Guntur District Police
-
మామ లైంగిక దాడి: విడాకులకు వెళితే అక్కడ మరొకరు
గుంటూరు ఈస్ట్: భార్యాభర్తల గొడవలో తలదూర్చి మధ్యవర్తులు తనను బెదిరిస్తున్నారని గుంటూరుకు చెందిన స్వాతి అనే యువతి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్‌కు ఫిర్యాదు చేశారు. ఆమె కథనం ప్రకారం.. ఈనెల 2వ తేదీన స్వాతి అర్బన్ ఎస్పీ గ్రీవెన్స్‌కు వచ్చి భర్త సందీప్ వేధిస్తున్నాడని, మామ శ్రీనివాసరావు లైంగిక దాడికి యత్నించాడని, తన పాపను చంపేందుకు యత్నించారని ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో మహిళా మండలి నేతగా పరిచయం చేసుకున్న శైలజ అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తానని నమ్మించింది. 3వ తేదీన గీతా రీజెన్సీకి పిలిచి ఖర్చుల కింద రూ.25 వేలు ఇవ్వాలని అడిగింది. స్వాతి వ్యతిరేకించడంతో శైలజ, ఆమె అనుచరులు ఈమని చంద్రశేఖరరావు, కొర్రపాటి సురేశ్, నాగుల్‌మీరా స్వాతి భర్తకు మద్దతుగా నిలిచారు. స్వాతిపై ప్రెస్మీట్లు పెట్టించి యూట్యూబ్‌లో ప్రచారం చేశారు. ఆమె భర్త చేత లాలాపేట పోలీస్‌స్టేషన్‌లో తప్పుడు ఫిర్యాదు ఇప్పించారు. తమకు పోలీసు ఉన్నతాధికారులు బాగా సన్నిహితమని, తాము కోరినట్లు నగదు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫోన్లోనే పలుమార్లు బెదిరించారు. దళిత నాయకులైన ఈమని చంద్రశేఖరరావు, కొర్రపాటి సురేష్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామని బెదిరిస్తున్నారని, రక్షణ కల్పించాలని స్వాతి అర్బన్ ఎస్పీని కోరింది. -
కుర్రోకుర్రో సోది చెప్తానంటూ.. ఇంటిని దోచేస్తారమ్మా వీళ్లు
పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): కుర్రోకుర్రు.. మహర్జాతకమే తల్లి నీది.. కానీ నీ ఇంట ఏదో తేడా ఉంది.. అమ్మకు పూజ చేసి సరిచేయాలి అంటూ ఇంట్లో ఉన్నదంతా ఊడ్చేస్తారు.. చెబుతా.. చెబుతా.. సోది చెబుతా.. నీ కొచ్చిన కష్టం తీరుస్తా అంటూ నిలువునా దోచేస్తారు.. చేతబడి జరిగిందంటూ నమ్మబలికి నట్టేట ముంచేస్తారు. మన మూఢనమ్మకాలే పెట్టుబడిగా ప్రస్తుతం జిల్లాలో ఇబ్బడిముబ్బడిగా జ్యోతిష్యాలయాలు వెలిశాయి. దొంగస్వాములు పుట్టుకొచ్చారు. విద్యావంతులే వీరి చేతుల్లో చిక్కి దారుణంగా మోసపోతున్నారు.. ఇంకా సాధారణ ప్రజానీకం పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. శాస్త్రసాంకేతిక రంగాల్లో విశేష ప్రగతి సాధించాం. అంతరిక్షాన్నీ అందిపుచ్చుకుంటున్నాం. సామాజికంగానూ పురోభివృద్ధి సాధిస్తున్నాం.. అయినా ఇప్పటికీ మూఢనమ్మకాల నుంచి బయటకు రాలేకపోతున్నాం. ఏదో పూజ చేస్తే మంచి జరుగుతుందని చెబితే సులువుగా నమ్మేస్తున్నాం. నిలువుదోపిడీలు చెల్లిస్తున్నాం.. ఇలాంటివేమీ లేవు.. నమ్మొద్దని.. ప్రముఖ పండితులు, ప్రవచనకర్తలే నెత్తీనోరూ మొత్తుకుంటున్నా మనలో మార్పు రావడం లేదనేందుకు ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు బలం చేకూరుస్తున్నాయి. అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. చేతబడి పేరుతో రాబడి పొన్నూరుకు అతిదగ్గరగా ఉండే ఓ గ్రామంలో ఓ వ్యక్తి మంచిచెడులు చెబుతానంటూ ఓ దుకాణం తెరిచాడు. అతని వద్దకు వెళ్లిన వారిని నిలువునా దోచుకుంటున్నాడు. ఎవరైనా వెళ్తే ముందు దుకాణం సమీపంలోని ఓ కొట్టు వద్దకు వెళ్లి తెల్లకాగితం కొనుక్కురావాలని చెబుతాడు. అక్కడికి వెళ్లాక తెల్లకాగితం, ఓ కొబ్బరికాయ ఇచ్చి రూ.200 వసూలు చేస్తారు. ఆ తర్వాత తెల్లకాగితాన్ని ఒక పద్ధతి ప్రకారం మడిచి అమ్మవారి వద్ద పెట్టి దండం పెట్టుకుని రావాలని చెబుతారు. అమ్మవారు హుండీలో రూ.5వేలు వేయమంటోందని, తమ నోటికొచ్చిన అంకె చెప్పేస్తారు. ఆ డబ్బులు హుండీలో వేసిన తర్వాత తెల్లకాగితాన్ని రసాయనంలో కలిపిన నీటిలో ముంచి తీస్తారు. ముందుగానే తెల్లకాగితంపై పటికతో పిచ్చి గీతలు, బొమ్మలు వేసి ఉంచడం వల్ల రసాయనంలో ముంచిన తర్వాత దానిపై గీతలు, బొమ్మలు కనిపిస్తాయి. ఆఖరికి దొంగస్వామి వచ్చి వాటిని చూపి చేతబడి జరిగిందని భయపెట్టి, దానిని విరగడ చేయాలంటే పూజలు చేయాలని నమ్మిస్తాడు. రూ.లక్షల్లో వసూలు చేస్తాడు. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. మూఢనమ్మకాలొద్దు జీవితంలో సమస్యలు సహజం. వాటికి శాస్త్రీయంగా పరిష్కార మార్గాలు వెతకాలి. అంతేగానీ అతీత శక్తులు, జ్యోతిష్యాలు, చేతబడులను నమ్మకూడదు. నమ్మితే దానిని ఆసరాగా చేసుకుని చాలా మంది మోసం చేస్తారు. ప్రజలను నమ్మించి దోచుకునే దొంగస్వాములు, జ్యోతిష్యుల భరతపడతాం. ఇలాంటి వారి గురించి తెలిసినా.. వారి వల్ల బాధితులైనా ధైర్యంగా పోలీసులకు సమాచారం ఇవ్వండి వారి పనిపడతాం. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. - కె.సుప్రజ, డీఎస్పీ, గుంటూరు వెస్ట్ -
మత్తు మందిచ్చి బాలికపై లైంగికదాడి
తాడేపల్లి రూరల్ (మంగళగిరి): గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండలో బాలికకు మత్తు మందిచ్చి ఖాశింవలి అనే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమె తల్లికి ఆరోగ్యం బాగోలేదని నమ్మబలికి వేరే ఊరులో ఉన్న ఆ బాలికను రప్పించి.. మరోసారి లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీనిపై బాలిక తల్లి, బంధువులు శుక్రవారం రాత్రి 10 గంటలకు తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులోని వివరాల మేరకు... కొలనుకొండ గ్రామంలో నివాసం ఉండే ఖాశిం వలి, అతని భార్య రసూల్‌బీ స్థానికంగా వడ్డీ వ్యాపారస్థులు. బాధిత బాలిక తల్లి, వారి కుటుంబసభ్యులు పూసలు అమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. బాధిత బాలికను ఖాశిం వలి ఈ ఏడాది రంజాన్ మాసంలో తన ఇంటికి తీసుకెళ్లి.. కూల్‌డ్రింక్‌లో మత్తు మందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం బయటపడటంతో మత పెద్దల సమక్షంలో రాజీ కుదిర్చారు. అనంతరం బాలికను వేరే ప్రాంతంలోని మదరసాకు తరలించారు. ఈ నెల 22న బాలిక తల్లికి ప్రమాదం జరిగిందని మదరసా వద్దకు వెళ్లి ఖాశిం వలి ఆ బాలికకు తెలిపాడు. ఈ విషయాన్ని బాలిక మదరసా పెద్దలకు చెప్పడంతో వారు నమ్మలేదు. దీంతో బాలిక గోడ దూకి వచ్చి ఖాశిం వలితో కొలనుకొండ వచ్చింది. బాలిక బంధువులు తిరునాళ్ల కోసం ఊరు వెళ్లడంతో.. తమ ఇంటికి తీసుకెళ్లి మరోసారి ఖాశిం వలి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అతని భార్య కూడా ఈ దారుణానికి సహకరించింది. ఈ నేపథ్యంలో బాలిక వారి నుంచి తప్పించుకుని విజయవాడకు వెళ్ళగా, స్వచ్ఛంద సంస్థకు చెందినవారు ఆమె నుంచి వివరాలు సేకరించటంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వెంటనే వారు బాలిక బంధువులు, తల్లికి సమాచారం అందించడంతో వారు శుక్రవారం రాత్రి 10 గంటలకు తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఖాశింవలిని అదుపులోకి తీసుకున్నారు. -
లైంగిక దాడి నిందితుడి అరెస్టు
గుంటూరు: ఐదేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని గుంటూరు అర్బన్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణంలోని అర్బన్ కాన్ఫరెన్స్ హాలులో అర్బన్ ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ వివరాలు వెల్లడించారు. గుంటూరులోని రామిరెడ్డి నగర్ 7వ లైనులో ఓ వివాహిత తన ఐదేళ్ల కుమార్తెతో కలసి నివాసం ఉంటూ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. యూకేజీ చదువుతున్న ఆమె కుమార్తె(5) ఈ నెల 11వ తేదీ సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వచ్చింది. ఇంటికి తాళం వేసి ఉండడంతో బాలిక ఇంటి ముందు ఆడుకుంటుండగా 19 ఏళ్ల నిందితుడు బాలికను ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లి వెంటనే నగరంపాలెం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. బాలికను చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తరలించి పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని శనివారం చుట్టుగుంట సెంటర్లో అదుపులోకి తీసుకుని విచారించగా లైంగికదాడికి పాల్పడినట్లు అంగీకరించాడు. నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ,అట్రాసిటీ, పోక్సో యాక్ట్‌తో పాటుగా సెక్షన్ 376(2)ఐ ప్రకారం కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కాగా, ఆపదలో ఉన్న వారు డయల్ 100తో పాటుగా 86888 31568 వాట్సాప్ నంబరును సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ కోరారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాల మేరకు ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ పర్యవేక్షణలో ఫాస్ట్‌ట్రాక్‌లో దర్యాప్తు పూర్తి చేసి 15 రోజుల్లో చార్జిషీటును దాఖలు చేస్తామని ఎస్పీ తెలిపారు. -
బీ అలర్ట్
ఏ ఇద్దరు మాట్లాడుకున్నా.. ఏ ముగ్గురు ముచ్చటించినా, ఏ నలుగురు కూడినా ఒకటే చర్చ.. ఎవరు గెలుస్తారు.. ఎవరి మెజార్టీ ఎంత.. అధికారం ఎవరిది.. ఎన్నికలు ముగిశాక ఫలితాలకు సుదీర్ఘ సమయం ఉండడంతో అటు పార్టీల నాయకులతోపాటు ప్రజలకూ టెన్షన్ మొదలైంది. ఫలితాలకు సమయం దగ్గర పడడంతో ఇప్పుడు ఆ టెన్షన్ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో ఫలితాలు వెలువడ్డాక పరిస్థితులు ఏంటి ? ఎక్కడైనా వివాదాలు తలెత్తే అవకాశం ఉందా ? అనే అంశాలపై పోలీసులు నిఘా పెట్టారు. సమస్యాత్మక గ్రామాలను గుర్తించారు. ఆ గ్రామాల్లో కదలికలపై ఇప్పటి నుంచే ఓ కన్నేశారు. మరో వైపు జిల్లాకు అదనపు బలగాలు కావాలంటూ ఉన్నతాధికారులు లేఖ రాశారు. సాక్షి, గుంటూరు: ఎన్నికల ఫలితాలు రాజకీయ పార్టీలతోపాటు గ్రామాల్లో సైతం వేడి రాజుకున్న విషయం తెలిసిందే. ఈ నెల 23వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత గ్రామాల్లో రెండు, మూడు రోజులపాటు గొడవలు జరిగే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించడంతో సమస్యాత్మక గ్రామాలను గుర్తించిన గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ ఎస్వీ రాజశేఖరబాబు ఆయా గ్రామాలపై డేగ కన్ను వేశారు. గొడవలు తలెత్తకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలపై స్థానిక పోలీసు అధికారులకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అదనంగా మరి కొంత బలగాలు కావాలంటూ ఇప్పటికే ఉన్నతాధికారులను కోరినట్లు తెలిసింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత రూరల్ జిల్లా పరిధిలో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. పల్నాడు ప్రాంతంపై నిఘా గుంటూరు రూరల్ జిల్లా పరిధిలో పోలింగ్ రోజు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అవాంఛనీయ ఘటనలు జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలోని నరసరావుపేట, గురజాల, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో పోలీసు శాఖపై మచ్చ పడింది. కొందరు పోలీసు అధికారుల నిర్లక్ష్యం వల్లే ఆయా ప్రాంతాల్లో గొడవలు జరిగాయని నిర్ధారించుకున్న ఉన్నతాధికారులు ఇప్పటికే వారిపై చర్యలకు సిఫార్సులు చేశారు. రాజకీయ పార్టీలకు చెందిన ముఖ్య నేతలే గొడవలు సృష్టించేలా వ్యవహరిస్తున్న తీరు పోలీసులను కలవరపాటుకు గురి చేస్తోంది. దీనికి తోడు ఎన్నికల ఫలితాలు వెలువడే సమయంలో హింసాత్మక ఘటనలు జరిగే ప్రమాదం ఉందంటూ సోషల్ మీడియాలో అన్ని రాజకీయ పార్టీల నేతలు, నెటిజన్లు సైతం పోస్టింగ్‌లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఫ్యాక్షన్ గ్రామాలు అధికంగా ఉన్న పల్నాడు ప్రాంతంలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఎన్నికల ఫలితాలు రాగానే దాడులు చేసేందుకు గ్రామాల్లోని కొన్ని వర్గాలు సిద్ధమవుతున్నాయనే నిఘా వర్గాల హెచ్చరికతో అప్రమత్తమయ్యారు. అదనపు బలగాలు ఇప్పటికే జిల్లాలో ఉన్న 13 ఏపీఎస్పీ ప్లటూన్లకు తోడు మరో ఎనిమిది ప్లటూన్ల ఏపీఎస్పీ బలగాలను పంపాలంటూ గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ రాజశేఖర బాబు ఉన్నతాధికారులకు లిఖిత పూర్వకంగా కోరినట్లు తెలిసింది. సమస్యాత్మక గ్రామాలపై పూర్తి స్థాయి నిఘా ఉంచడంతోపాటు గొడవలు సృష్టించే వారి వివరాలు సేకరించి వారికి హెచ్చరికలు జారీ చేసేందుకు సమాయత్తమవుతున్నారు. ఫలితాలు వచ్చిన తరువాత తమకు ఓట్లు పడలేదనే అక్కసుతో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీవర్గాలపై దాడులకు పాల్పడే ప్రమాదం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఆమేరకు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఈనెల 23న ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో పట్టణాలతోపాటు, గ్రామాల్లో సైతం 144 సెక్షన్ అమలులోకి తీసుకొచ్చి గుంపులుగా చేరడం, ఊరేగింపులు, ర్యాలీలు చేపట్టకుండా చూసేలా స్థానిక పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు తెలిసింది. ఎన్నికల రోజు గొడవలు జరిగిన ప్రాంతంలో ప్రతిదాడులు జరిగే అవకాశాలు ఉండటంతో ఆయా ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉంటూ పోలీసు బందోబస్తును సైతం రెట్టింపు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గ్రామాల్లో ఇరుపార్టీలకు చెందిన ముఖ్య నాయకులతో మాట్లాడి శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా చూసేలా గ్రామాల్లో పోలీసు అధికారులు పర్యటించాలని సూచిస్తున్నారు. గ్రామాల్లో గొడవలు జరిగితే ఎన్నికల సమయంలో బైండోవర్లు చేయించుకున్న నేతలపై కేసులు నమోదు అవుతాయంటూ ముందస్తు హెచ్చరికలు చేస్తున్నట్లు సమాచారం. కౌంటింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు గ్రామాల్లో పరిస్థితి ఇలా ఉంటే కౌంటింగ్ కేంద్రాల వద్ద సైతం అధికార పార్టీ నేతలు బాహాబాహీకి దిగే ప్రమాదం ఉందని గ్రహించిన పోలీసు ఉన్నతాధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాలకు సమీపంలో గుంపులుగా చేరకుండా కౌంటింగ్ కేంద్రాలకు దగ్గర్లో పోలీసు చెక్‌పోస్టులు ఏర్పాట్లు చేసి తనిఖీలు చేసేందుకు ఏర్పాటు చేస్తున్నారు. కౌంటింగ్ ఏజెంట్లతోపాటు, అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తరువాత మాత్రమే లోపలకు అనుమతిస్తారు. బాంబు, డాగ్‌స్క్వాడ్‌ల ద్వారా తనిఖీలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. గ్రామాల్లో గొడవలు సృష్టిస్తే ఉపేక్షించేది లేదు ఎన్నికల ఫలితాలు ముందుగాని, తరువాత గానీ గ్రామాల్లో గొడవలు సృష్టిస్తే ఉపేక్షించం. ఇప్పటికే సమస్యాత్మక గ్రామాలను గుర్తించి నిఘా ఉంచాం. ఫలితాలు వెలువడే రోజు ఆయా గ్రామాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రాజకీయ పార్టీల నాయకులు సమన్వయంతో వ్యవహరించి శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా పోలీసు శాఖకు సహకరించాలి.– రాజశేఖరబాబు, రూరల్ ఎస్పీ -
గుంటూరు జిల్లాలో నకిలీ నోట్ల తయారీ ముఠా అరెస్ట్
-
మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం
-
భారీగా నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం
గుంటూరు క్రైం: రైతుల జీవితాలను నాశనం చేసే కల్తీ పత్తి విత్తనాలు పట్టుపడుతూనే ఉన్నాయి. గుంటూరు కేంద్రంగా పెద్ద మొత్తంలో నకిలీ విత్తనాలు తయారవుతున్నా అధికారులు కనీస జాగ్రత్తలు కూడా తీసుకోవటం లేదు. తూతూ మంత్రంగా దాడులు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారు. తాజాగా నకిలీ పత్తివిత్తనాలు విక్రయిస్తున్న మరో నలుగురిని గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 3 లక్షల విలువైన కల్తీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు బస్టాండ్ సమీపంలో సోమవారం తనిఖీలు చేపట్టిన విజిలెన్స్ అధికారులు ఓ దుకాణంలో నిల్వ ఉంచిన రూ. 3 లక్షల విలువైన కల్తీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. -
‘వైఎస్ జగన్ సభలకు వచ్చారని వేధిస్తున్నారు’
గుంటూరు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈనెల 16న వేజండ్లకు వచ్చిన క్రమంలో ర్యాలీ నిర్వహించిన కార్యకర్తలను చేబ్రోలు ఎస్ఐ ఆరోగ్యరాజు వేధింపులకు గురి చేస్తున్నారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త రావి వెంకటరమణలు అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని కలిసి వివరించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో అర్బన్ ఎస్పీ త్రిపాఠిని శనివారం బాధితులతో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన వాస్తవ పరిస్థితులను తెలిపారు. సెల్‌ఫోన్‌కు సంబంధించిన ఒక ఘర్షణకు సాకుగా చూపి వేజండ్ల వార్డు మెంబర్ షేక్ సంధాని, గౌస్‌లను స్టేషన్‌కు పిలిపించి ఇష్టానుసారం కొట్టారని ఆరోపించారు. అయితే దీనిపై బాధితులు ఆస్పత్రికి వెళితే కేసులు పెడతానంటూ ఎస్ఐ బెదిరించారన్నారు. అప్పటికే సంధాని, గౌస్‌ల వద్ద తెల్లకాగితాలపై సంతకాలు తీసుకున్న పోలీసులు కేసులు నమోదు చేస్తామని వేధిస్తున్నారని వివరించారు. వైఎస్ జగన్ ర్యాలీకి ఎందుకు వెళుతున్నారంటూ ఎస్ఐ అడిగారని బాధితులు పేర్కొన్నారు. ఎస్ఐ వేధింపులను తట్టుకోలేకపోతున్నామని వారు తెలియజేశారు. -
16 చోట్లకు మారిన ప్రొఫెసర్ లక్ష్మి
-
16 చోట్లకు మారిన ప్రొఫెసర్ లక్ష్మి
గుంటూరు : మెడికో విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య కేసులో నిందితురాలు ప్రొఫెసర్ లక్ష్మి, ఆమె భర్త విజయ సారథిని పోలీసులు మంగళవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఐజీ సంజయ్ మీడియాకు వివరించారు. ప్రొఫెసర్ లక్ష్మితో పాటు ఆమె భర్తను సోమవారం బెంగళూరులో అదుపులోకి తీసుకున్నామని, లక్ష్మితో పాటు మరో ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు ఐజీ తెలిపారు. సంధ్యారాణి ఆత్మహత్య తర్వాత పరారీలో ఉన్న లక్ష్మి...బెయిల్ వచ్చేవరకూ ఆచూకీ తెలియకూడదనే ఉద్దేశంతో 16 ప్రాంతాలు మార్చారని ఐజీ సంజయ్ తెలిపారు. పుల్లలచెరువు మొదలు పాండిచ్చేరీ, చెన్నై, తిరుపతి,గుంటూరు,హైదరాబాద్, షిర్డీ సహా బెంగళూరు ప్రాంతాల్లో తలదాచుకున్నట్లు చెప్పారు. బెంగళూరులో లక్ష్మి దంపతులకు ప్రయివేట్ బ్యాంక్ ఉద్యోగి సహకరించాడని, అలాగే వారికి సహకరించినవారిపై చర్యలు తీసుకుంటామని సంజయ్ వెల్లడించారు. విచారణ దాదాపు పూర్తయిందని, టెక్నికల్ గా మరింత సమాచారం సేకరించాల్సి ఉందన్నారు. అలాగే స్థానిక పోలీసుల వైఫల్యంపై విచారణ జరుపుతున్నట్లు చెప్పారు. ఈ కేసులో లక్ష్మి వేధింపులకు సంబంధించి ముఖ్యమైన ఆధారం ఆత్మహత్య చేసుకున్న సంధ్యారాణి డైరీ అన్నారు. ఈ ఏడాది ఆగస్ట్‌లోనూ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు ఆమె తన డైరీలో రాసుకున్నట్లు చెప్పారు. కేసు విచారణను జాప్యం చేస్తున్నారంటూ తమపై ఆరోపణలు వచ్చాయన్నారు. ఈ కేసులో మొత్తం ఎనిమిది టీమ్‌లు పనిచేశాయని ఐజీ తెలిపారు. నిందితులను కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. దురదృష్టకర ఘటన సంధ్యారాణి ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమని ప్రొఫెసర్ లక్ష్మి భర్త విజయ్ సారథి అన్నారు. చట్టం మీద గౌరవం ఉందని, అయితే బెయిల్ వస్తుందనే ఉద్దేశంతోనే తాము పలు ప్రాంతాలు తిరిగినట్లు చెప్పారు. కారణాలు ఏవయినా తమ కుటుంబంలో ఓ సభ్యురాలు చనిపోయిందనే బాధ తమలో ఉందన్నారు. నేను ఏ తప్పు చేయలేదు తాను ఏ తప్పు చేయలేదని, తనపై ఎలాంటి ఆరోపణలు లేవని ప్రొఫెసర్ లక్ష్మి అన్నారు. సంధ్యారాణికి పీజీలో గైనికాలజీ చేయడంపై ఆసక్తి లేదన్నారు. అయితే సంధ్యారాణి భర్త ఒత్తిడి చేయడంతోనే ఆమె గైనిక్ చేస్తోందని లక్ష్మి తెలిపారు. తాను చెప్పింది సంధ్యారాణి అర్థం చేసుకోలేదని అన్నారు. -
గుంటూరుకు ప్రొఫెసర్ లక్ష్మి దంపతులు
గుంటూరు : పీజీ విద్యార్థిని డాక్టర్ సంధ్యారాణి బలవన్మరణం కేసులో నిందితురాలు ప్రొఫెసర్ లక్ష్మిని పోలీసులు మంగళవారం తెల్లవారుజామున గుంటూరు తీసుకు వచ్చారు. వీరిని రహస్య ప్రాంతానికి తరలించి విచారణ జరుపుతున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు మీడియా ఎదుట ప్రవేశపెట్టే అవకాశం ఉంది. లక్ష్మితో పాటు ఆమె భర్త డాక్టర్ విజయసారథిని పోలీసులు సోమవారం బెంగళూరులో అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ప్రొఫెసర్ లక్ష్మి దంపతులు బెంగళూరులోని ఓ స్నేహితుడి ఇంట్లో ఉన్నట్లు సమాచారం అందుకున్న ప్రత్యేక పోలీస్ బృందం నిన్న దాడి చేసి వీరిని అరెస్టు చేసింది. వీళ్లు పోలీసులకు దొరక్కుండా 22 రోజుల పాటు ఐదు రాష్ట్రాలు చుట్టేశారు. పోలీసు శాఖలోని ఓ ఉన్నతాధికారితో పాటు, ఓ రిటైర్డ్ జడ్జి, అధికార నేతల సలహా మేరకే బెయిల్ వచ్చే వరకూ పోలీసులకు దొరకకూడదని వీరు నిర్ణయించుకున్నట్లు సమాచారం. కాగా ప్రొఫెసర్ లక్ష్మిని బెంగళూరులో పోలీసులు అరెస్ట్ చేయడం బూటకమని, బెయిల్‌పై జిల్లా కోర్టు, హైకోర్టులో ఆమెకు చుక్కెదురు అవడంతో గత్యంతరం లేని స్థితిలోనే ఆమె పోలీసులకు లొంగిపోయిందని న్యాయవాది వైకే ఆరోపించారు. -
ప్రొఫెసర్ లక్ష్మి దంపతుల అరెస్ట్
- మూడు రోజులుగా బెంగళూరులోని స్నేహితుడి ఇంట్లో మకాం - పక్కా సమాచారంతో దాడిచేసి పట్టుకున్న ప్రత్యేక పోలీస్ బృందం సాక్షి, గుంటూరు/ బెంగళూరు: డాక్టర్ సంధ్యారాణి ఆత్మహత్య కేసులో నిందితురాలిగా ఉన్న ప్రొఫెసర్ లక్ష్మితో పాటు ఆమె భర్త డాక్టర్ విజయసారథిని పోలీసులు సోమవారం బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. మూడు రోజులుగా బెంగ ళూరులోని ఓ స్నేహితుడి ఇంట్లో ఉన్నట్లు సమాచారం అందుకున్న ప్రత్యేక పోలీస్ బృందం దాడి చేసి వీరిని అరెస్టు చేసింది. సోమవారం అర్థరాత్రికి వీరిని గుంటూరు తీసుకువచ్చే అవకాశం ఉంది. కాగా, లక్ష్మి దంపతులు పోలీసులకు దొరక్కుండా 22 రోజుల పాటు ఐదు రాష్ట్రాలు చుట్టేశారు. పోలీసు శాఖలోని ఓ ఉన్నతాధికారితో పాటు, ఓ రిటైర్డ్ జడ్జి, అధికార నేతల సలహా మేరకే బెరుుల్ వచ్చే వరకూ పోలీసులకు దొరకకూడదని వీరు నిర్ణరుుంచుకున్నట్లు సమాచారం. గత నెల 24న సంధ్యారాణి మృతిచెందగా, ఆ రోజు రాత్రి లక్ష్మి దంపతులు గుంటూరుకు చెందిన ఓ వ్యాపారి ఏర్పాటు చేసిన ట్రావెల్స్ కారులో మొదట ప్రకాశం జిల్లాకు వెళ్లి, అటు నుంచి తమ కుమారుడు చదువుకుంటున్న పాండిచ్చేరి వెళ్లి అక్కడ ఓ లాడ్జిలో బస చేశారు. ఆ తర్వాత చెన్నై, తిరుపతి వెళ్లిన వీరు.. తమ కుమారుడిని తిరిగి పాండిచ్చేరికి పంపించేశారు. ఇక అటు నుంచి మహారాష్ట్రలోని షిరిడీ, శనిసింగనాపూర్, షోలాపూర్ వంటి పుణ్యక్షేత్రాలు తిరిగి చివరకు హైదరాబాద్ చేరుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అరుుతే హైదరాబాద్‌లో వీరి జాడ కనిపెట్టలేక పోయారు. అక్కడి నుంచి మంత్రాలయం, మహానంది వంటి క్షేత్రాలకు వెళ్లినట్లు పోలీసులకు సమాచారం అందడంతో కొన్ని బృందాలను పంపారు. మరోవైపు ఆమె భర్త, ఏపీ మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ డాక్టర్ విజయసారథికి గతంలో రెండు సార్లు బైపాస్ సర్జరీ జరిగింది. అలాగే మానసిక ఒత్తిడి, యూరిన్‌లో రక్తం పడుతుండటంతో ఆయన మార్గంమధ్యలో పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ ప్రయాణిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. సినీఫక్కీలో అరెస్ట్ : ఈ క్రమంలో లక్ష్మి దంపతులు బెంగళూరుకు చేరుకున్న విషయాన్ని తెలుసుకున్న పోలీసులు.. కర్ణాటక డీజేపీ ఓం ప్రకాశ్‌తో పాటు బెంగళూరు నగర పోలీస్ కమిషనర్‌కు సమాచారం అందించారు.ఆ దంపతులు ఏటీఎం ద్వారా ఎక్కడ డబ్బులు డ్రా చేసినా పోలీస్ అధికారుల సెల్‌కు మెసేజ్ వచ్చేలా బ్యాంకు అధికారుల సహకారం తీసుకున్నారు. బెంగళూరులోని జయనగర్‌లో ఓ స్నేహితుడి ఇంట్లో మూడ్రోజులుగా ఉన్న వీరు డబ్బులు డ్రా చేయాలని స్నేహితుడి కుమారుడికి ఏటీఎం కార్డు ఇచ్చి పంపారు. అలా డబ్బు డ్రా చేయగానే పోలీసు అధికారి సెల్‌కు మెసేజ్ రావడంతో వారు వెంటనే ఏటీఎం సెంటర్ లొకేషన్ కనిపెట్టి ఆ ఏరియా పోలీసులను అలర్ట్ చేసి.. అతన్ని వెంబడించి అతను ఇంట్లోకి వెళ్లగానే పోలీసులు ఆ గృహాన్ని చుట్టుముట్టి దాడి చేశారు. లక్ష్మి దంపతులు అక్కడే ఉండటంతో అదుపులోకి తీసుకున్నారు.ఓ పోలీసు ఉన్నతాధికారి లక్ష్మి దంపతులకు తమ కదలికలను ఎప్పటికప్పుడు చేరవేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికి తోడు అధికార నేతల అండదండలు కూడా పుష్కలంగా ఉండటంతో చివరకు వీరిని పట్టుకోవడానికి పోలీసులకు 22 రోజులు పట్టింది. సెలవడిగితే శాడిజం చూపేది గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపల్‌కు పీజీ విద్యార్థుల లేఖ సాక్షి, గుంటూరు: ‘మొగుడితో గడపడానికైతే టైం ఉంటుందా’ అంటూ చెప్పలేని అసభ్య పదజాలంతో సంధ్యారాణిని ప్రొఫెసర్ లక్ష్మి వేధించేదని, ఆమె వల్లే డాక్టర్ సంధ్యారాణి మృతి చెందిందని, అదే విభాగంలో పీజీ చదువుతున్న వైద్య విద్యార్థులు గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌కు లేఖ రాశారు. డాక్టర్ సంధ్యారాణి మృతిచెందిన నాలుగు రోజులకే అంటే గత నెల 27న 23 మంది పీజీ వైద్య విద్యార్థులు ఈ లేఖలో తమ ఆవేదనను, సంధ్యారాణికి జరిగిన అన్యాయం గురించి వివరించారు. సంధ్యారాణిని ఉద్దేశించి లక్ష్మి చేసిన పరుష వ్యాఖ్యలను వారు అందులో ప్రస్తావించారు. -
ప్రొఫెసర్ లక్ష్మి అరెస్ట్
-
వైఎస్సార్సీపీ నేతల బైఠాయింపు
గుంటూరు : గుంటూరు ఎస్పీ కార్యాలయం ఎదుట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మంగళవారం బైఠాయించారు. మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తిపై దాడికి పాల్పడ్డ గురజాల డీఎస్పీ నాగేశ్వరరావుపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారుల తీరుపై నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పార్టీ సీనియర్ నేతలు అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, బీసీ సంఘాలు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. -
అప్రమత్తంగా ఉండండి
తాడేపల్లి రూరల్: పుష్కరాల్లో విధులు నిర్వహించే సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండి భక్తులను క్షేమంగా ఇంటికి పంపిచాలని గుంటూరు అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి అన్నారు. బుధవారం ఘాట్లు పరిశీలించేందుకు ఇక్కడకు వచ్చిన ఆయన ముఖ్యమంత్రితో పాటు పోలీసు ఉన్నతాధికారులు కంట్రోల్ రూమ్ నుంచి పుష్కర ఘాట్లు వీక్షించేలా ఏర్పాటు చేసిన వై–ఫై కెమెరాలను, గాలిలో ఎగురుతూ చుట్టు పక్కల ప్రాంతాలను చిత్రీకరించే డ్రోన్ కెమెరాలను స్వయంగా పరిశీలించారు. నిరంతరం అంతా అప్రమత్తంగా ఉండాలని, విజయవాడ కంట్రోల్ రూమ్ నుంచి ఏ అధికారి ఫోన్ చేసి ఏ ఘాట్‌ను చూపించమంటే ఆ ఘాట్‌ను చూపించగలగాలని ఆయన సూచించారు. ఆయన పరిశీలిస్తున్న సమయంలో పెద్ద గాలి వచ్చి భక్తులు దుస్తులు మార్చుకునే గదులు పైకి కిందకు ఊగుతుండడంతో ఆయన దగ్గరుండి, బోల్టు ఫిట్టింగ్ చేయించి కదలకుండా ఏర్పాట్లు చేయించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో క్రైమ్ ఎస్పీ డి. కోటేశ్వరరావు, మంగళగిరి డీఎస్పీ రామాంజనేయులు, సీఐ హరికృష్ణ తదితరులు ఉన్నారు. -
'దొంగ'భక్తులు వస్తున్నారు..
పన్నెండేళ్లకోసారి వచ్చే పుష్కరాల హడావుడి అంతా ఇంతా కాదు. భక్తులు, వ్యాపారులు, పూజారులు, అధికారులు ఇలా అన్ని వర్గాల వారూ పుష్కరాల్లో ఊపిరిసలపనంత బిజీ అవుతారు. వీరే కాదు.. ఇంకో బ్యాచ్ కూడా చాలా బిజీగా ఉంటుంది పుష్కరాల సీజన్లో. అదే దొంగల బ్యాచ్. వీరికి కూడా పుష్కరాల్లో చేతి నిండా పనే. వీరి కళ్లన్నీ జనం జేబుల్లోని పర్సులు, నగదు, మహిళల మెడపై ఉండే బంగారు ఆభరణాల చుట్టూనే తిరుగుతుంటాయి. సందట్లో సడేమియా అన్నట్టు దొరికినంత దోచుకునేందుకు వీరు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. గుంటూరు : విజయవాడ, గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో దొంగల బ్యాచ్ స్థావరాలకు పెట్టింది పేరు. దీన్ని ఆసరాగా చేసుకుని అంతర్రాష్ట్ర దొంగలు 12 రోజులపాటు జరిగే పుష్కరాల పని కోసం స్థావరాలను సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే ఈ ప్రాంతాల్లో తమతో సత్సంబంధాలు ఉండేవారి ద్వారా తమకు ఆశ్రయం కల్పించే వారి తో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. తమకు షెల్టర్ ఇచ్చినవారికి అద్దె రూపంలో డబ్బు చెల్లించేలా కాదండోయ్.. వారు కాజేసిన సొమ్ములో కొంత వాటా ఇచ్చేలా అగ్రిమెంట్లు కుదుర్చుకున్నారు. మొత్తానికి ఈ విషయం ఆనోటా, ఈనోటా పోలీసు బాస్‌ల చెవికి చేరింది. వీరిని ఎలా అరికట్టాలనే దానిపై వారు ప్రణాళికలు రచించే పనిలో పడ్డారు. షెల్టర్లు సిద్ధం! ఆగస్టు 12 నుంచి కృష్ణా పుష్కరాలు మొదలు కానున్న విషయం తెలిసిందే. దీని కోసం వ్యాపారులు, పూజారులు, అధికారులు ఏవిధంగా అయితే ఏర్పాట్లు చేసుకుంటున్నారో దొంగలు సైతం ఈ 12 రోజుల్లో తమ చేతివాటం చూపేందుకు కావాల్సిన ఏర్పాట్లన్ని ఇప్పటికే పూర్తి చేసుకున్నట్లు సమాచారం. గుంటూరు జిల్లాలోని తాడేపల్లి మండలం సీతానగరం, మహానాడు, సుందరయ్యనగర్, కేఎల్‌రావు కాలనీతో పాటు, విజయవాడలోని కేదారేశ్వరపేట, రాజారాజేశ్వరిపేట, కొండపల్లి, నందిగామలతో పాటు, మరికొన్ని ప్రాంతాల్లో ఉండే దొంగల బ్యాచ్ ఇప్పటికే వివిధ జిల్లాల నుంచి వచ్చే దొంగల ముఠాకు షెల్టర్ ఇచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యంగా ప్రకాశం జిల్లా కొప్పరాల తిప్ప, నెల్లూరు జిల్లా పిట్రగుంట, తమిళనాడులోని కాంచీపురం, చిత్తూరు జిల్లాలోని ఓ గ్రామంతో పాటు, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన అనేక గ్రామాల నుంచి దొంగల ముఠాలు పుష్కరాల్లో తమ ‘పనితనం’ చూపించేం దుకు సిద్ధమైనట్లు తెలిసింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయా ప్రాంతాల్లోని తమ పాతమిత్రుల ద్వారా స్థానిక దొంగలను ఆశ్రయించి స్థావరాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. 12 రోజుల పాటు ఇక్కడే ఉండేందుకు వసతి సౌకర్యంతో పాటు, భోజన సదుపాయాలు సైతం అందించేలా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. అందుకు ప్రతిగా వారు దోచుకున్న సొత్తులో కొంత వాటాను వీరికి పంచేలా, వీరి మధ్య సయోధ్య కుదిరినట్లు చెబుతున్నారు. ఇప్పటికే తాడేపల్లి మండలం పట్టాభిరామయ్య కాలనీలోని ఓ హిజ్రా ఇంట్లో బయటి నుంచి వచ్చే దొంగలకు షెల్టర్ కోసం ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లు సమాచారం. పుష్కరాల ప్రాంతంలో నిరంతర నిఘా గుంటూరు అర్బన్ జిల్లా పరిధిలో పుష్కరాలు జరిగే ప్రాంతాల్లో నిరంతర నిఘా ఉంచాం. గత పుష్కరాల సంఘటనలను దృష్టిలో ఉంచుకుని అప్రమత్తతతో వ్యవహరించేలా పోలీసు సిబ్బందికి సూచనలు చేశాం. కృష్ణా పుష్కరాల్లో ఎటువంటి సంఘటనలూ జరగకుండా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. - సర్వశ్రేష్ఠ త్రిపాఠి, గుంటూరు అర్బన్ ఎస్పీ అసలే ముదుర్లు.. వీరికి ఇతరులూ తోడు.. గత కృష్ణా పుష్కరాల్లో సైతం ఈ ప్రాంతంలో దొంగలు తమ చేతికి పనిచెప్పి పుష్కరాలకు వచ్చే భక్తుల సొమ్మును భారీ ఎత్తున దోచుకున్నట్లు పోలీసుల రికార్డుల్లో ఉంది. దీనికి తోడు తాడేపల్లి మండలంలోని అనేక ప్రాంతాలకు చెందిన దొంగలు రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాలతో పాటు, చుట్టుపక్కల రాష్ట్రాల్లో సైతం దొంగతనాలు చేసిన సంఘటనలు అందరికీ తెలిసిందే. గత ఏడాది తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో ఓ యోగ సెంటర్లో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లకు చెందిన డబ్బు, నగలు, సెల్ఫోన్లను తాడేపల్లి దొంగలు ఎత్తుకొచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అంతా అత్యున్నత స్థాయి అధికారులు కావడంతో దొంగలను పట్టి సొత్తు రికవరీ చేసిన పోలీసులు వారిపై ఎటువంటి కేసులు నమోదు చేయకుండా వదిలేసిన సంగతి తెలిసిందే. ఈ స్థాయిలో దొంగతనాలకు పాల్పడే దొంగలకు, బయట నుంచి వచ్చే ముఠాలు తోడైతే పరిస్థితి ఏ స్థాయిలో ఉంటుందో ఊహించటం కష్టమే. పుష్కర ఏర్పాట్లు, ట్రాఫిక్‌పై దృష్టి పెడుతున్న పోలీసులు వీరిపై ఇప్పటినుంచే పూర్తిస్థాయి నిఘా ఉంచకపోతే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందనేది అందరూ ఒప్పుకోవాల్సిందే. -
ఇల్లు స్వాధీనం చేయాలని సీఐ బెదిరిస్తున్నాడు
గుంటూరు : ఇల్లు ఖాళీ చేసి వడ్డీకిచ్చిన వారికి అప్పగించాలని తాలుకా ఎస్హెచ్ఓ బెదిరిస్తున్నాడని ఓ మహిళ అర్బన్ ఎస్పీని ఆశ్రయించింది. ప్రభుత్వం అందించిన స్థలంలో ఇల్లు కట్టుకొని 13 ఏళ్ల నుంచి ఉంటున్నానని చెప్పింది. కరెంటు, ఇంటి పన్నులూ చెల్లిస్తున్నానని పేర్కొంది. వేళంగి నగర్‌కు చెందిన ఉదగిరి నగదర్ వద్ద 2013లో 50 వేలు వడ్డీకి తీసుకున్నానని తెలిపింది. చెక్కులు, స్టాంపు ఖాళీ పేపర్లు తీసుకున్నాడంది. అప్పకు సంబంధించి ఇల్లు స్వాధీనం చేయాలని తనపై దాడి చేసాడని వాపోయింది. ఫోన్లో ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో డీఎస్పీ కూడా వచ్చి విచారించారంది. ఐజీకి కూడా ఫిర్యాదు చేశానంది. గత వారం ఎస్పీకి ఫిర్యాదు చేయగా రూరల్ సీఐ పూర్ణచంద్రరావు వద్దకు పంపించారని తెలిపింది. ఇల్లు నగదర్‌కు స్వాధీనం చేయాలని సీఐ బెదిరిస్తున్నారని వాపోయింది. కోర్టు నుంచి ఆదేశాలందాయని సీఐ చెబుతున్నారేగానీ అవి తనకు చూపడం లేదని విలపించింది. 29 ఫిర్యాదుల స్వీకరణ జిల్లా రూరల్ కార్యాలయంలో సోమవారం డీఎస్పీలు డి.సుధాకర్ ,సూర్యనారాయణ రెడ్డి గ్రీవెన్స్ నిర్వహించారు. 29 మంది నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. పలువురి సమస్యలపై వెంటనే స్పందించి ఫోన్లో ఎస్హెచ్ఓలకు తగిన ఆదేశాలిచ్చారు. కొందరి ఫిర్యాదులను పరిశీలించాల్సిందిగా లిఖిత పూర్వకంగా ఆదేశాలు అప్పటికప్పుడే పంపించారు. -
'నా ప్రియుడే వదిలేయండి... ప్లీజ్'
గుంటూరు : తాడేపల్లి బైపాస్ రోడ్డులో గురువారం ఓ యువతి కిడ్నాప్ పేరిట కలకలం సృష్టించింది. తీరా సాయంత్రానికి అదేం కాదు అతనూ, నేనూ ప్రేమికులమే..అతడిని వదిలేయమంటూ ప్రాధేయపడింది. వివ రాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా బొబ్బి లికి చెందిన యువతి కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్‌లో ఉంటూ డాన్స్ వృత్తిలో జీవనం సాగి స్తోంది. ఇటీవల ఆర్గనైజర్‌కు, సదరు యువతికి గొడవ కావడంతో గుంటూరులో బంధువుల ఇంట్లో ఉంటోంది. గురువారం ఓ యువకుడు బలవంతంగా ద్విచక్రవాహనంపై లాక్కొచ్చాడంటూ బైపాస్ రోడ్డులో హడావుడి సృష్టించింది. విజయవాడ 1టౌన్ సీఐ గుంటూరు నుంచి వస్తూ వీరిద్దరి గలాటా చూసి, ప్రశ్నించగా, ఇతను నన్ను కిడ్నాప్ చేసి, బలవంతంగా లాక్కొస్తున్నాడంటూ తెలిపింది. దీంతో సీఐ ఇద్దరిని తన వాహనంలో తీసుకువచ్చి తాడేపల్లి పోలీసులకు అప్పగించారు. మొదట అతను ఎవరో నాకు తెలియదని, నాకు సంబంధం లేదని చెప్పింది. తాను ఆమె భర్తనని, తమఇద్దరిదీ ప్రేమ వివాహమని చెప్పాడు. పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నా రు. బొబ్బిలిలో ఉన్న యువతి తండ్రికి సమాచారం ఇచ్చారు. సాయంత్రానికల్లా సదరు యువతి వచ్చి తమ ఇద్దరిదీ ఒకే ఊరని, తామిద్దరూ ప్రేమించుకున్నామని, తరచూ గొడవలు పడుతుంటే కోపంతో అతనెవరో తెలియదని చెప్పానని, అతడిని వదిలేయమని ప్రాధేయపడింది. తల్లిదండ్రులు వస్తే పంపిస్తామని పోలీసులు చెప్పారు. -
అమరావతి చేరుకునేందుకు ఏడు మార్గాలు
- గుంటూరురేంజ్ ఐజీ ఎన్.సంజయ్ గుంటూరు : గుంటూరు జిల్లా ఉద్దండరాయనిపాలెం గ్రామంలో గురువారం జరుగుతున్న అమరావతి నగర శంకుస్థాపన కార్యక్రమాన్ని పురస్కరించుకుని రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే సందర్శకులకు ఏడు మార్గాలను గుర్తించామని గుంటూరు రేంజ్ ఐజీ ఎన్. సంజయ్ తెలిపారు. వాహనదారులు శంకుస్థాపనకు చేరుకోవాల్సిన మార్గాల గురించి వివరించారు. అది ఆయన మాటల్లోనే.. విజయవాడ వైపు నుంచి వచ్చే సాధారణ సందర్శకులు, భారీవాహనాలు ... కనకదుర్గమ్మ వారధి, మంగళగిరిపాతబస్టాండ్, నిడమర్రు, కురగల్లు, ఐనవోలు, మల్కాపురం, మందడం, తాళయపాలెం రోడ్డు మీదుగా శంకుస్థాపన స్థలానికి సమీపంలో ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలంలో పార్కు చేసుకోవాలి. తమిళనాడు, నెల్లూరు, ఒంగోలు - గుంటూరు వైపు నుంచి వచ్చే అన్ని రకాల వాహనదారులు తమిళనాడు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి చిలకలూరిపేట మీదుగా శంకుస్థాపన స్థలానికి వచ్చే వాహనాలు చిలకలూరిపేట, గుంటూరు బైపాస్‌రోడ్డు, పెదకాకాని, తాడికొండ, పెదపరిమి, తుళ్ళూరు, రాయపూడి, మోదుగలంకపాలెం, వెలగపూడి బైపాస్ మీదుగా శంకుస్థాపన స్థలానికి చేరుకోవాలి. రాయలసీమ జిల్లాలు (కర్నూలు, కడప, అనంతపురం)భారీ వాహనాలు... వినుకొండ, నరసరావుపేట బైపాస్, ములకలూరు, ముప్పాళ్ళ, పెదకూరపాడు, అమరావతి, బోరుపాలెం, తుళ్ళూరు బైపాస్‌రోడ్డు, రాయపూడి, మోదుగలంకపాలెం, వెలగపూడి బైపాస్ మీదుగా శంకుస్థాపన స్థలానికి చేరుకోవాలి. చిన్న వాహనాలు : నరసరావుపేట బైపాస్, పేరేచర్ల, గుంటూ రు అవుటర్ రింగ్‌రోడ్డు, తాడికొండ, పెదపరిమి, తుళ్ళూరు, మోదుగలంకపాలెం మీదుగా శంకుస్థాపన స్థలికి చేరుకోవాలి. హైదరాబాద్ నుంచి భారీ వాహనాలు హైదరాబాద్, దాచేపల్లి, సత్తెనపల్లి, పెదకూరపాడు, అమరావతి, తుళ్ళూరు బైపాస్, వెలగపూడి బైపాస్ మీదుగా శంకుస్థాపన స్థలికి చేరుకోవాలి. చిన్న వాహనాలు: హైదరాబాద్, దాచేపల్లి, సత్తెనపల్లి, గుంటూరు అవటర్ రింగ్‌రోడ్డు, తాడికొండ, తుళ్ళూరు, మోదుగలంకపాలెం మీదుగా శంకుస్థాపన స్థలానికి చేరుకోవాలి. ఏఏఏ పార్కింగ్ ఏరియాలో గవర్నర్లు, సీఎంలు, జడ్జిలు, వివిధ దేశాల అంబాసిడర్లు, వివిధ దేశాల ప్రముఖులు, ప్రముఖ పారిశ్రామిక వేత్తలకు ప్రత్యేక స్థలం కేటాయించడమైంది. క్యాబినెట్ మినిస్టర్ల వాహనాలు మార్షలింగ్, రీమార్షలింగ్ కోసం ప్రత్యేక స్థలం కేటాయించారు. ఒక వాహన మార్గానికి రెండోవాహన మార్గం అడ్డురాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. శంకుస్థాపన కార్యక్రమం జరిగే 22వ తేదీ ఉదయం 7 నుంచి సాయంత్రం 7 గంటల వరకు విజయవాడ - మంగళగిరి రోడ్డులో ప్రకాశం బ్యారేజీపై ఎటువంటి వాహనాలు సంచారం అనుమతి లేదు. విజయవాడ నుంచి గుంటూరు వైపు అదేవిధంగా గుంటూరు నుంచి విజయవాడవైపు తిరుగు వాహనాలు ప్రయాణించుటకు కనకదుర్గవారధి పూర్తికాలం అనుమతి ఉంటుంది. శంకుస్థాపన జరిగే 22వ తేదీ ఉదయం 8 గంటలనుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శంకుస్థాపన ప్రదేశానికి వాహనాలు సులువుగా వెళ్ళుటకు గాను అన్ని మార్గాల్లో వన్‌వే అమలులో ఉంటుంది. అదేవిధంగా మధ్యాహ్నం 1.45 నుంచి శంకుస్థాపన స్థలం నుండి బయటకు వెళ్ళే వాహనాలు సులువుగా తిరుగు ప్రయాణం చేయుటకు అన్ని మార్గాల్లో వన్‌వే అమలులో ఉంటుంది. మధ్యాహ్నం 11.30 గంటల తరువాత కరకట్టపైన ఎటువంటి వాహనాలకు ప్రవేశం లేదు. ఏఏ, ఏ పాస్‌లు కలిగిన వాహనదారులు గన్నవరం విమానాశ్రయం నుంచి బెంజిసర్కిల్, కనకదుర్గమ్మ వారధి, ఎన్టీఆర్ కరకట్ట, ఉండవల్లి జంక్షన్, కరకట్ట రోడ్డుకు సమాంతరంగా కొత్తగా వేయబడిన రోడ్డు నుంచి శంకుస్థాపన స్థలానికి చేరుకుని కుడిపక్కన ఏర్పాటు చేసిన ఏఏ, ఏ పార్కింగ్ నందు వాహనాలు నిలుపుకోవాలి. హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలు నందిగామ, ఇబ్రహీంపట్నం, కనకదుర్గమ్మ వారధి, ఉండవల్లి సెంటర్, కరకట్ట రోడ్డుకు సమాంతరంగా ఏర్పాటు చేసిన మార్గం గుండా శంకుస్థాపన కార్యక్రమానికి చేరుకోవాలి. గుంటూరువైపు నుంచి వచ్చే వాహనాలు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కాజా టోల్‌ప్లాజా, ఎన్టీఆర్ కరకట్ట బోట్‌హౌస్, ఉండవల్లి సెంటర్, కరకట్టకు సమాంతరంగా ఏర్పాటు చేయబడిన కొత్త మార్గం గుండా శంకుస్థాపన కార్యక్రమానికి చేరుకోవాలి. -
వైఎస్ జగన్ దీక్షకు అనుమతి ఇవ్వండి
గుంటూరు : ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టనున్న దీక్షకు ఉల్ఫ్ గ్రౌండ్లో అనుమతి ఇవ్వాలంటూ ఆ పార్టీ నేతలు గుంటూరు అర్బన్ ఎస్పీ త్రిపాఠిని కలిశారు. బుధవారం సాయంత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అంబటి రాంబాబు తదితరులు బుధవారం సాయంత్రం ఎస్పీని కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. అయితే ప్రజలకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతోనే అనుమతి నిరాకరించినట్లు ఎస్పీ తెలిపారు. దీక్షకు అనుమతిపై మరోసారి దరఖాస్తు ఇస్తే పరిశీలిస్తామని ఎస్పీ త్రిపాఠి ఈ సందర్భంగా వైఎస్ఆర్ సీపీ నేతలకు సూచించారు. -
25 క్వింటాళ్ల బియ్యం పట్టివేత
గుంటూరు: గుంటూరు జిల్లా నగరం మండలం దూలిపుడి వద్ద బుధవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా తరలిస్తున్న 25 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బియ్యాన్ని తరలిస్తున్న ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బియ్యాన్ని, ఆటోను పోలీసులు పోలీస్ స్టేషన్‌కు తరలించి... సీజ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పాస్‌పోర్ట్ ఒక్క రోజులోనే క్లియరెన్స్
♦ ఆధునిక పరిజ్ఞానంతో పారదర్శక సేవలు ♦ ప్రత్యేక వ్యవస్థ రూపకల్పన చేసిన ఇంజినీరింగ్ విద్యార్థులు ♦ అమల్లోకి తెచ్చిన గుంటూరు అర్బన్ పోలీసు యంత్రాంగం గుంటూరు ఎడ్యుకేషన్ : విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు విద్యార్థులు పాస్‌పోర్ట్ కోసం ఇకపై రోజుల తరబడి అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. పాస్‌పోర్ట్ పొందేందుకు అవసరమైన ధృవపత్రాలతో దరఖాస్తు సమర్పించిన తరువాత ఒక్కరోజు వ్యవధిలోనే క్షేత్రస్థాయిలో పరిశీలన పూర్తయి పాస్‌పోర్ట్ అందుకునే విధానం అమల్లోకి వచ్చింది. గుంటూరు అర్బన్ పోలీసు యంత్రాంగం ఈ ప్రక్రియను ఇటీవల ప్రయోగాత్మకంగా అమల్లోకి తెచ్చింది. ‘‘జీయూపీ సేవ డాట్ ఇన్’’ పేరుతో రూపకల్పన చేసిన ఈ ప్రాజెక్టునే గుంటూరు అర్బన్ పోలీసులు అమల్లోకి తెచ్చారు. జీయూపీ అంటే గుంటూరు అర్బన్ పోలీసు అని అర్ధం. గుంటూరు రూరల్ మండలం బుడంపాడులోని జీవీఆర్ అండ్ ఎస్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ (ఈసీఈ) పూర్తి చేసిన ఆరుగురు బీటెక్ గ్రాడ్యుయేట్లు ఈ ప్రాజెక్టును రూపొందించారు. ఇప్పటివరకూ మాన్యువల్ విధానంలో జరుగుతున్న పాస్‌పోర్ట్ దరఖాస్తు పరిశీలన ప్రక్రియకు సంబంధించిన కార్యకలాపాలను నూతన విధానంలో ఆన్లైన్లో నిర్వహిస్తున్నారు. పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసిన తరువాత దరఖాస్తుదారుడికి ఎస్ఎంఎస్ వెళుతుంది. అందిన దరఖాస్తులను అర్బన్ పరిధిలోని 16 పోలీస్ స్టేషన్లకు పంపుతారు. పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు సమర్పించిన దరఖాస్తు దారుడి ఇంటికి వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు వెళ్లే కానిస్టేబుళ్లకు ఒక్కొక్కరికీ ట్యాబ్లెట్ పీసీలను అందజేశారు. పాస్‌పోర్ట్‌కు సంబంధించి జరిగే పరిశీలన, ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చే అంశాలన్నీ పూర్తి పారదర్శకంగా జరగడం ఇందులోని ముఖ్యాంశం. తద్వారా సింగిల్ విండో విధానంలో పాస్‌పోర్ట్‌కు క్లియరెన్స్ రావడంతో పాటు అవినీతికి తావులేని విధంగా పారదర్శకత ఉంటుంది. ఈ సందర్భంగా ప్రాజెక్టును రూపొందించిన విద్యార్థులు ప్రత్తిపాటి వెంకటేష్ బృందాన్ని కళాశాల చైర్మన్ డాక్టర్ జి. వెంకటేశ్వరరావు, డెరైక్టర్ డాక్టర్ శ్రీకాంత్, ఈసీఈ విభాగాధిపతి ఎస్డీఎల్వీ ప్రసాద్ అభినందించారు. -
‘సమరదీక్ష’కు భద్రతపై పోలీసుల నిర్లక్ష్యం
జగన్ దీక్షకు భద్రత కల్పించని గుంటూరు పోలీసులు సాక్షి, గుంటూరు: వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన సమరదీక్షకు భద్రత కల్పించడంలో పోలీసు యంత్రాంగం నిర్లక్ష్యం వహించింది. బందోబస్తు ఏర్పాటు చేయాలని వైఎస్సార్సీపీ నేతలు అంతకుముందే గుంటూరు అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని కోరారు. మంగళవారం రాత్రి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి నేతృత్వంలో వెళ్లిన నేతలను కలిసేం దుకు ఎస్పీ నిరాకరించారు. అటు ఎమ్మెల్యే ఆర్కే కూడా బందోబస్తు కోరుతూ లేఖ రాశారు. అయినప్పటికీ దీక్షలో ఒక్క కానిస్టేబుల్ కూడా కనిపించలేదు. దీంతో తమ నాయకుడికి భద్రత కల్పించాలని కోరేందుకు పార్టీ ప్రజాప్రతినిధులు బుధవారం సాయంత్రం ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. ఎస్పీ లేకపోవడంతో ఎంపీ మేకపాటి ఫోన్ చేశారు. సరిగా స్పందించకపోవడంతో ఎస్పీ తీరుకు నిరసనగా కార్యాలయం ఎదుట నేతలు ధర్నా నిర్వహించారు. మేకపాటి డీజీపీకి ఫోన్ చేసి, ఎస్పీ వైఖరిపై ఫిర్యాదు చేశారు. దీంతో డీజీపీ ఏఎస్పీ శ్రీనివాసులును పంపి భద్రతపై హామీ ఇప్పించడంతో ధర్నా విరమించారు. కాగా, ప్రజాప్రతినిధుల పట్ల అమర్యాదగా వ్యవహరించిన ఎస్పీ మీద పార్లమెంటు హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయాలని ఎంపీలు.. శాసనసభ, మండలిలో హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిర్ణయించారు. -
అదృశ్యమైన బాలికలు దొరికారు
హైదరాబాద్: వారం రోజుల క్రితం గుంటూరులో అదృశ్యమైన ముగ్గురు బాలికలు లేఖారెడ్డి, దివ్య, యశస్వి సురక్షితంగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. కూకట్ పల్లిలో వీరి ఆచూకీ కనుగొన్నారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా వీరి జాడ గుర్తించారు. స్నేహతురాలి పెళ్లి కోసం వీరు ఇంట్లో చెప్పకుండా ఇక్కడికి వచ్చినట్టు తెలిసింది. తల్లిదండ్రులకు అప్పగించేందుకు గుంటూరు పోలీస్ స్టేషన్ కు వీరిని తీసుకెళ్లారు. ఈనెల 14న అదృశ్యవడంతో గుంటూరు అర్బన్ పోలీసు స్టేషన్ లో బాలికల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. తమ పిల్లలు సురక్షితంగా ఉన్నారని తెలియడంతో బాలికల కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. -
ముగ్గురు బాలికల అదృశ్యం
హైదరాబాద్: గుంటూరులో ముగ్గురు బాలికలు అదృశ్యమవడంతో కలకలం రేగింది. లేఖారెడ్డి, దివ్య, యశస్వి అనే బాలికలు ఈనెల 14న గుంటూరులో అదృశ్యమయ్యారు. తర్వాతి రోజు వీరు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో దిగినట్టు పోలీసులు గుర్తించారు. ఒకటో నంబర్ ప్లాట్ ఫామ్ నుంచి వీరు బయటకు వస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వీరితో ముగ్గురితో పాటు మరో యువతి ఉండడం అనుమానాలకు తావిస్తోంది. ఈ యువతే వీరిని గుంటూరు నుంచి ఇక్కడకు తీసుకువచ్చి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ముగ్గురు బాలికలు ఇంటి నుంచి వచ్చేటప్పుడు పెద్దమొత్తంలో బంగారం, డబ్బు తీసుకుని వచ్చినట్టు తెలుస్తోంది. వీరి అదృశ్యంపై గుంటూరు అర్బన్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. దిల్ షుఖ్ నగర్ కు చెందిన యశస్వి గుంటూరులో చదువుకుంటోందని పోలీసులు తెలిపారు. వీరి ఆచూకీ కోసం తల్లిదండ్రులు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. ఈ ముగ్గురి కోసం గుంటూరు, హైదరాబాద్ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. -
'సముద్రతీరం వెంబడి ప్రత్యేక నిఘా'
ఒంగోలు (ప్రకాశంజిల్లా): గుంటూరు పోలీస్ రేంజ్ పరిధిలో సముద్రతీరం వెంబడి నిఘా పెంచుతున్నట్లు గుంటూరు రేంజ్ ఐజీ ఎన్.సంజయ్ అన్నారు. నూతనంగా బాధ్యతలు తీసుకున్న ఆయన ఒంగోలుకు గురువారం మొదటిసారి వచ్చారు. సర్కిళ్ల వారీగా శాంతిభద్రతల అంశం, నేరాలు, దొంగతనాలపై సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కోస్ట్‌గార్డ్, మెరైన్ పోలీసులతో పాటు జిల్లా పోలీసులు, రెవెన్యూ యంత్రాంగాన్ని సమన్వయపరిచి తీరం వెంబడి ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయనున్నట్లు.. త్వరలో కోస్ట్‌గార్డ్ పోలీసులతో మాక్‌డ్రిల్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాజధాని నిర్మాణం జరుగుతున్నందున అక్కడ మహిళా పోలీసుల అవసరం ఉందని చెప్పారు. మహిళా సిబ్బందిలో ధైర్యం నింపేందుకు ప్రత్యేక శిక్షణ ఇస్తామని తెలిపారు. సీసీఎస్ పోలీస్స్టేషన్లను ప్రత్యేక నేరాల వైపు దృష్టి సారించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. గుంటూరు, ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సీసీఎస్ పోలీస్స్టేషన్ల సిబ్బందిని సమన్వయపరిచి నేరాల అదుపునకు చొరవ చూపుతున్నట్లు పేర్కొన్నారు. మంత్రి శిద్దా రాఘవరావుపై ఎన్బీడబ్ల్యూ ఉన్నా ఇంత వరకు పోలీసులు చర్యలు చేపట్టలేదని విలేకరులు అడగ్గా...అలాంటి వాటిని ఎస్పీ పరిశీలిస్తారన్నారు. సమావేశంలో ఎస్పీ చిరువోలు శ్రీకాంత్, అదనపు ఎస్పీ బి.రామానాయక్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
మాజీ సైనికులను ఆదుకుంటాం
నాలుగు రాష్ట్రాల లెఫ్టినెంట్ జనరల్ జగ్‌ధీర్‌సింగ్ విద్యానగర్(గుంటూరు) : మాజీ సైనికులను, దేశరక్షణలో భర్తలను కోల్పోయిన వితంతువులను అన్ని విధాలా ఆదుకుంటామని సేవాపురస్కార్, విశిష్ట సేవాపురస్కార్, జీవోసీ, అవార్డుల గ్రహీత, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ ఏరియా లెఫ్టినెంట్ జనరల్ జగ్‌ధీర్‌సింగ్ తెలిపారు. ఆదివారం గుంటూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఆర్మీ ఆధ్వర్యంలో మాజీ సైనికుల రాష్ట్ర స్థాయి సదస్సు, సమస్యల పరిష్కారానికి అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా లెఫ్టినెంట్ జనరల్ జగ్‌ధీర్‌సింగ్ పాల్గొని మాట్లాడారు. మాజీ సైనికులు, సైనిక వితంతువుల సమస్యలను సమీప సైనిక సంక్షేమ శాఖ కార్యాలయం ద్వారా తెలియపరిస్తే వాటిని సంబంధిత శాఖల అధికారులతో చర్చించి పరిష్కరిస్తామన్నారు. ఇంటి పన్నులు, భూమి శిస్తు లేకుండా జీవోలున్నాయని వాటిని అనుసరించి సమస్యలు పరిష్కరించుకోవచ్చన్నారు. వితంతువులు, మాజీ సైనికుల కుమార్తెల పెళ్లిళ్లకు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న ఆర్థిక సాయాన్ని సద్వినియోగం చేసు కోవాలన్నారు. అశోక చక్ర, విశిష్ట సేవామెడల్ ఆంధ్రా సబ్‌ఏరియా మేజర్ జనరల్ సీఏ పీఠావలా మాట్లాడుతూ మాజీ సైనికులకు ప్రభుత్వం మెట్ట అయితే ఐదు ఎకరాలు, మాగాణి భూమి అయితే 2.5 ఎకరాలు ఇస్తుందని తెలిపారు. ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణాలకు, పొలాల కొనుగోలుకు మాజీ సైనికులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రుణా లను అందిస్తున్నాయన్నారు. సికింద్రాబాద్ ఈఎమ్ఈ సెంటర్ బ్రిగేడియర్ జె. సిథానా మాట్లాడుతూ దేశ రక్షణలో పాల్గొన్న వారికి విశిష్ట పురస్కారాలు అందించనున్నట్టు తెలిపారు. జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండే మాట్లాడుతూ మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఇళ్ల స్థలాలు, ఇతర సమస్యలు తన దృష్టికి తీసుకువచ్చారని వీలైనంత త్వరగా వాటిని పరిష్కరిస్తామని తెలిపారు. జిల్లా అర్బన్ ఎస్పీ రాజేష్‌కుమార్ మాట్లాడుతూ ప్రతి సోమవారం తన కార్యాలయంలో ఫిర్యాదుల దినోత్సవం జరుగుతుందని మాజీ సైనికులకు ఎటుంటి సమస్యలు న్నా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో భాగంగా ఆర్మీ ఏఎమ్‌సీ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాల్లో మాజీ సైనికులకు పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. మాజీ సైనికులలో పేదలు, యుద్ధంలో పనిచేసి నేడు నడవలేని స్థితిలోఉన్న వారిని గుర్తించి మోటార్‌సైకిళ్లు, ట్రైసైకిళ్లు అందజేశారు. అలాగే దాదాపు 200 మంది వితంతువులకు చీరలు, ఆర్థిక సాయంగా రూ. 5వేలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కల్నల్ శేషా, రిక్రూట్మెంట్ సెక్టార్ కల్నల్ జాఫ్రి, ఈసీహెచ్ఎస్ గుంటూరు మేనేజర్ హనుమంతరావు, క్యాంటిన్ మేనేజర్ శ్రీనివాసరావు, మేజర్ అజిత్‌రెడ్డి, భాష్యం రామకృష్ణా, పద్మశ్రీ టౌన్షిప్ డెరైక్టర్ శ్రీనివాసరావు, రాష్ట్ర వ్యాప్తంగా మాజీ సైనికులు, మహిళలు పాల్గొన్నారు. -
ఫలించిన పోలీస్ బాస్‌ల ప్రయత్నాలు
గుంటూరు: ఏపీలో పోలీస్ బాస్‌ల ప్రయత్నాలు ఫలించాయి. గుంటూరు రేంజి పరిధిలో 86 మంది సీఐలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. గుంటూర్ రేంజ్ పరిధిలోని గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలోని 79 మంది సీఐలను బదిలీ చేస్తూ ఈనెల 4వ తేది రాత్రి ఐజీ పీవీ సునీల్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. కొందరు ప్రజాప్రతినిధుల జోక్యంతో ఆ బదిలీలు నిలిచిపోయాయి. సీఎం కార్యాలయం నుంచి జిల్లా పోలీసు కార్యాలయానికి మౌఖిక ఆదేశాలు అందడంతో బదిలీలను నిలుపుదల చేసినట్లు సమాచారం. విధుల నుంచి రిలీవ్ అయిన వారు తదుపరి ఉత్తర్వులు అందేంతవరకూ విధుల్లో చేరవద్దని ఉన్నతాధికారులు బదిలీపై రిలీవ్ అయిన సీఐలను ఆదేశించినట్లు తెలిసింది. ఎట్టకేలకు మరో ఏడుగుని కలిపి మొత్తం 86 మంది సీఐలను బదిలీ చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ** -
కానిస్టేబుళ్ల కీచక పర్వంపై కన్నెర్ర
-
కానిస్టేబుళ్ల కీచక పర్వంపై కన్నెర్ర
గుంటూరు: కానిస్టేబుళ్ల కీచక పర్వంపై పోలీసు ఉన్నతాధికారులు కన్నెర్ర చేశారు. బాధితురాలి ఫిర్యాదు తీసుకోవాలని కిందిస్థాయి అధికారులను ఆదేశించారు. ఒకవేళ బాధితురాలు ఫిర్యాదు ఇవ్వకుంటే సుమోటోగా కేసు నమోదు చేయాలని సూచించారు. సంఘటన జరిగిన సమీపంలోని ఓ కార్యాలయం వెలుపల ఉన్న సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలను ఉన్నతాధికారులు పరిశీలించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు కానిస్టేబుళ్లను ఈ సాయంత్రానికి అరెస్ట్ చేసే అవకాశముంది. రాత్రి గస్తీ తిరుగుతున్న కానిస్టేబుల్, హోంగార్డు ఓ యువతిని బెదిరించి అత్యాచారం చేశారని ఆరోపణలు వచ్చాయి. యువతికి తోడుగా ఉన్న యువకుడిని తరిమేసి వారీ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై అర్బన్ జిల్లా ఎస్పీ రాజేష్‌కుమార్ విచారణ జరుపుతున్నారు. ఈ వ్యవహారంలో రాజీ కుదిర్చిన కొత్తపేట ఎస్సై కూడా చర్య తీసుకునే అవకాశముంది. -
ఐదుగురు గుంటూరు పోలీసులపై వేటు
గుంటూరు: గుంటూరు నగర పరిధిలో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఐదుగురు పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. విధినిర్వహణలో నిర్లక్ష్యం, బాధ్యతారహితంగా వ్యవహరించిన ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేస్తూ గుంటూరు రేంజ్ ఐజీ సునీల్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెండైన వారిలో సీఐ శేషయ్య, ఎస్ కృష్ణయ్య, ఏఎస్ఐ నాయక్, ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు ఉన్నారు. -
ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం
ఎర్రదొంగలపై సస్పెక్టెడ్ షీట్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు సమావేశంలోగుంటూరు రేంజ్ ఐజీ నెల్లూరు(క్రైమ్): ఎర్రచందనం అక్రమ రవాణాను ఉక్కుపాదంతో అణచివేయాలని గుంటూరు రేంజ్ ఐజీ పీవీ సునీల్‌కుమార్ పోలీసు, అటవీ అధికారులకు సూచించారు. ఎర్రచందనం అక్రమ రవాణాను నియంత్రించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన గురువారం స్థానిక ఉమేష్‌చంద్ర మెమోరియల్ కాన్ఫరెన్స్ హాల్లో పోలీసు, అటవీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఐజీ మాట్లాడుతూ ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడే, సహకరించే వారు ఎంతటి వారైనా ఉపేక్షించవద్దన్నారు. జిల్లా సరిహద్దు ప్రాంతాలైన సోమశిల, రాపూరు, ఉదయగిరి, మర్రిపాడు తదితర ప్రాంతాల సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా నియంత్రణకు తీసుకొంటున్న చర్యలపై ఇకమీదట ప్రతి సోమవారం సమీక్ష సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా ఎక్కువగా జరిగే ప్రాంతాల్లోని ఎస్ఐలు తీసుకొంటున్న చర్యలు? ఎంత మందిని అరెస్ట్‌చేశారు? ఎన్ని కేసులు నమోదయ్యాయి తదితర వివరాలను విధిగా తెలియచేయాలన్నారు. దాని ఆధారంగానే వారి పనితీరును అంచనా వేస్తామన్నారు.గతంలో ఎర్రచందనం కేసుల్లో అరెస్ట్ అయిన వారిపై వెంటనే సస్పెక్టెడ్ షీట్లు తెరవాలన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు సహకరించినా? నియంత్రణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత అధికారులపై వేటు తప్పదని, అవసరమైతే క్రిమినల్ కేసులు సైతం నమోదు చేస్తామని హెచ్చరించారు. గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన సోమశిల కేంద్రంగా ఎర్రచందనం స్మగ్లింగ్ కథనాన్ని ఆయన పరిశీలించారు. ఎస్పీ నవదీప్ సింగ్ ఎర్రచందనం అక్రమ రవాణా నియంత్రణకు తీసుకొంటున్న చర్యలను ఐజీకి వివరించారు. అటవీశాఖ అధికారులు నేరస్తులను పట్టుకునేందుకు గ్రామాల్లోకి వెళ్లిన సమయంలో రాజకీయనాయకులు, స్థానిక ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోందన్నారు. దీంతో నిందితులు తప్పించుకుంటున్నారని ఐజీ దృష్టికి తీసుకొచ్చారు. దానిపై స్పందించిన ఐజీ స్థానిక పోలీసుల సహకారంతో వారిని అరెస్ట్ చేయాలని, అటవీ అధికారులకు సిబ్బంది సహకరించాలని సూచించారు. ఈ సమావేశంలో అటవీశాఖ అధికారి రాంబాబు, ఏఎస్పీ రెడ్డి గంగాధర్‌రావు, డీఎస్పీలు పి. వెంకటనాథ్‌రెడ్డి, రాంబాబు, మాల్యాద్రి, బాలవెంకటేశ్వరరావు, చౌడేశ్వరి, ఓఎస్డీ శిల్పవల్లి, గూడూరు, కావలి, ఆత్మకూరు సబ్‌డివిజన్ పోలీసు అధికారులు, అటవీ అధికారులు, స్పెషల్‌బ్రాంచ్ ఇన్స్పెక్టర్లు జి. శ్రీనివాసరావు, వై. జయరామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చుండూరుపై ‘సుప్రీం’లో ఎస్ఎల్పీ
గుంటూరు జిల్లా పోలీసుల సమాయత్తం గుంటూరు, న్యూస్‌లైన్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చుండూరు దళితుల ఊచకోత కేసు లో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్‌లీవ్ పిటిషన్(ఎస్ఎల్పీ) దాఖలు చేసేందుకు గుంటూరు జిల్లా పోలీసు యంత్రాంగం సమాయత్తమైంది. నిందితుల శిక్ష రద్దు చేస్తూ హైకోర్టు ఈ నెల 23న తీర్పు వెలువరించడం తెలి సిందే. 1991 ఆగస్టు 6న చుండూరు, మోదుకూరు, అమృతలూరు గ్రామాల్లోని దళితులకు, అగ్రవర్ణాలకు మధ్య జరిగిన ఘర్షణలో దళితుల ఊచకోతకు తెగబడిన విషయం విదితమే. ఈ కేసులో 21 మందికి యావజ్జీవ శిక్ష, 35 మందికి ఏడాది జైలుశిక్ష, జరిమానా విధిస్తూ ప్రత్యేక కోర్టు 2007లో తీర్పు ఇచ్చింది. దీనిపై నిందితులు హైకోర్టుకు అప్పీలు చేసుకోగా.. వారికి విధించిన శిక్షలను రద్దుచేయడంతో, జరిమానాలను తిరిగి చెల్లించాలని హైకోర్టు తాజాగా తీర్పుచెప్పడం తెలిసిందే. దీంతో హైకోర్టు తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ జిల్లా పోలీసులు సుప్రీంను ఆశ్రయించాలని నిర్ణయించారు. ఈ మేర కు సుప్రీంకోర్టులో అప్పీలు చేసేందుకు ఏఎస్పీ డి.కోటేశ్వరరావు శుక్రవారం ఢిల్లీ వెళ్లారు. -
ప్రేమించకుంటే.... చంపేస్తానంటున్నాడు...
గుంటూరు : ప్రేమించాలని లేకుంటే హతమారుస్తానని హెచ్చరించిన యువకుడి వేధింపుల నుంచి విముక్తి కల్పించాలంటూ ఓ విద్యార్థిని గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ జె.సత్యనారాయణను కలిసి వేడుకుంది. వివరాల్లోకి వెళితే ముప్పాళ్ళ మండలం దమ్మాలపాడు గ్రామానికి చెందిన ఓ బాలిక నరసరావుపేటలోని ఓ కళాశాలలో ఇంటర్ చదువుతూ, అదే కళాశాల హాస్టల్లో ఉంటోంది. కొద్దిరోజుల క్రితం సెలవులకు ఇచ్చిన సందర్భంగా అదే గ్రామానికి చెందిన నల్లపనేని విజయ్ కుమార్ ప్రేమించాలని లేకుంటే హతమార్చుతానని హెచ్చరిస్తున్నాడు. వేధింపులు ఎక్కువ కావటంతో తల్లిదండ్రుల సహకారంతో ఆమె ముప్పాళ్ళ పోలీస్ స్టేషన్ లో రెండు నెలల క్రితం చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టలేదని, వేధింపులకు పాల్పడుతున్న ఆకతాయిని అరెస్ట్ చేసి తనకు రక్షణ కల్పించాలని విద్యార్థిని వేడుకుంది. సానుకూలంగా స్పందించిన ఎస్పీ ఆ యువకుడిపై శాఖాపరమైన చర్యలు చేపడతామని, ధైర్యంగా ఉండాలని హామీ ఇచ్చారు. -
జైరాం రమేష్ కాన్వాయ్‌పై ఆంక్షలు
గుంటూరు : కేంద్రమంత్రి, జీవోఎం సభ్యుడు జైరాం రమేష్ కాన్వాయ్‌పై పోలీసులు ఆంక్షలు విధించారు. తాడేపల్లి వద్ద ఆయన వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. జైరాం రమేష్ గుంటూరు జిల్లాలో పర్యటించనున్న విషయం తెలిసిందే. అయితే మున్సిపల్ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున పరిమిత సంఖ్యలో మాత్రమే వాహనాలను అనుమతించారు. ఒక్కొక్క వాహనమే వెళ్లాలని పోలీసులు సూచించారు. జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించినందున సోమవారం నుంచే ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చింది. కాగా విశాఖలో జరిగిన సీఐఐ సదస్సులో జైరాం రమేష్ సోమవారం పారిశ్రామిక వేత్తలతో భేటీ అయిన విషయం తెలిసిందే.