
చైనా ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ 'షియోమీ' (Xiaomi) గురువారం తన లగ్జరీ ఎలక్ట్రిక్ సెడాన్ 'ఎస్‌యూ7' (SU7) అల్ట్రా ధరలను ప్రకటించింది. ఈ కారు కోసం బుకింగ్స్ అక్టోబర్ చివరి నాటికి ప్రారంభమవుతాయని వెల్లడించింది.
కంపెనీ తన షియోమీ ఎస్‌యూ7 అల్ట్రా ధరలను 529900 యువాన్స్ (సుమారు రూ. 63 లక్షల కంటే ఎక్కువ)గా ప్రకరించింది. సంస్థ ఇప్పటికే మార్చి నెలలో.. చైనాలో ఈ కారు డెలివరీలను ప్రారంభించింది. దీనికి అక్కడ మంచి ఆదరణ కూడా లభించిందని సంస్థ వెల్లడించింది.
షియోమీ ఎస్‌యూ7 ఎలక్ట్రిక్ కారు రెండు వేరియంట్లలో లభిస్తుంది. బేస్ వేరియంట్ ఒక ఛార్జ్‌పై 668 కిమీ రేంజ్ అందిస్తే.. టాప్ వేరియంట్ 800 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుంది. ఈ కారు సూపర్ ఎలక్ట్రిక్ మోటార్ టెక్నాలజీని పొందుతుంది. కాబట్టి అత్యుత్తమ పనితీరును అందిస్తుంది.
చూడటానికి బీవైడీ సీల్ మాదిరిగా ఉండే ఈ కారు.. ఏరోడైనమిక్ డిజైన్ పొందుతుంది. కాబట్టి ఇది మినిమలిస్టిక్ లేఅవుట్‌తో ఒక పెద్ద టచ్‌స్క్రీన్ సెంటర్ స్టేజ్, ఒక డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, పెద్ద హెడ్స్-అప్ డిస్‌ప్లే, పనోరమిక్ రూఫ్ వంటివి పొందుతుంది. గత ఏడాది గ్లోబల్ మార్కెట్లో అరంగేట్రం చేసిన కొత్త ఎస్‌యూ7 ఎలక్ట్రిక్ సెడాన్‌ను.. షియోమీ భారతదేశంలో తన 10వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ప్రదర్శించింది.
Comments
Please login to add a commentAdd a comment