అసలే చలికాలం (శీతాకాలం).. దట్టమైన మంచు వల్ల ట్రైన్‌ల రాకపోకలు ఆలస్యమవుతాయి. ఇది ప్రయాణికులకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. మంచు కారణంగా దృశ్యమానత తగ్గుతుంది. కాబట్టి ట్రైన్‌లు ఆలస్యంగా స్టేషన్లకు చేరుకుంటాయి. అలాంటి సమయంలో ప్రయాణికులు వేచి ఉండాల్సి ఉంటుంది. దీనికి కొంత ఉపశమనం కల్పిస్తూ భారతీయ రైల్వే ఓ స్పెషల్ సర్వీ అందించనున్నట్లు ప్రకటించింది.
ట్రైన్ కోసం వేచి చూసే ప్రయాణికులు.. తాము వెళ్ళవలసిన ట్రైన్ రెండు గంటలు లేదా అంతకంటే ఎక్కువ ఆలస్యంగా వస్తే.. వారికి ఐఆర్‌సీటీసీ ఉచితంగా ఫుడ్ అందించనుంది. ఈ సర్వీస్ రాజధాని, శతాబ్ది, దురంతో ఎక్స్‌ప్రెస్ వంటి ప్రీమియం రైళ్లలో ప్రయాణించే ప్రయాణీకుల మాత్రమే అందుబాటులో ఉంటుంది.
ఫ్రీ మీల్స్ ఎంపికలు
➤టీ/కాఫీ సర్వీస్: ప్రయాణీకులకు బిస్కెట్లు, టీ/కాఫీ కిట్‌తో.. టీ లేదా కాఫీ అందిస్తారు. ఇందులో షుగర్ లేదా షుగర్ లెస్ సాచెట్‌లు, మిల్క్ క్రీమర్‌లు ఉంటాయి.
➤అల్పాహారం లేదా సాయంత్రం టీ: నాలుగు ముక్కలతో కూడిన బ్రెడ్ (తెలుపు లేదా గోధుమరంగు), వెన్న, ఫ్రూట్ డ్రింక్ (200మి.లీ), టీ లేదా కాఫీ.
➤లంచ్ లేదా డిన్నర్: రైస్, పప్పు, రాజ్మా లేదా చోలేతో పాటు ఊరగాయ సాచెట్‌లు ఉంటాయి. ఇది వద్దనుకుంటే.. ప్రయాణీకులు మిక్డ్స్ వెజిటేబుల్స్, ఊరగాయ సాచెట్‌లు, ఉప్పు & మిరియాలు సాచెట్‌లతోపాటు ఏడు పూరీ ఎంచుకోవచ్చు.
ట్రైన్ రెండు గంటలు లేదా అంతకంటే ఎక్కువ ఆలస్యం అయితే ప్యాసింజర్.. తన టికెట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. టికెట్ డబ్బు రీఫండ్ అవుతుంది. రైల్వే కౌంటర్‌లో టిక్కెట్లు బుక్ చేసుకున్న వారు నగదు రూపంలో డబ్బును మళ్ళీ పొందటానికి వ్యక్తిగతంగానే వాటిని రద్దు చేయాలి.
ఫ్రీ ఫుడ్, రీఫండ్ వంటివి కాకుండా.. ఆలస్యం సమయంలో ప్రయాణీకుల సౌకర్యాన్ని నిర్ధారించడానికి భారతీయ రైల్వే ఇతర సౌకర్యాలను అందిస్తుంది. వెయిటింగ్ రూమ్‌లలో ఉండటానికి అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రయాణికుల భద్రత కోసం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) అదనపు సిబ్బందిని కూడా మోహరిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment