నిస్సాన్ ఇండియా అమ్మకాల్లో అరుదైన మైలురాయిని చేరుకుంది. మార్కెట్లో 5 లక్షల కార్లను విక్రయించినట్లు కంపెనీ వెల్లడించింది. సంస్థ 2010లో తన కార్యకలాపాలను ప్రారంభించినప్పటి నుంచి మొత్తం 5,13,241 యూనిట్ల సేల్స్ సాధించింది. నవంబర్ 2024లో నిస్సాన్ 9,040 యూనిట్ల కార్లను విక్రయించింది. ఇందులో దేశీయ విక్రయాలు 2,342 యూనిట్లు కాగా.. ఎగుమతులు 6,698 యూనిట్లు. గత ఏడాదితో పోలిస్తే.. ఈ ఏడాది కంపెనీ సేల్స్ గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది.
నిస్సాన్ కంపెనీ అమ్మకాలు పెరగటానికి మాగ్నైట్ ప్రధాన కారణం. రూ. 6 లక్షల (ఎక్స్ షోరూమ్) ప్రారంభ ధర వల్ల లభించే ఈ కారును చాలామంది కస్టమర్లు ఇష్టపడి కొనుగోలు చేశారు. ఇది ప్రస్తుతం ఎక్స్-ట్రైల్‌తో పాటు అమ్ముడవుతోంది.
ఇదీ చదవండి: ట్రైన్ ఆలస్యమైతే.. అవన్నీ ఫ్రీ: రీఫండ్ ఆప్షన్ కూడా..
సన్‌రూఫ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఛార్జర్, 16 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ వంటి లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన నిస్సాన్ మాగ్నైట్ 1.0 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. ఇవి 5 స్పీడ్ మాన్యువల్ లేదా 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ పొందుతాయి.
Comments
Please login to add a commentAdd a comment