
అతి తక్కువ కాలంలోనే అధిక ప్రజాదరణ పొందిన కియా కారెన్స్ (Kia Carens) అమ్మకాల్లో అరుదైన మైలురాయిని చేరుకుంది. దాని విభాగంలో అత్యంత వేగంగా అమ్ముడవుతున్న వాహనాలలో ఒకటిగా అవతరించిన ఈ కారు.. ప్రీమియం ఫీచర్స్, కొత్త డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది.
కియా ఇండియా.. కారెన్స్ కారును లాంచ్ చేసినప్పటి నుంచి, అంటే 36 నెలల్లో ఏకంగా 2,00,000 అమ్మకాల మైలురాయిని దాటేసింది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. దేశీయ మార్కెట్లో మాత్రమే కాకుండా.. కంపెనీ 70 కంటే ఎక్కువ దేశాల్లో 24064 యూనిట్ల కారెన్స్ కార్లను విక్రయించిందని స్పష్టం చేసింది.
మొత్తం అమ్మకాలలో కారెన్స్ పెట్రోల్ వేరియంట్‌లు 58 శాతం వాటాను కలిగి ఉండగా, 42 శాతం కస్టమర్లు డీజిల్ వెర్షన్‌ను ఎంచుకున్నారు. 32% కొనుగోలుదారులు ఆటోమేటిక్, iMT ట్రాన్స్‌మిషన్‌లను ఎంచుకుంటున్నారు. 28 శాతం మంది కస్టమర్లు సన్‌రూఫ్‌తో కూడిన వేరియంట్‌లను ఎంచుకున్నారు.
ఇదీ చదవండి: 48 గంటల్లో 20000 బుకింగ్స్.. మొదటి 50వేల మందికి..
కియా కారెన్స్ ధరలు ఇండియన్ మార్కెట్లో రూ. 12.92 లక్షల నుంచి రూ. 19.95 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. ఈ కారు మల్టిపుల్ వేరియంట్లలో, వివిధ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. కాబట్టి ఎక్కువమంది దీనిని కొనుగోలు చేయడానికి ఎగబడుతుంటారు.
నెలవారీ (ఫిబ్రవరి) అమ్మకాల్లో సోనెట్ (7,598 యూనిట్లు), సెల్టోస్ (6,446 యూనిట్లు) మంచి వృద్ధిని సాధించాయి. కారెన్స్ గత నెలలో 5318 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. కంపెనీ మొత్తం సేల్స్.. 2024 ఫిబ్రవరి కంటే 23.8 శాతం ఎక్కువ. దీన్నిబట్టి చూస్తుంటే.. కియా కార్లకు ఇండియన్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని స్పష్టమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment