కామారెడ్డిలో ప్రసంగిస్తున్న జైరాం రమేశ్, పక్కన షబ్బీర్ అలీ
కామారెడ్డి, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది, తె చ్చింది కాంగ్రెస్ పార్టీయేనని కేంద్ర మంత్రి జైరాంరమేశ్ స్పష్టం చేశారు. ఇందులో కేసీఆర్ చేసిందేమి లేదన్నా రు. తెలంగాణ పునర్నిర్మాణం కూడా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఆయన అన్నారు. బుధవారం రాత్రి కామారెడ్డిలోని ఇస్లాంపురాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. తెలంగాణ కోసం 60 సంవత్సరాలుగా పోరాటం నడిచిందన్నారు.
టీఆర్‌ఎస్ కన్నా ముందే కాంగ్రెస్ పార్టీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు సోనియాగాం ధీని కలిసి తెలంగాణ రాష్ట్రం కావాలని కోరినట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. 2009 సంవ్సతరం నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసి సాధించిందన్నారు.
12 మంది తెలంగాణ ప్రాంత ఎంపీలు పోరాడడం వల్లే రాష్ట్రం వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ కి తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలు రెండు కళ్ల లాంటివని, రెండు రాష్ట్రాల ను దేశంలోనే అగ్రగామిగా నిలబెడతామని జైరాం రామేశ్ వాగ్ధానం చేశారు. టీడీపీకి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టేనని అన్నారు. కాంగ్రెస్ మాత్రమే సెక్యుల ర్ పార్టీ అన్న విషయాన్ని గుర్తించాల న్నారు.
సోనియాగాంధీని తెలంగాణ తల్లి, తెలంగాణ నిర్మాతగా అభివర్ణిం చారు. షబ్బీర్‌అలీని గెలిపిస్తే రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడని అన్నా రు. 2009 లో చేసిన తప్పు మరోసారి చేయొద్దని ప్రజలను కోరారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో రైతులు, మహిళ లు, యువకుల కోసం అనేక కార్యక్రమాలను రూపొందించిందన్నారు. ఏఐసీసీ నేత కొప్పుల రాజు, కైలాస్‌శ్రీనివాస్‌రావ్, అంజయ్య, మోహన్‌రెడ్డి, గూ డెం శ్రీనివాస్‌రెడ్డి, పంపరి శ్రీనివాస్, నారాగౌడ్, హరికిసన్‌గౌడ్ తదితరులు ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు.
కామారెడ్డిని జిల్లా చేస్తాం
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న పది జిల్లాలను 20 జిల్లాలుగా విభజిస్తామని జైరాంరమేశ్ పేర్కొన్నారు. అం దులో కామారెడ్డిని జిల్లాగా ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో సభకు హాజరైనవారు చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు.రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.