'మోడీ, చంద్రబాబు దొందూ దొందే' | Jairam Ramesh takes on Narendra Modi, Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

'మోడీ, చంద్రబాబు దొందూ దొందే'

Published Wed, Apr 23 2014 4:05 PM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM

'మోడీ, చంద్రబాబు దొందూ దొందే' - Sakshi

'మోడీ, చంద్రబాబు దొందూ దొందే'

గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇద్దరు దొందూ దొందే అని కేంద్ర మంత్రి, జీవోఎం సభ్యుడు జైరాం రమేష్ ఎద్దేవా చేశారు. ఆ ఇద్దరు నేతలు మత సామరస్యాన్ని విస్మరించారని ఆరోపించారు. బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన కరీంనగర్లో విచ్చేశారు. ఈ సందర్బంగా జైరాం రమేష్ మాట్లాడుతూ... గతంలో మోడీని విమర్శించిన బాబు.... ఇప్పుడు ఆయనతోనే బాబు అంటకాగడాన్ని జైరాం రమేష్ విమర్శించారు. చంద్రబాబు రంగులు మార్చే ఊసరవెల్లిగా అని ఆయన అభివర్ణించారు.

కేసీఆర్కు రెండు కళ్లున్నా... తెలంగాణ ప్రాంతం పునర్ నిర్మాణం అంటూ ఓ వైపు మాత్రమే చూస్తున్నారంటూ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ రెండు కళ్లతో రెండు ప్రాంతాల అభివృద్ధిని కోరుకుంటుందని గుర్తు చేశారు. కాంగ్రెస్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని ఆయన పునరుద్ఘాటించారు. తెలంగాణ ఇస్తే పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తానని మాట ఇచ్చి... ఆ తర్వాత మాట మార్చిన మహా నాయకుడు అంటూ కేసీఆర్పై తీవ్ర స్థాయిలో జైరాం రమేష్ విరుచుకుపడ్డారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement