Women leader
-
మరోసారి సహనం కోల్పోయిన నితీష్.. మహిళా నేతపై అరిచిన సీఎం
పట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ మరోసారి తన సహనాన్ని కోల్పోయారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశంలో తమ ప్రత్యర్థి ఆర్జేడీకి చెందిన మహిళా నేతపై ఆగ్రహంతో ఊగిపోయారు. ఆయన చేసిన తాజా వ్యాఖ్యాలపై ప్రతిపక్ష ఆర్జేడీ నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు బిహార్ అసెంబ్లీ సమావేశంలో భాగంగా బుధవారం నితీష్ కుమార్ మాట్లాడుతుండగా.. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎదురుదాడికి దిగారు.. రిజర్వేషన్లు, బిహార్‌కు ప్రత్యేక హోదాపై ఆయన ప్రభుత్వం వైఫల్యానికి నిరసనగా ‘ నితీష్ డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు.దీనిపై నితీష్ కుమార్ మాట్లాడుతూ.. రిజర్వేషన్లపై పాట్నా హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించుకుందని తెలిపారు. అయినప్పటికీ ప్రతిపక్షాలు వెనక్కి తగ్గకపోవడంతో సహనం కోల్పోయిన సీఎం.. ఓ మహిళా నేతపై విరుచుకపడ్డారు. నువ్వు మహిళవే కదా? నీకేమైనా తెలుసా? తాను ఎలా మాట్లాడుతుందో చూడండి. .మీరు మహిళల కోసం ఏమైనా చేశారా? లేదు కదా. మేము మాట్లాడతాం మీరు నిశబ్దంగా వినండి..వినకపోతే అది మీ తప్పు.’అంటూ మడిపడ్డారు.సీఎం వ్యాఖ్యలపై ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మండిపడ్డారు. మహిళలపై వ్యాఖ్యలు చేసే సమయంలో నితీష్ కుమార్ అలవాటు పడిన నేరస్థుడిగా ప్రవర్తిస్తారని విమర్శలు గుప్పించారు. 2నువ్వు స్త్రీవి, నీకు ఏమైనా తెలుసా?’ అంటూ మహిళలపై చౌకబారు, అసభ్యకరమైన, నీచమైన వ్యాఖ్యలు చేయడం గౌరవనీయులైన ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. కాగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల పరిమితిని 65 శాతానికి పెంచుతూ బిహార్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పాట్నా హైకోర్టు ఇటీవల కొట్టివేసిన విషయం తెలిసిందే.ఈ పెంపు రాజ్యాంగ విరుద్ధమన్న న్యాయస్థానం.. 65శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తూ గత నెల జూన్‌లో సంచలన తీర్పు వెలువరించింది. ఇక తాజాగా ఎన్డీయే కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న నితిష్ కుమార్.. బిహార్‌కు ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇటీవల కేంద్రం బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వలేమని తేల్చి చెప్పడంతో జేడీయూకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. -
జనసేన మహిళా నేతపై దాడి
ఒంగోలు టౌన్ : జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ మీద అదే పార్టీకి చెందిన జిల్లా అధ్యక్షుడు రియాజ్ వర్గం దాడికి పాల్పడ్డారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం దాసరివారిపాలెం కనపర్తిల వద్ద జరిగిన ఈ ఘటన జిల్లాలో సంచలనం రేకెత్తించింది. బాధితురాలు అరుణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. ముక్తినూతలపాడు గ్రామానికి చెందిన రాయపాటి అరుణ జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. ఆదివారం నాగులుప్పలపాడు మండలంలోని ఎన్జీపాడు, వినోదరాయునిపాలెం, అమ్మనబ్రోలు, దాసరిపాలెం, కనపర్తి గ్రామాల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు. రాత్రి 9 గంటల సమయంలో తిరుగు ప్రయాణంలో దాసరివారిపాలెం గ్రామ శివారు వద్దకు రాగానే జనసేన జిల్లా అధ్యక్షుడైన షేక్ రియాజ్ అనుచరులు ఒంగోలుకు చెందిన చెనపతి రాంబాబు, ఆరిగ శివ, షాలు, చిట్టెం ప్రసాద్, పల్లి రాజేష్, ముత్యాల కళ్యాణ్ రియాజ్ ప్రోత్సాహంతో కారును అడ్డగించారు. కారులో ఉన్న అరుణ అనుచరుడైన చరణ్‌ను బయటకు లాగి కొట్టారు. ఈ దాడి నుంచి చరణ్ తప్పించుకుని తిరిగి కారులో బయలు దేరినా విడిచిపెట్టకుండా రియాజ్ అనుచరులు కారును వెంబడించారు. కనపర్తి గ్రామం వద్ద అటకాయించారు. మహిళ అని కూడా చూడకుండా ఛాతిపై చెయ్యివేసి గుండెల మీద బలంగా పిడి గుద్దులు గుద్దారు. అదే కారులో ఉన్న ఉప్పుగుండూరుకు చెందిన జనసేన నాయకుడు బాలిశెట్టి నాగేశ్వరరావు అడ్డుపడగా చిట్టెం ప్రసాద్ ఆయనపై కర్రలతో దాడి చేసి కొట్టారు. ఈ దాడిలో అతడి తల పగిలి రక్త స్రావం కావడంతో స్థానికుల సాయంతో బయట పడ్డారు. అక్కడి నుంచి తప్పించుకున్న అరుణ నేరుగా ఒంగోలు జీజీహెచ్‌కు వెళ్లి చికిత్స చేయించుకున్నారు. అరుణ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దాడి విషయాన్ని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లినా పొత్తులతో బిజీగా ఉన్నామని, ఎన్నికలయ్యాక చూద్దాంలే అని తేలిగ్గా తీసుకున్నట్టు సమాచారం. -
7 గంటల్లో దిగిపోయినా మళ్లీ స్వీడన్ పీఠంపై ఆండర్సన్
కోపెన్‌హాగెన్(డెన్మార్క్): స్వీడన్ ప్రధాని పీఠంపై మహిళా నేత మాగ్డలీనా ఆండర్సన్ వారం రోజుల వ్యవధిలోనే మళ్లీ ఆసీనులయ్యారు. కూటమి ప్రభుత్వంలోని పార్టీ మద్దతు ఉపసంహరిం చడంతో గత వారం పదవికి రాజీనామా చేసిన ఆమె సోమవారం మళ్లీ ప్రధానిగా ఎన్నికయ్యారు. 349 సీట్లు ఉన్న స్వీడన్ పార్లమెంట్లో ప్రధాని పదవికి జరిగిన ఓటింగ్‌లో ఈమెకు మద్దతుగా 101 ఓట్లు పడ్డాయి. 75 మంది గైర్హాజరయ్యారు. స్వీడన్ రాజ్యాంగం ప్రకారం ప్రధానిగా ఎన్నుకోబడే వ్యక్తిని ఓటింగ్‌లో 175కు మించి సభ్యులు వ్యతిరేకించకూడదు. అంటే వ్యతిరేకంగా 175 ఓట్లు పడితే ఆ ప్రభుత్వం కొలువుతీరదు. అదృష్టవశాత్తు ఆండర్సన్‌కు వ్యతిరేకంగా 173 ఓట్లే పడ్డాయి. దీంతో మైనారిటీలో ఉన్నా సరే సోషల్ డెమొక్రటిక్ పార్టీ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటైంది. గత వారం గ్రీన్ పార్టీతో సోషల్ డెమొక్రటిక్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వాన్నిఏర్పాటుచేసింది. దేశ తొలి మహిళా ప్రధానిగా ఆండర్సన్ బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించారు. అంతకుముందే ఆర్థికమంత్రిగా ఉన్న ఆమె అదే హోదాలో బడ్జెట్‌ను వెంటనే ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్ ప్రతిపాదనలు విపక్ష స్వీడన్ డెమొక్రాట్స్ పార్టీ విధానాలకు అనుకూలంగా ఉన్నాయంటూ కూటమి ప్రభుత్వం నుంచి గ్రీన్ పార్టీ వైదొలగింది. దీంతో ఆరోజు కేవలం ప్రధాని అయిన ఏడు గంటలకే ఆండర్సన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. -
మామ లైంగిక దాడి: విడాకులకు వెళితే అక్కడ మరొకరు
గుంటూరు ఈస్ట్: భార్యాభర్తల గొడవలో తలదూర్చి మధ్యవర్తులు తనను బెదిరిస్తున్నారని గుంటూరుకు చెందిన స్వాతి అనే యువతి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్‌కు ఫిర్యాదు చేశారు. ఆమె కథనం ప్రకారం.. ఈనెల 2వ తేదీన స్వాతి అర్బన్ ఎస్పీ గ్రీవెన్స్‌కు వచ్చి భర్త సందీప్ వేధిస్తున్నాడని, మామ శ్రీనివాసరావు లైంగిక దాడికి యత్నించాడని, తన పాపను చంపేందుకు యత్నించారని ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో మహిళా మండలి నేతగా పరిచయం చేసుకున్న శైలజ అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తానని నమ్మించింది. 3వ తేదీన గీతా రీజెన్సీకి పిలిచి ఖర్చుల కింద రూ.25 వేలు ఇవ్వాలని అడిగింది. స్వాతి వ్యతిరేకించడంతో శైలజ, ఆమె అనుచరులు ఈమని చంద్రశేఖరరావు, కొర్రపాటి సురేశ్, నాగుల్‌మీరా స్వాతి భర్తకు మద్దతుగా నిలిచారు. స్వాతిపై ప్రెస్మీట్లు పెట్టించి యూట్యూబ్‌లో ప్రచారం చేశారు. ఆమె భర్త చేత లాలాపేట పోలీస్‌స్టేషన్‌లో తప్పుడు ఫిర్యాదు ఇప్పించారు. తమకు పోలీసు ఉన్నతాధికారులు బాగా సన్నిహితమని, తాము కోరినట్లు నగదు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫోన్లోనే పలుమార్లు బెదిరించారు. దళిత నాయకులైన ఈమని చంద్రశేఖరరావు, కొర్రపాటి సురేష్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామని బెదిరిస్తున్నారని, రక్షణ కల్పించాలని స్వాతి అర్బన్ ఎస్పీని కోరింది. -
భూ కబ్జా కేసులో టీడీపీ మహిళా నేత అరెస్ట్
పీఎం పాలెం(భీమిలి): టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అధికారులు, ప్రజాప్రతినిధుల అండతో కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమిని కబ్జాచేసిన టీడీపీ మహిళా నేతను సోమవారం పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గతంలో జీవీఎంసీ నాలుగో వార్డు టీడీపీ అధ్యక్షురాలుగా పనిచేసిన షేక్ జహనార అప్పటి మంత్రి అండదండలతో పీఎం పాలెం హౌసింగ్ బోర్డు కాలనీ సర్వే నంబరు 20లో ఉన్న భూమిని ఆక్రమించడానికి స్కెచ్ వేసి భవన నిర్మాణం ప్రారంభించింది. విషయం తెలుసుకున్న రెవెన్యూ, జీవీఎంసీ అధికారులు ఆ నిర్మాణాన్ని అప్పట్లోనే కూల్చేశారు. అనంతరం కొద్ది రోజుల తర్వాత మళ్లీ అదే స్థలంలో నిర్మాణం చేపట్టగా విషయం తెలుసుకున్న అధికారులు మళ్లీ కూల్చివేశారు. కొన్నాళ్ల తర్వాత జీవీఎంసీ, హౌసింగ్ బోర్డు అధికారులను మాయ చేసిన జహనార అదే స్థలంలో భవనం నిర్మించేసింది. అప్పట్లో సుమారు రూ.3 కోట్ల విలువ చేసే స్థలం సొంతం చేసుకుని దర్జాగా భవన నిర్మాణం పూర్తి చేసేసింది. అనంతరం టీడీపీ అధికారం కోల్పోయినప్పటికీ ఆక్రమణల్లో ఆరితేరిన షేక్ జహనార మాత్రం వెనక్కు తగ్గలేదు. తాజాగా ఈ నెల 13న సర్వే నంబరు 20/4లో ఉన్న ప్రభుత్వ స్థలం ఆక్రమించి రోడ్డు నిర్మాణ పనులు చేపట్టింది. లారీలతో కంకర తీసుకొచ్చి యంత్రాల సహాయంతో పనులు చేపట్టింది. విషయం తెలుసుకున్న విశాఖ రూరల్ తహసీల్దార్ కె.నరసింగరావు ఆదేశాల మేర కు సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని పనులు నిలుపుదల చేయించారు. అనంతరం తహసీల్దారు పీఎం పాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారించిన పోలీసులు టీడీపీ మహిళా నేత షేక్ జహనారను సోమవారం అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. -
టీడీపీ మహిళా నేత దందా
సాక్షి, పెనుకొండ: టీడీపీ మహిళా నేత అక్రమ దందా శుక్రవారం వెలుగులోకి వచ్చింది. మైనింగ్ అధికారులు సీజ్ చేసిన క్వారీ నుంచి కంకరను టిప్పర్‌తో అక్రమంగా తరలిస్తుండగా కియా పోలీసుస్టేషన్ సిబ్బంది శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. మండలంలోని గుట్టూరు సమీపంలో టీడీపీ నాయకురాలు సవితమ్మ నిర్వహిస్తున్న ఎస్ఆర్ఆర్ ట్రస్టుకు చెందిన క్వారీకి సరైన అనుమతులు లేకపోవడంతో ఇటీవల జిల్లా మైనింగ్ అధికారులు సీజ్ చేశారు. క్వారీలోని కంకరను బయటకు తరలించకుండా ఆదేశాలు జారీ చేశారు. అయితే నిబంధనలను ఉల్లంఘించి క్వారీ నిర్వాహకులు గత రెండు రోజులుగా 6 ఎంఎం కంకరను టిప్పర్‌లో బయటకు తరలిస్తున్నారు. నిఘా ఉంచిన కియా పోలీసులు టిప్పర్‌లో అక్రమంగా తరలిస్తుండగా దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం టిప్పర్ సహా డ్రైవర్‌ను స్టేషన్‌కు తరలించి విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ నారాయణ తెలిపారు. ఇదిలా ఉంటే టిప్పర్‌పై దేవా వెంకటకొండయ్య పేరు ఉంది. ఇతను సవితమ్మ భర్త వెంకటేశ్వరరావుకు స్వయానా తమ్ముడు. ఇతను చనిపోయాడు. కంకరను సవితమ్మే అక్రమంగా తరలిస్తుందనేందుకు ఇదే నిదర్శనంగా పోలీసులు భావిస్తున్నారు. అయినప్పటికీ కేసు నమోదు చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. -
పదేపదే.. కాలు తాకాడు: ఎంపీ భార్య
సాక్షి, తిరువనంతపురం : కేరళ కాంగ్రెస్ చీఫ్ కేఎం మణి కోడలు, ఎంపీ జోస్ మణి భార్య నిషా జోస్ ఓ పుస్తకంలో రాసుకున్న జ్ఞాపకాలు కలకలం రేపుతున్నాయి. ‘రాజకీయ నేత భార్యగా తన జీవితానుభవాలు’ పేరిట ఆమె రాసిన పుస్తకం ఇప్పుడు కేరళ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. గతంలో తాను రైలులో ప్రయాణిస్తుండగా చోటుచేసుకున్న లైంగిక వేధింపుల ఘటనను ఆమె ప్రస్తావించడంపై పెద్ద ఎత్తున చర్చకు తెరలేచింది. 2012లో తనతో కలిసి ప్రయాణించిన ఓ రాజకీయ నేత లక్ష్మణరేఖ దాటారంటూ పేరు వెల్లడించకుండా జోస్ మణి పేర్కొనడం దుమారం రేపుతోంది. ఆ వ్యక్తి తన కాలును ఉద్దేశపూర్వకంగా పలుమార్లు తాకారని ఆరోపించారు. ఈ విషయాన్ని తాను ట్రైన్ టికెట్ ఎగ్జామినర్ (టీటీఈ)కు ఫిర్యాదు చేసినా ఆయన తనకు సాయపడలేదన్నారు. నిందితుడికి వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటే తాను ఇబ్బందుల్లో పడతానని అతను భయపడినట్టు చెప్పారని ఆరోపించారు. నిందితుడు మిత్ర పక్షానికి చెందిన నేత కావడంతో సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోమని రైల్వే అధికారి తనకు ఉచిత సలహా ఇచ్చారని ఆమె రాసుకొచ్చారు. తాను రైల్వే స్టేషన్లో ఉండగా, సదరు వ్యక్తి తాను ఓ రాజకీయ నేత కుమారుడినని పరిచయం చేసుకున్నారని, రైలు ఎక్కిన తర్వాత కూడా అతను తనతో మాట్లాడేందుకు ప్రయత్నించాడని అప్పటి ఘటనను ఆమె ప్రస్తావించారు.మరోవైపు ఆమె చేసిన వ్యాఖ్యలపై కేరళ ఎంఎల్ఏ పీసీ జార్జ్ కుమారుడు షోన్ జార్జ్ స్పందించారు. తనను వేధించిన వ్యక్తి పేరును ఆమె వెల్లడించాలని కోరారు. పుస్తకాన్ని ప్రమోట్ చేసుకునేందుకే జోస్ మణి ఈ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కాగా, ఈ ఘటన జరిగినప్పుడు నిషా, జార్జ్‌లు ఇద్దరూ కాంగ్రెస్ కేరళ రాష్ట్ర శాఖలో పనిచేస్తున్నారు. -
మహిళా నేత దారుణ హత్య
♦ కొట్టి, తాడుతో ఉరి బిగించి చంపేసిన దుండగులు ♦ డాగ్‌స్క్వాడ్, క్లూస్ టీంతో పరిశీలన ♦ వివరాలు సేకరించిన ఎస్పీ రెమా రాజేశ్వరి ♦ కొట్టి, తాడుతో ఉరి బిగించి చంపేసిన దుండగులు ♦ డాగ్‌స్క్వాడ్, క్లూస్ టీంతో పరిశీలన ♦ వివరాలు సేకరించిన ఎస్పీ రెమా రాజేశ్వరి వికారాబాద్ రూరల్: వడ్డెర సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా నాయకురాలు దారుణహత్యకు గురయ్యారు. దుండగులు ఆమెపై దాడి చేసి తాడుతో ఉరేసి చంపేశారు. కలకలం రేపిన ఈ ఘటన వికారాబాద్ మున్సిపల్ పరిధిలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాలు.. తాండూరుకు చెందిన వరలక్ష్మి(32) వడ్డెర సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా నాయకురాలు. ఆమె తాండూరు ఓ బ్యూటీపార్లర్‌ను నడుపుతూ అక్కడే తన తల్లి, ఇద్దరు చెల్లెళ్లతో కలిసి ఉండేది. శుక్రవారం ఉదయం 7 గంటలకు వికారాబాద్ అనంతగిరిపల్లి సమీపంలో ఆమె మృతదేహంగా కనిపించింది. పశువుల కాపరులు చెప్పడంతో స్థానిక కౌన్సిలర్ భరత్ సమాచారంతో సీఐ రవి ఘటనా స్థలానికి చేరు కున్నారు. మృతదేహం బోర్లాపడి ఉండడం తో హతురాలికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. మృతదేహానికి పక్కనే పడిఉన్న పర్సు ను పోలీసులు పరిశీలించారు. అందులో ని ఫొటోలు, వివరాల ఆధారంగా వరలక్ష్మిగా గుర్తించారు. వరలక్ష్మి తలపై బండరాళ్లతో మోదిన ఆనవాళ్లు, మెడకు ఉరివేసినట్లుగా ఓ తాడు ఉంది. పోలీసు జాగిలాలు ఘటనా స్థలం నుంచి సమీపంలో ఉన్న సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలకు.. అక్కడి నుంచి పక్కనే ఉన్న ఓ పొలంలోకి వెళ్లింది. ఎస్పీ రెమా రాజేశ్వరి, ఏఎస్పీ వెంకటస్వామి, డీఎస్పీ స్వామి పరిశీలించారు. వరలక్ష్మి చెల్లెళ్లు తమ కుటుంబీకులంతా వచ్చే వరకు మృతదేహాన్ని తరలించేది లేదని భీష్మించారు. డీఎస్పీ స్వామి వారికి నచ్చజెప్పారు. వరలక్ష్మి గురువారం రాత్రి 8.30 గంటలకు తనతో ఫోన్లో మాట్లాడిందని ఆమె సోదరి తెలిపింది. భూమికి సం బంధించిన పనిపై వెళ్లాలని.. వారి వాహనంలోనే ఉన్నాను.. ఇంటికి వస్తున్నట్లు చెప్పిం దని తెలిపింది. పోలీసులు ఘటనా స్థలిలో కొన్ని లేఖలు స్వాధీనం చేసుకున్నారు. కేసు మిస్టరీ ఛేదనలో ఇవి కీలకం కానున్నాయి. సీఐ రవి కేసు దర్యాప్తు చేస్తున్నారు. 24 గంటల్లో పట్టుకుంటాం: ఎస్పీ వికారాబాద్ : వరలక్ష్మిని హత్య చేసిన వారిని 24 గంటల్లో పట్టుకుంటామని ఎస్పీ రెమా రాజేశ్వరి పేర్కొన్నారు. శుక్రవారం ఆమె తన కార్యాలయంలో మాట్లాడారు. వరలక్ష్మి గురువారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు బస్సులో బయలుదేరి వెళ్లి ఎంజీబీఎస్‌లో సాయంత్రం దిగినట్లు, వెంటనే తిరిగి బస్సులో మొయినాబాద్‌కు 5.17 గంటలకు వచ్చినట్లు తెలుస్తోందన్నారు. వరలక్ష్మి ఫోన్ కాల్‌డేటాను పరిశీలించి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు 4 పోలీసు బృందాలను ఏర్పాటు చేశామన్నారు. కొందకరిపై అనుమానం వ్యక్తం చేస్తూ హతురాలి చెల్లెలు నిర్మల పోలీసులకు ఫిర్యాదు చేసిందని ఎస్పీ తెలిపారు.