బైక్‌పై వెళుతున్నారా.. అయితే జాగ్రత్త !
అన్నానగర్: భార్య, భర్తలు ఇద్దరు ఓ బైక్‌లో వెళుతున్నారు. అంతలో వెనుక బైక్‌లో వచ్చిన ముగ్గురు దుండగలు ఆ దంపంతులపై దాడి చేసి 28 సవర్ల నగలను చోరి చేసుకొని పరారయ్యారు. వారి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ ఘటన చెన్నై రాజీవ్‌గాంధీ ప్రభువ్వ ఆస్పత్రి సమీపంలో చోటు చేసుకుంది. చెన్నైలోని పాత వన్నారపేటకు చెందిన వ్యక్తి కణ్ణిరధమ్, తర భార్య విజయరాణితో కలిసి బుధవారం ఉదయం 6 గంటల సమయంలో పుదుచ్చేరికి బయలుదేరారు. బైక్‌లో చెన్నై ఎగ్మూర్‌కు వచ్చి, అక్కడి నుంచి రైల్లో పుదుచ్చేరికి వెళ్లటానికి సిద్ధమయ్యారు.
రాజీవ్‌గాంధీ ప్రభుత్వ ఆస్పత్రి సమీపంలో వెనుక బైక్‌లో వచ్చిన ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు వారిని అడ్డుకున్నారు. విజయరాణిపై దాడి చేసి నెట్టడంతో భార్యభర్తలు కింద పడ్డారు. ఈ సందర్భాన్ని ఉపయోగించుకొని విజయరాణి మెడలో ఉన్న 28 సవర్ల నగలను బైక్‌లో వచ్చిన దుండగులు దోచుకున్నారు. వెంటనే వారు కేకలు వేసిన ప్రయోజనం లేకుండా పోయింది. దుండగుల వెంటనే బైక్‌లో పరారయ్యారు. గాయపడిన విజయరాణి, భర్త ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీని గురించి పోలీసులు కేసు నమోదు చేసి పరారైన వారి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన ఆ ప్రాంతలో కలకలం రేపింది.