జైరాం రమేష్ కాన్వాయ్పై ఆంక్షలు | police restrictions on jariram ramesh convoy | Sakshi
Sakshi News home page

జైరాం రమేష్ కాన్వాయ్పై ఆంక్షలు

Published Tue, Mar 4 2014 10:51 AM | Last Updated on Tue, Aug 21 2018 4:18 PM

జైరాం రమేష్ కాన్వాయ్పై ఆంక్షలు - Sakshi

జైరాం రమేష్ కాన్వాయ్పై ఆంక్షలు

కేంద్రమంత్రి, జీవోఎం సభ్యుడు జైరాం రమేష్ కాన్వాయ్పై పోలీసులు ఆంక్షలు విధించారు.

గుంటూరు : కేంద్రమంత్రి, జీవోఎం సభ్యుడు జైరాం రమేష్ కాన్వాయ్పై పోలీసులు ఆంక్షలు విధించారు. తాడేపల్లి వద్ద ఆయన వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు.  జైరాం రమేష్ గుంటూరు జిల్లాలో పర్యటించనున్న విషయం తెలిసిందే. అయితే మున్సిపల్ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున పరిమిత సంఖ్యలో మాత్రమే వాహనాలను అనుమతించారు. ఒక్కొక్క వాహనమే వెళ్లాలని పోలీసులు సూచించారు.

జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను ప్రకటించినందున సోమవారం నుంచే ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చింది. కాగా విశాఖలో జరిగిన సీఐఐ సదస్సులో జైరాం రమేష్ సోమవారం పారిశ్రామిక వేత్తలతో భేటీ అయిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement