indian railwasy
-
ట్రైన్ ఆలస్యమైతే.. అవన్నీ ఫ్రీ: రీఫండ్ ఆప్షన్ కూడా..
అసలే చలికాలం (శీతాకాలం).. దట్టమైన మంచు వల్ల ట్రైన్ల రాకపోకలు ఆలస్యమవుతాయి. ఇది ప్రయాణికులకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. మంచు కారణంగా దృశ్యమానత తగ్గుతుంది. కాబట్టి ట్రైన్లు ఆలస్యంగా స్టేషన్లకు చేరుకుంటాయి. అలాంటి సమయంలో ప్రయాణికులు వేచి ఉండాల్సి ఉంటుంది. దీనికి కొంత ఉపశమనం కల్పిస్తూ భారతీయ రైల్వే ఓ స్పెషల్ సర్వీ అందించనున్నట్లు ప్రకటించింది.ట్రైన్ కోసం వేచి చూసే ప్రయాణికులు.. తాము వెళ్ళవలసిన ట్రైన్ రెండు గంటలు లేదా అంతకంటే ఎక్కువ ఆలస్యంగా వస్తే.. వారికి ఐఆర్సీటీసీ ఉచితంగా ఫుడ్ అందించనుంది. ఈ సర్వీస్ రాజధాని, శతాబ్ది, దురంతో ఎక్స్‌ప్రెస్ వంటి ప్రీమియం రైళ్లలో ప్రయాణించే ప్రయాణీకుల మాత్రమే అందుబాటులో ఉంటుంది.ఫ్రీ మీల్స్ ఎంపికలు➤టీ/కాఫీ సర్వీస్: ప్రయాణీకులకు బిస్కెట్లు, టీ/కాఫీ కిట్‌తో.. టీ లేదా కాఫీ అందిస్తారు. ఇందులో షుగర్ లేదా షుగర్ లెస్ సాచెట్లు, మిల్క్ క్రీమర్లు ఉంటాయి.➤అల్పాహారం లేదా సాయంత్రం టీ: నాలుగు ముక్కలతో కూడిన బ్రెడ్ (తెలుపు లేదా గోధుమరంగు), వెన్న, ఫ్రూట్ డ్రింక్ (200మి.లీ), టీ లేదా కాఫీ.➤లంచ్ లేదా డిన్నర్: రైస్, పప్పు, రాజ్మా లేదా చోలేతో పాటు ఊరగాయ సాచెట్లు ఉంటాయి. ఇది వద్దనుకుంటే.. ప్రయాణీకులు మిక్డ్స్ వెజిటేబుల్స్, ఊరగాయ సాచెట్లు, ఉప్పు & మిరియాలు సాచెట్లతోపాటు ఏడు పూరీ ఎంచుకోవచ్చు.ట్రైన్ రెండు గంటలు లేదా అంతకంటే ఎక్కువ ఆలస్యం అయితే ప్యాసింజర్.. తన టికెట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. టికెట్ డబ్బు రీఫండ్ అవుతుంది. రైల్వే కౌంటర్లో టిక్కెట్లు బుక్ చేసుకున్న వారు నగదు రూపంలో డబ్బును మళ్ళీ పొందటానికి వ్యక్తిగతంగానే వాటిని రద్దు చేయాలి.ఫ్రీ ఫుడ్, రీఫండ్ వంటివి కాకుండా.. ఆలస్యం సమయంలో ప్రయాణీకుల సౌకర్యాన్ని నిర్ధారించడానికి భారతీయ రైల్వే ఇతర సౌకర్యాలను అందిస్తుంది. వెయిటింగ్ రూమ్‌లలో ఉండటానికి అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రయాణికుల భద్రత కోసం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) అదనపు సిబ్బందిని కూడా మోహరిస్తుంది. -
ట్రైన్ టికెట్ బుక్ చేస్తే జైలు శిక్ష!.. స్పందించిన రైల్వే శాఖ
ఐఆర్సీటీసీలో ట్రైన్ టికెట్స్ బుక్ చేయాలంటే తప్పకుండా పర్సనల్ అకౌంట్స్ ద్వారా మాత్రమే బుక్ చేయాలని, బంధువులు లేదా ఫ్రెండ్స్ అకౌంట్స్ ద్వారా బుక్ చేస్తే వారికి జైలు శిక్ష పడటమే కాకూండా.. రూ. 10000 వరకు జరిమానా విధించే అవకాశం ఉందనే వార్తలు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపైనా మొదటిసారి 'రైల్వే' స్పందించింది.రైల్వే శాఖ స్పందిస్తూ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు నిజం కాదని కొట్టిపారేసింది. ఇవన్నీ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి మాత్రమే జరుగుతున్న ప్రచారమని స్పష్టం చేసింది. ఐఆర్సీటీసీలో పర్సనల్ ఐడీ నుంచి ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా టికెట్స్ బుక్ చేసుకోవచ్చని చెప్పింది.ఐఆర్సీటీసీలో ఒక యూజర్ ఐడీ ద్వారా నెలకు కేవలం 12 టికెట్లను పొందవచ్చు. ఆధార్ అనుసంధానం పూర్తి చేసుకున్న వ్యక్తులు ఒక నెలలో 24 టికెట్స్ బుక్ చేసుకోవచ్చని రైల్వే శాఖ వివరించింది. పర్సనల్ ఐడీ ద్వారా బుక్ చేసిన టికెట్స్ ఇతరులకు విక్రయించడానికి కాదు.. ఒకవేలా అలా జరిగితే సంబంధిత వ్యక్తుల మీద చర్యలు తీసుకుంటామని తెలిపింది. The news in circulation on social media about restriction in booking of etickets due to different surname is false and misleading. pic.twitter.com/jLUHVm2vLr— Spokesperson Railways (@SpokespersonIR) June 25, 2024 -
రైల్లో వినాయక చవితి పిండి వంటలు! ఆర్డర్ చేయండి.. ఆస్వాదించండి..
భారతదేశంలో అత్యంత ప్రసిద్ధమైన పండుగలలో వినాయక చవితి. దీన్నె గణేష్ చతుర్థి (Ganesh Chaturthi) అని కూడా అంటారు. దేశంలోని అనేక ప్రాంతాలలో, ముఖ్యంగా మహారాష్ట్రలో అత్యంత వైభవంగా ఈ పండుగను జరుపుకొంటారు. పండుగలో భాగంగా వినాయకుడి ప్రతిమను కొలువుదీర్చి ప్రత్యేకమైన పిండి వంటలు తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ ప్రత్యేకమైన పిండి వంటలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంటాయి. మహారాష్ట్రలో అయితే ప్రధానంగా లడ్డూ, మోదక్, చక్లిలు, పురాన్ పోలీ వంటి వాటితో సహా ఇంకా మరెన్నో సాంప్రదాయ మహారాష్ట్ర వంటకాలు విఘ్నేశ్వరుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. (Flipkart New Feature: ఆన్లైన్ షాపింగ్ చేసేవారికి గుడ్‌న్యూస్.. ఫ్లిప్‌కార్ట్‌లో సరికొత్త ఫీచర్!) చాలా మంది ఇంటిపట్టున ఉండి పండుగ జరుపుకొని సంప్రదాయక పిండి వంటకాలను ఇంట్లోనే ఆస్వాదిస్తారు. కానీ కొంతమంది వివిధ కారణాల వల్ల ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. పండుగ సమయంలో ఈ ప్రత్యేక వంటకాలను వారు ఆస్వాదించలేరు. అటువంటి వారి కోసం ఐఆర్సీటీసీ (IRCTC) ఆమోదిత ఫుడ్ అగ్రిగేటర్ ‘జూప్’ (Zoop) వినాయక చవితి ప్రత్యేక సంప్రదాయ వంటకాలను అందిస్తుంది. 160కి పైగా రైల్వే స్టేషన్లలో.. దీంతో పండుగ వేళ రైల్లో ప్రయాణిస్తున్నప్పటికీ నోరూరించే పండుగ పిండి వంటలను ఆస్వాదించవచ్చు. ఈ వంటకాలు కావాల్సిన ప్రయాణికులు జూప్ అధికారిక వెబ్సైట్, మొబైల్ యాప్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లేదా గూగుల్ చాట్‌బాట్ ద్వారా ఆర్డర్ చేయవచ్చు. మహారాష్ట్రలోని 160కి పైగా రైల్వే స్టేషన్లలో వీటిని కస్టమర్లకు డెలివరీ చేస్తారు. -
ఇండియా ఫస్ట్ ఏసీ ట్రైన్ - ఆశ్చర్యగొలిపే నిజాలు!
మన దేశంలో ఈ రోజు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రైల్వే విస్తరించి ఉంది. అయితే ఒకప్పుడు అంటే భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందు రైల్వే అనేది కేవలం కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమై ఉండేది. ఇప్పుడు ట్రైన్లో ఉండే జనరల్, ఏసీ, స్లీపర్ వంటి కోచ్‌లు ఉండేవి కాదు కేవలం ఫస్ట్ (ఏసీ కోచ్) అండ్ సెకండ్ క్లాసులు మాత్రమే ఉండేవి. ఈ ఏసీ కోచ్‌లు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? ఎక్కడ మొదలయ్యాయి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఏసీ కోచ్ లేదా ఫస్ట్ క్లాసులో కేవలం బ్రిటీష్ వారు మాత్రమే ప్రయాణించాలి. వారి అవసరాలకు అనుగుణంగా చల్లగా ఉండటానికి ఏసీ బోగీలను ఏర్పాటు చేసుకున్నారు. భారతీయులకు వీటిలోకి అనుమతి ఉండేది కాదు. ఇండియన్స్ సెకండ్ క్లాసులోనే ప్రయాణించాలి. ఏసీ బోగీలుగా పిలువబడే వాటికి ఏసీలకు బదులు ఐస్ బ్లాక్స్ ఉపయోగించే వారు. వీటిని నేరుగా ఫ్లోర్‌లోనే ఉంచేవారని తెలుస్తోంది. ఈ రైలు మొదట 1928లో ముంబైలోని బల్లార్డ్ పీర్ స్టేషన్ నుంచి ఢిల్లీ, బటిండా, ఫిరోజ్‌పూర్, లాహోర్ మీదుగా ప్రయాణించేది. ఆ తరువాత 1930లో సహరాన్ పూర్, అంబాలా, అమృత్సర్, లాహోర్కి మళ్లించారు. ఈ రైలు పేరు 'ఫ్రాంటియర్ మెయిల్' (Frontier Mail). ఆ తరువాత ఇది 1996లో గోల్డెన్ టెంపుల్ మెయిల్ పేరుతో వినియోగంలో ఉండేది. (ఇదీ చదవండి: రైతు దశ తిప్పిన టమాట.. ఇది చూస్తే ఆగుతుంది నోటమాట!) ఫ్రాంటియర్ మెయిల్ ప్రత్యేకతలు.. నిజానికి ఫ్రాంటియర్ మెయిల్ అనేది బ్రిటీష్ వారి కాలంలో అత్యంత విలాసవంతమైన ట్రైన్. కొన్ని నివేదికల ప్రకారం ఇది సుమారు 35 రైల్వే స్టేషన్స్‌లో ఆగుతూ 1893 కిమీ ప్రయాణిస్తుందని సమాచారం. ఒక సారికి ఇది 1300 మంది ప్రయాణికులను తీసుకెళ్లేదని, టెలిగ్రామ్స్ వంటి వాటిని తీసుకెళ్లడానికి కూడా దీన్ని ఉపయోగించేవారని తెలుస్తోంది. -
ఈ 8 రైల్వే స్టేషన్లు బ్రిటీష్ కాలం నాటివి.. ఇప్పుడెలా ఉన్నాయో తెలిస్తే..
భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ కలిగివుంది. ఈ విషయంలో భారతీయ రైల్వే నాల్గవ స్థానంలో ఉంది. వీటిలో కొన్ని రైల్వే స్టేషన్లు బ్రిటీష్ కాలంలో నిర్మితమయ్యాయి. అవి ఎక్కడ ఉన్నాయో, ఇప్పుడు వాటి పరిస్థితి ఏమిటో ఓ లుక్కేద్దాం. భారతీయ రైల్వే ప్రస్తుతం 7 వేలకుపైగా రైల్వే స్టేషన్లను కలిగివుంది. వీటి మీదుగా 13 వేలకు మించిన రైళ్లు నడుస్తుంటాయి. దీనితో పాటు ఈ రూట్లలో గూడ్సు రైళ్లు కూడా నడుస్తుంటాయి. భారత్‌లో రైల్వే వ్యవస్థ.. బ్రిటీషర్లు మన దేశాన్ని పరిపాలిస్తున్న రోజుల్లో ఏర్పడింది. నాడు నిర్మితమైన రైల్వే స్టేషన్లు ఇవే.. హౌరా రైల్వేస్టేషన్ హౌరా రైల్వే స్టేషన్ పశ్చిమ బెంగాల్‌లోని హౌరా పట్టణంలోని ప్రముఖ రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ నుంచి తొలి రైలు 1854 ఆగస్టు 15న తన రాకపోకలు ప్రారంభించింది. ఈ రైలు హౌరా-హుబ్లీల మధ్య నడిచేది. ఇది మన దేశంలో ఏకంగా 23 ప్లాట్‌ఫారాలు కలిగిన అతిపెద్ద రైల్వే స్టేషన్. రాయ్‌పూర్ రైల్వేస్టేషన్ చెన్నై సబర్బన్ రైల్వే నెట్వర్క్ పరిధిలోని వాలాజాపేట విభాగంలో ఉన్న రాయపూర్ రైల్వేస్టేషన్‌ను బ్రిటీషర్లు నిర్మించారు. ఈ రైల్వే స్టేషన్ నుంచి 1856లో దక్షిణభారతానికి చెందిన తొలి రైలు నడిచింది. ప్రస్తుతం ఇది దక్షిణ మరాఠా- మద్రాస్‌కు కేంద్ర కార్యాలయంగా ఉంది. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయన్ రైల్వే స్టేషన్ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయన్ రైల్వే స్టేషన్‌ను గతంలో ముగల్‌సరాయ్ రైల్వే స్టేషన్ పేరుతో పిలిచేవారు. తరువాతి కాలంలో దీని పేరు మార్చారు. ఇది యూపీలోని ప్రధాన రైల్వే స్టేషన్లలో ఒకటి. బెనారస్‌కు కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఈ రైల్వేస్టేషన్ ఉంది. ఈ స్టేషన్ 1862లో నిర్మితమయ్యింది. ఛత్రపతి శివాజీ టర్మినస్ ముంబైలోని ఛత్రపతి శివాజీ టర్మినస్ భారత్‌లోని ప్రముఖ రైల్వే స్టేషన్. దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. దీని నిర్మాణం 1978లో ప్రారంభమయ్యింది. తొలుత ఈ రైల్వే స్టేషన్‌కు మహారాణి విక్టోరియా పేరు పెట్టారు. తరువాత 1996లో దీని పేరు ఛత్రపతి శివాజీ టర్మినస్‌గా మార్చారు. డెహ్రాడూన్ రైల్వేస్టేషన్ డెహ్రాడూన్ రైల్వేస్టేషన్ ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ రైల్వేస్టేషన్. దీని నిర్మాణం 1897-1899 మధ్యకాలంలో బ్రిటీషర్ల సారధ్యంలో సాగింది. ఈ రైల్వే లైన్‌కు 1896లో అనుమతి లభించింది. 1900 మార్చి 1న ఈ రైలు ప్రారంభమయ్యింది. లక్నో చార్బాగ్ రైల్వేస్టేషన్ లక్నోలోని ఐదు రైల్వే స్టేషన్లలో చార్బాగ్ రైల్వే స్టేషన్ ఒకటి. దీని నిర్మాణం 1914లో మొదలయ్యింది. 1923 నాటికి ఈ స్టేషన్ నిర్మాణం పూర్తయ్యింది. ఈ స్టేషన్ డిజైన్‌ను బ్రిటీష్ ఆర్కిటెక్ జె. హెచ్ రూపొందించారు. ఈ స్టేషన్ నిర్మాణంలో భారత ఇంజినీరు చౌబె ముక్తా ప్రసాద్ కీలక బాధ్యతలు వహించారు. నాటిరోజల్లో ఈ స్టేషన్ నిర్మాణానికి రూ.70 లక్షలు ఖర్చయ్యాయి. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ అజ్మరీ గేట్- పహాడ్‌గంజ్ మధ్య ఉన్న న్యూఢిల్లీ రైల్వేస్టేషన్ నిర్మాణానికి 1826లో ఈస్ట్ ఇండియా కంపెనీ అనుమతినిచ్చింది. 1931 నాటికి ఈ రైలు ప్రారంభానికి నోచుకుంది. ప్రస్తుతం ఈ స్టేషన్లో మొత్తం 16 ప్లాట్‌ఫారాలు ఉన్నాయి. ప్రతీరోజూ కొన్ని వందల రైళ్లు ఈ మార్గం గుండా రాకపోకలు సాగిస్తాయి. నంది హాల్ట్ రైల్వే స్టేషన్ నంది హాల్ట్ రైల్వే స్టేషన్ బెంగళూరులోని యలువహళ్లిలో ఉంది. ఇది 108 ఏళ్ల క్రితం బ్రిటీషర్ల కాలంలో నిర్మితమయ్యిందని చెబుతారు. ఇది కూడా చదవండి: డ్రోన్లతో రోడ్డు ప్రమాదాలకు చెక్ ? -
ట్రైన్ టిక్కెట్ల కేటాయింపు కసరత్తు సాగుతుందిలా..
ఇప్పుడున్న రోజుల్లో రైలులో ప్రయాణించాలంటే ముందుగా టిక్కెట్ బుక్ చేసుకోవడం ఎంతో ముఖ్యమైదిగా మారిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లోనూ చాలామంది ప్రయాణికులకు వెయిటింగ్ లిస్టు వస్తుంటుంది. అలాగే చాలాసార్లు కన్ఫర్మ్ సీటు కూడా లభించదు. ఒక్కోసారి వివిధ రకాల కేటగిరీలలోని వెయిటింగ్ లిస్టులలోకి చేరిపోతుంటుంది. వాటిలో ఒకటే పీక్యూ. దీని అర్థం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ఎక్స్‌ప్రెస్ ట్రైన్లో 12 కోచ్‌లు ఉంటాయి. ప్రతీ కోచ్‌లో 72 సీట్లు ఉంటాయి. ఈ విధంగా రైల్లో మొత్తంగా 864 సీట్లు ఉంటాయి. రైల్వే అధికారులు ఈ 864 సీట్లను వివిధ కోటాల కింద కేటాయిస్తుంటారు. వీటిలోనిదే పీక్యూ. దీని అర్థం పూల్డ్ కోటా. దీనిలో 8శాతం సీట్లు రిజర్వ్ అయి ఉంటాయి. ఏదైనా రైలు తన మొదటి స్టేషన్ నుంచి ఏడవ స్టేషన్ వరకూ వెళితే ఆ రూటులో 2 నంబరు మొదలుకొని 6వ నంబరు వరకూ స్టేషన్లు వస్తాయి. అయితే దీనిలో నాల్గవ నంబరు స్టేషన్ ప్రధానమైనది అవుతుంది.ఈ విధంగా రైలు అధికారులు 8 శాతం సీట్లను పూల్డ్ కోటా తరహాలో రిజర్వ్ చేస్తారు. ఈ విధంగా చూస్తే 864 సీట్లలో 8 శాతం అంటే 69 సీట్లు ఈ స్టేషన్లకు పూల్డ్ కోటా కింద రిజర్వ్ చేస్తారు. మొదటి స్టేషన్ నుంచి టర్మినేటింగ్ స్టేషన్ వరకూ ప్రయాణించేవారికి లేదా ఏదైనా మధ్యలోని స్టేషన్ నుంచి టర్నినేటింగ్ స్టేషన్ వరకూ లేదా రెండు మధ్యస్థ స్టేషన్ల మధ్య ప్రయాణించేవారికి పూల్డ్ కోటా సీట్లను కేటాయిస్తారు. ఈ కోటా నిండిపోయిన పక్షంలో వెయిటింగ్ లిస్టు(పీక్యూడబ్ల్యుఎల్) కింద టిక్కెట్ జారీ చేస్తారు. పీక్యూడబ్ల్యుఎల్ అంటే పూల్డ్ కోటా వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్. పీక్యూడబ్ల్యుఎల్ టిక్కెట్.. కన్ఫర్మ్ టిక్కెట్ అయ్యేందుకు సాధారణంగా అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్ ప్రాధాన్యాతా సూచీలో ఇవి జీఎన్డబ్ల్యుఎల్ తరువాత వస్తాయి. ముందుగా జీఎన్డబ్ల్యుఎల్ టిక్కెట్ కన్ఫర్మ్ అవుతుంది. ఆ తరువాతనే పీక్యూడబ్ల్యుఎల్ నంబరు వస్తుంది. అటువంటిప్పుడు మీరు ఐఆర్సీటీసీ వెబ్సైట్లో మీ టిక్కెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాన్ని చెక్ చేసుకోవచ్చు. భారతీయ రైల్వేలో టిక్కెట్ల ఎడ్వాన్స్ బుకింగ్ అనేది ప్రయాణపు తేదీకి సరిగ్గా 120 రోజుల ముందు మొదలవుతుంది. అందుకే ఎవరైనా సరే రైలులో దూర ప్రాంతాలు వెళ్లాలనుకుంటే ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకోవడం ఉత్తమం. అప్పుడు కన్ఫర్మ్ టిక్కెట్ దొరికి, రైలులో సౌకర్యవంతంగా ప్రయాణించేందకు అవకాశం ఏర్పడుతుంది. -
సిబ్బంది లేని రైల్వే స్టేషన్లు అవి.. టిక్కెట్లు ఎవరిస్తారంటే..
మనం పలు రైల్వే స్టేషన్ల పేర్లు వినేవుంటాం. వాటిలో కొన్నింటి పేర్ల చివర సెంట్రల్, టెర్మినల్, రోడ్డు అని ఉండటాన్ని చూసేవుంటాం. అయితే కొన్ని రైల్వే స్టేషన్ల పేరు చివర పీహెచ్ అని రాసివుంటుంది. అలా ఎందుకు ఉంటుందని ఎప్పుడైనా ఆలోచించారా? అందుకే ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని రైల్వే స్టేషన్ల పేర్ల చివరన పీహెచ్ అని ఉంటుంది. ఇక్కడ పీహెచ్ అంటే పాసింజర్ హాల్ట్ అని అర్థం. అంటే ఈ స్టేషన్లలో కేవలం పాసింజర్ రైళ్లు మాత్రమే ఆగుతాయి. ఇటువంటి స్టేషన్లు మిగిలిన స్టేషన్ల కన్నా కాస్త భిన్నంగా ఉంటాయి. ఈ స్టేషన్లలో రైల్వేశాఖ తరపున ఎటువంటి అధికారిగానీ, ఉద్యోగిగానీ ఉండరు. పాసింజర్ హాల్ట్ అనేది డీక్లాస్ తరహా స్టేషన్. రైళ్లు ఆగేందుకు సిగ్నల్ చూపేలా ఇక్కడ ఎటువంటి ఏర్పాట్లు ఉండవు. అయితే సిగ్నల్స్ లేని ఇటువంటి స్టేషన్లలో రైళ్లు ఎలా ఆగుతాయనే సందేహం ఎవరికైనా కలుగుతుంది. ఇటువంటి రైల్వే స్టేషన్లలో రైళ్లను రెండు నిముషాల పాటు ఆపాలంటూ ట్రైన్ డ్రైవర్‌కు ముందుగానే ఆదేశాలు అందుతాయి. ఈ మేరకు డ్రైవర్ ఆయా స్టేషన్లలో రైళ్లను ఆపుతాడు. కాగా ఇటువంటి స్టేషన్లలో రైల్వే సిబ్బందే లేకపోతే మరి ప్రయాణికులు టిక్కెట్లు ఎలా తీసుకోవచ్చనే సందేహం కలుగుతుంది. ఇటువంటి డీ క్లాస్ స్టేషన్లలో రైల్వేశాఖ స్థానికంగా ఉన్న ఒక వ్యక్తిని కమిషన్ ఆధారంగా టిక్కెట్లు విక్రయించేందుకు నియమిస్తుంది. అయితే ప్రస్తుతం ఇటువంటి రైల్వేస్టేషన్లకు స్వస్తి పలకాలని రైల్వేశాఖ యోచిస్తోంది. ఇటువంటి స్టేషన్ల నుంచి రైల్వేకు ఎటువంటి ఆదాయం రావడంలేదని సమాచారం. -
నా వల్లే భారతీయ రైల్వేస్‌కు ఆదాయం పెరిగింది: కరీనా కపూర్
Kareena Kapoor Says Indian Railways Income Increased By Geet Role: బాలీవుడ్ దివా కరీనా కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందం, అభినయంతో బీటౌన్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన బ్యూటీ కరీనా. ఆమెను అభిమానులంతా ముద్దుగా బెబో అని కూడా పిలుచుకుంటారు. కభీ ఖుషీ కభీ ఘమ్, జబ్ వి మెట్, ఉడ్తా పంజాబ్, తషాన్, భజరంగీ భాయిజాన్, 3 ఇడియట్స్, హీరోయిన్ వంటి చిత్రాలతో అలరించింది. సినిమాలకు చాలా దూరంగా ఉన్న ఈ భామ ఇటీవల అమీర్ ఖాన్‌కు జోడీగా లాల్ సింగ్ చద్ధా సినిమాలో నటించింది. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద కుదేలైంది. ఇదిలా ఉంటే కరీనా కపూర్ తాజాగా ఓ రియాలిటీ షోలో పాల్గొని ఆసక్తికర విషయాలు తెలిపింది. బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్, వరుణ్ శర్మ లాయర్లుగా వ్యవహరిస్తున్న రియాలిటీ షో 'కేస్‌తో బన్ తా హై'. ఈ షోలో పాల్గొన్న జబ్ వి మెట్ సినిమాలోని గీత్ అనే పాత్ర వల్లే రైల్వేస్‌కు ఆదాయం పెరిగిందని తెలిపింది. ''నేను చేసిన గీత్ పాత్ర వల్లే ప్యాంట్స్ అమ్మకాలు, భారతీయ రైల్వేలకు ఆదాయం పెరిగింది'' అని కరీనా కపూర్ చెప్పుకొచ్చింది. కాగా కరీనా కపూర్, షాహిద్ కపూర్ జోడిగా కలిసి నటించిన చిత్రం జబ్ వి మెట్. ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో గీత్‌గా కరీనా కపూర్ అలరించింది. ఇదిలా ఉంటే కరీనా కపూర్ త్వరలో ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. సుజయ్ ఘోష్ డైరెక్షన్లో విజయ్ వర్మ, జైదీప్ అహ్లవత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చదవండి: ప్రభాస్ అంటే చాలా ఇష్టం, మేము ఫ్రెండ్స్ కూడా: పీవీ సింధు View this post on Instagram A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) -
చైనా కంపెనీకి భారత రైల్వే చక్రాల కాంట్రాక్ట్
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కారణంగా భారత్.. చైనాతో వ్యాపార కార్యకలాపాల్ని పున:ప్రారంభించింది. ఇండియన్ రైల్వేలో ఎల్‌హెచ్‌బీ(Link-Hofmann-Busch) కోచెస్‌కు కావాల్సిన 39,000 వీల్స్‌ను చైనా నగరం తైయువాన్‌కు చెందిన ఓ సంస్థకు ప్రాజెక్ట్‌ను అప్పగించింది. సాధారణంగా ఇండియన్ రైల్వేకు కావాల్సిన ట్రైన్ విడి భాగాల్ని ఉక్రెయిన్ నుంచి కొనుగోలు చేస్తుంది. కానీ యుద్ధం కారణంగా అది కష్టతరంగా మారింది. ఈ తరుణంలో రైల్వే ఎల్‌హెబీ కోచ్ ఒక్కో చక్రంపై 1.68శాతం తక్కువకే కొనుగోలు చేసేలా కేంద్రం..చైనాకు ఈ ప్రాజెక్ట్‌ను ఇచ్చినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్ సభలో స్పందించారు. 'సరిహద్దు వివాదం కారణంగా ఇండియన్ రైల్వే, డ్రాగన్ కంట్రీ నుంచి దిగుమతి చేసుకునే అనేక ఆర్డర్లను రద్దు చేసింది. గతంలో రైల్వేకు సంబంధించిన విడిభాగాల్ని ఉక్రెయిన్ నుంచి దిగుమతి చేసుకోనే వాళ్లం. కానీ ఉక్రెయిన్ - రష్యా యుద్ధం కారణంగా అలా సాధ్యపడడం లేదని' అశ్విని వైష్ణవ్ వివరణ ఇచ్చారు. ఎల్‌హెచ్‌బీ కోచ్‌కు కావాల్సిన చక్రాల కొరత ఎక్కువగా ఉంది. ఆ కొరతను అధిగమించేందుకు అంతర్జాతీయ సంస్థల నుంచి టెండర్లను ఆహ్వానించాయి. ఇందులో భాగంగా హాంకాంగ్‌కు చెందిన ట్రైన్ చక్రాల తయారీ సంస్థ ఎం/ఎస్ టీజెడ్ (M/s TZ (Taizhong)కు, చైనాకు చెందిన ఎం/ఎస్ తైయువాన్ హెవీ ఇండస్ట్రీస్(M/s Taiyuan)కు ఆర్డర్ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఎల్‌హెచ్‌బీ కోచ్‌లంటే.. లింక్ హోఫ్మన్ బుష్‌కు సంక్షిప్త పదమే ఎల్‌హెచ్‌బీ. ఈ ఎల్‌హెచ్‌బీ అనేది జర్మన్ టెక్నాలజీ తయారీదారు పేరు. భారతీయ రైల్వేలో ప్రయాణికుల రైళ్లకు ఉపయోగించే కోచ్‌లను ఇటీవల కాలంలో ఈ ఎల్‌హెచ్‌బీ టెక్నాలజీతో ఇండియాలోనే రైల్ కోచ్ ప్యాక్టరీ కపుర్తలా, ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై, మోడరన్ కోచ్ ఫ్యాక్టరీ రాయ్‌బరేలిలలో తయారు చేస్తున్నారు. ఈ కోచ్‌లు మనదేశంలో సుమారుగా 2000 సంవత్సరం నుంచి వినియోగిస్తున్నారు. భారతీయ రైల్వే ప్రారంభంలో 24 ఎల్‌హెచ్‌బీ ఏసీ కోచ్‌లను శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ల కోసం జర్మనీ నుంచి దిగుమతి చేసుకుంది. ఎక్కువ సీటింగ్ సామర్థ్యం ఈ ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు తక్కువ బరువు ఉండడంతో గంటకు 200 కి.మీ వేగంతో ప్రయాణించే సామర్థ్యం ఉన్నప్పటీకి ప్రస్తుతం గరిష్టంగా గంటకు 160 కి.మీల వేగంతో ప్రయాణించే విధంగా నడుపుతున్నారు. ఇవే పాత కోచ్‌లైతే కేవలం గంటకు110 కి.మీ గరిష్ట వేగంతో మాత్రమే నడిచేవి. -
ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్‌న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ : ప్రయాణికులకు భారతీయ రైల్వే శుభవార్తను అందించింది. అన్‌లాక్ 4.0లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నూతనంగా జారీచేసిన మార్గదర్శకాలను పాటిస్తూ రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా మరో 80 రైళ్లను నడిపేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్ 12 నుంచి 80 ప్రత్యేక రైళ్లను ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించింది. ఈ మేరకు రైల్వేబోర్డు చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 10 నుంచి రిజర్వేషన్లు ప్రక్రియ సైతం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. పూర్తి స్థాయిలో రైళ్లు నడిపేందుకు మరికొంత సమయం పడుతుందన్నారు. రైళ్ల జాబితా కోసం ఇక్కడి క్లిక్ చేయండి.. -
కరోనా ఎఫెక్ట్ : 168 రైళ్లు రద్దు
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ వ్యాప్తిపై ఆందోళనతో ప్రజలు ప్రయాణాలకు దూరంగా ఉండటంతో రవాణా రంగంపై పెను ప్రభావం చూపుతోంది. పలు రైళ్లలో ప్రయాణీకుల సంఖ్య నామమాత్రంగా ఉండటంతో భారతీయ రైల్వేలు ఈనెల 20 నుంచి 31 వరకూ 168 రైళ్లను రద్దు చేశాయి. ఇక రద్దయిన రైళ్లలో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణీకులందరికీ ఈ సమాచారం వ్యక్తిగతంగా చేరవేశామని అధికారులు పేర్కొన్నారు. ఇక వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ముందు జాగ్రత్త చర్యగా రైల్వే స్టేషన్లలో జనసమ్మర్ధాన్ని తగ్గించేందుకు పలు రైల్వే జోన్ల పరిధిలో ఫ్లాట్‌ఫాం టికెట్ ధరలను పెంచారు. మరోవైపు మహమ్మారి వైరస్‌ను అడ్డుకునేందుకు ప్రజలు సామాజిక దూరం పాటించాలని, సమూహాల్లో కలవకుండా ఉండాలని అత్యవసరమైతే మినహా ప్రయాణాలు చేయరాదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వైద్య నిపుణులు ప్రజలకు సూచిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి : ‘ఈ సంక్షోభం చాలా పెద్దది’ -
కాశీ మహాల్ ఎక్స్‌ప్రెస్‌లో ఆశ్చర్యకర ఘటన
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రారంభించిన కాశీ మహాల్ ఎక్స్‌ప్రెస్‌లో ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా రాజకీయ నేతలు, ప్రముఖుల కోటాలో రైలు టికెట్లను కేటాయిస్తారు. కానీ కాశీ మహాల్ ఎక్స్‌ప్రెస్ రైలులో మాత్రం ఏకంగా దేవుడికే ఓ సీటును రిజర్వు చేశారు. అంతేకాదు శివుడి పేరుతో ప్రత్యేక బెర్త్ కూడా ఏర్పాటు చేశారు. బి5 కోచ్‌లోని సీట్ నెంబర్ 64 పూర్తిగా దేవుడికే కేటాయించారు. అంతటితో ఆగిపోకుండా అందులో శివుడి చిత్రపటాన్ని పెట్టి సీటును పూలతో డెకరేట్ చేశారు. ప్రయాణికులు ఎవ్వరు ఈ సీట్ పైకి ఎక్కకూడదు అంటూ బోర్డు పెట్టారు. రైలు ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసినప్పటికీ దీన్ని ఎంత కాలం వరకు దేవుడి పేరుతో కేటాయిస్తారనేది తెలియాల్సి ఉంది. ఈ విషయం తెలిసి ప్రయాణికులంతా ఆశ్చర్యపోతున్నారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా యూపీలో కాశీ మహాల్ ఎక్స్‌ప్రెస్ రైలును ఆదివారం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ రైలు ఇండోర్ నుంచి కాశీకి ప్రతి రోజూ రాకపోకలను జరుపుతుంది. మార్గంలో మధ్యలోని మూడు జోతిర్లాంగాల క్షేత్రాలైన.. ఓంకారేశ్వర్, ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్‌ని చుట్టుకుంటూ కాశీని చేరుకుంటుంది. సుమారు 1131 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తూ మూడు జోతిర్లాంగాల క్షేత్రాలను చుట్టేస్తుంది. ప్రతి కోచ్ లో భక్తి సంగీతం చిన్నగా వినిపిస్తూ ఉంటుంది. ప్రయాణికులకు పూర్తి భక్తి భావం కలిగేలా ఇలాంటి సదుపాయం ఏర్పాటు చేశారు. దీంతో పాటు శాకాహార భోజనం కూడా అందించే ఏర్పాట్లు చేశారు. కాగా భారతీయ రైల్వే కాకుండా పూర్తిగా ప్రైవేటు సంస్థ తయారు చేసిన మూడో రైలు కాశీ మహాల్ ఎక్స్ ప్రెస్ కావడం విశేషం. -
ఇటు ముంబై.. అటు చెన్నై!
సాక్షి, హైదరాబాద్: రైళ్ల సంఖ్య పెరగాలన్నా, వాటి వేగం పెంచాలన్నా ప్రతి మార్గంలో కనీసం రెండు లైన్ల మార్గం అవసరం. ఇంతకాలం రెండు లైన్ల మార్గాలు పూర్తిగా అందుబాటులోకి రాక తెలంగాణ పరిధిలో రైళ్ల సంఖ్య.. ఉన్న రైళ్ల వేగం పెరగని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ కొరత తీరిపోతోంది. కొత్తగా రెండు ప్రధాన మార్గాలను రెండు లైన్లు (డబ్లింగ్)గా మార్చబోతుండటంతో, షిర్డీ మీదుగా ముంబై, తిరుపతి మీదుగా చెన్నై.. ఈ రెండు ప్రధాన మార్గాలకు ప్రత్యామ్నాయ రూట్లు అందుబాటులోకి రాబోతున్నాయి. ప్రస్తుతం ఉన్న ఒకే రూట్‌పై పడుతున్న భారాన్ని తగ్గిస్తూ రెండు మార్గాల్లో రైళ్లను నడిపే వెసులుబాటు అందుబాటులోకి రాబోతోంది. దీనివల్ల దూరాభారం తగ్గడమే కాకుండా, ఆ ప్రాంతాలకు వెళ్లే రైళ్ల సంఖ్యను పెంచేందుకు అవకాశం కలగబోతోంది. మరోవైపు, ప్రధాన ట్రంక్ రూట్లలో ఇక తెలంగాణవ్యాప్తంగా సింగిల్ లైన్లు ఉండవు. అన్నీ డబుల్ లైన్లుగానే ఉండనున్నాయి. ఈ ఘనతను మరో మూడేళ్లలో సాధించే అవకాశముంది. దీనికి సంబంధించి ఈ ఏడాది దాదాపు రూ.9 వేల కోట్లతో పనులు మొదలవుతున్నాయి. ముంబైకి మరో మార్గం.. ప్రస్తుతం తెలంగాణ మీదుగా ముంబైకి ప్రధాన మార్గం వికారాబాద్–వాడీ లైను. ప్రధాన రైళ్లన్నీ ఈ మార్గం గుండానే వెళ్తున్నాయి. ముంబైకి నిజామాబాద్–బాసర మీదుగా సాగే ముద్ఖేడ్ లైన్ ఉన్నప్పటికీ ఇది సింగిల్ లైన్ కావటంతో ప్రధాన రైళ్లను నడిపే అవకాశం లేకుండా పోయింది. షిర్డీకి కూడా ఇదే ప్రధాన మార్గం అయినా, సింగిల్ లైన్ కారణంగా ఎక్కువ రైళ్లను నడిపే అవకాశం లేకుండా పోయింది. తాజాగా కేంద్రప్రభుత్వం అకోలా–డోన్ మార్గాన్ని రెండు లైన్లుగా మార్చాలని నిర్ణయించింది. 626 కి.మీ. మేర రెండో మార్గం నిర్మాణానికి రూ.6,260 కోట్లను మంజూరు చేసింది. ఇందులో భాగంగా తెలంగాణ పరిధిలో నగర శివారులోని బొల్లారం నుంచి నిజామాబాద్ మీదుగా బాసర దాటే వరకు డబుల్ లైన్లు అందుబాటులోకి వస్తాయి. దీంతో హైదరాబాద్ నుంచి ముంబైకి రెండో ప్రధాన లైన్ అందుబాటులోకి వస్తుంది. ఫలితంగా వాడీ రూట్‌పై భారం తగ్గుతుంది. డిమాండ్ అధికంగా ఉన్నందున ముంబైకి అదనంగా ఎక్స్‌ప్రెస్ రైళ్లు, సెమీ హైస్పీడ్ రైళ్లు నడిపే వెసులుబాటు కలుగుతుంది. షిర్డీకి కూడా రైళ్ల సంఖ్య పెరుగుతుంది. ఇదే డబ్లింగ్ ప్రాజెక్టులో మహబూబ్‌నగర్ నుంచి కర్నూలు వరకు (డోన్ వరకు కొనసాగుతుంది) కూడా రెండో లైను అందుబాటులోకి వస్తున్నందున ఆ మార్గంలో కూడా రైళ్ల సంఖ్య పెరుగుతుంది. బెంగళూరుకు అదనంగా రైళ్లు నడిపే అవకాశం కలుగుతుంది. తిరుపతి, చెన్నైకి దగ్గరి దారి.. ఇక రెండో ప్రత్యామ్నాయ మార్గం ఏర్పడే ప్రధాన రూట్ తిరుపతి, చెన్నై. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లాలంటే వరంగల్–విజయవాడ మీదుగా తిప్పుతున్నారు. ఇప్పుడు దీనికి ప్రత్యామ్నాయ మార్గం అందుబాటులోకి రాబోతోంది. బీబీనగర్–నల్లపాడు–నడికుడి–గుంటూరు మార్గాన్ని కూడా రెండు లైన్లుగా మార్చబోతున్నారు. 248 కి.మీ. మేర ఉండే ఈ మార్గంలో డబ్లింగ్ కోసం రూ.2,480 కోట్లు మంజూరయ్యాయి. హైదరాబాద్–వరంగల్ మార్గంలో బీబీనగర్ వరకు రెండు లైన్లున్నాయి. అక్కడి నుంచి నడికుడి మీదుగా గుంటూరు వెళ్లే మార్గంలో మాత్రం సింగిల్ లైన్ మాత్రమే ఉంది. ఫలితంగా ఈ మార్గంలో ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఎక్కువగా నడిపే అవకాశం లేకుండా పోయింది. చెన్నై వైపు వెళ్లే రైళ్లను గత్యంతరం లేక వరంగల్ మీదుగా నడుపుతున్నారు. ఆ మార్గంలో ఇప్పటికే ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో డిమాండ్ ఉన్నా.. కొత్త రైళ్లను వేయలేకపోతున్నారు. ఇప్పుడు బీబీనగర్–నల్లపాడు మీదుగా ఉన్న సింగిల్ లైన్‌ను రెండుగా మారిస్తే చెన్నై, తిరుపతి వైపు ఇదో ప్రధాన మార్గం అవుతుంది. నిజానికి ఈ మార్గంలో వెళ్తే దాదాపు 70 కి.మీ. దూరం కూడా తగ్గుతుంది. సింగిల్ లైన్‌తో ఇదే సమస్య.. సింగిల్ లైన్ మీదు గా వెళ్లేప్పుడు రైళ్ల సంఖ్య తక్కువగా ఉంటోంది. ఒక ఎక్స్‌ప్రెస్ రైలు వెళ్తుంటే దాని ముందు వెళ్లే, వచ్చే ఇతర రైళ్లను ముందు స్టేషన్లలో నిలిపి దారి ఇవ్వాల్సి వస్తోంది. ఈ రైలు దాటిపోతేగాని అవి తిరిగి కదిలే పరిస్థితి ఉండదు. దీంతో నిలిచిపోయే రైళ్ల ప్రయాణ సమయం పెరుగుతుంది. ఇలా ఆపాల్సి రావటంతో రైళ్ల సంఖ్య పెంచటం కుదరదు. ప్రస్తుతం బొల్లారం నుంచి నిజామాబాద్ మీదుగా మహారాష్ట్ర వైపు, బీబీనగర్ నుంచి గుంటూరు మీదుగా తిరుపతి, చెన్నై వైపు ఇదే సమస్య ఉంది. ఇప్పుడు దాన్ని దూరం చేసే ప్రాజెక్టులు మంజూరయ్యాయి. ఆ పనులు వచ్చే మూడేళ్లలో పూర్తవుతాయని అంచనా వేస్తున్నారు. -
కేంద్ర మంత్రికి ట్వీట్.. అర్ధగంటలో స్టాల్ సీజ్
తిరుపతిలోని రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై ఉన్న క్యాంటీన్లో బిస్కెట్ ప్యాకెట్‌ను ఎమ్మార్పీ కంటే అధికధరలకు విక్రయిస్తున్నారంటూ వినియోగదారుడు రైల్వే మంత్రికి ట్వీట్ చేయడంతో.. అర్ధగంటలో స్టాల్‌ను సీజ్ చేశారు.’ ‘హైదరాబాద్ నుంచి రేణిగుంటకు రైల్లో ప్రయాణిస్తున్న ఓ 20 ఏళ్ల యువతి ఎదురుగా మరో వ్యక్తి కూర్చున్నాడు. ఆ బోగీలో పెద్దగా ప్రయాణికులు లేకపోవడం, వ్యక్తి చూపులు అనుమానంగా ఉండడంతో భయపడ్డ యువతి వెంటనే సమస్యను మంత్రికి ట్వీట్ చేసింది. 12 నిమిషాల తరువాత ఓ స్టేషన్ రాగా ఆ వ్యక్తిని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ యువతికి స్వయాన రైల్వే మంత్రి ఫోన్ చేసి అభినందించడం ఇటీవల పత్రికల్లో చదివే ఉంటాం’ ‘ఇటీవల చెన్నై నుంచి విజయవాడ మీదుగా వెళుతున్న రైల్లో ఫ్యాను పనిచేయడం లేదని ఓ ప్రయాణికుడు స్మార్ట్‌ఫోన్ నుంచి ట్విట్టర్ ద్వారా రైల్వే మంత్రికి ట్వీట్ పంపాడు. నిముషాల వ్యవధిలో విజయవాడ సీనియర్ డీఈఈకు సమాచారం అందడంతో విద్యుత్ సిబ్బంది రైలు వద్దకు చేరుకుని ఫ్యాన్ మరమ్మతు చేశారు.’ ‘రెండు రోజుల కిందట బెంగళూరు నుంచి బళ్లారికి రాత్రి వేళ రైల్లో వెళుతున్న ఓ యువతి నెలసరి సమస్యతో బాధపడుతుంటే.. ఆమె స్నేహితురాలు రైల్వే మంత్రికి ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపారు. రైల్వే మంత్రి సూచనతో రంగంలోకి దిగిన అధికారులు ఆరు నిముషాల్లో ఈమె ప్రయాణిస్తున్న బోగి వద్దకు వచ్చి కావాల్సిన శానిటరీ నాప్కిన్లు, మాత్రలు ఇచ్చి వెళ్లారు.’ సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటే కలిగే మేలు ఎలా ఉంటుందో చెప్పడానికి ఇవి మచ్చుకలు మాత్రమే. ఇటీవల రైళ్లలో ఎదురవుతున్న సమస్యలపై ట్విట్టర్ ద్వారా రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళుతుంటే అప్పటికప్పుడే పరిష్కరిస్తుండడం వల్ల రైళ్లలో ప్రయాణికుల సంఖ్య పెరగడంతోపాటు సంస్థపై జనానికి నమ్మకం కలుగుతోంది. అందుబాటులో ఉన్న సేవలను ఉపయోగించుకోవడంలో విద్యావంతులు తమదైనశైలి మార్కు వేస్తున్నారు. సోషల్ మీడియా సత్తా.. రైళ్లలో ప్రయాణించేటప్పుడు చాలా మందికి వివిధ రకాల సమస్యలు ఎదురవుతుంటాయి. క్యాటరింగ్లో పాచిన ఆహారం ఇవ్వడం, మరుగుదొడ్ల నుంచి దుర్గంధం వస్తున్నా పట్టించుకోకపోవడం, ఏసీలు, ఫ్యాన్లు పనిచేయకపోవడం లాంటి ఘటనలు చాలానే ఎదురవుతుంటాయి. వీటిని ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక కొందరు.. స్టేషన్లలో అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మరికొందరు సమస్యను ప్రశ్నించడమే మానేస్తుంటారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సమస్యల ప్రస్తావనకు సోషల్ మీడియా మంచి మాధ్యమంగా మారుతోంది. సామాన్య మధ్యతరగతి ప్రజల చేతుల్లో స్మార్ట్ఫోన్లు ఉండడం సత్ఫలితాలను ఇస్తున్నాయి. రైలు ప్రయాణాల్లో ఎదురయ్యే సమస్యలను వెంటనే ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకెళుతున్న ఘటనలు ఇటీవల బాగా పెరిగాయి. ప్రధానంగా సమస్యలను రైల్వేశాఖ మంత్రికి క్షణాల్లో చెప్పడం.. నిమిషాల్లో ఇవి పరిష్కారానికి నోచుకుంటుండడంతో ప్రజలు సైతం సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 24 గంటల పర్యవేక్షణ.. ట్విట్టర్లో రైల్వే మంత్రికి అందే ఫిర్యాదులను ఢిల్లీలోని రైల్ భవన్ అధికారులు పర్యవేక్షిస్తుంటారు. ఇది 24 గంటల పాటు పనిచేసే సెంట్రల్ వ్యవస్థ. రైలు ప్రయాణికులు పంపే ఫిర్యాదులను రైల్వే మంత్రి చూడడంతో పాటు.. రైల్ భవన్‌లోని అధికారులు సైతం ఫిర్యాదులు చూస్తూ ఉంటారు. ట్విట్టర్ వేదికగా వచ్చే ఫిర్యాదులు, సూచనలపై అప్పటికప్పుడు సానుకూల స్పందన వస్తుండడం ప్రయాణికులకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. ఎలాంటి సమస్యలంటే... రైల్లో దొంగతనాలు జరుగుతున్నా సిబ్బంది స్పందిచకపోవడ అనుమానిత వ్యక్తులు మన పక్కన ఉన్నప్పుడు.. అసాంఘిక కార్యకలాపాలు రైల్లో జరుగుతున్నప్పుడు రైల్వే స్టేషన్లలో, రైళ్లలో ఆహార పదార్థాల్లో నాణ్యత లేకపోవడం, క్యాంటీన్లలో ఎమ్మార్పీ కన్నా అధిక ధరలు వసూలు చేసినా ప్లాట్‌ఫామ్‌పై నీళ్లు రాకపోయినా, రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల వసతులు సరిలేకపోయినా, అసౌకర్యాలపై రైల్లో ప్రయాణికులు అనారోగ్యానికి గురైనా, మహిళలు, దివ్యాంగుల బోగీల్లో ఇతరులు ఎక్కినా ఫిర్యాదులు చేయొచ్చు. ఇలాంటివే ఫిర్యాదు చేయాలి.. ఇలాంటి చేయకూడదని లేదు. కానీ ఫిర్యాదు చేసేటప్పుడు కాస్త విజ్ఞతతో ఆలోచిస్తే సరి. ట్వీట్ చేసేటప్పుడు తప్పనిసరిగా పేరు, ఫోన్ నంబరు నమోదు చేయాలి. అలాగే ప్రయాణి కుల బెర్తు, బోగీ కూడా రాయాలి. మీరూ ట్విట్టండి.. స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా ట్విట్టర్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ట్విట్టర్లో వ్యక్తి పేరు, పాస్వర్డ్, మెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్ నమోదు చేసి సేవ్ చేసుకున్న తరువాత ట్విట్టర్ వినియోగంలోకి వస్తుంది. అనంతరం రైల్వే మినిస్టర్ అని టైప్‌చేస్తే రైల్వేమంత్రి పీయుష్ గోయల్ చిత్రంతో పాటు సైట్ ఓపెన్ అవుతుంది. ప్రయాణికులు తమకు తెలిసిన భాషల్లో సమస్యలను నేరుగా మంత్రికి ట్వీట్ రూపంలో తెలియచేయొచ్చు. ట్వీట్ మెసేజ్ సెకన్ల వ్యవధిలోనే ఆయా డివిజన్ల రైల్వే ఉన్నతాధికారులకు చేరుతుంది. అర్ధరాత్రులు సైతం అధికారులు స్పందిస్తారు. మెసేజ్ చేరగానే అప్రమత్తమై ప్రయాణికుల సమస్యలను పరిష్కరించి తిరిగి రైల్వే మంత్రికి నివేదిస్తారు. -
ఎలుకలు కొరికాయి...రూ.10లక్షలు చెల్లించండి
రాంచి: రైలులో ఎలుకల స్వైర విహారం వివాదాన్ని సృష్టించింది. రాంచీ నుంచి హౌరా వెళ్లేందుకు గాను రిటైర్డ్ ఛీప్ ఇంజనీర్ పీసీ సిన్హా , అతని భార్య అల్కా గత ఏడాది డిసెంబర్ 30 న టికెట్స్ బుక్ చేసుకున్నారు. ఏసీ ఫస్ట్ క్లాస్ కంపార్ట్ మెంట్ లో సుఖంగా ప్రయాణం చేద్దామనుకున్న ఈ సీనియర్ దంపతులు మూషికాలతో అష్టకష్టాలు పడ్డారు. సుఖం, సౌకర్యం మాట దెవుడెరుగు చివరకు ఆసుపత్రి మెట్లుఎక్కి, టీకాలు వేయించుకోవాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే ... బొకారో స్టీల్ లిమిటెడ్ చీఫ్ ఇంజనీర్ గా పనిచేసి రిటైర్ అయిన సిన్హా, ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న అల్కా టికెట్స్ బుక్ చేసుకుని రైలు ఎక్కారు. అర్ధరాత్రి దాటిన తరువాత ఆ బోగీలోని ప్రయాణీకులకు కంటిమీద కునుకు కరువైంది. కంపార్ట్మెంట్లో ఎక్కడ చూసిన ఎలుకల మయం. ఎలుకల విసర్జకాలతో దుర్గంధపూరితంగా తయారైంది అక్కడి వాతావరణం. అక్కడితో వీరి కష్టాలు ఆగిపోలేదు. దొరికిని వారిని దొరికినట్టు ఎలుకలు కొరికేయడం మొదలుపెట్టాయి. దీంతో సిన్హాతో పాటు మరో నలుగురి ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఎలుకల సంచారంతో పరిస్థితి అంతా గజిగజి గందరగోళంగా తయారవ్వడంతో సత్రంగంజ్ స్టేషన్లో దాదాపు అరగంటసేపు రైలును ఆపివేశారు. ఈ క్రమంలో సిన్హా దంపతులు గ్రీవియెన్స్ సెల్లో ఫిర్యాదు చేశారు. రైల్వే శాఖ సిబ్బంది నిర్వాకం వల్ల తమకు కలిగిన అసౌకర్యానికి గాను 10 లక్షల రూపాయల పరిహారం చెల్లించాల్సిందిగా డిమాండ్ చేశారు. హై క్లాస్ బోగీల్లో ఎలుకల స్వైర విహారంపై సిన్హా మండిపడ్డారు. తన జీవితంలో ఇంత పెద్ద ఎలుకల్ని ఎక్కడా చూడాలేదని ఆయన అన్నారు. ఒకవైపు భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ స్వచ్ఛ భారత్ గురించి విస్రృతంగా ప్రచారం చేస్తోంటే, మరోవైపు రైల్వే శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించడం సిగ్గు చేటని వ్యాఖ్యానించారు. ఎలుకల కాటు వల్ల అంటువ్యాధులు సోకే ప్రమాదం ఉందన్నారు. అసలే డయాబెటిక్ రోగినైన తనను ఎలుకలు 3 మిల్లీమీటర్ల మేర కొరికి పారేశాయని ఆందోళన వ్యక్తం చేశారు. చివరికి కోలకత్తా చేరిన తరువాత రాబిస్ టీకాలు వేయించుకోవాల్సి వచ్చిందన్నారు. ఇప్పటికీ రైళ్లను శుభ్రంగా ఉంచడం తెలియని ప్రభుత్వాలు బుల్లెట్ ట్రెయిన్ల కోసం కలలు కంటున్నాయని సిన్హా భార్య అల్కా మండిపడ్డారు. సిన్హా దంపతుల ఫిర్యాదును పై అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్టు ఆగ్నేయ రైల్వే అధికారి ఒకరు తెలిపారు. అయితే దీనిపై ఇంకా తనకు సమాచారం అందలేదని, ఫిర్యాదు అందిన అనంతరం అవసరమైన చర్యలను తీసుకుంటామని రాంచి డివిజనల్ రైల్వే మేనేజర్ దీపక్ కుమార్ చెప్పారు.