గుంటూరు ఈస్ట్: భార్యాభర్తల గొడవలో తలదూర్చి మధ్యవర్తులు తనను బెదిరిస్తున్నారని గుంటూరుకు చెందిన స్వాతి అనే యువతి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్‌కు ఫిర్యాదు చేశారు. ఆమె కథనం ప్రకారం.. ఈనెల 2వ తేదీన స్వాతి అర్బన్ ఎస్పీ గ్రీవెన్స్‌కు వచ్చి భర్త సందీప్ వేధిస్తున్నాడని, మామ శ్రీనివాసరావు లైంగిక దాడికి యత్నించాడని, తన పాపను చంపేందుకు యత్నించారని ఫిర్యాదు చేశారు.
ఆ సమయంలో మహిళా మండలి నేతగా పరిచయం చేసుకున్న శైలజ అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తానని నమ్మించింది. 3వ తేదీన గీతా రీజెన్సీకి పిలిచి ఖర్చుల కింద రూ.25 వేలు ఇవ్వాలని అడిగింది. స్వాతి వ్యతిరేకించడంతో శైలజ, ఆమె అనుచరులు ఈమని చంద్రశేఖరరావు, కొర్రపాటి సురేశ్, నాగుల్‌మీరా స్వాతి భర్తకు మద్దతుగా నిలిచారు. స్వాతిపై ప్రెస్‌మీట్లు పెట్టించి యూట్యూబ్‌లో ప్రచారం చేశారు. ఆమె భర్త చేత లాలాపేట పోలీస్‌స్టేషన్‌లో తప్పుడు ఫిర్యాదు ఇప్పించారు. తమకు పోలీసు ఉన్నతాధికారులు బాగా సన్నిహితమని, తాము కోరినట్లు నగదు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫోన్‌లోనే పలుమార్లు బెదిరించారు. దళిత నాయకులైన ఈమని చంద్రశేఖరరావు, కొర్రపాటి సురేష్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామని బెదిరిస్తున్నారని, రక్షణ కల్పించాలని స్వాతి అర్బన్ ఎస్పీని కోరింది.
మామ లైంగిక దాడి: విడాకులకు వెళితే అక్కడ మరొకరు
Published Tue, Aug 10 2021 9:56 AM | Last Updated on Tue, Aug 10 2021 10:00 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment