
భారతదేశంలో లెక్కకు మించిన బైకులు అమ్మకానికి ఉన్నాయి. అయితే చాలామంది సరసమైన, ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైకులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ కథనంలో ఇండియన్ మార్కెట్లోని టాప్ 5 చీప్ అండ్ బెస్ట్ బైకులు గురించి తెలుసుకుందాం.
హీరో హెచ్ఎఫ్ 100 (Hero HF 100)
ఇండియన్ మార్కెట్లో అత్యంత సరసమైన బైకుల జాబితాలో చెప్పుకోదగ్గ మోడల్ 'హీరో హెచ్ఎఫ్ 100'. దీని ధర రూ. 59,018 (ఎక్స్ షోరూమ్). సింపుల్ డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఈ బైక్ 65 కిమీ / లీ మైలేజ్ అందిస్తుంది. మల్టిపుల్ వేరియంట్లలో లభించే ఈ బైక్.. 97.2 సీసీ ఇంజిన్ ద్వారా.. అత్యుత్తమ పనితీరును అందిస్తుంది.

టీవీఎస్ స్పోర్ట్ (TVS Sport)
తక్కువ ధరలో లభించే బైకుల జాబితాలో మరో మోడల్.. టీవీఎస్ స్పోర్ట్. దీని ధర రూ. 59,881 (ఎక్స్ షోరూమ్). 109.7 సీసీ ఇంజిన్ కలిగిన ఈ బైక్ 80 కిమీ / లీ మైలేజ్ అందిస్తుంది. ఈ బైక్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 10 లీటర్లు కాగా.. దీని బరువు 112 కేజీలు మాత్రమే.
హీరో హెచ్ఎఫ్ డీలక్స్ (Hero HF Deluxe)
రూ. 59,998 (ఎక్స్ షోరూమ్) వద్ద లభించే హీరో హెచ్ఎఫ్ డీలక్స్ కూడా సరసమైన బైకుల జాబితాలో ఒకటి. ఇది 65 కిమీ మైలేజ్ అందిస్తుంది. 4 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ కలిగిన ఈ బైక్ 97.2 సీసీ ఇంజిన్ పొందుతుంది. కాబట్టి మంచి పనితీరును అందిస్తుంది.

హోండా షైన్ (Honda Shine)
ఇండియన్ మార్కెట్లో ఎక్కువమంది కొనుగోలు చేసిన బైక్ ఈ హోండా షైన్. దీని ప్రారంభ ధర రూ. 66,900 మాత్రమే. ఇందులో 123.94 సీసీ ఇంజిన్ 55 కిమీ / లీ మైలేజ్ అందిస్తుంది. దీని ఫ్యూయెక్ ట్యాంక్ కెపాసిటీ 10.5 లీటర్లు. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది.
ఇదీ చదవండి: పెట్రోల్, డీజిల్ కార్ల కథ ముగిసినట్టే?.. ఈవీ పాలసీ 2.0 గురించి తెలుసా
టీవీఎస్ రేడియన్ (TVS Radeon)
మన జాబితాలో చివరి బైక్.. ఎక్కువ మైలేజ్ ఇచ్చే.. సరసమైన బైక్ టీవీఎస్ రేడియన్. దీని ప్రారంభ ధర రూ. 70720 (ఎక్స్ షోరూమ్). ఇది 62 కిమీ / లీ మైలేజ్ అందిస్తుంది. ఈ బైక్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 10 లీటర్లు మాత్రమే. ఇంజిన్ 4 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది.
Comments
Please login to add a commentAdd a comment