CAREFUL
-
ఆయుధాల మరమ్మతుల్లో జాగ్రత్తలు పాటించాలి
వెంగళరావునగర్: ఆయుధాలు మరమ్మతులకు వచ్చిన సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అంజనీకుమార్ తెలియజేశారు. యూసుఫ్‌గూడ ఫస్ట్ బెటాలియన్‌లో బుధవారం ఆర్మరర్ బేసిక్ కోర్స్ రెండో బ్యాచ్ ప్రారంభ కార్యక్రమ జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన అంజనీకుమార్ ఆర్మరల్ బేసిక్ కోర్స్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయుధాల మరమ్మతులులో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అప్పుడే ఎలాంటి కొత్త సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చని తెలియజేశారు. అనంతరం ఆయన బేస్ రిఫైర్ వర్క్‌షాపును సందర్శించారు. ఇందులో భాగంగా ఆయుధాలు ఎలా మరమ్మతులు చేసే విధానం, ఎటువంటి సమస్యలు వస్తాయని అంటో ఆర్మరర్స్ను అడిగి తెలుసుకుని సంతృప్తిని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీఎస్ఎస్పీ అడిషనల్ డీజీ స్వాతి లక్రా, డీఐజీ ఎం.ఎస్.సిద్ధిఖీ, ఫస్ట్ బెటాలియన్ కమాండెంట్ మురళీకృష్ణ, వర్క్‌షాప్ ఇన్చార్జి పి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
బైక్‌పై వెళుతున్నారా.. అయితే జాగ్రత్త !
అన్నానగర్: భార్య, భర్తలు ఇద్దరు ఓ బైక్‌లో వెళుతున్నారు. అంతలో వెనుక బైక్‌లో వచ్చిన ముగ్గురు దుండగలు ఆ దంపంతులపై దాడి చేసి 28 సవర్ల నగలను చోరి చేసుకొని పరారయ్యారు. వారి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ ఘటన చెన్నై రాజీవ్‌గాంధీ ప్రభువ్వ ఆస్పత్రి సమీపంలో చోటు చేసుకుంది. చెన్నైలోని పాత వన్నారపేటకు చెందిన వ్యక్తి కణ్ణిరధమ్, తర భార్య విజయరాణితో కలిసి బుధవారం ఉదయం 6 గంటల సమయంలో పుదుచ్చేరికి బయలుదేరారు. బైక్‌లో చెన్నై ఎగ్మూర్‌కు వచ్చి, అక్కడి నుంచి రైల్లో పుదుచ్చేరికి వెళ్లటానికి సిద్ధమయ్యారు. రాజీవ్‌గాంధీ ప్రభుత్వ ఆస్పత్రి సమీపంలో వెనుక బైక్‌లో వచ్చిన ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు వారిని అడ్డుకున్నారు. విజయరాణిపై దాడి చేసి నెట్టడంతో భార్యభర్తలు కింద పడ్డారు. ఈ సందర్భాన్ని ఉపయోగించుకొని విజయరాణి మెడలో ఉన్న 28 సవర్ల నగలను బైక్‌లో వచ్చిన దుండగులు దోచుకున్నారు. వెంటనే వారు కేకలు వేసిన ప్రయోజనం లేకుండా పోయింది. దుండగుల వెంటనే బైక్‌లో పరారయ్యారు. గాయపడిన విజయరాణి, భర్త ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీని గురించి పోలీసులు కేసు నమోదు చేసి పరారైన వారి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన ఆ ప్రాంతలో కలకలం రేపింది. -
ఉపపోరును పకడ్బందీగా నిర్వహించాలి
జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్ ఖమ్మం జెడ్పీసెంటర్: జిల్లాలో సెప్టంబర్ 8న జరగనున్న స్థానిక సంస్థల ఉప ఎన్నికలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ లోకేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక సంస్థల ఏర్పాట్లపై అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లాలో వివిధ కారణాలతో ఖాళీ అయిన వార్డు మెంబర్లు, సర్పంచ్, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిందని, అందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ఎన్నికల సిబ్బందికి శిక్షణ, ఈవీఎంలను సిద్ధం చేయాలన్నారు. ఈ ఎన్నికలకు మొత్తం 74 ఈవీఎంలు అవసరపడతాయని, మరో 30 ఈవీఎంల కోసం ప్రభుత్వానికి నివేధించాలని అధికారులను ఆదేశించారు. వచ్చే నెల 4న బ్యాలెట్ పేపర్‌ను ఈవీఎంలలో ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఒక్కో మండలానికి అదనంగా మరో ఈవీఎంను, వార్డు సభ్యుల ఎన్నికలకు కూడా రిజర్వులో ఉంచాలన్నారు. ఎంపీటీసీ కౌటింగ్ మండల పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేయాలన్నారు. కౌంటింగ్ సిబ్బంది, ఎన్నికల సిబ్బందికి టీఏ, డీఏల కోసం బడ్జెట్ ప్రతిపాదనలు పంపాలన్నారు. వచ్చేనెల 7న మెన్, మెటిరియల్‌ను కలెక్టరేట్ నుంచి ఎన్నికల జరిగే ప్రాంతాలకు సిబ్బంది వేళ్లేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశఃలో జిల్లా పరిషత్ సీఈఓ మారుపాక నాగేశ్, డీఆర్వో శ్రీనివాస్, ఇన్చార్జ్ డీపీఓ నారాయణరావు, ఎలక్షన్ డీటీ రాంబాబు, సమాచార శాఖ ఏడీ మహ్మద్ ముర్తుజా తదితరులు పాల్గొన్నారు. -
అప్రమత్తంగా ఉండండి
తాడేపల్లి రూరల్: పుష్కరాల్లో విధులు నిర్వహించే సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండి భక్తులను క్షేమంగా ఇంటికి పంపిచాలని గుంటూరు అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి అన్నారు. బుధవారం ఘాట్లు పరిశీలించేందుకు ఇక్కడకు వచ్చిన ఆయన ముఖ్యమంత్రితో పాటు పోలీసు ఉన్నతాధికారులు కంట్రోల్ రూమ్ నుంచి పుష్కర ఘాట్లు వీక్షించేలా ఏర్పాటు చేసిన వై–ఫై కెమెరాలను, గాలిలో ఎగురుతూ చుట్టు పక్కల ప్రాంతాలను చిత్రీకరించే డ్రోన్ కెమెరాలను స్వయంగా పరిశీలించారు. నిరంతరం అంతా అప్రమత్తంగా ఉండాలని, విజయవాడ కంట్రోల్ రూమ్ నుంచి ఏ అధికారి ఫోన్ చేసి ఏ ఘాట్‌ను చూపించమంటే ఆ ఘాట్‌ను చూపించగలగాలని ఆయన సూచించారు. ఆయన పరిశీలిస్తున్న సమయంలో పెద్ద గాలి వచ్చి భక్తులు దుస్తులు మార్చుకునే గదులు పైకి కిందకు ఊగుతుండడంతో ఆయన దగ్గరుండి, బోల్టు ఫిట్టింగ్ చేయించి కదలకుండా ఏర్పాట్లు చేయించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో క్రైమ్ ఎస్పీ డి. కోటేశ్వరరావు, మంగళగిరి డీఎస్పీ రామాంజనేయులు, సీఐ హరికృష్ణ తదితరులు ఉన్నారు. -
విత్తన కొనుగోలులో జాగ్రత్త అవసరం
విజయనగరంఫోర్ట్: రబీ సీజన్ ఆరంభమైంది. కొంతమంది రైతులు ఇప్పటకే విత్తనాలు కొనుగోలు చేశారు. మరి కొంతమంది ఇంకా కొనుగోలు చేయాల్సి ఉంది. విత్తనాలు నాణ్యతపైనే పంట దిగుబడి అధారపడి ఉంటుంది. విత్తనాల కొనుగోలులో జాగ్రత్తలు పాటించకపోతే నష్ట పోవలసి వస్తుందని వ్యవసాయశాఖ సహాయసంచాలకులు ఎ.నాగభూషణరావు తెలిపారు. విత్తనాలు సేకరణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి ఆయన వివరించారు. గత 5, 6 సంవత్సరాల్లో పత్తి, పొద్దుతిరుగుడు, మొక్కజొన్న, మిర్చి , కాయగూరల్లో ప్రైవేటు విత్తన ఉత్పత్తి సంస్థలు అనేక రకాలను మార్కెట్లోకి విడుదల చేశాయి. అయితే వాటిని సాగుచేసినప్పుడు ఆయా సంస్థలు ప్రకటించిన దిగుబడి కన్నా తక్కువ దిగుబడి రావడం వల్ల నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి విత్తనాలను కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. నోటిఫైడ్, నాన్ నోటిఫైడ్ విత్తనాల తేడా: విత్తనాలలో ప్రభుత్వ పరంగా విడుదలయ్యేవి, ప్రైవేటుపరంగా విడదలయ్యేవి ఉంటాయి. ప్రభుత్వపరంగా రూపొందించిన రకాలు నోటిఫైడ్ పేరిట మార్కెట్లోకి వస్తాయి. ప్రైవేటు సంస్థలు రూపొందించిన విత్తనాలను నాన్ నోటిఫైడ్ పేరిట విడుదల చేస్తారు. నోటిఫైడ్ విత్తనాల నాణ్యత, పంపిణీ ప్రమాణాలు మొదలైనవి 1966 నాటి విత్తన చట్టం, 1983 నాటి విత్తన నియంత్రణ పరిధిలోకివస్తాయి. విత్తనాలు నాణ్యతాప్రమాణాలకు అనుణంగా లేటనట్లయితే ఉత్పత్తిదారులు, పంపిణీ దారులు చట్టరీత్యా శిక్షార్హులు. విత్తనాలు కొనుగోలులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు: మండల వ్యవసాయఅధికారి లేదా సంబంధిత వ్యవసాయ సహాయ సంచాలకుల సలహా మేరకు ఆయా ప్రాంతాలకు అనువైన నోటిఫైడ్ లేదా నాన్ నోటిఫైడ్ రకాలను కొనుగోలు చేయాలి. ప్రైవేటు కంపెనీలు ప్రచురించిన ఆకర్షణీయమైన కరపత్రాలను నమ్మకూడదు. ఆయా రకాలను వ్యవసాయ విశ్వ విద్యాలయం వారు ప్రయోగత్మకంగా సాగుచేసినప్పుడు సత్ఫలితాలు వస్తే ప్రభుత్వం వాటిని ఎంపిక చేసుకోవాలి. వ్యవసాయశాఖ జారీ చేసిన లెసైన్సు ఉన్నవారి నుంచి మాత్రమే విత్తనాలను కొనుగోలుచేయాలి. లెసైన్సు లేకుండా , బిల్లులు ఇవ్వకుండా తక్కువ ధరలతో, నాణ్యత లేని విత్తనాలను అమ్మడానికి కొన్ని ప్రైవేటు కంపెనీలు ప్రయత్నిస్తుంటాయి. వాటి పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలి. సంబంధిత అధీకృత డీలరు వద్దే విత్తనాలు కొనుగోలు చేయాలే తప్ప ఇతరులు వద్ద కొనుగోలు చేయకూడదు. ఎలాంటి అనుమానమున్నా వెంటనే నేరుగా జిల్లా సంయుక్త సంచాలకులు లేదా కమిషనర్ కార్యాలయానికి తెలియపర్చాలి. కొనుగోలు చేసిన విత్తనాల ప్యాకెట్లను , వాటికి కుట్టిన లేబుళ్లను విత్తనాలను వినియోగించిన తరువాత భద్రపరచుకోవాలి. ఇవి మున్ముందు విత్తనాలకు సంబంధించిన నాణ్యత సమస్యలకు , పరిహారం పొందడానికి ముఖ్యమైన అధారంగా ఉంటాయి. ఒక వేళ ఏదైనా విత్తనం, నాణ్యత ప్రమాణాలకు తగినట్టు లేకపోతే... అంటే తక్కువ మొలకశాతం, జన్యుస్వచ్ఛత లేకపోవడం, కల్తీ వంటి వాటిని గమనించినట్లుయితే సంబంధిత వ్యవసాయ అధికారికి తెలియజేయాలి. వారి సలహా మేరకు తదుపరి చర్య తీసుకోవాలి. -
జంతువులతో జాగ్రత్త సుమా...
జంతువుల నుంచి మనుషులకు సుమారు 280 రకాల వ్యాధులు సంక్రమిస్తున్నాయి. ఇందులో ఇందులో ప్రధానంగా రేబిస్, బ్రూసెల్లోసిస్, ఆంత్రాక్స్, స్వైన్‌ప్లూ, టీబీ, బర్డ్‌ప్లూ ప్రమాదకరమైనవి. రేబిస్ వ్యాధి: రాబిస్ వ్యాధి కుక్క కాటు ద్వారా మనుషులకు సంక్రమిస్తుంది. ఈ వ్యాధి కుక్కల లాలాజలంలో ఉండే రాబిస్ అనే వైరస్ ద్వారా వ్యాప్తి చెందుతుంది. దీని కోసం ప్రతీ సంవత్సరం వ్యాధి నిరోధక టీకాలు పెంపుడు జంతువులకు తప్పని సరిగా ఇప్పించినట్లైయితే మనుషులకు ఈ వ్యాధులు సోకకుండా ఉంటాయి. ఆంత్రాక్స్: ఈ వ్యాధి ఆంత్రాక్స్ బ్రూసెల్లోసిస్ అనే సూక్ష్మక్రిమి వల్ల వ స్తుంది. ఇది ఎక్కువగా గొర్రెలకు వ్యాపిస్తుంది. ఈ వ్యాధి ఉన్న గొర్రెపొటేళ్ళ మాంసం తిన్న మనుషులకు వస్తుంది. బర్డ్‌ప్లూ: ఈ వ్యాధి అవయిన్‌లూప్లెంజా అనే సూక్ష్మక్రిమివల్ల వస్తుంది. ఇది గాలి ద్వారా చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి వచ్చేటప్పుడు కోళ్ళుచాలా ఎక్కువగా చనిపోతాయి. ఈ వ్యాధితో ఉన్న కోళ్ళ మాంసం, రెట్టల ద్వారా మనుషులకూ వ్యాపిస్తుంది. ఈ వ్యాధి ఎక్కువగా చలి కాలంలో వస్తుంది. టీబీ... దీనిని ట్యూబోలలోసిస్ అంటారు. ఇది బ్యాక్టిరీయా ద్వారా మనుషులకు, పశువులకు వచ్చి ప్రతీ సంవత్సరం అనే మంది చనిపోతున్నారు. టీబీతో ఉన్న పశువుల పాలు బాగా మరిగించకుండా తాగినట్లైయితే మనుషులకు, చిన్న పిల్లలకు ఈ వ్యాధి సంక్రమిస్తుంది. -
ఆఫర్లతో జర జాగ్రత్త
డిస్కౌంట్ ఆఫర్స్.. ఏ షాపింగ్ వూల్ చూసినా ఆఫర్లే..ఆఫర్లు.. జేబులో డబ్బుంటే చాలు వెళ్లి కొనేద్దాం అనేలా ఆకట్టుకుంటున్నారు నిర్వాహకులు. అయితే ఆఫర్ కదా అని వెనకా, ముందు చూసుకోకుండా దుస్తులు కొంటే మోసపోయేది వునమే. ఆఫర్లకు ఆకర్షితులై అవగాహన లేకుండా బట్టలు కొంటే ఇబ్బంది తప్పదు. ముఖ్యంగా వేలకు వేలు పోసి కొనే పట్టు చీరలు కొనే ముందు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. అంతేకాక వాటిని భద్ర పరుచుకొవడంలో కూడ జాగ్రత్తలు అవసరం. బ్రాండెడ్ దుస్తులు, పట్టుచీరలు కొనేటపుడు, వాటిని ఉతికే సందర్భాల్లో ఇలా చేయుండి. - న్యూఢిల్లీ బ్రాండెడ్ దస్తులు కొంటున్నారా? నలిపి చూడండి వుడతలు త్వరగా పడవు. (ఫోల్డింగ్ స్టైల్ ఉన్నవి అలానే ఉంటాయి) జిప్‌పై, బటన్లపై ఇలా దాదాపు ప్రతి ముఖ్యమైన వస్తువులపై బ్రాండ్ పేరు ఉంటుంది. డబుల్ స్టిచ్చింగ్‌తో పాటుగా, నాణ్యత పట్టుకోగానే చాలా తేడాగా ఉంటుంది. ఖచ్చితంగా వారంటీ, గ్యారెంటీలతో ఉంటుంది. షర్ట్ కాలర్, ప్యాంట్ బ్యాక్ బ్యాడ్జ్, చుట్టుకొలత ఇన్‌సైడ్‌లో బ్రాండ్ పేరు ఉంటుంది. క్లాత్ తీసుకుంటుంటే దాని అంచుపై బ్రాండ్ పేరు ఉంటుంది. పట్టు చీర కొంటున్నారా?... అసలైన పట్టు బంగారు వర్ణంలో మెరుస్తూ ఉంటుంది. పట్టు వస్త్రాలపై ఎలాంటి గీతలు ఉండవు. పట్టులో వాడే దారాలను రెండు రకాలు. న్యాచురల్, సింథటిక్ ఫైబర్. న్యాచురల్ ఫైబర్‌ను ముట్టుకుంటే ఊలూ, జుట్టు ముట్టుకున్న భావన కలుగుతుంది. దీనిని కాల్చితే జుట్టును కాల్చిన వాసన వస్తుంది. కాల్చిన అనంతరం గుండ్రంగా మారి పౌడర్లా మారుతుంది. సింథటిక్ ఫైబర్ అయితే వెంటనే కాలిపోయి, పూసలా గట్టిగా మారిపోతుంది. ఎక్కవ కాలం మన్నాలంటే .. నెలకు లేదా రెండు నెలలకు వాడినా, వాడకున్నా బయటకు తీసి మడతలు తీసి ఉంచండి. ఎక్కడ భద్ర పరుస్తున్నారో అక్కడ మిరియాలు లేదా గంధం చెక్కను మరో చిన్న గుడ్డలో ఉంచి దాని పక్కన భద్రంగా ఉంచుకోండి. తేమగా ఉన్నప్పుడే ఐరన్ చేయండి. పేపర్‌ను పెట్టి ఇస్త్రీ చేస్తే దానిపై వేడి ప్రభావం కూడా ఉండదు. ఉతికే సందర్భంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మంచి నీళ్లలోనే ఉతకాలి. గోరు వెచ్చని నీటిలో ఉతికితే మంచిది. ఉప్పు నీళ్లలో అయితే కొంచెం బొరాక్స్ పౌడర్, అమ్మోనియం కలిపి ఉతకవచ్చు. ఎక్కువ సమయం నీటిలో నానబెట్ట కూడదు. ఉతికిన తరువాత దానిని పిండ కూడదు, దులప కూడదు. ఎలా ఉందో అలానే మడతలు లేకుండా ఆరబెట్టాలి. డిటర్జెంట్ పౌడర్‌కు బదులు షాంపూను వాడవచ్చు. (బేబీ షాంపూ అయితే మంచిది) ఉతికే ముందు నీళ్లల్లో వేసే ముందు ఇతర దుస్తులు లేకుండా చూసుకోండి. రఫ్‌గా, హార్డ్‌గా ఉతక కూడదు. నీడలో మాత్రమే ఆరబెట్టాలి. సింథిటిక్ ఫైబర్‌తో చేసిన వాటికి దానితో పాటుగా వచ్చే సూచనలు ఫాలో అవుతూనే పైన పేర్కొన్న సూచనలు పాటిస్తే వున్నికగా ఉంటాయి.