అప్రమత్తంగా ఉండండి
అప్రమత్తంగా ఉండండి
Published Thu, Aug 11 2016 12:04 AM | Last Updated on Tue, Aug 21 2018 4:18 PM
తాడేపల్లి రూరల్:
పుష్కరాల్లో విధులు నిర్వహించే సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండి భక్తులను క్షేమంగా ఇంటికి పంపిచాలని గుంటూరు అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి అన్నారు. బుధవారం ఘాట్లు పరిశీలించేందుకు ఇక్కడకు వచ్చిన ఆయన ముఖ్యమంత్రితో పాటు పోలీసు ఉన్నతాధికారులు కంట్రోల్ రూమ్ నుంచి పుష్కర ఘాట్లు వీక్షించేలా ఏర్పాటు చేసిన వై–ఫై కెమెరాలను, గాలిలో ఎగురుతూ చుట్టు పక్కల ప్రాంతాలను చిత్రీకరించే డ్రోన్ కెమెరాలను స్వయంగా పరిశీలించారు. నిరంతరం అంతా అప్రమత్తంగా ఉండాలని, విజయవాడ కంట్రోల్ రూమ్ నుంచి ఏ అధికారి ఫోన్ చేసి ఏ ఘాట్‌ను చూపించమంటే ఆ ఘాట్‌ను చూపించగలగాలని ఆయన సూచించారు. ఆయన పరిశీలిస్తున్న సమయంలో పెద్ద గాలి వచ్చి భక్తులు దుస్తులు మార్చుకునే గదులు పైకి కిందకు ఊగుతుండడంతో ఆయన దగ్గరుండి, బోల్టు ఫిట్టింగ్ చేయించి కదలకుండా ఏర్పాట్లు చేయించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో క్రైమ్ ఎస్పీ డి. కోటేశ్వరరావు, మంగళగిరి డీఎస్పీ రామాంజనేయులు, సీఐ హరికృష్ణ తదితరులు ఉన్నారు.
Advertisement
Advertisement