మరోసారి సహనం కోల్పోయిన నితీష్‌.. మహిళా నేతపై అరిచిన సీఎం | Nitish Kumar To RJD MLA Rekha Devi Amid Ruckus Over Reservation In Assembly | Sakshi
Sakshi News home page

మరోసారి సహనం కోల్పోయిన నితీష్‌.. మహిళా నేతపై అరిచిన సీఎం

Published Wed, Jul 24 2024 6:56 PM | Last Updated on Wed, Jul 24 2024 8:06 PM

Nitish Kumar Loses Control On BJD Women MLA In Assembly

పట్నా: బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ మరోసారి తన సహనాన్ని కోల్పోయారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశంలో తమ ప్రత్యర్థి ఆర్‌జేడీకి చెందిన మహిళా నేతపై ఆగ్రహంతో ఊగిపోయారు. ఆయన చేసిన తాజా వ్యాఖ్యాలపై ప్రతిపక్ష ఆర్జేడీ నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు బిహార్‌ అసెంబ్లీ సమావేశంలో భాగంగా బుధవారం నితీష్‌ కుమార్‌ మాట్లాడుతుండగా.. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎదురుదాడికి దిగారు.. రిజర్వేషన్లు, బిహార్‌కు ప్రత్యేక హోదాపై ఆయన ప్రభుత్వం వైఫల్యానికి నిరసనగా ‘ నితీష్‌ డౌన్‌ డౌన్’‌ అంటూ నినాదాలు చేశారు.

దీనిపై నితీష్‌ కుమార్‌ మాట్లాడుతూ.. రిజర్వేషన్లపై పాట్నా హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించుకుందని తెలిపారు. అయినప్పటికీ ప్రతిపక్షాలు వెనక్కి తగ్గకపోవడంతో సహనం కోల్పోయిన సీఎం.. ఓ మహిళా నేతపై విరుచుకపడ్డారు. నువ్వు మహిళవే కదా? నీకేమైనా తెలుసా? తాను ఎలా మాట్లాడుతుందో చూడండి. .మీరు మహిళల కోసం ఏమైనా చేశారా? లేదు కదా. మేము మాట్లాడతాం మీరు నిశబ్దంగా వినండి..వినకపోతే అది మీ తప్పు.’అంటూ మడిపడ్డారు.

సీఎం వ్యాఖ్యలపై ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ మండిపడ్డారు. మహిళలపై వ్యాఖ్యలు చేసే సమయంలో నితీష్‌ కుమార్‌ అలవాటు పడిన నేరస్థుడిగా ప్రవర్తిస్తారని విమర్శలు గుప్పించారు. 2నువ్వు స్త్రీవి, నీకు ఏమైనా తెలుసా?’ అంటూ  మహిళలపై చౌకబారు, అసభ్యకరమైన, నీచమైన వ్యాఖ్యలు చేయడం గౌరవనీయులైన ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌కు అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. 

కాగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో  బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల పరిమితిని 65 శాతానికి పెంచుతూ బిహార్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పాట్నా హైకోర్టు ఇటీవల కొట్టివేసిన విషయం తెలిసిందే.ఈ పెంపు రాజ్యాంగ విరుద్ధమన్న న్యాయస్థానం.. 65శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తూ  గత నెల జూన్‌లో సంచలన తీర్పు వెలువరించింది. ఇక తాజాగా ఎన్డీయే కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న నితిష్‌ కుమార్‌.. బిహార్‌కు ప్రత్యేక హోదా కోసం డిమాండ్‌ చేస్తున్నారు. అయితే ఇటీవల కేంద్రం బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వలేమని తేల్చి చెప్పడంతో జేడీయూకు భారీ ఎదురుదెబ్బ తగిలింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement