మాటను సైతం కట్టుబడి ఉండలేరా అని ప్రశ్నిస్తున్నారు. దుర్గేష్‌కు రూరల్ కేటాయించాలని కోరుతూ కడియం నుంచి రాజమహేంద్రవరం నగరంలోకి కోటిపల్లి బస్టాండ్ వరకూ ర్యాలీ నిర్వహించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో జనసేన బలోపేతానికి దుర్గేష్ చేసిన కృషిని కూడా గుర్తించలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో అధిష్టానం ఉందా అని మండిపడ్డారు. దుర్గేష్‌కు సీటు కేటాయించకపోతే బుచ్చయ్యకు సహకరించేది లేదని స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరులో దుర్గేష్‌కు మద్దతుగా క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ప్రకటించే వరకూ చూస్తానంటున్న గోరంట్ల రాజమహేంద్రవరం రూరల్ సీటు తనకేనని సీనియర్ టీడీపీ నేత, సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై ఇరు పార్టీల అధ్యక్షులూ ప్రకటించేంత వరకూ వేచి చూస్తానని అంటున్నారు. -
గాల్లో డబుల్ డెక్కర్: భలే డిజైన్ చేశారు.. ఫొటో వైరల్
డబుల్ డెక్కర్ బస్సులు, రైళ్లు చూశాం. కానీ డబుల్ డెక్కర్ విమానాల గురించి ఎప్పుడైనా విన్నారా? తాజాగా విమానంలో డబుల్ డెక్కర్ సీటు ఫొటో ఒకటి వైరల్ అయ్యింది. ఈ సరికొత్త సీటు డిజైన్‌పై ప్రయాణికుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. అలెజాండ్రో నూనెజ్ విసెంట్ అనే 23 ఏళ్ల డిజైనర్ ఈ డబుల్ డెక్కర్ సీట్లను రూపొందించారు. ‘చైస్ లాంజ్’ ఎయిర్‌ప్లేన్ సీట్ ప్రోటోటైప్ ఫొటో మొదటగా 2022లో విడుదలైంది. జర్మనీలోని హాంబర్గ్‌లో జరిగిన ఎయిర్‌క్రాఫ్ట్ ఇంటీరియర్స్ ఎక్స్‌పోలో దీన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఈ డబుల్ డెక్కర్ సీట్లపై రెడిట్‌లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఒక్కో యూజర్ ఒక్కోలా స్పందించారు. ఈ మిశ్రమ స్పందనలపై డిజైనర్ నూనెజ్ విసెంట్ మాట్లాడుతూ డబుల్ డెక్కర్ సీటు స్థలాన్ని ఆప్టిమైజ్ చేయడంలో సహాయపడుతుందని, విమానంలో ఖాళీ స్థలాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని సీఎన్ఎన్ వార్తా సంస్థతో ఆయన పేర్కొన్నారు. The double-decker airplane seat is back https://t.co/CK2nnh12kC pic.twitter.com/OKqgpmxiCn — CNN (@CNN) June 9, 2023 -
ఆ గట్టునుంటావా!.. ఈ గట్టునుంటావా!..
సాక్షి, కర్నూల్: ఆగట్టునుంటావా... ఎంకప్ప... ఈ గట్టునుంటావా!.. ఎంకప్ప యాగట్టునుంటావో.. రోంత సూసుకోని దుంకప్ప.... లెక్కలేసుకోని ఎగరప్ప.. ఎంకప్పో... ఎంకప్పా... అంటూ వల్లె నెత్తికింద పెట్టుకోని కాలు మింద కాలు ఏస్కోని కట్టమింద పాడుకుంట పండుకున్నడు తిమ్మప్ప. ఏం బావా! పాట నీ యిస్టమొచ్చినట్ల మార్సుకోని మార్సుకోని పాడుతుండవ్. ఆగట్టునుంటావా! ఈగట్టునుంటావా నాగన్న అని పాడాల్ల గదా!... అడిగాడు నెట్టేకల్లు కట్ట మీద కూచుంటూ. ఏమిలే నెట్టికంటి! తిమ్మప్ప అంటే ఏమన్న తిక్కప్ప అనుకుంటివా! నాను పాడే పాటకి అర్తం ఉండాది. నీది రంగస్థలం పాట.. నాది రాజకీయ రంగస్థలం పాట... లేచికూర్చుంటూ చెప్పాడు తిమ్మప్ప. ఎట్టెట్టా! రాజకీయ రంగస్థలం పాటనా! వాయబ్బో! నీకు అన్ని రకాల పాటలు తెల్సా! ఎంకప్ప... ఎంకప్ప అని పేరు మార్సి పాడుతుండవ్.. ఎంకప్పంటే మన బాయి కాడి ఎంకప్పనా!... అడిగాడు నెట్టెకల్లు. బాయికాడి ఎంకప్ప కాదురా! సెరువు కాడి పెద్ద కప్ప. యిప్పుడు కప్పలు సిగ్గుపడిపోతున్నాయంట. ఆగట్టున ఉండే కప్ప ఈ గట్టున ఉండే కప్ప పాడుకుంటున్న పాట యిది. నాయకులు ఆ పార్టీ నుండి ఈ పార్టీలోకి దుంకినట్ల నీకు దుంకనీక శ్యాతనయితదా! అని అడుగుతున్నాయంట... చెప్పాడు తిమ్మప్ప. ఓహోహ్హో! బలే చెప్పినావ్ బావ!... అంటూ గట్టిగా నవ్వాడు నెట్టేకల్లు. మన మురికి కాల్వల కాడ కప్పలు గద దుంకినట్ల యిప్పుడు నాయకులు కండ్లు మూసి తెర్సే లోపల పటపటమని ఏరే పార్టీలోకి దుంకుతున్నారన్నా... చెప్పాడు నెట్టేకల్లు. కాల్వలుల్ల, బాయిలల్ల, సెర్వులల్ల కప్పలే సిగ్గుతో తలకాయలు దించుకుంటున్నాయంట. వాయబ్బ.. మనకు నాలుగు కాళ్లుంటే గూడ నాయకుల లెక్క గబగబ దుంకల్యాకపోతుండమే.. వాలు రొండు కాల్లతోని లటుక్కున దుంకుతున్నారే అని నాయకులకెల్లి వారకంట సూసి మూతి ముడ్సుకుంటున్నాయంట... చెప్పాడు తిమ్మప్ప. అవు కద బావా! అస్సలు రోంత గూడ ఎనక ముందు ఆలోసన గూడ సెయ్యకుండ దుంకేది నేర్సుకున్నరీల్లు. అవు ఒక పార్టీ గుర్తు మింద గెల్సినాము.. గెల్సిన పార్టీ యింత బువ్వ పెట్టింది. ఇంత బట్ట యిచ్చింది. దానికి మర్యాద యిద్దామని లేదే. టిక్కెట్టు రాలేదంటూ లటుక్కున దుంకేదే. తిన్న తల్లెకే బొర్రలు పెట్టేదంటే యిదే సూడు బావా! చెప్పాడు నెట్టేకల్లు. నెట్టేకల్లు.. రానురాను నాయకులు శానా రాటుదేలిపోతుండరు. దుడ్లు సేతిలో పెడితే సిగ్గుశరం గాదు యాది యిడ్సమంటె అది యిడ్సనీక రడీ అయిపోతరు. ఒరే వీల్లని సూసి కప్పలే గాదు.. ఊసరివెల్లి గూడా సిగ్గుపడ్తుందంట... చెప్పాడు తిమ్మప్ప. ఊసరవెల్లి... అంటే ఏంది బావా! అదెట్లుంటది. దాంతోటి గూడా మన నాయకులు పోటీ పడ్తరా!.. అడిగాడు నెట్టేకల్లు. ఒరె నెట్టిగా! పల్లెటూర్ల పుట్టి పెరిగి ఊసరవెల్లిని సూసిలేవారా! ఊసరవెల్లి అంటే రంగులు మారుస్తుంటది. యా రంగు సెట్టు మింద గూసుంటే ఆ రంగు మార్సుకొని ఎవ్వురికి కనపడకుండ దొంగ సూపులు సూస్తుంటది. అట్ల మన ఘనమైన నాయకులు నిమిసానికో రంగు మారుస్తరు. పాపం ఊసరవెల్లి కొన్ని కొన్ని రోజులకొక రంగు మారిస్తే ఈల్లు గంటగంటకు రంగులు మారుస్తరు. సూడు మల్ల బి–ఫారం వచ్చేవరకు ఎవరెవరు ఎన్ని రంగులు మారుస్తరో... యాందాట్లో దూరి నామినేసను ఏస్తరో వాల్లకే తెలదు... చెప్పాడు తిమ్మప్ప. – కర్నూలు (కల్చరల్) -
తిరుగుబాట్లు, ఆందోళనలతో ఉక్కిరిబిక్కిరి
సాక్షి, హైదరాబాద్: గందరగోళం.. తకరారు.. తెగని పంచాయితీ.. అయోమయం.. అనిశ్చితి.. అసంతృప్తి.. అసమ్మతి.. ఈ పదాలన్నీ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఏర్పడిన మహాకూటమి ప్రస్తుత పరిస్థితికి అతికినట్టు సరిపోతాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరేం చేస్తారో.. అభ్యర్థుల జాబితా ఎప్పుడొస్తుందో.. అందులో ఏయే స్థానాలుంటాయో.. సీట్ల సర్దుబాటు ఇంకా ఎన్నాళ్లు సాగుతుందో.. అసలు ఈ పంచాయితీ ఎప్పటికి తేలుతుందో.. ఏమీ అర్థంకాని పరిస్థితి నెలకొంది. గత రెండు నెలలుగా ఎడతెరపి లేకుండా చర్చలు జరుగుతూనే ఉన్నా.. కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ నేతలు పదుల సార్లు కూర్చుని మాట్లాడుకున్నా.. సీట్ల పంచాయితీ తేలడం లేదు.. ఎవరెక్కడ పోటీ చేయాలనే లెక్కలు కుదరడంలేదు. కాలం కరిగిపోతూనే ఉన్నా.. ఈ తకరారుకు తెరపడటంలేదు.. కూటమి కోలుకునే పరిస్థితులూ కనిపించడంలేదు. ఆది నుంచీ అదే పరిస్థితి ఈ ఏడాది సెప్టెంబర్ 6న ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కానీ అప్పటికి చాలా ముందుగానే కూటమికి బీజం పడింది. అప్పుడెప్పుడో తెరవెనుక పడిన ఈ బీజం.. తెరపైకి వచ్చి కూడా రెండు నెలలు దాటిపోయింది. అప్పటి నుంచీ ప్రతి రోజూ గందరగోళం, సందిగ్ధత కనిపిస్తూనే ఉన్నాయి. అసలు కూటమిలో ఏయే పార్టీలుంటాయనే దానిపై కూడా స్పష్టత లేకుండా సాగిన నేతల చర్చలు.. నెలలు గడుస్తున్నా ముగియకపోవడం కూటమి శ్రేణులను నైరాశ్యంలో ముంచెత్తుతున్నాయి. కూటమిలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్న కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీచేయాలనే దానిపై ఇప్పటివరకు స్పష్టత రాకపోవడం కూటమిలో ఎండమావి లాంటి ఐక్యతకు అద్దం పడుతోంది. పోలింగ్‌కు కేవలం 23 రోజులు, ప్రచారానికి 21 రోజులు గడువు మాత్రమే మిగిలి ఉన్నా.. సీట్ల సర్దుబాటు కొలిక్కి రాకపోవడంపై ఆయా పార్టీలు శ్రేణులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నాయి. కూటమి నేతలు సీట్లు పంచుకునే లోపు తాము స్వీట్లు పంచుకుంటామని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేసి చాలా రోజులు అయినా, ఇప్పటివరకు సీట్ల సర్దుబాటు కుదరకపోవడం గమనార్హం. తాము 26 స్థానాల్లో పోటీచేస్తామని టీడీపీ, 36 స్థానాల జాబితా ఇచ్చామని టీజేఎస్, 12 స్థానాలు తమకివ్వాల్సిందేనని సీపీఐ పట్టు పట్టిన నాటి నుంచి ఇప్పటివరకు అర్థవంతమైన చర్చలకు కూటమిలో ఆస్కారం లేకుండా పోయిందనే విమర్శలు వస్తున్నాయి. ఎన్ని సీట్లు పోటీ చేస్తామన్నది అప్రస్తుతమని, గెలుపే ధ్యేయంగా సీట్లను ఎంచుకుంటామని అన్ని పార్టీలు చెబుతున్నా, ఏ పార్టీ కూడా తాము అనుకున్న స్థానాల్లో పోటీ నుంచి తప్పుకునేందుకు సిద్ధంగా లేకపోవడం కూటమిలోని గందరగోళ పరిస్థితులను తెలియజేస్తోంది. ఇందుకు నిదర్శనంగా బుధవారం సాయంత్రం టీజేఎస్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తాము పోటీచేస్తున్నట్టు ప్రకటించిన స్థానాల్లో ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థులు ప్రకటించిన స్థానాలుండడం విశేషం. ఆయా స్థానాల్లో తమ పోటీ ఖాయమని, తాము పోటీచేసే చోట్ల స్నేహపూర్వక పోటీలుండవని, తాము మాత్రమే బరిలో ఉంటామని చెప్పిన టీజేఎస్ నాయకత్వం.. కాంగ్రెస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన ఆసిఫాబాద్, స్టేషన్‌ఘన్‌పూర్‌తో పాటు టీడీపీ అభ్యర్థిని ప్రకటించిన మహబూబ్‌నగర్‌లోనూ పోటీలో ఉంటామని చెప్పడం కూటమిలో నెలకొన్న సందిగ్ధతను తెలియజేస్తోంది. ఆయా స్థానాల్లో పోటీచేస్తామని చెబుతూనే.. కూటమి ఉంటుందని, అవగాహనతో వెళ్తామని టీజేఎస్ నేతలు ప్రకటించడం విడ్డూరంగా ఉందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ ఏకపక్ష ప్రకటన... సర్దుబాటు పరిస్థితి అలా ఉంటే.. టికెట్ల పంచాయతీ వారం రోజులుగా కూటమి పక్షాల్లో అప్రతిహతంగా సాగుతోంది. తమ పార్టీ తరఫున పోటీచేసే అభ్యర్థుల జాబితా ఖరారు కోసం టీపీసీసీ నాయకత్వాన్ని ఢిల్లీకి పిలిపించిన నాటి నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోంది. వారం రోజులుగా జాబితాపై కుస్తీలు పట్టిన కాంగ్రెస్ నాయకత్వం చివరకు గత సోమవారం 65 మందితో తొలి జాబితా ప్రకటించింది. అందులో టీజేఎస్ అడుగుతున్న స్థానాల్లో కూడా అభ్యర్థులను ఏకపక్షంగా ప్రకటించింది. అంతకుముందు ఢిల్లీలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి ఆర్.సి.కుంతియా మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ 93 చోట్ల, టీడీపీ 14, సీపీఐ 3, టీజేఎస్ 8, ఇంటిపార్టీ 1 స్థానంలో పోటీచేస్తుందని ఏకపక్షంగా చెప్పేశారు. భాగస్వామ్య పక్షాలతో సర్దుబాటు పూర్తికాక ముందే ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీచేస్తుందో చెప్పేసి అన్ని పార్టీలను గందరగోళంలో పడేశారు. అయితే, ఇంటిపార్టీకి ఇస్తామని చెప్పిన ఒక్క స్థానాన్ని కూడా తేల్చకపోవడంతో ఆ పార్టీ బయటకు వెళ్లిపోవాల్సి వచ్చింది. ఇక, మిగిలిన పార్టీల్లోనూ ఏ పార్టీ ఎక్కడ పోటీచేయాలన్న దానిపై ఇంతవరకు సరైన అభిప్రాయానికి రాలేకపోయారు. కాంగ్రెస్‌లోనూ పెండింగే...! కూటమిలోని భాగస్వామ్య పార్టీలే కాదు.. కూటమికి నేతృత్వం వహిస్తున్నామని, పెద్దన్న పాత్ర పోషిస్తున్నామని చెప్పుకుంటున్న కాంగ్రెస్‌లోనూ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ టీవీ సీరియల్లా సాగుతూనే ఉంది. తాము పోటీ చేస్తామని చెబుతున్న స్థానాల్లో 19 చోట్ల అభ్యర్థులను ప్రకటించలేకపోయింది. ఇక, టీడీపీ అడుగుతున్న చోట్ల 11 స్థానాల్లో మాత్రమే స్పష్టత రాగా, మిగిలిన స్థానాలు ఎక్కడెక్కడన్నది ఎవరికీ అంతుపట్టడం లేదు. టీజేఎస్ పరిస్థితి మరీ గందరగోళంగా ఉంది. ఆ పార్టీ అడుగుతున్న స్థానాలు వచ్చే పరిస్థితి లేకపోగా, పోటీ చేయాలనుకుంటున్న చోట కూడా కాంగ్రెస్ మెలికలు పెడుతోంది. దీంతో చేసేదేమీ లేని పరిస్థితుల్లో టీజేఎస్ నాయకత్వం తాము పోటీచేయాలనుకుంటున్న 12 స్థానాలను ప్రకటించి బంతిని కాంగ్రెస్ కోర్టులోకి నెట్టేసింది. సీపీఐ కూడా దింపుడు కళ్లెం ఆశలతో 3 సీట్లకు సరిపెట్టుకుంటామని చెబుతూనే.. దేవరకొండ స్థానం కాంగ్రెస్ వదిలిపెడుతుందని నమ్మకముందని వ్యాఖ్యానించింది. మరోవైపు అభ్యర్థులను ప్రకటించిన చోట్ల తిరుగుబాట్లు, ఆందోళనతో కూటమి పక్షాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. ఇక, అందరం ఒకేచోట కూర్చుని అభ్యర్థులను ప్రకటిస్తామని, అక్కడే కనీస ఉమ్మడి ప్రణాళిక (సీఎంపీ)ని ప్రకటిస్తామని చెప్పినప్పటికీ అవేవీ జరిగే పరిస్థితులు కనిపించడంలేదు. ఎవరికి వారే టికెట్లు ప్రకటించుకుంటుండగా, సీఎంపీ ఎప్పుడు ప్రకటిస్తారన్నది కూడా తేలడంలేదు. ఈ పరిస్థితుల్లో అసలు కూటమి ఏ తీరం చేరుతుందో అర్థంకాని పరిస్థితులు అటు రాష్ట్ర రాజకీయ వర్గాలను, ఇటు ఆయా పార్టీలను గందరగోళానికి గురిచేస్తున్నాయి. -
మాల మాదిగలకు సమానంగా టికెట్లివ్వాలి
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు మాల మాదిగలకు సమానంగా టికెట్లు ఇవ్వాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య డిమాండ్ చేశారు. బుధవారం ఖైరతాబాద్‌లో ఏర్పాటు చేసిన మాల మహానాడు రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చెన్నయ్య మాట్లాడుతూ..అన్ని పార్టీలు ప్రకటించబోయే మేనిఫెస్టోలో తమ డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చే రుణాలను బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా రూ.5 లక్షల వరకు ఇవ్వాలని, సబ్‌ప్లాన్ నిధులను సక్రమంగా వినియోగించేలా కమిటీని ఏర్పాటుచేయాలని, అర్హులైన దళితులందరికీ ఇళ్లు నిర్మించాలని, మహిళా సంఘాలకు ఇచ్చే బ్యాంకు రుణాలు రూ.20 లక్షలకు పెంచి ప్రోత్సహించాలనే డిమాండ్లను మేనిఫెస్టోలో చేర్చాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మాల మహానాడు మహిళా అధ్యక్షురాలు సరసాదేవి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా శ్రీనివాస్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు శ్యామ్‌కుమార్, సాయి, దేవిక, రాజ్‌కుమార్, రాజేందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
లెక్క తేలినట్టే..
-
జేడీ(యూ), ఆర్జేడీల మధ్య సీట్ల రగడ
పట్నా: జనతా పరివార్ విలీన ప్రక్రియ ఆలస్యమవుతున్న నేపథ్యంలో కనీసం బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనైనా కలిసి పోటీ చేయాలనుకుంటే.. జేడీ(యూ), ఆర్జేడీల మధ్య సీట్ల పంపకంపై అప్పుడే గొడవ ప్రారంభమైంది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు గాను తమ పార్టీ 145 సీట్లలో పోటీ చేయాలని భావిస్తున్నట్టు ఆర్జేడీ ఉపాధ్యక్షుడు రఘువంశ్ ప్రసాద్ సింగ్ శుక్రవారం నాడిక్కడ చెప్పారు. దీనిపై జేడీ(యూ) నేత, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ ఘాటుగా స్పందించారు. ఆర్జేడీకి కనీసం 145 ఇవ్వాలని రఘువంశ్ పేర్కొనగా.. ‘145 ఎందుకు? మొత్తం 243 సీట్లూ తీసుకోవచ్చు..’ అంటూ నితీశ్ ఎద్దేవా చేశారు. ప్రస్తుత సీట్ల పంపకానికి 2010 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రాతిపదిక కారాదని సింగ్ ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలాన్ని పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. అయితే బీహార్‌లో ఎన్డీయే కుప్పకూలిన తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చిందని రఘువంశ్ పేర్కొన్నారు. ఆయన డిమాండ్‌ను బిహార్ సీఎం తోసిపుచ్చారు. ప్రస్తుత బిహార్ అసెంబ్లీ గడువు ఈ ఏడాది నవంబర్ 29తో ముగియనుంది.