పట్నా: జనతా పరివార్ విలీన ప్రక్రియ ఆలస్యమవుతున్న నేపథ్యంలో కనీసం బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనైనా కలిసి పోటీ చేయాలనుకుంటే.. జేడీ(యూ), ఆర్జేడీల మధ్య సీట్ల పంపకంపై అప్పుడే గొడవ ప్రారంభమైంది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు గాను తమ పార్టీ 145 సీట్లలో పోటీ చేయాలని భావిస్తున్నట్టు ఆర్జేడీ ఉపాధ్యక్షుడు రఘువంశ్ ప్రసాద్ సింగ్ శుక్రవారం నాడిక్కడ చెప్పారు. దీనిపై జేడీ(యూ) నేత, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ ఘాటుగా స్పందించారు. ఆర్జేడీకి కనీసం 145 ఇవ్వాలని రఘువంశ్ పేర్కొనగా.. ‘145 ఎందుకు? మొత్తం 243 సీట్లూ తీసుకోవచ్చు..’ అంటూ నితీశ్ ఎద్దేవా చేశారు.
ప్రస్తుత సీట్ల పంపకానికి 2010 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రాతిపదిక కారాదని సింగ్ ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలాన్ని పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. అయితే బీహార్‌లో ఎన్డీయే కుప్పకూలిన తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చిందని రఘువంశ్ పేర్కొన్నారు. ఆయన డిమాండ్‌ను బిహార్ సీఎం తోసిపుచ్చారు. ప్రస్తుత బిహార్ అసెంబ్లీ గడువు ఈ ఏడాది నవంబర్ 29తో ముగియనుంది.
జేడీ(యూ), ఆర్జేడీల మధ్య సీట్ల రగడ
Published Sat, May 16 2015 1:50 AM | Last Updated on Sun, Sep 3 2017 2:06 AM
Advertisement