చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ 'షియోమీ' (Xioami) గత ఏడాది ఆటోమొబైల్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఇందులో భాగంగానే కంపెనీ డిసెంబర్ 2024లో ఎస్‌యూ7 (SU7) పేరుతో ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసింది. షియోమీ లాంచ్ చేసిన ఈ కారును ఇప్పటికి లక్ష మంది కొనుగోలు చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..
షియోమీ ఎస్‌యూ7 మార్కెట్లో అడుగు పెట్టి ఇంకా సంవత్సరం పూర్తి కాలేదు, అప్పుడే లక్ష యూనిట్ల అమ్మకాలను పొందగలిగింది అంటే.. చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. ఎస్‌యూ7 కారు లక్ష యూనిట్ల సేల్స్ పొందిన విషయాన్ని కంపెనీ ఫౌండర్ & సీఈఓ 'లీ జున్' తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఫోటో కూడా షేర్ చేశారు. ఈ ఏడాది చివరి నాటికి షియోమీ ఎస్‌యూ7 మొత్తం 1.30 లక్షల సేల్స్ పొందే అవకాశం ఉందని భావిస్తున్నారు.
షియోమీ ఎస్‌యూ7
షియోమీ ఎస్‌యూ7 ఎలక్ట్రిక్ కారు స్టాండర్డ్, ప్రో, మ్యాక్స్ అనే మూడు వెర్షన్‌లలో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ.25.18 లక్షలు, రూ. 28.67 లక్షలు, రూ. 34.97 లక్షలు. ఇవి మూడు చూడటానికి చాలా మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉంటాయి. కాబట్టి ఎక్కువమంది వీటిని ఇష్టపడి కొనుగోలు చేశారు. కంపెనీ కూడా తన కస్టమర్లకు డెలివరీలను వేగంగా చేయడానికి.. ఉత్పత్తిని కూడా వేగవంతం చేసింది.
ఇదీ చదవండి: ఆఫ్రికన్ దేశాలకు ఇండియన్ బైకులు: ప్యూర్ ఈవీ ప్లాన్ ఇదే..
ఆరు కలర్ ఆప్షన్లలో లభించే షియోమీ ఎస్‌యూ7 ఎలక్ట్రిక్ కారు 5.28 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ 210 కిమీ/గం కాగా.. ఇది 400 న్యూటన్ మీటర్ టార్క్, 299 పీఎస్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులోని 73.6 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ సింగిల్ ఛార్జీతో గరిష్టంగా 800కిమీ రేంజ్ అందిస్తుంది.
The 100,000th Xiaomi SU7 has found its owner! She chose Radiant Purple and shared, "I’ve always been a Xiaomi Fan and picked the Pro for its smart driving and range." pic.twitter.com/c8G8GrVzwO
— Lei Jun (@leijun) November 18, 2024
Comments
Please login to add a commentAdd a comment