ఆఫర్లతో జర జాగ్రత్త
డిస్కౌంట్ ఆఫర్స్.. ఏ షాపింగ్ వూల్ చూసినా ఆఫర్లే..ఆఫర్లు.. జేబులో డబ్బుంటే చాలు వెళ్లి కొనేద్దాం అనేలా ఆకట్టుకుంటున్నారు నిర్వాహకులు. అయితే ఆఫర్ కదా అని వెనకా, ముందు చూసుకోకుండా దుస్తులు కొంటే మోసపోయేది వునమే. ఆఫర్లకు ఆకర్షితులై అవగాహన లేకుండా బట్టలు కొంటే ఇబ్బంది తప్పదు. ముఖ్యంగా వేలకు వేలు పోసి కొనే పట్టు చీరలు కొనే ముందు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. అంతేకాక వాటిని భద్ర పరుచుకొవడంలో కూడ జాగ్రత్తలు అవసరం. బ్రాండెడ్ దుస్తులు, పట్టుచీరలు కొనేటపుడు, వాటిని ఉతికే సందర్భాల్లో ఇలా చేయుండి. - న్యూఢిల్లీ
బ్రాండెడ్ దస్తులు కొంటున్నారా?
నలిపి చూడండి వుడతలు త్వరగా పడవు. (ఫోల్డింగ్ స్టైల్ ఉన్నవి అలానే ఉంటాయి)
జిప్‌పై, బటన్‌లపై ఇలా దాదాపు ప్రతి ముఖ్యమైన వస్తువులపై బ్రాండ్ పేరు ఉంటుంది.
డబుల్ స్టిచ్చింగ్‌తో పాటుగా, నాణ్యత పట్టుకోగానే చాలా తేడాగా ఉంటుంది.
ఖచ్చితంగా వారంటీ, గ్యారెంటీలతో ఉంటుంది.
షర్ట్ కాలర్, ప్యాంట్ బ్యాక్ బ్యాడ్జ్, చుట్టుకొలత ఇన్‌సైడ్‌లో బ్రాండ్ పేరు ఉంటుంది.
క్లాత్ తీసుకుంటుంటే దాని అంచుపై బ్రాండ్ పేరు ఉంటుంది.
పట్టు చీర కొంటున్నారా?...
అసలైన పట్టు బంగారు వర్ణంలో మెరుస్తూ ఉంటుంది.
పట్టు వస్త్రాలపై ఎలాంటి గీతలు ఉండవు.
పట్టులో వాడే దారాలను రెండు రకాలు. న్యాచురల్, సింథటిక్ ఫైబర్.
న్యాచురల్ ఫైబర్‌ను ముట్టుకుంటే ఊలూ, జుట్టు ముట్టుకున్న భావన కలుగుతుంది.
దీనిని కాల్చితే జుట్టును కాల్చిన వాసన వస్తుంది. కాల్చిన అనంతరం గుండ్రంగా మారి పౌడర్‌లా మారుతుంది.
సింథటిక్ ఫైబర్ అయితే వెంటనే కాలిపోయి, పూసలా గట్టిగా మారిపోతుంది.
ఎక్కవ కాలం మన్నాలంటే ..
నెలకు లేదా రెండు నెలలకు వాడినా, వాడకున్నా బయటకు తీసి మడతలు తీసి ఉంచండి.
ఎక్కడ భద్ర పరుస్తున్నారో అక్కడ మిరియాలు లేదా గంధం చెక్కను మరో చిన్న గుడ్డలో ఉంచి దాని పక్కన భద్రంగా ఉంచుకోండి. తేమగా ఉన్నప్పుడే ఐరన్ చేయండి. పేపర్‌ను పెట్టి ఇస్త్రీ చేస్తే దానిపై వేడి ప్రభావం కూడా ఉండదు.
ఉతికే సందర్భంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మంచి నీళ్లలోనే ఉతకాలి. గోరు వెచ్చని నీటిలో ఉతికితే మంచిది.
ఉప్పు నీళ్లలో అయితే కొంచెం బొరాక్స్ పౌడర్, అమ్మోనియం కలిపి ఉతకవచ్చు.
ఎక్కువ సమయం నీటిలో నానబెట్ట కూడదు.
ఉతికిన తరువాత దానిని పిండ కూడదు, దులప కూడదు. ఎలా ఉందో అలానే మడతలు లేకుండా ఆరబెట్టాలి.
డిటర్జెంట్ పౌడర్‌కు బదులు షాంపూను వాడవచ్చు. (బేబీ షాంపూ అయితే మంచిది)
ఉతికే ముందు నీళ్లల్లో వేసే ముందు ఇతర దుస్తులు లేకుండా చూసుకోండి.
రఫ్‌గా, హార్డ్‌గా ఉతక కూడదు. నీడలో మాత్రమే ఆరబెట్టాలి.
సింథిటిక్ ఫైబర్‌తో చేసిన వాటికి దానితో పాటుగా వచ్చే సూచనలు ఫాలో అవుతూనే పైన పేర్కొన్న సూచనలు పాటిస్తే వున్నికగా ఉంటాయి.